
బనశంకరి: రేణుకాస్వామి హత్య కేసులో జైలుపాలైన నటి పవిత్రా గౌడ అనారోగ్యానికి గురి కావడంతో పరప్పన అగ్రహార జైలులోనే ఆసుపత్రి వార్డులో చికిత్స అందిస్తున్నారు. చికిత్స తరువాత ఆమె కోలుకున్నట్లు తెలిసింది. హత్య కేసులో ప్రముఖ నటుడు దర్శన్‌తో పాటు 17 మంది నిందితులు పరప్పన జైలులో ఉన్నారు.
జూన్ 11వ తేదీన నిందితులను అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులు అరెస్టు చేశారు. రెండువారాల పాటు తీవ్రంగా విచారించి, తరువాత జైలుకు పంపారు. మరోవైపు దర్శన్ కూడా జైలులో ఆహారం సరిపడక ఇబ్బందులు పడుతున్నాడు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు తెలిసింది. సరిగా నిద్రపోవడం లేదని, నిరంతరం చింతిస్తున్నాడని సమాచారం. ఫలితంగా బాగా బరువు కూడా తగ్గిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment