Janaagraha Deeksha
-
చంద్రబాబు డైరెక్షన్లోనే పట్టాభి అనుచిత వ్యాఖ్యలు: సజ్జల
సాక్షి, గుంటూరు: చంద్రబాబుకు రాజకీయ సంస్కారం లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. 'ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది. బాబు లాంటి ద్రోహి ఉండటానికి వీల్లేదని ఎన్టీఆర్ ఆనాడే అన్నారు. చంద్రబాబు డైరెక్షన్లోనే పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలను చంద్రబాబు మరింత దిగజార్చారు. కావాలనే సీఎంపై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు. అధికారం లేకపోయేసరికి చంద్రబాబుకు మతిభ్రమించింది. రాష్ట్రంలో గొడవలు సృష్టించాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు. ఎల్లో మీడియాతో కలిసి చంద్రబాబు అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారు. యువకుడైన సీఎం బాధ్యతగా వ్యవహరిస్తుంటే.. 70 ఏళ్ల వ్యక్తి బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబును ప్రజలు అసహ్యించుకుంటున్నారు. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఈసీని కోరుతాం. పాప విముక్తి కావాలంటే ఇప్పటికైనా చంద్రబాబు క్షమాపణ కోరాలి' అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చదవండి: (టీడీపీపై సీఈసీకి ఫిర్యాదు చేస్తాం) -
Janaagraha Deeksha: టీడీపీ బూతు పురాణంపై ఉవ్వెత్తున ఎగసిన జనాగ్రహం
సాక్షి,అమరావతి/సాక్షి,నెట్వర్క్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభితో అసభ్య పదజాలంతో దూషింపజేయడంపై జనాగ్రహం ఉవ్వెత్తున ఎగసింది. బూతు వ్యాఖ్యలపై సీఎం వైఎస్ జగన్‌కు క్షమాపణ చెప్పాల్సిందిపోయి.. వాటిని సమర్థిస్తూ చంద్రబాబు దీక్ష చేయడమేమిటి? అంటూ ప్రజలు నిలదీశారు. వాక్ స్వాతంత్య్రం అంటే బూతులు తిట్టడమేనా? అని ప్రశ్నించారు. ఇది అనైతికం.. అధర్మం.. దుర్మార్గం అని స్పష్టం చేశారు. తక్షణమే సీఎం వైఎస్ జగన్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా వేమూరు నుంచి పాదయాత్ర చేపట్టిన ఎమ్మెల్యే మేరుగ నాగార్జునకు తెనాలిలో స్వాగతం పలికిన ఎమ్మెల్యే అన్నాబత్తుని, ఇతర నేతలు లేదంటే.. ప్రజాక్షేత్రంలో మళ్లీ మళ్లీ తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సీఎం వైఎస్ జగన్‌ను బూతులు తిట్టించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ గురువారం చేపట్టిన జనాగ్రహ దీక్షలు శుక్రవారం కూడా కొనసాగాయి. ఈ దీక్షల్లో ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో ఆఖండ విజయంతో అధికారం చేపట్టిన సీఎం వైఎస్ జగన్.. ఎన్నికల మేనిఫెస్టోలోని 95 శాతానికిపైగా హామీలను తొలి ఏడాదే అమలు చేసి రాజకీయాల్లో సరి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని ప్రజలు ప్రశంసించారు. కృష్ణా జిల్లా పామర్రు 4 రోడ్ల కూడలిలో శుక్రవారం జనాగ్రహ దీక్షలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ మహిళా అధ్యక్షురాలు కైలే జ్ఞానమణి, మహిళా ప్రతినిధులు కులం, మతం, వర్గం, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకూ సంక్షేమాభివృద్ధి పథకాలను అందించడం ద్వారా ప్రజాస్వామ్యానికి సరి కొత్త నిర్వచనం చెప్పారని కొనియాడారు. నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు కేటాయించడం ద్వారా సరి కొత్త సామాజిక రాజకీయ విప్లవానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా సంక్షేమ పథకాల ద్వారా దన్నుగా నిలిచారని ప్రశంసించారు. ప్రజాదరణను జీర్ణించుకోలేకే కుట్రలు సీఎం వైఎస్ జగన్ తమ కష్టనష్టాల్లో వెన్నంటి ఉన్నందుకే పంచాయతీ, మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు, తిరుపతి లోక్‌సభ ఎన్నికల్లో ఆయన వెంట నడిచామని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రజలు స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్‌కు నానాటికీ పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే చంద్రబాబు ఎప్పటికప్పుడు విద్వేషాలను రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు మండిపడ్డాయి. తొలుత దేవాలయాలపై దాడులు చేయించి.. విగ్రహాలను ధ్వంసం చేయించి.. రథాలకు నిప్పు పెట్టించి మత కల్లోలాలను సృష్టించడానికి చంద్రబాబు కుట్రలు చేశారని ఎత్తిచూపారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో నిర్వహించిన జనాగ్రహ దీక్షలో మాట్లాడుతున్న మంత్రి ఆదిమూలపు సురేష్ ఆ తర్వాత వ్యవస్థలను అడ్డం పెట్టుకుని.. స్థానిక సంస్థల ఎన్నికలను అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు. గుజరాత్లో దొరికన మాదక ద్రవ్యాలకూ.. ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర నిఘా సంస్థలు స్పష్టం చేసినా, డీజీపీ గౌతం సవాంగ్ తేల్చి చెప్పినా చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ నేతలు నానా యాగీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని చేసినా ప్రజలు నమ్మడం లేదని ఇప్పుడు పట్టాభి ద్వారా సీఎంను బూతులు తిట్టించి రాష్ట్రంలో అలజడులు రేపేలా కుట్ర పన్నారని నిప్పులు చెరిగారు. పశ్చిమగోదావరి జిల్లా మార్టేరులో నిర్వహించిన జనాగ్రహ దీక్షలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తదితరులు మిన్నంటిన నిరసనలు ► చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జనాగ్రహ దీక్షలు కొనసాగాయి. కుప్పంలో టీడీపీ నేతలు రెచ్చగొట్టడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు అడ్డుకుని బారికేడ్లు ఏర్పాటు చేశారు. బాబు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండు వద్ద చంద్రబాబు దిష్టి బొమ్మను దహనం చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభి చిత్రపటాలను గాడిదకు కట్టి ఊరేగించారు. శ్రీకాళహస్తిలో టీడీపీ నేతల వైఖరిని హిజ్రాలు తప్పుపట్టారు. ► టీడీపీ తీరును నిరసిస్తూ అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. పలు చోట్ల చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పాల్సిందేనని కర్నూలు జిల్లాలో పార్టీ నేతలు డిమాండ్ చేశారు. మాజీ మేయర్ బంగి అనంతయ్య గుండు కొట్టించుకుని నిరసన తెలిపారు. వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు బాబు వైఖరిపై నిప్పులు చెరిగాయి. ► శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు.. చంద్రబాబు తీరు మార్చుకోకపోతే తీవ్ర పర్యవసానాలు తప్పవని హెచ్చరించారు. కృష్ణా జిల్లాలో చంద్రబాబు, పట్టాభి దిష్టి బొమ్మలను తగులబెట్టారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ► విశాఖ నగరంతో పాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో టీడీపీ నేతల తీరును విమర్శిస్తూ ధర్నాలు, దీక్షలు, ర్యాలీలు హోరెత్తాయి. వెంటిలేటర్‌పై ఉన్న పార్టీ, కొడుకు లోకేష్ భవిష్యత్తు ఏమవుతుందోనన్న బెంగతో చంద్రబాబు విచక్షణ కోల్పోయి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ► టీడీపీ ఉనికి కోల్పోవడం ఖాయం అని విజయనగరం, శ్రీకాళుళం జిల్లాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు ధ్వజమెత్తాయి. నల్ల రిబ్బన్లు ధరించి టీడీపీ వైఖరికి నిరసన తెలిపారు. -
‘పట్టాభి ఓ గే’.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహిళ
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ నేత పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సీఎంని దూషించడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా జనాగ్రహ దీక్షలు కొనసాగుతున్నాయి. (చదవండి: AP: దుర్భాషలపై జనాగ్రహం) ఈ క్రమంలో విజయవాడ జనాగ్రహ దీక్షలో పాల్గొన్న ఓ మహిళ పట్టాభిపై సంచనల వ్యాఖ్యలు చేశారు. పట్టాభి ఓ గే అన్నారు. ఈ సందర్భంగా సదరు మహిళ మాట్లాడుతూ.. ‘‘గత ఎన్నికల్లో ఓడిపోయారు.. భవిష్యత్తులో కూడా ఓడిపోతామనే భయంతోనే టీడీపీ ఇలాంటి దిగజారుడు పనులు చేస్తుంది. ఫోకస్ అవ్వడం కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారు. సీఎం జగన్‌ని దూషించిన పట్టాభి ఇప్పుడు నిజంగానే ఫోకస్ అవుతున్నాడు. ఇంతకు ముందు వరకు తను ఎవరో తెలియదు. తను హైలెట్ అవ్వడం కోసం ఈ పని చేశాడు. ఈ పట్టాభి ఎవరు అని ఆరా తీయగా మాకు సంచలన విషయాలు తెలిశాయి’’ అని తెలిపారు. (చదవండి: పట్టాభి చేసింది తప్పే; టీడీపీలో సీనియర్ల అసహనం) ‘పట్టాభి ఓ గే. అతడు 1997లో ఐహెచ్ఎంలో హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. ఆ సమయంలో ఈశాన్య రాష్ట్రాల ప్రాంతానికి చెందిన ఓ అబ్బాయిని లైంగికంగా వేధించాడు. దాంతో కాలేజీ వాళ్లు పట్టాభిని సస్పెండ్ చేశారు. అతడు సస్పెండ్ అయినప్పుడు అతని తండ్రి చలసాని ఆజాద్ కాలేజీకి వచ్చాడు. ఇప్పుడేమో కొమ్మారెడ్డి పట్టాభి అని ఉంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చదవండి: పట్టాభి మాట్లాడింది.. దారుణమైన భాష: ఏపీ డీజీపీ -
ఏపీ వ్యాప్తంగా జనాగ్రహ దీక్షలు
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జనాగ్రహ దీక్షలు కొనసాగుతున్నాయి. రెండున్నరేళ్లుగా సంక్షేమాభివృద్ధి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు. సీఎం వైఎస్ జగన్‌ను టీడీపీ నేత పట్టాభితో తీవ్ర పదజాలంతో దూషింపజేసిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు. అనంతపురం: టీడీపీ బూతు వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్ష కొనసాగుతోంది. కృష్ణాజిల్లా: సీఎం జగన్ పై టీడీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తిరువూరు వైఎస్సార్ కార్యాలయంలో "జనాగ్రహ దీక్ష దీక్షలో పాల్గొన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, పిఏసియస్ ఛైర్మన్లు, పార్టీ నాయకులు,కార్యకర్తలు నిరసన తెలుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా: తణుకు రాష్ట్రపతి రోడ్ లో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జనాగ్రహదీక్ష కొనసాగుతుంది. ఈ సందర్భంగా నేతలు.. సీఎం జగన్ పై టీడీపీ నేత పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలపై.. వైఎస్సార్సీపీ ఆర్ సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టాభి వెంటనే సీఎం జగన్ కు బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. జనాగ్రహ దీక్షలో వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో జెడ్పీ చైర్మన్ కావురు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్షలో కొనసాగుతుంది. ఈ దీక్షలో మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ యడ్ల తాతాజీ,ఎంపిపి లు చిట్టూరి కనక లక్ష్మి,రావూరి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్ష కొనసాగుతుంది.ఈ జనాగ్రహ దీక్షలో వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో.. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం నాయకులు విమర్శలు చేస్తే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవ్వరు చూస్తువూరుకోరని అన్నారు. టీడీపీ నాయకులు ఏ స్థాయికి దిగజారి పోయారో ఈ వ్యాఖ్యలతో అర్థమవుతుందని గ్రంధి శ్రీనివాస్ అన్నారు. పవన్ కల్యాణ్ కు పట్టిన గతే చంద్రబాబుకి పడుతుందని అన్నారు.భవిష్యత్ లో ఒక్క సీటుకే..బాబు పరిమితం అవుతారని అన్నారు. వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పులివెందులలో నిరసనలు కొనసాగుతున్నాయి. స్థానిక బిఎస్ ఎన్ ఎల్ ఆఫీస్ సర్కిల్స్ లో జనాగ్రహ దీక్షల పేరుతో వైఎస్సార్సీపీ నాయకులు దీక్షలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా: టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాజోలులో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జనాగ్రహ దీక్షను చేపట్టారు. అదే విధంగా, మండపేట కలువ పువ్వు సెంటర్ లో వైఎస్సార్సీపీ చేపట్టిన జనాగ్రహ దీక్షలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు,మున్సిపల్ చైర్మన్ నూక దుర్గా రాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
AP: దుర్భాషలపై జనాగ్రహం
సాక్షి, అమరావతి, నెట్వర్క్: విద్వేషాలను రెచ్చగొట్టి ఉనికి చాటుకునేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డైరెక్షన్లో సాగుతున్న బూతు పురాణాన్ని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు. దుర్భాషలాడటం వాక్ స్వాతంత్య్రం ఎలా అవుతుందని మండిపడు తున్నారు. రెండున్నరేళ్లుగా సంక్షేమాభివృద్ధి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి దన్నుగా నిలుస్తామని మరోసారి చాటి చెప్పారు. సీఎం వైఎస్ జగన్‌ను టీడీపీ నేత పట్టాభితో తీవ్ర పదజాలంతో దూషింపజేసిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలనే డిమాండ్‌తో బుధవారం వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు ప్రజలు వెల్లువెత్తారు.ఇదే సమయంలో టీడీపీ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు ఏమాత్రం స్పందన కనిపించకపోవడం గమనార్హం. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఎమ్మెల్యే విడదల రజనితో కలిసి భారీ ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు రాష్ట్రమంతా నిరసనల హోరు టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నెల్లూరులో భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమాలు జరిగాయి. ప్రకాశం జిల్లాలో టీడీపీకి వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తాయి. దుర్భాషలకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు మిన్నంటాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాల్లోనూ చంద్రబాబు, పట్టాభి దిష్టిబొమ్మలను దహనం చేయడంతో పాటు ప్రదర్శనలు, మానవహారాలు నిర్వహించారు. సీఎం జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. టీడీపీ నేతల నోటి దురుసుపై కృష్ణా జిల్లాలో నిరసనాగ్రహం పెల్లుబికింది. టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని పలుచోట్ల పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. నల్ల జెండాలతో ప్రదర్శనలు చేపట్టారు. టీడీపీ నేతల తీరు పట్ల సిక్కోలులో వైఎస్సార్ సీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. నెల్లూరులో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నవైఎస్సార్సీపీ నాయకులు ముఖ్యమంత్రిని దూషించిన పట్టాభితోపాటు చంద్రబాబు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కడప జిల్లాలో ఆందోళన చేపట్టి దిష్టి బొమ్మలను దహనం చేశారు. గుంటూరు జిల్లాలోనూ నిరసనలు హోరెత్తాయి. పలుచోట్ల రోడ్లపై బైఠాయించి ఆందోళనకు దిగారు. రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై విజయనగరం జిల్లాలో వైఎస్సార్ సీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. టీడీపీ నేతల బూతు పురాణంపై చిత్తూరు జిల్లాలో వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడ్డాయి. టీడీపీ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ దేవుళ్లను ప్రార్థించారు. తూర్పు గోదావరి జిల్లాలో పలుచోట్ల చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రజాక్షేత్రంలో చెల్లని చంద్రబాబు కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని విశాఖలో శాంతియుతంగా నిర్వహించిన కార్యక్రమాల్లో ధ్వజమెత్తారు. పాడేరులో వైఎస్సార్సీపీ నేతల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కర్నూలు జిల్లా ఆత్మకూరులో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు చర్చి సెంటర్లో నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకార్తలు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నిరసన తెలుపుతున్న మేయర్ షేక్ నూర్జహన్, వైఎస్సార్సీపీ శ్రేణులు ► ఈ వ్యవహారంలో పూర్తి బాధ్యత చంద్రబాబుదే. పోలీసులు జారీ చేసిన సమన్ల అంశంపై పట్టాభి ప్రెస్‌మీట్ పెడితే.. ఈ స్థాయిలో విమర్శలు అవసరం లేదు కదా. ఆ మాటకు తప్పనిసరిగా రియాక్షన్ వస్తుందని తెలుసు. అంతా పక్కా ప్రణాళికతో చేశారు. – సజ్జల రామకృష్ణారెడ్డి,వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ► పట్టాభి వంటి జీతానికి పనిచేసే వాళ్లతో సీఎం వైఎస్ జగన్‌ను, మమ్మల్ని తిట్టించడం చంద్రబాబు ఆనవాయితీగా పెట్టుకున్నాడు. ‘చంద్రబాబు మోసగాడు. 420. అవినీతి చక్రవర్తి. ఔరంగజేబు’ అని నాడు ఎన్టీఆర్ అన్నారు. అవే మాటలను నేను గుర్తు చేస్తున్నా అంతే. అసలు గంజాయి వ్యాపారం మొదలు పెట్టిందే చంద్రబాబు. – కొడాలి నాని, పౌరసరఫరాల శాఖ మంత్రి ► పట్టాభితో చంద్రబాబు చేయించినది చర్య అయితే, జగనన్న అభిమానులు తిరగబడటం కేవలం ప్రతిచర్య మాత్రమే. మొదటిది లేకపోతే అంటే బూతులు తిట్టించకపోతే, ప్రతి చర్యకు అవకాశమే లేదు. 36 గంటలు కాదు.. 360 రోజులు దీక్షలు చేసినా బాబును ప్రజలు నమ్మరు. – మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ► చంద్రబాబును ఇలాగే మాట్లాడితే ఊరుకుంటారా? ఇలాగే వదిలేస్తే రేపు అన్ని పార్టీల వారినీ ఇలాగే మాట్లాడతారు. అలజడి సృష్టిస్తున్నదే చంద్రబాబు. ఆ దిశగా పోలీసులు విచారణ చేయాలి. – బాలినేని శ్రీనివాసరెడ్డి, అటవీ శాఖ మంత్రి ► ఎప్పుడూ హైదరాబాద్‌లో ఉండే చంద్రబాబు ఉన్నపళంగా వచ్చి కరకట్ట పక్కన ఎందుకు నక్కి ఉన్నారు? ఈ కుట్ర కోసం కాదా? ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడలేక ఇంతకు దిగజారతారా? ఆర్టికల్ 356 ప్రయోగించాలా? వ్యవస్థల్ని మేనేజ్ చేసే మీ మాఫియా వల్ల ఈ రాష్ట్రంలో పేదలకు జరిగిన మంచి ఏమిటి? – చెరుకువాడ శ్రీరంగనాథరాజు,గృహ నిర్మాణ శాఖ మంత్రి ► చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే క్షమాపణ చెప్పాలి. పట్టాభి ద్వారా చంద్రబాబు మాట్లాడించిన ఆ మాటలు తల్లులను క్షోభకు గురి చేస్తాయి. గొడవలు, ఘర్షణల ద్వారా లబ్ధిపొందాలనేదే చంద్రబాబు లక్ష్యం. – గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్