LIVE : Chandrababu Remand, Court matters and Ground updates
6:43 PM, సెప్టెంబర్ 28, 2023
మంగళగిరి కార్యాలయంలో జనసేన పార్టీ నేతల భేటీ
► తెలుగుదేశం పొత్తుపై నాదెండ్ల మనోహర్ చర్చలు
► జైలుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో మాట్లాడి పొత్తు ప్రకటించారు
► ఎన్ని సీట్లు అడుగుదాం?, ఏ ఏ జిల్లాల్లో అడుగుదాం?
► కనీసం 75 సీట్లు తక్కువ కాకుండా సీట్లు అడగాలన్న యోచనలో నేతలు
► తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టొద్దన్న పవన్ సూచనలను గుర్తు చేసిన నాదెండ్ల
► లోకేష్, బాలకృష్ణ పక్కన నిలబడ్డంత మాత్రాన ఎక్కువ ఊహించుకోవద్దంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసినట్టు సమాచారం
► జనసేన పోటీ చేసే చోట తెలుగుదేశం మద్ధతు ఎలా తీసుకోవాలన్న దానిపై చర్చ
6:12 PM, సెప్టెంబర్ 28, 2023
కేవియట్ పిటిషన్‌తో తెలుగుదేశం బేజారు
► అక్టోబర్ 3పై కోటి ఆశలు పెట్టుకున్నతెలుగుదేశం
► అన్యాయం జరిగిపోయిందని కలరింగ్ ఇచ్చేందుకు సన్నాహాలు
► గగ్గోలు పెట్టి స్టే తెచ్చుకోవాలని వ్యూహం
► ఈ కేసులో తమ వాదనలు వినాలంటూ ఏపీ సర్కారు కేవియట్ పిటిషన్
► మొత్తం ఆధారాలను సుప్రీంకోర్టు ముందుంచనున్న ఏపీ సర్కారు
► చంద్రబాబు ఏ రకంగా అక్రమాలకు పాల్పడ్డారో తెలియజేస్తూ సమగ్ర పిటిషన్
► కేసు పూర్తిగా వ్యతిరేకంగా ఉందని ఇప్పటికే టిడిపికి చెప్పిన సీనియర్ లాయర్లు
► ఈ కేసులో తమకు రిలీఫ్ దొరకడం కష్టమేనని తెలుగుదేశం ఆందోళన
4:20 PM, సెప్టెంబర్ 28, 2023
రింగ్ రోడ్డు పేరిట దోపిడి చేశారు : YSRCP
► రింగ్ రోడ్డును తమకు అనుకూలంగా మలుపులు తిప్పారు
► రోడ్డు పక్కనే ఉన్న తమ భూములకు విలువ పెంచుకున్నారు
► భారీ లాభాలతో విక్రయించారు : YSRCP
అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు అలైన్మెంట్ ఖరారు పేరిట జరిగిన భూ దోపిడీలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడుగా నారా లోకేశ్ కీలక పాత్ర వహించినట్లు సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వెల్లడించింది. లోకేశ్ పాత్రకు సంబంధించి 129 ఆధారాలను గుర్తించి జప్తు చేసింది. ఐఆర్‌ఆర్ లో లోకేశ్… pic.twitter.com/r8R8fu07cB
— YSR Congress Party (@YSRCParty) September 28, 2023
4:05 PM, సెప్టెంబర్ 28, 2023
పాదయాత్ర లేదు.. పార్టీ ప్రోగ్రాం లేదు..
► పాదయాత్రను వాయిదా వేసాం : అచ్చెన్నాయుడు
► కేసులో లోకేష్ పేరు పెట్టారు
► చంద్రబాబునాయుడిపై PT వారంటు జారీ చేశారు
► వీటిన్నింటిని న్యాయపరంగా ఎదుర్కొవాలి
► ఢిల్లీలో సుప్రీంకోర్టులో లాయర్లతో లోకేష్ మాట్లాడాలి
► లోకేష్‌ను వాయిదా వేసుకొమ్మని మేమే కోరాం
3:52 PM, సెప్టెంబర్ 28, 2023 - BIG BREAKING
చినబాబుకు భయం పట్టుకుంది.! పాదయాత్ర వాయిదా
► లోకేష్ యువగళం పాదయాత్ర వాయిదా
► యువగళం పాదయాత్ర తేదీ వాయిదా వేయాలని తెలుగుదేశం నిర్ణయం
► ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాతే పునఃప్రారంభించాలని నిర్ణయం
► అప్పటివరకు ఢిల్లీలోనే ఉండాలని యోచిస్తోన్న లోకేష్
► రాజమండ్రికి వస్తే జైలుకు పోవడమొక్కటే మిగిలిందని లోకేష్‌కు సూచించిన టీడీపీ నేతలు, ఎల్లో మీడియా టాప్ మేనేజ్‌మెంట్లు
► అక్టోబర్ 3న సుప్రీంకోర్టులో స్కిల్ కేసు విచారణను బట్టి నిర్ణయం తీసుకుందామని సూచన
► ఢిల్లీలో మంచి లాయర్లను ముందస్తు బెయిల్ కోసం మాట్లాడుకొమ్మని సలహా
► ఇప్పుడే పాదయాత్రకు వెళ్లాలనుకుంటే అరెస్ట్ అవుతారని సూచన
► టీడీపీ నాయకులు, పచ్చమీడియా మేనేజ్‌మెంట్ల అభిప్రాయాలతో ఏకీభవించిన లోకేష్
► పాదయాత్ర సంగతి తర్వాత చూద్దాం, ఢిల్లీ హోటల్లోనే ఉంటానన్న లోకేష్
పాదయాత్ర ఘనంగా ప్రారంభిస్తామని నిన్నటిదాకా ట్వీట్లు వేసిన తెలుగుదేశం
అద్భుత ప్రజాదరణతో జైత్రయాత్రలా కొనసాగుతోన్న యువగళం పాదయాత్ర చంద్రబాబు గారి అక్రమ అరెస్టు కారణంగా ఆగింది. కానీ అది చిన్న విరామం మాత్రమే. ఎక్కడ ఆగిందో అక్కడ నుంచే మళ్ళీ సెప్టెంబర్ 29, 2023, రాత్రి 8.15 గంటలకు పాదయాత్రను ప్రారంభిస్తున్నారు నారా లోకేష్ గారు#YuvaGalamPadayatra… pic.twitter.com/cSDQONUG8s
— Telugu Desam Party (@JaiTDP) September 26, 2023
3:12 PM, సెప్టెంబర్ 28, 2023 - BIG BREAKING
సుప్రీంకోర్టు: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేవియట్
► సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
► చంద్రబాబుపై నమోదయిన కేసులో మా వాదన వినాలని విజ్ఞప్తి
► స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు పాత్రపై ఎన్నో ఆధారాలున్నాయి
► విద్యార్థులకు శిక్షణ ఇస్తామని కోట్ల కుంభకోణం చేశారు
► నిధులను షెల్ కంపెనీల ద్వారా రూటు మళ్లించి ఎన్‌క్యాష్ చేసుకున్నారు
► కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే ఈ అంశాన్ని దర్యాప్తు చేస్తున్నాయి
► ఈ కేసులో మొదట సమాచారం ఇచ్చింది కేంద్ర పరిధిలోని GST శాఖ
► ఈ కేసులో మా వాదన మీ ముందుంచుతాం : ఏపీ ప్రభుత్వం
3:10 PM, సెప్టెంబర్ 28, 2023
తిట్టలేదట కానీ అన్నాడట : అదీ బుచ్చయ్య సంస్కారం.!
► నేను జడ్జిని తిట్టలేదు : గోరంట్ల బుచ్చయ్య చౌదరీ
► కానీ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని అన్నాను
► నాకు కోర్టు నోటీసులు వచ్చాక, పరిశీలించి మాట్లాడుతా
► చంద్రబాబుని జైల్లో పెట్టి పొందేది తాత్కాలిక ఆనందమే
1:10 PM, సెప్టెంబర్ 28, 2023
జవాబులు చెప్పండి ప్లీజ్.!
తెలుగుదేశం లీగల్ సెల్‌కు సగటు తెలుగు ప్రజల 10 ప్రశ్నలు..
1. ఏ కోర్టులో అయినా బాబు లాయర్లు సెక్షన్ 17A అంటున్నారు, మరో వాదన వినిపించడం లేదేందుకు?
2. అరెస్ట్ చేసిన తీరును తప్పుబడుతున్నారు కానీ తప్పు చేయలేదని ఎందుకు చెప్పడం లేదు?
3. దేశంలోనే అత్యంత ఖరీదైన హరీష్ సాల్వేను పెట్టుకున్నా.. మీ కేసులో ఒక్కటంటే ఒక్క బలమైన కారణం దొరకడం లేదా?
4. మీడియా మీటింగ్‌ల్లో మీరు చేసే ప్రకటనలను కోర్టు ముందు ఎందుకు చెప్పడం లేదు?
5. Yes, మేం తప్పు చేయలేదు, ఈ డబ్బులు మా ఖాతాల్లో పడలేదు, ఈ సంతకాలు బాబు పెట్టలేదు అని కోర్టుకు చెప్పడం లేదెందుకు?
6. మీరు అన్నీ కరెక్ట్‌గానే చేస్తే.. మీ మనుష్యులు శ్రీనివాస్, మనోజ్ తదితరులంతా దేశం విడిచి ఎందుకు పారిపోయారు?
7. ప్రపంచమంతా అన్ని దేశాల్లో నిరసనలు చేస్తున్నారని ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటున్న మీరు జర్మనీలో సీమెన్స్ కంపెనీ ముందు ఎందుకు ధర్నాలు చేయడం లేదు?
8. కనీసం సీమెన్స్ కంపెనీకి తెలుగుదేశం పార్టీ నుంచి అధికారికంగా ఒక్క మెయిల్ అయినా రాయలేదేందుకు?
9. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్నది ఒప్పందం నుంచి ఎందుకు తొలగించారో.. ఏ మీడియా సమావేశంలో చూపించడం లేదెందుకు?
10. మేనేజర్ తప్పు చేస్తే ఓనర్‌ను శిక్షిస్తారా అన్న డొంక తిరుగుడు వాదన లోకేష్ ఎందుకు చేస్తున్నారు?
1:10 PM, సెప్టెంబర్ 28, 2023
అమరావతిలో రింగ్ అంతా లోకేష్‌దే
► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో లోకేష్ కుట్ర సుస్పష్టం
► కోర్టులో దాఖలు చేసిన మెమోలో సిట్ వెల్లడి
► లోకేష్ పాత్రను స్పష్టం చేస్తున్న 129 ఆధారాలు
► ఈ ఆధారాలను జప్తు చేసిన సిట్ అధికారులు
► అప్పటి అధికారులు, అలైన్ మెంట్ లో పాల్గొన్న సంస్థల వాంగ్మూలాలూ నమోదు
► పక్కా పన్నాగంతోనే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో మార్పులు
► హెరిటేజ్‌కు, లింగమనేని రమేష్ కుటుంబానికి అడ్డగోలుగా లబ్ధి
► వారి భూములను ఆనుకొని వెళ్లేలా IRRలో మార్పులు
► క్విడ్ ప్రోకో ద్వారా చంద్రబాబుకు కరకట్ట బంగ్లా బహుమానంగా ఇచ్చిన లింగమనేని
మాస్టర్ ప్లాన్ లోని ఇన్నర్ రింగు రోడ్డును ఇష్టానుసారం మార్చేసింది ప్రజల కోసం ఏమాత్రం కాదు. ఆ ప్రాంతాల్లోని నారాయణ కాలేజీల కోసమే ఈ ప్లాను.. తద్వారా నారాయణతో పాటు @naralokesh , @ncbn సైతం లబ్ది పొందారు. #CorruptBabuNaidu#SkilledCriminalCBNInJail #AmaravathiLandScam… pic.twitter.com/HwytVjPaVR
— YSR Congress Party (@YSRCParty) September 28, 2023
1:00 PM, సెప్టెంబర్ 28, 2023
పాదయాత్ర నిలిపివేస్తే పరువు గోవిందా.!
► లోకేష్ తీరుపై తెలుగుదేశంలో తీవ్ర ఆందోళన, ఆగ్రహం
► ఇప్పటివరకు నడిచిన క్రెడిట్ అంతా పోతోందని ఆవేదన
► ఏపీ నుంచి ఢిల్లీ పారిపోయారన్న అపఖ్యాతి వద్దంటున్న టిడిపి క్యాడర్
► ఎల్లో మీడియాలో వస్తున్న అప్‌డేట్స్ ప్రకారం టిడిపి ఇన్‌సైట్స్ ఇలా ఉన్నాయి
రెండు వర్గాలుగా మారిన తెలుగుదేశం అగ్ర నేతలు
ఒక వర్గం : ముందయితే ఎలాగైనా లోకేష్‌ను బుజ్జగించి రాజమండ్రికి రప్పించాలి
రెండో వర్గం : పాదయాత్రను కనీసం వారం పాటు వాయిదా వేయాలి
ఒక వర్గం : లోకేష్‌ను అరెస్ట్ చేస్తే బ్రాహ్మణితో పాదయాత్ర చేయించాలి
రెండో వర్గం : ముందస్తు బెయిల్ వచ్చే వరకు లోకేష్‌ను ఢిల్లీలోనే ఉంచాలి
ఒక వర్గం : లోకేష్ కంటే బ్రాహ్మణి బరిలో దిగితే ఎక్కువ మైలేజ్ వస్తుంది, నారా+నందమూరి కుటుంబాలకు వారసురాలిగా గుర్తింపు వస్తుంది
రెండో వర్గం : ఇన్నాళ్లు లోకేష్‌ను లీడర్‌గా ప్రచారం చేసి ఇప్పుడు వెనక్కు జరిపితే క్యాడర్ మనోస్థైర్యం దెబ్బ తింటుంది
12:45 PM, సెప్టెంబర్ 28, 2023
మా చినబాబు మంచోడే, కొనాలని ముందే కల పడింది : టిడిపి
► అమరావతిలో భూములు కొనాలని లోకేష్ ముందే అనుకున్నారు : పట్టాభి
► భూముల విషయంలో టిడిపి నేత పట్టాభి అధికారిక ప్రకటన
► అవును, నారా లోకేష్‌తో పాటు హెరిటేజ్ కూడా భూములు కొనుగోలు చేశారు
► సంస్ధ విస్తరణ కోసం అనేక చోట్ల హెరిటేజ్ భూములు కొంటుంది
► అదేవిధంగా ఆనాడు అమరావతి ప్రాంతంలోనూ భూములు కొనుగోలు చేసింది
► FIR ఫైల్ కాగానే CIDకి కూడా హెరిటేజ్ సంస్ధ అన్ని వివరాలతో లేఖ రాసింది
► జులై1న హెరిటేజ్ 7.21 ఎకరాలు కొనుగోలు చేసింది
► జులై 31తర్వాత మరి కొన్ని ఎకరాలు భూమి కొనుగోలు చేసింది
► లింగమనేని నుంచి కూడా 4.55 ఎకరాలు కొనుగోలు చేసింది
► ఈ భూమికి సంబంధించి లీగల్ ఇష్యూ ఉందని ఒప్పందం రద్దు చేసుకుంది
► లీగల్ ఇష్యూ ఉందని కోట్లు విలువచేసే 4.5 ఎకరాలను హెరిటేజ్ వదులుకుంది
► లింగమనేని భూమి ఒప్పందం రద్దుచేసుకున్నాక హెరిటేజ్‌కు మిగిలింది 9.6 ఎకరాలు
► కొనాలని ముందే అనుకున్నారు కాబట్టి తప్పు జరిగిందని ఎలా చెబుతారు?
చంద్రబాబు అప్పట్లో అమరావతిని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దబోతున్నట్లు గ్రాఫిక్స్‌తో అందర్నీ నమ్మించాడు. కానీ.. చివరికి అమరావతి అంతర్జాతీయ స్కామ్‌గా మిగిలిపోయింది. ఈ స్కామ్‌కి డైరెక్షన్ చంద్రబాబు.. పర్యవేక్షణ నారా లోకేష్.
— YSR Congress Party (@YSRCParty) September 27, 2023
- మంత్రి ఆదిమూలపు సురేష్#APAssembly#CorruptBabuNaidu… pic.twitter.com/XaSGHK5b8o
12:30 PM, సెప్టెంబర్ 28, 2023
కిం కర్తవ్యం.?
► రేపు నంద్యాలలో టీడీపీ యాక్షన్ కమిటీ సమావేశం
► ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొననున్న నారా లోకేష్
► చంద్రబాబును అరెస్ట్ చేసిన నంద్యాలలోనే యాక్షన్ కమిటీ భేటీ
► పార్టీ భవిష్యత్ కార్యాచరణతో పాటు ముఖ్యమైన అంశాలపై సమావేశంలో చర్చ
► లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు ముందు నిలబడుతుందా?
► లోకేష్‌కు వ్యతిరేకంగా ఎలాంటి బలమైన ఆధారాలున్నాయి.?
► లోకేష్ పాదయాత్ర నిరవధికంగా వాయిదా పడుతుందా?
► ఇప్పట్లో చంద్రబాబు బయటకు వస్తారా?
► చంద్రబాబుకు ప్రత్యామ్నయంగా పార్టీకి ఎవరు నేతృత్వం వహిస్తారు?
► భువనేశ్వరీ, బ్రాహ్మణికి ఎలాంటి బాధ్యతలు ఇస్తారు?
► ఎల్లో మీడియాలో జరుగుతున్నట్టు మహిళలిద్దరే పార్టీకి నేతృత్వం వహిస్తారా?
► లోకేష్ అరెస్ట్ అవుతారంటూ ఎల్లో మీడియాలో చేస్తున్న ప్రచారం నిజమేనా? సానుభూతి కోసమా?
► బాలకృష్ణ పాత్ర ఏంటీ? పార్టీ మీటింగ్‌లు రెండు పెట్టి మళ్లీ కనిపించడం లేదేందుకు?
► జైలు ముందు పొత్తు ప్రకటన తర్వాత పవన్ కళ్యాణ్ ఎందుకు తెర మీదికి రావడం లేదు?
► పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు? ఏ ఏ సీట్లు ఇస్తారు?
12:00 PM, సెప్టెంబర్ 28, 2023
లోకేష్ యువగళానికి మంగళం.!
► మరింత వాయిదా దిశగా లోకేష్ పాదయాత్ర యువగళం
► ఢిల్లీలో చేసిన ప్రకటన ప్రకారం రేపు రాత్రి నుంచి పాదయాత్ర చేయాలని నిర్ణయం
► అరెస్ట్ భయంతో ఇప్పట్లో ఢిల్లీ నుంచి రాలేనంటున్న చిన బాబు
► పాదయాత్ర మధ్యలో నిలిపివేస్తే పరువు పోతుందంటున్న తెలుగుదేశం నేతలు
► హైకోర్టులో ముందస్తు బెయిల్ వస్తేనే ఏపీకి వస్తానని తేల్చి చెబుతోన్న లోకేష్
► అరెస్ట్ అయితే మరింత సానుభూతి వస్తుందంటున్న టిడిపి నేతలు
► చంద్రబాబు అరెస్ట్‌కే రాలేదు, నాకేం వస్తుందని ఎదురు ప్రశ్నిస్తోన్న లోకేష్
► యువగళం పాదయాత్ర వాయిదా వేస్తున్నారని ఎల్లో మీడియాలో బ్రేకింగ్‌లు
► వారం వాయిదా వేస్తేనే బాగుంటుందని కొందరు నేతలు లోకేష్‌కు సూచించారు : ఎల్లో మీడియా
► ఎవరా కొందరు.? ఎందుకు వాయిదా? అన్న వివరాలు వెల్లడించని ఎల్లో మీడియా
11:45AM, సెప్టెంబర్ 28, 2023
ఏసీబీ జడ్జిపై పోస్టు.. మరో టీడీపీ నేత అరెస్ట్
►ఏసీబీ జడ్జిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన కృష్ణా జిల్లా టీడీపీ నేత
►టీడీపీ నాయకుడు బుర్ర వెంకట్‌ను అదుపులోకి తీసుకున్న కంకిపాడు పోలీసులు
►మచిలీపట్నం సైబర్ బ్రాంచ్ కి అప్పగించిన పోలీసులు
► స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధించిన ఏసీబీ న్యాయమూర్తి
10:20AM, సెప్టెంబర్ 28, 2023
ఏ వయస్సులో చేసినా నేరం నేరమే
►చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు పక్కా ఆధారాలు ఉన్నాయి
►ఆధారాలతోనే సీఐడీ అరెస్ట్ చేసింది
►కోర్టులు కూడా బెయిల్ ఇవ్వకపోవడానికి అదే కారణం
►బాబు చేసిన స్కాం లు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి
►చంద్రబాబుకు 23 లక్కీ నంబర్
►మా పార్టీకి చెందిన 23 మందికి లాక్కున్నాడు
►2019లో ఆయనకి వచ్చిన సీట్లు 23
►జైలుకు వెళ్లిన డేట్ కూడా 23 యే
►చంద్రబాబు అరెస్ట్ పై జంప్ అయిన ఎమ్మెల్యే ల హడావుడి ఎక్కువైంది.
►మునిగిపోయే పడవలో కూర్చుని ఎక్కువ రోజులు వారు రాజకీయం చెయ్యలేరు
►తప్పు చేస్తే మా ప్రభుత్వంలో ఎంతటి వారికైనా జైలు జీవితం తప్పదు
►ఏ వయస్సులో చేసినా తప్పు తప్పే.. నేరం నేరమే..
►భవిష్యత్తు లో చంద్రబాబు మరిన్ని కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది
:: ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్
07:30AM, సెప్టెంబర్ 28, 2023
రింగ్‌రోడ్డు కేసులో లోకేష్ పాత్రపై 129 ఆధారాలు
►అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో లోకేశ్ కుట్ర సుస్పష్టం
►ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన మెమోలో సిట్ వెల్లడి
►లోకేశ్ పాత్రను స్పష్టం చేస్తున్న 129 ఆధారాలు
►ఈ ఆధారాలను జప్తు చేసిన సిట్ అధికారులు
►అప్పటి అధికారులు, అలైన్‌మెంట్‌లో పాల్గొన్న సంస్థల వాంగ్మూలాలూ నమోదు
►పక్కా పన్నాగంతోనే ఐఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌లో మార్పులు
►హెరిటేజ్‌కు, లింగమనేని రమేశ్ కుటుంబానికి అడ్డగోలుగా ప్రయోజనం
►వారి భూములను ఆనుకొని వెళ్లేలా ఐఆర్‌ఆర్‌లో మార్పులు
►క్విడ్ ప్రోకో ద్వారా చంద్రబాబుకు కరకట్ట బంగ్లా
ఇదీ చదవండి: హెరిటేజ్ అంటేనే నారా కుటుంబం
07:00AM, సెప్టెంబర్ 28, 2023
సుప్రీం జడ్జిల వద్ద బాబు లాయర్ల పట్టు.. నో రిలీఫ్
►నిన్న(బుధవారం) సుప్రీంలో చంద్రబాబు లాయర్ల ఇబ్బందికర ప్రవర్తన
►తక్షణ ఉపశమనానికి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌పై ఒత్తిడి
► తిరస్కరించిన సీజేఐ
►కస్టడీ పిటిషన్‌పై వాదనలు వినకుండా ట్రయల్ జడ్జిని నియంత్రించలేమని స్పష్టీకరణ
►అక్టోబర్ 3వ తేదీనే ఎస్‌ఎల్‌పీపై విచారణ జాబితాలోకి అని బాబు లాయర్లకు చెప్పిన చీఫ్ జస్టిస్
►అంతకు ముందు.. బాబు పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టి
►సోమవారం జాబితా చేయాలని బాబు లాయర్ హరీష్ సాల్వే పట్టు
►సాధ్యం కాదని.. వచ్చే వారమే లిస్ట్ చేస్తామని స్పష్టం చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా
06:45AM, సెప్టెంబర్ 28, 2023
ఏసీబీ జడ్జిపై పోస్టులు.. టీడీపీ నేత అరెస్ట్
► చంద్రబాబు కేసును విచారణ చేసిన ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందును అవమానించిన టీడీపీ నేత
►సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టిన టీడీపీ సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ముల్లా ఖాజా హుస్సేన్
► జడ్జిపై అనుచిత పోస్ట్ చేసినందుకు టీడీపీ నేత ముల్లా ఖాజాను అరెస్ట్ చేసిన నంద్యాల పోలీసులు
►ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేసిన ఖాజా హుస్సేన్
►టీడీపీ తరపునే పోస్ట్ చేసినట్లు ఒప్పుకోలు!
►నేడు కోర్టులో హాజరు పరచనున్న పోలీసులు.
ఇదీ చదవండి: జడ్జిలపై కులం పేరుతో దూషణల పర్వం
06:30AM, సెప్టెంబర్ 28, 2023
రాజమండ్రి జైల్లో చంద్రబాబు @19
►స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడి రిమాండ్ 19వ రోజుకి చేరుకుంది
► సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో అదుపులోకి తీసుకుంది ఏపీ సీఐడీ
► ఏసీబీ కోర్టు రిమాండ్‌తో ఖైదీ నెంబర్ 7691గా రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహా బ్లాక్‌లో చంద్రబాబు
► ఇప్పటికే రెండుసార్లు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగింపు
► అక్టోబర్ 5వ తేదీ వరకు జైల్లోనే చంద్రబాబు
టీడీపీ & గ్యాంగ్ చిల్లర వేషాలు: వైఎస్సార్‌సీపీ
►చంద్రబాబు ఇప్పటికే 20కిపైగా కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడు.
►అప్పుడు న్యాయస్థానాలను టీడీపీ వాళ్లు ఆహా ఓహో అని పొగిడారు.
►ఇప్పుడు చంద్రబాబుకి రిమాండ్ విధించగానే.. కోర్టులు చెడ్డవి అయిపోయాయా?
►జడ్జిలపై టీడీపీ నేతలు అసభ్యకర కామెంట్స్ పెట్టడం.. వాళ్ల పైశాచికత్వానికి నిదర్శనం
చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలతో టీడీపీ అండ్ గ్యాంగ్ చిల్లర వేషాలు వేస్తోంది. @ncbn ఇప్పటికే 20కిపైగా కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడు. అప్పుడు న్యాయస్థానాలను టీడీపీ వాళ్లు ఆహా ఓహో అని పొగిడారు.. ఇప్పుడు బాబుకి రిమాండ్ విధించగానే కోర్టులు చెడ్డవి అయిపోయాయా? గౌరవ జడ్జిలపైనే సోషల్… pic.twitter.com/1PjfV0rabV
— YSR Congress Party (@YSRCParty) September 27, 2023
Comments
Please login to add a commentAdd a comment