న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ స్కూల్ లో చదువుతున్న350 మంది పైగా విద్యార్థులు కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు లోనయైన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. బెంగళూరులో ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులు ఈ రోజు మధ్యాహ్నం ఆహారం తీసుకున్న అనంతరం తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు. దీంతో అసలు విషయాన్ని గ్రహించిన స్కూల్ యాజమాన్యం విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆ విద్యార్థులు ఆహారం తీసుకున్న అనంతరం తలనొప్పి, కడుపు నొప్పితో తీవ్ర ఇబ్బందిపడటంతో డాక్టర్ అంబేద్కర్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో చాలామంది వైద్యం తీసుకున్న తరువాత ఇంటికి చేరుకున్నారు. కాగా చాలామంది విద్యార్థులకు ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.