muthyala naidu
-
డిప్యూటీ సీఎం బూడి హత్యకు కుట్ర
దేవరాపల్లి (అనకాపల్లి జిల్లా): డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు ఇంటి వద్ద డ్రోన్ కెమెరాతో నలుగురు రెక్కీ నిర్వహించడం వివాదాస్పదమైంది. గ్రామస్తులు వారిని పట్టుకుని, తమ నేత బూడి ముత్యాలనాయుడుç ßæత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ పోలీసులకు అప్పగించారు. ముత్యాలనాయుడు ప్రత్యరి్థ, బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ జోక్యం చేసుకోవడంతో వివాదం ముదిరింది.రాత్రి వరకు హైడ్రామా నడిచింది. దేవరాపల్లి మండలం తారువలోని బూడి ఇంటి చుట్టూ శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో డ్రోన్‌తో రెక్కీ నిర్వహించారు. అరగంటకు పైగా ముత్యాలనాయుడు ఇంటి పరిసరాల్లో డ్రోన్ చక్కర్లు కొట్టడంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు డ్రోన్ ఆపరేటర్లను ఆరా తీశారు. పొంతన లేని సమాధానం చెప్పడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ డి.నాగేంద్ర గ్రామానికి చేరుకుని డ్రోన్, బీజేపీ జెండా సహా హైదరాబాద్‌కు చెందిన డ్రోన్ ఆపరేటర్ చిలకల పాండురంగారావు, అసిస్టెంట్ ఆపరేటర్ పొట్టి సాయికృష్ణ, చొప్ప గంగాధర్, కొమర అప్పారావులను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. తన హత్యకు కుట్ర పన్నారని, అనుమతులు లేకుండా తన ఇంటి చుట్టూ డ్రోన్‌తో రెక్కీ నిర్వహించారని ముత్యాలనాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం రమేష్ ఎదురుదాడి విషయం తన అనుచరుల ద్వారా తెలుసుకున్న సీఎం రమేష్ డ్రోన్ ఆపరేటర్లను తారువ గ్రామస్తులపై ఎదురు ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. సాయంత్రం 4 గంటల సమయంలో అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో దేవరాపల్లి పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. తమ కార్యకర్తలపై దాడి చేసిన బూడి వర్గీయులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ముత్యాలనాయుడు ఇంటి వద్దకు వెళ్లేందుకు సీఎం రమేష్ సిద్ధం కాగా.. పోలీసులు నిరాకరించారు. రౌడీమూకల మాదిరిగా పోలీసులను నెట్టుకుంటూ తన వెంట ఉన్న పచ్చ దండుతో రమేష్ తారువకు వెళ్లారు. ముత్యాలనాయుడి మరో ఇంటి వద్దకు (ఆ ఇంట్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ముత్యాలనాయుడి కుమారుడు రవికుమార్ ఉంటున్నారు) వెళ్లగా.. రమేష్ వస్తున్న విషయం తెలుసుకుని ముత్యాలనాయుడు ఆ ఇంటి వద్ద తన అనుచరులతో బైఠాయించారు. ఈ ఇల్లు కూడా తన పేరిట ఉందని, ఎవరొస్తారో చూస్తానని హెచ్చరించారు. విషయం తెలుసుకుని అవాక్కయిన సీఎం రమేష్ తన అనుచరులతో కలిసి హనుమాన్ ఆలయం ముందు మెట్లపై కూర్చుండి పోయారు. తారువ గ్రామస్తులు, వైఎస్సార్సీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని తమ ఊళ్లో రౌడీ రాజకీయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పోలీసులు వెళ్లిపోవాలని కోరడంతో సీఎం రమేష్ పోలీసు జీపు ఎక్కారు. దీంతో రమేష్ ఎక్కిన జీపునకు అడ్డంగా గ్రామస్తులు బైఠాయించారు. గూండాగిరీ చేసిన సీఎం రమేష్ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. దీంతో అరగంటకు పైగా సీఎం రమేష్ ఎక్కిన పోలీసు వాహనం నిలిచిపోయింది. ఆ వాహనాన్ని గ్రామస్తులు చుట్టముట్టడంతో సీఎం రమే‹Ù, అతని అనుచరవర్గం భయంతో వణికిపోయారు. పోలీసులు అతికష్టంపై రమేష్ ఎక్కిన వాహనాన్ని ముందుకు పంపించగా.. గ్రామస్తులు మాత్రం ఊరి పొలిమేర దాటే వరకు వెంబడించారు. -
మనిషి బీజేపీ.. మనసు టీడీపీ : ముత్యాలనాయుడు
నర్సీపట్నం: సీఎం రమేష్‌ను జిల్లా ప్రజలు ఎలాగూ నమ్మరని.. మనిషి బీజేపీ, మనసు టీడీపీ కావడంతో ఇరు పార్టీల కార్యకర్తలు సైతం ఆయనను విశ్వసించడం లేదని డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు అన్నారు. ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్‌తో కలిసి గురువారం క్యాంపు కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రమేష్‌లా తాను బ్యాంకులను మోసం చేయలేదన్నారు. దోపిడీలు చేయటం తనకు చేతకాదన్నారు.అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకు చంద్రబాబు అనుమతితో ఆయన బీజేపీలో చేరారని, రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినా ఏనాడూ స్టీల్‌ప్లాంట్ గురించి నోరు మెదపలేదన్నారు. స్థానికులకే ఎంపీ టికెట్ కేటాయించాలని తొలుత గట్టిగా మాట్లాడిన అయ్యన్నపాత్రుడు డబ్బుల కోసం సీఎం రమేష్‌కు సాగిలపడ్డారని విమర్శించారు.ఇక్కడి ప్రజలు విజ్ఞత కలిగినవారని, స్థానికేతర్లకు ఇక్కడ ప్రజలు పట్టం కట్టిన దాఖలాలు లేవన్నారు. రాయలసీమ ప్రాంతం నుంచి డబ్బు సంచులతో దిగిన సీఎం రమేష్ ఓటర్లను కొనేయాలనుకుంటే.. ఆయన ఆటలు చెల్లవన్నారు. టీడీపీ నాయకులు అమ్ముడు పోతారేమో కాని ఓటర్లు మాత్రం డబ్బులకు లొంగిపోయే వారు కాదన్నారు.ప్రజల కలలకు వాస్తవ రూపం..సీఎం రాష్ట్ర ప్రజల ప్రగతిని దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోకు రూపకల్పన చేశారని, వారి కలలకు వాస్తవ రూపం ఇచ్చారని ముత్యాలనాయుడు అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే రాష్ట్రం అప్పులు పాలవుతుందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. అవే సంక్షేమ పథకాలను అమలు చేస్తానని సిగ్గు లేకుండా మేనిఫెస్టో విడుదల చేశారని విమర్శించారు.ఆచరణ సాధ్యం కాని హామీలతో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. రైతన్నకు మంచి చేసే ఆలోచనతో జగనన్న ఉంటే, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు అసత్యప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రైతులకు ఉపయోగపడే ఏ పథకమైనా తీసుకోచ్చారా అని ప్రశ్నించారు. నేడు రైతు భరోసా, రైతులకు రుణాలు, కౌలు రైతుల చట్టం తదితర పథకాలను జగనన్న అమలు చేస్తుంటే ఓర్వలేని చంద్రబాబు ఆసత్యప్రచారం చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, రుత్తల యర్రాపాత్రుడు పాల్గొన్నారు.ఇవి చదవండి: టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి -
ఈ సంక్షేమం ఆగకూడదు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాతే రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమం అందుతోందని, అట్టడుగు వర్గాల సామాజిక సాధికారత సాధ్యమైందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. ఈ సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌ను ఎన్నుకోవాలని తెలిపారు. కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్లో సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అధ్యక్షతన జరిగిన సామాజిక సాధికార సభలో ఆయన ప్రసంగించారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మగౌరవంతో బతకగలుగుతున్నారని మంత్రి తెలిపారు. వయో పరిమితిని 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గించి, అవ్వాతాతలకు పెన్షన్ ఇస్తున్న మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని చెప్పారు. అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.18,760 ఇస్తానని చెప్పి, ఇప్పటికే మూడు విడతలు అందించారని, జనవరిలో నాలుగో విడత కూడా ఇవ్వనున్నారని తెలిపారు. 2014 ఎన్నికలకు ముందు రుణ మాఫీ చేస్తానని చంద్రబాబు రైతులను, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను మోసం చేశారన్నారు. అదే అక్కచెల్లెమ్మలకు 2019 ఏప్రిల్ వరకూ ఉన్న బకాయిలు చెల్లిస్తామన్న జగన్ దానిని అమలు చేసి చూపించారన్నారు. రైతులకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తొలిసారిగా గౌరవాన్ని కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. జగన్ సీఎం అయ్యాక బీసీ ఉప కులాలన్నింటినీ గుర్తించి, 57 కార్పొరేషన్లకు తొలిసారి చైర్మన్లను నియమించి, వారికి సరైన గుర్తింపు, గౌరవం కల్పించారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఉప ముఖ్యమంత్రి పదవులు, మంత్రి వర్గంలో, ఇతర నామినేటెడ్ పదవులన్నింటిలో పెద్ద పీట వేసిన సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ చెప్పారు. ఇన్నాళ్లూ మాటలకే పరిమితమైన సామాజిక సాధికారతను సీఎం జగన్ చేతల్లో చూపించారని అన్నారు. చంద్రబాబు మంత్రివర్గంలో ఎస్సీ, మైనార్టీలకు స్థానమే కల్పించలేదన్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా చంద్రబాబుకు ఆయన కులమే కనిపిస్తుందని, సీఎం జగన్‌కు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కనిపిస్తారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని అన్నారు. సీఎం వైఎస్ జగన్‌కు బడుగు, బలహీన వర్గాలే ప్రాధాన్యత అని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు చెప్పారు. రాజ్యసభకు తొమ్మిది మందికి అవకాశం వస్తే అందులో మత్స్యకార వర్గం నుంచి తనకు, శెట్టిబలిజల నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, యాదవ నుంచి బీద మస్తాన్‌రావు, కురుబ నుంచి ఆర్. కృష్ణయ్యలకు ప్రాతినిధ్యం కల్పించి రాజకీయంగా అగ్రస్థానంలో కూర్చోబెట్టారన్నారు. అవే పదవులను కోట్లకు అమ్ముకున్న నైజం చంద్రబాబుదని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు లభించిన గౌరవం 2024 తర్వాత ఆగిపోకూడదంటే సీఎం జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ చెప్పారు. ఎవరైనా పార్టీ పెడితే సీఎం కావాలనుకుంటారని, కానీ పక్కవారు సీఎం కావాలని కోరుకునే నాయకులు మనకు అవసరమా అంటూ పవన్ కళ్యాణ్ తీరును ఎద్దేవా చేశారు. బలిసిన వారికి, బడుగులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో బడుగుల పక్షాన నిలిచిన జగన్‌కు మద్దతుగా నిలిచి మరోసారి సీఎంను చేయాలని కోరారు. సామాజిక సాధికారతకు అర్థం చెప్పేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన అందించారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ వంగా గీత, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు పాల్గొన్నారు. -
సెలవైనా ఠంఛన్‌గా పింఛన్
సాక్షి, అమరావతి: సెలవు రోజైనా ప్రభుత్వం ఠంఛన్‌గా అవ్వాతాతలకు పింఛన్లు పంపిణీ చేసింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి రాష్ట్రవ్యాప్తంగా 51,37,566 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళ, వివిధ రకాల చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.1,415.64 కోట్ల మొత్తాన్ని అందజేశారు. అక్టోబరు ఒకటో తేదీ నుంచి పంపిణీకిగాను 65,78,854 మంది లబ్ధిదారుల కోసం ప్రభుత్వం మొత్తం రూ.1,813.60 కోట్ల విడుదల చేసింది. ఒకటో తేదీ ఆదివారం సెలవు అయినా.. సాయంత్రానికి 78.09 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తయినట్టు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. మిగిలిన వారి కోసం ఐదోతేదీ వరకు వలంటీర్ల ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని తెలిపారు. -
టీడీపీ బకాయిలనూ చెల్లిస్తున్నాం
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వం చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిన బిల్లులను తమ ప్రభుత్వం చెల్లిస్తూ వస్తోందని.. ఈ కారణంతోనే ఇప్పటివరకూ ఇబ్బందులు వచ్చాయని.. అయినా వాటిని అధిగమించి ఆ బకాయిలు చెల్లిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. నిధులకు ఎక్కడా ఇబ్బందిలేదని.. శాఖ పరిధిలో చెల్లించాల్సిన బిల్లులన్నింటినీ నెలరోజుల్లో పూర్తిగా చెల్లించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. ఇటీవల కాలంలో రూ.వెయ్యి కోట్లు చెల్లించామన్నారు. ఉపాధి హామీ పథకం మెటీరియల్ కేటగిరిలో.. గ్రామాల్లో జరిగిన, జరుగుతున్న వివిధ భవన నిర్మాణ పనులు, రోడ్డు పనులకు సంబంధించి దాదాపు రూ.1,900 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించనున్నామన్నారు. ఈ శాఖ కార్యక్రమాలపై సీఎం సమీక్ష అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లోని చెత్తతో వర్మీ కంపోస్టు తయారీ ఇక చెత్తను సేకరించే ‘క్లాప్’ మిత్రలకు పెండింగ్‌లో ఉన్న 3 నెలల గౌరవ వేతనం వెంటనే చెల్లించడంతో పాటు భవిష్యత్‌లో ఏ నెల జీతం ఆ నెలలో చెల్లించనున్నట్లు మంత్రి చెప్పారు. అలాగే, క్లీన్ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా.. గ్రామాల్లో సేకరించే చెత్తను వర్మీ కంపోస్టు ఎరువుగా తయారుచేయడం.. లేదంటే ఇతర అవసరాలకు వినియోగించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. జగనన్న కాలనీల్లో ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణంతో పాటు ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటుచేస్తామన్నారు. మంచినీటి పథకాల నిర్వహణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులనూ చెల్లించాలని ఆదేశాలిస్తున్నట్లు ఆయన చెప్పారు. అంతేకాక.. గ్రామీణ రోడ్లకు సంబంధించి రూ.83 కోట్ల దాకా బిల్లులు చెల్లించాల్సి ఉండగా, వాటినీ వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఎవరు ఎవర్ని బాదుతారో చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే, వాటి గురించి మాట్లాడకుండా అరకొరగా ఉండే లోపాల గురించే మాట్లాడుతున్నారంటూ ప్రతిపక్షాలను ఉద్దేశించి మంత్రి ముత్యాలనాయుడు వ్యాఖ్యానించారు. టీడీపీ చేపడుతున్న ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి పైవిధంగా బదులిచ్చారు. చంద్రబాబు జనాలను బాదుతాడా, లేదంటే జనమే ఆయనను బాదుతారో చూద్దామన్నారు. -
మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం
-
ఆయన ప్రసంగాన్ని తప్పుపట్టటం సరికాదు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగాన్ని ప్రతిపక్ష నేతలు తప్పుపట్టటం సరికాదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై సోమవారం చర్చ మొదలైంది. కాకాని గోవర్థన్ రెడ్డి గవర్నర్ ప్రసంగాన్ని బలపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2014నుంచి ఇప్పటి వరకు హోదా కోసం కట్టుబడి ఉన్నారన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే విధంగా ముందుకు వెళ్తామని చెప్పారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో అధికారాన్ని, నిధులను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అనేక సార్లు యూ టర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని తెలిపారు. గత ప్రభుత్వంలో నాయకులు తమ స్వార్థం కోసం ఏపీ ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెట్టారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పోలవరం అంచనాలను పెంచిందన్నారు. జన్మభూమి కమిటీలతో టీడీపీ నేతలు అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపించారు. గత ఐదేళ్లలో ప్రజలు దౌర్భాగ్యమైన పాలనను చూశారన్నారు. మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని.. ప్రభుత్వ విప్ ముత్యాల నాయుడు పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కేబినేట్లో స్థానం కల్పించామని తెలిపారు. ప్రజలు పూర్తిగా విశ్వాసం, నమ్మకంతో వైఎస్ జగన్మోహన్రెడ్డిని గెలిపించారని అన్నారు. రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
‘అహంకారం నెత్తికెక్కి మాట్లాడుతున్నారు’
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ నేతలు అహంకారం, అధికారం నెత్తికెక్కి మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుడి ముత్యాల నాయుడు, పార్టీ నేత పెట్టా ఉమశంకర్, మండిపడ్డారు. ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాట్లు తెలిపారు. ఈ మేరకు ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాధరణ చూసి టీడీపీ నేతలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ప్రకటలో పేర్కొన్నారు. ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్ ప్రస్తావించిన ప్రతీ అంశం వాస్తవమే అని, ప్రజలే రుజువులతో సహా వచ్చి ప్రతి సమస్యను ఆయనకు వివరిస్తున్నారని తెలిపారు. చేతనైతే అధికారం ఉన్నవారు ఈ సమస్యలను పరిష్కరించాలని, వైఎస్ జగన్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. వైఎస్ఆర్ హయంలో జరిగిన అభివృద్ధికి.. చంద్రబాబు నాయుడు హయంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ప్రకటించారు. -
టీచర్ల పిల్లలూ..సర్కారు బడుల్లోనే
దేవరాపల్లి(మాడుగుల): ఉపాధ్యాయులు పనిచేస్తున్న పాఠశాలలోనే తమ పిల్లలను చేర్పించేలా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని అప్పుడే సర్కారు బడులపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని వైఎస్సార్సీపీ శాసన సభాపక్ష ఉపనేత, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు అన్నారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రవేశం పొందిన విద్యార్థులను గురువారం స్థానిక విద్యాశాఖ కార్యాలయంలో ఎమ్మెల్యే అభినందించారు. ఎంఈవో సిహెచ్. రవీంద్రబాబు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు, వారికి సహకరించిన తల్లిదండ్రులను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుల పట్ల నమ్మకం సన్నగిల్లుతున్న తరుణంలో ఇది శుభపరిణామమన్నారు. ప్రస్తుతం ఉన్నత పదవుల్లో ఉన్నవారంతా గతంలో సర్కారు బడుల్లో చదివి ర్యాంకులు సాధించిన వారేనని పేర్కొన్నారు. విద్యాపరంగా సాయానికి తానెప్పుడూ ముందుంటానన్నారు. తారువాలో మోడల్ గ్రంథాలయం..... స్వగ్రామం తారువాలో అత్యాధునిక సౌకర్యాలతో మోడల్ గ్రంథాలయాన్ని నిర్మిస్తున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు. వచ్చే ఏడాదికి పనులు పూర్తయి వినియోగంలోకి వస్తుందన్నారు. రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి, టి.సుబ్బిరామిరెడ్డి, ఎంపీ అవంతి శ్రీనివాసరావు, జెడ్పీ చైర్మన్ లాలం గంగా భవాని దీనికి నిధులు సమకూర్చారని చెప్పారు. ఈ గ్రంథాలయంలో గ్రూప్–వన్ వంటి పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్‌ను అందుబాటులో ఉంచుతామన్నారు. వచ్చే ఏడాది పాలిటెక్నిక్ కోచింగ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. 40 మంది కుర్చునేలా తరగతి గది , ల్రైబ్రరీ రూమ్, స్టడీ రూమ్, కంప్యూటర్ రూమ్, ఈ బుక్స్ కూడా అందుబాటులోకి తెస్తున్నట్టు చెప్పారు. ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులను అభినందించారు. రెసిడెన్షియల్‌కు ఎంపికైన విద్యార్థులకు నోట్ పుస్తకం, పెన్నులు అందజేశారు.‘మన ఊరు–మన బడి’ కార్యక్రమంలో భాగంగా సర్కారు బడిలో చేరిన విద్యార్థులకు ప్రవేశప్రతాలను ఎమ్మెల్యే అందజేశారు. సమావేశంలో సీఆర్పీలు, పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మనసు, మాట, చేత ఒకటి కావాలి
‘మనసులో ఉన్న భావనే మాటగా వెలువడాలి. మాటలు చేతలు కావాలి. ఇది మహాత్ముల లక్షణ’మని వక్తలు ఉద్బోధించారు. శ్రీరామకృష్ణ మిషన్, వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీరామకృష్ణమఠంలో సోదరి నివేదిత 150వ జయంత్యుత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం కల్చరల్: ‘మనసులో ఉన్న భావనే మాటగా వెలువడాలి. మాటలు చేతలు కావాలి. ఇది మహాత్ముల లక్షణ’మని నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ముర్రు ముత్యాలునాయుడు అన్నారు. శ్రీరామకృష్ణ మిషన్, వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీరామకృష్ణమఠంలో సోదరి నివేదిత 150వ జయంత్యుత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి,. ముఖ్య అతిథిగా ముత్యాలు నాయుడు మాట్లాడుతూ ఈ దేశానికి రామకృష్ణ పరమహంస, వివేకానందుల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని, కానీ సోదరి నివేదిత గురించి తెలియనివారు చాలామంది ఉండవచ్చని అన్నారు. చికాగో వెళ్ళేటప్పుడు వివేకానందునికి బోస్టన్ నగరంలో నివసిస్తున్న ఒక మహిళ పరిచయమై, తన విజిటింగ్ కార్డును ఇచ్చిందన్నారు. చికాగో ప్రపంచ మత సమ్మేళన సభలు మూడు నెలలు వాయిదా పడి, తెచ్చుకున్న ధనం అయిపోవడంతో వివేకానందుడు ఆ మహిళ ఇంటికి వెళ్ళి కొంతకాలం బస చేశారని చెప్పారు. అక్కడికి వచ్చిన అమెరికన్ ప్రొఫెసర్ ఒకరు వివేకానందుని వాగ్ధాటికి అచ్చెరువొంది ‘ఈ దేశంలో ప్రొఫెసర్లందరూ కలసినా వివేకానందునికి సాటి రా’రని అన్నారు. లండన్‌లో సోదరి నివేదిత వివేకానందుని ప్రసంగానికి ముగ్ధురాలై అన్ని మతాలూ ఒకే దారిచూపుతాయని గ్రహించిందని, వివేకానందుని పిలుపుమేరకు ఈ గడ్డపై కాలు మోపిందని వివరించారు. మహాత్మునికి, సోదరి నివేదితకు పోలికలు ఉన్నాయని, గోపాలకృష్ణ గోఖలే మహాత్ముని స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానించగా వివేకానందుడు నివేదితను ఈ గడ్డపై సామాజిక సేవ చేయవలసిందిగా పిలుపునిచ్చారన్నారు. నివేదిత, కాటన్, బ్రౌన్ ఈ దేశానికి ఎనలేని సేవలు చేశారన్నారు. గ్లోబల్ హాస్పిటల్స్ సలహాదారుడు డాక్టర్ కె.ఎస్.రత్నాకర్ మాట్లాడుతూ విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తే సమాజం నాశనమవుతుందన్నారు. యువత పే, ప్రాస్పెక్ట్స్, ప్రమోషన్ అనే మూడు అంశాలపై మాత్రమే దృష్టి సారించరాదన్నారు. సభకు అధ్యక్షత వహించిన రామకృష్ణ మిషన్, బేలూరు ప్రధాన కార్యదర్శి స్వామి అభిరామానందజీ మాట్లాడుతూ మన దేశంలో యువకులు, మానవవనరుల సంఖ్య ఇతర దేశాలకన్నా ఎక్కువన్నారు. విద్య అంటే కేవలం ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం మాత్రమే కాదని, వ్యక్తిత్వ వికాసం మెరుగుపరుచుకోవాలని సూచించారు. నగరాధ్యక్షుడు స్వామి కపాలీశానంద స్వాగత వచనాలు పలికారు. విజయవాడ రామకృష్ణ మిషన్‌కు చెందిన స్వామి శేవ్యానందజీ, విశాఖపట్టణం మిషన్‌కు చెందిన గుణేశానందజీ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథి ముత్యాలునాయుడిని నిర్వాహకులు సత్కరించారు. స్వామి హరికృపానందజీ వందనసమర్పణ చేశారు. ఉత్సవాలు శని, ఆదివారాల్లో కొనసాగుతాయి. -
భావితరాలకు ఆక్సిజన్ సిలిండర్లే గతి
కోటగుమ్మం(రాజమహేంద్రవరం): ప్రస్తుతం ఉన్న వాతావరణంలో మార్పులు సంభవించకపోతే మన భావితరాలు ఆక్సిజన్ సిలిండర్లతో తిరగాల్సిన పరిస్థితి వస్తుందని నన్నయ్య విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్ ఎం.ముత్యాలునాయుడు హెచ్చరించారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో గురువారం రాత్రి ‘శక్తి పునరుత్పాదకత’పై అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు సంబంధించిన సావనీర్‌ను ఆవిష్కరించిన ముత్యాలునాయుడు మాట్లాడుతూ ప్రకృతి పరంగా లభించే మంచినీటినే ప్రస్తుత తరుణంలో కొనుగోలు చేసి తాగాల్సిన పరిస్థితి ఉందని, వాతావరణంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పుల వల్ల ఆక్సిజన్‌ను కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. బొగ్గు, ఆయిల్, గ్యాస్‌ను స్థాయికి మించి తవ్వేస్తున్నాం. దాని దుష్ఫలితాలు ప్రస్తుతం మనం అనుభవిస్తున్నాం. ప్రకృతి పరంగా లభించే సహజ వనరులు గాలి, నీరు, సౌర శక్తి, సముద్రం మన దగ్గర అధికంగా ఉన్నాయి. వాటిని వినియోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు. కావలసినంత సముద్ర తీరం ఉన్న రాష్ట్రంలో పవన విద్యుత్‌ను ఎందుకు వినియోగించుకోకూడదని ప్రశ్నించారు. వీటన్నింటినీ మనం అందుబాటులోకి తీసుకువస్తే 2030 నాటికి 40 శాతం అభివృద్ధి సాధిస్తామన్నారు. 2050 నాటికి నూరు శాతం అభివృద్ధి సాధించి గ్లోబల్ వార్మింగ్ నుంచి రక్షించుకోగలుగుతామన్నారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డేవిడ్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే తమ కళాశాలలో సోలార్ విద్యుత్‌ను వినియోగించుకుంటున్నామన్నారు. సోలార్ విద్యుత్‌పై త్వరలో తమ కళాశాలలో గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో కోర్సులు ప్రారంభించనున్నట్టు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు, వివిధ వర్సిటీల ప్రతినిధులు, ఆర్ట్స్ కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా అంతర్జాతీయ సదస్సు సందర్భంగా కళాశాల విద్యార్థినులు చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. -
ఫుడ్ పాయిజన్.. 300 మందికి అస్వస్థత
-
ఫుడ్ పాయిజన్.. 300 మందికి అస్వస్థత
కె.కోటపాడు(విశాఖపట్నం): కలుషిత ఆహారం తిని 300 మంది అస్వస్థతకు గురైన సంఘటన విశాఖపట్నం జిల్లా కె. కోటపాడు మండలం మర్రివలసలో ఆదివారం రాత్రి జరిగింది. గ్రామంలోని ఓ పెళ్లిలో ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసిన 300 మంది అస్వస్థతకు గురయ్యారు. మాంసాహరం విషతుల్యమై వాంతులు, విరోచనాలతో డీలా పడ్డారు. దీంతో వారిని కోటపాడు ప్రభుత్వ ఆస్పత్రితో పాటు పలు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తలరించారు. -
విఐపి రిపోర్టర్ - మాడుగుల ఎమ్మెల్యే ముత్యాల నాయుడు