బుల్లితెర నటి దివ్య భర్త ఆర్ణవ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయ్యింది. తనపై సందేహంతో గర్భిణి అని కూడా చూడకుండా తన భర్త ఆర్ణవ్ తనని చిత్ర హింసలకు గురి చేస్తూ హత్య చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని, తన ముందే వేరే వారికి ఫోన్లో ఐ లవ్ యు చెప్పి, ముద్దులు పెట్టి మానసికంగా వేధిస్తున్నాడని చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో దివ్య ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ మేరకు పోరూరు మహిళా పోలీసుస్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేసి, అతన్ని ఇటీవల అరెస్టు చేసి పుళల్ జైలుకు తరలించారు. కాగా తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నటుడు ఆర్ణవ్ స్థానిక పూందమల్లి నేర విభాగం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. మెజిస్ట్రేట్ స్టాలిన్ దీనిపై శుక్రవారం విచారణ జరిపిన అనంతరం నటుడు ఆర్ణవ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ముఖ్యంగా నటుడు ఆర్ణవ్ రెండు వారాలు పోరూరు మహిళా పోలీసు స్టేషన్‌లో సంతకం చేయాలని ఆదేశించారు. దీంతో ఆర్ణవ్ శనివారం పుళల్ జైలు నుంచి విడుదలయ్యారు.
చదవండి: SSMB28: మహేశ్-త్రివిక్రమ్ సినిమా ఆగిపోయిందా? నిర్మాత ట్వీట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment