నా తండ్రిని అవమానించారు: షేక్‌ హసీనా | Sheikh Hasina breaks silence demanded punishment for acts of vandalism | Sakshi
Sakshi News home page

నా తండ్రిని అవమానించారు: షేక్‌ హసీనా

Published Tue, Aug 13 2024 9:14 PM | Last Updated on Wed, Aug 14 2024 9:37 AM

Sheikh Hasina breaks silence demanded punishment for acts of vandalism

ఢాకా: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల కోసం విద్యార్థులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారటంతో షేక్‌ హసీనా ప్రధానిగా రాజీనామా చేసి.. భారత్‌ చేరుకున్నారు. ఆమె ప్రస్తుతం భారత్‌తో ఆశ్రయం పొందుతున్నారు. బంగ్లా సంక్షోభం, అల్లర్ల అనంతరం షేక్‌ హసీనా తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. 

‘‘జులైలో విద్యార్థుల నిరసనల్లో హత్యలు, విధ్వంసక చర్యలకు పాల్పడిన వారిపై కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నా. దేశ పౌరులు షేక్ ముజిబుర్ రెహ్మాన్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న జాతీయ సంతాప దినాన్ని పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నా. బంగాబంధు స్మారకం వద్ద పూల మాలలు వేసి మృతి చెందినవారి ఆత్మ శాంతించాలని ప్రార్థించండి.

గత జూలై నుంచి ఆందోళనలతో విధ్వంసం, హింస చెలరేగింది. ఈ ఆందోళనల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీసులు పాత్రికేయులు, శ్రామిక ప్రజలు, అవామీ లీగ్, అనుబంధ సంస్థల నాయకులు, కార్మికులకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను’ అని ఆమె అన్నారు. షేక్‌ హసీనా విడుదల చేసిన ప్రకటనను ఆమె కుమారుడు సజీబ్ వాజెద్‌  ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు.

‘‘ నా తండ్రి, జాతిపిత బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో బంగ్లా స్వతంత్ర దేశంగా ఏర్పడింది. తాజా పరిణామాలతో ఆయన ఘోర అవమానానికి గురయ్యారు. లక్షలాది మంది అమరవీరుల రక్తాన్ని అవమానించారు. దేశప్రజల నుంచి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement