vandalism
-
PM Narendra Modi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విధ్వంసమే
సోనిపట్: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న కాంగ్రెస్ హరియాణాలో పొరపాటున అధికారంలోకి వస్తే విధ్వంసం తప్పదని అన్నారు. అభివృద్ధి పూర్తిగా ఆగిపోతుందని, అస్థిరత రాజ్యమేలుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు అధికారం అప్పగించవద్దని ప్రజలకు సూచించారు. బుధవారం హరియాణాలోని సోనిపట్ జిల్లా గొహానాలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అస్థిరత, అవినీతి, బంధుప్రీతి తదితర అవలక్షణాలన్నీ ఉంటాయని ఆరోపించారు. కర్ణాటకలో ఇప్పుడు అలాంటి పరిస్థితే ఉందని గుర్తుచేశారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మధ్య అంతర్గత యుద్ధం సాగుతోందన్నారు. తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌లోనూ అదే కథ అని పేర్కొన్నారు. అందుకే కాంగ్రెస్ పట్ల హరియాణా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో బడుగులకు అన్యాయం రిజర్వేషన్లను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ప్రధానమంత్రి మండిపడ్డారు రిజర్వేషన్ల పట్ల ద్వేషం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని విమర్శించారు. అందుకే కాంగ్రెస్ రాజ కుటుంబంలోని నాలుగో తరం రిజర్వేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తోందని ఆరోపించారు. ఆ పార్టీ అధికారంలో లేనప్పుడే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు హక్కులు లభించాయని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయా వర్గాల హక్కులను లాక్కుందని, తీరని అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. పారిశ్రామికీకరణతో పేదలు, రైతులు, దళితులకు లబ్ధి ఇటీవల జరిగిన అమెరికా పర్యటన గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. అమెరికాలో పలువురు ముఖ్య నాయకులను, ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులను కలిశానని చెప్పారు. భారతీయ యువత నైపుణ్యాల గురించి వారికి వివరించానని అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు నేడు భారత్‌లో ఫ్యాక్టరీలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయని వెల్లడించారు. దేశంలో పారిశ్రామికీకరణ పెరిగితే పేదలు, రైతులు, దళితులు అధికంగా లబ్ధి పొందుతారని స్పష్టంచేశారు. పరిశ్రమలు, వ్యవసాయ రంగాల్లో బీజేపీ ప్రభుత్వం హరియాణాను అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దిందని ఉద్ఘాటించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ బీజేపీకి ఆదరణ నానాటికీ పెరుగుతోందని, కాంగ్రెస్ దిగజారిపోతోందని వివరించారు. రాష్ట్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని మోదీ ధీమా వ్యక్తంచేశారు. -
నా తండ్రిని అవమానించారు: షేక్ హసీనా
ఢాకా: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల కోసం విద్యార్థులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారటంతో షేక్ హసీనా ప్రధానిగా రాజీనామా చేసి.. భారత్ చేరుకున్నారు. ఆమె ప్రస్తుతం భారత్‌తో ఆశ్రయం పొందుతున్నారు. బంగ్లా సంక్షోభం, అల్లర్ల అనంతరం షేక్ హసీనా తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘జులైలో విద్యార్థుల నిరసనల్లో హత్యలు, విధ్వంసక చర్యలకు పాల్పడిన వారిపై కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నా. దేశ పౌరులు షేక్ ముజిబుర్ రెహ్మాన్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న జాతీయ సంతాప దినాన్ని పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నా. బంగాబంధు స్మారకం వద్ద పూల మాలలు వేసి మృతి చెందినవారి ఆత్మ శాంతించాలని ప్రార్థించండి.గత జూలై నుంచి ఆందోళనలతో విధ్వంసం, హింస చెలరేగింది. ఈ ఆందోళనల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీసులు పాత్రికేయులు, శ్రామిక ప్రజలు, అవామీ లీగ్, అనుబంధ సంస్థల నాయకులు, కార్మికులకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను’ అని ఆమె అన్నారు. షేక్ హసీనా విడుదల చేసిన ప్రకటనను ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ ‘ఎక్స్’లో షేర్ చేశారు.‘‘ నా తండ్రి, జాతిపిత బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో బంగ్లా స్వతంత్ర దేశంగా ఏర్పడింది. తాజా పరిణామాలతో ఆయన ఘోర అవమానానికి గురయ్యారు. లక్షలాది మంది అమరవీరుల రక్తాన్ని అవమానించారు. దేశప్రజల నుంచి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.Son of deposed Prime Minister of Bangladesh Sheikh Hasina, Sajeeb Wazed Joy releases a statement on behalf of Sheikh Hasina on his social media handle X....I appeal to you to observe the National Mourning Day on 15th August with due dignity and solemnity. Pray for the salvation… pic.twitter.com/b1qRgOP06r— ANI (@ANI) August 13, 2024 -
హిందూ ఆలయంపై విద్వేష రాతలు
న్యూయార్క్/గాందీనగర్: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని ప్రముఖ హిందూ ఆలయంపై దాడి జరిగింది. దుండగులు ఆలయ గోడపై భారత వ్యతిరేక అభ్యంతరకర చిత్రాలతోపాటు ఖలిస్తాన్ అంటూ కలర్ స్ప్రే చేశారు. పోలీసులు ఈ ఘటనను విద్వేష నేరంగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. నెవార్క్‌లోని స్వామి నారాయణ్ మందిర్ హిందూ ఆలయంపై అభ్యంతరకర చిత్రాలు(గ్రాఫిటీ) ఉన్నాయంటూ శుక్రవారం ఉదయం తమకు ఆలయ నిర్వాహకుల నుంచి ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసు అధికారులు వాటిని పరిశీలించారు. గ్రాఫిటీని రెచ్చగొట్టే చర్యగా ఆలయ పెద్దలు పేర్కొన్నారని పోలీసులు వెల్లడించారు. కావాలనే ఎవరో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు భావిస్తున్నామని చెప్పారు. విద్వేష నేరంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నామన్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీ తదితరాలతో ఆధారాలను సేకరిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనను అమెరికా విదేశాంగ శాఖ, శాన్ఫ్రాన్సిస్కోలోని భారత్ కాన్సులేట్ కార్యాలయం తీవ్రంగా ఖండించాయి. గతంలోనూ భారత దౌత్య కార్యాలయాలపై ఇలాంటి దాడులు జరిగాయి. జూలైలో శాన్ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్ కార్యాలయంపై ఖలిస్తాన్ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. అమెరికా, కెనడాలపౌరసత్వమున్న ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూపై హత్యాయత్నం వెనుక భారత ప్రమేయముందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఉపేక్షించరాదు: జై శంకర్ ఈ ఘటనపై విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ వెలుపల ఉగ్రవాదం, వేర్పాటువాదాలను ఉపేక్షించరాదని డిమాండ్ చేశారు. -
అలాంటివి మేము అంగీకరించం.. చర్యలు తీసుకుంటాం! భారత్‌కి హామీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు మోదీ పునరుత్పాదక ఇంధన, వాణిజ్యం, రక్షణ రంగాలలో ఇరు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్‌తో విస్తృత చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలో ఆలయాల ధ్వసం ఘటనలపై కూడా తాము ఇరువురం మాట్లాడుకున్నట్టు మోదీ తెలిపారు. తాను మరోసారి ఈ ఆలయ ధ్వంస గురించి ఆల్బనీస్‌తో చర్చించానని, ఇలాంటి విధ్వంసాలకి పాల్పడే వారిపై తప్పక కఠిన చర్యలు తీసుకుటామని మరోసారి హామీ ఇచ్చారని చెప్పారు. అంతేగాదు భారత్ ఆస్ట్రేటియా మధ్య స్నేహపూర్వక సంబంధాలను, వారి చర్య లేదా ఆలోచనల ద్వారా దెబ్బతీసే ఏ అంశాలను అంగీకరించమని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి అంశాలకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారని తెలిపారు. ఇదిలా ఉండగా జనవరి 12న ఆస్ట్రేలియాలో మిల్‌పార్క్‌లోని బీఏపీఎస్ స్వామి నారాయణ మందిర్, జనరవి 16న క్యారమ్ డౌన్స్‌లోని శ్రీ విష్ణు దేవాలయాలు హిందూ వ్యతిరేక శక్తులచే ధ్వసమయ్యాయి. కాగా, సిడ్నీలోని ర్యాలీ అల్బనీస్ భారత ప్రధాని మోదీతో కలసి పాల్గొని భారతీయ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిని ఒకరోజు తర్వాత ఈ చర్చలు జరిగాయి. (చదవండి: జోబైడెన్ హత్యకు యువకుడి యత్నం.. ట్రక్కుతో వైట్‌హౌస్‌పై దాడి) -
ఆలయాలపై దాడులు ఆందోళనకరం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్‌తో శుక్రవారం సమావేశమయ్యారు. అంతర్జాతీయ పరిణామాలతోపాటు కీలక ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ప్రతిష్టాత్మకమైన వాణిజ్య ఒప్పందం, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భద్రత, పరస్పర సహకారం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. క్లీన్ ఎనర్జీ, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ఖనిజాలు, వలసలు, సప్లై చైన్లు, విద్యా, సాంస్కృతికం, క్రీడల్లో ఇకపై కలిసి పనిచేయాలని, ఒకరికొకరు సహకరించుకోవాలని అంగీకారానికొచ్చారు. ఆస్ట్రేలియాలో హిందూ ఆలయాలపై ఇటీవల జరిగిన దాడుల గురించి ఆల్బానీస్ వద్ద మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆస్ట్రేలియాలో ఖలిస్తాన్ మద్దతుదారుల కార్యకలాపాలు పెరుగుతుండడాన్ని గుర్తుచేశారు. క్రీడలు, నవీన ఆవిష్కరణలు, ఆడియో–విజువల్ ప్రొడక్షన్, సౌర విద్యుత్ విషయంలో పరస్పర సహకారానికి సంబంధించి నాలుగు ఒప్పందాలపై భారత్, ఆస్ట్రేలియా ప్రతినిధులు సంతకాలు చేశారు. చర్చల అనంతరం ఆంథోనీ అల్బానీస్‌తో కలిసి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. ‘‘ఆస్ట్రేలియాలోని హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నట్లు గత కొన్ని వారాలుగా మీడియాలో నిత్యం వార్తలు వస్తుండడం నిజంగా విచారకరం. అలాంటి దాడులు భారత్‌లో ప్రతి ఒక్కరికీ సహజంగానే ఆందోళన కలిగిస్తున్నాయి. ఆలయాలపై దాడుల పట్ల మన మనసులు కలత చెందుతున్నాయి. మన మనోభావాలను, ఆందోళనలను ఆస్ట్రేలియా ప్రధానమంత్రికి తెలియజేశా. ఆస్ట్రేలియా సమాజంలో, ఆర్థిక వ్యవస్థలో భారతీయులు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు అల్బానీస్ నాకు హామీ ఇచ్చారు. భారతీయుల భద్రత విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వానికి సాధ్యమైనంతవరకూ మా వంతు సహకారం అందిస్తాం’’ అని పేర్కొన్నారు. భారత్–ఆస్ట్రేలియా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి ద్వైపాక్షిక భద్రతా సహకారం అత్యంత కీలకమని మూలస్తంభమని మోదీ ఉద్ఘాటించారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో మారిటైమ్ సెక్యూరిటీ, డిఫెన్స్, సెక్యూరిటీ కో–ఆపరేషన్ గురించి తాము చర్చించామని అన్నారు. త్వరలోనే ఆర్థిక సహకార ఒప్పందం: అల్బానీస్ ఇండియా–ఆస్ట్రేలియా సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని(సీఈసీఏ)ను సాధ్యమైంత త్వరగా కుదుర్చుకోవాలని మోదీ, తాను అంగీకారానికి వచ్చినట్లు ఆంథోనీ అల్బానీస్ తెలిపారు. ఈ ఏడాదిలోనే ఒప్పందాన్ని ఖరారు చేస్తామన్న నమ్మకం ఉందన్నారు. భారత్–ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందం(ఈసీటీఏ) గత ఏడాది ఖరారైన సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ నుంచే ఇది అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఇరు పక్షాలు సీఈసీఏపై కసరత్తు చేస్తున్నాయి. వలసల ఒప్పందం పురోగతిలో ఉందని, దీనివల్ల ఇరు దేశాల విద్యార్థులకు, వృత్తి నిపుణులకు లబ్ధి చేకూరుతుందని అల్బానీస్ తెలిపారు. భారత్‌తో తమకు బహుముఖ సంబంధాలు ఉన్నాయన్నారు. ఈ ఏడాదిలో మే నెలలో తమ దేశంలో ‘క్వాడ్’ సదస్సు జరగబోతోందని, మోదీ రాకకోసం ఎదురు చూస్తున్నానని వివరించారు. జీ20 సదస్సులో పాల్గొనడానికి సెప్టెంబర్‌లో భారత్‌కు వస్తానని అన్నారు. (చదవండి: మంటల్లో చిక్కుకున్న బస్సు..అదే టైంలో కండక్టర్ నిద్రిస్తుండటంతో..) -
పోలీసు పుత్రిడి నుంచి ఉగ్రవాదిగా అజీజ్... 16 ఏళ్ల జైలు శిక్ష
సాక్షి హైదరాబాద్: పాక్ నిఘా సంస్థ లష్కరే తొయిబా (ఎల్ఈటీ) ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో భారీ విధ్వంసాలకు కుట్రపన్నిన కేసులో నిందితుడిగా ఉన్న అబ్దుల్ అజీజ్ అలియాస్ గిడ్డా అజీజ్ దోషిగా తేలాడు. ఇతడికి 16 ఏళ్ల జైలు శిక్ష, రూ.26 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చినట్లు శనివారం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏసీపీ పి.వెంకటేశ్వర్లు వివరించారు. ఈ కేసులో మరో నిందితుడు మహ్మద్ నిస్సార్‌కు న్యా యస్థానం 2011లోనే 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పెట్రోల్ పంపులో మేనేజర్‌గా.. భవానీనగర్‌కు చెందిన గిడ్డా అజీజ్ తండ్రి మెహతబ్ అలీ హెడ్ కానిస్టేబుల్‌గా పని చేశారు. అజీజ్ 1985 నుంచి 87 వరకు పాతబస్తీలోని మదీనా ప్రాంతంలోని ఓ పెట్రోల్ పంపులో మేనేజర్‌గా పని చేశాడు. నల్లగొండ జిల్లా బోనాల్‌పల్లికి చెందిన సిమి ఉగ్రవాది మహ్మద్ ఫసీయుద్దీన్ ద్వారా ఉగ్రవాద బాటపట్టాడు. ఎల్ఈటీకి అనుబంధంగా ఆజం ఘోరీ ఏర్పాటు చేసిన ఇండియన్ ముస్లిం మహమ్మదీ ముజాహిదీన్ సంస్థతో సన్నిహితంగా మెలిగాడు. హత్యలు, దోపిడీలతో పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన ఫసీ అతని అనుచరుడు మీర్ 1993 జూన్ 21న కార్ఖానా పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. 2000లో జగిత్యాలలో జరిగిన ఎన్కౌంటర్లో ఘోరీ చనిపోయాడు. దీంతో సౌదీ అరేబియాకు వెళ్లిపోయిన గిడ్డా అజీజ్ అక్కడే ఇంటర్నేషనల్ ఇస్లామిక్ రిలీఫ్ ఆర్గనైజేషన్ (ఐఐఆర్వో) అనే సంస్థలో చేరాడు. పూర్తి స్థాయి జిహాదీ వలంటీర్లతో కూడి న ఈ సంస్థలో అజీజ్ కీలకపాత్ర పోషించాడు. భారీ విధ్వంసానికి కుట్ర.. ‘బాబ్రీ’ ఉదంతం తర్వాత రెచ్చిపోయిన అజీజ్ అయోధ్యతో పాటు హైదరాబాద్‌లోనూ భారీ స్థాయిలో విధ్వంసానికి కుట్రపన్నాడు. అప్పట్లో బోస్నియా– చెచెన్యాల్లో జరుగుతున్న అంతర్యుద్ధాలకు ఆకర్షితుడైన అజీజ్ 1995లోనే ఆ దేశానికి వెళ్లి వచ్చాడు. ఆ యుద్ధాల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు అనేక మంది యువతకు ఉగ్రవాద శిక్షణ కూడా ఇచ్చాడు. 1995 జూలై 17 బోస్నియా నుంచి అసలు పేరుతోనే పాస్‌పోర్ట్ పొందాడు. ఆపై భారత్‌కు వచ్చిన గిడ్డా అజీజ్ 1993 జనవరి 7న సికింద్రాబాద్ ఆర్పీఓ కార్యాలయం నుంచి తన పేరుతోనే మరో పాస్‌పోర్ట్ తీసుకున్నాడు. 2000 అక్టోబర్ 3న అబ్దుల్ కరీం పేరుతో ఇంకో నకిలీ పాస్‌పోర్ట్ పొందాడు. అజీజ్, నిస్సార్ సహా మరొకరిని నగర పోలీసులు 2001 ఆగస్టు 28న హుమాయున్‌నగర్ పరిధిలోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రి వద్ద అరెస్టు చేశారు. అజీజ్ నుంచి ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, బెల్జియంలో తయారైన పిస్టల్, క్యాట్రిడ్జిలు, బోస్నియా పాస్‌పోర్ట్, రెండు నకిలీ పాస్‌పోర్టులు, ఎలక్ట్రిక్ సర్క్యూట్ బోర్డులు, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బెయిల్ పొందిన అజీజ్ సౌదీకి పారిపోయాడు. మూడేళ్లే అక్కడే ఉన్న అజీజ్ 2004లో నగరానికి వచ్చాడు. సికింద్రాబాద్‌లో ఉన్న గణేష్ దేవాలయం పేల్చివేతకు కుట్రపన్నాడు. సౌదీలో తలదాచుకుని.. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో పేలుళ్లకు పన్నిన ఈ కుట్రను ఛేదించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు మిగిలిన నిందితుల్ని అరెస్టు చేయగా... గిడ్డా అజీజ్ త్రుటిలో తప్పించుకున్నాడు. బోస్నియా పాస్‌పోర్ట్ వినియోగించి అడ్డదారిలో సౌదీ పారిపోయి అక్కడే తలదాచుకున్నాడు. అజీజ్‌ది నకిలీ పాస్‌పోర్ట్ అని గుర్తించిన సౌదీ అధికారులు 2007లో అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న నగర పోలీసులు రెండు కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న అజీజ్‌పై 2008లో ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించారు. సౌదీలో నకిలీ పాస్‌పోర్ట్ కేసు విచారణ, శిక్ష పూర్తికావడంతో అక్కడి అధికారులు 2016లో భారత్‌కు బలవంతంగా తిప్పిపంపించారు. దీంతో అప్పటి నుంచి 2001 నాటి విధ్వంసాల కేసు విచారణ సాగి అజీజ్‌కు 16 ఏళ్ల శిక్ష పడింది. (చదవండి: ములుగులో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు దుర్మరణం) -
కేరళ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: కేరళ ప్రభుత్వానికీ సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు బుధవారం కొట్టేవేసింది. ఆరుగురు సీపీఎం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసు విచారణను ఉపసంహరించుకోవాలన్న కేరళ ప్రభుత్వ పిటిషన్ సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేసిన చట్టం కింద ఆరుగురు ఎమ్మెల్యేలు విచారణ ఎదుర్కోవాల్సిందేనని తేల్చిచేప్పింది. దేశంలో అందరికీ ఒకే చట్టం వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2015లో కేరళ అసెంబ్లీలో సీపీఎంకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. -
కాకినాడలో రెచ్చిపోయిన ఆకతాయిలు
-
కేరళలో గాంధీ విగ్రహానికి అవమానం
న్యూఢిల్లీ : విగ్రహాల విధ్వంసం దేశమంతా దావానంలా వ్యాపిస్తోంది. కేరళ, కన్నూర్‌లోని తాళిపరంబ ప్రాంతంలో జాతిపిత మహాత్మా గాంధీ ప్రతిమ అవమానానికి గురైంది. విగ్రహాన్నుంచి కళ్లజోడుని దుండగులు వేరుచేశారు. గాంధీజీ తల నుంచి వేరుపడివున్న కళ్లజోడుని ఈ ఉదయం స్థానికులు గుర్తించారు. తమిళనాడులోని తిరువత్రియూర్ పెరియార్ నగర్లో అంబేద్కర్ విగ్రహానికి రంగులు పూసి దుండగులు అవమానం చేశారు. త్రిపుర ఎన్నికల్లో విజయానంతరరం చోటుచేసుకున్న పరిణామాల్లో ఆదివారం బీజేపీ కార్యకర్తలు రష్యా విప్లవ నేత లెనిన్ విగ్రహాన్ని కూల్చిన సంగతి.. కోల్‌కతాలో మంగళవారం శ్యాంప్రసాద్ ముఖర్జీ విగ్రహం కూల్చివేతకు గురైన విషయం విదితమే. -
విగ్రహాల ధ్వంసంపై స్పందించిన అమిత్‌షా
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన విగ్రహాల ధ్వంసంపై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా స్పందించారు. ఇలాంటి సంఘటనలు చాలా దురదృష్టకరం అని అన్నారు. ఈ ధ్వంసానికి పాల్పడిన వారిలో తమ పార్టీ వ్యక్తి ఉన్నా మరే పార్టీ వ్యక్తి ఉన్నా కూడా తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సంఘటనలకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని, తమిళనాడు పెరియార్ విగ్రహాన్ని కొంతమంది కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం పెద్ద మొత్తంలో ఘర్షణలు చెలరేగాయి. వీటి ధ్వంసానికి బీజేపీనే కారణం అని పలుచోట్ల చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో అమిత్ షా తన ట్విటర్ ఖాతా ద్వారా స్పందించారు. ‘విగ్రహాల ధ్వంసం అనేది చాలా దురదృష్టకరం. ఒక పార్టీగా ఇలాంటి సంఘటనలకు ఏమాత్రం మద్దతు ఇవ్వబోం. తమిళనాడు, త్రిపురలోని మా పార్టీ కార్యకర్తలతో సంఘాలతో నేను మాట్లాడాను. ఒక వేళ ఎవరైనా బీజేపీకి సంబంధించిన వ్యక్తి విగ్రహాల ధ్వంసంలో ఉన్నట్లు తెలిస్తే వారిపై పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని అమిత్‌షా హెచ్చరించారు. -
సరి'హద్దు' మీరిన దాదాగిరీ
మూడున్నర దశాబ్దాలకు పైగా తునిలో తెలుగు తమ్ముళ్ల ఇష్టారాజ్యం ఆర్థిక మంత్రి యనమల సోదరుడు కృష్ణుడిపై ఆరోపణలు విశాఖ జిల్లా పాల్మన్‌పేటలో దాడి ఆయన ప్రోద్బలంతోనే అంటున్న బాధితులు కాకినాడ : మూడు దశాబ్దాలకు పైగా తుని ప్రాంతంలో చక్రం తిప్పుతున్న తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యాలు, అరాచకాలు ఇప్పుడు సరి‘హద్దు’ మీరాయి. మంగళవారం విశాఖ జిల్లా పాల్మన్‌పేటపై విరుచుకుపడి, విధ్వంసం సృష్టించడానికి సూత్రధారి తుని నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి వరుసకుసోదరుడైన యనమల కృష్ణుడేనన్న ఆరోపణ బలంగా వినిపిస్తోంది. పాల్మన్‌పేట దాడిలో బాధితులైన మత్స్యకారులు గురువారం తుని వద్ద హైవేపై బైఠారుుంచి ఆందోళన చేసిన సందర్భంగా ఇదే ఆరోపణ చేశారు. ‘కృష్ణుడు డౌన్‌డౌన్’ అని నినదించడం, కృష్ణుని ప్రోద్బలంతోనే దాడి జరిగిందని ఎలుగెత్తడం గమనార్హం. ఇదే విషయాన్ని పాల్మన్‌పేట బాధితులు పాయకరావుపేట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామకృష్ణుడు రాష్ట్ర వ్యవహారాల్లో తలమునకలై ఉంటారు. తుని ఏఎంసీ చైర్మన్ అయిన కృష్ణుడే నియోజకవర్గంలో అంతా తానే అన్నట్టు వ్యవహరిస్తూంటారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నదే. 2009లో ఓటమి తరువాత ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్న రామకృష్ణుడు అనంతరం ఎమ్మెల్సీ అయ్యారు. గత ఎన్నికల్లో తుని నుంచి టీడీపీ తరఫున తలపడ్డ కృష్ణుడు.. వైఎస్సార్సీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా చేతిలో ఓటమి పాలయ్యూరు. అయినా.. సోదరుడు మంత్రి కావడంతో ఆయన పెత్తనానికి అడ్డు లేకుండా పోతోంది. ఈ పరిస్థితుల్లో ఇంతవరకూ తుని నియోజకవర్గానికే పరిమితమైన తెలుగు తమ్ముళ్ల దాష్టీకం, దౌర్జన్యాలు ఇప్పుడు సరిహద్దు దాటాయనడానికి పాల్మన్‌పేట ఘటనే ఉదాహరణ. ముఖ్యనేత ఉన్నారన్న భరోసాతోనే.. యువకుల క్రికెట్ విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో తునికి చెందిన తెలుగు తమ్ముళ్లు మారణాయుధాలతో పాల్మన్పేటవాసులపై దాడికి తెగబడ్డారు. తునిలోని వేమవరం, గొల్లముసలయ్యపేట, యాదాలవారివీధి, కుమ్మరిపేట మంత్రి రామకృష్ణుడికి వెన్నుదన్నుగా ఉన్న గ్రామాలు. విశాఖకు చెందిన రాజయ్యపేట గ్రామస్తులకు మద్దతుగా పై నాలుగు గ్రామాల నుంచి ఐదారు వందల మంది తెలుగు తమ్ముళ్లు బరిసెలు, బల్లేలతో పాల్మన్‌పేటపై దాడులకు తెగబడ్డారు. కృష్ణుడి ప్రోద్బలం, ముఖ్యనేత చూసుకుంటారన్న భరోసాతోనే తెలుగు తమ్ముళ్లు ఇంతకు బరి తెగించారని బాధితులు ఆరోపిస్తున్నారు. 2014లో హేచరీస్‌లో విధ్వంసం నియోజకవర్గంలో సముద్రతీరంలో ఉన్న హేచరీలపై చెన్నై నుంచి అధికారులు దాడులకు రాకుండా చూసుకుంటామని, అందుకు రూ.20 లక్షలు ఇవ్వాలని తెలుగు తమ్ముళ్లు 2014లో డిమాండ్ చేశారు. ప్రియాంక హేచరీస్ యాజమాన్యం తమకు అన్ని అనుమతులూ ఉన్నాయని, ఎవరికీ సొమ్ము ఇవ్వనవసరం లేదని నిరాకరించడంతో రెచ్చిపోయిన తెలుగుతమ్ముళ్లు 2014 డిసెంబరులో ఆ హేచరీపై దాడి చేసి, విధ్వంసం సృష్టించారు. ఈ దాడికి కృష్ణుడే కారణమని, ఆయన నుంచి ప్రాణహాని ఉందని హేచరీస్ యజమాని అప్పట్లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జోక్యం చేసుకున్న టీడీపీ ముఖ్యులు రాజీ చేశారు. అప్పుడు హేచరీస్ యాజమాన్యం ఫిర్యాదు ఇవ్వడమే దాడులకు కారణం కాగా.. ఇప్పుడు పాల్మన్‌పేటపై దాడికి కూడా వారు పాయకరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేయడమే కారణమైంది. ఈ రెండు ఘటనలను నిశితంగా పరిశీలిస్తే చట్టాన్ని తెలుగు తమ్ముళ్లు పెరట్లో రాటకు కట్టేసిన పశువును చేశారనే విషయం స్పష్టమవుతోంది. అక్రమ ఇసుకదందా తుని నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు ఇసుక అక్రమ దందాతో లక్షలు కొల్లగొట్టారు. 2015 మార్చి నుంచి తుని, కోటనందూరు మండలాల్లో బొద్దవరం, డి.పోలవరంలో తెలుగు తమ్ముళ్ల ఆధ్వర్యంలో ఇసుక మాఫియా చెలరేగిపోయింది. కొండల మధ్య వేలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను నిల్వ చేసి వ్యాపారం నిర్వహిస్తుండగా, స్థానికుల సహకారంతో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా రెడ్‌హేండెడ్‌గా పట్టిచ్చారు. అయితే తెలుగు తమ్ముళ్లకు భయపడ్డ అధికారులు కేసును నీరుగార్చారు. వైఎస్సార్సీపీ వారిపై కక్షతో కేసులు కాగా వైఎస్సార్ సీపీలో చురుకుగా ఉన్నవారిపైనా తెలుగు తమ్ముళ్లు కక్ష కడుతున్నారు. తుని కాపు ఐక్యగర్జన ఘటనలతో సంబంధం లేనివారిని కేసుల్లో ఇరికిస్తున్నారు. బిళ్లనందూరుకు చెందిన లగుడు శ్రీనును అలాగే తుని కేసులో ఇరికించారని బంధువులు ఆవేదన చెందుతున్నారు. తమ మాట వినని, వైఎసార్సీపీకి చెందిన మాజీ జెడ్పీటీసీ పెదపాటి అమ్మాజీ, సొసైటీ అధ్యక్షుడు గొర్లె రామచంద్రరావు, భీమవరపుకోట సర్పంచ్ జిగటాల వీరబాబు.. ఇలా 70 మందికి పైబడి నేతలు, కార్యకర్తలపై బనాయించిన అక్రమ కేసులు తెలుగు తమ్ముళ్ల వేధింపులకు సాక్ష్యం. చివరకు ఒంటిమామిడిలో పోలీసు క్వార్టర్ల కోసం కేటాయించిన లక్షలాది రూపాయల విలువ చేసే స్థలాన్ని కూడా తెలుగు తమ్ముళ్లు కబళించారంటున్నారు. బడా కంపెనీల పారిశ్రామిక అవసరాల కోసం రైతుల అభీష్టానికి భిన్నంగా బలవంతపు భూ సేకరణలో కూడా తెలుగు తమ్ముళ్లదే హవా. అక్రమంగా ఆక్వా చెరువుల తవ్వకాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, అసైన్డ్ ల్యాండ్స్, డి ఫాం పట్టాల అమ్మకాలు...ఇలా తుని నియోజకవర్గంలో వారి అక్రమాలు, ఆగడాల జాబితా కొండవీటి చేంతాడంత ఉంటుంది. ఈ దందాకు అడ్డుకట్ట పడేదెప్పుడా అని నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తూంటే.. ఇప్పుడది సరిహద్దులు కూడా దాటడంతో గగ్గోలు పెట్టడం పాల్మన్పేటవాసుల వంతైంది. ప్రాతినిధ్యం ఎవరిదైనా పెత్తనం ‘తమ్ముళ్ల’దే.. ఇప్పుడంటే తుని తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం సరిహద్దు దాటడం సంచలనమైంది. కానీ.. నియోజకవర్గ పరిధిలో ఇలాంటి ఆగడాలు నిత్యకృత్యం. టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారీ తుని, పరిసర ప్రాంతాల్లో తెలుగు తమ్ముళ్ల దాదాగిరీ బరితెగించడం ప్రజలకు తెలిసిందే. గత ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కూడా ఇదే ప్రధాన కారణం. అయినా పార్టీ అధికారంలో ఉండడంతో తెలుగు తమ్ముళ్లు ఆ సంస్కృతిని విడనాడకపోగా మరింత పేట్రేగిపోతున్నారు. ప్రాతినిధ్యం వహిస్తున్నది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేయే అయినా.. తెలుగుతమ్ముళ్ల ఇష్టారాజ్యమే నియోజకవర్గంలో సాగుతోంది. అందుకు ఉదాహరణలకూ కొదవ లేదు. -
దూకుడే
సాక్షి, ముంబై: టోల్ విధానంలో పారదర్శకత తీసుకురావాలన్న డిమాండ్‌తో తాము బుధవారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న రాస్తారోకో ఉంటుందని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే స్పష్టం చేశారు. పోలీసులు పంపిన నోటీసులకు తాను బెదరనని, వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. మంగళవారం సాయంత్రం రాజ్‌ఠాక్రే నివాసం కృష్ణకుంజ్ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి రాష్ట్రంలోని హైవేలన్నింటిపై తమ పార్టీ కార్యకర్తలు రాస్తారోకోకు దిగుతారన్నారు. ఈ ఆందోళనలో భాగంగా నవీముంబైలోని వాషీ టోల్‌నాకా వద్ద జరిగే రాస్తారోకోలో తాను పాల్గొంటానని చెప్పారు. అయితే తాను ఆందోళనకు పిలుపునిచ్చిన అనంతరం చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నారు. అయితే వారిని ఎలా నమ్మేదని ప్రశ్నించారు. మరోవైపు గతంలో కూడా ప్రభుత్వంతో చర్చలు జరిగాయని, ఫలితం మాత్రం శూన్యమన్నారు. నిజంగా ప్రభుత్వం టోల్ సమస్యను పరిష్కరించాలని భావిస్తే ఒక గడువు ఇచ్చి ఓ ప్రణాళిక రూపొందించాలని, కేవలం చర్చలు జరిపితే లాభం లేదన్నారు. తాము చర్చలకు వచ్చినప్పుడు తమ వెంట కొందరు విలేకరులను కూడా అనుమతించాలని ప్రభుత్వానికి సూచించామని తెలిపారు. ‘ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం ఏదో గూడు పుఠాణి, ఒప్పందం కుదిరింది.. ఇలా రకరకాలుగా పుకార్లు వస్తాయి. ఈ నేపథ్యంలోనే చర్చల సమయంలో విలేకరులను కూడా అనుమతించాలని కోరామ’ని రాజ్‌ఠాక్రే వివరించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు.... రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు జరుగుతున్నందున నగరాలు, పట్టణాల్లోని జనజీవనంపై ప్రభావం కలగకుండా ఆందోళన చేయాలని ఎమ్మెన్నెస్ కార్యకర్తలకు సూచించానని రాజ్‌ఠాక్రే చెప్పారు. కేవలం నిరసన తెలిపేందుకే తాము ఈ ఆందోళన చేస్తున్నామన్నారు. మరోవైపు 13 రకాల పన్నులతోపాటు టోల్ వసూలు చేస్తున్నారని, వీటిని ఎక్కడ వినియోగిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ డబ్బులు మౌలిక సదుపాయాల కోసం కాకుండా ఎన్నికల నిధి కోసమే కలెక్షన్ చేస్తున్నారని ఆరోపించారు. ఫిబ్రవరి 21న ర్యాలీ... రాస్తారోకో ఆందోళన అనంతరం ఈ నెల 21వ తేదీన ముంబై గిర్గావ్ నుంచి మంత్రాలయం వరకు మహార్యాలీ నిర్వహిస్తామని రాజ్‌ఠాక్రే ప్రకటించారు. రాస్తారోకో ఆందోళన అనంతరం కూడా ప్రయోజనం లేకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అయినా ప్రభుత్వంలో మార్పు రాకపోతే మాత్రం ఇక ఊరుకోమని హెచ్చరించారు. ఎమ్మెన్నెస్ పార్టీ తనదైన శైలిలో ఆందోళనకు దిగుతుందన్నారు. సీఎంకు సీట్ల పంపకాలే ముఖ్యం... రాష్ట్రవ్యాప్తంగా సమస్యగా మారిన టోల్ అంశంపై చర్చలు జరపడంకంటే సీట్ల పంపకాలపైనే ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆసక్తి చూపుతున్నారని రాజ్‌ఠాక్రే ఆరోపించారు. ఈ సమస్యకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. అయితే ఢిల్లీలో సీట్ల పంపకాల కోసం మాత్రం సమయం ఉందని ఎద్దేవా చేశారు. పోలీసు బందోబస్తు ఎమ్మెన్నెస్ రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకో ఆందోళన చేపట్టనున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికోసం సిబ్బంది సెలవులు కూడా రద్దు చేశారు. ముందుజాగ్రత్త చర్యగా ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రేతోపాటు ఎమ్మెన్నెస్ పదాధికారులు, కార్యకర్తలకు పోలీసులు నోటీసులు పంపించారు. కాగా, రాజ్ ఠాక్రేకు శివాజీపార్క్ పోలీసు స్టేషన్ నుంచి నోటీసులు వెళ్లాయి. ఆందోళన హింసాత్మకంగా మారితే దీనికి బాధ్యత మీదే ఉంటుందని ఆ నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు ప్రజలు కూడా కొంత ఆయోమయంలో ఉన్నారు. దీంతో బుధవారం ఏమి జరగనుందనే విషయంపై అందరిలో ఉత్కంఠ కనిపిస్తోంది. -
అరెస్టు అనివార్యమేనా!
సాక్షి, ముంబై: టోల్‌ప్లాజాలపై దాడులు చేసేలా పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధినేత రాజ్‌ఠాక్రేపై పోలీసులు కేసు నమోదుచేసి అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈప్రక్రియను ప్రారంభించిన పోలీసులు రాజ్‌ఠాక్రేను ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశాలున్నాయి. నవీముంబైలో ఆదివారం రాత్రి రాజ్‌ఠాక్రే చే సిన రెచ్చగొట్టే సీడీ ప్రసంగాలను హోంశాఖ, పోలీసులు ఇప్పటికే పరిశీలించారు. ఆయనపై ఎప్పుడైనా కేసులు నమోదుచేయవచ్చని హోంశాఖ వర్గాలు తెలిపాయి. టోల్ చెల్లించొద్దని, ఎవరైన బలవంతం చేస్తే వారిని చితక్కొట్టండని రాజ్‌ఠాక్రే పిలుపునివ్వడంతో రాష్ట్రంలోని అన్ని టోల్‌ప్లాజాల వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఎమ్మెన్నెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయి రాష్ట్రవ్యాప్తంగా టోల్ ప్లాజాలపై విరుచుకుపడ్డారు. పుణే-సతార రహదారిపై టోల్ ప్లాజాపై రాళ్లు రువ్వడంతో నాలుగు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులకు నష్టం వాటిళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు కూడా గాయపడ్డారు. తాజాగా మంగళవారం సాయంత్రం బాంద్రా-వర్లీ సీలింక్‌పై కూడా దాడులు చేశారు. కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫర్నీచర్, టోల్ రసీదులు జారీచేసే యంత్రాలను ధ్వంసంచేసి ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారు. ఈ ఘటనలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు రాజ్‌పై కేసు నమోదుచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నష్టాన్ని ఆందోళనకారుల నుంచి వసూలు చేస్తామని హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన రాజ్‌ఠాక్రే, ప్రభుత్వం ఏం చేయాలని అనుకుంటుందో అది చేసుకోవచ్చని. తాను ఏం చేయదలుచుకున్నానో అది కచ్చితంగా చేస్తానని ప్రభుత్వానికి సవాలు విసిరారు. శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన సీఎం పృథ్వీరాజ్ చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్లపై భారీగా విమర్శలు చేసే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దీనికిముందే రాజ్ ఠాక్రేను అరెస్టు చేసే అవకాశముందని సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ఇదేం టోల్ వసూళ్ల పద్ధతి: బీజేపీ ముంబై: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న టోల్ రుసుం వసూళ్ల విధానంపై బీజేపీ మండిపడింది. వీరి తీరువల్ల భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ బుధవారం విలేకరులతో అన్నారు. డబ్బులు వెచ్చించి కాంట్రాక్టును దక్కించుకున్న కంపెనీలు టోల్ రూపంలో వాహనదారుల నుంచి భారీగా వసూళ్లు చేస్తున్నాయన్నారు. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) కార్యకర్తలు సృష్టించిన విధ్వంసాన్ని సీసీటీవీ ఫుటేజీల్లో పరిశీలిస్తామని హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ ప్రకటించడంపై ఫడ్నవిస్ మండిపడ్డారు. ఆయన తరచూ ఇలాంటి ప్రకటనలు చేస్తూనే ఉంటారని, అయితే వీటిని పెద్దగా ఎవరూ పట్టించుకోరని విమర్శించారు. కాగా, ప్రారంభం నుంచే అప్రమత్తంగా ఉంటే ఇలాంటి పరిస్థితి తలెత్తేదే కాదని బీజేపీ ఎంపీ గోపీనాథ్ ముండే అన్నారు. టోల్ విధానంలో మార్పుండదు: సీఎం ప్రస్తుతమున్న టోల్ వ్యవస్థ కొనసాగుతుందని రాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ స్పష్టం చేశారు. టోల్ రుసుంను నిలిపివేయాలంటూ రాష్ట్రంలోని అనేక టోల్‌ప్లాజాల వద్ద ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త రోడ్లను నిర్మించేందు కోసమే ఈ టోల్ విధానాన్ని కొనసాగిస్తున్నామని చవాన్ మీడియాకు తెలిపారు. ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే పేరు ఎత్తకుండానే రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సమంజసం కాదన్నారు. రోడ్లను నిర్మించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ టోల్ విధానాన్ని కొనసాగిస్తున్నాయన్నారు. టోల్ వసూళ్లలో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. రాజకీయ గిమ్మిక్కే: ఉద్ధవ్ ఈ ఏడాది జరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని టోల్‌రుసుం రూపంలో ఎమ్మెన్నెస్ పార్టీ రాజకీయ డ్రామాలకు తెరలేపిందని శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే ఆరోపించారు. ఆయనదంతా ఎన్నికల గిమ్మిక్కు అని విమర్శించారు. కొల్హాపూర్‌లో స్థానికుల సహకారంతో తమ పార్టీ నిర్వహించిన ఆందోళన విజయవంతమైందన్నారు. ముంబై, ఠాణే, పుణే టోల్‌నాకాలపై భారీ విధ్వంసం జరగడంపై మాట్లాడుతూ ఇన్నేళ్లుగా నిద్రపోయిన ఎమ్మెన్నెస్ పార్టీ ఆకస్మాత్తుగా మేలుకోవడాన్ని తాము అర్ధం చేసుకుంటున్నామన్నారు. ఎన్నికలకు ముందు ఇలా చేస్తున్నారని అన్నారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా టోల్ ఆందోళన రాజుకుందని, డబ్బులు వసూలు చేయడం లేదని రాజ్‌ఠాక్రే గొప్పలు చెబుతున్నారు. ఎక్కడ రాజుకుంది...? రాష్ట్రవ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజాలు యథాతథంగా పనిచేస్తున్నాయి. వాహన యజమానుల నుంచి డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నార’ని ఉద్ధవ్ ఠాక్రే వ్యంగంగా మాట్లాడారు. టోల్‌ప్లాజాలను ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, ఓటర్లను ఆకట్టుకునేందుకు కేవలం గొప్పలు చెప్పుకోవడం తప్ప వాటివల్ల ఒరిగిందేమి లేదని ఘాటుగా విమర్శించారు. కేవలం శివసేన, బీజేపీ, ఆర్పీఐ నేతృత్వంలోని మహాకూటమి అధికారంలో వస్తే రాష్ట్ర ప్రజలకు తప్పకుండా టోల్ నుంచి విముక్తి లభిస్తుందని హామీ ఇచ్చారు. ఆరు లేన్ల పుణే, ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై ప్రయాణం సౌకర్యంగా ఉంటుందని, ఆ రహదారిలో టోల్ చెల్లించేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. అయితే ఆధ్వాన్న రోడ్లు ఉన్న కొల్హాపూర్, నాసిక్‌లలో ఎందుకు టోల్ రుసుం చెల్లించాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. వసూలు చేసిన టోల్ రుసుం వ్యయంలో భారీగా అవినీతి జరుగుతోందన్నారు.