సాక్షి, హైదరాబాద్: గ్యాంబ్లింగ్‌పై నిషేధం ఉన్న థాయ్‌లాండ్‌లో.. ఓ హోటల్‌లో రహస్యంగా క్యాసినో నిర్వహిస్తూ పట్టుబడిన చికోటి ప్రవీణ్‌కు థాయ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్‌ను థాయ్ కోర్టు మంజూరు చేసింది. చికోటి ప్రవీణ్‌తో పాటు 83 మందికి బెయిల్ మంజూరైంది. 4500 బాట్స్ జరిమానాను కోర్టు విధించింది. ఫైన్ కట్టించుకుని పాస్‌పోర్టులను పోలీసులు తిరిగిచ్చేశారు.
కాగా, థాయ్‌లాండ్ చోనుబురి జిల్లా బాంగ్ లమంగ్‌లోని ఆసియా పట్టాయా హోటల్ హోటల్ వద్ద పెద్ద ఎత్తున్న గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారని గోవా నుంచి ఓ వ్యక్తి, థాయ్ పోలీసులకు అందించిన సమాచారం ఆధారంగా అక్కడి పోలీసులు రైడ్ నిర్వహించారు. పోలీసులను చూడగానే అక్కడున్నవాళ్లంతా పరుగులు అందుకున్నారు. అయితే సకాలంలో స్పందించిన పోలీసులు వాళ్లను తప్పించుకోనివ్వలేదు. మొత్తం 93 మందితో కూడిన ముఠాను థాయ్‌లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చివరికి.. ఆ ముఠాకు బాస్ చికోటి ప్రవీణ్‌గా తేలిన విషయం తెలిసిందే.
చదవండి: థాయ్‌లాండ్‌లో చికోటి చీకటి దందా.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు
Comments
Please login to add a commentAdd a comment