
పట్టాభి హోటల్ మేనేజ్‌మెంట్ చేసే సమయంలో ఓ అబ్బాయిని లైంగికంగా వేధించాడు
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ నేత పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సీఎంని దూషించడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా జనాగ్రహ దీక్షలు కొనసాగుతున్నాయి.
(చదవండి: AP: దుర్భాషలపై జనాగ్రహం)
ఈ క్రమంలో విజయవాడ జనాగ్రహ దీక్షలో పాల్గొన్న ఓ మహిళ పట్టాభిపై సంచనల వ్యాఖ్యలు చేశారు. పట్టాభి ఓ గే అన్నారు. ఈ సందర్భంగా సదరు మహిళ మాట్లాడుతూ.. ‘‘గత ఎన్నికల్లో ఓడిపోయారు.. భవిష్యత్తులో కూడా ఓడిపోతామనే భయంతోనే టీడీపీ ఇలాంటి దిగజారుడు పనులు చేస్తుంది. ఫోకస్ అవ్వడం కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారు. సీఎం జగన్‌ని దూషించిన పట్టాభి ఇప్పుడు నిజంగానే ఫోకస్ అవుతున్నాడు. ఇంతకు ముందు వరకు తను ఎవరో తెలియదు. తను హైలెట్ అవ్వడం కోసం ఈ పని చేశాడు. ఈ పట్టాభి ఎవరు అని ఆరా తీయగా మాకు సంచలన విషయాలు తెలిశాయి’’ అని తెలిపారు.
(చదవండి: పట్టాభి చేసింది తప్పే; టీడీపీలో సీనియర్ల అసహనం)
‘పట్టాభి ఓ గే. అతడు 1997లో ఐహెచ్‌ఎంలో హోటల్ మేనేజ్‌మెంట్ చేశాడు. ఆ సమయంలో ఈశాన్య రాష్ట్రాల ప్రాంతానికి చెందిన ఓ అబ్బాయిని లైంగికంగా వేధించాడు. దాంతో కాలేజీ వాళ్లు పట్టాభిని సస్పెండ్ చేశారు. అతడు సస్పెండ్ అయినప్పుడు అతని తండ్రి చలసాని ఆజాద్ కాలేజీకి వచ్చాడు. ఇప్పుడేమో కొమ్మారెడ్డి పట్టాభి అని ఉంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.