conditional bail
-
ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి ఊరట
-
థాయ్‌లాండ్‌లో చికోటి ప్రవీణ్‌కు బెయిల్ మంజూరు
సాక్షి, హైదరాబాద్: గ్యాంబ్లింగ్‌పై నిషేధం ఉన్న థాయ్‌లాండ్‌లో.. ఓ హోటల్లో రహస్యంగా క్యాసినో నిర్వహిస్తూ పట్టుబడిన చికోటి ప్రవీణ్‌కు థాయ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్‌ను థాయ్ కోర్టు మంజూరు చేసింది. చికోటి ప్రవీణ్‌తో పాటు 83 మందికి బెయిల్ మంజూరైంది. 4500 బాట్స్ జరిమానాను కోర్టు విధించింది. ఫైన్ కట్టించుకుని పాస్‌పోర్టులను పోలీసులు తిరిగిచ్చేశారు. కాగా, థాయ్‌లాండ్ చోనుబురి జిల్లా బాంగ్ లమంగ్‌లోని ఆసియా పట్టాయా హోటల్ హోటల్ వద్ద పెద్ద ఎత్తున్న గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారని గోవా నుంచి ఓ వ్యక్తి, థాయ్ పోలీసులకు అందించిన సమాచారం ఆధారంగా అక్కడి పోలీసులు రైడ్ నిర్వహించారు. పోలీసులను చూడగానే అక్కడున్నవాళ్లంతా పరుగులు అందుకున్నారు. అయితే సకాలంలో స్పందించిన పోలీసులు వాళ్లను తప్పించుకోనివ్వలేదు. మొత్తం 93 మందితో కూడిన ముఠాను థాయ్‌లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చివరికి.. ఆ ముఠాకు బాస్ చికోటి ప్రవీణ్‌గా తేలిన విషయం తెలిసిందే. చదవండి: థాయ్‌లాండ్‌లో చికోటి చీకటి దందా.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు -
Hyderabad: పీడీ యాక్ట్ కొట్టివేత.. ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదల
సాక్షి, హైదరాబాద్/కుషాయిగూడ/అబిడ్స్: పీడీ యాక్ట్ కేసులో ఆగస్టు 25న అరెస్టయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను విడుదల చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని బుధవారం ఆదేశించింది. ఆయనపై నమోదు చేసిన కేసును ఎత్తివేయడంతో పాటు పలు ఆంక్షలు విధించింది. దాదాపు రెండున్నర నెలలుగా చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్న ఎమ్మెల్యేలకు ఎట్టకేలకు ఊరట లభించింది. ‘మతపరంగా అభ్యంతరకర, రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు చేయొద్దు. జైలు నుంచి విడుదలయ్యే సమయంలో ర్యాలీలు నిర్వహించొద్దు. న్యాయవాది, పిటిషనర్‌తో పాటు నలుగురు కుటుంబ సభ్యులు మాత్రమే జైలుకు వెళ్లాలి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ఎలాంటి ఇంటర్వ్యూ ఇవ్వకూడదు’అని న్యాయమూర్తులు జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డి, జస్టిస్ జె.శ్రీదేవి ధర్మాసనం బుధవారం ఆదేశించింది. ఈ షరతులతో పాటు క్రైం నంబర్ 261/2022లో కిందికోర్టు ఇచ్చిన ఆంక్షలు వర్తిస్తాయి. సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ రాజాసింగ్‌పై ఆగస్టు 25న పోలీసులు పీడీ యాక్టు నమోదు చేసి అరెస్టు చేశారు. పోలీసులు పీడీ చట్టం నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్ భార్య ఉషాభాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్, పిటిషనర్ తరఫున న్యాయవాది రవిచందర్ వాదనలు వినిపించారు. ‘రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో రెచ్చగొట్టేవిధంగా వ్యవహరిస్తున్నారు. ఆయనపై వందకుపైగా క్రిమినల్ కేసులున్నాయి. అందులో ఒక హత్య కేసు కూడా ఉంది. మంగళ్‌హాట్ పీఎస్‌లో ఇప్పటికీ రౌడీషీట్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగానే మూడు క్రిమినల్ కేసుల ఆధారంగా రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపింది. పీడీ యాక్ట్ నమోదు కేసులో 12 నెలలపాటు జైల్లో ఉంచేందుకు వీలుగా ప్రభుత్వం జీవో 90ని జారీ చేసింది. రాజాసింగ్‌ను పీడీ యాక్ట్ కింద అరెస్టు చేయడాన్ని అడ్వయిజరీ బోర్డు కూడా సమర్ధించింది’అని ఏజీ వాదించారు. తప్పుడు ఆరోపణలతో పీడీ యాక్ట్ నమోదు... ‘రాజాసింగ్‌పై ఉన్న కేసుల్లో కిందికోర్టు రిమాండ్‌కు పంపేందుకు నిరాకరించింది. ఈ పరిస్థితుల్లో కావాలని ఆయనపై తప్పుడు ఆరోపణలు చేసి పీడీ యాక్ట్ ప్రయోగించారు. గత పదేళ్లల్లో రాష్ట్ర ప్రభుత్వం పలువురిపై నమోదు చేసిన పీడీ యాక్ట్ కేసుల్ని కోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా పీడీ యాక్ట్‌ను ప్రయోగించారు. ప్రవక్త గురించి రాజాసింగ్ మాట్లాడినట్లుగా తప్పుడు వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వీడియోలోని ఆ వాయిస్ రాజా సింగ్‌ది కాదు. అసలు ఆయన మహ్మద్ ప్రవక్త గురించి ఏమీ మాట్లాడలేదు. రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి పోలీసులు చూపుతున్న 15 కేసుల్లో ఆధారాలు లేవన్నారు. పీడీ యాక్ట్‌ను రద్దు చేయాలి’అని రవిచందర్ వాదనలు వినిపించారు. సాయంత్రం చర్లపల్లి జైలు నుంచి విడుదల హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో బుధవారం సాయంత్రం రాజాసింగ్ చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. చర్లపల్లి జైలు వద్దకు కుటుంబసభ్యులు, రాజాసింగ్ తరఫు న్యాయవాదితో పాటు అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకున్నారు. జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. సాయంత్రం 6 గంటల 50 నిమిషాల ప్రాంతంలో భార్య, మనుమడు, న్యాయవాది కారులో జైలులోనికి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత రాజాసింగ్ బయటికి వచ్చారు. శాంతిభద్రతల దృష్ట్యా చర్లపల్లి జైలు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రాజాసింగ్ జైలు నుంచి ధూల్‌పేట్‌లోని ఆయన నివాసానికి రావడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికి సంబరాలు చేశారు. చదవండి: మంత్రి గంగులపై ఫిర్యాదు చేసింది నేనే -
హత్య చేస్తానని బెదిరింపులు.. నటుడికి షరతులతో బెయిల్
బుల్లితెర నటి దివ్య భర్త ఆర్ణవ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయ్యింది. తనపై సందేహంతో గర్భిణి అని కూడా చూడకుండా తన భర్త ఆర్ణవ్ తనని చిత్ర హింసలకు గురి చేస్తూ హత్య చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని, తన ముందే వేరే వారికి ఫోన్లో ఐ లవ్ యు చెప్పి, ముద్దులు పెట్టి మానసికంగా వేధిస్తున్నాడని చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో దివ్య ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పోరూరు మహిళా పోలీసుస్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేసి, అతన్ని ఇటీవల అరెస్టు చేసి పుళల్ జైలుకు తరలించారు. కాగా తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నటుడు ఆర్ణవ్ స్థానిక పూందమల్లి నేర విభాగం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. మెజిస్ట్రేట్ స్టాలిన్ దీనిపై శుక్రవారం విచారణ జరిపిన అనంతరం నటుడు ఆర్ణవ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ముఖ్యంగా నటుడు ఆర్ణవ్ రెండు వారాలు పోరూరు మహిళా పోలీసు స్టేషన్లో సంతకం చేయాలని ఆదేశించారు. దీంతో ఆర్ణవ్ శనివారం పుళల్ జైలు నుంచి విడుదలయ్యారు. చదవండి: SSMB28: మహేశ్-త్రివిక్రమ్ సినిమా ఆగిపోయిందా? నిర్మాత ట్వీట్ వైరల్ -
రఘురామకృష్ణరాజుకు షరతులతో కూడిన బెయిల్
-
కొండా విశ్వేశ్వరరెడ్డికి స్వల్ప ఊరట
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నాయకుడు, చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట కలిగింది. పోలీసులను నిర్బధించిన కేసులో ముందస్తు బెయిల్ కోసం విశ్వేశ్వరరెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా రూ. 25వేలతో కూడిన రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. 41ఏ సీఆర్పీసీ ప్రకారం నోటీసులు అందుకున్న తరువాత పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి సన్నిహితుడు సందీప్ రెడ్డి వద్ద పది లక్షల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు బంజారాహిల్స్‌లోని విశ్వేశ్వరరెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో కొండా అనుచరులు ఎస్సై, హెడ్ కానిస్టేబుల్‌ను నిర్భందించారు. దీంతో వారు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కారణంగా పలు సెక్షన్ల కింద విశ్వేశ్వరరెడ్డిపై కేసు నమోదైంది. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విశ్వేశ్వరరెడ్డి తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. అయితే నాంపల్లి కోర్టు ఆ పిటిషన్‌ను తిరిస్కరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నందుకే పోలీసులు తనపై కావాలనే తప్పుడు కేసు నమోదు చేశారని విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. -
ఇంటికి చేరుకున్న సల్మాన్
-
సల్మాన్ కు బెయిల్
-
ఇంటికి చేరుకున్న సల్మాన్
ముంబై: హిట్ అండ్ రన్ కేసులో బాంబే హైకోర్టు నుంచి బెయిల్ పొందిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సెషన్స్ కోర్టు ఫార్మాలటీస్ అన్నింటినీ పూర్తి చేసి శుక్రవారం సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. సల్మాన్ రూ.30 వేల పూచీకత్తుతో పాటు, పాస్ పోర్టును కూడా సెషన్స్ కోర్టుకు సమర్పించారు. తొలుత ఈరోజు హైకోర్టులో కేసు విచారణ జరిగే సమయంలో సల్మాన్ వ్యక్తిగతంగా హాజరుకాలేదు. విచారణ సమయంలో ఆయన బాంద్రాలోని ఇంట్లో ఉన్నారు. అయితే బెయిల్ మంజూరు కావడంతో సెషన్స్ కోర్టుకు సల్మాన్ హాజరయ్యాడు. అంతకుముందు ముంబై సెషన్స్ కోర్టు సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీనిపై బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సల్మాన్ కు హైకోర్టులో ఉపశమనం లభించింది. దీంతోపాటు సెషన్స్ కోర్టు తీర్పును కూడా హైకోర్టు సస్పెండ్ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ ఎం తిప్సే ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. వ్యక్తిగత పూచీకత్తుతో పాటు 30 వేల రూపాయల బాండ్ సమర్పించాల్సిందిగా సల్మాన్ ను ఆదేశించారు. సల్మాన్ తరపున సీనియర్ న్యాయవాది అమిత్ దేశాయ్ వాదనలు వినిపించారు. -
సల్మాన్ ఖాన్‌కు బెయిల్
-
సల్మాన్ ఖాన్‌కు బెయిల్
ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు ముంబై హైకోర్టులో ఉపశమనం లభించింది. హిట్ అండ్ రన్ కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడ్డ సల్మాన్‌కు న్యాయస్థానం బెయిల్‌ను మంజూరు చేసింది. అంతేగాక కింది కోర్టు తీర్పును హైకోర్టు సస్పెండ్ చేసింది. సెషన్స్ కోర్టులో విచారణ సరిగా జరగలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ ఎం తిప్సే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వ్యక్తిగత పూచీకత్తుతో పాటు 30 వేల రూపాయల బాండ్ సమర్పించాల్సిందిగా సల్మాన్ ను ఆదేశించారు. సల్మాన్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకాలేదు. విచారణ సమయంలో ఆయన బాంద్రాలోని ఇంట్లో ఉన్నారు. సల్మాన్ తరపున సీనియర్ న్యాయవాది అమిత్ దేశాయ్ వాదనలు వినిపించారు. సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్, సోదరి అల్వీరా కోర్టుకు వచ్చారు. హిట్ అండ్ రన్ కేసులో రెండ్రోజుల క్రితం ముంబై సెషన్స్ కోర్టు సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. శిక్షపడిన కొన్నిగంటల్లోనే ఆయన న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించడంతో రెండు రోజుల పాటు తాత్కాలిక బెయిల్ లభించింది. ఈ బెయిల్ గడువు ఈ రోజుతో ముగిసింది. కాగా బెయిల్ పొడగించాలని సల్మాన్ తరపున ఆయన న్యాయవాది విన్నవించగా న్యాయస్థానం మన్నించింది. దీంతో ఆయనకు ఊరట కలిగింది.