సాక్షి, హైదరాబాద్: థాయిలాండ్ క్యాసినో కేసులో ఈడీ ఎదుట సోమవారం విచారణకు హజరైన చికోటి ప్రవీణ్ సాక్షి టీవీతో మాట్లాడారు. తాను ఆర్గనైజర్ కాదు అని పేర్కొన్నారు. థాయ్‌లాండ్ క్యాసినో కేసులో తన ప్రమేయం లేదన్నారు. అందుకే అక్కడి న్యాయస్తానం తమకు 2000 బాత్‌లు(రూ.4,850) ఫైన్ విధించి వదిలేసిందన్నారు. థాయ్‌లాండ్‌లో కేసు ముగిసిందన్నారు.
ఈడీ అడిగిన అన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని, దర్యాప్తు సంస్థ మీద తనకు పూర్తి నమ్మకం ఉందని చికోటి అన్నారు. మళ్లీ ఎప్పుడూ పిలిచినా అందుబాటులో ఉండాలని చెప్పారని వివరించారు.
టీడీపీ నేత పట్టాభి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని చికోటి మండిపడ్డారు. ఆయనకు అధికారం లేక పిచ్చిమాటలు మాట్లాడున్నాడని ధ్వజమెత్తారు. తన భుజంపై తుపాకీ పెట్టి ప్రత్యర్థులను కాల్చే కుట్ర సాగుతోందన్నారు. త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేస్తానని, ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తానని అన్నారు. తనను రాజకీయాల్లోకి రానివ్వకూడదనే రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
చంద్రబాబుకు కనీసం సెన్స్ లేదని, అందుకే పట్టాభి లాంటి వ్యక్తిని పార్టీ అధికార ప్రతినిధిగా పెట్టుకున్నాడని మండిపడ్డాడు. పట్టాభి అన్నీ పనికిరాని మాటలు చెబుతున్నాడని, ఆయన తీరు చూస్తే మతి భ్రమించినట్టుగా భావిస్తున్నానని చికోటి చెప్పాడు.
చికోటి ప్రవీణ్ సాక్షి టీవీకి ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూ ఈ లింకులో చూడవచ్చు.
చదవండి: హైదరాబాద్‌లో ఉగ్రవాద కార్యకలాపాలపై దర్యాప్తు ముమ్మరం..మరో ఇద్దరు అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment