సాక్షి, సిటీబ్యూరో : రామాయణాన్ని వర్తమాన పరిస్థితులకు అన్వయం చేస్తూ, చిన్నారులకు చక్కగా అర్థమయ్యేలా పదకొండున్నరేళ్ల బాలుడు మాస్టర్ విక్రమ్ నాగరాజన్ రచించిన ‘రామాయణ–2020’ పుసక్తం చిన్నారుల్లో ఆసక్తి రెకేత్తిస్తోంది. ఆధునిక ప్రపంచానికి రామాయణాన్ని ఎలా అన్వయం చేసుకోవాలో ఈ పుస్తకంలో వివరించడం విశేషం. ఈ పుస్తకాన్ని చమన్న పబ్లికేషన్స్ ప్రచురించింది. వెల రూ.315. పుస్తక రచయిత విక్రమ్ నాగరాజన్ ప్రస్తుతం అమెరికాలో ఆరో తరగతి చదువుతున్నారు. ఇతనికి గణితం, జాగ్రఫీ, జువాలజీ, చరిత్ర, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ తదితర అంశాల్లోనూ ఆసక్తి ఉందని పబ్లికేషన్స్ నిర్వాహకులు ఎం.పట్టాభిరామ్ తెలిపారు. పుస్తక కాపీలకు చమన్న పబ్లికేషన్స్, కేరాఫ్ ఎం.పట్టాభిరామ్, 4ఎఫ్, ముస్సోరీహిల్ కౌంటీ, నిజాంపేట్ మెయిన్ రోడ్, హైదరాబాద్–500090, 9502196347 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment