
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రిపై పట్టాభి అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. గత కొన్ని నెలలుగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ నేత పట్టాభి.. ఇవాళ మరింత దిగజారి సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీఎంను ఏకవచనంతో దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో వైఎస్సార్‌సీపీ నిరసనలు చేపట్టారు. నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు.
తిరుపతి: సీఎంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు.. చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మ ను దగ్ధం చేశారు. తిరుపతి ఆర్టీసి బస్టాండ్ కూడలి లోని గాంధీ విగ్రహం ముందు చంద్రబాబు నాయుడు, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి దిష్టి బొమ్మ ను దగ్ధం చేశారు. ఆధారాలు లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్ధార్ అని హెచ్చరించారు. పట్టాభి తెలుగుదేశం పార్టీలో పెయిడ్ ఆర్టిస్ట్ అని విమర్శించారు. నిరసన కార్యక్రమం లో పెద్దఎత్తున వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు..
విశాఖ: విశాఖపట్నంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించారు. చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కర్నూలు: టీడీపీ నేతలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని హఫీజ్‌ఖాన్ మండిపడ్డారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. బాబు డైరెక‌్షన్‌లో ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని హఫీజ్‌ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment