Trainees
-
ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ, ట్రైనీలకు పోస్టింగ్స్
సాక్షి, అమరావతి: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. సివిల్ సప్లయిస్ డైరెక్టర్‌గా విజయ సునీత, గ్రామ, వార్డు సచివాలయాల అదనపు డైరెక్టర్‌గా భావన, శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్‌గా మల్లారపు నవీన్, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా సి. విష్ణు చరణ్, మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్‌గా నిధిమీనా, ఏపీసీఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌గా కట్టా సింహాచలం బదిలీఅయ్యారు. మరోవైపు.. 2020 బ్యాచ్ ట్రైనింగ్ ఐఏఎస్‌లకు కూడా ప్రభుత్వం పోస్టింగ్స్ ఇచ్చింది. దీంతో, తెనాలి సబ్ కలెక్టర్‌గా గీతాంజలి శర్మ, రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా శుభం బన్సల్, నరసాపురం సబ్ కలెక్టర్‌గా మల్లవరపు సూర్యతేజ, టెక్కలి సబ్ కలెక్టర్‌గా రవికుమార్ రెడ్డి, పాలకొండ సబ్ కలెక్టర్‌గా నూరుల్ కుమిర్, ఆదోని సబ్ కలెక్టర్‌గా అభిషేక్ కుమార్, విజయవాడ సబ్ కలెక్టర్‌గా అధితిసింగ్, పెనుకొండ సబ్ కలెక్టర్‌గా కార్తీక్, గూడూరు సబ్ కలెక్టర్‌గా శోభిక, కందుకూరు సబ్ కలెక్టర్‌గా మాధవన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. -
ఆరు మాసాలకే సరి..
విజయనగరం: మహిళల అభ్యన్నతే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెబుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. నిధులు వెచ్చించడంలో ఉన్న శ్రద్ధ వాటిని సద్వినియోగపరుచుకుని, లక్ష్యాలు నెరవేర్చుకోవడంలో చూపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న ఉపాధి కల్పనలో భాగంగా మూడేళ్ల కిందట జిల్లాలో నియోజకవర్గానికి ఒకటి వంతున తొమ్మిది కుట్టు శిక్షణకేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ.14.40 లక్షలతో 270 కుట్టుమిషన్లు కూడా అప్పట్లో కొనుగోలు చేశారు. జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి 30 నుంచి 40 కుట్టుమిషన్లు కేటాయించి శిక్షణ కేంద్రాలు తెరిచారు. పేదరిక నిర్మూలన సంస్థ కేటాయించిన నిధులతో గ్రామీణాభివృద్ది సంస్థ ఈ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే మూడు సంవత్సరాలలో కేవలం ఆరుమాసాలు నిర్వహించి శిక్షణ కేంద్రాలు నిలిపివేశారు. దీంతో ఆ కేంద్రాల్లో కుట్టు మిషన్లు నిరుపయోగంగా ఉన్నాయి. ఒక్కో కేంద్రానికి రూ. 30 వేలు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాల నిర్వహణకు పేదరిక నిర్మూలన సంస్థ నిధులు కేటాయించాల్సి ఉంది. ఒక్కో కేంద్రానికి నెలకు రూ.30 వేల చొప్పున మండల సమాఖ్యలకు డీఆర్డీలు విడుదల వేయాలి. ఆ నిధులతో శిక్షణకు అవసరమైన సామగ్రి కొనుగోలుతో పాటు శిక్షణ ఇచ్చే వారికి వేతనాలు ఇవ్వాలి. ఒక్కో కేంద్రంలో ఆరు నెలలపాటు నాలుగు బృందాలకు శిక్షణ అందించే అవకాశం ఉంది. ఏడాదికి కనీసం 2,600 మందికి ఉపాధి శిక్షణ ఇవ్వవచ్చు. శిక్షణ అనంతరం మహిళలకు 50 శాతం రాయితీపై కుట్టు యంత్రాలను అందించాలి. కేంద్రాలు సక్రమంగానే నడుస్తున్న సమయంలో పేదరిక నిర్మూలన సంస్థ వద్ద నిధులు లేవనే కారణంతో పాటు ఇతర జిల్లాల్లో కేంద్రాలు నిలిపివేశారన్న సాకుతో జిల్లాలో కేంద్రాలను మూసివేశారు. మహిళలకు ఆర్థిక భరోసా ఇచ్చే కుట్టు శిక్షణ కేంద్రాలను తెరిపించే విషయంలో అటు పాలకులు, ఇటు అధికారులు దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని 9 కుట్టు శిక్షణ కేంద్రాల నిర్వాహణకు నెలకు రూ.2.82 లక్షలు చొప్పున సంవత్సరానికి రూ.33 లక్షల నిధులు అవసరమవుతాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఏడాదికి 2,600 మందికి శిక్షణ ఇవ్వవచ్చు. ఎన్నో పథకాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసే అధికారులు 33 లక్షల రూపాయలు లేవనే సాకుతో కేంద్రాలు మూసివేయడం తగదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కేంద్రాలు తెరిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
కేంద్ర కారాగారాన్ని సందర్శించిన ట్రైనీ ఐపీఎస్‌లు
సాక్షి, హైదరాబాద్: సర్దార్ వల్లభాయ్ నేషనల్ అకాడమికి చెందిన 33 మంది ట్రైనీ ఐపీఎస్‌లు హైదరాబాద్ కేంద్ర కారాగారాన్ని బుధవారం సందర్శించారు. జైలులో భద్రత, సంక్షేమ కార్యకలాపాలు, పరిపాలన గురించి సమగ్రంగా తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా జైలు సూపరిటెండెంట్ అధికారి అర్జున్రావ్ పలు అంశాలపై వారికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో యువ ఐపీఎస్ అధికారులకు అవగాహన కల్పించారు. దర్యాప్తు, న్యాయ వ్యవస్థ, విచారణ, శిక్షా స్మృతి, ఖైదీల సంస్కరణ, పునరావాసంలో పోలీసుల పాత్రను అర్జున్రావ్ ట్రైనీ ఐపీఎస్‌లకు వివరించారు. ఖైదీల రోజు వారి కార్యక్రమాలు, పెరోల్, సెలవుల విధానం గురించి జైల్ అధికారులు వారికి తెలియజేశారు. యువ ఐపీఎస్‌లు వారికున్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ సమ్మయ్య, జైలర్లు శ్రీనివాస్ రావ్, వెంకటేశం పాల్గొన్నారు. -
బండరాయితో ఫోన్లు పగలగొట్టించారు
బ్యాంకాక్: నిబంధనలు అతిక్రమించి ఫోన్ తీసుకొచ్చినందుకు థాయ్ నావీ అధికారులు... శిక్షణ పొందుతున్న ట్రైనీలకు ఓ విచిత్రమైన శిక్ష విధించారు. కాలేజీలు, కార్యాలయాల్లో ముఖ్యంగా ఫోన్ వాడకం విషయంలో మనమైతే... ఎన్ని రకాల రూల్స్ పెట్టినా ఏదో ఒక రకంగా వాటిని బ్రేక్ చేస్తూనే ఉంటాం. ఒకవేళ రూల్స్ ను పాటించకుండా.. పని వేళల్లో ఫోన్ మాట్లాడితే....ఫోన్ లాక్కొని తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ఇచ్చేస్తారు. అలానే ఏమౌతుందిలే అనుకున్న థాయ్ లాండ్ నావీలో ట్రైనీలు కూడా పై అధికారులు పెట్టిన రూల్స్ బ్రేక్ చేసి ఫోన్లు వాడాలనుకున్నారు. అయితే వారికి అధికారులు చుక్కలు చూపించే శిక్ష విధించారు. ఎంతో ఇష్టపడి కొనుకున్న ఫోన్‌ను బండరాయితో మోది పగలగొట్టాలని.. అధికారులు ఆదేశించడంతో పాపం వేరేదారి లేక అయిష్టంతో వారు ఆ పని చేశారు. అయితే వాళ్లందరూ ఫోన్లను బండతో పగలగొడుతున్న సమయంలో తీసిన వీడియో ఇప్పుడు ఇంటర్ నెట్లో హల్ చల్ చేస్తోంది. చిన్న తప్పుకు అంత పెద్ద శిక్షా అని అందరూ అనుకుంటుంటే, దీని పై అక్కడ అధికారులు వివరణ కూడా ఇచ్చారు. 'అంతర్గతంగా మాకు మేమే కొన్ని నిబంధనలు పెట్టుకున్నాము..ఎవరైతే కావాలని రూల్స్ అతిక్రమిస్తారో..వాళ్లతో కావాలనే వారి ఫోన్లను బద్దలు కొట్టిస్తాం' అంటూ బదులు ఇచ్చారు. T