హైదరాబాద్ కేంద్ర కారాగారాన్ని సందర్శించిన యువ ఐపీఎస్ అధికారులు
సాక్షి, హైదరాబాద్: సర్దార్ వల్లభాయ్ నేషనల్ అకాడమికి చెందిన 33 మంది ట్రైనీ ఐపీఎస్‌లు హైదరాబాద్ కేంద్ర కారాగారాన్ని బుధవారం సందర్శించారు. జైలులో భద్రత, సంక్షేమ కార్యకలాపాలు, పరిపాలన గురించి సమగ్రంగా తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా జైలు సూపరిటెండెంట్ అధికారి అర్జున్‌రావ్ పలు అంశాలపై వారికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో యువ ఐపీఎస్ అధికారులకు అవగాహన కల్పించారు.
దర్యాప్తు, న్యాయ వ్యవస్థ, విచారణ, శిక్షా స్మృతి, ఖైదీల సంస్కరణ, పునరావాసంలో పోలీసుల పాత్రను అర్జున్‌రావ్ ట్రైనీ ఐపీఎస్‌లకు వివరించారు. ఖైదీల రోజు వారి కార్యక్రమాలు, పెరోల్, సెలవుల విధానం గురించి జైల్ అధికారులు వారికి తెలియజేశారు. యువ ఐపీఎస్‌లు వారికున్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ సమ్మయ్య, జైలర్లు శ్రీనివాస్ రావ్, వెంకటేశం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment