
న్యూఢిల్లీ : విగ్రహాల విధ్వంసం దేశమంతా దావానంలా వ్యాపిస్తోంది. కేరళ, కన్నూర్‌లోని తాళిపరంబ ప్రాంతంలో జాతిపిత మహాత్మా గాంధీ ప్రతిమ అవమానానికి గురైంది. విగ్రహాన్నుంచి కళ్లజోడుని దుండగులు వేరుచేశారు. గాంధీజీ తల నుంచి వేరుపడివున్న కళ్లజోడుని ఈ ఉదయం స్థానికులు గుర్తించారు.
తమిళనాడులోని తిరువత్రియూర్ పెరియార్ నగర్‌లో అంబేద్కర్ విగ్రహానికి రంగులు పూసి దుండగులు అవమానం చేశారు. త్రిపుర ఎన్నికల్లో విజయానంతరరం చోటుచేసుకున్న పరిణామాల్లో ఆదివారం బీజేపీ కార్యకర్తలు రష్యా విప్లవ నేత లెనిన్ విగ్రహాన్ని కూల్చిన సంగతి.. కోల్‌కతాలో మంగళవారం శ్యాంప్రసాద్ ముఖర్జీ విగ్రహం కూల్చివేతకు గురైన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment