
సాక్షి, గుంటూరు: చంద్రబాబుకు రాజకీయ సంస్కారం లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. 'ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది. బాబు లాంటి ద్రోహి ఉండటానికి వీల్లేదని ఎన్టీఆర్ ఆనాడే అన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలను చంద్రబాబు మరింత దిగజార్చారు. కావాలనే సీఎంపై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు.
అధికారం లేకపోయేసరికి చంద్రబాబుకు మతిభ్రమించింది. రాష్ట్రంలో గొడవలు సృష్టించాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు. ఎల్లో మీడియాతో కలిసి చంద్రబాబు అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారు. యువకుడైన సీఎం బాధ్యతగా వ్యవహరిస్తుంటే.. 70 ఏళ్ల వ్యక్తి బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబును ప్రజలు అసహ్యించుకుంటున్నారు. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఈసీని కోరుతాం. పాప విముక్తి కావాలంటే ఇప్పటికైనా చంద్రబాబు క్షమాపణ కోరాలి' అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment