సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన విగ్రహాల ధ్వంసంపై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా స్పందించారు. ఇలాంటి సంఘటనలు చాలా దురదృష్టకరం అని అన్నారు. ఈ ధ్వంసానికి పాల్పడిన వారిలో తమ పార్టీ వ్యక్తి ఉన్నా మరే పార్టీ వ్యక్తి ఉన్నా కూడా తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సంఘటనలకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని, తమిళనాడు పెరియార్ విగ్రహాన్ని కొంతమంది కూల్చివేసిన విషయం తెలిసిందే.
ఈ ఘటన అనంతరం పెద్ద మొత్తంలో ఘర్షణలు చెలరేగాయి. వీటి ధ్వంసానికి బీజేపీనే కారణం అని పలుచోట్ల చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో అమిత్ షా తన ట్విటర్ ఖాతా ద్వారా స్పందించారు. ‘విగ్రహాల ధ్వంసం అనేది చాలా దురదృష్టకరం. ఒక పార్టీగా ఇలాంటి సంఘటనలకు ఏమాత్రం మద్దతు ఇవ్వబోం. తమిళనాడు, త్రిపురలోని మా పార్టీ కార్యకర్తలతో సంఘాలతో నేను మాట్లాడాను. ఒక వేళ ఎవరైనా బీజేపీకి సంబంధించిన వ్యక్తి విగ్రహాల ధ్వంసంలో ఉన్నట్లు తెలిస్తే వారిపై పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని అమిత్‌షా హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment