బండరాయితో ఫోన్లు పగలగొట్టించారు
బ్యాంకాక్: నిబంధనలు అతిక్రమించి ఫోన్ తీసుకొచ్చినందుకు థాయ్ నావీ అధికారులు... శిక్షణ పొందుతున్న ట్రైనీలకు ఓ విచిత్రమైన శిక్ష విధించారు. కాలేజీలు, కార్యాలయాల్లో ముఖ్యంగా ఫోన్ వాడకం విషయంలో మనమైతే... ఎన్ని రకాల రూల్స్ పెట్టినా ఏదో ఒక రకంగా వాటిని బ్రేక్ చేస్తూనే ఉంటాం. ఒకవేళ రూల్స్ ను పాటించకుండా.. పని వేళల్లో ఫోన్ మాట్లాడితే....ఫోన్ లాక్కొని తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ఇచ్చేస్తారు.
అలానే ఏమౌతుందిలే అనుకున్న థాయ్ లాండ్ నావీలో ట్రైనీలు కూడా పై అధికారులు పెట్టిన రూల్స్ బ్రేక్ చేసి ఫోన్లు వాడాలనుకున్నారు. అయితే వారికి అధికారులు చుక్కలు చూపించే శిక్ష విధించారు. ఎంతో ఇష్టపడి కొనుకున్న ఫోన్ను బండరాయితో మోది పగలగొట్టాలని.. అధికారులు ఆదేశించడంతో పాపం వేరేదారి లేక అయిష్టంతో వారు ఆ పని చేశారు. అయితే వాళ్లందరూ ఫోన్లను బండతో పగలగొడుతున్న సమయంలో తీసిన వీడియో ఇప్పుడు ఇంటర్ నెట్లో హల్ చల్ చేస్తోంది. చిన్న తప్పుకు అంత పెద్ద శిక్షా అని అందరూ అనుకుంటుంటే, దీని పై అక్కడ అధికారులు వివరణ కూడా ఇచ్చారు. 'అంతర్గతంగా మాకు మేమే కొన్ని నిబంధనలు పెట్టుకున్నాము..ఎవరైతే కావాలని రూల్స్ అతిక్రమిస్తారో..వాళ్లతో కావాలనే వారి ఫోన్లను బద్దలు కొట్టిస్తాం' అంటూ బదులు ఇచ్చారు.
T