విందు భోజనం వికటించడంతో 300 మంది అస్వస్థతకు గురయ్యారు.
కె.కోటపాడు(విశాఖపట్నం): కలుషిత ఆహారం తిని 300 మంది అస్వస్థతకు గురైన సంఘటన విశాఖపట్నం జిల్లా కె. కోటపాడు మండలం మర్రివలసలో ఆదివారం రాత్రి జరిగింది. గ్రామంలోని ఓ పెళ్లిలో ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసిన 300 మంది అస్వస్థతకు గురయ్యారు.
మాంసాహరం విషతుల్యమై వాంతులు, విరోచనాలతో డీలా పడ్డారు. దీంతో వారిని కోటపాడు ప్రభుత్వ ఆస్పత్రితో పాటు పలు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తలరించారు.