Sheikh Hasina
-
హసీనాను రప్పించడమే ప్రాథమ్యం
ఢాకా: భారత్‌లో తలదాచుకుంటున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పించడమే తమ తొలి ప్రాధాన్యత అని ఆ దేశ ప్రభుత్వం ఉద్ఘాటించింది. హసీనాను విచారించేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తామని దేశ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ ప్రెస్ కార్యదర్శి షఫీకుల్ ఆలం తెలిపారు. ‘‘హసీనా పార్టీ అవామీ లీగ్ భవితవ్యంపై నీడలు కమ్ముకున్నాయి. ఆ పార్టీ దేశ రాజకీయ ముఖచిత్రంలో ఉండాలా, వద్దా అనేది ప్రజలతో పాటు ఇతర పారీ్టలు నిర్ణయిస్తాయి. హత్యలు, అదృశ్యాలు, నేరాలకు పాల్పడిన వారికి శిక్ష పడాల్సిందే’’అని నొక్కి చెప్పారు. హసీనా ప్రభుత్వం మానవాళిపై నేరాలకు పాల్పడుతోందంటూ ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం ఇచ్చిన నివేదికను ఉదాహరించారు. ఈ నేపథ్యంలో హసీనాను అప్పగించే విషయమై భారత్‌పై ఒత్తిడి పెరిగిందన్నారు. యూనస్‌కు శిక్ష తప్పదు: హసీనా మహమ్మద్ యూనస్ బంగ్లాలో అరాచకాలకు పాల్పడుతున్నారని హసీనా ఆరోపించారు. ‘‘నన్ను అధికారానికి దూరం చేసే కుట్రలో భాగంగానే హత్యలకు పాల్పడ్డారు. అందుకు కారణమైన ‘దుండగుడు’యూనస్‌ను, ఇతరులను బంగ్లా గడ్డపై శిక్షిస్తా’’అని ప్రతినబూనారు. జూలై తిరుగుబాటులో మరణించిన పోలీసుల కుటుంబాలతో ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె వర్చువల్‌గా పాల్గొన్నారు. మృతుల భార్యలతో ముఖాముఖి మాట్లాడారు. యూనస్ వచ్చాక గతంలో ఎన్నడూ లేనంతగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు. 2024 తిరుగుబాటు నేపథ్యంలో తన ప్రభుత్వం కుప్పకూలడంతో హసీనా భారత్‌కు పారిపోయి వచ్చి ఆశ్రయం పొందుతుండటం తెలిసిందే. ‘‘విచారణ కమిటీలన్నింటినీ యూనస్ రద్దు చేశారు. ప్రజలను చంపడానికి ఉగ్రవాదులను మధ్యంతర ప్రభుత్వం విడుదల చేసింది. వారు బంగ్లాను నాశనం చేస్తున్నారు. హత్యాయత్నం నుంచి నేను త్రుటిలో తప్పించుకున్నా. ఏదో మంచి చేయడానికే దేవుడు నన్ను బతికించాడని భావిస్తున్నా. నేను బంగ్లా తిరిగొచ్చాక సమస్యలన్నీ పరిష్కరిస్తా’’ఆమె ప్రకటించారు. -
బంగ్లాదేశ్ లో మళ్లీ చెలరేగిన హింస
-
‘ఆయన దయవల్లే బతికున్నాను’
ఢాకా : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశాన్ని వదిలి భారత్‌కు వచ్చే ముందు తనని, తన చెల్లెలు షేక్ రెహానాను హత్య చేసేందుకు కుట్ర జరిగిందని ఆరోపించారు. గతేడాది ఆగస్టు నెలలో ఉద్యోగ రిజర్వేషన్ల చిచ్చు కారణంగా అదుపు తప్పిన అల్లర్ల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం కుప్పకూలింది. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. అవమానకర రీతిలో తన సోదరితో కలిసి దేశాన్ని వీడారు. అయితే, నాడు దేశాన్ని వీడే సమయంలో జరిగిన ఘటనను తాజాగా షేక్ హసీనా గుర్తు చేసుకున్నారు. తన బంగ్లాదేశ్ అవామీ లీగ్ పార్టీ ఫేస్బుక్ పేజీలో షేక్ హసీనా ఆడియో ప్రసంగాన్ని పోస్ట్ చేశారు. ఆ ఆడియో ప్రసంగంలో ‘రెహానా,నేను కేవలం 20-25 నిమిషాల వ్యవధిలో మేం మరణం అంచునుంచి తప్పించుకున్నాము’ అని ఆడియో ప్రసంగంలో తెలిపారు. ఆ ఆడియోలో తనను చంపేందుకు వివిధ సమయాల్లో కుట్రలు పన్నారని షేక్ హసీనా గుర్తు చేసుకున్నారు. అందుకు ఆగస్టు 21న జరిగిన హత్యల నుండి, కోటాలిపారాలో జరిగిన భారీ బాంబు నుండి బయటపడటమే నిదర్శనమన్నారు.అల్లాయే లేకపోతే నేను ఇలా మీ ముందు మాట్లాడం సాధ్యమయ్యేది కాదు. కుట్రదారులు నన్ను ఎలా చంపాలని ప్లాన్ చేశారో మీరే చూశారు. అయితే, నేనింకా సజీవంగా ఉన్నానంటే అల్లా దయే. నేను నా దేశంలో ఎందుకు లేకపోయానా? అని ఇప్పటికీ బాధపడుతున్నాను.కట్టుబట్టలతో బంగ్లాదేశ్‌ను వీడాను’ అంటూ భావోద్వేగంగా కన్నీరు పెట్టుకున్నారు.పలు మార్లు హత్యాయత్నంషేక్ హసీనా పలు మార్లు హత్యహత్నం నుంచి తప్పించుకున్నారు. ఆగస్ట్ 21, 2004న బంగాబంధు అవెన్యూలో అప్పటి ప్రతిపక్ష నాయకురాలు షేక్ హసీనా నిర్వహించిన ఉగ్రవాద వ్యతిరేక ర్యాలీలో గ్రనేడ్ దాడి జరిగింది. ఈ దాడిలో 24 మంది మరణించారు. షేక్ హసీనాతో పాటు 500 మందికి పైగా గాయపడ్డారు. దీంతో పాటు పలు మార్లు హసీనాపై హత్యయత్నం జరగడంతో హసీనా భారీ మొత్తంలో సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. 👉ఇదీ చదవండి : ట్రంప్ ప్రమాణ స్వీకారం.. 40ఏళ్లలో ఇదే తొలిసారి -
హసీనా వీసా గడువు పెంపు
న్యూఢిల్లీ: విద్యార్థుల ఉద్యమం, ఎగసిన అల్లర్లతో స్వదేశం వీడి భారత్‌లో తలదాచుకుంటున్న పదవీచ్యుత బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా విషయంలో మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆమెకు ఇచ్చిన వీసా గడువును పొడిగించింది. గత ఏడాది జూలై–ఆగస్ట్‌లో బంగ్లాదేశ్‌లో దేశ విమోచన పోరాటయోధుల కుటుంబాలు, వారసులకు నియామకాల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ మొదలైన ఉద్యమాన్ని హసీనా ఉక్కుపాదంతో అణిచేసి దారుణాలకు పాల్పడ్డారని ఆమెను విచారిస్తామని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించడం తెల్సిందే. ఆమె పాస్ట్‌పోర్ట్‌ను రద్దుచేస్తున్నట్లు మొహమ్మద్ యూనుస్ సర్కార్ మంగళవారం ప్రకటించిన వేళ ఆమె వీసా గడువను భారత్ తాజాగా పొడిగించడం గమనార్హం. ఆమెతోపాటు 75 మంది పాస్ట్‌పోర్ట్‌లను రద్దుచేస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది. -
భారత్‌పై ‘బంగ్లా’ విషం.. ఈ అంశాలతో స్పష్టం
ఒకప్పుడు భారత్‌తో చెలిమిచేసిన బంగ్లాదేశ్ ఇప్పుడు విషం చిమ్ముతోంది. ఆ దేశంలో హిందువులపై తరచూ దాడులు జరగుతున్నా మౌనం వహిస్తోంది. అక్కడి నేతలు అనునిత్యం భారత్‌పై నిరంకుశ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. అయినా బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ ఏమీ మాట్లాడటంలేదు. పైగా బంగ్లాదేశ్ హోమ్ మంత్రి అక్కడి సైన్యాన్ని భారత్ ముందు గట్టిగా నిలబెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు యూనస్ ప్రభుత్వం మాజీ ప్రధాని షేక్ హసీనాను భారత్ నుంచి రప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.షేక్ హసీనా అధికారానికి దూరమైన తర్వాత, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్‌కు ఏమాత్రం ఇష్టంలేని పలు నిర్ణయాలు తీసుకుంటోంది. అయినప్పటికీ భారత్ ఆ దేశంతో స్నేహపూర్వకంగానే మెలుగుతోంది. బంగ్లాదేశ్‌కు చెందిన పలువురు నేతలు తమ వ్యాఖ్యలతో విషం చిమ్ముతున్నా, భారత్ ఇంకా మాటల యుద్దం ప్రారంభించలేదు. భారత్.. బంగ్లాదేశ్ విషయంలో ఎంతో సంయమనం పాటిస్తోంది.బంగ్లాదేశ్‌లో భారత్‌కు వ్యతిరేకంగా..1. హిందువులపై దాడిబంగ్లాదేశ్లో హిందువులపై తరచూ దాడులు జరుగుతున్నాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం ఈ సంవత్సరంలో ఇప్పటివరకు బంగ్లాదేశ్‌లో హిందువులపై 2,200కి పైగా అఘాయిత్యాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. ఇది పాకిస్తాన్లో జరిగినదాని కంటే 10 రెట్లు అధికం.2. పాకిస్తాన్‌తో చెలిమిబంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ తాజాగా పాకిస్తాన్‌తో చెలిమి కోరుకుంటున్నారు. పాక్ నేతలతో సంబంధాలు నెరపుతున్నారు. పాకిస్తాన్ నుండి షిప్ కంటైనర్లు తరచూ చిట్టగాంగ్ నౌకాశ్రయానికి చేరుకుంటున్నాయి. పాక్ సైన్యం బంగ్లాదేశ్ ఆర్మీకి శిక్షణ ఇవ్వబోతోంది.3. సార్క్ పునరుద్ధరణకు యత్నంసౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్ (సార్క్)పై దృష్టి సారించడంపై భారత్ సుముఖంగా లేదు. అయతే బంగ్లాదేశ్ ప్రభుత్వం దానిని పునరుద్ధరణకు ప్రయత్నాలు సాగిస్తోంది.4. దౌత్య సంబంధాలను విచ్ఛిన్నంబంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌తో దౌత్య సంబంధాలను విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశ్యంలో ఉంది. ఈ నేపధ్యంలో బంగ్లాదేశ్ హైకమిషనర్ ప్రణయ్ వర్మను వెనక్కి పిలిపించింది. ఇలాగే మరో ఇద్దరు దౌత్యవేత్తలను కూడా వెనక్కి పిలిపించింది.5. సాధారణ సంబంధాలలోనూ..మన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ బంగ్లాదేశ్‌ను సందర్శించినప్పుడు, యూనస్ లేదా బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన సోషల్ మీడియా ఖాతాలలో ఇందుకు సంబంధించిన ఫొటో పోస్ట్ చేయలేదు. సాధారణ విధివిధానాలను కూడా బంగ్లాదేశ్ పాటించలేదు. ప్రధాని మోదీ బంగ్లా ప్రధాని యూనస్‌కు ఫోన్ చేసినప్పటికీ ఆయన చర్చల కోసం ఏ ప్రతినిధి బృందాన్నీ భారత్‌కు పంపలేదు. దీనిని చూస్తుంటే భారత్‌తో బంధాన్ని చెడగొట్టుకుంటోందని స్పష్టమవుతోంది.6. షేక్ హసీనా అప్పగింత షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు వెళ్లేందుకు భారత్ అంత తేలిగ్గా అనుమతించదని బంగ్లాదేశ్‌కు తెలుసు. అయినా భారత్ పరువు తీయాలనే ఉద్దేశంతో షేక్ హసీనాను రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. భారత్‌తో సంబంధాలు చెడగొట్టేందుకే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఇది కూడా కారణమేబంగ్లాదేశ్ ప్రజలు షేక్ హసీనాపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపధ్యంలో ఆమెకు ఆశ్రయం ఇచ్చిన భారత్‌పై మండిపడుతున్నారు. షేక్ హసీనాకు భారతదేశం మద్దతు ఇస్తున్నదని, అందుకే ఆమె నియంతగా మారిందని వారు ఆరోపిస్తున్నారు. ఇటువంటి సమయంలో ముహమ్మద్ యూనస్ ప్రభుత్వం అక్కడి ప్రజల కోపాన్ని చల్లార్చడానికి బదులుగా, రెచ్చగొట్టేటట్లు చేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.బంగ్లాదేశ్ ఈ తీరులో ప్రవర్తిస్తున్నా భారత్.. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాను దౌత్య ఆయుధంగా ఉపయోగించలేదు. ఆమెను అడ్డుపెట్టుకుని బంగ్లాదేశ్‌ను అస్థిరపరిచేందుకు ఎలాంటి ప్రణాళిక చేయలేదు. షేక్ హసీనాను మాజీ ప్రధానిగా గౌరవిస్తున్నామని, అందుకే కొత్త ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించామని భారత్ స్పష్టం చేసింది. రాజకీయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ముహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్‌లో తన అధికారాన్ని కాపాడుకోవాలని అనుకుంటున్నారు. అందుకే బంగ్లాదేశ్ వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకోకూడదని కోరుకుంటున్నారు.ఇది కూడా చదవండి: World Year Ender 2024: హద్దులు దాటిన విమర్శలు.. వివాదాల్లో రాజకీయ ప్రముఖులు -
హసీనా రూ. 41 వేల కోట్ల లంచం తీసుకున్నారు
ఢాకా: బంగ్లాదేశ్‌లోని ఏకైక అణు విద్యుత్ కర్మాగారం నిర్మాణంలో పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా రూ.41.46 వేల కోట్ల మేర లంచం తీసుకున్నారని ఆపద్ధర్మ ప్రభుత్వం ఆరోపించింది. దీనిపై అవినీతి నిరోధక విభాగం తాజాగా విచారణ చేపట్టినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. రూప్పూర్ అణు ప్లాంట్ డిజైన్, నిర్మాణ బాధ్యతలను రష్యా ప్రభుత్వ రంగ సంస్థ రోసటోమ్ తీసుకోగా, నిర్మాణ పనులను భారతీయ కంపెనీలు చేపట్టాయి.రూప్పూర్ పవర్ ప్రాజెక్ట్ నుంచి షేక్ హసీనా, ఆమె కుమారుడు జాయ్, బంధువు తులిప్ సిదిఖీలు మలేసియా బ్యాంకుకు చేసిన రూ.41.46 వేల కోట్ల బదిలీని అక్రమంగా ఎందుకు ప్రకటించలేదంటూ రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్ హైకోర్టు దేశ యాంటీ కరప్షన్ కమిషన్(ఏసీసీ)ను ప్రశ్నించిన నేపథ్యంలోనే ఈ దర్యాప్తు చేపట్టినట్లు మీడియా తెలిపింది.నేషనల్ డెమోక్రాటిక్ మూవ్మెంట్(ఎన్డీఎం) చైర్మన్ బాబీ హజాజ్ అవినీతి జరిగిందంటూ మొదటిసారిగా ఆరోపించారు. రూప్పూర్ అణు ప్లాంట్ నిర్మాణంలో అవినీతి అంటూ వచి్చన ఆరోపణలను రష్యా ప్రభుత్వ సంస్థ రోసటోమ్ తీవ్రంగా ఖండించింది. షేక్ హసీనా, సోదరి రెహానాతోపాటు ప్రస్తుతం భారత్‌లో ఉండగా, ఆమె కుమారుడు జాయ్ అమెరికాలో ఉంటున్నారు. వీరి బంధువు తులిప్ సిద్దిఖీ బ్రిటన్ ఎంపీగా వ్యవహరిస్తున్నారు.బంగ్లాదేశ్‌లో అల్లర్లు, హింసాత్మక ఘటనలపైనా ఆపద్ధర్మ ప్రభుత్వం హసీనాతోపాటు ఆమె కేబినెట్ సభ్యులు, ఇతర ఉన్నతాధికారులపైనా జన హననం కేసులు నమోదయ్యాయి. ఆమెను అప్పగించాలంటూ రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్‌లోని ఆపద్ధర్మ ప్రభుత్వం భారత్‌ను అధికారికంగా కోరడం తెలిసిందే. -
హసీనా అప్పగింత సాధ్యమేనా?
బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచీ మన దేశానికి తలెత్తుతున్న దౌత్య సమస్య లకు తాజాగా మరొకటి వచ్చిచేరింది. గత ఆగస్టు నుంచీ భారత్‌లో ఆశ్రయం పొందుతున్న తమ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని సోమవారం బంగ్లా విదేశాంగ శాఖ దౌత్య సందేశం పంపింది. హసీనా అవినీతి పాలనను వ్యతిరేకిస్తూ విద్యార్థుల నాయకత్వంలో జనాగ్రహం వెల్లువెత్తి ఆమె ఆ దేశం నుంచి నిష్క్రమించారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం వచ్చినప్పటినుంచీ మైనారిటీలకూ, హసీనా హయాంలో బాధ్యతలు నిర్వర్తించిన నేతలకూ, ఉన్నతాధికారులకూ గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. దాడులూ, దౌర్జన్యాలూ, నిర్బంధాలూ తప్పడం లేదు. ఆఖరికి న్యాయమూర్తుల్ని సైతం వెంటాడుతున్నారు. భయోత్పాతంలో ముంచెత్తుతున్నారు. చాలామంది అజ్ఞాతంలోకి పోయారు. దీన్నంతటినీ ఆపాలనీ, మైనారిటీలకు రక్షణ కల్పించాలనీ మన దేశం ఇప్పటికే బంగ్లా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కానీ కక్షపూరిత చర్యలు ఎక్కడా తగ్గిన దాఖలా లేదు. పైగా భారత మీడియా ఉన్నవీ లేనివీ కల్పించి తప్పుడు ప్రచారం చేస్తున్నదని అక్కడి ప్రభుత్వం ఆరోపిస్తోంది. అంతేకాదు... దానికి సమాంతరంగా అంతా బాగానే ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తోంది. ‘న్యూయార్క్ టైమ్స్’లో వచ్చిన కథనమే ఇందుకు ఉదాహరణ. విద్యార్థి బృందాలు దేశాభివృద్ధికి, అవినీతి అంతానికి ప్రణాళికలు వేస్తున్నట్టు ఆ కథనం సారాంశం. మైనారిటీలు సురక్షితంగా ఉన్నట్టు ఆ వర్గాలతోనే చెప్పించారు. నోబెల్ శాంతి బహుమతి పొందిన యూనస్ పాలన తీరుతెన్నులు గమనిస్తే పరిస్థి తులు ఆయన నియంత్రణలో ఉన్నట్టు కనబడదు. మైనారిటీల సంగతలావుంచి అసలు ముస్లిం మహిళలకే ఇబ్బందులు తప్పడం లేదు. మత ఛాందసవాదులు రంగంలోకి దిగి బురఖా ధరించని బాలికలనూ, మహిళలనూ నడిరోడ్లపై పంచాయతీలు పెట్టి హింసిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. హసీనా ఏలుబడిలో అవినీతి పెరిగిందనటంలో సందేహం లేదు. పదవి కాపాడుకొనేందుకు ఎన్నికల ప్రక్రియను ఏమార్చారన్న ఆరోపణల్లో కూడా నిజం వుంది. కానీ దానికి విరుగుడు ఈ అరాచకమా?!ప్రభుత్వాలను కూలదోసిన సందర్భాల్లో పాలకులు పరారీ కావటం, వేరేచోట ఆశ్రయం పొందటం అసాధారణమేమీ కాదు. హసీనా ఢిల్లీకి ఆదరా బాదరాగా వచ్చినా ఇక్కడినుంచి లండన్ వెళ్లాలని ప్రయత్నించారు. కానీ బ్రిటన్ ఆమె వినతిని తోసిపుచ్చింది. బంగ్లాలో హఠాత్తుగా బయ ల్దేరిన ఉద్యమానికి అమెరికా ఆశీస్సులున్నాయని ఆరోపణలొచ్చిన నేపథ్యంలో బ్రిటన్ ఆమె వినతిని తిరస్కరించటంలో వింతేమీ లేదు. కానీ ఆమెను అప్పగించాలని కోరిన వెంటనే మన ప్రభుత్వం అందుకు అంగీకరించటం సాధ్యమేనా? చట్టబద్ధ పాలన ఆనవాళ్లు లేవు సరికదా... ఎడాపెడా కక్షపూరిత విధానాలు అమలవుతున్నప్పుడు కోరిన వెంటనే ఒక మాజీ అధినేతను అప్ప గిస్తారని బంగ్లా ఎలా అనుకుంది? ఉగ్రవాదుల ఆటకట్టించేందుకు వీలుగా రెండు దేశాలూ 2013లో నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. తగిన సాక్ష్యాధారాలు అందజేశాకే నేరస్తుల్ని అప్పగించాలని ఉన్న నిబంధనను కాస్తా వారెంటు జారీ అయితే చాలు అప్పగించవచ్చని సవరిస్తూ 2016లో ఆ ఒప్పందాన్ని సరళం చేశారు. కానీ తనపై పెట్టిన కేసులు న్యాయసమ్మతమైనవి కాదని, అందువల్ల అప్పగింత వినతిని తిరస్కరించాలని హసీనా మన ప్రభుత్వాన్ని కోరుకోవచ్చు. రాజ కీయ కారణాలతో అప్పగించాలని కోరితే తిరస్కరించొచ్చని ఒప్పందంలోని నిబంధనలే చెబుతున్నాయి. సంక్లిష్టమైన ఈ ప్రక్రియంతా పూర్తికావటానికి సుదీర్ఘకాలం పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హసీనా విషయంలో అక్కడి న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా వ్యవహరిస్తుందన్న విశ్వాసం తమకు లేదని మన ప్రభుత్వం చెప్పే అవకాశం కూడా ఉంది. ఒకవేళ మన దేశం అందుకు సంసిద్ధత చూపినా హసీనా మన కోర్టుల్ని ఆశ్రయించి ఉపశమనం పొందుతారు. బ్రిటన్‌తో మనకు నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉన్నప్పటికీ రుణాలు తీసుకుని బ్యాంకులను వేలాది కోట్ల రూపాయల మేర మోసగించి పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యా వంటివారిని రప్పించటం అసాధ్యమవుతున్నది. మన దేశంలో ఉగ్రవాద ఘటనలకు పాల్పడి పరారీలో ఉన్న నేరగాళ్లను పట్టి అప్పగించటానికి కొన్ని యూరప్ దేశాలు నిరాకరిస్తున్నాయి. మన న్యాయవ్యవస్థ, జైళ్లు ప్రామాణికంగా లేవన్న కారణాలు చూపుతున్నాయి. అసలు తన ప్రస్థానం ఏ విధంగా కొనసాగించదల్చుకున్నదో బంగ్లాదేశ్ నిర్ధారించుకోవాలి. ఆ దేశ ఆవిర్భావానికి మూలకారణమైన ‘బెంగాలీ భావన’కు తూట్లు పొడిచే ప్రయత్నం జరుగుతోంది. బంగ్లా విముక్తిని తాము గుర్తించబోమని చెప్పే ఘనులు తయారవుతున్నారు. అడుగడుగునా మత ఛాందసుల ప్రాబల్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. మన దేశంతో సంబంధాల పునరుద్ధరణకు నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకొనేందుకు బంగ్లా ఇంతవరకూ సిద్ధపడలేదు. పైగా పాకిస్తాన్‌తో అంటకాగేందుకు ఉత్సాహపడుతోంది. 53 యేళ్ల క్రితం ఒక దేశంగా ఆవిర్భవించటానికి ముందు పాక్ సైనిక పాలకులు తమను ఎంత దారుణంగా అణచేశారో ఈ తరం మరిచిపోయి ఉండొచ్చు. 30 లక్షలమందికి పైగా ప్రజల బలిదానాలతో ఏర్పడిన దేశం కళ్లముందు కుప్పకూలుతుంటే నిశ్చేష్టులై ఉండిపోవటం విషాదకరం. అత్యంత విషమ పరిస్థితుల్లో కూడా ఎంతో అప్రమత్తతతో, వివేకంతో వ్యవహరించిన శ్రీలంక పౌరులను ఆదర్శంగా తీసుకుంటేనే దేశానికి మెరుగైన భవిష్యత్తు సాధ్యమవుతుందని బంగ్లా ప్రజలు తెలుసుకోవాలి. -
షేక్ హసీనాపై రూ. 500 కోట్ల అవినీతి ఆరోపణలు
ఢాకా : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) 5 బిలియన్ డాలర్ల అక్రమార్జనకు పాల్పడ్డారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. వీటిపై విచారణ చేపట్టాలని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు బంగ్లాదేశ్ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 160 కిలోమీటర్లు దూరంలో రష్యా ప్రభుత్వం పద్మ నది ఒడ్డున ఈశ్వర్ది జిల్లాలోని రూప్పూర్ వద్ద రూప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ (Rooppur Nuclear Power Plant) పేరుతో రెండు అణు విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తోంది. వాటిల్లో మొదటి అణు విద్యుత్ ప్లాంట్ కార్యకలాపాలు వచ్చే ఏడాదిలో ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ అణు విద్యుత్ ఏర్పాటులో షేక్ హసీనా భారీ మొత్తంలో అవినీతికి పాల్పడ్డారని ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.అనంతరం షేక్ హసీనాతో పాటు కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్, ఆమె మేనకోడలు, యూకే ట్రెజరీ మంత్రి తులిప్ సిద్ధిక్‌లను కూడా ప్రశ్నించేలా బంగ్లా మధ్యంతర ప్రభుత్వం రంగంలోకి దిగినట్లు మీడియా కథనాలు హైలెట్ చేస్తున్నాయి.అయితే రూప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ నిధుల్ని హసీనా, జాయ్, తులిప్‌లు మలేషియా బ్యాంకుకు 5 బిలియన్ డాలర్లను బదిలీ చేయడంపై స్థానిక హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. తాజా,విచారణలో భాగంగా నిధులు దుర్వినియోగం అవుతున్నా అవినీతి నిరోధక కమిషన్ (anti-corruption commission) ఎందుకు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుందని ప్రశ్నించింది. ఈ పరిణామం తర్వాతనే షేక్ హసీనాతో పాటు ఆమె కుటుంబ సభ్యులను విచారణకు మహ్మద్ యూనిస్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఏసీసీ నివేదిక ప్రకారం.. రూప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలను నేషనల్ డెమోక్రటిక్ మూవ్మెంట్ (ఎన్‌డిఎం) చైర్మన్ బాబీ హజ్జాజ్ వెలుగులోకి తెచ్చారు. -
‘షేక్ హసీనాను మాకు అప్పగించండి’
ఢాకా : మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని మహమ్మద్ యూనస్ నేృత్వంలోని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం భారత్‌కు లేఖ రాసింది. దీంతో ఇప్పటికే ఉన్న ఒప్పందం ప్రకారం షేక్ హసీనాను కేంద్రం బంగ్లాదేశ్‌కు అప్పగిస్తుందా? లేదా అనేది చర్చాంశనీయంగా మారింది. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా షేక్ హసీనా ప్రధాని పీఠం నుంచి దిగిపోవడమే గాక.. దేశాన్ని వీడారు. ఆగస్టు 5 నుండి భారత్‌లోనే నివాసం ఉంటుంన్నారు. ఈ తరుణంలో హసీనాను తమకు అప్పగించాలని మహమ్మద్ యూనస్ నేృత్వంలోని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం భారత్‌కు లేఖ రాసింది. Bangladesh's foreign adviser #TouhidHossain says #Dhaka has sent #DiplomaticNote to New Delhi for extradition of deposed PM @SheikhHasinaW. @MEAIndia pic.twitter.com/30mm1EvVra— Upendrra Rai (@UpendrraRai) December 23, 2024 ఆ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు పలువురు మాజీ కేబినెట్ మంత్రులు, సలహాదారులుపై మారణ హోమం కేసులు నమోదు చేసింది. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతుంది. తాజాగా, షేక్ హసీనాను విచారించేందుకు సిద్ధమైంది. భారత్‌లో ఉన్న ఆమెను తిరిగి స్వదేశానికి రప్పించే దిశాగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.ఇందులో భాగంగా ‘షేక్ హసీనాను తమకు అప్పగించాలని భారత్‌కు లేఖ రాసినట్లు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి తౌహిద్ హుస్సేన్ మీడియాతో మాట్లాడారు. తౌహిద్ హుస్సేన్ ప్రకటనకు ముందు.. మద్యంతర ప్రభుత్వ సలహాదారు జహంగీర్ అలం మాట్లాడుతూ.. హసీనాను ఇక్కడికి(బంగ్లాదేశ్) తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు తన కార్యాలయం లేఖ పంపిందని అన్నారు. ప్రస్తుతం, ప్రక్రియ కొనసాగుతుందని సూచించారు. అంతేకాదు బంగ్లాదేశ్,భారత్‌ల మధ్య అప్పగింత ఒప్పందం ఇప్పటికే ఉందని, ఆ ఒప్పందం ప్రకారం హసీనాను తిరిగి బంగ్లాదేశ్‌కు తీసుకురావచ్చని ఆలం చెప్పారు. మహ్మద్ యూనిస్ హెచ్చరికలు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం వీడడంతో అక్కడ మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే, ఈ తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వం వహిస్తున్నారు. తన నేతృత్వంలో ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వ పాలన 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మహ్మద్ యూనిస్.. మాజీ ప్రధాని షేక్ హసీనా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘జూలై-ఆగస్ట్‌లో జరిగిన ప్రతి హత్యకు మేము న్యాయం చేస్తాము. హత్యకు బాధ్యులైన వారిని విచారిస్తాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. దేశం వీడి భారత్‌కి వెళ్లిన హసీనా తిరిగి ఇక్కడికి రావాల్సిందే. శిక్షను అనుభవించాల్సిందేనని హెచ్చరించారు. -
సరైన దిశలో ఒక ప్రయత్నం
ఎట్టకేలకు ఒక అడుగు ముందుకు పడింది. బంగ్లాదేశ్‌లోని పరిస్థితి పట్ల తన మనోభావాలను భారత్ స్పష్టంగా పంచుకోగలిగింది. బంగ్లాదేశ్‌లోని మధ్యంతర సర్కారుకు ప్రధాన సలహాదారైన మహమ్మద్ యూనస్, బంగ్లా విదేశాంగ కార్యదర్శి మహమ్మద్ జషీముద్దీన్ తదితరులతో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఢాకాలో సమావేశమవడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయాక రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న వేళ భారత్ నుంచి తొలిసారిగా ఓ ఉన్నతాధికారి బంగ్లా వెళ్ళడం, దౌత్య భేటీ జరపడం విశేషమే. ఇటు హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడం, అటు బంగ్లాలో అల్పసంఖ్యాక హిందువులపై దాడులతో ద్వైపాక్షిక సంబంధాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పరిస్థితుల్లో తాజా భేటీలో ఇరుపక్షాలూ నిర్మొహమాటంగా పరస్పరం అభిప్రాయాలు పంచుకోవడం సరైన దిశలో పడిన అడుగు. హసీనా హయాంతో పోలిస్తే, భారత్ పట్ల పెద్ద సానుకూలత లేని సర్కారు బంగ్లాలో ప్రస్తుతం నెలకొన్నందున తాజా దౌత్యయత్నాలు కీలకం. చారిత్రకంగా మిత్రత్వం, పరస్పర ప్రయోజనాలున్న పొరుగు దేశాలు అపోహలు, అనుమానాలు దూరం చేసుకోవడానికి ఇవి ఏ మేరకు ఉపకరిస్తాయో చూడాలి. బయట ఉద్రిక్త వాతావరణం ఉన్న సమయంలో జరిగిన ఈ చర్చలు మైనారిటీలపైన, హిందూ ఆలయాలపైన దాడులు, రాజద్రోహ నేరంపై హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు సహా అనేక వివాదాస్పద అంశాలపై దృష్టి సారించాయి. రెండు కోట్ల పైగా హిందువులున్న ముస్లిమ్ మెజారిటీ దేశంలో మైనారిటీల భద్రతపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తే, ఆ ఘటనలు రాజకీయమైన వంటూ బంగ్లా వాదించింది. ప్రజల భావోద్వేగాలు, రాజకీయ ప్రయోజనాలు కలగలిసినప్పుడు పరస్పర భిన్న వాదనల మధ్య రాజీ కుదర్చడం కష్టమే. కానీ, విదేశాంగ శాఖ కార్యదర్శుల భేటీతో చిరు ప్రయత్నమైనా సాగడం విశేషం. బంగ్లాదేశ్ సైతం ఇప్పటికైనా కళ్ళు తెరిచి, జరుగుతున్నదే మిటో గ్రహించి, అసలంటూ సమస్య ఉన్నదని గుర్తించడానికి ఈ భేటీ ప్రేరేపిస్తే మంచిదే. 1971 నాటి బంగ్లాదేశ్ విముక్తి పోరులో భారత్ పాత్ర మరపురానిది. అదే సమయంలో స్వాతంత్య్రం ముందు నుంచి చారిత్రకంగా ఉన్న అనుబంధం రీత్యా సాహిత్య, ఆర్థిక, ఆధ్యాత్మిక, రాజకీయ పరంగా ఆధునిక భారతావని రూపుదిద్దుకోవడంలో బంగాళ ప్రాంతపు భాగ స్వామ్యం అవిస్మరణీయమే. బ్రిటీషు కాలం నుంచి భౌగోళిక రాజకీయాలు, సామాజిక సాంస్కృతిక కారణాలతో ముడిపడిన భారత – బంగ్లా బంధం ఇటీవలి ఉద్రిక్తతల నడుమ నలిగిపోతోంది. ఇరుదేశాల మధ్య 4,096 కి.మీల ఉమ్మడి సరిహద్దుంది. ప్రపంచంలోనే సుదీర్ఘమైన అయిదో సరిహద్దు ఇది. పైగా, చాలా ప్రాంతంలో పూర్తిస్థాయిలో సరిహద్దుల గుర్తింపు జరగనేలేదు. సరిహద్దులో నెలకొన్న పశ్చిమ బెంగాల్‌లోని ఒక్క పెట్రాపోల్ వద్దనే రెండు దేశాల మధ్య భూమార్గ వాణిజ్యంలో 30 శాతం జరుగుతుంది. ఏటా సుమారు 23 లక్షల మంది సరిహద్దులు దాటి, భారత్‌కు వైద్య చికిత్సకు వస్తుంటారు. కాబట్టి, ఇటీవలి ఉద్రిక్తతల్ని దాటి వాణిజ్యం, ఇంధనం, సహకారం, సామర్థ్యాల పెంపు దలను బంగ్లా చూడగలగాలి. ఇరుదేశాలూ చేతులు కలిపి అడుగులు వేస్తేనే అభివృద్ధి సాధ్యం. ఉల్లిపాయలు, బంగాళదుంపలు, వెల్లుల్లి లాంటి నిత్యావసర వస్తువుల విషయంలో ఢిల్లీ పైనే ఢాకా ఆధారపడి ఉంది. కానీ, తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశం దేశీయ ఉత్పత్తిని పెంచుకొని, ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తోంది. ఇక, బంగ్లా రోగులకు శస్త్రచికిత్స చేసేది లేదంటూ కొన్ని భారతీయ ఆస్పత్రులు అమానవీయంగా, మూర్ఖంగా వ్యవహరించడం సమర్థనీయం కాదు. ఈ చర్యల వల్ల బంగ్లా దేశీయులు ఇప్పుడు మలేసియాను ఆశ్రయిస్తున్నట్టు వార్త. ఇలాంటివన్నీ దీర్ఘకాలంలో భారత ప్రయోజనాలకే దెబ్బ. అసలు మిగతా ప్రపంచంతో భారత వాణిజ్యంతో పోలిస్తే, సరుకుల్లో భారత – బంగ్లాల ద్వైపాక్షిక వాణిజ్యం వేగంగా వృద్ధి చెందింది. అనేక అంశాలు ముడిపడి ఉన్నందున తెగేదాకా లాగడం ఇరుపక్షాలకూ మంచిది కాదు. కొత్త వాస్తవాలను గుర్తించక ఒకవేళ మనం ఇదే వైఖరితో ముందుకు సాగితే చివరకు నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, మాల్దీవులు, మయన్మార్ వరుసలోనే బంగ్లాదేశ్ సైతం ఢిల్లీకి దూరమవుతుంది. పొరుగున మిత్రులెవరూ లేని దుఃస్థితి భారత్‌కు దాపురిస్తుంది. యూనస్ సారథ్యంలోని ప్రస్తుత బంగ్లా సర్కార్ పాక్‌కు చేరువవుతోంది. ఇటీవల రెండు దేశాల మధ్య వీసాల ఎత్తివేత, రక్షణ ఒప్పందాలు, కరాచీ నుంచి పాకిస్తానీ సరుకుల రవాణా నౌకను చిట్టగాంగ్ వద్ద లంగరేసుకునేందుకు అనుమతించడం లాంటివి చూస్తే అదే అనిపిస్తోంది. దాదాపు 47 ఏళ్ళ తర్వాత రెండు దేశాల మధ్య నేరుగా సముద్ర నౌకాయాన సంబంధాల పునరుద్ధరణకు ఇది ఒక సూచన. వ్యూహాత్మకంగా సుస్థిర దక్షిణాసియాకు కట్టుబడ్డ భారత్ జాగ్రత్తగా అడుగులు వేయాలి. బంగ్లా అంతర్గత రాజకీయాల్లోకి అతిగా జొరబడి, ప్రస్తుత హయాం నమ్మకాన్ని పోగొట్టు కోరాదు. ఈ పరిస్థితుల్లో భారత విదేశాంగ కార్యదర్శి ఢాకా పర్యటన ఇరుగుపొరుగు బాంధవ్యం, భాగస్వామ్యాల ప్రాధాన్యాన్ని గుర్తించినట్టే అనిపిస్తోంది. బంగ్లా సైతం ముందుగా తన అంతర్గత వ్యవహారాలను చక్కదిద్దుకోవాలి. ఆ దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొంటే, మైనారిటీలు సురక్షితంగా ఉంటే, పాత బంధం మళ్ళీ మెరుగవుతుంది. వెరసి, భారత్ – బంగ్లాలు ప్రస్తుతం నాలుగురోడ్ల కూడలిలో నిలిచాయి. మనసు విప్పి మాట్లాడుకొని, పరస్పర ప్రయోజనాల్ని కాపాడుకుంటే మేలు. అలాకాక సహకార మార్గం బదులు సంఘర్షణ పథాన్ని ఎంచుకుంటే ఇరువురికీ చిక్కే! -
సంబంధాల్లో సహనం అవసరం
షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసినప్పటి నుండీ... హింస, అశాంతితో బంగ్లాదేశ్ అతలాకుతలమవుతోంది. విస్తృత సరిహద్దు రీత్యా, అక్కడి పాలనా విధానాలు మన దేశ భద్రతపై కీలక ప్రభావం చూపుతున్నాయి. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడంలో భారత్ పాత్ర ఉన్నప్పటికీ, ఇరు దేశాల సంబంధాలు హెచ్చు తగ్గులను చూస్తూ వచ్చాయి. ఇటీవల శ్రీలంక, మాల్దీవులు, నేపాల్ లాంటి పొరుగు దేశాలతో దెబ్బతిన్న సంబంధాలను విజయవంతంగా నిర్వహించిన అనుభవంతో భారత్ పాఠాలు నేర్చుకోవాలి. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే ప్రక్రియలో తోడ్పాటు అందించాలి. హసీనాకు ఏకపక్ష మద్దతివ్వడం వల్ల మన ఉద్దేశ్యాలపై అనుమానం ఏర్పడిందనీ, మన విధానాలను దిద్దుకోవాల్సిన అవసరం ఉందనీ అర్థం చేసుకోవాలి.షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఒక ప్రజా తిరుగుబాటుతో కూల్చివేసినప్పటి నుండీ, హింస, అశాంతితో బంగ్లాదేశ్ అతలాకుతలమవుతోంది. అక్కడి మైనా రిటీ హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ సంఘటనల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం ‘మైనారిటీలతో సహా బంగ్లాదేశ్ పౌరులందరి భద్రతకు, రక్షణకు ప్రాథమిక బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వానిదే’ అని స్పష్టం చేసింది.బంగ్లాదేశ్ పరిణామాలను రెండు రకాలుగా చూడవచ్చు. మొదటిది, హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వ ఉక్కు పాదాన్ని తొలగించిన తర్వాత... ఇస్లామిస్టులు, పాకిస్తాన్ కి చెందిన ఇంటర్–సర్వీసెస్ ఇంటెలిజెన్ ్స (ఐఎస్ఐ) పట్టు సాధించారు. ఈ క్రమంలో హిందూ మైనారిటీలు హింసకు గురవుతున్న సందర్భంగా ఆ దేశం పాక్షిక అరాచక స్థితికి చేరుకుంటోంది. రెండవ పరిణామం ఏమంటే, గత దశాబ్ద కాలంగా నిజమైన ప్రజాస్వామ్యం లేని బంగ్లా దేశ్, తాత్కాలిక ప్రభుత్వ ఆధ్వర్యంలో అడుగులేయడానికి ప్రయ త్నిస్తూ ఒక తాత్కాలిక దశ గుండా పయనిస్తోంది.సరిహద్దుల చుట్టూ?బంగ్లాదేశ్ బహుశా దక్షిణాసియాలో భారతదేశానికి అత్యంత పర్యవసానాలతో కూడిన పొరుగు దేశం. దాని సరిహద్దులను దాదాపు భారత్ పరివేష్టించి ఉంది. 4,367–కిలోమీటర్ల సరిహద్దులో, కేవలం 271 కిలోమీటర్లు మాత్రమే మయన్మార్‌తో ఉండగా, మిగిలిన 4,096 కిలోమీటర్లు భారతదేశంతో ఉంది. త్రిపుర, మిజోరాం, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో ఆ దేశం సరిహద్దులను కలిగి ఉంది. అందుకే ఈశాన్య ప్రాంతపు ఆర్థిక అభివృద్ధి, భద్రతకు ఇది కీలకం. బంగ్లాదేశ్ సరిహద్దు స్వభావాన్ని బట్టి చూస్తే, దానిని పూర్తిగా మూసివేయడం చాలా కష్టం. ఫలితంగా, ఆ దేశంలోని వివిధ ప్రభు త్వాల పాలనా విధానాలు మన దేశ భద్రతపై కీలక ప్రభావం చూపు తున్నాయి. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడంలో భారత్ పాత్ర ఉన్నప్పటికీ, ఇరు దేశాల సంబంధాలు హెచ్చు తగ్గులను చూస్తూ వచ్చాయి. నియంతలైన జియావుర్ రెహ్మాన్, హెచ్ఎమ్ ఎర్షాద్ తమ నియంత్రణను కొనసాగించే ప్రయత్నంలో దేశంలో ఇస్లా మీకరణను ప్రోత్సహిస్తూ వచ్చారు. దీంతో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో ఈ ఎగుడు దిగుళ్లు తప్ప లేదు. పాకిస్తాన్ లాగే, జమాత్–ఎ–ఇస్లామీ కూడా బంగ్లాదేశ్ స్వాతంత్య్ర ఉద్యమానికి వ్యతిరేకంగా పోరాడినప్పటికీ, ఈ ప్రక్రియలో అది గణనీయమైన పాత్ర పోషిస్తూనే పెరిగింది.భారత వ్యతిరేక గ్రూపులుఅయితే, బంగ్లాదేశ్‌లో జరుగుతున్నది కేవలం భారతదేశానికి సంబంధించినది మాత్రమే కాదు... చైనా, మయన్మార్, ఆగ్నేయాసి యాతో సహా విస్తృత ప్రాంతంపై దీని ప్రభావం ఉంటోంది. దాని అతి పెద్ద ముస్లిం జనాభాలో పెరిగిపోతున్న సమూల మార్పువాదం (రాడి కలైజేషన్) విస్తృత ప్రపంచ పరిణామాలను కలిగి ఉంటుంది. జమాత్–ఎ–ఇస్లామీతో పాటు, హర్కత్–ఉల్–జిహాద్–అల్–ఇస్లామీ, జమాత్–ఉల్–ముజాహిదీన్ బంగ్లాదేశ్, అలాగే అల్–ఖైదా, ఇస్లామిక్ స్టేట్ల వంటి ఇతర రాడికల్ గ్రూపులు కూడా ఆ దేశంలో ఉన్నాయి. మదర్సా నాయకుల నెట్వర్క్ అయిన హెఫాజత్–ఎ–ఇస్లాం కూడా దేశంలో షరియా పాలనను కోరుకుంటూ, అక్కడ లౌకిక రాజకీయ స్థాపనను వ్యతిరేకిస్తోంది.బేగం ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ)తో జమాత్–ఎ–ఇస్లామీ పొత్తు పెద్ద సమస్యగా మారింది. తత్ఫలితంగా, 1991–96లోనూ 2001–06లోనూ ఖలీదా జియా ప్రధానమంత్రిగా ఉన్న పదవీకాలం అనేది... దాదాపుగా ఐఎస్ఐ, ఈశాన్య ప్రాంతంలో భారతదేశానికి వ్యతిరేకంగా క్రియాశీలంగా ఉన్న తిరుగుబాటు గ్రూపుల వర్గానికి విశృంఖల స్వేచ్ఛను ఇచ్చింది. 2009లో హసీనా ప్రభుత్వ స్థాపనతో భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య సంబంధం స్థిరపడింది. మరీ ముఖ్యంగా, ఇది ఐఎస్ఐ లేదా వివిధ ఈశాన్య తిరుగుబాటు గ్రూపులు, బంగ్లాదేశ్ భూభాగాన్ని భారత వ్యతిరేక శక్తులకు ఉపయోగించడాన్ని తనిఖీ చేయడంలో సహాయపడింది. రెండు దేశాలను కలిపే భూ మార్గాలను తిరిగి తెరవడానికీ, బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, నేపాల్ గుండా ప్రాంతీయ ట్రాఫిక్ కదలికను ప్రోత్సహించేందుకు మోటార్ వాహ నాల ఒప్పందంపై సంతకం చేయడానికీ ఈ పరిణామం దారి తీసింది.మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రం పక్కనే బంగాళాఖాతం శిఖర ప్రాంతంలో ఉన్న బంగ్లాదేశ్ స్థానాన్ని ఉపయోగించుకోవడంతో పాటు, భారతదేశాన్ని నియంత్రించడం అనే తన పెద్ద విధానంలో భాగంగా చైనా తొలి నుంచి బంగ్లాదేశ్‌పై గణనీయమైన ఆసక్తిని పెంచుకుంది. ఇక్కడ చైనా ముఖ్యమైన పెట్టుబడులను కలిగి ఉంది. ఇక్కడి నుండి ఒక పైప్‌లైన్ మలక్కా జలసంధిని దాటవేస్తూ చైనాలోని యునాన్‌కు క్యుక్పియు నౌకాశ్రయం నుండి చమురును తీసుకు వెళుతుంది. బంగ్లాదేశ్‌లో వంతెనలు, రోడ్లు, పవర్ ప్లాంట్లను నిర్మించడంలో చైనా ప్రభుత్వం పెద్ద మొత్తంలో డబ్బును పెట్టుబడి పెట్టింది. అంతేకాకుండా దేశానికి అతిపెద్ద సైనిక సరఫరాదారుగా కూడా అవతరించింది.భారత్ చేయాల్సింది!పైన ఉదహరించిన అనేక కారణాల వల్ల, బంగ్లాదేశ్‌లోని వ్యవహా రాలను భారత్ చాలా జాగ్రత్తగా నిర్వహించాలి. పరిస్థితి చాలా అస్థిరంగా ఉంది. అక్కడ పరిస్థితులు అదుపు తప్పవచ్చు కూడా. ఫలితంగా భారతదేశానికి ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి. అక్కడి ప్రజా ఉద్యమంపై భారత వ్యతిరేక కథనాన్ని రుద్దేందుకు ఐఎస్ఐ ఓవర్‌టైమ్ పని చేసే అవకాశం ఉండటంతో పరిస్థితి మరింత జఠిలమైంది.ఇటీవల పొరుగు దేశాలతో దెబ్బతిన్న సంబంధాలను విజయ వంతంగా నిర్వహించడం నుండి భారతదేశం పాఠాలు నేర్చుకోవాలి. ఆర్థిక సంక్షోభం సమయంలో శ్రీలంకకు ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా, భారత్ గణనీయంగా మంచిపేరు సాధించింది. దీనివల్ల అనూర కుమార దిస్సనాయకే ప్రభుత్వంలో ప్రయోజనాలను పొందు తున్నాం. అదేవిధంగా, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజూతో ప్రశాంతంగా వ్యవహరించడం ద్వారా, ఆయన ప్రచారం చేసిన ‘భారత్ వైదొలిగిపో’ వ్యూహాన్ని మట్టుబెట్టింది.నేపాల్లోనూ ఇలాంటి ప్రయోజనాలే కనిపిస్తున్నాయి. చైనాలో అధికార పర్యటనలో ఉన్న భారత వ్యతిరేక ప్రధాని కేపీ శర్మ ఓలీ, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద బీజింగ్‌తో తమ దేశం ఎలాంటి కొత్త రుణ ఒప్పందంపై సంతకం చేయదని ముందే స్పష్టం చేశారు. నిజానికి, నేపాలీలు తమ దేశంలో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పరిధిని తగ్గించే కొత్త ఒప్పందంపై చైనాతో సంతకం చేయాలనుకుంటున్నారు.బంగ్లాదేశ్‌తో కూడా భారతదేశం వ్యూహాత్మక సహన విధానాన్ని అనుసరించాలి. బంగ్లాదేశ్ పరివర్తనలో ఉన్న దేశం. అక్కడ ప్రజా స్వామ్యాన్ని పునరుద్ధరించే ప్రక్రియకు న్యూఢిల్లీ మద్దతు ఇవ్వాలి.హిందువులపై దాడులను అతిగా చూసే ధోరణి నెలకొంది. ప్రారంభంలో కాస్త పెరిగిన తర్వాత, అటువంటి దాడులు ఇప్పుడు తగ్గాయి. మనం హసీనాకు ఏకపక్షంగా మద్దతు ఇవ్వడం వల్ల మన ఉద్దేశ్యాలపై అనుమానం ఏర్పడిందనీ, మన బంగ్లాదేశ్ విధానానికి దిద్దుబాటును అందించాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి.మనోజ్ జోషి వ్యాసకర్త ‘అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్’లో డిస్టింగ్విష్డ్ ఫెలో(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
బంగ్లాదేశ్‌లో దాడుల సూత్రధారి యూనస్ ప్రభుత్వమే: షేక్ హసీనా
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు కారణం ప్రధాని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానిదేనని ఆరోపించారు ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా. బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై లక్ష్యంగా చేసుకొని బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. న్యూయార్క్‌లో జరిగిన అవామీ లీగ్ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న షేక్ హసీనా ప్రసంగిస్తూ.. బంగ్లాలో హిందూ దేవాలయాలు, చర్చీలు, ఇస్కాన్‌పై వరుస దాడుల నేపథ్యంలో యూనస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.‘నాపై సామూహిక హత్యల ఆరోపణలు వచ్చాయి. కేసులు కూడా నమోదు చ ఏశారు కానీ వాస్తవానికి విద్యార్ధి సంఘాలతో కలిసి పక్కా ప్రాణాళికతో సామూహిక హత్యలకు పాల్పడింది మహమ్మద యూనస్. వారే సూత్రధారులు.. దేశంలో ఇలాగే మరణాలు కొనసాగితే ప్రభుత్వం మనుగడ సాగదని లండన్‌లో ఉన్న తారిక్ రెహమాన్(బీఎన్పీ నాయకుడు, ఖలీదాజియా కుమారుడు) కూడా చెప్పాడు. దేశంలో మైనారిటీలు, ఉపాధ్యాయులు, పోలీసులు అందరిపై దాడి చేసి చంపేస్తున్నారు. హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. చర్చిలు, అనేక దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. వీటన్నింటికీ మాస్టర్‌మైండ్ యూనసే. బంగ్లాదేశ్‌లో మైనారిటీలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు’ షేక్ హసీనా ప్రశ్నించారు. ఈసందర్భంగా తాను దేశాన్ని ఎందుకు వీడాల్సివచ్చిందో ఆమె మరోసారి వివరించారు. ‘‘నా తండ్రిలాగే నన్నూ హత్య చేసేందుకు కుట్రలు జరిగాయి. వాటిని ఎదుర్కోవడం నాకు 25-30 నిమిషాలు పట్టదు. నా భద్రతా సిబ్బంది కాల్పులు జరిపి ఉంటే.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేవారు. కానీ, ఊచకోతను నేను కోరుకోలేదు. నేను అధికారం కోసం అక్కడే ఉంటే మారణహోమం జరిగేది. ప్రజలను విచక్షణారహితంగా చంపేస్తుండటంతోనే దేశం విడిచివెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా. అందుకే ఆందోళనకారులపై కాల్పులు జరపొద్దని నా భద్రతా సిబ్బందికి చెప్పా’’ అని తెలిపారు. బంగ్లాదేశ్‌లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు అధికమయ్యాయి. దీనిని నిరసిస్తూ హిందువులు శాంతియుత నిరసనలు చేపట్టారు. అయితే ఇటీవల ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ఠ్తో ఈ ఆందోళనలు మరింత తీవ్రతరమయ్యాయి.అక్టోబరు 25న బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న కృష్ణదాస్.. ఆ దేశ జెండాను అగౌరవపరిచారన్న ఆరోపణలతో అదే నెల 30న కృష్ణదాస్‌తో పాటు 18 మందిపై కేసు నమోదు చేశారు. ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో కృష్ణదాస్‌ను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో చెలరేగిన ఘర్షణల్లో ఓ న్యాయవాది ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు ఇస్కాన్‌తో సంబంధమున్న మరో 17మందికి బ్యాంకు ఖాతాల లావాదేవీలను నెల రోజుల పాటు నిలిపివేయాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై జరుగుతోన్న దాడులకు వ్యతిరేకంగా పలు సంఘాలు నిరసనలు చేపడుతున్నాయి. కాగా బంగ్లాదేశ్ పరధానిగా ఉన్న షేక్ హసీనా గత ఆగస్టులో తిరుగుబాటు, కుట్ర కారణంగా దేశం వీడి భారత్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. అనంతరం ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం దేశ బాధ్యతలను చేపట్టింది. తిరుగుబాటు సమయంలో జరిగిన మరణాలకు సంబంధించిన నేరాభియోగాలపై విచారణ నిమిత్తం హసీనాను అప్పగించాలని బంగ్లా డిమాండ్ చేస్తోంది. అమె అరెస్టుకు ఇంటర్ పోల్ సాయమూ కోరింది. -
చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ ను ఖండించిన షేక్ హసీనా, మమతా బెనర్జీ
-
హసీనా కోసం ఇంటర్‌పోల్ సాయం కోరుతాం: బంగ్లాదేశ్ ప్రభుత్వం
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాను భారతదేశం నుంచి స్వదేశానికి రప్పించేందుకు ఇంటర్‌పోల్ సహాయం కోరనున్నట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం వెల్లడించింది. పలు నేరారోపణలపై విచారణను ఎదుర్కొనేందుకు ఆమెను బంగ్లా రప్పించేందుకు అక్కడి సిద్ధమైంది. 77 ఏళ్ల అవామీ లీగ్ చీఫ్, ఆమె పార్టీ నాయకులు విపక్ష-వ్యతిరేక విద్యార్థుల ఉద్యమాన్ని క్రూరంగా అణిచివేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇక.. దీని ఫలితంగా జూలై-ఆగస్టులో విద్యర్థుల నిరసనల సందర్భంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్యమం కాస్త పెద్ద ఎత్తున తిరుగుబాటుకు దారితీయటంతో ఆగస్టు 5న హసీనా రహస్యంగా భారతదేశానికి పారిపోవాల్సి వచ్చింది.మరోవైపు..విద్యార్థుల నిరసనల సందర్భంగా కనీసం 753 మంది మరణించగా.. వేలాది మంది గాయపడ్డారని ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తెలిపింది. హసీనా, ఆమె అవామీ లీగ్ నాయకులపై అంతర్జాతీయ క్రైమ్స్ ట్రిబ్యునల్, ప్రాసిక్యూషన్ బృందానికి అక్టోబర్‌లో పలు నేరాలు, మారణహోమంపై 60కి పైగా ఫిర్యాదులు దాఖలు అయ్యాయని బంగ్లా ప్రభుత్వం పేర్కొంది.‘‘త్వరలో ఇంటర్‌పోల్ ద్వారా హసీనాకు రెడ్ నోటీసు జారీ చేయనున్నాం. పారిపోయిన ఫాసిస్టులు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నప్పటికీ.. తిరిగి బంగ్లాకు తీసుకువచ్చి కోర్టులో నెలబెడతాం’’ అని న్యాయ వ్యవహారాల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ తెలిపారు. బంగ్లాదేశ్ ప్రభుత్వ అధికారుల ప్రకారం.. రెడ్ నోటీసు అనేది అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్ కాదు. అప్పగించడం, లొంగిపోవడం లేదా చట్టపరమైన చర్యలు పెండింగ్‌లో ఉన్న వ్యక్తిని గుర్తించి, తాత్కాలికంగా అరెస్టు చేయాలని చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు పెట్టుకొనే అభ్యర్థన మాత్రమే. ఇక.. ఇంటర్‌పోల్ సభ్య దేశాలు తమ జాతీయ చట్టాల ప్రకారం రెడ్ నోటీసులను అమలు చేస్తాయని అధికారులు తెలిపారు.చదవండి: రష్యాకు ‘అక్టోబర్’ షాక్.. రోజుకు 1500 మంది సైనికుల మృతి! -
బంగ్లా: అవామీ లీగ్ ర్యాలీ.. ఢాకాలో ఉద్రిక్తత
ఢాకా: బంగ్లాదేశ్‌లో నూర్ హుస్సేన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని షేక్ హాసినా అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులు చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారినట్లు అక్కడి మీడియా పేర్కొంది. షహీద్ నూర్ హొస్సేన్ స్క్వేర్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించాలని అవామీ లీగ్ పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో పలువురు అవామీ లీగ్ మద్దతుదారులపై దాడి జరిగినట్లు వెల్లడించింది. బంగాబంధు అవెన్యూలోని షేక్ హసీనా పార్టీ కేంద్ర కార్యాలయం ముందు ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇక.. మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం ఆగస్టు 5న తిరుగుబాటు ద్వారా పతనమైన అనంతరం ఇవాళ(ఆదివారం) నూర్ హుస్సేన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించాలని అవామీ లీగ్ పార్టీ మొదటిసారి నిర్ణయం తీసుకుంది. విమోచన యుద్ధం విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలను విశ్వసించే సాధారణ ప్రజలు, కార్యకర్తలను నూర్ హుస్సేన్ చత్తర్ (జీరో పాయింట్) వద్ద మార్చ్‌లో చేరాలని పార్టీ ఆహ్వానించింది. ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను తొలగించి బంగ్లాదేశ్ అవామీ లీగ్ నాయకత్వంలో ప్రజాస్వామ్య పాలనను పునఃస్థాపన చేయాలని కూడా పిలుపునిచ్చింది.Despite suppression from 32 political groups, police, 191 platoons of BGB, the army, and espionage, the AL has marched across the zero point. These are not corrupt people; they’ve received no rewards from the AL in the past decade. Yet, today, they’re struggling for it! pic.twitter.com/Q9Q1JmY8YW— Tasin Mahdi 🇧🇩 (@in_tasin) November 10, 2024అయితే.. ఈ ప్రకటన వెలువడిన వెంటనే బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం నిరసన ర్యాలీకి అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న అవామీ లీగ్ ఫాసిస్ట్ పార్టీ.. ఈ ఫాసిస్ట్ పార్టీ బంగ్లాదేశ్‌లో నిరసనలు నిర్వహించేందుకు అనుమతించేది లేదని యూనస్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం అన్నారు. రాజకీయ కార్యకర్త, అవామీ లీగ్ యువజన ఫ్రంట్, జూబో లీగ్ నాయకుడు నూర్ హొస్సేన్ నవంబర్ 10, 1987న ఎర్షాద్ వ్యతిరేక ఉద్యమంలో హత్యకు గురయ్యాడు.చదవండి: ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. ట్రంప్ మరో కీలక నిర్ణయం -
బంగ్లా మాజీ ప్రధాని షేక్ హాసీనాపై అరెస్ట్ వారెంట్
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పై అరెస్టు వారెంట్ జారీ అయింది. నవంబర్ 18న కోర్టుకు హాజరుకావాలని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఆదేశించింది. వచ్చే నెల 18లోగా ఆమెను అరెస్టు చేసి తమ ఎదుట హాజరు పరచాలని ఐసీటీ చీఫ్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ తజుల్ ఇస్లాం ఆదేశించారు. రిజర్వేషన్లపై విద్యార్థుల నిరసనలు హింసాత్మకంగా మారడంతో.. ప్రధానిగా ఉన్న షేక్‌హసీనా పదవి నుంచి వైదొలిగారు. ప్రస్తుతం ఆమె భారత్‌లో తలదాచుకుంటున్నారు.జులై 15 నుంచి ఆగస్టు 5 వరకు జరిగిన మారణహోమం, ఇతర నేరాల ఆరోపణలపై హసీనాకు వ్యతిరేకంగా ఐసీటీకి అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందగా, వాటిపై ట్రైబ్యునల్ ఇటీవల విచారణ ప్రారంభించింది. మరోవైపు ఆమె దౌత్య పాస్‌పోర్టు కూడా రద్దయింది.హసీనా పాలనపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు ఆమె భారత్‌లో ఉండటాన్ని వ్యతిరేకిస్తుండగా, భారత్‌లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనాను తమకు అప్పగించాలని అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) భారత్‌ను ఇటీవల కోరింది.ఆమెను బంగ్లాకు అప్పగించాలని ఆ పార్టీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్ డిమాండ్ చేశారు. రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల నేతృత్వంలోని నిరసనలను ఆమె అడ్డుకోవడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ కోటా విషయంలో చెలరేగిన అల్లర్లకు సంబంధించి ఆమెపై నమోదైన హత్య కేసుల్లో విచారణ ఎదుర్కొవల్సిందేనని బీఎన్పీ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: కెనడా ప్రధాని ఓవరాక్షన్.. ఖండించిన భారత్ -
హసీనా మౌనంగా ఉంటే మంచిది
ఢాకా: బంగ్లాదేశ్‌ను వీడిన మాజీ మహిళా ప్రధాని షేక్ హసీనా భారత్‌లో ఉన్నంతకాలం మౌనంగా ఉంటే మంచిదని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మొహమ్మద్ యూనుస్ హెచ్చరించారు. హసీనా బంగ్లాదేశ్‌ను వీడాక చెలరేగిన అల్లర్లలో చనిపోయిన వారికి న్యాయం జరగాలని ఆగస్ట్ 13వ తేదీన హసీనా డిమాండ్ చేయడంపై యూనుస్ ఘాటుగా స్పందించారు. గురువారం ఢాకాలోని తన అధికార నివాసంలో పీటీఐతో ఆయన ముఖాముఖి మాట్లాడా రు. ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..అప్పగింత కోరేదాకా మౌనంగా ఉండాల్సిందే‘‘హసీనాను అప్పగించాలని మేం భారత్‌ను మేం కోరేదాకా ఆమె అక్కడ ఎలాంటి వ్యాఖ్యానాలు చేయొద్దు. మౌనమే మేలు. ఇక భారత్ సైతం ఒక విషయం గుర్తుంచుకోవాలి. హసీనా లేకపోయి ఉంటే మా దేశం అఫ్గానిస్తాన్‌లా తయారవుతుందన్న అభిప్రాయాలు మార్చుకోవాలి. హసీనాకు చెందిన ఆవామీ లీగ్ పార్టీ తప్ప బంగ్లాదేశ్‌లోని ప్రతి రాజకీయ పార్టీ ఇస్లామిక్ పార్టీ అనే భావననూ భారత్ విడనాడాలి. భారత్‌లో ఉంటూ ఆమె చేస్తున్న బంగ్లా వ్యతి రేక వ్యాఖ్యలపై ఇక్కడ ఎవరూ సంతోషంగా లేరు. ఆమెను వెనక్కి తీసుకురా వాలని యోచిస్తున్నాం. భారత్‌లో ఉంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బతింటాయి’’ అని అన్నారు.మేం కూడా ఆమెను మర్చిపోతాం‘‘ఆమె ఇండియాలో మౌనంగా కూ ర్చుంటేనే మేం కూడా ఆమెను మర్చి పోతాం. బంగ్లాదేశ్ ప్రజలూ ఆమెను మర్చిపోతారు. ఆమె తన లోకంలో తాను ఉంటే అందరికీ మంచిది. అలా కాకుండా భారత్‌తో కూర్చుని మాకు ఎలా పరిపాలించాలో ఉచిత సలహాలిస్తే ఎవ్వరికీ నచ్చదు. ఈ ధోరణి మాకేకాదు భారత్‌కు కూడా మంచిది కాదు. ఇరు దేశాల సంబంధాలపైనా ప్రతి కూల ప్రభావం చూపుతుంది. ఆమె సాధారణ పర్యటనకు ఇండియా వెళ్లలేదు. ఉవ్వెత్తున ఎగసిన ప్రజా ఉద్యమా నికి జడిసి హసీనా దేశం నుంచి పారిపో యారు. దేశంలో దురా గతాల నుంచి ప్రజలకు న్యాయం అందించేందుకు మా సర్కార్ కట్టుబ డి ఉంది. ఆమె చెబుతు న్నట్లు ప్రజలకు న్యాయం జరగా లంటే వాస్తవానికి ఆమెనే స్వదేశా నికి తీసుకురావాలి. అలా జరగకపోతే బంగ్లాదేశ్ ప్రజలు శాంతించరు. ఆమె పాల్పడిన దురాగతాలపై అందరి సమక్షంలో విచారణ జరగాల్సిందే’’ అని అన్నారు.భారత్‌తో సత్సంబంధాలనే కోరుకుంటున్నాం‘‘బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ఇస్లామిక్‌గా మారిపోయిందని, దేశాన్ని అఫ్గానిస్తాన్‌లా మార్చేస్తారని భారత్ భావిస్తోంది. కానీ మేం పొరుగుదేశం ఇండియాతో మైత్రి బంధాన్నే కోరుకుంటున్నాం. హసీనా నాయకత్వంలో మాత్రమే బంగ్లాదేశ్‌లో సుస్థిరత సాధ్యమని భారత్ భావించడం మానుకోవాలి. హసీనా ప్రభుత్వం కూలిపోయాక మైనారిటీ హిందువులపై దాడులు పెరిగాయనేది అవాస్తవం. భారత్‌తో బలహీనంగా ఉన్న బంధాన్ని బలోపేతం చేసుకోవాల్సిన సమయమొచ్చింది. రవాణా, అదానీ విద్యుత్ ఒప్పందం వంటి వాటిని పట్టాలెక్కించాలి. ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష జరుపుతా. తదుపరి ఎన్నికల్లో బీఎన్పీ గెలిచి అధికారంలోకి వస్తే దేశంలో అవసరమైన సంస్కరణలు తీసుకొస్తా’’ అని అన్నారు. -
Bangladesh: మాజీ పీఎం షేఖ్ హసీనాపై మరో రెండు హత్య కేసులు
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై మరో రెండు హత్య కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమెపై నమోదైన మొత్తం కేసుల సంఖ్య 94కి చేరుకుంది. హసీనా గత నెలలో ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు చేరుకున్నారు. ఆమెపై నమోదైన 94 కేసులలో చాలా వరకు వివాదాస్పద రిజర్వేషన్ కోటా వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా జరిగిన హత్యలకు సంబంధించినవే అయివున్నాయి.జూలై 19న జరిగిన నిరసనల సందర్భంగా ఢాకా నివాసి ఒకరు హతమయ్యారు. దీనికి సంబంధించిన కేసులో హసీనాతో పాటు మరో 26 మందిపై హత్య కేసు నమోదయ్యిందని డైలీ స్టార్ వార్తాపత్రిక తెలిపింది. మృతుడి భార్య ఢాకా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అఫ్నాన్ సుమీ కోర్టులో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్, అవామీ లీగ్ జనరల్ సెక్రటరీ ఒబైదుల్ క్వాడర్, అవామీ లీగ్‌తో పాటు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నిందితులుగా ఉన్నారు. జూలై 19న బంగ్లాదేశ్ టెలివిజన్ భవన్ ముందు తన భర్తను కాల్చి చంపారని మృతుడి భార్య తన ఫిర్యాదులో పేర్కొంది.ఇదేవిధంగా జత్రాబరి ప్రాంతంలో ఒక విద్యార్థి మృతికి సంబంధించి హసీనా, మాజీ న్యాయశాఖ మంత్రి షఫీక్ అహ్మద్, మాజీ అటార్నీ జనరల్ ఏఎం అమీన్ ఉద్దీన్, సుప్రీంకోర్టు న్యాయవాది తానియా అమీర్‌తో పాటు మరో 293 మందిపై కేసు నమోదైంది. మృతుని తల్లి జాత్రబరి పోలీస్ స్టేషన్లో ఈ ఉదంతంపై ఫిర్యాదు చేశారు. తన కుమారుడు ఆగస్టు 5న రిజర్వేషన్ల సంస్కరణ ఉద్యమంలో పాల్గొన్నాడని, ఉదయం 9 గంటల ప్రాంతంలో జత్రాబరి పోలీస్ స్టేషన్ దాటుతుండగా అతనిపై కాల్పులు జరిపారని ఫిర్యాదుదారు ఆరోపించారు. బాధితుడిని ఢాకా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. -
హసీనాను బంగ్లాకు అప్పగించండి.. భారత్‌కు విజ్ఞప్తి
ఢాకా: భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లా మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాను తమకు అప్పగించాలని అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) భారత్‌ను కోరింది. ఆమెను బంగ్లాకు అప్పగించాలని బీఎన్పీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్ మంగళవారం భారత్‌కు కోరారు. రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల నేతృత్వంలోని నిరసనలను ఆమె అడ్డుకోవడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ కోటా విషయంలో చెలరేగిన అల్లర్లకు సంబంధించి ఆమెపై నమోదైన హత్య కేసుల్లో విచారణ ఎదుర్కొవల్సిందేనని బీఎన్పీ స్పష్టం చేసింది. ఢాకాలో మాజీ ప్రెసిడెంట్ బీఎన్పీ వ్యవస్థాపకుడు జియా-ఉర్ రెహమాన్ సమాధి వద్ద మీర్జా ఫఖ్రుల్ నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘భారత్ షేక్ హసీనాను చట్టబద్ధంగా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అప్పగించాలని కోరుతున్నాం. ఈ దేశ ప్రజలు ఆమెపై విచారణ జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఆమె కచ్చితంగా విచారణను ఎదుర్కొవల్సిందే. షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించటం వల్ల భారత్ ప్రజాస్వామ్యం పట్ల తన నిబద్ధతను నిలుపుకోవడం లేదు. షేక్ హసీనా విద్యార్థి సంఘాల నేతృత్వంలోని నిరసనలు ఎదుర్కొనలేక దేశం విడిచి పారిపోయారు. పొరుగు దేశం (భారత్) హసీనాకు ఆశ్రయం కల్పించటం దురదృష్టకరం’ అని అన్నారు. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ కోట ఆందోళనల నేపథ్యంలో ఆగస్టు 5న షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె భారత్‌తో ఆశ్రయం పొందుతున్నారు. -
Muhammad Yunus: అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారు
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనుస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎదురు లేకుండా అధికారంలో కొనసాగేందుకు దేశంలోని అన్ని వ్యవస్థలను హసీనా నాశనం చేశారన్నారు. ‘న్యాయ వ్యవస్థ భ్రష్టు పట్టింది. దాదాపు 15 ఏళ్లపాటు సాగించిన దుర్మార్గపు పాలనలో ప్రజాస్వామిక హక్కులను ఆమె అణగదొక్కారు. ప్రభుత్వ ఖజానాను దోచుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు’అని ఆయన నిప్పులు చెరిగారు. హసీనా క్రూరమైన నియంతృత్వ విధానాల ఫలితంగా దేశంలో అన్నిరకాలుగా పూర్తి గందరగోళంలోకి నెట్టివేయబడిందని పేర్కొన్నారు. భద్రతా బలగాలు, మీడియాతోపాటు పౌర యంత్రాంగం, న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్ వంటి కీలక విభాగాల్లో ముఖ్యమైన సంస్కరణలను తేవాలన్నది తమ ప్రధాన ఉద్దేశమన్నారు. జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయ సాధనకు చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలిపారు. శాంతి నెలకొనే వరకు సాయుధ బలగాలు పౌర విభాగాలకు సాయంగా పనిచేస్తూనే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజలు, భద్రతా బలగాల సహకారంతో అతి తక్కువ సమయంలోనే సాధారణ పరిస్థితులను తీసుకువస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలకు భద్రతను, రక్షణను కల్పించేందుకు ప్రభుత్వ కట్టుబడి ఉంటుందని ప్రకటించారు. -
అన్నిటికీ... విదేశీ హస్తమేనా?
ఇందిరా గాంధీ పొలిటికల్ టూల్ కిట్ నుండి నరేంద్ర మోదీ చాలావరకు అరువు తెచ్చుకున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సొంత రాజకీయ సమస్యలకు విదేశీ హస్తాన్ని నిందించడం అటువంటి అరువు ఆలోచనే. ప్రభుత్వాధినేతలు తెరవెనుక శక్తులతో కొట్టుమిట్టాడేయుగంలో ఇందిర పనిచేయవలసి వచ్చిందనేది మనం గమనించాలి. భారతదేశం బలహీనంగా, వెనుకబడి, అభివృద్ధి చెందకుండా ఉండాలని ఎవరూ కోరుకోవడం లేదు. అభివృద్ధి చెందిన, ఆత్మవిశ్వాసంతో కూడిన భారతదేశం తమ ప్రయోజనాలకు సరిపోతుందని పాశ్చాత్య శక్తులు కూడా గుర్తించాయి. కాబట్టి, దేశీయ వైఫల్యాలను సమర్థించుకోవడానికి ఒక సాకు వెతకడం కన్నా, పారదర్శక పాలనపై దృష్టి పెట్టడం మేలు.హిండెన్ బర్గ్, జార్జ్ సోరోస్ నుండి, అంత ర్జాతీయ మానవ హక్కుల సంస్థల నుండి వేగులు, గూఢచారుల వరకు, వివిధ రూపాల్లో విదేశీ హస్తం భారత దేశంలోకి తిరిగి జొరబడిందని ఆరోపణలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేఖ్ హసీనాను దేశం వీడేలా చేయడానికి యువకులు పెద్దఎత్తున నిరసనలు జరిపినప్పటికీ, ఆమె బహిష్కరణ వెనుక విదేశీ హస్తం ఉందని ఆరోపణలు వినబడుతున్నాయి.కచ్చితంగా చెప్పాలంటే, మునుపటి ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో జరిగినట్లుగానే, కొత్త ప్రచ్ఛన్న యుద్ధంలో దక్షిణాసియా ఒక ఆట స్థలం కావచ్చు. పెద్ద, చిన్న అనేక దేశాలు ఈ ప్రాంతంలో వాటాను పొందివున్నాయి. కాబట్టి, పాలనలో మార్పు వంటి విపత్తు సంఘటనలు సంభవించినప్పుడు, తెరవెనుక శక్తులు పనిచేస్తున్నా యని అనుకోవాల్సి వస్తుంది. అయితే, చాలా తరచుగా, దక్షిణాసియా దేశాలు ఎదుర్కొంటున్న సమస్యల మూలాలకు స్వదేశంలోని పరిస్థి తులే కారణమవుతున్నాయి.అప్పటినుంచే మొదలు...అప్పుడప్పుడూ, భారతీయ రాజకీయ చర్చల్లో విదేశీ హస్తం ప్రత్యక్షమవుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు, సాక్షాత్తూ ప్రధానమంత్రే భారతదేశ అంతర్గత స్థిరత్వం, పురోగతి అంశాలపై ఉన్న ప్రపంచ ముప్పు గురించి మాట్లాడారు. అదేసమయంలో అఖండమైన పార్లమెంటరీ మెజారిటీతో ‘బలమైన, స్థిరమైన’ ప్రభుత్వ ఆవశ్యకతను ఆయన నొక్కిచెప్పారు. ఈ సందర్భంలో, ఓటర్లు ఆ ముప్పును సీరియస్‌గా తీసుకోలేదు. మోదీకి అంతంత అనుకూల ఫలితాన్ని మాత్రమే అందించారు. ఇందిరా గాంధీ పొలిటికల్ టూల్ కిట్ నుండి నరేంద్ర మోదీ చాలావరకు అరువు తెచ్చుకున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు తరచుగా వ్యాఖ్యానిస్తున్నారు. తన రాజకీయ సమస్యలకు విదేశీ హస్తాన్ని నిందించడం అటువంటి అరువు తెచ్చుకున్న ఆలోచనే. ప్రభు త్వాధినేతలు తెరవెనుక శక్తులతో కొట్టుమిట్టాడే యుగంలో ఇందిర పనిచేయవలసి వచ్చిందనేది మనం గమనించాలి. చిలీకి చెందిన సాల్వడార్ అలెండే 1973లో హత్యకు గురైన తర్వాత, విదేశీ హస్తం తదుపరి లక్ష్యం తానేనన్న భయంతో ఆమె 1974లో ఎమర్జెన్సీ పాలన విధించి ఉండవచ్చని ఆమె మీడియా సలహాదారు, దివంగత హెచ్‌వై శారదా ప్రసాద్ రాశారు. ఫిడెల్ క్యాస్ట్రో(క్యూబా), లియోనిడ్ బ్రెజ్నెవ్ (రష్యా) ఇద్దరూ ఆమెను తీవ్రంగా హెచ్చరించారని ఆయన తన నోట్స్‌లో పేర్కొన్నారు.1960లు, 1970లు ప్రచ్ఛన్న యుద్ధం తీవ్రంగా కొనసాగినకాలం. నిజానికి అది విదేశీ హస్త యుగం. అమెరికా, సోవియట్ యూనియన్ రెండూ తమ సొంత శక్తిని పెంపొందించుకోవడానికి మిత్రులను, తోలుబొమ్మలను వెతుకుతూ ఉండేవి. భారతదేశం అప్పట్లో పాశ్చాత్య శక్తులకు అభిముఖంగా ఉండేది. నేడు భారతదేశం తనను తాను అమెరికాకు ‘వ్యూహాత్మక భాగస్వామి’గానూ ‘నాటోయే తర మిత్రదేశం’ గానూ భావిస్తోంది. అయినప్పటికీ, విదేశీ హస్తం చుట్టూ ఉన్న రాజకీయాల్లో అమెరికాను కూడా అనుమానించవలసి రావడాన్ని తోసిపుచ్చలేం.ప్రచ్ఛన్న యుద్ధం ముగియడంతో, విదేశీ హస్తం గురించి చర్చ తగ్గుముఖం పట్టింది కానీ, అది పూర్తిగా అదృశ్యం కాలేదు. సోవియట్ యూనియన్ రద్దు కావడంతో అమెరికాకు భారతదేశం చేరువకావడం; పశ్చిమం వైపు వెళ్లే భారతీయుల సంఖ్య పెరగడం; ఆంగ్లం మాట్లాడే దేశాల పౌరసత్వాన్ని కోరుకోవడం పెరగడంతో, బహిరంగ చర్చల నుండి విదేశీ హస్తం ప్రస్తావన వెనక్కి తగ్గింది. కానీ, తమిళ నాడులోని కుడంకుళం వద్ద రష్యా సహాయంతో ఏర్పాటుచేస్తున్న అణు కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకుని నిరసనలు జరగడం వెనుక విదేశీ హస్తం ఉందని 2012లో అప్పటి ప్రధాని మన్మోహ¯Œ సింగ్‌వంటి వివేకం కలిగిన నాయకుడు కూడా భావించక తప్పని పరిస్థితి ఏర్పడింది.అన్నింటికీ అదేనా?ఈ నేపథ్యంలో మోదీ లాంటి నాయకుడి హయాంలో బీజేపీలాంటి రాజకీయ పార్టీకి ప్రతి సమస్య, సవాలు వెనుక విదేశీ హస్తం కనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఒక దశాబ్ద కాలంగా దేశంలోని వివిధ ఏజెన్సీలు, ఫోర్డ్ ఫౌండేషన్ నుండి సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ వరకు అన్ని రకాల సంస్థలను విదేశీ హస్తాలు పన్నిన కుట్రదారులుగా బీజేపీ ఆరోపిస్తోంది. కాబట్టి, భారతదేశంలోని అధికార యంత్రాంగంలోని చాలామంది షేఖ్ హసీనాను తొలగించడం వెనుక మాత్రమేకాకుండా, హిండెన్ బర్గ్ చేసిన స్టాక్ మార్కెట్ విశ్లేషణ పరిశోధన వెనుక కూడా విదేశీ హస్తం ఉందని భావించడంలో ఆశ్చర్యం లేదు.విదేశాలలో ‘భారతీయ హస్తం’ పని చేస్తున్నట్లే, భారతదేశంలో చాలా విదేశీ హస్తాలు పనిచేస్తూ ఉండవచ్చు. భారతీయ ఏజెంట్లు విదేశాల్లో హత్యాకాండకు పాల్పడుతున్నారనే ఆరోపణలను ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా పరిగణిస్తున్నారు. భారతీయ హస్తం పదును దేరుతోందని ఇది సూచిస్తోంది. ఒక దేశం వెలుపల ఉన్న శక్తులు ఒకరిపై కుట్ర పన్నుతుంటే గనక, అటువంటి దేశంలోని ఏ ప్రభు త్వమైనా సరే విస్తృతంగా పరిశీలించి, విదేశీ హస్తాలు ఆటాడేందుకు సహాయపడే స్థానిక శక్తులపై ఎలాంటి చర్యలనైనా తీసుకోవచ్చు అనేది ఇక్కడ గ్రహించాల్సిన ప్రాథమికాంశం.ఇంటిని దిద్దుకోవాలి!అనిశ్చితమైన, వేగంగా మారుతున్న ప్రపంచంలో, భారతదేశం వంటి ప్రధాన శక్తి అంతర్గత భద్రత, పాలనపై దృష్టి పెట్టాలి. తద్వారా ‘విదేశీ హస్తం’ ఆడుకోవడానికి స్థలాన్ని తెరిచే పరిస్థితులను సృష్టించకూడదు. జరిగే ప్రతి తప్పిదానికీ ‘విదేశీ హస్తం’ బాధ్యత వహించాలని ఆరోపించడం ద్వారా దేశీయంగా ఉన్న అసమర్థ పాలననుండి జనాల దృష్టిని మళ్లించడం సులభం. నిజానికి హసీనా తన బహిష్కరణకు తానే పునాది వేసుకున్నారు. వాస్తవం ఏమిటంటే, భారతదేశంలోని దర్యాప్తు సంస్థల నుండి నియంత్రణ సంస్థల వరకు వివిధ సంస్థల ఏకపక్ష చర్యలు... సందేహాస్పద నిర్ణయాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.ప్రచ్ఛన్న యుద్ధ యుగం దేశాన్ని అస్థిరపరిచే శత్రుపూర్వక విదేశీ హస్తం జ్ఞాపకాన్ని మిగిల్చిందనడాన్ని తోసిపుచ్చలేము. వలసవాద అనంతర సమాజంలో ఈస్టిండియా కంపెనీ బ్రిటిష్ రాజ్యంగా మారిన జ్ఞాపకాన్నీ విస్మరించలేము. కాబట్టి ‘విదేశీ హస్తం’ అనేది కేవలం వేగులు, పంచమాంగదళం లాంటి అనుమానిత చర్యలలో మాత్రమే కాకుండా కార్పొరేట్, ఆర్థిక ప్రపంచంలోని వారి చర్యలలో కూడా కనిపిస్తుంది.అయితే, భారతదేశం మునుముందుకే నడిచింది. చాలా తక్కువ దేశాలు మినహాయిస్తే, భారతదేశం బలహీనంగా, వెనుకబడి, అభివృద్ధి చెందకుండా ఉండాలని ఎవరూ కోరుకోవడం లేదు. అభివృద్ధి చెందిన, ఆత్మవిశ్వాసంతో కూడిన భారతదేశం తమ ప్రయోజనాలకు సరిపోతుందని పాశ్చాత్య శక్తులు గుర్తించాయి. ఆఖరికి మన విదేశాంగ విధానం కూడా దేశ ఆర్థికాభివృద్ధికి అనుకూలమైన బాహ్య వాతావరణాన్ని కోరుకుంటోంది. కాబట్టి, దేశీయవైఫల్యాలు, దుష్పరి పాలనను సమర్థించుకోవడానికి ఒక సాకు కోసం వెతకడం కన్నా, స్వదేశంలో మంచి, పారదర్శక పాలనపై దృష్టి పెట్టడం మేలు.- వ్యాసకర్త మాజీ పత్రికా సంపాదకుడు, ఆర్థికవేత్త, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- సంజయ బారు -
అనుకోని అతిథికి అభ్యంతరాలు
బంగ్లాదేశ్ అంతర్గత పరిణామాల ఫలితంగా ప్రధాని పదవికి రాజీనామా చేసి షేక్ హసీనా ఆశ్రయం కోరుతూ భారత్‌కు వచ్చారు. అయితే భారత్ ఆమెకు శాశ్వత ఆశ్రయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా లేకపోయినా... అత్యవసరంగా ఆమెను అక్కున చేర్చుకొంది. ఆ విధంగా ఆమె ప్రాణాలను కాపాడ గలిగింది. ఇటీవలి కాలంలో భారత విధానంలో చోటు చేసుకున్న మార్పులు, బంగ్లాదేశ్‌తో భవిష్యత్తులో ఎదురవ్వగల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని భారత్ శాశ్వత ఆశ్రయాన్ని నిరాకరిస్తోంది. ఇదే సమయంలో హసీనా బ్రిటన్‌లో ఆశ్రయం పొందాలని ఆశిస్తున్నా అక్కడ ఆమెకు ద్వారాలు మూసుకొన్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్ ఆమె కోసం తగిన నివాసప్రాంతాన్ని వెదకడంలో తన దౌత్య పరపతిని ఉపయోగించే అవకాశం ఉంది.బంగ్లాదేశ్ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. పాకిస్తాన్ కబంధ హస్తాల నుండి స్వాతంత్య్రం కోసం పోరాటానికి నాయకత్వం వహించిన, ఆ దేశ ప్రజాస్వామ్య దశ ప్రక్రియలో ఎక్కువ భాగం నాయకత్వం వహించిన కుటుంబం ఇకపై దేశ భవిష్యత్తులో ఎటువంటి పాత్రనూ కలిగి ఉండదు. పెరుగుతున్న హింసాకాండ మధ్య షేక్ హసీనా ఢాకా నుండి నిష్క్రమించడం అనేది బంగ్లాదేశ్‌లో ఆమె కుటుంబ ఉనికి ముగింపును సూచిస్తుంది. ముజిబుర్ రెహ్మాన్ విగ్రహంపై మూత్ర విసర్జన చేస్తున్న నిరసనకారుడి చిత్రాలూ, మాజీ ప్రధాని లోదుస్తు లను ప్రదర్శిస్తున్న ఇతరుల చిత్రాలూ ఆ కుటుంబం పట్ల ప్రజల్లో పెరిగిన ద్వేషాన్ని తెలియజేస్తున్నాయి.హింసాత్మక మార్గాల ద్వారా ప్రజల నిరసనలను అరికట్టేందుకు బంగ్లా సైన్యం నిరాకరించడంతో, షేక్ హసీనా ఆశ్రయం కోరుతూ భారత్‌కు వచ్చారు. ఆమె భారత్‌లో ఆశ్రయం పొందడం ఇదే మొదటి సారి కాదు. 1975లో ఆమె తండ్రి ముజిబుర్ రెహ్మాన్ హత్యకు గురైనప్పుడు హసీనా, ఆమె కుటుంబం భారతదేశంలో నివసించారు. ఆరేళ్లపాటు న్యూఢిల్లీలో ఉన్న హసీనా, ఆ ఉపకారాన్ని మరచిపోలేదు. ఆమె అప్పుడు ప్రధాని కుమార్తె. తన తండ్రి ఢాకాలో ఘోర హత్యకు గురైనప్పుడు ఆమె జర్మనీలో ఉన్నారు. అందువల్లే ఆమె ప్రాణం నిలబడింది. ఈసారి మాత్రం ఆమె పదవి నుంచి వైదొలిగిన ప్రధానమంత్రిగా ఉన్నారు. భారత్ తనను నిరాశపరచదన్న ఆమె విశ్వాసం చెల్లుబాటైంది. ఆమెకు జాతీయ భద్రతా సలహాదారు స్వాగతం పలికారు, అనంతరం విదేశాంగ మంత్రి ఆమెను కలిశారు. ఆమె ప్రస్తుతం న్యూ ఢిల్లీలోని సురక్షిత గృహంలో ఉన్నారు, ఆమె ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకుంటారు. ఆమె ఇకపై దౌత్యపరమైన పాస్‌పోర్ట్‌ను కలిగి ఉండరు కాబట్టి ఆమె ఆశ్రయం పొందాలనుకునే దేశం నుండి వీసా అవసరం. ఆమె భవిష్యత్ గమనంలో భారత్ తనదైన పాత్ర పోషిస్తుంది.ఆమె భారతదేశానికి చేరుకున్న సందర్భంలో, డాక్టర్ జైశంకర్ మాట్లాడుతూ, ‘చాలా తక్కువ సమయంలో, భారతదేశానికి రావడా నికి ఆమె అనుమతిని కోరారు’ అని పేర్కొన్నారు. తన భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి ప్రభుత్వం ఆమెకు సమయం ఇస్తుందని ఆయన అన్నారు. ఆమె షాక్‌లో ఉన్నారనీ, కోలుకోవడానికి తగినంత సమయం కావాలనీ భారత ప్రభుత్వం పేర్కొంది. ఆమె భారత దేశంలో ఉన్న సమయంలో సంబంధిత ప్రోటోకాల్, రక్షణతో పాటు ఆమెను ప్రభుత్వ అతిథిగా భావించి వ్యవహరించడం కొనసాగుతుంది. ఆమెకు ఇద్దరు బిడ్డలు. కుమారుడు సజీబ్ అహ్మద్ వాజెద్ అమెరికాలో ఉంటూండగా, కుమార్తె సైమా వాజెద్ ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలోని ప్రపంచ ఆరోగ్య సంస్థకు సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజినల్ డైరెక్టర్‌గా సైమా వాజెద్ వ్యవహరిస్తున్నారు. అయితే హసీనా అమెరికాకు వెళ్లడం కుదరదని, ఆమె వీసాను అమెరికా రద్దు చేసిందని వార్తలు వచ్చాయి. బ్రిటన్‌లో నివసించడం హసీనాకు ఇష్టమైన మొదటి ఎంపిక. ఆమెతోపాటు ఢాకా నుండి పారిపోయి వచ్చిన ఆమె సోదరి షేక్ రెహానా బ్రిటిష్ పౌరురాలు. కాబట్టి అక్కడికి హసీనా వెళ్లడం అర్థవంతంగానే ఉంటుంది. షేక్ రెహానా కుమార్తె తులిప్ సిద్ధిక్ పార్లమెంటులో లేబర్ పార్టీ సభ్యురాలు. పైగా ట్రెజరీ, నగరాభివృద్ధి మంత్రికి ఆమె ఆర్థిక కార్యదర్శి కూడా!తమ ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం బ్రిటన్ వెలుపల ఉన్న వారికి ఆశ్రయం లేదా తాత్కాలిక ఆశ్రయం పొందేందుకు ఎటువంటి నిబంధనా లేదని బ్రిటన్ అధికారులు సూచిస్తున్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ‘అంతర్జాతీయ రక్షణ అవసరమయ్యే వారు తాము చేరుకునే మొదటి సురక్షిత దేశంలో (ఈ సందర్భంలో భారత్) ఆశ్రయం పొందాలి – అదే భద్రతకు వేగవంతమైన మార్గం’ అని కూడా వారు పేర్కొన్నారు. ‘బంగ్లాదేశ్‌లో గత కొన్ని వారాల సంఘ టనలపై ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో దర్యాప్తు’ కోసం డిమాండ్ చేయడం ద్వారా బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి బంగ్లాదేశ్ సంక్షోభానికి ఆజ్యం పోశారు. షేక్ హసీనాను పదవీచ్యుతురాలిని చేయడాన్ని సమర్థిస్తున్నట్లు ఈ ప్రకటన సూచిస్తుంది.ఆమెకూ, భారత ప్రభుత్వానికీ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ, ఆమెకు భారత్ ఆశ్రయమివ్వడం సరి కాదు. ఆమెకున్న భద్రతాపరమైన ఆందోళనలు ఆమె కదలికలను తీవ్రంగా పరిమితం చేస్తాయి. పైగా ఎన్నికల అనంతరం, అధికారంలో ఉన్న చివరి రోజులలో ఆమె తీసుకున్న నిర్ణయాలపై అభియోగాలను ఎదుర్కొ నేందుకు ఆమెను రప్పించాలనే డిమాండ్లు పెద్ద సంఖ్యలో వస్తు న్నాయి. కొన్ని ఆరోపణలు కల్పితం కావచ్చు. కానీ దేశంలో సాగు తున్న రాజకీయ క్రీడలో ఆమె పావుగా మారతారు.జనరల్ ముషారఫ్‌ను విచారించకుండా పాక్ సైన్యం అక్కడి ప్రభుత్వాన్ని నిరోధించింది. తద్వారా ఆయన దుబాయ్‌లో జీవించగలిగారు. ఇది బంగ్లాదేశ్‌లోనూ పునరావృతం కావచ్చు. భవిష్య త్తులో బంగ్లాలో సైనిక నాయ కత్వం ఎలా రూపొందుతుంది అనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. హసీనా భారతదేశంలోనే కొనసా గడం సరికాదని, బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న మహ్మద్ యూనస్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్ సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇప్పటికే షేక్ హసీనాను, ఆమె సోద రిని అరెస్టు చేయాలని, అభియోగాలను ఎదుర్కొనేందుకు వారు దేశా నికి తిరిగి రావాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆమె భారత్‌లోనే ఉండి పోయినట్లయితే, ఆమెను అప్పగించేందుకు న్యూఢిల్లీ అనుమతి నిరాక రిస్తుంది. ఇది ఇండో–బంగ్లా సంబంధాలను దెబ్బ తీస్తుంది. భారత్, బంగ్లాదేశ్ 2016 జూలైలో ‘రెండు దేశాల మధ్య పారిపోయిన నేరస్థు లను త్వరితగతిన అప్పగించడం’ లక్ష్యంగా ఒక అప్పగింత ఒప్పందంపై సంతకం చేశాయి. ఒప్పందానికి కట్టుబడి ఉండేందుకు నిరాక రిస్తే భారత్ ఒకే పక్షంవైపు మొగ్గు చూపుతోందనే మాట వస్తుంది.ఆమె తిరిగి రావాలనే డిమాండ్‌ను తిరస్కరించడం వల్ల బంగ్లా దేశ్‌లో భారత వ్యతిరేక భావాలు కూడా ఏర్పడవచ్చు, ఇది భారత దేశం కోరుకోదు. హసీనాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జమాతే ఇస్లామీ ఈ నిరసనలకు నాయకత్వం వహించి ఇరు దేశాల సంబంధాల సాధా రణీకరణపై ప్రభావం చూపుతుంది.1962 యుద్ధం జరిగి, దలైలామాను తమకు అప్పగించాలని చైనా క్రమం తప్పకుండా డిమాండ్ చేసినప్పటికీ, న్యూఢిల్లీ దశాబ్దాలుగా ఆయనకు దేశంలో ఆతిథ్యం ఇచ్చింది. 1992 నుండి దివంగత ఆఫ్ఘన్ అధ్యక్షుడు మొహమ్మద్ నజీబుల్లా కుటుంబానికి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. కుటుంబానికి సురక్షితమైన ఇల్లు, నెలవారీ స్టైపండ్ అందించడం జరిగింది. అయితే ఇటీవల భారత్ తన విధానాలను మార్చుకోవడం ప్రారంభించింది. 2022 జూలైలో దేశం విడిచి పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సేకు ఆశ్రయం ఇవ్వడానికి న్యూఢిల్లీ నిరాకరించింది. 2021 ఆగస్టులో అమె రికా సైన్యాల ఉపసంహరణ తర్వాత తాలిబాన్ దేశాన్ని స్వాధీనం చేసుకు న్నప్పుడు, ఆఫ్ఘనిస్తాన్లోని అష్రఫ్ ఘనీ ప్రభుత్వ సభ్యులకు సురక్షిత మైన స్వర్గధామాలను కల్పించడానికి భారత్ నిరాకరించింది.ఇవి ఇంకా ప్రారంభ రోజులే. బంగ్లాదేశ్ స్థిరపడటానికి, అక్కడి తాత్కాలిక ప్రభుత్వం హసీనాను తమకు అప్పగించాలని డిమాండ్ చేయడానికి కాస్త సమయం పడుతుంది. షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించే అవకాశాల గురించి ఆలోచిస్తున్నట్లు భారత ప్రభుత్వం అధికారికంగా చెప్పకపోయినప్పటికీ, ఆమె కోసం తగిన నివాసప్రాంతాన్ని వెదకడంలో మాత్రం అది తన దౌత్య పరపతిని ఉపయోగించుకుంటుంది. ఈ పని ఎంత వేగంగా చేస్తే అంత మంచిది.హర్ష కక్కడ్ వ్యాసకర్త భారత సైన్యంలో విశ్రాంత మేజర్ జనరల్ -
Pak Vs Ban: పదవి పోయినా.. పాక్‌తో టెస్టు సిరీస్‌లో ఆల్‌రౌండర్!
రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్‌కు చేరుకుంది. బంగ్లాలో తీవ్రమైన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఈ ద్వైపాక్షిక సిరీస్‌పై సందిగ్దం నెలకొనగా.. తాత్కాలిక ప్రభుత్వం ఎట్టకేలకు ఇందుకు అనుమతినివ్వడంతో పాక్ గడ్డపై అడుగుపెట్టింది. అయితే, ఈ జట్టులో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) ఆ దేశ మాజీ ఎంపీ, మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌కు కూడా చోటునివ్వడం విశేషం.అందుకే అతడికి అనుమతిఈ విషయం గురించి బీసీబీ డైరెక్టర్ ఇఫ్తికర్ అహ్మద్ మాట్లాడుతూ.. ‘‘మా దేశ తాత్కాలిక క్రీడా శాఖ మంత్రితో మాట్లాడాము. షకీబ్‌ను జట్టులో చేర్చడానికి ఆయన ఎటువంటి అభ్యంతరం తెలపలేదు. ప్రతిభ ఆధారంగానే జట్టు ఎంపిక ఉండాలని.. పక్షపాతం చూపకూడదని స్పష్టం చేశారు. అందుకే షకీబ్ కూడా పాక్‌తో సిరీస్ ఆడనున్న జట్టులో స్థానం సంపాదించగలిగాడు’’ అని తెలిపాడు.కాగా షేక్ హసీనా పాలనను నిరసిస్తూ బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. నిరసనకారుల భారీ ఆందోళనలకు తలొగ్గిన షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు. అయినప్పటికీ ఆందోళనకారుల ఆగ్రహ జ్వాలలు చల్లారలేదు. షేక్ హసీనాతో పాటు అవామీ లీగ్(పార్టీ)తో సంబంధం ఉన్న ప్రముఖుల ఇళ్లపైనా దాడులు చేశారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మష్రాఫే మొర్తజా ఇంటికి నిప్పు అంటించారు.అతడి అవసరం జట్టుకు ఉందిఅతడు అధికార అవామీ లీగ్ ఎంపీ( నరేల్-2 డిస్ట్రిక్ట్ పార్లమెంట్ నియోజకవర్గం) కావడమే ఇందుకు కారణం. ఈ ప్రభావం.. మరో ఎంపీ షకీబ్ అల్ హసన్‌పై కూడా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఈ ఆల్‌రౌండర్ కెరీర్ ఇక ముగిసిపోతుందని విశ్లేషకులు భావించారు. అయితే, తాత్కాలిక ప్రభుత్వంలో క్రీడా శాఖ మంత్రిగా ఉన్న 26 ఏళ్ల ఆసిఫ్ మహమూద్ షకీబ్ ఎంపిక విషయంలో చొరవ చూపినట్లు తెలుస్తోంది.చట్ట సభ ప్రతినిధిగా అతడు ఏ పార్టీకి చెందినవాడైనా.. ఆటగాడిగా జట్టుకు అతడి అవసరం ఉంది గనుక పాక్ సిరీస్‌కు ఎంపిక చేసేందుకు అనుమతినిచ్చినట్లు బీసీబీ డైరెక్టర్ ఇఫ్తికర్ అహ్మద్ తాజాగా వెల్లడించాడు. కాగా షేక్ హసీనా రాజీనామా తర్వాత బంగ్లాదేశ్ పార్లమెంటు రద్దు నేపథ్యంలో మగురా ఎంపీగా ఉన్న షకీబ్ పదవి కోల్పోయాడు.ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అతడు లక్షా యాభై వేలకు పైగా మెజారిటీతో గెలుపొందాడు. ప్రతిపక్షం ఎన్నికలను బాయ్‌కాట్ చేసిన నేపథ్యంలో అతడికి ఏకపక్ష విజయం సాధ్యమైంది. ఇదిలా ఉంటే.. ఆగష్టు 21-25(రావల్పిండి), ఆగష్టు 30-సెప్టెంబరు 3(కరాచీ) మధ్య పాక్- బంగ్లా టెస్టు సిరీస్ జరుగనుంది.బంగ్లాదేశ్ జట్టు..నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), మహ్మదుల్ హసన్ జాయ్, జాకీర్ హసన్, షద్మాన్ ఇస్లాం, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ కుమార్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్, నహిద్ రానా, షోరీఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్, సయ్యద్ ఖలీద్ అహ్మద్పాకిస్తాన్ జట్టు..షాన్ మసూద్ (కెప్టెన్), సైమ్ అయూబ్, మహ్మద్ హురైరా, బాబర్ ఆజమ్, అబ్దుల్లా షఫీక్, అఘా సల్మాన్, సౌద్ షకీల్, కమ్రాన్ గులామ్, ఆమెర్ జమాల్, మహ్మద్ రిజ్వాన్, సర్ఫరాజ్ అహ్మద్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, నసీం షా, అబ్రార్ అహ్మద్, ఖుర్రమ్ షెహజాద్, షాహీన్ అఫ్రిది. -
నా తండ్రిని అవమానించారు: షేక్ హసీనా
ఢాకా: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల కోసం విద్యార్థులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారటంతో షేక్ హసీనా ప్రధానిగా రాజీనామా చేసి.. భారత్ చేరుకున్నారు. ఆమె ప్రస్తుతం భారత్‌తో ఆశ్రయం పొందుతున్నారు. బంగ్లా సంక్షోభం, అల్లర్ల అనంతరం షేక్ హసీనా తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘జులైలో విద్యార్థుల నిరసనల్లో హత్యలు, విధ్వంసక చర్యలకు పాల్పడిన వారిపై కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నా. దేశ పౌరులు షేక్ ముజిబుర్ రెహ్మాన్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న జాతీయ సంతాప దినాన్ని పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నా. బంగాబంధు స్మారకం వద్ద పూల మాలలు వేసి మృతి చెందినవారి ఆత్మ శాంతించాలని ప్రార్థించండి.గత జూలై నుంచి ఆందోళనలతో విధ్వంసం, హింస చెలరేగింది. ఈ ఆందోళనల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీసులు పాత్రికేయులు, శ్రామిక ప్రజలు, అవామీ లీగ్, అనుబంధ సంస్థల నాయకులు, కార్మికులకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను’ అని ఆమె అన్నారు. షేక్ హసీనా విడుదల చేసిన ప్రకటనను ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ ‘ఎక్స్’లో షేర్ చేశారు.‘‘ నా తండ్రి, జాతిపిత బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో బంగ్లా స్వతంత్ర దేశంగా ఏర్పడింది. తాజా పరిణామాలతో ఆయన ఘోర అవమానానికి గురయ్యారు. లక్షలాది మంది అమరవీరుల రక్తాన్ని అవమానించారు. దేశప్రజల నుంచి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.Son of deposed Prime Minister of Bangladesh Sheikh Hasina, Sajeeb Wazed Joy releases a statement on behalf of Sheikh Hasina on his social media handle X....I appeal to you to observe the National Mourning Day on 15th August with due dignity and solemnity. Pray for the salvation… pic.twitter.com/b1qRgOP06r— ANI (@ANI) August 13, 2024 -
Bangladesh: షేక్ హసీనాపై హత్య కేసు!
ఢాకా: బంగ్లాదేశ్ రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో షేక్ హసీనా ప్రధానిగా రాజీనామా చేసి.. భారత్ చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. బంగ్లాదేశ్‌లో తాజాగా ఆమెపై హత్య కేసు నమోదైనట్లు స్థానిక మీడియా పేర్కొటోంది. రిజర్వేషన్ల విషయంలో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత నెలలో చెలరెగిన అల్లర్లలో ఓ కిరాణా షాప్ యజమాని హత్య చేయబడ్డారు. ఈ హత్య కేసులో షేక్ హసీనాతో సహా ఆరుగురిపై కేసు నమోదైనట్లు సమాచారం. ఈ కేసును.. అల్లర్లలో హత్య చేయబడ్డ కిరాణా ఓనర్ అబూ సయ్యద్ సన్నిహితుడు నమోదు చేశారు. జూలై 19న మొహమ్మద్‌పూర్‌లో విద్యార్థుల నిరసనలో పోలీసు కాల్పులు జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఆ కాల్పుల్లోనే అబూ సయ్యద్ మృతి చెందినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ హత్య కేసులో మాజీ ప్రధాని షేక్ హసీనాతో సహా అవామీ లీగ్ జనరల్ సెక్రటరీ ఒబైదుల్ క్వాడర్, మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చౌదరి అబ్దుల్లా అల్ మామున్‌పై నిందితులుగా చేర్చారు. బంగ్లాలో చోటుచేసుకున్న నిరసనకారులు అల్లర్లలో ఇప్పటివరకు మొత్తం 560 మంది మృతి చెందారు. -
Bangladesh: ఆ చిన్న ద్వీపం.. హసీనాను గద్దేదింపిందా?
బంగ్లాదేశ్‌లో చెలరేగిన నిరసనలు ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చడం ఆ దేశం అల్లకల్లోలంగా మారింది. ఈ అల్లర్లతో ఒక్క వారంలోనే ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లడం, నిరసనకారులు రెచ్చిపోయి షాపులు, బంగ్లాలు తగలబెట్టడం.. ఆర్మీ దేశాన్ని హస్తగతం చేసుకోవడం, మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజీనామా చేయడం ఇలాంటి ఎన్నో పరిస్థితులు వెలుగుచూశాయి.అయితే ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేసిన బంగ్లాదేశ్ అల్లర్ల వెనుక చైనా, పాకిస్తాన్, తాజాగా అగ్రరాజ్యం కుట్ర ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని మాజీ ప్రధాని షేక్ హసీనా కూడా చెబుతున్నారు. దేశంలో నిరసనలకు, తాను పదవి కోల్పోవడానికి అమెరికా కారణమని ఆమె ఆరోపనలు చేశారు. బంగ్లా వదిలి వెళ్లే ముందు దేశ ప్రజల్ని ఉద్దేశించి హసీనా మాట్లాడాలని అనుకున్నప్పటికీ, అక్కడి సైన్యం అందుకు అనుమతించలేదు. వీటన్నింటికి అమెరికాకు ‘సెయింట్ మార్టిన్స్’ ద్వీపాన్ని ఇవ్వకపోవడమే కారణమని ఆమె ఆరోపించినట్లు తెలుస్తోంది.బంగాళాఖాతంలోని ఈశాన్య భాగంలో ఉంది ఈ సెయింట్ మార్టిన్ ద్వీపం. ఇది ఒక చిన్న పగడపు భూభాగం. బంగ్లాదేశ్ కాక్స్ బజార్-టెక్నాఫ్ కొనకు దక్షిణాన దాదాపు 9 కి.మీ దూరంలో ఈ దీవి ఉంది. దాదాపుగా 3700 మంది జనాభా ఇక్కడ నివాసం ఉంటున్నారు. వీరు చేపలు పట్టడం, వ్యవసాయం చేస్తూ జీవిస్తూ ఉంటారు. వరిసాగు చేస్తూ మయన్మార్‌కు ఎగుమతి చేస్తుంటారు.ఈ ద్వీపం ఎలా ఏర్పడింది?18వ శతాబ్ధంలో ఈ ద్వీపంలో అరబ్ వర్తకులు స్థిరపడి దీనికి జజీరా అనే పేరు పెట్టారు. స్థానికులు నారికెల్ జింజిరా లేదా కొబ్బరి ద్వీపం అని కూడా పిలుస్థారు. తరువాత 1900ల్లో ఈ ద్వీపాన్ని ఇంగ్లాండ్ వాళ్లు బ్రిటిష్ ఇండియాలో భాగం చేసుకొన్నారు. క్రిస్టియన్ గురువు సెయింట్ మార్టిన్ పేరును ఈ ద్వీపానికి పెట్టారని చెబుతారు. 1947లో భారత్ విడిపోయిన తర్వాత ఇది తూర్పు పాకిస్థాన్‌లో భాగమైంది. 1971 తర్వాత బంగ్లాదేశ్‌కు దక్కింది.1974లో దీనిపై బంగ్లా సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ మయన్మార్- బంగ్లాదేశ్ ఒప్పందం కూడా చేసుకొంది. తరువాత 2012లో ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ది లా ఆఫ్ ది సీ (ITLOS) ద్వారా ఈ ద్వీపంపై బంగ్లాదేశ్ సార్వభౌమాధికారాన్ని గుర్తించింది. అయితే ఇక్కడ సముద్ర సరిహద్దుల గుర్తింపు పూర్తికాలేదు. దీంతో ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బంగ్లాదేశ్ మత్స్యకారుల పడవలపై మయన్మార్ దళాలు కాల్పులు జరపడం పరిపాటిగా మారింది.సెయింట్ మార్టిన్ ద్వీపం బంగ్లాదేశ్‌కు కీలకమైన ఆర్థిక, పర్యావరణ ఆస్తిగా ఉంది. ఈ ద్వీపం బంగ్లాదేశ్ ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ) పరిధిలోకి వస్తుంది. ఇది చేపలు, చమురు, గ్యాస్ వంటి విలువైన సముద్ర వనరుల వెలికితీతకు ఉపయోగపడుతోంది. ఈ ద్వీపం ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. దాని సహజమైన బీచ్‌లు, సాంస్కృతిక వారసత్వంతో సందర్శకులను ఆకర్షిస్తుంది.హసీనా ఆరోపణలతో హాట్‌టాపిక్‌గా మార్టిన్ ద్వీపం..ప్రస్తుతం ఈ చిన్న దీవి హాట్‌టాపిక్‌గా మారింది. దీనికి కారణం ఇటీవల షేక్ హసీనా చేసిన ఆరోపణలే కారణం. రాజకీయ మద్దతు కోసం అమెరికా ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించిందని, కానీ తాను అంగీకరించలేదని తెలిపింది. సెయింట్ మార్టిన్ ద్వీపంపై. సార్వభౌమాధికారాన్ని అమెరికాకు అప్పగించి ఉంటే.. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో తాను అధికారంలో ఉండేదాన్నని పేర్కొన్నారు.ఈ ద్వీపం యమన్మార్‌కు దగ్గరగా ఉంటుంది. వివిధ దేశాల మధ్య సముద్ర మార్గాలకు కీలకంగా వ్యవహరిస్తోంది. బంగాళా ఖాతంలో పలు దేశాల మధ్యలో ఉండటంతో అగ్రరాజ్యం అమెరికా దృష్టి దీనిపై ఎప్పటి నుంచో ఉన్నట్లు వినికిడి. కానీ ఈ ద్వీపంపై తమకు ఆసక్తి లేదని పలుమార్లు అమెరికా అధికారికంగా చెబుతూ వస్తోంది. తాజాగా సైతం మార్టిన్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవలనే ఆలోచన తమకు ఎప్పుడూ లేదని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతనిధి మాథ్యూ మిల్లర్ పేర్కొన్నారు.కానీ మార్టిన్ ద్వీపంలో అమెరికా తమ స్థావరం ఏర్పాటుకు చాలా ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. సముద్ర మార్గం ద్వారా ప్రపంచ వాణిజ్యానికి ఎంతో ముఖ్యమైన మలక్కా జలసంధిపై నేరుగా కలుపుతుంది. కనుక ఈ ద్వీపంలో సైనిక స్థావరం ఏర్పాటు చేస్తే మలక్కాజలసంధి చుట్టూ ఉన్న ప్రాంతాల్లో పట్టు సాధించేందుకు వీలవుతుందని అగ్రరాజ్యం జభావించినట్లు సమాచారం.దీనికి సమీపంలో కాక్స్ బజార్ పోర్టును చైనా నిర్మిస్తోంది. దీనికి సమీపంలోని ఈ ద్వీపంలో స్థావరం ఉంటే నిఘాకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందని అగ్రరాజ్యం భావిస్తోంది. దీంతోపాటు ఏకకాలంలో ఇక్కడి నుంచి చైనా, మయన్మార్‌పై నిఘా పెట్టేందుకు అవకాశం లభిస్తుంది. అందుకే దీనిని దక్కించుకునేందుకు పలుమార్లు ప్రయత్నించినట్లు, అక్కడ స్థావరం ఏర్పాటుకు చాలా యత్నాలు చేసినట్లు తెలుస్తోంది.. అప్పటి నుంచి ఈ అంశం పలుమార్లు తెరపైకి వస్తూనే ఉంది. -
షేక్ హసీనాకు ఆశ్రయం.. కేంద్రంపై శశిథరూర్ ప్రశంసలు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా విషయంలో భారత్ సరైన పనే చేసిందన్నారు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్. ఆమె విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. పొరుగుదేశమైన బంగ్లాలో అధికార మార్పు భారత్‌ను ఆందోళనకు గురిచేసే అంశం కాదన్నారు.కాగా బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ప్రధాని షేక్ హసీనా గత వారం తన పదవికి రాజీనామా చేసి.. ఉన్పళంగా దేశం వీడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హసీనా భారత్‌లోనే ఆశ్రయం పొందుతున్నారు.ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లోని తాజా పరిణామాలు, బంగ్లాలో మద్యంతర ప్రభుత్వ ఏర్పాటుతో భార్త్తో సంబంధాలపై ప్రభావం, భారత్‌లో షేక్ హసీనా ఆశ్రయం వంటి అంశాలపై శశిథరూర్ స్పందించారు.బంగ్లాదేశ్‌తో భారత్‌కు సన్నిహిత, స్నేహపూర్వక సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. బంగ్లాదేశ్ ప్రజల శ్రేయస్సు కోసం నిబద్దతతో ఉన్నట్లు పేర్కొన్నారు. ‘మనం ఎలప్పుడూ బంగ్లాదేశ్ ప్రజలతో ఉన్నాం. అక్కడి ప్రజలకు అండగా ఉన్నాం. 971 యుద్ధం సమయంలో వారితోనే ఉన్నాం.. వారి కష్టసుఖాల్లోనూ వెంటే ఉన్నాం. అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా భారత్‌తో స్నేహపూర్వకంగానే ఉన్నారు.. రాబోయే కాలంలోనూ ఇరు దేశాల బంధాల్లో ఎలాంటి మార్పు ఉండదు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వంతో భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన నాకు వ్యక్తిగతంగా తెలుసు. చాలా గౌరవనీయమైన వ్యక్తిహసీనాకు మనం సాయం చేయకపోతే.. అది భారత్‌కు అవమానం. మన స్నేహితుడితో మనం చెడుగా ప్రవర్తిస్తే భవిష్యత్తులో ఎవరూ మనకు మిత్రులుగా ఉండేందుకు ఇష్టపడరు. హసీనా భారత్‌కు స్నేహితురాలు. ఆమెకు కూడా భారత్ స్నేహితురాలే. మీ మిత్రులు సమస్యల్లో ఉంటే ఎప్పుడూ సాయం చేయడానికి వెనుకాడకూడదు. కచ్చితంగా వారిని సురక్షితంగా ఉంచేలా చూడాలి. ఇప్పుడు భారత్ కూడా చేసింది అదే. ఒక భారతీయుడిగా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. అంతకు మించి నేనేమీ కోరుకోవడం లేదు. ఒక భారతీయుడిగా మనం ప్రపంచం కోసం నిలబడే విషయంలో కొన్ని ప్రమాణాలున్నాయి. ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి రక్షణ కల్పించి ప్రభుత్వం సరైన పనే చేసింది’. అని థరూర్ పేర్కొన్నారు. -
Sheikh Hasina: నాపై అమెరికా కుట్ర
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి తనను తప్పించడం వెనుక అమెరికా హస్తముందని చెప్పారు షేక్ హసీనా సంచలన ఆరోపణలు చేశారు. సెయింట్ మారి్టన్ ద్వీపాన్ని, బంగ్లా సరిహద్దుల వెంబడి బంగాళాఖాతంపై పెత్తనాన్ని అప్పగించాలని అమెరికా కోరింది. అలా చేసి ఉంటే నా పదవికి ఢోకా ఉండేది కాదు’’ అన్నారు. బంగ్లా ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు వంటి ఆ డిమాండ్లకు ఒప్పుకోనందుకే తనను దింపేసి కీలుబొమ్మ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాలని అమెరికా కుట్ర పన్నిందని మండిపడ్డారు. విద్యార్థుల శవాల మీదుగా అధికారం దక్కించుకోవాలని ప్రత్యర్థులు కుట్రలు చేశారని ఆరోపించారు. దేశంలో హింసాకాండను, మృతదేహాల ఊరేగింపులను చూడటం ఇష్టం లేకే రాజీనామా చేసినట్టు వెల్లడించారు. భారత్‌లో తలదాచుకుంటున్న హసీనా తాజాగా ఓ ఆంగ్ల పత్రిక ద్వారా బంగ్లాదేశ్ ప్రజలకు సందేశం విడుదల చేశారు. దేశం వీడే ముందు దీన్ని ప్రజలందరికీ చదివి విని్పంచాలని భావించినా వీలు పడలేదన్నారు. కుట్రదారుల వలలో చిక్కుకోవద్దని బంగ్లా ప్రజలకు పిలుపునిచ్చారు. అవామీ లీగ్ నేతలు, కార్యకర్తలపై దాడులు, హత్యలు, వారి ఆస్తుల విధ్వంసంపై ఆవేదన వ్యక్తంచేశారు. భగవంతుడి దయతో త్వరలో బంగ్లాదేశ్ చేరుకుంటానన్నారు.అమాయక విద్యార్థులను రెచ్చగొట్టారు విద్యార్థులను రజాకార్లుగా తానెప్పుడూ సంబోధించలేదని హసీనా తెలిపారు. స్వార్థ ప్రయోజనాల కోసం వారిని రెచ్చగొట్టడానికి తన వ్యాఖ్యలను వక్రీకరించారని మండిపడ్డారు. అమెరికాపై హసీనా గతంలోనూ ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్‌లో వైమానిక స్థావరం ఏర్పాటుకు అనుమతిస్తే ఎన్నికల్లో ప్రధాని పదవి నిలబెట్టుకోవడానికి సహకరిస్తామంటూ ఓ దేశం ఆఫర్ ఇచి్చందని గత మేలో ఆమె వెల్లడించారు.చీఫ్ జస్టిస్‌గా రెఫాత్ అహ్మద్ ఢాకా: బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా జస్టిస్ సయ్యద్ రెఫాత్ అహ్మద్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. విద్యార్థి నేతల డిమాండ్‌తో సీజే, ఐదుగురు న్యాయమూర్తులు శనివారం రాజీనామా చేయడం తెల్సిందే. దేశంలో అశాంతికి ఆజ్యం పోసే వదంతుల వ్యాప్తిపై యూనుస్ ప్రభుత్వం కన్నెర్రజేసింది. వాటిని ప్రచారం చేసే, ప్రచురించే మీడియా సంస్థలను మూసేస్తామని హెచ్చరించింది.హసీనా ఎలాంటి ప్రకటనా చేయలేదు: కుమారుడు హసీనా ఓ ఆంగ్ల పత్రిక ద్వారా విడుదల చేశారంటున్న ప్రకటన పూర్తిగా అవాస్తమని ఆమె కుమారుడు సాజిబ్ వాహెద్ జాయ్ చెప్పారు. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వాన్ని మార్చేందుకు అమెరికా కుట్ర పన్నిందని ఆమె చెప్పినట్టుగా వచి్చన ఆ కథనమంతా పూర్తిగా కట్టుకథ అని ఆరోపించారు. ‘‘దీనిపై నా తల్లితో మాట్లాడాను. బంగ్లాను వీడే ముందు గానీ, వీడాక గానీ ఏ పత్రికకూ తాను అలాంటి ప్రకటన విడుదల చేయలేదని ఆమె స్పష్టం చేశారు’’ అని తెలిపారు. ఏమిటీ సెయింట్ మారి్టన్ ద్వీపం? అమెరికాపై హసీనా ఆరోపణలతో సెయింట్ మారి్టన్ ద్వీపం ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ఇది ఈశాన్య బంగాళాఖాతంలో బంగ్లాదేశ్‌కు చెందిన కాక్స్ బజార్–టెక్నాఫ్ ద్వీపకల్పానికి దక్షిణంది 9 కి.మీ. దూరంలో ఉంది. కేవలం 3 చదరపు కి.మీ. విస్తీర్ణముండే ఈ ద్వీపాన్ని బెంగాలీలో నారీకేళ్ (కొబ్బరి) ద్వీపమంటారు. ఇందులో 3,700 మంది నివసిస్తున్నారు. చేపల వేట, వరి సాగు, కొబ్బరి తోటల పెంపకం వారి వృత్తి. ఈ ద్వీపం వ్యూహాత్మకంగా అతి కీలక ప్రాంతంలో ఉంది. చైనాతో వైరం దృష్ట్యా భావి అవసరాల దృష్ట్యా ఇక్కడ సైనిక స్థావరాన్ని ఏర్పాటుకు అమెరికా ప్రయత్నిస్తోంది. -
అమెరికా వల్లే నాకు ఇలాంటి దుస్థితి.. షేక్ హసీనా ఆవేదన
బంగ్లాదేశ్‌లో అల్లర్ల వేళ అక్కడ అలాంటి పరిస్థితులకు గల కారణాలను వెల్లడించారు బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా. బంగ్లాదేశ్‌లో తమ ప్రభుత్వం పడిపోవడానికి అమెరికానే కారణమని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. బంగాళాఖాతంలో ఉన్న సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు ఇవ్వనందుకే ఈ పరిస్థితి నెలకొందని హసీనా చెప్పుకొచ్చారు.కాగా, మాజీ ప్రధాని షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను వీడిన తర్వాత మొదటిసారిగా మాట్లాడారు. తాజాగా షేక్ హసీనా మీడియా సంస్థతో కీలక విషయాలను వెల్లడించారు. బంగ్లాదేశ్‌లో తమ ప్రభుత్వ పతనానికి అమెరికానే కారణమని ఆరోపించారు. బంగాళాఖాతంలో అమెరికా ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోందన్నారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న తాను అడ్డుకోవడంతోనే అమెరికా ఈ పన్నాగం పన్నినట్లు చెప్పుకొచ్చారు. ఇక, బంగాళాఖాతంలోని సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు తాను అప్పగించనందుకే ఇలా అల్లర్లకు ప్రేరేపించినట్టు తెలిపారు. BIG BREAKING NEWS 🚨 Sheikh Hasina accuses US of ousting her from power for Saint Martin IslandShe revealed "I could've remained in power if I surrendered the sovereignty of Saint Martin Island""US's aim was to assert control over the Bay of Bengal. I resigned to avoid… pic.twitter.com/Wa2pmtxF0G— Times Algebra (@TimesAlgebraIND) August 11, 2024 బంగ్లాదేశ్ విద్యార్థుల మృతదేహాలపై కొందరు అధికారంలోకి రావాలని కోరుకున్నారని.. కానీ దానికి తాను అంగీకరించలేదని షేక్ హసీనా స్పష్టం చేశారు. అలాగే, బంగ్లాదేశ్‌లో విద్యార్థుల మరణాలను చూడలేకనే రాజీనామా చేసినట్టు స్పష్టం చేశారు. ఒకవేళ తాను గనుక అమెరికాకు సెయింట్ మార్టిన్ దీవులను అప్పగించి ఉంటే ఇప్పుడు పరిస్థితులు మరోలా ఉండేదని అన్నారు. ఇదే సమయంలో ఛాందసవాదుల వల్ల బంగ్లాదేశ్ వాసులు తప్పుదోవ పట్టవద్దని విజ్ఞప్తి చేశారు. శాంతిని పెంపొందించాలని కోరారు. తాను అక్కడే ఉంటే మరింత విద్యార్థులు చనిపోయేవారిని ఆమె తెలిపారు. అందుకే దేశం విడిచి వెళ్లిపోయినట్టు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్‌లో ఆందోళనలు పీక్ స్టేజ్ చేరుకోవడంతో నిరసనకారులు షేక్ హసీనా అధికారిక నివాసాన్ని ముట్టడించడంతో షేక్ హసీనా దేశాన్ని వీడారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో భారత్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం షేక్ హసీనా ఇండియాలోనే ఉన్నారు. ఇతర దేశాల్లో ఆశ్రయం దొరక్కపోవడంతో ఢిల్లీలోనే ఉంటున్నారు. -
Bangladesh: ఎన్నికలవేళ హసీనా తిరిగొస్తారు: సాజీబ్
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో ఎన్నికలు నిర్వహించాలని ఆపద్ధర్మ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగొస్తారని ఆమె కుమారుడు సాజీబ్ వాజెద్ జాయ్ వెల్లడించారు. ‘‘ బంగ్లా మధ్యంతర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన మరుక్షణమే ఆమె భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు వెళ్తారు’ అని వాజెద్ అన్నారు. ప్రస్తుతం హసీనా న్యూఢిల్లీలో ఆశ్రయం పొందుతున్నారు. ఆమె బ్రిటన్‌లో ఆశ్రయం పొందాలని యోచిస్తున్నట్లు భారత మీడియా కథనాలు ప్రచురించింది. అయితే బ్రిటన్ హోం శాఖ దీనిపై స్పందించడానికి నిరాకరించింది. బంగ్లాదేశ్ గురించి బ్రిటన్ విదేశాంగ మంత్రితో మాట్లాడానని, ఆయన ఎలాంటి వివరాలను పంచుకోలేదని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గురువారం చెప్పారు. ఈ నేపథ్యంలో వాజెద్ మీడియాతో మాట్లాడారు. అనివార్య పరిస్థితుల్లో తాను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు వాజెద్ ప్రకటించారు. -
Sheikh Hasina: భారత్‌ను వీడిన షేక్ హసీనా టీమ్..
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా షేక్ హసీనా ప్రధాని పీఠం నుంచి దిగిపోవడమే గాక.. దేశాన్ని వీడిన సంగతి తెలిసిందే. హసీనా, ఆమె సోదరితోపాటు ఆమె టీం మొత్తం ప్రస్తుతం భారతలోనే ఉన్నారు. యూపీలోని హిండన్ ఎయిర్‌బేస్‌లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఇక్కడి నుంచి ఆమె లండన్ వెళ్లాలని భావించారు. యూకేలో రాజకీయ శరణార్థిగా వెళ్లాలనుకున్నారు. అయితే అందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఇంకా ఫలించడం లేదుమరోవైపు హసీనా భవిష్యత్తు ప్రణాళికపై భారత్ తాజాగా స్పందించింది. షేక్ హసీనా బృంద సభ్యులు భారత్ నుంచి వెళ్లిపోయినట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. వారు ఎక్కడికి వెళ్లారనేది తెలియదని తెలిపారు. వారంతా తెలియని ప్రదేశానికి పయనమైనట్లు చెప్పారు. అయితే ఆమె టీమ్ సభ్యుల్లో ఎవరు వెళ్లారో, ఎవరో ఉన్నారనేదానిపై స్పష్టత లేదు. అంతేగాక హసీనా భారత్ వీడి వెళ్లే ప్లాన్‌పై తమకు ఎలాంటి అప్డేట్ లేదని అన్నారు.యూకే విదేశాంగ కార్యదర్శికి జైశంకర్ ఫోన్ అదే విధంగా బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీతో మాట్లాడినట్లు రణధీర్ జైశ్వాల్ తెలిపారు. బంగ్లాదేశ్, పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలపై ఇరువురు నేతలు మాట్లాడుకున్నారని అన్నారు. ‘బంగ్లాదేశ్‌లో ఇప్పటికీ ఇంకా ఉద్రిక్త పరిస్థితులే కొనసాగుతున్నాయి. అక్కడ శాంతిభద్రతలు పునరుద్ధరించాలని భారత్ కోరుకుంటోంది. బంగ్లాలో భారత దౌత్య సిబ్బంది, భారత పౌరుల భద్రత విషయంలో స్థానిక అధికారులతో మన ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోంది’ అని తెలిపారు. కాగా ప్రస్తుతం భారత్‌లో ఉన్న హసీనా యూకేలో రాజకీయ ఆశ్రయం పొందుతున్నారనే ఊహాగానాల మధ్య ఈ పరిణామం వెలుగుచూసింది. -
సోదరితో పాటు షాపింగ్ చేసిన షేక్ హసీనా
బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత మాజీ ప్రధాని షేక్ హసీనా బృందంలోని సభ్యులంతా హడావుడిగా భారత్‌కు తరలివచ్చారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం షేక్ హసీనా టీమ్‌లోని చాలా మంది ఇక్కడికి వచ్చే సమయంలో తమ దుస్తులతో పాటు ఇతర రోజువారీ వినియోగ వస్తువులను కూడా తీసుకురాలేదు.భారత ప్రోటోకాల్ అధికారులు హసీనా జట్టు సభ్యులకు దుస్తులు ఇతర వస్తువులను కొనుగోలు చేసుకునేందుకు సహాయం అందించారు. బంగ్లాదేశ్‌లో వారు ఎదుర్కొన్న భయానక అనుభవాల నుంచి వారు ఇంకా కోలుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. బంగ్లాదేశ్ సైన్యం షేక్ హసీనాకు రాజీనామా చేసేందుకు 45 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చింది. దీంతో ఆమె వెంటనే తన రాజీనామాను అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్‌కు సమర్పించారు. అనంతరం ఆమె భారత్ తరలివచ్చారు.తాజాగా షేక్ హసీనా తన సోదరి రిహన్నాతో కలిసి ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్ బేస్ షాపింగ్ కాంప్లె క్స్‌కు వచ్చి తనకు అవసరమైన దుస్తులు ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు చేశారు. ఆమె సుమారు రూ.30 వేల విలువైన సామగ్రి కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మొత్తాన్ని ఆమె భారతీయ రూపాయిలలో చెల్లించారు. అయితే ఈ కొనుగోలు అధికారికంగా ధృవీకృతం కాలేదు. ప్రస్తుతం షేక్ హసీనా.. హిండన్ ఎయిర్‌బేస్‌లోని సేఫ్ హౌస్‌లో ఉంటున్నారు. ఆమె త్వరలో ఇక్కడ నుండి మరొక ప్రదేశానికి తరలివెళ్లవచ్చని తెలుస్తోంది.షేక్ హసీనా భద్రత కోసం ఆమె ఉంటున్న ప్రాంతంలో కమాండోలను మోహరించారు. షేక్ హసీనా తన సోదరి రెహానాతో కలిసి బంగ్లాదేశ్ నుంచి హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ హిండన్ ఎయిర్‌బేస్‌లో ఆమెను కలుసుకున్నారు. -
షేక్ హసీనాకు భారత్‌లో ఆశ్రయం సబబేనా?
బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం భారత్‌తో పాటు పొరుగు దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఉన్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ ప్రధానిగా నియమితులయ్యారు.షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి, దేశం విడిచిపెట్టిన తర్వాత బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున హింస చెలరేగుతోంది. ముఖ్యంగా రాజధాని ఢాకా, చిట్టగాంగ్, కుల్నా సహా ఇతర పలు ప్రాంతాల్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. పలు హిందూ దేవాలయాలు, ఇళ్లు, వ్యాపార సంస్థలు ధ్వంసమయ్యాయి.ఈ నేపధ్యంలో ఇండియా టీవీ తన వెబ్సైట్లో ఒక పోల్ నిర్వహించింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్‌లో ఆశ్రయం ఇవ్వడం సబబేనా అని ఇండియా టీవీ ప్రజాభిప్రాయాన్ని ఒక పోల్ ద్వారా కోరింది. దీనికి వేలాది మంది స్పందించారు. 60 శాతం మంది షేక్ హసీనాకు భారత్‌లో ఆశ్రయం ఇవ్వడం తగినదేనని అన్నారు. ఆమెకు ఇక్కడ ఆశ్రయం ఇవ్వకూడదని 33 శాతం మంది తమ అభిప్రాయం వెల్లడించారు. తమ అభిప్రాయం వెల్లడించలేమని ఏడు శాతం మంది పేర్కొన్నారు. -
బంగ్లాదేశ్ అంటే భయపడాల్సిందేనా?
ముజిబుర్ రెహ్మాన్ కుటుంబానికి ఆగస్టు ఎప్పుడూ క్రూరమైన నెలగానే ఉంటోంది. బంగ్లాదేశ్ వ్యవస్థాపక నిర్మాత షేక్ ముజిబుర్ రెహ్మాన్ తన మొత్తం కుటుంబంతో సహా 1975 ఆగస్టు 15 తెల్లవారు జామున సైనిక తిరుగుబాటులో మరణించారు. ఆయన ఇద్దరు కుమార్తెలు షేక్ హసీనా, షేక్ రెహానా భారతదేశానికి వలస రావలసి వచ్చింది.తన తండ్రి వారసురాలిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన షేక్ హసీనా, 2004 ఆగస్టు 21న తాను ప్రసంగిస్తున్న ర్యాలీపై గ్రెనేడ్ దాడిలో గాయపడి దాదాపు మరణం అంచులను తాకి వచ్చారు.బంగ్లాదేశ్‌లోని సిల్హెట్లో హర్కత్–ఉల్–జిహాద్ అనే ఉగ్రవాద సంస్థ చేసిన ఆ దాడిలో అవామీ లీగ్ కార్యకర్తలు చాలామంది మరణించారు. ఇప్పుడు 20 సంవత్సరాల తరువాత ఆగస్టు మధ్యాహ్నం, హసీనాను ప్రధాని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ, ఆమె నివాసంపై దాడి చేస్తామని బెదిరించిన నిరసనకారులను కాల్చి చంపడానికి ఇష్టపడని బంగ్లాదేశ్ సైన్యం, ఆమెను పదవి వీడి ఢాకా నుండి పారి పోవాలని కోరింది.బంగ్లాదేశ్‌లో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న కుటుంబాల పిల్లలకు ఉద్యోగాల్లో 30 శాతం మేరకు కోటా కల్పిస్తున్నట్లు హసీనా ప్రభుత్వం ప్రకటించింది. ఈ కోటాకు వ్యతిరేకంగా నెల రోజుల పాటు సాగిన విద్యార్థి ప్రదర్శనల పట్ల షేక్ హసీనా ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదు. ఆ ఘటన... బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాత్– ఎ–ఇస్లామీ పార్టీల్లోని ఆమె ప్రత్యర్థుల మద్దతుతో పాలన మార్పు కోసం డిమాండ్‌గా మారిందని ఇక్కడ తిరిగి చెప్పాల్సిన పనిలేదు.బంగ్లాదేశ్ బాగుండాలని కోరుకునే వారికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, విద్యార్థుల ప్రతిఘటనా ఉద్యమం పాలనా మార్పు కోసం డిమాండ్‌గా మాత్రమే కాకుండా, భావజాల మార్పు కోసం ప్రతీకార యుద్ధంగా మారింది. హసీనా దేశం విడిచి పారి పోవడంతో, బంగ్లాదేశ్ జాతిపిత ముజిబుర్ రెహ్మాన్ విగ్రహాన్ని ఇస్లాం విరుద్ధమని పేర్కొంటూ ఆందోళనాకారులు పగలగొట్టారు. అవామీ లీగ్ నాయకుల కార్యాలయాలను, ఇళ్లను కూడా తగలబెట్టారు. అంతకు ముందు రోజు రాత్రి రంగ్‌పూర్‌లో, ఇతర ప్రాంతాల్లో మైనా రిటీల ఇళ్లపై, గ్రామాలపై దాడులు జరి గాయి. ఇది బంగ్లాదేశ్‌కు, మరీ ముఖ్యంగా పొరుగు దేశా లకు ఏ సంకేతాలను ఇస్తోంది?గత రెండు ఎన్నికలలో రిగ్గింగ్ చేసిన ఆరోపణలతో సహా, ఎన్ని తప్పులు చేసినప్పటికీ, అవామీ లీగ్ దేశంలో లౌకిక పాలనను అందించింది. బంగ్లాదేశ్‌లో నివసించే మైనారిటీల భూములు కబ్జాకు గురై, అప్పుడప్పుడు దాడులు జరిగినప్పటికీ, ఏ సైనిక నియంతృత్వం లేదా దేశాన్ని పాలించిన మునుపటి పాలనా వ్యవస్ధల కంటే చాలా ఎక్కువ స్థాయిలో వాళ్లు సమాన అవకాశాలను పొందారన్నది వాస్తవం.చిట్టగాంగ్ కొండ ప్రాంతాలలో బౌద్ధ గిరిజనులపై దాడులు, బరిషల్, ఫరీద్‌పూర్‌లలో హిందూ గ్రామాలను తగులబెట్టడం తర చుగా జరుగుతూ వచ్చిన బంగ్లా నేషనలిస్టు పార్టీ పాలించిన రోజుల్లోకి ప్రస్తుతం బంగ్లాదేశ్ దిగజారిపోవడం భారత్‌కు నిజంగానే ఆందోళన కలిగించే విషయం. ఈ పరిణామం ఇప్పటికే జనాభాపరంగా విస్తరించి ఉన్న పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లోకి వేలాదిమంది శరణార్థులను నెట్టివేస్తుంది. బంగ్లా నేషనలిస్టు పార్టీ పాలనలో, జిహాదీలను అఫ్గానిస్తాన్‌కు ఎగుమతి చేసి బంగ్లాదేశ్ అపఖ్యాతి పాలైంది. 2001లో తాలిబన్లను తరిమికొట్టిన తర్వాత, వారు బంగ్లాదేశ్‌కు తిరిగివచ్చి, ఢాకాలోనే కాకుండా భారత గడ్డపై దాడులకు పాల్పడి బీభత్సం సృష్టించారు. ఇప్పుడూ అలా జరిగే అవకాశం గురించి భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల ‘తిరుగుబాటు’లో కొందరు పాకిస్తానీ యులను జోడించారని ఇప్పటికే అనుమానాలు ఉన్నాయి. భారతదేశ ఈశాన్య ప్రాంతాల నుండి ఉగ్రవాదు లకు సురక్షితమైన స్వర్గధామాలను సృష్టించడానికి, బంగ్లాదేశ్‌లోని అనుకూల వాతా వరణాన్ని పాకిస్తాన్ మళ్లీ ఉపయోగించుకునే అవకాశం ఉంది.భారతదేశం వంటి పొరుగు దేశాలతో వాణిజ్యం, ప్రయాణ కనెక్టివిటీకి ప్రాధాన్యత నిస్తూనే స్వతంత్ర అలీన విదేశాంగ విధానాన్ని కోరుకునే వారికీ... చైనాతో సన్నిహిత సంబంధాలను నెరపడానికి అవసరమైతే భారతదేశ భద్రతా ప్రయోజనాలతో రాజీ పడటానికైనా సిద్ధపడేవారికీ మధ్య అవామీ లీగ్ పాలన విభజితమై ఉండింది. ఏదేమైనప్పటికీ, షేక్ హసీనా ఎల్లప్పుడూ ఇతరులకు ప్రాధాన్య తనిస్తూనే భారతదేశంతో మెరుగైన సంబంధాలను నిర్మించుకునే వైఖరిని తీసుకుంటూ వచ్చారు. తీస్తా నదిని దిగువకు అభివృద్ధి చేసే విషయంలో, చైనా ప్రతిపా దనను పక్కనబెట్టి బంగ్లాదేశ్‌తో భాగస్వామి కావాలనే భారత ప్రతిపాదనకు సూటిగా అంగీకరించారు. ఆ మేరకు బీజింగ్ ఆమె పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు కొట్టివేసిన కోటాలకు (బంగ్లా స్వాతంత్య్రోద్యమం కోసం పోరాడిన కుటుంబాల పిల్లలకు ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు) వ్యతిరేకంగా జరిగిన ఒక ప్రదర్శన నుండి, పాలనా వ్యవస్థ మార్పు అనే సింగిల్ పాయింట్ పిలుపుగా విద్యార్థుల నిరసనలు రంగు మారుతున్న క్రమంలో ఇలా జరగటం అనేది మరొక విషయం. కానీ, చరిత్రకారులు, అంతర్జాతీయ సంబంధాల పరిశీలకులు ఏదో ఒక రోజు దీనిపై పరిశోధన చేయాల్సి ఉంటుంది. ఏమైనప్పటికీ, బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న చైనా కోరల గురించి భారతదేశమూ, గతంలో షేక్ హసీనా ప్రభుత్వాన్ని అనేక అంశాలలో వ్యతిరేకించిన పాశ్చాత్య దేశాలూ జాగ్ర త్తగా పరిశీలించాల్సిన అవ సరం ఉంది. చైనాకు బంగ్లాదేశ్ దాదాపు 7 బిలియన్ డాలర్ల రుణా లను చెల్లించాల్సి ఉంది. దాని రుణ చెల్లింపులు ఇప్పటికే దాని విదేశీ మారక నిల్వలకు సంబంధించి సంక్షోభం సృష్టించాయి. ఇవి 2021 ఆగస్టు, 2024 జూన్ మధ్య కాలంలో 60 శాతం మేరకు పడి పోయాయి. శ్రీలంకను అనుసరించి బంగ్లాదేశ్ కూడా చైనా రుణ ఉచ్చులో మునిగిపోవచ్చు. రుణమాఫీకి బదులుగా రుణదాతకు వ్యూహాత్మక ఓడరేవులు, ఆర్థిక మండలాలను ఇవ్వవలసి వస్తుంది కూడా. చైనా ఓడలు నెలల పర్యంతం హిందూ మహాసముద్ర ప్రాంతాలను సర్వే చేస్తున్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్ర ప్రాంత దేశాలలో విస్త రించిన చైనా నావికాదళ ఉనికితో ఇవి సంబంధం కలిగి ఉంటాయి. ఢాకాలో కొత్తగా రానున్న ప్రభుత్వంతో వ్యవహ రించేటప్పుడు ఈ అంశాలన్నింటినీ భారతీయ ఉన్నతాధి కారులు పరిగణనలోకి తీసుకోవాలి. ఈ పరిస్థితులలో, భారతదేశం, ప్రజాస్వామ్య ప్రపంచం కాయవలసిన ఉత్తమమైన పందెం ఏమిటంటే బంగ్లా దేశ్ మిలిటరీకి మద్దతు ఇవ్వడం, ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం చైనా అనుకూల మంత్రులు లేదా కరడు గట్టిన ఛాందసవాదులతో నింపబడకుండా చూసుకోవడం. అవామీ లీగ్ పని ముగియలేదు. అది ఇప్పటికీ దేశంలో లోతైన మూలాలను కలిగి ఉంది. పెద్ద సంఖ్యలో మద్దతు దారులను కలిగి ఉంది. సైన్యం ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసిన తాత్కాలిక ప్రభుత్వంలో అవామీ లీగ్ తన స్థానాన్ని కోల్పోకూడదు.చివరగా, ప్రపంచం శరవేగంతో మారుతుంది. కమ్యూ నిజం రాత్రికి రాత్రే మరణించినట్లే, షేక్ హసీనా ప్రభుత్వం కూడా కుప్పకూలి పోయింది. ఏదేమైనప్పటికీ, భావజాలాలు పాలనా వ్యవస్థల కంటే ఎక్కువ కాలం కొనసాగుతాయి. ఇవి సరైన ‘వాతావరణ పరిస్థితుల’లో పునరాగమనం చేయ గలవు. బంగ్లాదేశ్‌లో పెట్టుబడులు పెట్టిన భారతదేశం, ఇతర దేశాలన్నీ ఆ పాఠాన్ని గుర్తుంచుకోవడం మంచిది.జయంత రాయ్ చౌధురీ వ్యాసకర్త పీటీఐ తూర్పు రీజియన్ మాజీ హెడ్(‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
బంగ్లాదేశ్ అల్లర్లు: షేక్ హసీనా పార్టీ నేతలే టార్గెట్!
ఢాకా: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా చేస్తున్న అల్లర్లు కొనసాగుతున్నాయి. నిరసనకారుల అల్లర్లు తీవ్ర హింసాత్మకంగా మారటంతో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి.. తన సోదరితో కలిసి భారత్‌కు వచ్చారు. అయితే ఆమె భారత్ చేరిన తర్వాత నుంచి నిరసనకారులు షేక్‌హసీనా పార్టీ నేతలను టార్గేట్ చేసి దాడులు మరింత తీవ్రం చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంటోంది. దేశవ్యాప్తంగా షేక్‌హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నేతలు, కార్యకర్తల ఇళ్లు, వ్యాపార సంస్థలను ధ్వంసం చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలినట్లు స్థానిక మీడియాలో వెల్లడిస్తోంది. దేశ రాజధాని ఢాకాకు 100 కి.మీ దూరంలోని కొమిల్లా నగరంలో మాజీ కౌన్సిలర్ ఎండీ షా ఆలం ఇంటికి నిరసనకారలు నిప్పుపెట్టారు. మంగళవారం ఎంపీ షఫీకుల్ ఇస్లాం షిముల్ ఇంటికి ఆందోళనకారులు గుంపు నిప్పు పెట్టడంతో నలుగురు వ్యక్తులు మరణించారు. ఇంట్లో, బాల్కనీల్లో మృతదేహాలు లభ్యమయ్యాయి. మంగళవారం ఢాకాలోని అవామీలీగ్ పార్టీ కార్యాలయాలకు నిసరనకారులు నిప్పుపెట్టి ధ్వంసం చేశారు. దేశవ్యాప్తంగా షేక్ హసీనా పార్టీ నేతలు, మైనార్టీలైన హిందువులే లక్ష్యంగా దాడులకు తెగపడ్డారు. సోమ, మంగళవారం సుమారు 97 ప్రాంతాల్లో మైనార్టీలకు సంబంధించిన ఇళ్లు, షాప్‌లపై నిరసనకారులు దాడులు జరిగినట్లు బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యతా మండలి ప్రధాన కార్యదర్శి రాణా దాస్‌గుప్తా పేర్కొన్నారు. దక్షిణ బాగర్హాట్ జిల్లాలో ఒక హిందూ వ్యక్తిపై తీవ్రంగా దాడి చేయటంతో చికిత్స పొందుతూ మరణించినట్లు స్థానిక ఆసుపత్రి అధికారి తెలిపారు. ఖుల్నా డివిజన్లోని జబీర్ ఇంటర్నేషనల్ హోటల్‌కు నిరసనకారులు నిప్పుపెట్టిన ఘటనలో 24 మంది సజీవదహనం అయ్యారు. ఈ హోటల్ జషోర్ జిల్లా అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి షాహిన్ చక్లాదర్‌కు చెందినది. మృతదేహాలు హోటల్లోని వేర్వేరు అంతస్తుల్లో పడి ఉన్నాయని ఖుల్నా ఫైర్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్ మమున్ మహమూద్ వెల్లడించారు. ఇప్పటివరకు జరిగిన నిరసనల్లో మొత్తం 440 మంది మరణించగా.. షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీకి చెందిన నేతలు 20 మంది ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంటోంది. మరోవైపు.. షేక్ హసీనా దేశం విడిచివెళ్లిపోవటంతో మంగళవారం బంగ్లాదేశ్ పార్లమెంట్‌ను రద్దు చేశారు. నోబెల్ విజేత ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారని మహ్మద్ షహబుద్దీన్ ప్రకటించారు. ఆయన ఆర్మీ, విద్యార్థి నాయకులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘డాక్టర్ ముహమ్మద్ యూనస్ చీఫ్‌గా నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాము’అని అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. -
‘షేక్ హసీనాను మాకు అప్పగించండి’
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని ఆదేశ ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జాయింట్ జనరల్ సెక్రటరీ, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌ఈబీఏ) ప్రెసిడెంట్ ఏఎమ్ మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ భారత్‌కు విజ్ఞప్తి చేశారు.దేశంలో చెలరేగిన అల్లర్ల అనంతరం తన పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చిన షేక్ హసీనా,ఆమె సోదరి షేక్ రహానాను తమకు అప్పగించాలని ఖోకాన్ భారత్‌ను కోరినట్లు బంగ్లాదేశ్ మీడియా సంస్థ ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది.చదవండి : బ్రిటన్ నిరాకరణ!.. మరికొద్ది రోజులు భారత్‌లోనే హసీనాఎస్ఈబీఏ ఆడిటోరియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఖోకాన్ మాట్లాడారు. భారత్‌తో స్నేహాన్ని కోరుకుంటున్నట్లు చెబుతూనే.. తమ దేశం నుంచి పారిపోయి విదేశంలో తలదాచుకుంటున్న హసీనాను అరెస్ట్ చేసి తమకు అప్పగించాలని వ్యాఖ్యానించారు.బంగ్లాదేశ్‌లో అమాయకుల ప్రాణాలు కోల్పోయారని, వారిని హసీనానే చంపారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఖోకాన్ దేశంలో అత్యవసర పరిస్థితికి పిలుపునివ్వాలని అన్నారు. వారం పది రోజుల్లో సుప్రీం కోర్టు న్యాయవాదులు రాజీనామాలు చేసి అవినీతికి వ్యతిరేకంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని పిలుపునిచ్చారు. -
బంగ్లాదేశ్ అంటే భయపడాల్సిందేనా?
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఒక ప్రదర్శన, పాలనా వ్యవస్థ మార్పు అనే సింగిల్ పాయింట్ పిలుపుగా బంగ్లాదేశ్‌లో రంగులు మారింది. దాంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశాన్ని వీడాల్సి వచ్చింది. నిరసనల్లో కొందరు పాకిస్తానీయులను జోడించారని ఇప్పటికే అనుమానాలు ఉన్నాయి. భారత ఈశాన్య ప్రాంతాల నుండి ఉగ్రవాదులకు సురక్షితమైన స్వర్గధామాలను సృష్టించడానికి, బంగ్లాదేశ్ అనుకూల వాతావరణాన్ని పాక్ మళ్లీ ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఏమైనప్పటికీ, బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న చైనా కోరల గురించి భారత్ జాగ్రత్త పడాలి. ఈ పరిస్థితులలో భారత్ చేయవలసింది... బంగ్లాదేశ్ మిలిటరీకి మద్దతు ఇవ్వడం! ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో చైనా అనుకూలురు నిండిపోకుండా చూసుకోవడం!!ముజిబుర్ రెహ్మాన్ కుటుంబానికి ఆగస్టు ఎప్పుడూ క్రూరమైన నెలగానే ఉంటోంది. బంగ్లాదేశ్ వ్యవస్థాపక నిర్మాత షేక్ ముజిబుర్ రెహ్మాన్ తన మొత్తం కుటుంబంతో సహా 1975 ఆగస్టు 15 తెల్లవారుజామున సైనిక తిరుగు బాటులో మరణించారు. ఆయన ఇద్దరు కుమార్తెలు షేక్ హసీనా, షేక్ రెహానా భారతదేశానికి వలస రావలసి వచ్చింది.తన తండ్రి వారసురాలిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన షేక్ హసీనా, 2004 ఆగస్టు 21న తాను ప్రసంగిస్తున్న ర్యాలీపై గ్రెనేడ్ దాడిలో గాయపడి దాదాపు మరణం అంచులను తాకి వచ్చారు.బంగ్లాదేశ్‌లోని సిల్హెట్లో హర్కత్–ఉల్–జిహాద్ అనే ఉగ్రవాద సంస్థ చేసిన ఆ దాడిలో అవామీ లీగ్ కార్యకర్తలు చాలామంది మరణించారు. ఇప్పుడు 20 సంవత్సరాల తరువాత ఆగస్టు మధ్యాహ్నం, హసీనాను ప్రధాని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ, ఆమె నివాసంపై దాడి చేస్తామని బెదిరించిన నిరసనకారులను కాల్చి చంపడా నికి ఇష్టపడని బంగ్లాదేశ్ సైన్యం, ఆమెను పదవి వీడి ఢాకా నుండి పారిపోవాలని కోరింది.బంగ్లాదేశ్‌లో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న కుటుంబాల పిల్లలకు ఉద్యోగాల్లో 30 శాతం మేరకు కోటా కల్పిస్తున్నట్లు హసీనా ప్రభుత్వం ప్రకటించింది. ఈ కోటాకు వ్యతిరేకంగా నెల రోజుల పాటు సాగిన విద్యార్థి ప్రదర్శనల పట్ల షేక్ హసీనా ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదు. ఆ ఘటన... బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాత్– ఎ–ఇస్లామీ పార్టీల్లోని ఆమె ప్రత్యర్థుల మద్దతుతో పాలన మార్పు కోసం డిమాండ్‌గా మారిందని ఇక్కడ తిరిగి చెప్పాల్సిన పనిలేదు.బంగ్లాదేశ్ బాగుండాలని కోరుకునే వారికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, విద్యార్థుల ప్రతిఘటనా ఉద్యమం పాలనా మార్పు కోసం డిమాండ్‌గా మాత్రమే కాకుండా, భావజాల మార్పు కోసం ప్రతీకార యుద్ధంగా మారింది. హసీనా దేశం విడిచి పారి పోవ డంతో, బంగ్లాదేశ్ జాతిపిత ముజిబుర్ రెహ్మాన్ విగ్రహాన్ని ఇస్లాం విరుద్ధమని పేర్కొంటూ ఆందోళనాకారులు పగలగొట్టారు. అవామీ లీగ్ నాయకుల కార్యాలయాలను, ఇళ్లను కూడా తగలబెట్టారు.అంతకు ముందు రోజు రాత్రి రంగ్‌పూర్‌లో, ఇతర ప్రాంతాల్లో మైనా రిటీల ఇళ్లపై, గ్రామాలపై దాడులు జరిగాయి. ఇది బంగ్లాదేశ్‌కు, మరీ ముఖ్యంగా పొరుగు దేశాలకు ఏ సంకేతాలను ఇస్తోంది?గత రెండు ఎన్నికలలో రిగ్గింగ్ చేసిన ఆరోపణలతో సహా, ఎన్ని తప్పులు చేసినప్పటికీ, అవామీ లీగ్ దేశంలో లౌకిక పాలనను అందించింది. బంగ్లాదేశ్‌లో నివసించే మైనారిటీల భూములు కబ్జాకు గురై, అప్పుడప్పుడు దాడులు జరిగినప్పటికీ, ఏ సైనిక నియంతృత్వం లేదా దేశాన్ని పాలించిన మునుపటి పాలనా వ్యవస్ధల కంటే చాలా ఎక్కువ స్థాయిలో వాళ్లు సమాన అవకాశాలను పొందారన్నది వాస్తవం.చిట్టగాంగ్ కొండ ప్రాంతాలలో బౌద్ధ గిరిజనులపై దాడులు, బరిషల్, ఫరీద్‌పూర్‌లలో హిందూ గ్రామాలను తగులబెట్టడం తర చుగా జరుగుతూ వచ్చిన బంగ్లా నేషనలిస్టు పార్టీ పాలించిన రోజుల్లోకి ప్రస్తుతం బంగ్లాదేశ్ దిగజారిపోవడం భారత్‌కు నిజంగానే ఆందోళన కలిగించే విషయం. ఈ పరిణామం ఇప్పటికే జనాభాపరంగా విస్తరించి ఉన్న పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపుర, మేఘాలయ రాష్ట్రా ల్లోకి వేలాదిమంది శరణార్థులను నెట్టివేస్తుంది. బంగ్లా నేషనలిస్టు పార్టీ పాలనలో, జిహాదీలను అఫ్గానిస్తాన్‌కు ఎగుమతి చేసి బంగ్లాదేశ్ అపఖ్యాతి పాలైంది. 2001లో తాలిబన్లను తరిమికొట్టిన తర్వాత, వారు బంగ్లాదేశ్‌కు తిరిగివచ్చి, ఢాకాలోనే కాకుండా భారత గడ్డపై దాడులకు పాల్పడి బీభత్సం సృష్టించారు. ఇప్పుడూ అలా జరిగే అవకాశం గురించి భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల ‘తిరుగుబాటు’లో కొందరు పాకిస్తానీ యులను జోడించారని ఇప్పటికే అనుమానాలు ఉన్నాయి. భారతదేశ ఈశాన్య ప్రాంతాల నుండి ఉగ్రవాదులకు సురక్షితమైన స్వర్గధామా లను సృష్టించడానికి, బంగ్లాదేశ్‌లోని అనుకూల వాతావరణాన్ని పాకిస్తాన్ మళ్లీ ఉపయోగించుకునే అవకాశం ఉంది.భారతదేశం వంటి పొరుగు దేశాలతో వాణిజ్యం, ప్రయాణ కనెక్టివిటీకి ప్రాధాన్యతనిస్తూనే స్వతంత్ర అలీన విదేశాంగ విధానాన్ని కోరుకునే వారికీ... చైనాతో సన్నిహిత సంబంధాలను నెరపడానికి అవసరమైతే భారతదేశ భద్రతా ప్రయోజనాలతో రాజీ పడటానికైనా సిద్ధపడేవారికీ మధ్య అవామీ లీగ్ పాలన విభజితమై ఉండింది. ఏదేమైనప్పటికీ, షేక్ హసీనా ఎల్లప్పుడూ ఇతరులకు ప్రాధాన్య తనిస్తూనే భారతదేశంతో మెరుగైన సంబంధాలను నిర్మించుకునే వైఖరిని తీసుకుంటూ వచ్చారు. తీస్తా నదిని దిగువకు అభివృద్ధి చేసే విషయంలో, చైనా ప్రతిపాదనను పక్కనబెట్టి బంగ్లాదేశ్‌తో భాగ స్వామి కావాలనే భారత ప్రతిపాదనకు సూటిగా అంగీకరించారు. ఆ మేరకు బీజింగ్ ఆమె పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు కొట్టివేసిన కోటాలకు (బంగ్లా స్వాతంత్య్రోద్యమం కోసం పోరాడిన కుటుంబాల పిల్లలకు ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు) వ్యతిరేకంగా జరిగిన ఒక ప్రదర్శన నుండి, పాలనా వ్యవస్థ మార్పు అనే సింగిల్ పాయింట్ పిలుపుగా విద్యార్థుల నిరసనలు రంగు మారుతున్న క్రమంలో ఇలా జరగటం అనేది మరొక విషయం. కానీ, చరిత్ర కారులు, అంతర్జాతీయ సంబంధాల పరిశీలకులు ఏదో ఒక రోజు దీనిపై పరిశోధన చేయాల్సి ఉంటుంది. ఏమైనప్పటికీ, బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న చైనా కోరల గురించి భారతదేశమూ, గతంలో షేక్ హసీనా ప్రభుత్వాన్ని అనేక అంశాలలో వ్యతిరేకించిన పాశ్చాత్య దేశాలూ జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవ సరం ఉంది. చైనాకు బంగ్లాదేశ్ దాదాపు 7 బిలియన్ డాలర్ల రుణా లను చెల్లించాల్సి ఉంది. దాని రుణ చెల్లింపులు ఇప్పటికే దాని విదేశీ మారక నిల్వలకు సంబంధించి సంక్షోభం సృష్టించాయి. ఇవి 2021 ఆగస్టు, 2024 జూన్ మధ్య కాలంలో 60 శాతం మేరకు పడి పోయాయి. శ్రీలంకను అనుసరించి బంగ్లాదేశ్ కూడా చైనా రుణ ఉచ్చులో మునిగిపోవచ్చు. రుణమాఫీకి బదులుగా రుణదాతకు వ్యూహాత్మక ఓడరేవులు, ఆర్థిక మండలాలను ఇవ్వవలసి వస్తుంది కూడా. చైనా ఓడలు నెలల పర్యంతం హిందూ మహాసముద్ర ప్రాంతాలను సర్వే చేస్తున్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్ర ప్రాంత దేశాలలో విస్తరించిన చైనా నావికాదళ ఉనికితో ఇవి సంబంధం కలిగి ఉంటాయి. ఢాకాలో కొత్తగా రానున్న ప్రభుత్వంతో వ్యవహరించేటప్పుడు ఈ అంశాలన్నింటినీ భారతీయ ఉన్నతాధి కారులు పరిగణనలోకి తీసుకోవాలి. ఈ పరిస్థితులలో, భారతదేశం, ప్రజాస్వామ్య ప్రపంచం కాయ వలసిన ఉత్తమమైన పందెం ఏమిటంటే బంగ్లాదేశ్ మిలిటరీకి మద్దతు ఇవ్వడం, ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం చైనా అనుకూల మంత్రులు లేదా కరడుగట్టిన ఛాందసవాదులతో నింపబడకుండా చూసుకో వడం. అవామీ లీగ్ పని ముగియలేదు. అది ఇప్పటికీ దేశంలో లోతైన మూలాలను కలిగి ఉంది. పెద్ద సంఖ్యలో మద్దతుదారులను కలిగి ఉంది. సైన్యం ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసిన తాత్కాలిక ప్రభు త్వంలో అవామీ లీగ్ తన స్థానాన్ని కోల్పోకూడదు.చివరగా, ప్రపంచం శరవేగంతో మారుతుంది. కమ్యూనిజం రాత్రికి రాత్రే మరణించినట్లే, షేక్ హసీనా ప్రభుత్వం కూడా కుప్పకూలి పోయింది. ఏదేమైనప్పటికీ, భావజాలాలు పాలనా వ్యవస్థల కంటే ఎక్కువ కాలం కొనసాగుతాయి. ఇవి సరైన ‘వాతావరణ పరిస్థితు ల’లో పునరాగమనం చేయగలవు. బంగ్లాదేశ్‌లో పెట్టుబడులు పెట్టిన భారతదేశం, ఇతర దేశాలన్నీ ఆ పాఠాన్ని గుర్తుంచుకోవడం మంచిది.జయంత రాయ్ చౌధురీ వ్యాసకర్త పీటీఐ తూర్పు రీజియన్ మాజీ హెడ్(‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
బ్రిటన్ నిరాకరణ!.. మరికొద్ది రోజులు భారత్‌లోనే హసీనా
న్యూఢిల్లీ/లండన్: బంగ్లాదేశ్ తాజా మాజీ ప్రధాని షేక్ హసీనాకు రాజకీయ ఆశ్రయం కల్పించేందుకు బ్రిటన్ వెనకాడుతున్నట్టు తెలుస్తోంది. దాంతో ఆమె ఇతర అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరికొంతకాలం ఆమె భారత్‌లోనే ఉండనున్నారు. రిజర్వేషన్ల రగడ శ్రుతి మించి పరిస్థితి చేయి దాటిపోవడంతో సోమవారం మధ్యాహ్నం ఆమె రాజీనామా చేసి సోదరి షేక్ రెహానాతో కలిసి ఢిల్లీ చేరుకోవడం తెలిసిందే. తాత్కాలిక ఆశ్రయం నిమిత్తం వీలైనంత త్వరగా లండన్ వెళ్లాలని భావించారు.కానీ బంగ్లాతో తాజాగా చెలరేగిన హింసాకాండకు బాధ్యురాలిగా హసీనాపై విచారణ జరిగే పక్షంలో ఆమెను స్వదేశానికి అప్పగించకుండా చట్టపరమైన రక్షణ కలి్పంచలేమని బ్రిటన్ సంకేతాలిచి్చంది. తాజా హింసాకాండపై ఐరాస సారథ్యంలో స్వతంత్ర దర్యాప్తు జరగాలని బ్రిటన్ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో యూఏఈ, ఖతర్, సౌదీ అరేబియాతో పాటు బెలారస్ వంటి దేశాలకు వెళ్లే అవకాశాలను హసీనా పరిశీలిస్తున్నట్టు సమాచారం. తన కుటుంబ సభ్యులున్న ఫిన్లండ్ వెళ్లే ఆలోచన కూడా ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం హసీనా, రెహానా ఢిల్లీలోనే రహస్య ప్రాంతంలో ఉన్నారు. రెహానాకు బ్రిటన్ పౌరసత్వముంది. ఆమె కూతురు తులిప్ సిద్దిఖ్ బ్రిటన్‌లో అధికార లేబర్ పార్టీ ఎంపీ కూడా.దేశం వీడే ముందు... హసీనా రాజీనామా చేసి బంగ్లాదేశ్‌ను వీడేముందు జరిగిన నాటకీయ పరిణామాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆమె సోమవారం ఉదయం ఢాకాలో తన అధికారిక నివాసంలో త్రివిధ దళాధిపతులు, ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఆందోళనలను అదుపు చేయలేకపోతున్నారంటూ ఆగ్రహించారు. పరిస్థితిని చక్కదిద్దాలన్నారు. ఆ దశ ఎప్పుడో దాటిపోయిందని వారు బదులిచ్చారు. అధికారం వీడేలా హసీనాను ఒప్పించేందుకు నాలుగు గంటల పాటు ప్రయత్నించారు రాజీనామా చేసి దేశం వీడటమే మార్గమని చెల్లెలు రెహానాతో కూడా చెప్పించారు.అదే సమయంలో విద్యార్థులు, యువకులు కర్ఫ్యూను ధిక్కరించి మరీ ప్రధాని అధికార నివాసాన్ని ముట్టడించేందుకు దేశ చరిత్రలోనే కనీవినీ ఎరగని సంఖ్యలో ఢాకా వీధుల గుండా పోటెత్తసాగారు. దాంతో, ‘‘పరిస్థితి చేయి దాటుతోంది. గంటలోపే జనప్రవాహం వచ్చిపడొచ్చు, 45 నిమిషాల్లో సర్వం సర్దుకుని దేశం వీడా’లంటూ హసీనాకు సైనిక ఉన్నతాధికారులు స్పష్టం చేశారు! విదేశాల్లో ఉన్న కుమారుడు కూడా ఫోన్లో అదే మాట చెప్పిన మీదట ఆమె అంగీకరించారు. ప్రజలనుద్దేశించి చివరగా సందేశమివ్వాలని భావించినా, అంత సమయం లేదని అధికారులు చెప్పడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. సోదరితో కలిసి ఇంటి ఆవరణలో సిద్ధంగా ఉన్న హెలికాప్టర్ ఎక్కారు. అధ్యక్ష నివాసం చేరుకుని ఆయనకు లాంఛనంగా రాజీనామా సమర్పించారు. హుటాహుటిన విమానాశ్రయం చేరుకుని, సిద్ధంగా ఉన్న సైనిక రవాణా విమానమెక్కి దేశం వీడారు. -
చైనా,ఐఎస్ఐ హస్తం?
బంగ్లాదేశ్ కల్లోలం వెనక విదేశీ హస్తముందా? చైనా, పాక్ ఐఎస్ఐ కలిసి పక్కా ప్రణాళికతోనే సంక్షోభాన్ని సృష్టించాయా? భారత్ పట్ల అనుకూలంగా ఉన్నందుకే షేక్ హసీనా పట్ల అక్కసు పెంచుకున్నాయా? తమ జేబు సంస్థల ద్వారా అరాచకం సృష్టించి ఆమెను గద్దె దించడంలో సఫలమయ్యాయా? రిజర్వేషన్ల ఆందోళన వాటికి అందివచ్చిన ఆయుధంగా మారిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. యువత, విద్యార్థుల ఆందోళనలో ఐఎస్ఐ శక్తులు చేరి పరిస్థితి చేయి దాటేలా చూడటంలో సఫలీకృతమైనట్టు పలు దేశాల నిఘా వర్గాలు నిర్థారిస్తున్నాయి.వాటి కథనం ప్రకారం... బంగ్లాదేశ్‌లో ఎలాగైనా భారత వ్యతిరేక, చైనా–పాక్ అనుకూల సర్కారు కొలువుదీరేలా చూడటమే లక్ష్యంగా ఐఎస్ఐ పావులు కదిపింది. ఇందుకోసం బంగ్లాలోని ఐఎస్ఐ స్లీపర్‌సెల్స్ రాత్రింబవళ్లూ పని చేశాయి. ముఖ్యంగా ఢాకాలో పరిస్థితులు పూర్తిగా చేయి దాటిపోవడం వెనక ఐఎస్ఐ ముసుగు సంస్థ జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్, దాని విద్యార్థి విభాగం ఇస్లామీ ఛాత్ర శివిర్ (ఐసీఎస్) కీలక పాత్ర పోషించాయి. యువత, విద్యార్థులు చేపట్టిన ఆందోళనలను వీలైనంతగా ఎగదోశాయి. ఇందుకోసం జమాత్, ఐసీఎస్ సభ్యులు విద్యార్థుల ముసుగులో పని చేశారు. జమాత్‌కు నిత్యం పాక్, ఐఎస్ఐ నుంచే నిధులందుతాయి. ఎప్పుడు, ఎక్కడ, ఏం చేయాలో ఢాకాలోని పాక్ హై కమిషన్ నుంచి ఎప్పటికప్పుడు నిర్దేశాలు వస్తుంటాయి. ఆ మేరకు జమాత్ సభ్యులు సైలెంటుగా పని చక్కబెడతారని పాక్‌లోని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు మీడియా సంస్థలు కథనాలు వెలువరిస్తున్నాయి. లండన్‌లో వ్యూహరచన! హసీనాను వీలైనంత త్వరగా గద్దె దింపి భారత వ్యతిరేకి అయిన మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా సారథ్యంలోని విపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) అధికారంలోకి వచ్చేలా చూడటమే టాస్‌్కగా ఐఎస్ఐ పావులు కదిపింది. తద్వారా నానాటికీ సుదృఢంగా మారుతున్న భారత్–బంగ్లా సంబంధాలకు బ్రేక్ వేయడంతో పాటు కశ్మీర్ నుంచే గాక బంగ్లా వైపు నుంచి కూడా భారత్‌లోకి ఉగ్రవాదులను చొప్పించే వ్యూహం దీని వెనక దాగుంది. లండన్‌లో ఇందుకు పక్కగా స్కెచ్ తయారైనట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ ఇటీవల ఐఎస్ఐ వర్గాలతో సౌదీ అరేబియాలో భేటీ అయినట్టు సమాచారం.అనంతరం ప్రణాళికను పక్కాగా అమల్లో పెట్టారు. అందులో భాగంగా అల్లర్ల వ్యాప్తికి జూన్‌లోనే ఐసీఎస్ వ్యూహాలు సిద్ధం చేసుకుంది. వీలైనంత అరాచకం సృష్టించడమే లక్ష్యంగా జమాతే, ఐసీఎస్‌లకు ఐఎస్ఐ భారీగా నిధులిచి్చనట్టు వెలుగులోకి వచి్చంది. వాటిలో అత్యధిక మొత్తాలను ఫండింగ్ చేసింది పాక్‌లోని చైనా సంస్థలేనని తేలింది. అంతిమంగా బంగ్లాలోనూ తాలిబన్ తరహా పాలన తేవాలన్నది వాటికి ఐఎస్ఐ, చైనా అప్పగించిన టాస్క్ అని నిఘా వర్గాలు నిర్ధారణకు వచ్చాయి. ఈ మేరకు కొద్ది నెలల క్రితమే ఐసీఎస్ రంగంలోకి దిగింది.ఢాకాతో పాటు పలు నగరాల్లో విద్యార్థులను నయానా భయానా భారీ సంఖ్యలో తమ సానుభూతిపరులుగా మార్చుకుంది. బంగ్లాదేశ్ అంతటా ఘర్షణలు తీవ్ర రూపు దాల్చేలా, పరిస్థితి చేయి దాటిపోయేలా చేయడం వెనక ఈ సంస్థే ప్రధాన పాత్ర పోషించిందని తేలింది. దానికి ఢాకాలోని పాక్ ఎంబసీ అన్నివిధాలా దన్నుగా నిలిచింది. ఈ క్రమంలో, అవసరమైతే తమ కార్యాలయంలో తలదాచుకోవాల్సిందిగా విద్యార్థులకు చెప్పేదాకా వెళ్లిందని దౌత్య వర్గాలంటున్నాయి!చైనా హస్తం సుస్పష్టంబంగ్లా కల్లోలం వెనక చైనా విదేశాంగ, భద్రతా వ్యవహారాల శాఖ హస్తం కూడా ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి. తమకంటే భారత్‌కు హసీనా ఎక్కువ ప్రాధాన్యమివ్వడం చైనాకు రుచించని అంశాల్లో ఒకటి. పాక్ అనుకూల సర్కారైతే తన చెప్పుచేతల్లో ఉంటుందన్నది చైనా వ్యూహం. హసీనాను గద్దె దింపడం వెనక కచ్చితంగా విదేశీ హస్తముందని ఆ దేశంలో భారత హైకమిషనర్‌గా చేసిన వీణా సిక్రీ అన్నారు. ‘‘ఇటీవలి చైనా పర్యటన సందర్భంగా హసీనాను ఘోరంగా అవమానించిన తీరే ఇందుకు నిదర్శనం. ఆమెకు కనీస ప్రొటోకాల్ మర్యాద కూడా ఇవ్వలేదు. అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా హసీనాతో వ్యక్తిగతంగా భేటీ కాలేదు. ఆమె సర్కారును కూలదోయడం వెనక పాక్–చైనా ఉమ్మడి వ్యూహం ఉందన్నది స్పష్టమే’’ అని వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
..అదే కల్లోలం
ఢాకా: బంగ్లాదేశ్‌లో అరాచకం రాజ్యమేలుతోంది. షేక్ హసీనా ప్రధానిగా తప్పుకోవాలంటూ వెల్లువెత్తిన నిరసనలు ఆమె రాజీనామా చేసినా ఆగడం లేదు. సోమవారం సాయంత్రానికే హసీనా దేశం వీడినా రాత్రి పొడవునా దేశవ్యాప్తంగా దమనకాండ కొనసాగింది. అల్లరి మూకలు యథేచ్ఛగా విధ్వంసానికి దిగాయి. ఇళ్లు, దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలకు విచ్చలవిడిగా నిప్పు పెట్టారు. చివరికి పోలీస్ స్టేషన్లను కూడా వదల్లేదు. ఒకచోట ఎస్సైని కొట్టి చంపారు. మరోచోట ప్రముఖ సినీ హీరో ఇంటిపై నిరసనకారులు దాడికి దిగారు. హీరో, ఆయన తండ్రి తుపాకీతో బెదిరించడంతో మరింతగా రెచి్చపోయారు. ఇద్దరినీ కర్రలతో చితకబాది చంపేశారు. జోషోర్ జిల్లాలో హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నాయకుని హోటల్‌ను తగలబెట్టడంతో 24 మంది సజీవ దహనమయ్యారు! సోమవారం ఢాకాలో పాక్షికంగా ధ్వంసం చేసిన హసీనా తండ్రి, బంగబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ విగ్రహాన్ని బుల్డోజర్లతో కూల్చేశారు.మైనారిటీలైన హిందువులను దేశవ్యాప్తంగా అల్లరిమూకలు లక్ష్యం చేసుకున్నాయి. దేవాలయాలను ధ్వంసం చేశారు. మహిళలపై అకృత్యాలకు పాల్పడ్డారు. హసీనా పలాయనం అనంతరం దేశవ్యాప్తంగా కనీసం 100 మందికి పైగా అల్లర్లకు బలైనట్టు స్థానిక మీడియా పేర్కొంది. గత నెల రోజుల్లో మరణించిన వారి సంఖ్య 440 దాటింది. పోలీసులు, సైన్యం రంగంలోకి దిగడంతో మంగళవారం సాయంత్రానికి పరిస్థితి కాస్త అదుపులోకి వచి్చనట్టు చెబుతున్నారు. మరోవైపు న్యూయార్క్‌లోని బంగ్లాదేశ్ కాన్సులేట్‌పై దాడి జరిగింది. నిరసనకారులు కార్యాలయంలోకి జొరబడి ముజిబుర్ రెహ్మాన్ ఫొటోను, వస్తువులను ధ్వంసం చేశారు. సంబంధిత వీడియో వైరల్‌గా మారింది.తాత్కాలిక ప్రభుత్వ సారధి గాయూనుస్నోబెల్ గ్రహీత మహమ్మద్ యూ నుస్ సారథిగా సైన్యం కనుసన్నల్లో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది. అధ్యక్ష కార్యాల యం మంగళవారం అర్ధరాత్రి ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. కేసులు, జైలుశిక్ష నేపథ్యంలో యూనుస్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. హసీనా సర్కారు పతనాన్ని ఆయన స్వాగతించారు. ఈ పరిణామాన్ని దేశానికి రెండో విముక్తిగా అభివర్ణించారు. అంతకుముందు, విద్యార్థి సంఘాల అలి్టమేటం నేపథ్యంలో పార్లమెంటును రద్దు చేస్తూ అధ్యక్షుడు మొహమ్మద్ షాబుద్దీన్ నిర్ణయం తీసుకున్నారు. దాంతో మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు, సాధారణ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులతో అధ్యక్షుడు భేటీ అయ్యారు. తాత్కాలిక సర్కారు కూర్పుపై వారితో చర్చించారు. విపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) సారథి బేగం ఖలీదా జియా (79)ను గృహనిర్బంధం నుంచి విడుదల చేశారు. -
బంగ్లాదేశ్ సంక్షోభం.. ప్రతి నియంతకు ఒక గుణపాఠం: ఫరూక్ అబ్దుల్లా
బంగ్లాదేశ్‌లో నెలకొన్న హింసాత్మక పరిస్థితులు, రాజకీయ అస్థిరతపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. ప్రస్తుత బంగ్లాదేశ్ పరిణామాలు.. ఆ దేశానికే కాకుండా, ప్రతి నియంతకు ఒక హెచ్చరిక సందేశంగా పేర్కొన్నారు. ఈ మేరకు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత మాట్లాడుతూ.. షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడం, దేశం విడిచి పారిపోవడం.. ప్రతి నియంతకు ఓ గుణపాఠమని పేర్కొన్నారు. ప్రజల ఓపిక నశించినప్పుడు ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని అన్నారు. నియంతృత్వం ఎప్పటికైనా ప్రజల అసంతృప్తతి, ఆగ్రహానికి కారణమవుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా షేక్ హసీనా నిలబడలేదని, అందుకే ఆమె ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీయాల్సి వచ్చిందనిన్నారు.‘బంగ్లాదేశ్‌లో తీవ్రమైన అనిశ్చితి నెలకొంది. వారి ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ఆ దేశంలో అంతర్గత పరిస్థితి కూడా బాగా లేదు. అందుకే అక్కడ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు లేవనెత్తిన ఉద్యమాన్ని అణచివేయడం అక్కడి సైన్యానికి గానీ, ఇంకెవరికీ గానీ సాధ్యం కాలేదు. కాబట్టి ఇది ఒక గుణ పాఠం. బంగ్లాదేశ్‌కు మాత్రమే కాదు. ప్రజల ఆగ్రహానికి గురైన ప్రతి నియంత దీనిని నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రజల ఓపిక నశించే సమయం వస్తే ఇలాగే జరుగుతుంది’ అని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాపై నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. ఆదివారం జరిగిన అల్లర్లలో 100 మందికి పైగా మరణించగా.. మొత్తంగా 300 మంది మృతి చెందారు. నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి సోమవారం రాజీనామా చేసి, దేశం విడిచి వెళ్లిన విషయం తెలిసిందే.హసీనా రాజీనామాతో నిరసనకారులు చెలరేగిపోయారు. ప్రధాని ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. పలు వస్తువులను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. హసీనా తండ్రి, మాజీ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని కూల్చేశారు. బంగ్లాదేశ్ పార్లమెంటులోనూ విధ్వంసానికి పాల్పడ్డారు. -
బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాట్లు.. తెరపైకి ఆ ముగ్గురి పేర్లు
తీవ్ర నిరసనలు, అట్టుడికిన అల్లర్లలో బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా.. ప్రాణాలు కాపాడుకునేందుకు ఉన్నపళంగా దేశం వీడాల్సి వచ్చింది. రాజకీయ సంక్షోభం నెలకొన్న బంగ్లాలో ప్రస్తుతం దేశ పాలన సైన్యం నియంత్రణలోకి తీసుకుంది. నిరసన కారులను శాంతిపజేసి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు దేశ ఆర్మీ ప్రయత్నిస్తోంది. అదేవిధంగా నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ సలహాలతో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థి ఉద్యమ సమన్వయకర్తలు ప్రతిపాదించారు.దేశ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్‌లతో పాటు రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల సభ్యులు ఆయన నివాసంలో సమావేశమైన అనంతరం ఆ తాత్కాలిక ప్రభుత్వానికి బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ సోమవారం ఆలస్యంగా తన సమ్మతిని తెలిపారు.తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. హసీనా రాజకీయ విరోధి, మాజీ ప్రధాని ఖలీదా జియా. నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్, విద్యార్థి నాయకుడు నహీద్ ఇస్లాం. ఖలీదా జియా.. ఈ క్రమంలోనే అవినీతి ఆరోపణలపై 2018 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా విడుదలకు రాష్ట్రపతి ఆదేశించారు. అధికారాన్ని ఆర్మీ హస్తగతం చేసుకున్న వెంటనే ఈమేరకు దేశాధ్యక్షుడి నుంచి ఆదేశాలు వెలువడటం గమనార్హం. ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ప్రస్తుతం దేశంలో ప్రధాన ప్రతిపక్షం హోదాలో ఉంది.ఖలీదా జియా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన రాజకీయ నాయకురాలు. అలాగే దేశ తొలి మహిళా ప్రధాని. 1991 నుంచి 1996, 2001 నుంచి 2006 వరకు రెండు సార్లు బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా చేశారు. ఖలీదా 1996లో రెండవసారి పీఎంగా గెలిచినప్పటికీ షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్‌తో సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలను బహిష్కరించి ఖండించాయి. దీంతో ఆమె రెండవ పదవీకాలం 12 రోజులు మాత్రమే కొనసాగింది. అనంతరం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తరువాత ఎన్నికలు నిర్వహించగా.. హసీనా ప్రధానిగా గెలుపొందారు.2007లో ఖలీదా అవినీతి ఆరోపణలపై అరెస్టయ్యారు. 2018లో దోషిగా నిర్ధారించడంతో జైలు శిక్ష పడింది. అనేక ఆరోగ్య సమస్యల కారణంగా ఎక్కువ కాలం ఆమె ఆసుపత్రిలోనే గడిపారు. మరి ఈ సమయంలో విడుదలవుతున్న ఖలీదా ప్రధానమంత్రి పదవిని చేపడతారా లేదా అని తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె వయసు 78 ఏళ్లు. మహమ్మద్ యూనస్.. అతను 1983లో గ్రామీణ బ్యాంక్‌ను స్థాపించాడు. బంగ్లాదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి బ్యాంక్ చిన్న మొత్తంలో రుణాలను (రూ 2,000 వరకు) అందిస్తుంది. ఇది లక్షలాది మంది పేదరికం నుంచి బయటపడటానికి సహాయపడుతోంది. అందుకే యూనస్‌కు ి 'పేదలకు బ్యాంకర్' అనే మారుపేరు వచ్చింది. ఈ మోడల్ ఇప్పుడు 100 కంటే ఎక్కువ దేశాలలో కొనసాగుతోంది.బంగ్లాదేశ్‌లో కమ్యూనిటీ అభివృద్ధికి కృషి చేస్తున్న మైక్రోఫైనాన్స్ సంస్థ అయిన గ్రామీణ బ్యాంక్‌ను స్థాపించినందుకు 2006లో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు. అయితే యూనస్‌పై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. జూన్‌లో తన టెలికాం కంపెనీ అయినా గ్రామీణ టెలికాం సంబంధించిన కార్మికుల సంక్షేమ నిధి నుంచి 252.2 మిలియన్ టాకా (రూ. 219.4 కోట్లు) నిధుల దుర్వినియోగం చేసిన ఆరోపణలపై అభియోగాలు మోపారు. కానీ తనపై అభియోగాలు రాజకీయ ప్రోద్బలంతో మోపారని ఆరోపించారు.జనవరిలో కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆరు నెలల జైలు శిక్షను అనుభవించాడు.అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇక షేక్ హసీనా రాజీనామా తర్వాత అధికారాన్ని కైవసం చేసుకునేందుకు షేక్ హసీనా ప్రత్యర్థులు పెనుగులాడుతుండగా.. విద్యార్థులు మాత్రం యూనస్‌ను ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నారు. ఆర్మీ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు విద్యార్ధులు అంగీకరించడం లేదు.నహీద్ ఇస్లాం..26 ఏళ్ల నహీద్ ఇస్లాం సోషియాలజీ విద్యార్థి. ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ చట్టానికి వ్యతిరేకంగా తీవ్ర పోరాటం చేశాడు. ఈ కోటా విధానంలో సంస్కరణలను డిమాండ్ చేస్తూ విద్యార్ధుల ఉద్యమానికి జాతీయ సమన్వయకర్తగా పనిచేశారు. చివరకు హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేతకు దారి తీసిన నేత ఇస్లాం.జూలై 19వ తేదీన సుమారు 25 మంది నహిద్ ఇస్లామ్‌ను ఇంటి నుంచి ఎత్తుకెళ్లారు. అతని కళ్లకు గంతలు కట్టి, చేతులకు బేడీలు వేసి వేధించారు. రెండు రోజుల తర్వాత పూర్బాచల్ వద్ద ఉన్న ఓ బ్రిడ్జ్ కింద అతన్ని అపస్మారక స్థితిలో గుర్తించారు. జూలై 26వ తేదీ మరోసారి కూడా అతన్ని కిడ్నాప్ చేశారు. గోనోసహస్త్య నగర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సమయంలో.. ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ డిటెక్టివ్ బ్రాంచ్, హా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు చెందిన వ్యక్తులుగా చెప్పుకునే కొందరు అతన్ని అపహరించారు. కానీ నహిద్‌ను తాము ఎత్తుకెళ్లలేదని ఢాకా డిటెక్టివ్ పోలీసులు వెల్లడించారు. -
యూకే వైపు షేక్ హసీనా.. అప్పటి వరకు భారత్‌లోనే
ఢిల్లీ : బంగ్లాదేశ్ ప్రధాని పదవికి నిన్న రాజీనామా చేసిన షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఉన్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేసిన వెంటనే నిన్న భారత్‌కు చేరుకున్నారు షేక్ హసీనా.ఘజియాబాద్ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు సైనిక విమానంలో వచ్చిన షేక్ హసీనా లండన్ వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. హసీనా వెంట ఆమె సోదరి హసీనా కూడా ఉన్నారు. ప్రస్తుతానికి రహస్య ప్రదేశంలో ఉన్న హసీనా బ్రిటన్ సర్కార్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. అయితే బ్రిటన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆదేశం నుంచి అనుమతి రాగానే లండన్ బయలు దేరి వెళ్లే అవకాశం ఉంది.దేశం విడిచి పెట్టిన షేక్ హసీనా కుమారుడు సజీవ్ వాజెద్ జాయ్ ప్రకటించారు. వెనకబడిన దేశాన్ని అభివృద్ధి పదం వైపు దూసుకెళ్లేలా చేసిన హసీనా దేశంలో చెలరేగిన అల్లర్లపై అసంతృప్తితో ఉన్నట్లు వెల్లడించారు. -
బంగ్లా మాజీ కెప్టెన్ ఇంటికి నిప్పు.. మంటల్లో కాలిపోయిన ఇల్లు!
బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో మాజీ కెప్టెన్ మష్రాఫే మొర్తజాకు చేదు అనుభవం ఎదురైంది. నిరసనకారులు అతడి ఇంటికి నిప్పుపెట్టారు. గుంపుగా వచ్చి.. మొర్తజా ఇంటిని చుట్టుముట్టి.. విధ్వంసం సృష్టించారు. ది ఢాకా ట్రిబ్యూన్ ఈ మేరకు వార్త వెలువరించింది.ప్రధాని షేక్ హసీనా (76)కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో కొద్ది రోజులుగా జరుగుతున్న నిరసనలు సోమవారం మరింత ఉధృతమయ్యాయి. వెంటనే ఆమె రాజీనామా చేయాలంటూ నిరసనకారులు తీవ్రస్థాయిలో ఆందోళన చేశారు. ఈ క్రమంలో పరిస్థితి చేయిదాటిపోవడంతో షేక్ హసీనా దేశం విడిచిపారిపోయారు. జనాగ్రహాన్ని తాళలేక అప్పటికప్పుడు భారత్‌కు చేరుకున్నారు. విమానంలో హసీనా బయల్దేరి వెళ్తున్నారన్న వార్త తెలిసి.. రన్ వే మీదకు కూడా దూసుకొచ్చారు జనం. విమానం టేకాఫ్ అయ్యేంత వరకు వెంటపడ్డారు.ఈ నిరసన సెగ బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఫాస్ట్ బౌలర్ మొర్తజాకు కూడా తగిలింది. 2019లో నరేల్-2 డిస్ట్రిక్ట్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మొర్తజా అధికార అవామీ లీగ్ తరఫున ఎంపీగా ఎన్నికయ్యాడు. 2024 ఎన్నికల్లోనూ మరోసారి పదవిని కైవసం చేసుకున్నాడు. ప్రధానీ షేక్ హసీనాతో మొర్తజాకు సత్సంబంధాలు ఉన్నాయి. అతడి క్రికెట్ కెరీర్‌కు హసీనా మద్దతుగా నిలిచారు. అంతేకాదు.. అవామీ లీగ్ తరఫున టికెట్ ఇచ్చి ఎంపీగా గెలవడంలో కీలక పాత్ర పోషించారు.ఈ నేపథ్యంలో హసీనాపై ఉన్న జనాగ్రహం మొర్తజాను ఇలా షాక్‌కు గురిచేసింది. అతడి ఇల్లు కాలిపోతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. బంగ్లాదేశ్ అత్యుత్తమ కెప్టెన్‌గా మొర్తజా పేరుగాంచాడు. ముఖ్యంగా వన్డేల్లో అతడి ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉంది. 88 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన అతడు.. 50 మ్యాచ్‌లు గెలిపించాడు.బంగ్లాదేశ్ అత్యుత్తమ పేసర్‌గానూ మొర్తజాకు గుర్తింపు ఉంది. మూడు ఫార్మాట్లలో కలిపి అతడు 389 వికెట్లు పడగొట్టాడు. షకీబ్ అల్ హసన్ తర్వాత బంగ్లా తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ మొర్తజా. లోయర్ ఆర్డర్ బ్యాటర్‌గానూ రాణించిన మొర్తజా.. 6 టెస్టులు, 220 వన్డేలు,. 54 టీ20లలో కలిపి 2955 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లగా.. సైన్యాధ్యక్షుడు జనరల్ వకారుజ్జమాన్ తాత్కాలికంగా తానే ఆ బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు ప్రకటించాడు. -
Bangladesh: షేక్ హసీనా తండ్రి విషయంలోనూ..
బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. అక్కడి సైన్యం ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టింది. ఈ నేపధ్యంలో ఆమె తన పదవికి రాజీనామా చేయడమే కాకుండా దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. దీంతో బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు చేపట్టనుంది.బంగ్లాదేశ్‌లో ఈ విధమైన తిరుగుబాటు జరగడం ఇదేమీ మొదటిసారి కాదు. 1975లో కూడా ఇదేవిధంగా జరిగింది. నాటి తిరుగుబాటు సమయంలో షేక్ హసీనా తండ్రి, ఆమె సోదరులు హతమయ్యారు. అయితే షేక్ హసీనా ఎలాగోలా ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటన తర్వాత ఆమె బంగ్లాదేశ్‌కు దూరంగా ఇతర దేశాలలో సుమారు ఆరేళ్ల పాటు ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో ఆమె భారతదేశంలో కూడా చాలా కాలంపాటు ఉన్నారు.అది 1975వ సంవత్సరం.. షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఒక ఆర్మీ యూనిట్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసింది. కొంతమంది సాయుధులు షేక్ హసీనా ఇంట్లోకి ప్రవేశించి ఆమె తల్లిదండ్రులను, సోదరులను దారుణంగా హత్యచేశారు. అయితే ఆ సమయంలో షేక్ హసీనా తన భర్త వాజిద్ మియాన్, చెల్లెలు పాటు యూరప్‌లో ఉన్నందున ఈ దాడి నుంచి తప్పించుకోగలిగారు.ఈ ఘటన అనంతరం షేక్ హసీనా కొంతకాలం జర్మనీలో ఉండి భారత్‌కు వచ్చారు. నాడు భారతదేశంలోని ఇందిరా గాంధీ ప్రభుత్వం ఆమెకు ఆశ్రయం ఇచ్చింది. షేక్ హసీనా 1981లో బంగ్లాదేశ్‌కు తిరిగి చేరుకున్నారు. ఆమె బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చిన సమయంలో ఆమెకు మద్దతుగా లక్షలాది మంది ప్రజలు విమానాశ్రయానికి చేరుకుని స్వాగతం పలికారు. దీని తరువాత షేక్ హసీనా 1986 సాధారణ ఎన్నికలలో పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. అయితే 1996 ఎన్నికల్లో విజయం సాధించిన ఆమె 2001 వరకూ ప్రధాని పదవి చేపట్టారు. అలాగే 2009 నుంచి 2004 వరకూ కూడా షేక్ హసీనా ప్రధాని పదవిలో ఉన్నారు. -
బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం.. ప్రధానిగా ముహమ్మద్ యూనస్!
ఢాకా : బంగ్లాదేశ్‌లో అత్యంత నాటకీయ పరిణామాల నడుమ 15 ఏళ్ల పాటు ప్రధానిగా దేశాన్ని ఏలిన షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం 40 నిమిషాల వ్యవధిలో బంగ్లాదేశ్ నుంచి సైనికుల సహాయంతో భారత్‌కు వచ్చారు. అయితే ఈ సంక్షోభంతో బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని నడిపించేది ఎవరన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ తరుణంలో నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థి ఉద్యమ సమన్వయకర్తలు ప్రతిపాదించారు.Nobel laureate and founder of Grameen Bank, Professor Muhammad Yunus speaks candidly with @ThePrintIndia about Sheikh Hasina’s resignation as Bangladesh's PM and what’s next for the nation. He calls it the “2nd liberation” for Bangladesh. Watch the interview to understand this… pic.twitter.com/BiKYboAQC6— ProtectYunus (@ProtectYunus) August 5, 2024సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో, విద్యార్ధుల ఉద్యమానికి కీలకంగా వ్యవహరించిన సమన్వయకర్త నహిద్ ఇస్లాం, దేశంలోని ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ పదవిని చేపట్టడానికి అంగీకరించిన యూనస్‌తో ఇప్పటికే చర్చించినట్లు ప్రకటించారు. మరోవైపు నిరసనకారుల ఆందోళనలతో అట్టుడికిపోయిన బంగ్లాదేశ్‌ను గాడిన పెట్టేందుకు ఆ దేశ రాష్ట్రపతి మహ్మద్ షహబుద్దీన్ రంగంలోకి దిగారు.ప్రతి పక్ష పార్టీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) చీఫ్ ఖలేదా జియాను విడుదల చేసేలా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.అధికారులు ఉదయం 6 గంటలకు కర్ఫ్యూను ఎత్తివేసిన తర్వాత మంగళవారం వ్యాపారాలు తిరిగి తెరవాలని, సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు, ఆర్మీ చీఫ్, వాకర్ ఉజ్-జమాన్ ఈ ఎన్నికల ముందే షహబుద్దీన్‌తో సంప్రదించి కొత్త మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇదే అంశంపై మంగళవారం సాయంత్రానికి స్పష్టత రానుంది. ప్రతి మరణానికి న్యాయం జరుగుతుందని, సైన్యంపై విశ్వాసం ఉంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్‌లో మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటును స్వాగతించిన అమెరికా ప్రధాన మంత్రి షేక్ హసీనా రాజీనామా, ఆ తర్వాత దేశం నుంచి నిష్క్రమణపై యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లెర్ స్పందించారు. బంగ్లాదేశ్‌లోని పరిస్థితుల్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ దేశ ప్రజలకు అమెరికా అండగా నిలుస్తోందని హామీ ఇచ్చారు. ఘర్షణల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని,ఆందోళనలను విరమించుకోవాలని కోరారు. బంగ్లాదేశ్ ప్రజలు సంయమనంతో ఉండాలని పిలుపునిచ్చారు తాత్కాలిక ప్రభుత్వ ప్రకటనను స్వాగతించారు.US Welcomes New Bangladeshi Govt & Asks to Refrain from "More Violence" - Job Done?US State Dept. spox Matthew Miller has weighed in on Monday's chaotic events in Dhakar.Washington gave its usual catchphrase, "We are monitoring the situation carefully." pic.twitter.com/2a7T3iIBdw— Geopolitical Kid (@Geopoliticalkid) August 6, 2024 బంగ్లాదేశ్‌కు శ్రీలంక మద్దతు బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభంపై శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ స్పందించారు. కష్టకాలంలో ఉన్న బంగ్లాదేశ్‌కు శ్రీలంక అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మధ్య బలమైన స్నేహం ఉందని అన్నారు. Our hearts are with the people of #Bangladesh during these incredibly challenging times. The recent events have led to significant unrest and, tragically, the loss of many lives. We extend our deepest sympathies to the families of those affected and to all who are suffering…— M U M Ali Sabry (@alisabrypc) August 5, 2024సురక్షితంగా భారత్ సరిహద్దు ప్రాంతాలు ప్రధాన మంత్రి షేక్ హసీనా రాజీనామా తరువాత బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న సంక్షోభం మధ్య, బంగ్లాదేశ్-పశ్చిమ బెంగాల్ సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ సోమవారం హామీ ఇచ్చారు, ప్రజలు భయాందోళన చెందవద్దని కోరారు.బంగ్లాదేశ్ నుండి అనధికార ప్రవేశాన్ని నిరోధించడానికి దేశం సమర్థవంతమైన చర్యలు తీసుకుంటుందని గవర్నర్ ఉద్ఘాటించారు. సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయి. భయాందోళనలు అవసరం లేదు. పుకార్ల నమ్మొద్దని, అలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.రెచ్చగొట్టే వీడియోలు షేర్ చేయొద్దు.. పశ్చిమ బెంగాల్ పోలీసుల హెచ్చరికపొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులపై రాష్ట్రంలో రెచ్చగొట్టేలా వ్యవహరించడం, సంబంధిత వీడియోలు షేర్ చేస్తే ఉపేక్షించేది లేదని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వదంతులను ఉపేక్షించవద్దని, రెచ్చగొట్టే వీడియోలను షేర్ చేయడం మానుకోవాలని, ఫేక్ న్యూస్ ట్రాప్‌లో పడకుండా ఉండాలని ప్రజలకు సూచించారు. -
టీ20 వరల్డ్‌కప్-2024పై నీలినీడలు! భారత్ వేదికగా?
బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అంశంపై జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో అక్కడి పరిస్థితి చేజారింది. దీంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్‌కు చేరుకున్నారు. ఆమె భారత్ నుంచి లండన్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో ఈ ఏడాది ఆక్టోబర్‌లో జరగనున్న మహిళల టీ20 వరల్డ్‌కప్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. టోర్నమెంట్ ఆరంభానికి కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉండడంతో బంగ్లాలోని పరిస్థితులను ఐసీసీ కూడా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆధికారులు మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే బంగ్లాలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ మెగా టోర్నమెంట్‌ను ప్రత్యామ్నాయ వేదికపై నిర్వహించాలని ఐసీసీ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. భారత్, శ్రీలంక, యూఏఈలను బ్యాకప్ ఆప్షన్స్‌గా ఐసీసీ ఉంచినట్లు సమాచారం."బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB), ఆ దేశ భద్రతా ఏజెన్సీలతో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాం. అక్కడ పరిస్థితిలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాము. ఈ మెగా టోర్నీలో పాల్గోనే ఆటగాళ్లే భద్రత మా ప్రాధన్యత. అందుకోసం మేము ఈ నిర్ణయం తీసుకోవడానికైనా సిద్దం. ఈ మెగా టోర్నీ నిర్వహణపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని" ఐసీసీ అధికారి ప్రతినిథి ఒకరు పేర్కొన్నారు. కాగా ఈ మెగా టోర్నీ ఆక్టోబర్ 3 నుంచి ఆక్టోబర్ 20 వరకు జరగనుంది. -
బ్రిటన్ గ్రీన్‌సిగ్నల్ రాగానే లండన్‌కు హసీనా
న్యూఢిల్లీ: ఆందోళనల కారణంగా దేశం వీడిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్‌హసీనా ప్రస్తుతం ఢిల్లీలో సురక్షిత ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం(ఆగస్టు 5) ఢాకా నుంచి అత్యవసరంగా బయలుదేరి ఎయిర్‌ఫోర్స్ విమానంలో ఢిల్లీలో దిగిన తర్వాత ఆమెను భారత ప్రభుత్వం భారీ భద్రత నడుమ ఢిల్లీలోని ఓ ఇంటికి తరలించింది. ఢిల్లీ నుంచి ఆమె లండన్ వెళ్లాల్సి ఉంది. అయితే ఆమెకు ఆశ్రయమివ్వడానికి బ్రిటన్ ప్రభుత్వానికి కొన్ని చిక్కులు ఉన్నట్లు తెలుస్తోంది. వీటన్నింటిని తొలగించి బ్రిటన్ వచ్చేందుకు అక్కడి ప్రభుత్వం హసీనాకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. యూకే సర్కారు ఒకే అన్న తర్వాత హసీనా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లండన్ బయలుదేరనున్నారు. హసీనా మంగళవారం(ఆగస్టు 6) ఢిల్లీలోని ఆమె కూతరును కలిసే అవకాశాలున్నాయి. ఇవి కూడా చదవండి:Bangladesh Political Crisis: సంక్షోభ బంగ్లాBangladesh Political Crisis: అప్రతిష్ట మూటగట్టుకున్న ఐరన్ లేడీ! -
Bangladesh Political Crisis: అప్రతిష్ట మూటగట్టుకున్న ఐరన్ లేడీ!
బంగ్లాదేశ్‌కు స్వేచ్ఛా వాయువులందించిన బంగబంధు షేక్ ముజిబుర్ రెహా్మన్ గారాలపట్టి. ఆయన వారసురాలిగా తొలినాళ్లలో బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణకు గళమెత్తిన నేతగా అంతర్జాతీయ గుర్తింపు. అనంతర కాలంలో రాజకీయ రంగంపైనా తిరుగులేని ముద్ర. దేశ చరిత్రలో ఏకంగా ఐదుసార్లు ప్రధాని పదవిని అధిష్టించిన ఏకైక నేత. ఇంతటి ఘనమైన రికార్డులు షేక్ హసీనా సొంతం. అభిమానుల దృష్టిలో ఐరన్ లేడీగా పేరు. కానీ ప్రధానిగా 2009లో రెండో దఫా పగ్గాలు చేపట్టిన నాటినుంచీ నియంతగా ఆమె ఇంటా బయటా అప్రతిష్ట మూటగట్టుకున్నారు. గత గత జనవరిలో విపక్షాలన్నీ మూకుమ్మడిగా బహిష్కరించిన ఏకపక్ష ఎన్నికల్లో ‘ఘనవిజయం’ సాధించి వరుసగా నాలుగోసారి ప్రధాని అయ్యారు. కానీ ఆర్నెల్లు కూడా తిరగకుండానే ప్రజల ఛీత్కారాలకు గురయ్యారు. అవమానకర రీతిలో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని దేశం వీడారు! విద్యారి్థగానే రాజకీయాల్లోకి 1947లో నాటి తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్)లో జని్మంచారు హసీనా. ఢాకా వర్సిటీలో చదివే రోజుల్లోనే చురుగ్గా రాజకీయాల్లో పాల్గొన్నారు. 1975లో సైన్యం ముజిబుర్, ఆయన భార్య, ముగ్గురు కుమారులతో పాటు 18 మంది కుటుంబీకులను దారుణంగా కాల్చి చంపింది. హసీనా, ఆమె చెల్లెలు రెహానా విదేశాల్లో ఉండటంతో ఈ మారణకాండ నుంచి తప్పించుకున్నారు. భారత్‌లో ఆరేళ్ల ప్రవాసం అనంతరం 1981లో హసీనా బంగ్లా గడ్డపై కాలు పెట్టారు. సైనిక పాలనకు వ్యతిరేకంగా గళం విప్పారు. పలుమార్లు గృహనిర్బంధానికి గురయ్యారు. 1996లో తొలిసారి ప్రధాని అయ్యారు. 2001లో ఓటమి చవిచూసినా 2008 ఎన్నికల్లో రెండోసారి గద్దెనెక్కారు. నాటినుంచీ ప్రధానిగా కొనసాగుతున్నారు. 2004లో గ్రెనేడ్ దాడి నుంచి త్రుటిలో బయటపడ్డారు.విపక్షాలను వెంటాడి... నిజానికి ప్రధానిగా హసీనా సాధించిన విజయాలు తక్కువేమీ కాదు. రాజకీయ అస్థిరతతో, ఆర్థిక అవ్యవస్థతో కొట్టుమిట్టాడిన బంగ్లాదేశ్‌ను ఒడుపుగా ఒడ్డున పడేశారు. కానీ 2009లో రెండోసారి పగ్గాలు చేపట్టాక విపక్ష నేతలే లక్ష్యంగా ప్రతీకార రాజకీయాలకు హసీనా తెర తీశారు. 1971 యుద్ధ నేరాల కేసులను తిరగదోడారు. ట్రిబ్యునల్ ద్వారా శరవేగంగా విచారణ జరిపి పలువురు ఉన్నతస్థాయి విపక్ష నేతలను దోషులుగా తేల్చారు. ఖలీదా సారథ్యంలోని విపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ) కీలక భాగస్వాములను 2013లో ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించారు. అవినీతి ఆరోపణలపై ఖలీదాకు 17 ఏళ్ల జైలుశిక్ష పడింది. వీటికి తోడు ఆర్థిక పరిస్థితి దిగజారింది. దేశంలో ఏకంగా 3.2 కోట్లమంది నిరుద్యోగులున్నారు. ఇలాంటి సమయంలో రిజర్వేషన్ల కోటాను తిరగదోడటం హసీనాకు రాజకీయంగా మరణశాసనం రాసింది. నాటి యుద్ధంలో ప్రధానంగా పాల్గొన్నది నేటి అధికార పార్టీ అవామీ లీగే. దాంతో, సొంత పార్టీ కార్యకర్తలకు అత్యధిక లబ్ధి చేకూర్చేందుకే రిజర్వేషన్లను తిరిగి తెరపైకి తెచ్చారంటూ దేశమంతా భగ్గుమంది. కీలక సమయంలో సైన్యం కూడా సహాయ నిరాకరణ చేయడంతో హసీనా రాజీనామా చేసి ప్రాణాలు కాపాడుకునేందుకు దేశం వీడాల్సి వచి్చంది.నాడూ ఆరేళ్లు భారత్ ఆశ్రయం ఆపత్కాలంలో షేక్ హసీనాకు భారత్ ఆశ్రయమివ్వడం కొత్తేమీ కాదు. ముజిబుర్‌ను సైన్యం పొట్టన పెట్టుకున్నాక 1975 నుంచి 1981 దాకా ఆరేళ్లపాటు సోదరి, భర్త, ప్లిలలతో పాటు ఆమె భారత్‌లోనే ఆశ్రయం పొందారు. ఢిల్లీలోని లజ్‌పత్ నగర్, పండోరా రోడ్ నివాసాల్లో గడిపారు. రెండేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో నాటి రోజులను హసీనా గుర్తు చేసుకున్నారు. ‘‘అప్పుడు నేను, నా భర్త పశి్చమ జర్మనీలో ఉన్నాం. మాకు ఆశ్రయమిస్తామంటూ నాటి ప్రధాని ఇందిరాగాంధీ వర్తమానం పంపారు. ఢిల్లీలో దిగగానే నేరుగా ఆమెను కలిశాను. నా తండ్రితో పాటు కుటుంబంలో 18 మందిని సైన్యం పొట్టన పెట్టుకున్నట్టు ఆమె ద్వారానే నాకు తెలిసింది. రహస్యంగా ఢిల్లీలోనే కాలం వెళ్లదీశాం. నా భర్త ఇక్కడే ఉద్యోగం కూడా చేశారు’’ అని చెప్పుకొచ్చారు హసీనా. -
సంక్షుభిత బంగాళం
భయపడినంతా అయింది. బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. హింసాత్మకంగా మారిన విద్యార్థుల నిరసనలు, వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం మధ్య అవామీ లీగ్ పార్టీ సారథి షేక్ హసీనా ప్రధానిగా రాజీనామా చేసి, సైనిక విమానంలో దేశం విడిచిపోవాల్సి వచ్చింది. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా సాగిన 1971 నాటి బంగ్లాదేశ్ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నవారి కుటుంబ సభ్యు లకు ప్రభుత్వోద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించిన వివాదాస్పద కోటా విధానంపై మొదలైన రచ్చ చివరకు ఇంతకు దారి తీసింది. జూలైలో ఢాకా యూనివర్సిటీలో ఆరంభమైన విద్యార్థుల నిరసన ప్రదర్శనలు ఇంతలు అంతలై, ఘర్షణలకు దారి తీశాయి. గత నెలలోనూ, అలాగే ఈ ఆదివారమూ కలిపి 300 మందికి పైగా అమాయకుల ప్రాణాలు పోవడంతో బంగ్లాలో పరిస్థితులు వేగంగా మారాయి. గత నెలలో సుప్రీమ్ కోర్ట్ జోక్యం చేసుకొని, అన్నీ కలిపి 56 శాతమున్న రిజర్వేషన్లను 7 శాతానికి తగ్గించినప్పుడు నిరసనలు తగ్గి, ప్రశాంతత నెలకొంటుందని భావించారు. అప్పటికి కాస్త ఆగినట్టనిపించినా, మృతుల కుటుంబాలకు న్యాయం పేరిట మళ్ళీ నిరసనలు రేగాయి. ప్రభుత్వ అనుకూల, ప్రతికూల వర్గాల మధ్య మళ్ళీ రేగిన ఘర్షణల్లో ఒక్క ఆదివారమే 100 మంది దాకా చనిపోవడం, విద్యార్థుల ‘చలో ఢాకా’ ప్రదర్శన నేపథ్యంలో అగ్నిపర్వతం బద్దలైంది. క్షేత్రస్థాయిలో ప్రజల మనోభావాలను గుర్తించకుండా, నిరంకుశంగా వ్యవహరిస్తే ఎంతటి పాపు లర్ నేతకైనా ఎలాంటి దురవస్థ తలెత్తుతుందో సోమవారం నాటి దృశ్యాలు కళ్ళకు కట్టాయి. దేశ వ్యాప్త కర్ఫ్యూ, ఇంటర్నెట్ సేవల సస్పెన్షన్ విధించినా ఢాకాలో రోడ్ల నిండా జనం, ప్రధాని నివా సాన్ని వారు చుట్టుముట్టిన తీరు, హసీనా రాజీనామా, విలాసవంతమైన ఆమె నివాసంలోకి జనం చొచ్చుకుపోయి లూటీ సాగించిన తీరు చూస్తుంటే... సరిగ్గా రెండేళ్ళ క్రితం 2022 జూలైలో శ్రీలంకలో అధ్యక్షుడు రాజపక్సేకు ఎదురైన ఘటనలు గుర్తుకొస్తాయి. దేశాలు, ప్రజలు వేరైనా, రెండు ఘటనల్లోనూ నిరంకుశ పాలన, అవినీతి, ఆశ్రిత పక్షపాతాలే ఇంతటి జనాగ్రహానికి కారణమయ్యా యని మరిచిపోరాదు. అయితే, బంగ్లాలో రెచ్చిపోయిన జనం ప్రధాని నివాసంలోకే కాక, ఆఖరికి దేశ పార్లమెంట్‌లోకి చొరబడి యథేచ్ఛగా ప్రవర్తించడం విస్మయం కలిగిస్తుంది. షేక్ హసీనా తండ్రి, బంగ్లాదేశ్ జాతిపిత అయిన ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని సైతం ధ్వంసం చేయడం, బంగబంధు మ్యూజియమ్‌ను తగలబెట్టడం, అధికార అవామీ లీగ్ ఆఫీసులకూ – పోలీస్ స్టేషన్లకూ – ప్రభుత్వ ఆఫీసులకూ నిప్పు పెట్టడం ప్రజాస్వామ్య వాదులకు ఆవేదన, ఆందోళన కలిగించక మానవు. అయిదు దశాబ్దాల స్వతంత్ర బంగాళం ఇటీవలెన్నడూ చూడని హింస, రాజకీయ సంక్షోభం ఇది. ఒక రకంగా ఇది అయిదుసార్లు బంగ్లా ప్రధానిగా వ్యవహరించిన 76 ఏళ్ళ హసీనా స్వయంకృతం. 2009 జనవరి నుంచి పదహారేళ్ళుగా నిర్విరామంగా అధికారంలో ఉన్న ఈ ఉక్కుమహిళ అనేక సంక్షోభాలనూ, హత్యాయత్నాలనూ దాటి వచ్చి, దేశాన్ని ఆర్థికంగా పైకి తెచ్చిన మాట నిజమే. ఒక దశలో ఇస్లామిక్ ప్రపంచంలో ప్రజాస్వామ్య, లౌకికవాదాలకు నమూనాగా తెచ్చుకున్న పేరూ పెద్దదే. కానీ, ప్రతిపక్ష నేతల్ని జైలులో పెట్టి, విమర్శకులను దేశద్రోహులుగా చిత్రించి, చట్టంతో పని లేకుండా ప్రత్యర్థుల్ని అడ్డు తొలగించుకుంటూ వచ్చి అభిమానుల్లో సైతం అప్రతిష్ఠ తెచ్చుకున్నారు. కోవిడ్ అనంతర పరిస్థితులు, రష్యా – ఉక్రెయిన్ యుద్ధంతో ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలమైంది. పెరిగిన ధరలు, పెచ్చుమీరిన నిరుద్యోగం, అణచివేతలతో అన్ని వర్గాల్లో అసంతృప్తి పేరుకుంది. పైగా, గడచిన రెండు తడవలుగా బంగ్లా ఎన్నికలు పరిహాసప్రాయమయ్యాయి. ముఖ్యంగా ఈ ఏటి జన వరి ఎన్నికలు వట్టి రిగ్గింగ్ అనే ఆరోపణలూ వచ్చాయి. ఇప్పుడామె రాజీనామాతో రోడ్డు మీద కొచ్చి ఆడామగా ఆనందిస్తున్న తీరు చూస్తే మార్పుకై జనం ఎంతగా మొహం వాచారో అర్థమవుతుంది. హసీనా రాజీనామాతో ప్రస్తుతం బంగ్లాదేశ్ సైన్యం కనుసన్నల్లోకి వెళ్ళింది. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆర్మీ ఛీఫ్ సమావేశమైనట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత ఆందోళనలకు అడ్డుకట్ట వేసి పరిస్థితిని చక్కదిద్దుతామనీ, త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటవుతుందనీ ఆర్మీ ఛీఫ్ ప్రకటించారు. అయితే, అది అంత సులభమేనా? దేశమంతా అల్లకల్లోలంగా ఉంది. పాలనా యంత్రాంగం పూర్తిగా పడకేసింది. సాక్షాత్తూ సైన్యం ఎదుటే ప్రదర్శకులు రెచ్చిపోతున్న దృశ్యాలూ కనిపించాయి. గత వారం నిషేధానికి గురైన జమాతే ఇస్లామీ వర్గీయులు సహా ఇంతకాలం అణచివేతకు గురైన ప్రతిపక్షాల మద్దతుదారులూ రోడ్డెక్కడంతో నిరసనకారుల్లో అందరూ విద్యార్థులే అనుకోలేం. అనూహ్య విధ్వంసం చూస్తుంటే, అసాంఘిక శక్తులు చేరాయన్న అనుమానాలూ వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ పరిణామాలు భారత్‌పై చూపే ప్రభావమూ ఎక్కువే. కొన్నేళ్ళుగా భారత అనుకూల హసీనా ఏలుబడి మనకు కలిసొచ్చింది. ఇప్పుడిక ప్రతికూల పార్టీలు అక్కడ అధికారంలోకి వస్తే చిక్కులు తప్పవు. మళ్ళీ ఒకప్పటిలా సరిహద్దులో తీవ్రవాద సంస్థల పీడ పెరుగుతుంది. అవి అక్కడ తిష్ఠ వేసి, మన ఈశాన్య రాష్ట్రాల్లో సమస్యలు సృష్టిస్తాయి. చొరబాట్లూ ఎక్కువవుతాయి. కోటీ 30 లక్షల మంది హిందువులున్న బంగ్లాలో భారత మైనారిటీల భద్రత ప్రశ్నార్థకమవుతుంది. హసీనా ఉండగానే వారి పైన దాడులు తప్పలేదు. ఇక, ఛాందసవాద, ప్రతికూల శక్తులు గద్దెనెక్కితే పరిస్థితి ఎలా ఉంటుందో? అలాగే, ఢాకా దృశ్యాలను చూస్తే, ఇదే అదనుగా తీవ్రవాద శక్తులు విజృంభించ కుండా బంగ్లా సమాజం అప్రమత్తం కావాలనిపిస్తోంది. ముందుగా శాంతిభద్రతలు నెలకొనడం అవసరం. ఎలాంటి సర్కారుతో సాగాలి, మళ్ళీ ఎన్నికలు లాంటివన్నీ ఆ తర్వాతే! అది పూర్తిగా ఆ దేశ అంతర్గత వ్యవహారం, ప్రజాభీష్టం. ఏమైనా రానున్నరోజులు బంగ్లాకే కాదు భారత్‌కూ కీలకం. -
భారత్-బంగ్లా బోర్డర్: BSF హై అలర్ట్
భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటా అంశం తీవ్ర పరిణామాలకు దారి తీసింది. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయడంతో త్వరలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు కానుంది. ఈనేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తమైంది. భారత్- బంగ్లా సరిహద్దులో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ హైఅలర్ట్ ప్రకటించింది.కాగా, భారత్-బంగ్లాదేశ్ మధ్య 4, 096 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతం ఉన్న నేపథ్యంలో బీఎస్ఎఫ్ అదనపు బలగాలను మోహరించాలని ఆదేశించింది. కమాండర్లందరూ సరిహద్దులోనే ఉండాలని సూచించినట్లు సీనియర్ అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్‌లో ఉద్రికత్తలు పెరగడంతో సరిహద్దులో ఉన్న బీఎస్ఎఫ్ సిబ్బందికి సెలవులను కూడా రద్దు చేశారు. ఎటువంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు బలగాలు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక, తాజా పరిస్థితులను సమీక్షించేందుకు ఇప్పటికే బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ ఛౌదరి కోల్‌కత్తాకు చేరుకున్నట్లు తెలుస్తోంది. VIDEO | Border Security Force (BSF) issues high alert along the Indo-Bangladesh border in Karimganj, Assam in wake of the violent protests and political turmoil in Bangladesh.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/BIVV9t1bsS— Press Trust of India (@PTI_News) August 5, 2024 DG BSF is already present in the eastern Command. The situation on the Indo- Bangladesh border is normal as of now. Troops are aware and alert about the recent development and situation across the IB: Statement#Bangladesh #coup#SheikhHasina #Pakistan pic.twitter.com/PpfOVh9dNB— world of politics (@world_dailyy) August 5, 2024 ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లను తొలగించి ప్రతిభకు పట్టం కట్టాలని చేస్తున్న ఆందోళనలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో ముందు జాగ్రత్త చర్యగా బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఢాకా ప్యాలెస్‌ను వీడారు. ఈ క్రమంలో భారత్ చేరుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బంగ్లా సైన్యం రంగంలోకి దిగింది. బంగ్లాలో సైనిక పాలన కొనసాగుతుండగా.. కర్ఫ్యూ విధించారు. అయితే, కర్ప్యూను దాటుకొని నిరసనకారులు ప్రధాని నివాసాన్ని ముట్టడించారు. Happy #Bangladesh!#HasinaDown #BangladeshWon pic.twitter.com/cdWKALiMVh— Basherkella - বাঁশেরকেল্লা (@basherkella) August 5, 2024 మరోవైపు.. ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు. నిరసనకారులు ప్రధాని అధికారిక నివాసం గణభాబన్‌ను ముట్టడించి, అక్కడ విధ్వంసం సృష్టించారు. విలువైన వస్తువుల్ని లూటీ చేశారు. చికెన్, ఫిష్, కూరగాయలు, ఫర్నీచర్, ఇతర విలువైన వస్తువులు పట్టుకుపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Fall of Bangladesh government attributed to record high unemployment & inflation!Nearly 8 lakh graduates are unemployed in #BangladeshStudents were protesting the 30% job quota for families of freedom fighters. The supreme court then intervened & reduced the Quota to 5%...… pic.twitter.com/rwdAHTe6Z3— Nabila Jamal (@nabilajamal_) August 5, 2024 शेख़ हसीना की 15 साल की सत्ता 15 मिनट में चली गई!ढाका में प्रधानमंत्री आवास के शयनकक्ष में प्रदर्शनकारी#SheikhHasina #Bangladesh pic.twitter.com/Vc5DJDik3o— Dheeraj Pal (@dheerajpal09) August 5, 2024 ناجائز دھاندلی زدہ وزیراعظم کے فرار کے بعد بنگلہ کے عوام نے وزیراعظم ہاؤس میں کھانا کھایا یہ کھانا حسینہ واجد کیلیے پکایا گیا تھا pic.twitter.com/Od2Qh3ldWO— Sabir Shakir (@ARYSabirShakir) August 5, 2024 Bangladesh Parliament. From Democracy to Mobocracy. pic.twitter.com/LnXQ7NPJXw— Aditya Raj Kaul (@AdityaRajKaul) August 5, 2024 -
ఆమె ఓటమి.. ప్రధాని నివాసంలో రచ్చ.. పార్లమెంట్లో ధూమపానం చేస్తూ.. (ఫొటోలు)
-
భారత్‌లో షేక్ హసీనా.. అజిత్ దోవల్‌తో భేటీ!
బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. తన సోదరి షేక్ రెహానాతో కలిసి ఆర్మీ హెలికాప్టర్లో దేశం విడిచి సురక్షిత ప్రాంతానికి వెళ్లారు. ప్రస్తుతం దేశం మొత్తాన్ని సైన్యం చేతుల్లోకి తీసుకుంది. నేటి రాత్రి లోపు దేశంలో పరిస్థితులను అదుపులోకి తీసుకొస్తామని ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జమాన్ ప్రకటించారు. త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.ఆర్మీ హెచ్చరికల నేపథ్యంలోనే బంగ్లాదేష్ ప్రధాని పదవి నుంచి 76 ఏళ్ల షేక్ హసీనా దిగిపోయినట్లు తెలుస్తోంది. ఆమె పదవి నుంచి దిగిపోయేందుకు 45 నిమిషాల సమయం ఇచ్చినట్లు.. క్రమంలోనే రాజీనామా చేసినట్లు సమాచారం. తీవ్ర ఆందోళనలతో ఢాకాలో ఆమె ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవాలని సెక్యూరిటీ ఆదేశించడంతో ఆగమేఘాల మీద దేశం విడిచి వెళ్లినట్లు వినికిడి.భారత్‌లో షేక్ హసీనా..అయితే షేక్ హసీనా భారత్‌కు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె కట్టుదిట్టమైన భద్రత మధ్య సోమవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. ఇది యూపీలోని ఘజియాబాద్‌లో ఉంది. అక్కడ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను కలిశారు. అనంతరం ఆమె లండన్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్‌లో పరిస్థితిని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రధాని నరేంద్ర మోదీఇ వివరించారు. అయితే మోదీ హసీనాను కలుస్తారో లేదన్న విషయంపై స్పష్టత లేదు.బీఎస్ఎఫ్ అలెర్ట్..బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో భారత సరిహద్దులను రక్షించే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అప్రమత్తమైంది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి హై అలర్ట్ ప్రకటించింది. సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. తాజా పరిస్థితి నేపథ్యంలో ముందస్తు చర్యల కోసం బీఎస్ఎఫ్ డీజీ ఇప్పటికే కోల్‌కతాకు చేరుకున్నట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు పొరుగు దేశంలోని పరిస్థితుల దృష్ట్యా బంగ్లాదేశ్‌తో అన్ని రైళ్ల సేవలను నిలిపివేసినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. -
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా
-
Bangladesh: వర్శిటీ అధికారులతో పీఎం హసీనా భేటీ
బంగ్లాదేశ్‌లో విద్యార్థుల రిజర్వేషన్ ఆందోళలను అదుపుచేసేందుకు ఆ దేశ ప్రధానిషేక్ హసీనా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు, కాలేజీ ప్రిన్సిపాళ్లతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అయితే విద్యార్థి ఉద్యమ నాయకులు ఈ చర్చల ఆహ్వానాన్ని తిరస్కరించారు. పీఎం హసీనా వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నవారి బంధువులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 30 శాతం రిజర్వ్ చేసే కోటా వ్యవస్థను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్‌లో ఇటీవల పోలీసులు- విద్యార్థి నిరసనకారుల మధ్య హింసాత్మక ఘర్షణలను చోటుచేసుకున్నాయి. వీటిని అదుపు చేసేందుకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు, సీనియర్ అధ్యాపకులు, కళాశాల ప్రిన్సిపాళ్లతో ప్రధాని సమావేశమయ్యారని పీఎంవో ప్రతినిధి తెలిపారు. శనివారం రాత్రి 8:15 గంటలకు ప్రారంభమైన సమావేశం దాదాపు మూడు గంటల పాటు కొనసాగింది.దీనిముందు పీఎం హసీనా వివిధ విద్యార్థి సంఘాల నేతలతో మాట్లాడుతూ ఈ విషయంలో చర్చల కోసం ఎవరైనా తన వద్దకు రావచ్చని, విద్యార్థులు తమ తల్లిండ్రులను కూడా తీసుకుని రావచ్చన్నారు. అయితే ప్రభుత్వంతో చర్చలు జరిపే ఆలోచన తమకు లేదని విద్యార్థి ఉద్యమ నేతలు మీడియాకు తెలిపారు. -
కోట్లకు పడగలెత్తిన బంగ్లాదేశ్ ప్రధాని ఇంటి సేవకుడు
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భవనంలో గతంలో పనిచేసిన సేవకునికి బాగోతం సంచలనంగా మారింది. ఆ సేవకుని ఆస్తుల విలువ దాదాపు రూ.284 కోట్లని ఢాకా ట్రిబ్యూన్ పేర్కొంది. గతంలో ఆ సేవకుడు ప్రధాని హసీనా భవనానికి వచ్చే అతిథులకు నీరు, టీ, స్నాక్స్ అందించేవాడని సమాచారం.ఢాకా ట్రిబ్యూన్ తెలియజేసిన వివరాల ప్రకారం ఆ సేవకుడని పేరు జహంగీర్ ఆలం. ఆయనపై అనేక అవినీతి కేసులు ఉన్నాయి. పీఎం షేక్ హసీనా కార్యాలయంతోపాటు ఆమె ఇంట్లో పనిచేసే సమయంలో ఆయన పలువురి నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. వివిధ పనులు ఇప్పిస్తానంటూ చాలామంది నుంచి భారీగా డబ్బులు వసూలు చేసేవాడని సమాచారం. ఆ సేవకుడు ప్రైవేట్ హెలికాప్టర్లో ప్రయాణాలు సాగించేవాడని తెలుస్తోంది. ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో పీఎం హసీనా వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా జహంగీర్ అమెరికాకు వెళ్లపోయాడని తెలుస్తోంది.బంగ్లాదేశ్‌కు చెందిన మాజీ ఆర్మీ చీఫ్, పోలీసు అధికారి, పన్ను విభాగపు అధికారి, పలువురు ప్రభుత్వ ఉద్యోగుల అవినీతికి సంబంధించిన కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపధ్యంలో ప్రధాని షేక్ హసీనా ఇంటిలో పనిచేసిన మాజీ సేవకుని బాగోతం కూడా బయట పడింది. కాగా ప్రధాని షేక్ హసీనాకు కోట్లకు పడగలెత్తిన సేవకుని గురించి తెలియగానే ఆశ్చర్యపోయారు. ఒక సాధారణ బంగ్లాదేశీయుడు ఇంత సంపదను కూడబెట్టడానికి చాలా ఏళ్లు పడుతుందని, అతని విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, దర్యాప్తు చేస్తున్నదని తెలిపారు. ప్రపంచ బ్యాంకు వెల్లడించిన వివరాల ప్రకారం 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్‌లో తలసరి ఆదాయం రూ. 2.11 లక్షలుగా ఉంది.ఈ ఉదంతంపై బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)అధికార ప్రతినిధి వహిదుజ్జామాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని ఇంటిలోని పనివానికే భారీ ఆస్తులు ఉన్నప్పుడు యజమాని ఆస్తి ఎంతో ఊహించలేమని వ్యాఖ్యానించారు. ఆ సేవకుడిని ఇంకా అరెస్టు చేయలేయకపోవడం శోచనీయమన్నారు. మరోవైపు బంగ్లాదేశ్ మాజీ ఆర్మీ చీఫ్ అజీజ్ అహ్మద్‌పై కూడా అవినీతి ఆరోపణలు రాగా, సంబంధిత అధికారులు అజీజ్‌కు ఆస్తులను జప్తు చేశారు. అతని బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. -
పొరుగు స్నేహాల్లో పురోగతి ఎంత?
ఉగ్రవాద ఎగుమతి ఆరోపణలతో భారత్ సంబంధాలు పాకిస్తాన్ తో నిలిచిపోయాయి. చైనా ప్రభావ పరిధిలోకి నేపాల్ జారిపోయింది. భారత్‌తో అనేక వ్యూహాత్మక ఒప్పందాలను రద్దు చేసుకోవడంతో సహా అనేక చైనా అనుకూల నిర్ణయాలను మాల్దీవులు తీసుకుంది. చైనా అప్పుల ఊబిలో చిక్కుకున్నప్ప టికీ ఆ రుణాలను చైనా పునఃవ్యవస్థీకరిస్తుందని శ్రీలంక ఆశపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం బంగ్లాదేశ్ మాత్రమే భారత ఏకైక పొరుగు నేస్తంగా మిగిలిపోయింది. దాన్ని బలపరిచేలా, ఎన్డీఏ 3.0 ప్రభుత్వం స్థిరపడేలోపే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గత వారం భారత పర్యటనకు వచ్చారు. ఆ స్నేహాన్ని కాపాడుకుంటూనే, బంగ్లాదేశ్‌ను దాటి ఈ స్ఫూర్తిని విస్తరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో భారత్ ఆలోచించాలి.బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, తీవ్రమైన వేడితో ఉడికిపోతున్న ఢిల్లీని ఒక నెలలోనే రెండోసారి సందర్శిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కోసం గతవారం ఇండియా వచ్చారు. ఆ భేటీ నాటికి ఎన్డీఏ 3.0 ప్రభుత్వం అప్పుడే స్థిరపడుతోంది. తదుపరి 125 రోజుల కోసం అది రచిస్తున్న పథకాలు ఇంకా పురోగతిలోనే ఉన్నాయి. ప్రభుత్వాధినేతల స్థాయి సమావేశాలను చాలా నెలల ముందుగానే ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇరుదేశాల మధ్య కుదిరే ఒప్పందంలోని ప్రతి పదాన్ని భేటీకి వారాల ముందుగానే దౌత్యవేత్తల బృందం నిశిత పరిశీలన చేసిన తర్వాతే సంతకాలు చేయడం జరుగుతుంది. షేక్ హసీనా పర్యటన కూడా... రెండు పొరుగు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలను మెరుగ్గా ఉంచడానికి ఢిల్లీలోని సౌత్ బ్లాక్, ఢాకాలోని సెగున్ బగీచాలో ఉన్న బంగ్లా విదేశాంగ మంత్రిత్వ శాఖ రూపొందించిన ప్రణాళికాబద్ధమైన ప్రయత్నంలో భాగమే.ఈ పర్యటన నుండి సాధించిన రెండు పెద్ద ప్రయోజనాలు ఏవంటే, తీస్తా నదీ జలాలను మెరుగ్గా సంరక్షించడానికీ, నిర్వహించడానికీ సహాయం చేస్తామనే వాగ్దానం. ఇది పశ్చిమ బెంగాల్ ఆవేశపూరిత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీసుకున్న అస్థిరమైన వైఖరి కారణంగా రెండు దేశాల చేయి దాటిపోయిన ఒప్పందం. అలాగే చైనాపై కన్నేస్తూనే, ఇరు దేశాల మధ్య మరిన్ని రహదారి, రైలు, విద్యుత్ కనెక్టివిటీలపై స్పష్టంగా సంతకం కుదిరింది.భూటాన్ నుండి ఉత్తర బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్‌లోకి ప్రవహించే నదిలోని పూడికను తొలగించడంతోపాటు జెట్టీలు, ఓడరేవులు, రహదారులను నిర్మించి నౌకాయానానికి అనువుగా ఉండేలా చేయడానికి చైనా ఇంతకుముందు బంగ్లాదేశ్‌కు నిధులు సమకూర్చడానికి ముందుకొచ్చింది. దీంతో భారతదేశ ప్రధాన భూభాగాన్ని ఈశాన్య దిశగా కలిపే చికెన్ నెక్ కారిడార్‌కు సమీపంలో చైనా ఉనికికి అవకాశం ఉండటంతో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. భారత్ చేస్తున్న ఎదురు ప్రతిపాదనకు (కౌంటర్ ఆఫర్) అనుకూలంగా వ్యవహరిస్తూ, చైనా ప్రతిపాదనను పునఃపరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్‌ను కోరింది.మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా పని చేసినప్పటినుండి, లాటిన్ అమెరికా కోసం ఫ్రాంక్లిన్ డెలానో రూజ్వెల్ట్ ప్రతిపాదించిన ‘మంచి పొరుగు’ విధానం తరహాలో భారతదేశం ఒక పొరుగు విధానాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తోంది. ఇది దక్షిణాసియాను సన్నిహితం చేయగలదు. అంతేకాకుండా భారత ఉపఖండం వరకు దేశాల మధ్య శాంతి, ఆర్థిక సంబంధాలను ప్రోత్సహిస్తుంది. ఇస్లామాబాద్‌కు వ్యతిరేకంగా భారత్ చేస్తున్న ఉగ్రవాద ఎగుమతి ఆరోపణల కారణంగా పాకిస్తాన్ తో భారత్ సంబంధాలు స్తంభించిపోయాయి. అదే సమయంలో చైనా ప్రభావ పరిధి వైపు నేపాల్ మొగ్గు చూపుతోంది. పైగా పూర్వ హిందూ రాజ్యంలో భాగంగా కుమావూ భూభాగాలను చూపిస్తున్న మ్యాప్ విషయమై భారతదేశంతో నేపాల్ గొడవ పడుతోంది. భారత రక్షణ ప్రాంతమైన భూటాన్, ఎదుగుతున్న చైనాతో విరోధించకూడదనే ఆత్రుతలో బీజింగ్‌తో సరిహద్దు చర్చల్లో మునిగిపోయింది.ద్వీప దేశమైన మాల్దీవులు గత సంవత్సరం ప్రభుత్వంలో మార్పును చూసినప్పటి నుండి, ‘తుంటరి పిల్లాడి’లా వ్యవహరిస్తోంది. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజూ ఢిల్లీలో ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ప్రధాని మోదీతో కలిసి వేదికపై కనిపించారు; కానీ మాల్దీవులలోని కొన్ని డజన్ల మంది భారత సైనికులను వెనక్కి తీసుకోవాలని కోరడం, భారత్‌తో అనేక వ్యూహాత్మక ఒప్పందాలను రద్దు చేయడంతో సహా అనేక చైనా అనుకూల భారత వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. బీజింగ్‌తో కుదుర్చుకున్న ఖరీదైన ప్రాజెక్టుల కారణంగా చైనా అప్పుల ఊబిలో శ్రీలంక చిక్కుకుంది; అయినప్పటికీ చైనా తన రుణాలను పునఃవ్యవస్థీకరిస్తుందనీ, మరిన్ని మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుందనీ ప్రకటించింది. కొలంబో చైనా ఆలింగనంలోకి వెళ్తోందనడానికి ఇది గట్టి సంకేతం.దీంతో భారత్‌కు పొరుగున ఉన్న ‘మంచి మిత్రుడు’గా ఢాకా మాత్రమే ఉండే పరిస్థితులు ఏర్పడ్డాయి. బంగ్లాదేశ్ స్థాపకుడు షేక్ ముజీబ్ హత్య తర్వాత, భారత్ పట్ల బంగ్లాదేశ్ విద్వేషపూరితమైన ప్రారంభానికి సంబంధించిన మొదటి సంకేతాలు, 2007–09లో సైనిక మద్దతుగల ఆపద్ధర్మ ప్రభుత్వ పాలనలో వచ్చాయి. ముజీబ్ కుమార్తె షేక్ హసీనా తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరుదేశాల సంబంధాలు వికసించాయి. అప్పటి నుండి రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, విద్యుత్ గ్రిడ్ల గొలుసు ద్వారా ఈ ప్రాంతాన్ని ఏకీకృతం చేసే ప్రయత్నంలో బంగ్లాదేశ్... భారతదేశానికి గొప్ప మిత్రదేశంగా ఉంది. భారత్‌కు సమస్యాత్మకమైన ఈశాన్య తిరుగుబాటుదారులను, ఇస్లామిస్ట్ టెర్రర్ మాడ్యూల్స్‌ను అప్పగించడంలో సహకారం, పరస్పర భూభాగాల్లోని చిన్న ప్రాంతాల మార్పిడి అనేవి, ఇరుదేశాల మధ్య సంబంధానికి బలమైన పునాదిని ఏర్పర్చాయి. ఈ ఢాకా–న్యూఢిల్లీ సంబంధాలపై చీకటి మేఘాలు లేవని కాదు. గత సంవత్సరం ఎన్నికల సమయంలో మాల్దీవుల్లో వివాదాస్పదమైన ‘ఇండియా అవుట్’ ప్రచారాన్ని చూసినట్లే, బంగ్లాదేశ్ కూడా ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రతిపక్షాలు నిర్వహించిన అదే తరహా ప్రచారాన్ని చూసింది. ఇది భారత స్నేహితులను ఆందోళనకు గురి చేసింది.1980 నుండి తలసరి ఆదాయం పదిరెట్లు పెరిగి 2,700 అమెరికన్ డాలర్లకు చేరిన నదీతీర దేశం, మరింత వృద్ధి సాధించడం కోసం విదేశీ వాణిజ్యంపై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే ఇప్పటినుంచి రెండు సంవత్సరాల్లో బంగ్లాదేశ్ తక్కువ అభివృద్ధి చెందిన దేశం అనే తన స్థితిని మార్చుకుంటుంది. దీంతో ఎదురయ్యే ఒక సవాలు ఏమిటంటే, చాలా మార్కెట్లలో డ్యూటీ–ఫ్రీ ప్రాప్యత అవకాశాన్ని కోల్పోతుంది. సుంక రహిత మార్కెట్ ప్రాప్యత కొనసాగే కొత్త సమగ్ర వాణిజ్య ఒప్పందం విషయంలో భారత్ సహాయం చేయాలి. మరింత వెసులుబాటుతో కూడిన వీసా పాలన; ఆ దేశానికి అవసరమైన ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి ఆహారాన్ని అంతరాయాలు లేకుండా సాఫీగా ఎగుమతి చేయడం వంటివి భారత్ రాబోయే రోజుల్లో అనుసరించే ‘మంచి పొరుగు’ విధానంలో భాగంగా ఉండాలి. అదే సమయంలో బంగ్లాదేశ్‌ను దాటి, ఈ స్నేహపూర్వకమైన స్ఫూర్తిని విస్తరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో భారత్ ఆలోచించాలి. ప్రధాని మోదీ తన దక్షిణాసియా ప్రత్యర్థులకు ఆహ్వానాలు పంపినప్పుడు, పాకిస్తాన్ మాత్రమే దీనికి మినహాయింపు అయింది. బహుశా మన విధానాన్ని మార్చుకుని, దివాళాకు దగ్గరగా ఉన్న పొరుగుదేశానికి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చుతూ బదులుగా శాంతిని పొందడానికి సమయం ఆసన్నమై ఉండవచ్చు. ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఆర్థిక, వ్యూహాత్మక ప్రభావం కోసం బీజింగ్‌తో కొత్త గొప్ప ఆటలో భారత్ నిమగ్నమై ఉన్నప్పుడు... ఇస్లామాబాద్‌ను దాని ‘బెస్ట్ ఫ్రెండ్’ అయిన చైనా నుండి దూరంగా ఉంచడం భారతదేశానికి ప్రయోజనకరంగా ఉంటుంది,వాస్తవానికి, తక్కువ వాగాడంబరం, చిన్న పొరుగువారి పట్ల ఎక్కువ సున్నితత్వం, మరింత వాణిజ్యం, కనెక్టివిటీ, చిన్నచిన్న అసౌకర్యాలను విస్మరించి పెద్ద చిత్రాన్ని చూసే తేడాలను క్రమబద్ధీకరించడంలో ఉదారమైన ప్రతిపాదనల వంటివి భారతదేశం చుట్టూ ఉన్న రాజధానులతో కంచెలను చక్కదిద్దడానికి మార్గం కావచ్చు. బీజింగ్‌ను ఈ ప్రాంతంలోకి మరింత ప్రవేశించకుండా నిరోధించాలి.జయంత రాయ్ చౌధురీ వ్యాసకర్త ‘పీటీఐ’ ఈస్టర్న్ రీజియన్ నెట్వర్క్ హెడ్(‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
ఎన్నాళ్లీ తీస్తా వివాదం!
నదీజలాల విషయంలో ఆచితూచి అడుగేయకపోతే ఆ నీళ్లల్లోనే నిప్పులు పుట్టుకొస్తాయి. అంతర్గతంగా ప్రాంతాల మధ్యనే తరచు చిచ్చు రేపే నదీజలాలు... పొరుగునున్న దేశంతో పంచుకోవాల్సి వచ్చినప్పుడు సమస్యగా మారటంలో వింతేమీ లేదు. ఈమధ్యే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మన దేశాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో రెండు దేశాలమధ్యా పలు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదరటంతోపాటు తీస్తా నదీజలాల పంపకంపై చర్చలు జరపాలనీ, ఫరక్కా జలాలపై తాజా ఒప్పందం కుదుర్చుకోవాలనీ ఇరు దేశాధినేతలూ నిర్ణయించారు. సరిగ్గా ఇదే ఇప్పుడు వివాదాన్ని రగిల్చింది. నదీజలాల విషయంలో ఉభయులకూ అంగీకారయోగ్యమైన పరిష్కారం కోసం కృషిచేయాలని భారత్, బంగ్లాదేశ్‌లు నిర్ణయించుకున్నాయని మంగళవారం ఢాకాలో హసీనా ప్రకటించిన వెంటనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చురుగ్గా స్పందించారు. ఈ అంశంలో తమను ఎందుకు సంప్రదించలేదంటూ కేంద్రంపై భగ్గుమన్నారు. ఇది సరికాదని అభ్యంతరం చెబుతూ ఆమె మోదీకి లేఖ రాశారు. మమత ఇలా స్పందించటం ఇది మొదటిసారేమీ కాదు. ప్రజానీకానికి గుక్కెడు నీళ్లందించాలన్నా, పచ్చటి పైర్లతో పొలాలు కళకళలాడాలన్నా బంగ్లాదేశ్‌కు ఈ నదీజలాలపై భారత్‌తో ఒప్పందం కుదరటం, ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావటం ఎంతో అవసరం. 2011లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు తీస్తాపై ఒప్పందం దాదాపు ఖరారైంది. కానీ ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ అధినేత మమత అలకబూనటంతో అది ఆఖరు నిమిషంలో ఆగిపోయింది. రాజకీయంగా యూపీఏకు ఉన్న పరిమితులేమిటో, మమత స్వభావమేమిటో తెలిసిన హసీనా దానిపై పట్టుబట్టకుండా ఉండిపోయారు. ఈ నేపథ్యం తెలిసినందువల్లే ప్రధాని నరేంద్ర మోదీ 2015లో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లినప్పుడు తన ప్రతినిధి బృందంలో ఆమెను కూడా చేర్చారు. ఒప్పందం కుదరకపోవటం వల్ల తమ దేశానికి ఎదురవుతున్న సమస్యలను హసీనా ఆమెకు వివరించగా, రాష్ట్రంలో తనకెదురయ్యే ప్రతిబంధకాలను మమత తెలిపారని కథనాలు వచ్చాయి. ఆ తర్వాత కాలంలో తీస్తా ప్రాజెక్టు గురించి బంగ్లాదేశ్ ప్రస్తావించకపోలేదు. కానీ బెంగాల్ అభ్యంతరాలు ఎప్పటిలాగే ఉండటం ఈ సమస్యకు శాపంగా మారింది. నిజానికి చారిత్రకంగా, సాంస్కృతికంగా పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ ఎంతో సన్నిహితమైనవి. దేశంలో జాతీయవాదం అంతకంతకు విస్తరించటానికి ఈ ప్రాంతమే కారణమని భావించిన బ్రిటిష్ వలసపాలకులు 1905లో బెంగాల్ విభజన చట్టం తీసుకొచ్చినప్పుడు నిరసనలు పెల్లుబికాయి. చివరకు 1911లో దాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఆ ప్రయత్నం హిందూ ముస్లింల మధ్య పొరపొచ్చాలను పెంచింది. స్వాతంత్య్రానంతరం దేశ విభజన జరిగినప్పుడు అది పాకిస్తాన్లో భాగంగా మారింది. పాకిస్తాన్ చెరలో తమ అస్తిత్వాన్ని కోల్పోతున్న తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించటానికి 1971లో మన దేశం అందించిన తోడ్పాటును బంగ్లా ప్రజలు ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. కానీ బంగ్లాదేశ్ తన సమస్యలను వాయిదా వేస్తూ పోలేదు. తమ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా బంగ్లా చిరకాల ఆకాంక్ష నెరవేర్చటం ఎలాగో మమతా బెనర్జీ ఆలోచించాలి. అవసరమైతే ఒక మెట్టు దిగేందుకు కూడా సిద్ధపడాలి. గంగానదిపై బెంగాల్లో నిర్మించిన ఫరక్కా బరాజ్ నుంచి బంగ్లాకు నదీజలాలు అందించటంపై 1996లో 30 ఏళ్లకు ఒప్పందం కుదిరింది.అది మరో రెండేళ్లలో పూర్తికావాల్సి వుంది. కనుక దానిపై కొత్తగా ఒప్పందం అవసరం. 1996లో తమకిచ్చిన హామీలను నెరవేర్చని కేంద్రం ఇప్పుడు మరోసారి తీస్తా, గంగా జలాలపై బంగ్లాతో చర్చించిందని మమత ఆరోపణ. అయితే అప్పుడూ ఇప్పుడూ కూడా బెంగాల్‌తో చర్చిస్తూనే ఉన్నామన్నది కేంద్రం జవాబు. 1996లో ఆ రాష్ట్ర ప్రతినిధిగా ఉన్న నీటిపారుదల శాఖ ప్రతినిధితో మాట్లాడారనీ, నిరుడు జూలై 24న కూడా ఫరక్కా జలాల అంశంపై ఏర్పడిన కమిటీలో బెంగాల్ నీటిపారుదల రంగం నిపుణుడు పాల్గొన్నారనీ కేంద్రం చెబుతోంది. మొన్న 14న ఆ కమిటీ నివేదిక కూడా సమర్పించిందని వివరించింది. అయితే ఇదంతా కేంద్ర ప్రభుత్వం అనధికారికంగా చేసిందే తప్ప విధానపరమైన చర్చలు కాదని మమత సర్కారు జవాబు. తమ అధికారులు కేవలం కేంద్రం అడిగిన సాంకేతిక వివరాలు మాత్రమే అందించారని తెలిపింది. దక్షిణాసియాపైనా, మరీ ముఖ్యంగా ఈ ప్రాంత దేశాలతో భారత్‌కున్న సంబంధాలపైనా చైనా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇలాంటి సమయంలో పట్టుదలకు పోయి నదీజలాలపై వివాదం రాజేయటం మంచిది కాదు. తీస్తా ప్రాజెక్టుపై అటు చైనా, ఇటు భారత్ ప్రతిపాదనలిచ్చాయనీ, ఎవరి ప్రతిపాదన బాగుందో చూసి నిర్ణయిస్తామనీ మంగళవారం హసీనా తెలిపారు. ఇది ఒక రకంగా భారత్ ముందుకు రాకపోతే చైనావైపు చూస్తామని చెప్పటమే. ఎగుమతుల ద్వారా బంగ్లా సమకూర్చుకుంటున్న ఆదాయంలో 80 శాతం వాటావున్న దుస్తుల తయారీ ముడిసరుకంతా చైనాయే సరఫరా చేస్తోంది. పైగా బంగ్లా వాణిజ్యంలో చైనా అతి పెద్ద భాగస్వామి. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బెంగాల్ వ్యవహరించాలి. విదేశాంగ విధాన నిర్ణయాలపై రాష్ట్రాల ప్రమేయం ఉండటం మంచిదికాదు. అదే సమయంలో బెంగాల్ ప్రయోజనాలు కాపాడటం కేంద్రం బాధ్యత. గత హామీలు నెరవేర్చలేకపోతే కారణాలేమిటో తెలుసుకుని వాటిని సరిదిద్దాలి. చిరకాల సమస్య అయిన తీస్తా వివాదంపై బెంగాల్‌ను ఒప్పించి బంగ్లా ఆకాంక్ష నెరవేర్చటం ఎలాగో కేంద్రం ఆలోచించాలి. -
అభివృద్ధి భాగస్వామి బంగ్లాదేశ్
న్యూఢిల్లీ: సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సీఈపీఏ)పై చర్చలు ప్రారంభించాలని, ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకొనే దిశగా ప్రణాళిక రూపొందించుకోవాలని భారత్, బంగ్లాదేశ్ నిర్ణయించుకున్నాయి. రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన బంగ్లా ప్రధానమంత్రి షేక్ హసీనాతో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపార వాణిజ్యపరమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు. మయన్మార్ పరిణామాలతోపాటు రోహింగ్యా కాందిశీకుల అంశంపై అభిప్రాయాలు పంచుకున్నారు. అనంతరం సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. భారత్‌కు బంగ్లాదేశ్ అతిపెద్ద అభివృద్ధి భాగస్వామి అని మోదీ అన్నారు. బంగ్లాదేశ్‌తో సంబంధ బాంధవ్యాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా సీఈపీఏపై చర్చలు ప్రారంభించామని నిర్ణయించినట్లు తెలిపారు. రక్షణ రంగంలో పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించామన్నారు. రక్షణ ఉత్పత్తుల తయారీ, సైనిక దళాల ఆధునీకరణ విషయంలో ఇరుదేశాలు సహకరించుకోవాలని ఆకాంక్షించారు.భారత్ విశ్వసనీయ మిత్రదేశం: హసీనా ఇండో–పసిఫిక్ కార్యక్రమంలో చేరాలన్న బంగ్లాదేశ్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మోదీ చెప్పారు. ‘‘ఇరు దేశాల బంధానికి పౌరుల మధ్య సంబంధాలే పునాది. వైద్య సేవల కోసం వచ్చే బంగ్లా పౌరులకు ఈ–మెడికల్ వీసా కలి్పస్తాం. బంగ్లాదేశ్‌లోని రంగపూర్‌లోని కొత్తగా అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నాం. 1996 నాటి గంగా నది నీటి ఒప్పందాన్ని నవీకరించడానికి సాంకేతిక చర్చలు ప్రారంభిస్తాం. తీస్తా నది పరిరక్షణ, నిర్వహణపై చర్చించడానికి బంగ్లాదేశ్‌కు టెక్నికల్ టీమ్‌ను పంపుతాం’’ అని ప్రధాని వివరించారు. సుస్థిరమైన, సౌభాగ్యవంతమైన, ప్రగతిశీల బంగ్లాదేశ్‌ను బంగబంధు షేక్ ముజిబుర్ రెహా్మన్ కలలుగన్నారని, ఆ కలను నిజం చేయడానికి తమవంతు సహకారం అందిస్తామని నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత్ తమకు అతిపెద్ద పొరుగు దేశమని, తమకు అత్యంత విశ్వసనీయ మిత్రదేశమని షేక్ హసీనా పునరుద్ఘాటించారు. భారత్‌తో సంబంధాలకు అత్యధిక విలువ ఇస్తున్నామని ఆమె పునరుద్ఘాటించారు.10 ఒప్పందాలపై సంతకాలు డిజిటల్, సముద్రయానం, సముద్ర వనరుల వినియోగం, రైల్వే, అంతరిక్షం, పర్యావరణ పరిరక్షణకు గ్రీన్ టెక్నాలజీ, ఆరోగ్యం, వైద్య వంటి కీలక రంగాల్లో సహకారం పెంపొందించుకోవడమే లక్ష్యంగా భారత్, బంగ్లాదేశ్ శనివారం 10 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో షేక్ హసీనా భేటీ న్యూఢిల్లీ: వేర్వేరు రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకొనే దిశగా భారత్, బంగ్లాదేశ్ వేగంగా ముందుకు సాగుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. నూతన రంగాల్లో సహకారం పెంపొందించుకుంటున్నాయని, రానున్న రోజుల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలను ఈ సహకారమే నిర్ణయిస్తుందని చెప్పారు. శనివారం రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ముతో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా సమావేశమయ్యారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలను బలోపేతం చేసుకొనేలా కలిసి పనిచేయాలని నిర్ణయానికొచ్చారు. షేక్ హసీనాను కలవడం సంతోషంగా ఉందని ముర్ము పేర్కొన్నారు. -
మోదీతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భేటీ.. కీలక చర్చలు
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య దైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేలా కీలక చర్చలు జరిపారు.రక్షణ సంబంధాలు, రక్షణ ఉత్పత్తి, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సహకారం, సరిహద్దు నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. పరస్పర వృద్ధి ప్రాంతీయ సహకారంపై దృష్టి సారించే ఉమ్మడి కార్యక్రమాలు, ఒప్పందాలపై చర్చించారు. ఈ మేరకు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు..ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ భారతదేశానికి అతి పెద్ద అభివృద్ధి భాగస్వామని తెలిపారు. బంగ్లాతో తమ సంబంధాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, రక్షణ ఉత్పత్తి నుండి సాయుధ బలగాల ఆధునీకరణ వరకు వివరణాత్మక చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు.బంగ్లాదేశీయులు వైద్య చికిత్స కోసం భారతదేశానికి రావడానికి వీలుగా ఈ-మెడికల్ వీసా సౌకర్యాన్ని భారతదేశం ప్రారంభిస్తుందని మోదీ ప్రకటించారు. బంగ్లాదేశ్‌లోని వాయువ్య ప్రాంత ప్రజల సౌలభ్యం కోసం రంగ్‌పూర్‌లో కొత్త అసిస్టెంట్ హైకమిషన్‌ను ప్రారంభించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని ఆయన తెలిపారు. అదే విధంగా నేడు సాయంత్రం జరగనున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో తలబడబోయే భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ జట్లకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.ఉగ్రవాదం, ఛాందసవాదం సరిహద్దు వద్ద శాంతియుత నిర్వహణపై తమ సహకారాన్ని బలోపేతం చేయాలని ఇరువురు నిర్ణయించుకున్నట్లు చెప్పారు. హిందూ మహాసముద్ర ప్రాంతం పట్ల తమ రెండు దేశాల దృష్టి కూడా ఒకటేనని.. ఇండో-పసిఫిక్ మహా సముద్రాల చొరవలో చేరాలన్న బంగ్లాదేశ్ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. తాము BIMSTEC, ఇతర ప్రాంతీయ, అంతర్జాతీయ వేదికలపై మా సహకారాన్ని కొనసాగిస్తామని చెప్పారు.#WATCH | Delhi: PM Narendra Modi says, "India will start e-medical visa facility for people coming from Bangladesh to India for medical treatment. We have taken the initiative to open a new Assistant High Commission in Rangpur for the convenience of the people of the North West… pic.twitter.com/qNXwEWrcpl— ANI (@ANI) June 22, 2024 గతేడాది మేలో సమావేశమై.. అనేక ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు తెలిపారు, అందులో భారత్-బంగ్లాదేశ్ మద్య గంగా నదిపై ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ ప్రారంభించి రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేసినట్లు పేర్కొన్నారు.బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా రెండు రోజుల భారత పర్యటనకు శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. ఆమెకు విమానాశ్రయంలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి కీర్తివర్ధన్ సింగ్ స్వాగతం పలికారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారత్‌లో అధికారిక పర్యటనకు వచ్చిన తొలి విదేశీ నేత హసీనాయే కావడం గమనార్హం. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి కూడా ఆమె హాజరయ్యారు. -
బంగ్లాదేశ్‌లో జోరుగా...‘బాయ్‌కాట్ ఇండియా’
ఢాకా: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా నాలుగో విడత ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టాక సామాజిక మాధ్యమాల్లో భారత వ్యతిరేక ప్రచారం ఊపందుకుంది. చీరలు, సుగంధ ద్రవ్యాలు వంటి భారత ఉత్పత్తుల్ని బాయ్‌కాట్ చేయాలన్న ప్రచారానికి ప్రతిపక్ష నేతలు మద్దతిస్తున్నారు. భారత ఉత్పత్తులతో నిండిపోయే ఢాకా మార్కెట్లో కొంతకాలంగా వంటనూనె, ప్రాసెస్ట్ ఫుడ్స్, కాస్మెటిక్స్, దుస్తులు వంటి వాటి విక్రయాలు పడిపోయాయి. హసీనాను, ఆమె ఆవామీ లీగ్ పార్టీని అతిపెద్ద భారత ఉత్పత్తులుగా ప్రతిపక్ష బీఎన్పీ నేతలు అభివరి్ణస్తుండగా ప్రధాని హసీనా భారత వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. తనకెంతో ఇష్టమైన చీరలతోనే ప్రత్యర్థి వాదనను ఆమె ఎదుర్కొంటున్నారు. భారత ఉత్పత్తుల్ని బాయ్‌కాట్ చేయాలని ప్రతిపక్ష బీఎన్పీ నేతలు నిజంగా భావిస్తున్నట్లయితే పార్టీ ఆఫీసు ఎదురుగా వాళ్లు భార్యల చీరలకు ఎందుకు నిప్పుపెట్టడం లేదు? అని ప్రశ్నించారు. బీఎన్పీ నేతలు, వారి భార్యలు భారత్‌లో చీరలు కొనుక్కొచి్చ, బంగ్లాదేశ్‌లో అమ్ముకుంటున్నారన్నారు. ‘గరం మసాలా, అల్లం, వెల్లుల్లి, ఉల్లి తదితర ఎన్నో దినుసుల్ని భారత్ నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. బీఎన్పీ నేతలు భారత సుగంధ ద్రవ్యాలు వాడకుండా వంట చేయగలరా?’అని హసీనా నిలదీశారు. అలా తినగలమని వారు సమాధానం చెప్పగలరా అని అన్నారు. ప్రజల నుంచి దూరమైన ఆ పార్టీ భారత వ్యతిరేక ప్రచారాన్ని ఎగదోస్తోందని హసీనా అన్నారు. భారత వ్యతిరేక ఆన్లైన్ ప్రచారం యూరప్, అమెరికాల్లో ఉన్న బంగ్లాదేశీయులతో ముందుగా మొదలైంది. పారిస్‌లో ఉంటున్న పినాకీ భట్టాచార్య భాయ్‌కాట్ ఇండియా ప్రచారంలో కీలకంగా ఉన్నారు. మొదట్లో ప్రతిపక్ష బీఎన్పీ నేతలు ఇందులో లేరు. తర్వాత్తర్వాత ప్రజల్లో మద్దతు సంపాదించేందుకు వారూ ఈ ప్రచారంలో తోడయ్యారు. -
బంగ్లా ప్రధానిగా అయిదోసారి హసీనా ప్రమాణం
ఢాకా: అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా(76) గురువారం బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా అయిదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలి ఎన్నికల్లో అవామీ లీగ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం బీఎన్పీతోపాటు ఆ పార్టీ మిత్ర పక్షాలు బహిష్కరించాయి. అధ్యక్ష భవనంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ దేశ 12వ ప్రధానిగా హసీనాతో ప్రమాణం చేయించారు. దీంతో వరుసగా నాలుగోసారి, మొత్తమ్మీద అయిదోసారి ఆమె ప్రధానిగా పగ్గాలు చేపట్టినట్లయింది. అనంతరం మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణం చేశారు. -
ప్రజాస్వామ్యం లేని గెలుపు?
ఆమె గెలవడం ఇది అయిదోసారి. అందులోనూ ఇది వరుసగా నాలుగో గెలుపు. మామూలుగా అయితే ఇది అసాధారణం. అయితే, బంగ్లాదేశ్‌లో కాదు. ఆ దేశంలో ఆదివారం పార్లమెంటరీ ఎన్నికలు జరిగిన తీరు కానీ, ప్రధాని షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ (ఏఎల్) ఘన విజయం కానీ అనూహ్యమేమీ కాదు. మునుపటి ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, దాని మిత్రపక్షాలు... అన్నీ కలిపి 15 పార్టీలు ప్రజాతీర్పుకు దూరంగా ఉన్నప్పుడు పాలక పక్షానిదే గెలుపు కాక మరేమవుతుంది! ఎన్నికలను బహిష్కరించాలంటూ ప్రతిపక్షాలు ప్రజలకు పిలుపునివ్వడంతో సహజంగానే ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గింది. 2018 నాటి 80 శాతం సగానికి పడిపోయి, 40 చిల్లర వద్ద తచ్చాడింది. ఫలితాలూ ఊహించినట్టే వచ్చాయి. మొత్తం 300 స్థానాల్లో 299 స్థానాలకు ఎన్నికలు జరగగా, పాలక పక్షానికి 223 వచ్చాయి. విచి త్రమేమంటే, ఆ తర్వాత అత్యధిక స్థానాలు గెలిచింది స్వతంత్రులే. ఇలా ఇండిపెండెంట్లుగా గెలిచిన 62 మందిలో కూడా అత్యధికులు పాలక అవామీ లీగ్ టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తూ, పార్టీ అధికా రిక అభ్యర్థిపై పోటీ చేసి గెలవమన్న వాళ్ళే! అలా గెలిచినవాళ్ళే! ఇప్పుడు బంగ్లాదేశ్ పార్లమెంట్లో రెండో అతి పెద్ద వర్గం ఈ ఇండిపెండెంట్లదే! ‘జాతీయ పార్టీ’ 11 సీట్లు, మరో మూడు విపక్ష పార్టీలు 3 సీట్లతో ఆ తర్వాతి స్థానాల్లో నామావశిష్టంగా నిలిచాయి. ఇప్పుడిక ఎవరిని పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా ప్రకటిస్తారో చూడాలి. అధికారిక ప్రకటనలెలా ఉన్నా, ఆచరణలో వాస్తవికంగా బంగ్లా ఇప్పుడు ఒక రకంగా ప్రతిపక్షమే లేని పార్లమెంట్ అయింది. షేక్ హసీనా తన తాజా విజయంతో అటు ప్రతిపక్షాలనే కాదు... ఇటు ప్రజాస్వామ్యాన్ని సైతం ఓడించారని విశ్లేషకులంటున్నది అందుకే! ప్రపంచంలో దీర్ఘకాల మహిళా ప్రభుత్వాధినేత అనే కిరీటం హసీనాదే. 2009 నుంచి హసీనా తాలూకు పార్టీదే అధికారం. అప్పటి నుంచి ఇన్నేళ్ళలో మంచీ చెడులు రెంటిలోనూ హసీనా ఉక్కుమహిళే! అటు ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలతో దేశాన్ని దుర్భర దారిద్య్రం నుంచి బయటకు తెచ్చి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన కీర్తి, ఇటు మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రతిపక్షాలను ఉక్కుపాదంతో తొక్కేసిన అపకీర్తి... రెండూ ఆమెవే. దేశ ఆర్థిక పురోగతి, సామాజిక అభివృద్ధిలో అవిస్మరణీయ పాత్ర ఈసారి కూడా ఆమెకు విజయం అందించి ఉండవచ్చు. అంతమాత్రాన మిగతా తప్పులన్నీ ఒప్పులై పోవు. అసలు ఈ ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికతపై అంతర్జాతీయ పరిశీలకులు, మానవ హక్కుల సంఘాల వారు అనుమానాలు, ఆందోళనలు వ్యక్తం చేశారు. కీలక సంస్థలు, వ్యవస్థల పైన, అసమ్మతి వినిపించకుండా చివరకు మీడియా పైన కూడా హసీనా సర్కార్ నియంత్రణపై విమర్శలూ వచ్చాయి. 17 కోట్లకు పైగా జనాభా ఉన్న బంగ్లాదేశ్ తరుణ ప్రజాస్వామ్యానికి ఇది వన్నె తీసుకురాదు. బలమైన ప్రతిపక్షం లేకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థే లేదు. హసీనా మరోసారి ఎన్నికవడం భారత్‌కు మాత్రం ఒక రకంగా శుభవార్తే! ఎందుకంటే, హసీనా హయాంలో భారత – బంగ్లాదేశ్ బంధాలు బలపడ్డాయి. వాణిజ్యం పెరిగింది. మెరుగైన రోడ్డు, రైలు రవాణా సదుపాయాలు ఏర్పడ్డాయి. అంతకన్నా ముఖ్యంగా దక్షిణాసియా ప్రాంతానికి తీవ్ర వాదం పెనుముప్పుగా పరిణమించిందని ఏకాభిప్రాయంతో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మునుపటి షేక్ హసీనా హయాం మరో పర్యాయం కొనసాగడం ఢిల్లీ దృష్టి నుంచి చూస్తే మంచిదే! బంగ్లాదేశ్‌లో రాజకీయ సుస్థిరత, విదేశాంగ విధానాల కొనసాగింపు మనకు లాభించే విషయాలు. పైగా, అంతర్యుద్ధంలో కూరుకుపోయిన ఉమ్మడి పొరుగుదేశమైన మయన్మార్ నుంచి శరణార్థుల సమస్య పెరుగుతూ, తీవ్రవాదులకు ఆయుధాలు సులభంగా అందివచ్చే పరిస్థితులున్న సమయంలో బంగ్లా దేశ్‌లో స్నేహశీల సర్కార్ ఉండడం భారత్‌కు ఒకింత సాంత్వన. నిజానికి, రాగల కొద్దినెలలు దక్షిణాసియా ప్రాంతానికి కీలకం. ఎందుకంటే, ఈ ప్రాంతంలోని పలు దేశాల్లో ఈ ఏడాదే ఎన్నికలున్నాయి. ఈ ఫిబ్రవరి 8న పాకిస్తాన్లో ఎన్నికలు జరగనుంటే, ఆ తరువాత కొద్దినెలలకే శ్రీలంకలో అధ్యక్ష పదవికి ఎన్నిక. ఇక, ఏప్రిల్ – మే నెలల్లో భారత్‌లో లోక్‌సభ ఎన్నికలు సరేసరి. వివిధ దేశాల ఎన్నికల ఫలితాలు, కొలువు దీరే కొత్త ప్రభుత్వాలు, వాటి వైఖరిలో మార్పులను బట్టి భారత ఉపఖండంలో అనేక మార్పులు రావడం సహజం. ఇప్పటికే నిరుడు సెప్టెంబర్‌లో మాల్దీవుల్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో భారత వ్యతిరేక వైఖరిని అస్త్రంగా చేసుకొని, మహమ్మద్ మొయిజు గద్దెనెక్కారు. భారత్‌కు దీర్ఘకాలిక మిత్రదేశమైన మాల్దీవులు అప్పటి నుంచి ఢిల్లీ కన్నా బీజింగ్ వైపు మొగ్గుతూ ఉండడం చూస్తూనే ఉన్నాం. తాజా లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్స్ ఘటనలోనూ అదే కనపడింది. వీటన్నిటి దృష్టితో చూసినప్పుడూ బంగ్లాదేశ్‌లో మరోసారి భారత అనుకూల హసీనా సర్కార్ ఏర్పాటవడం భారత్‌కు ప్రయోజనకరమే! ఇటు భారత్‌తో వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు, అటు చైనా సైనిక ఆలంబన – రెండూ కొనసాగిస్తూ హసీనా చేస్తున్న సమతూకం అందరికీ చేతకావు. అలాంటి ఆమె విజయాలు ప్రశంసా ర్హమే అయినా, సాగిస్తున్న రాజకీయ అణచివేతను విస్మరించలేం. ఆన్లైన్లో విమర్శించినా అరదండాలే అన్న డిజిటల్ భద్రతా చట్టం లాంటివి పౌరస్వేచ్ఛకు ప్రతిబంధకాలు. ప్రజాస్వామ్య వాతావర ణమే లేకుంటే, చివరకు అమెరికా సహా ఇతర అభివృద్ధి చెందిన దేశాలు వాణిజ్య షరతులు విధిస్తాయి. అదే అదనుగా బంగ్లాదేశ్ పక్షాన చైనా బరిలోకి దిగుతుంది. అది భారత్‌కూ అభిలషణీయం కాదు. అందుకే, ప్రతిపక్షాలను ఊపిరి పీల్చుకొనిచ్చేలా, వ్యవస్థల స్వతంత్రతను కాపాడేలా హసీనా సర్కార్‌కు భారత్ నచ్చజెప్పాలి. బంగ్లాకూ, భారత్‌కూ దీర్ఘకాలంలో అదే శ్రేయస్కరం. -
బంగ్లాదేశ్ ఎన్నికల్లో ‘అవామీ’ విజయం
ఢాకా: బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార అవామీ లీగ్ మరోసారి ఘన విజయం సాధించింది. మొత్తం 300 పార్లమెంట్ స్థానాలకు గాను 299 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించగా, అవామీ లీగ్ ఏకంగా 223 స్థానాలు సొంతం చేసుకుంది. ఎన్నికలు అదివారం జరగ్గా, సోమవారం ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. తుది ఫలితాలు వెలువడ్డాయి. పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షమైన జతియా పార్టీ 11 సీట్లు గెలుచుకుంది. బంగ్లాదేశ్ కల్యాణ్ పార్టీ కేవలం ఒక స్థానంలో గెలుపొందింది. 62 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. అలాగే జతియా సమాజ్ తాంత్రిక్ దళ్, వర్కర్స్ పార్టీ ఆఫ్ బంగ్లాదేశ్ ఒక్కో స్థానం చొప్పున గెలుచుకున్నాయి. అవామీ లీగ్ అధినేత, ప్రధానమంత్రి షేక్ హసీనా గోపాల్‌గంజ్–3 నియోజకవర్గం నుంచి అఖండ విజయం సాధించారు. బంగ్లాదేశ్ పార్లమెంట్‌కు ఆమె ఎన్నిక కావడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. హసీనా రికార్డు 76 ఏళ్ల షేక్ హసీనా 2009 నుంచి ప్రధానిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు వరుసగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. మొత్తంగా ఆమె ప్రధాని అవుతుండడం ఇది ఐదోసారి. బంగ్లా చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నేతగా రికార్డు సృష్టించబోతున్నారు. మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పారీ్టతో పాటు మరో 15 పార్టీలు ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. ఈసారి కేవలం 41.8 శాతం పోలింగ్ నమోదైంది. 2018 ఎన్నికల్లో 80 శాతానికి పైగా నమోదవడం విశేషం. ఇండియా గొప్ప మిత్రదేశం భారత్ తమకు గొప్ప మిత్రదేశమని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా కొనియాడారు. ఎన్నికల్లో విజయం అనంతరం ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. ఇరుగుపొరుగు దేశాలైన భారత్–బంగ్లాదేశ్ ఎన్నో సమస్యలను కలిసి పరిష్కరించుకున్నాయని చెప్పారు. 1971, 1975లో భారత్ తమకు అండగా నిలిచిందని గుర్తుచేశారు. తనకు, సోదరికి, కుటుంబ సభ్యులకు ఆశ్రయం కలి్పంచిందని అన్నారు. ఇండియాను తమ పక్కింటిలాంటి మిత్రదేశంగా భావిస్తామని తెలిపారు. ఇండియాతో తమకు అద్భుతమైన సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. హసీనాకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. బంగ్లాదేశ్‌తో సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. -
భారత్ నమ్మకమైన మిత్రదేశం: బంగ్లాదేశ్ ప్రధాని
ఢాకా: బంగ్లాదేశ్‌కు భారతదేశం నమ్మకమైన స్నేహితుడని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా అన్నారు. 1971లో జరిగిన విముక్తి యుద్ధంలో బంగ్లాదేశ్ ప్రజలకు ఆశ్రయం ఇచ్చింది భారతదేశమేనని చెప్పారు. ఎన్నికల సందర్భంగా భారతదేశం గురించి అడిగిన ప్రశ్నకు హసీనా మాట్లాడుతూ.. ''మేము చాలా అదృష్టవంతులం. భారతదేశం మనకు నమ్మకమైన స్నేహితుడు. మా లిబరేషన్ వార్ సమయంలో మాకు మద్దతు ఇచ్చారు. 1975 తర్వాత మేము మా కుటుంబం మొత్తాన్ని కోల్పోయినప్పుడు, వారు మాకు ఆశ్రయం ఇచ్చారు. భారతదేశ ప్రజలకు మా శుభాకాంక్షలు. " అని అన్నారు. బంగ్లాదేశ్‌లో నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) బహిష్కరిస్తోంది. దీంతో అధికార అవామీ లీగ్ నాయకురాలు హసీనా గెలుపు ఖాయమైంది. ప్రధానమంత్రిగా వరుసగా ఆమె నాలుగోసారి గెలుపొందడంతోపాటు మొత్తంగా అవామీ లీగ్ ఐదవ విజయం సాధించడం విశేషం. ఇదీ చదవండి: మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. ఖండించిన మాల్దీవుల ప్రభుత్వం -
హసీనాకు అగ్నిపరీక్ష!
మెరిసేదంతా మేలిమి అని ప్రజానీకాన్ని నమ్మిస్తే ఓట్ల వర్షం కురవొచ్చు. ఒకటికి రెండుసార్లు ఆ చిట్కా పనిచేసి అధికారం వచ్చినా రావొచ్చు. కానీ ఎల్లకాలం అదే మంత్రం ఫలించదని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పార్టీ నాలుగో దఫా నెగ్గేందుకు పడుతున్న అవస్థలను గమనిస్తే అర్థమవుతుంది. ఆదివారం బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికలు జరగబోతు న్నాయి. ఆ ఎన్నికలు సవ్యంగా సాగుతాయనీ, ప్రజలంతా తన పక్షమేననీ హసీనా ఇప్పటికీ నమ్మ బలుకుతున్నారు. పోలింగ్ కేంద్రాల ముందు బారులుతీరి ఓటు హక్కు వినియోగించుకోవటం ద్వారా దేశంలో ప్రజాస్వామ్యం బతికేవుందని చాటాలంటూ పౌరులకు ఆమె విన్నపాలు చేస్తున్నారు. అటు విపక్షం హసీనా నయవంచనను బట్టబయలు చేయాలని ప్రజలను కోరింది. ఈ ఎన్నికలను బహిష్కరించి, శని ఆదివారాల్లో దేశవ్యాప్త హర్తాళ్ పాటించాలని పిలుపునిచ్చింది. బంగ్లాలో అటు ఎన్నికల తంతు, ఇటు బహిష్కరణ పిలుపు రెండూ సాధారణ ప్రజలకు విసుగు తెప్పిస్తున్నాయి. 2014 ఎన్నికలను విపక్ష బంగ్లా నేషనలిస్టు పార్టీ (బీఎన్పీ) బహిష్కరించింది. తదనంతర ఎన్నికల్లో పోటీలో దిగి, చివరి నిమిషంలో ఆ పార్టీ ముఖం చాటేసింది. 2014లో 39 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకోగా, 2019 నాటికి అది ఒక్కసారిగా 80 శాతానికి ఎగబాకింది. గత ఎన్నికల్లో అవామీ పార్టీ నేతృత్వంలోని కూటమికి 300 స్థానాల్లో ఏకంగా 96 శాతం స్థానాలు... అంటే 288 రాగా, బీఎన్పీ కూటమికి ఏడంటే ఏడే వచ్చాయి. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ అధికార పక్షంపైరిగ్గింగ్ ఆరోపణలు రివాజు. అయితే గత ఎన్నికలకూ, ఇప్పటికీ తేడా కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అప్పట్లో హసీనా గెలుపుపై ఎవరికీ సంశయాలు లేవు. మెజారిటీ విషయంలోనే భిన్న స్వరాలు వినిపించాయి. ఈసారి అలాకాదు. ఏం చేసైనా నెగ్గి తీరాలన్న సంకల్పంతో అన్ని రకాల మాయోపాయాలకూ సిద్ధపడుతున్నారని విపక్షంతోపాటు పౌరసమాజ వర్గాలు ఆరోపిస్తున్నాయి. యాభై రెండేళ్ల క్రితం హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలో పాకిస్తాన్ పాలకులపై పోరాడి బంగ్లా విముక్తి సాధించింది. ఆ వెంటనే ముజిబుర్ రెహమాన్‌ను కూలదోసి సైన్యం అధికా రాన్ని ఆక్రమించింది. ఆయన్ను దారుణంగా కాల్చిచంపింది. వెంటవెంటనే జరిగిన మార్పుల్లో జన రల్ జియావుర్ రెహమాన్ అధికారం చేజిక్కించుకుని అనంతర కాలంలో దేశాధ్యక్షుడయ్యారు. బీఎన్పీ ఆయన నేతృత్వంలోని పార్టీయే. మరో సైనిక పాలకుడు హెచ్ఎం ఎర్షాద్ సైతం జాతీయ పార్టీని ఏర్పాటుచేశారు. మొత్తానికి మూడు సైనిక తిరుగుబాట్లు, దాదాపు 20 వరకూ విఫల తిరుగు బాట్లతో దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. సైనిక పాలకులు ఎన్నికలు లేకుండా చేసి, పౌరుల ఓటుహక్కుకు ఎగనామం పెడితే... ప్రజాస్వామ్యం పేరుతో అధికారంలోకి వచ్చిన పార్టీలు దొంగ ఓట్లతో, హింసతో దాన్ని మరింత నీరుగార్చాయి. తనకు మెజారిటీ ప్రజల మద్దతున్నదని చెప్పే హసీనా తొలి, మలి దఫాలకు మించి మూడోసారి పూర్తి స్థాయి నియంతగా మారారని, అసమ్మతి స్వరాలను అణిచేశారని ఆమె వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ కేసుల్లో ఇరుక్కుని 22,000 మంది విపక్ష నేతలు, కార్యకర్తలు జైళ్లలో మగ్గుతున్నారు. అధిక ధరలు తగ్గించాలని, ఉపాధి కల్పించాలని ఉద్యమించినవారిని హసీనా సర్కారు శత్రువులుగా చూస్తోంది. హసీనా తొలిసారి అధికారంలోకొచ్చిన రోజులతో పోలిస్తే ఇప్పుడు కరెంటు కోతలు లేవు. దేశం పచ్చగా కనబడుతోంది. అడిగిందే తడవుగా విదేశీ మదుపుదారులు ఉదారంగా అప్పులిచ్చారు. ఆర్థిక రంగం పుంజుకోవటంతో నగరాలు మెరిసిపోతున్నాయి. ఆకాశాన్నంటే భవంతులు, ఎక్స్‌ప్రెస్ వేలు, వంతెనలు, భారీ దుకాణ సముదాయాలు, దిగుమతి చేసుకున్న వినియోగ వస్తువులు విస్మయ పరుస్తున్నాయి. కానీ ఇప్పుడిప్పుడే ఇదంతా తిరబడుతున్న దాఖలాలు కనబడుతున్నాయి. అందాల పరదాల మాటున పాతరేసినవన్నీ పైపైకి తోసుకొచ్చి నిలదీస్తున్నాయి. బ్యాంకులు వేల కోట్లలో ఇచ్చిన అప్పులన్నీ పారు బాకీలుగా మారి బావురుమన్నాయి. ఖజానాలో కరెన్సీ మాయమై, ద్రవ్యో ల్బణం ఆకాశాన్నంటి దేశ ఆర్థిక వ్యవస్థ బిత్తరచూపులు చూసింది. విదేశీ పెట్టుబడులతో మొదలు పెట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణం సరైన పర్యవేక్షణ కొరవడి నత్తనడకన సాగింది. వ్యయం అనేక రెట్లు పెరిగింది. పల్లెటూళ్లు తెల్లముఖం వేశాయి. ఉపాధి కరువై గ్రామీణులు నగరా లకు, పట్టణాలకు వలసలు కట్టారు. కరెంట్ అకౌంట్ సంక్షోభం పీల్చి పిప్పి చేస్తుండగా ఒకనాడు పైపై మెరుగులు చూసి ఎగబడి పొగిడిన అంతర్జాతీయ మీడియా వరస కుంభకోణాల వైనాన్ని వెల్లడిస్తున్నకొద్దీ దేశంలో అశాంతి ప్రబలింది. ఉద్యమాలు వెల్లువెత్తాయి. వాటి అణచివేత తప్ప హసీనా దగ్గర మరే ప్రత్యామ్నాయం లేకపోవటం విషాదాల్లోకెల్లా విషాదం. దేశాన్ని దక్షిణాసియాలోనే ‘ఎకనామిక్ టైగర్’గా రూపొందించానని ఒకనాడు సగర్వంగా చాటు కున్న హసీనా సంక్షోభంపై సరైన సంజాయిషీ ఇవ్వలేకపోతున్నారు. మానవ హక్కుల ఉల్లంఘన లపై ఇంటా బయటా ఆరోపణలు పెరుగుతున్నాయి. ఈ ఉల్లంఘనల బాధ్యులకు తమ దేశంలో ప్రవేశం ఉండబోదని అమెరికా ప్రకటించింది. వైఫల్యాలకు పాలక విపక్షాలు రెండూ బాధ్యత వహించాలని ప్రజలు భావిస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. అయితే ఇతర నేతలతో పోలిస్తే హసీనాయే ఉన్నంతలో మెరుగని మెజారిటీ పౌరులు విశ్వసిస్తుండటం విశేషం. ఏకపక్షంగా సాగే తాజా ఎన్నికల తంతులో విజయం మాటెలావున్నా హసీనాకు మున్ముందు గడ్డు పరిస్థితులు తప్పవు. ఆమె విఫల నేతగా మిగులుతారా, తప్పులు దిద్దుకుని దేశాన్ని గట్టెక్కిస్తారా అన్నది చూడాల్సివుంది. -
బంగ్లా సుస్థిరత కొనసాగేనా?
భారత్‌కు సన్నిహిత పొరుగుదేశం, నమ్మదగిన భాగస్వామి అయిన బంగ్లాదేశ్‌లో జనవరి 7న ఎన్నికలు జరగనున్నాయి. 2009 నుంచి దేశ ప్రధానిగా అప్రతిహతంగా కొనసాగుతున్న షేక్ హసీనా ఈసారి కూడా తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. అయితే, ఎన్నికలు స్వేచ్ఛగా జరగడం లేదనీ, హసీనా ఇటీవలి సంవత్సరాలలో నియంతగా మారిందనీ ఆమె విమర్శకులు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో ఆమె పదవీకాలం బంగ్లాదేశ్‌లో రాజకీయ సుస్థిరతను తెచ్చిపెట్టింది. గత దశాబ్దంలో బంగ్లాదేశ్ తలసరి ఆదాయం మూడు రెట్లు పెరిగింది. గడచిన 20 ఏళ్లలో 2.5 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుండి బయటపడినట్లు ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. జనవరి 7న బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. పాలక అవామీ లీగ్ అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని చూస్తోంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ఎన్నికలను బహిష్కరించడం వల్ల ఈ పని మరింత సులభమవుతోంది. స్వతంత్ర అభ్యర్థులతో పాటు కొన్ని చిన్న, పెద్దగా పేరులేని రాజకీయ పార్టీలు అధికార పక్షానికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నప్పటికీ, అవి పెద్ద సవాలుగా మారే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి అఖండ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే, బీఎన్ పీ ఈ ఎన్నికలలో పాల్గొనక పోవడం అనేది అవామీ లీగ్ సాధించనున్న విజయంలోని ఆకర్షణను అయితే కచ్చితంగా తగ్గిస్తుంది. బేగమ్‌ల పోరు బంగ్లాదేశీయులు దేశ పితామహుడిగా భావించే షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తె అయిన షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. సైనిక నియంత జియావుర్ రెహమాన్ భార్య ఖలీదా జియా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి సారథ్యం వహిస్తు న్నారు. ఈ ఇద్దరు మహిళలను బంగ్లాదేశ్‌లోని పరస్పరం పోరాడు తున్న బేగమ్‌లు (‘బ్యాట్లింగ్ బేగమ్స్’) అని కూడా పిలుస్తారు. బంగ్లాదేశ్‌లో 1990లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ తర్వాత జరి గిన తొలి మూడు ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వంతులవారీగా అధికారంలో ఉన్నాయి. అయితే 2009 నుంచి దేశానికి హసీనా సారథ్యం వహిస్తున్నారు. గత దశాబ్దపున్నర కాలంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగలేదని విమర్శకులు ఆరోపించారు. 2014 ఎన్నికలను బహిష్కరించడం బీఎన్ పీ చేసిన తప్పిదమనీ, అవామీ లీగ్ భారీ మెజారిటీతో అధికారాన్ని నిలుపుకోవడానికి అది వీలు కల్పించిందనీ కొందరు అంటున్నారు. ఈ నిర్ణయం బీఎన్ పీనీ, దాని అగ్రనేతలనూ పార్లమెంటుకు చాలాకాలం పాటు దూరంగా ఉంచింది. ఖలీదా, తారిఖ్ రెహమాన్ (ఖలీదా కుమారుడు, రాజకీయ వారసుడు) సహా చాలా మంది నాయకులు అవినీతి కేసుల్లో చిక్కు కోవడంతో పార్టీ మరింత అపఖ్యాతి పాలైంది. వారి అక్రమాలకు సంబంధించి విచారణ జరిపి వారికి శిక్ష విధించారు. రెహమాన్ బంగ్లాదేశ్ రాజకీయాలతో సంబంధం లేకుండా లండన్‌లో ఉంటు న్నారు. ఖలీదా గృహనిర్భంధంలో ఉన్నారు; పైగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆమె తన పార్టీ రాజకీయ అదృష్టాన్ని పునరుద్ధరించడం కష్టమైపోయింది. మునుపటి ఎన్నికలకు ముందు బీఎన్ పీ హింసాత్మక చర్యల్లో పాల్గొంది. ఇది బీఎన్ పీకి చెందిన మరికొందరు అగ్రనేతలను విచారించే అవకాశాన్ని కూడా అవామీ లీగ్‌కు ఇచ్చింది. ఫలితంగా పార్టీ ఇప్పుడు చాలా బలహీనంగా ఉంది. అవామీ లీగ్‌ను ఏ విధంగానూ ఎదుర్కొనే స్థితిలో లేదు. ఆపద్ధర్మం స్థానంలో... బీఎన్ పీ కూటమి కీలక భాగస్వామి అయిన బంగ్లాదేశ్ జమాత్– ఎ–ఇస్లామీని ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధించారు. పార్లమెంటరీ చట్టాలపై తమకు నమ్మకం లేదనీ, ఇస్లామిక్ చట్టం, పాలనకు మాత్రమే కట్టుబడి ఉన్నామనీ ఆ పార్టీ పదేపదే ప్రకటించింది. దీంతో బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం జమాత్ పార్టీ రిజిస్ట్రేషన్ ని రద్దు చేసింది. హసీనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన యుద్ధ నేరాల విచారణ నేపథ్యంలో జమాతే ఇస్లామీ అగ్రనేతలకు ఉరిశిక్షలు పడ్డాయి. దాంతో పార్టీ మరింత నష్టపోయింది. సార్వత్రిక ఎన్నికలను తటస్థ మధ్యంతర ప్రభుత్వం నిర్వహించాలని బీఎన్ పీ డిమాండ్ చేస్తోంది. హసీనా ప్రభుత్వం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించదని ఆ పార్టీ భయపడుతోంది. అయితే ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించడం లేదు. 2018 ఎన్నికలలో పాల్గొనడం ద్వారా తాము తప్పు చేశామని బీఎన్ పీ ఇప్పుడు నమ్ముతోంది. 2011లో 15వ రాజ్యాంగ సవరణ ద్వారా తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటును అవామీ లీగ్ ప్రభుత్వం తొలగించింది. అంతకు ముందు ఆపద్ధర్మ ప్రభుత్వం నిర్ణీత గడువులోగా ఎన్నికలు నిర్వహించి ఎన్నికైన పార్టీకి అధికారాన్ని అప్పగించేది. ఏది ఏమైనప్పటికీ, తాత్కాలిక ప్రభుత్వం కొన్ని సంవత్సరాలు (2007–09) కొనసాగింది, సాధారణ ప్రభుత్వం వలె పనిచేయడమే కాకుండా దాని అధికార పరిధికి మించిన అనేక చర్యలు కూడా తీసుకుంది. అలాగే హసీనా, ఖలీదాలను కూడా విచారించింది. స్పష్టంగా, ఆపద్ధర్మ ప్రభుత్వం తప్పు చేయలేని వ్యవస్థ అయితే కాదు. అందుకే బంగ్లాదేశ్ ఇతర ప్రజా స్వామ్య దేశాలలో మాదిరిగా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించగల సంస్థలతో ముందుకు రావాలి. నిశ్శబ్ద విజయాలు ఉన్నప్పటికీ... షేక్ హసీనా ఇటీవలి సంవత్సరాలలో నియంతగా మారిందని ఆమె విమర్శకులు ఆరోపిస్తుండగా, ఆమె పదవీకాలం బంగ్లాదేశ్‌లో రాజకీయ సుస్థిరతను తెచ్చిపెట్టిందన్నది మరో నిజం. ఇది బంగ్లాదేశ్‌కూ, దాని ప్రజలకూ ప్రయోజనకరంగా నిరూపితమైంది. దేశం వేగవంతమైన ఆర్థిక వృద్ధిని చవిచూస్తోంది. దక్షిణాసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో బంగ్లాదేశ్ ఒకటి. గత దశాబ్దంలో దాని తలసరి ఆదాయం మూడు రెట్లు పెరిగింది. గత 20 ఏళ్లలో 2.5 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుండి బయటపడినట్లు ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. అనేక ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా హసీనా ప్రభుత్వం అమలు చేసింది. దేశ సొంత ఆర్థిక వనరులు, రుణాలు, అభివృద్ధి సహాయాల కలయికతో, కీలకమైన 2.9 బిలియన్ డాలర్ల పద్మ వంతెనను గంగానదిపై నిర్మించారు. ఈ వంతెన ఒక్కటే దేశ జీడీపీని 1.23 శాతం పెంచడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు. ఈ విజయాలు ఉన్నప్పటికీ, కోవిడ్ –19 మహమ్మారి నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. నవంబరులో ద్రవ్యోల్బణం 9.5 శాతానికి చేరుకోవడంతో పెరుగుతున్న జీవన వ్యయంతో దేశం పోరాడుతోంది. విదేశీ మారక నిల్వలు ఆగస్టు 2021లో రికార్డు స్థాయిలో 48 బిలియన్ల డాలర్ల నుండి ఇప్పుడు దాదాపు 20 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇవి మూడు నెలల దిగుమతులకు కూడా సరిపోవు. అదనంగా, దాని విదేశీ రుణం 2016 నుండి రెట్టింపు అయింది. అయితే, భారతదేశం అవసరమైన వస్తువులను సరఫరా చేయడం ద్వారా బంగ్లాదేశ్‌కు సహాయం చేసింది. దశాబ్దపున్నర కాలంగా బంగ్లాదేశ్‌లో ఉన్న రాజకీయ సుస్థిరత ఆర్థికాభివృద్ధికి కారణమైందనడంలో సందేహం లేదు. భారతదేశం, బంగ్లాదేశ్ ఇప్పుడు మరింతగా ఎక్కువ స్థాయి విశ్వాసాన్ని కలిగివున్న భాగస్వామ్య పక్షాలు. దీని ఫలితంగా ఇరు దేశాల మధ్య మెరుగైన రైలు కనెక్టివిటీ, ద్వైపాక్షిక వాణిజ్యం ఏర్పడింది. అయితే, చైనా నేతృత్వంలోని అంతర్జాతీయ వాణిజ్య కూటమి, రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్లో బంగ్లాదేశ్ ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో పొరుగుదేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలపై భారత్‌ను జాగ్రత్తగా నడుచుకునేలా చేసింది. భారతదేశం పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించాక పరిస్థితులు తనకు అనుకూలంగా పని చేస్తాయని ఆశిస్తోంది. ఆనంద్ కుమార్ వ్యాసకర్త అసోసియేట్ ఫెలో, మనోహర్ పారీకర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ ఎనాలిసెస్, న్యూఢిల్లీ -
భారత్, బంగ్లా సంయుక్తంగా.. పలు ప్రాజెక్టులకు శ్రీకారం
ఢాకా/అగర్తలా: భారత్, బంగ్లాదేశ్ ప్రధానులు నరేంద్ర మోదీ, షేక్ హసీనాలు బుధవారం సంయుక్తంగా పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. త్రిపురలోని నిశి్చంతపూర్, గంగాసాగర్‌ను బంగ్లాదేశ్‌తో కలుపుతూ 65 కిలోమీటర్ల ఖుల్నా–మోంగ్లా పోర్ట్ రైల్వే లైన్, బంగ్లాలోని రామ్‌పూర్‌లో ఉన్న మైత్రీ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టులను నేతలు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అగర్తలా నుంచి బంగ్లాలోని అఖౌరా వరకు నిర్మించిన రైలు మార్గం ఇరుదేశాల వాణిజ్యాన్ని పెంచుతుందని ఆశిస్తున్నారు. రైలులో అగర్తలా నుంచి ఢాకా మీదుగా కోల్‌కతా వెళ్లే వారికి ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. ‘ఈశాన్య భారతం, బంగ్లాల మధ్య తొలి రైలు మార్గం అగర్తలా–అఖౌరా క్రాస్‌బోర్డర్ రైల్వేలింక్ను ప్రారంభించడం చరిత్రాత్మకం’ అని ప్రారం¿ోత్సవం సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. 12.24 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో రైలు 5.46 కి.మీ.లు త్రిపురలో మిగతా 6.78 కిలోమీటర్లు బంగ్లాదేశ్‌లో ప్రయాణిస్తుంది. ‘రెండు దేశాల పరస్పర సహకార విజయాన్ని సంబరంగా జరుపుకునేందుకు మళ్లీ కలిశాం. గత దశాబ్దాల్లో రెండు దేశాల్లో జరగని అభివృద్ధిని ఈ 9 ఏళ్లలో సాధించాం. మన దేశాల పటిష్ట మైత్రీ బంధానికి ఈ ప్రాజెక్టులే సంకేతం’ అని హసీనాతో వీడియో కాన్ఫెరెన్స్ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. అగర్తలా–అఖౌరా రైలు మార్గం నిర్మాణం కోసం బంగ్లాకు భారత్ రూ.392.52 కోట్ల ఆర్థికసాయం అందజేసింది. కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రావడంతో ఈశాన్య రాష్ట్రాల్లో వాణిజ్యం, పర్యాటకం, అనుసంధానత ఊపందుకోనుంది. ఢాకా మీదుగా ఈ రైలు మార్గంలో అగర్తలా నుంచి కోల్‌కతాకు చాలా త్వరగా చేరుకోవచ్చు. ఈ మార్గం అందుబాటులోకి రావడంతో గతంలో ఉన్న 1,600 కిలోమీటర్ల దూరం ఏకంగా 500 కి.మీ.లకు తగ్గతోందని కార్యక్రమంలో పాల్గొన్న త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా చెప్పారు. -
G-20 Summit: బంగ్లా, మారిషస్ ప్రధానులతో మోదీ భేటీ
న్యూఢిల్లీ: జీ20 నేపథ్యంలో ఢిల్లీకి మొదటగా వచ్చిన నేతల్లో మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ ఒకరు. ప్రధాని మోదీ మొట్టమొదటి సమావేశం మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్‌తోనే జరిగింది. గ్లోబల్ సౌత్ వాణిని వినిపించేందుకు కట్టుబడి ఉన్నామని ఈ భేటీ సందర్భంగా ఇద్దరు నేతలు ప్రకటించారు. ‘రెండు దేశాల నడుమ సంబంధాలు ఏర్పాటై 75 ఏళ్లవుతున్న సందర్భంగా ఈ ఏడాదికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఫిన్‌టెక్, సాంస్కృతిక తదితర రంగాల్లో సహకారంపై చర్చించాం’అని మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘భారత్ దార్శనిక కార్యక్రమం ‘సాగర్’లో మారిషస్ వ్యూహాత్మక కీలక భాగస్వామి. ద్వైపాక్షిక సంబంధాలను విస్తృతం చేసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్నారు’అని పీఎంవో తెలిపింది. ప్రధాని మోదీ అనంతరం బంగ్లాదేశ్ ప్రధానమంత్రి హసీనాతో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాల్లో సహకారం విస్తృతం చేసుకునేందుకు, రెండు దేశాల మధ్య కనెక్టివిటీతోపాటు వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చించినట్లు అనంతరం ప్రధాని మోదీ తెలిపారు. ‘గత తొమ్మిదేళ్లలో బంగ్లాదేశ్‌తో సంబంధాలు ఎంతో బలోపేతమయ్యాయి. తాజాగా ప్రధాని హసీనాతో చర్చలు ఫలప్రదమయ్యాయని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. కనెక్టివిటీ, సాంస్కృతిక రంగాలతోపాటు ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఇద్దరు నేతలు అంగీకారానికి వచ్చారని పీఎంవో తెలిపింది. -
దేశ ప్రధాని జోక్యం.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ గురువారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చి అందరికి షాక్ ఇచ్చాడు. అయితే ఒక్కరోజు వ్యవధిలోనే తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు తమీమ్ ఇక్బాల్. కాగా అతను రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవడం వెనుక బంగ్లా ప్రధాని షేక్ హసీనా జోక్యం ఉన్నట్లు సమాచారం. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్ ఇక్బాల్ శుక్రవారం(జూలై 7న) సాయంత్రం బంగ్లా ప్రధాని షేక్ హసీనాను మర్యాద పూర్వకంగా కలిశాడు. ఈ నేపథ్యంలో ప్రధాని తనను రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరిందంటూ తమీమ్ ఇక్బాల్ మీడియాకు వివరించాడు. మీడియాతో మాట్లాడుతూ.. ''ముఖ్యమైన వన్డే వరల్డ్‌కప్ ముందు ఇలాంటి నిర్ణయం తగదని.. వరల్డ్‌కప్ వరకైనా క్రికెట్ ఆడితే బాగుంటుందని'' ప్రధాని తనను కోరినట్లు తమీమ్ ఇక్బాల్ పేర్కొన్నాడు. రిటైర్మెంట్ విషయంలో ఎవరు చెప్పినా వినకపోయేవాడినని.. అయితే ప్రధాని షేక్ హసీనా మాటల విషయంలో మాత్రం తాను అభ్యంతరం చెప్పలేకపోయానని.. అందుకే రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంటున్నా. స్వయంగా బంగ్లా ప్రధాని తనకు నెలన్నర రోజుల పాటు ఆటకు దూరంగా ఉండాలని.. మానసికంగా కుదుటపడాలని కోరారు. అందుకే నెలన్నర పాటు ఆటకు దూరంగా ఉండాలనుకుంటున్నా. మానసికంగా సిద్దమయ్యాకా మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నా'' అంటూ తెలిపాడు. ఇక తమీమ్ ఇక్బాల్ బంగ్లా తరఫున 70 టెస్ట్‌లు, 241 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన తమీమ్.. టెస్ట్‌ల్లో 10 సెంచరీలు, 31 అర్ధసెంచరీల సాయంతో 5134 పరుగులు.. వన్డేల్లో 14 సెంచరీలు, 56 అర్ధసెంచరీల సాయంతో 8313 పరుగులు.. టీ20ల్లో సెంచరీ, 7 అర్ధసెంచరీల సాయంతో 1758 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో తమీమ్ అత్యుత్తమ ఆటగాడిగా పేరుగాంచాడు. చదవండి: Tamim Iqbal Retirement: స్టార్ క్రికెటర్ షాకింగ్ నిర్ణయం.. అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటన -
భారత్ నుంచి బంగ్లాకు పైప్‌లైన్ ద్వారా డీజిల్
న్యూఢిల్లీ: భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు డీజిల్ రవాణా కోసం రూ.377 కోట్లతో నిర్మించిన పైప్‌లైన్‌ను ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా శనివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. భారత్–బంగ్లాదేశ్ సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ఈ లైన్ వల్ల రవాణా ఖర్చులతోపాటు కాలుష్యం కూడా తగ్గుతాయని చెప్పారు. ప్రస్తుతం డీజిల్ భారత్ నుంచి 512 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గంలో బంగ్లాదేశ్‌కు సరఫరా అవుతోంది. నూతనంగా అస్సాంలోని నుమాలిఘడ్ నుంచి బంగ్లాదేశ్‌కు 131.5 కిలోమీటర్ల మేర నిర్మించిన పైప్‌లైన్ ద్వారా ఏడాదికి 10 లక్షల టన్నుల డీజిల్ రవాణాకు వీలుంటుంది. ఈ 15 ఏళ్ల ఒప్పందాన్ని దశలవారీగా విస్తరించుకునే వీలుంది. -
విచ్ఛిన్న శక్తులపై ఉమ్మడి పోరు
న్యూఢిల్లీ: పరస్పర విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించే ఉగ్రవాద, ఛాందసవాద శక్తులను కలిసికట్టుగా ఎదుర్కోవాలని భారత్, బంగ్లాదేశ్ నిర్ణయించాయి. భారత్ పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో మంగళవారం ద్వైపాక్షిక చర్చల అనంతరం హైదరాబాద్ హౌస్‌లో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘ఉగ్రవాదం, ఛాందస వాదంపై పోరులో సహకరించుకోవాలని మేం నిర్ణయించాం. 1971 నాటి స్ఫూర్తిని సజీవంగా నిలుపుకునేందుకు రెండు దేశాల మధ్య కొనసాగుతున్న పరస్పర విశ్వాసానికి విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే శక్తులపై ఉమ్మడిగా పోరాడాలని అంగీకారానికి వచ్చాం’ అని అన్నారు. రెండు దేశాలను కలుపుతూ ప్రవహించే 54 నదులపై ఆధారపడి కోట్లాదిమంది రెండు దేశాల ప్రజలు శతాబ్దాలుగా జీవిస్తున్నారని మోదీ వివరించారు. ‘మైత్రి, సహకారభావం స్ఫూర్తితో రెండు దేశాలు ఎన్నో అంశాలను పరిష్కరించుకున్నాయి. తీస్తా నదీ జలాల పంపిణీ సహా అన్ని ప్రధాన సమస్యలపై త్వరలోనే అంగీకారం కుదురుతుందని ఆశిస్తున్నాను’ అని ప్రధాని మోదీ అన్నారు. బంగ్లాదేశ్‌తో సమగ్ర వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం(సెపా)పై త్వరలోనే చర్చలు మొదలవుతాయని వెల్లడించారు. బంగ్లాదేశ్‌పై చైనా పలుకుబడి పెరిగిపోవడంపైనా ఇద్దరు నేతలు పూర్తిస్థాయిలో చర్చించారని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాట్రా చెప్పారు. ఏడు ఒప్పందాలపై సంతకాలు మోదీ, హసీనాల చర్చల అనంతరం రెండు దేశాల అధికారులు రైల్వేలు, అంతరిక్ష పరిజ్ఞానం, నదీ జలాల పంపిణీ, అనుసంధానతకు సంబంధించిన 7 ఒప్పందాలపై సంతకాలు చేశారు. వీటిలో కుషియారా నదీ జలాల ఒప్పందం కూడా ఉంది. దీనిద్వారా బంగ్లాదేశ్‌లోని సిల్హెట్, భారత్‌లో దక్షిణ అస్సాం లాభపడతాయి. 1996లో గంగా జలాల ఒప్పందం తర్వాత రెండు దేశాల మధ్య కుదిరిన నదీ జలాల ఒప్పందం ఇదే. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభ్యంతరాలతో 2011 నుంచి తీస్తా నదీ జలాల పంపిణీ వివాదం కొనసాగుతుండటంపై హసీనా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుదిరిన ఎంవోయూలు.. బంగ్లాదేశ్ రైల్వే ఉద్యోగులకు వివిధ అంశాల్లో శిక్షణ, ఐటీ సొల్యూషన్స్ భారత్ సమకూర్చుతుంది. బంగ్లాదేశ్ ప్రభుత్వ రోడ్లు, హైవేల శాఖకు భారత్ నిర్మాణ సామగ్రి, యంత్రాలను అందజేయనుంది. ఖుల్నా–దర్శన రైలు మార్గం ప్రాజెక్టులో ట్రాక్ డబ్లింగ్ పనుల్లోనూ, పర్బతీపూర్– కౌనియా రైలు మార్గాన్ని డబుల్ లైన్‌గా మార్చేందుకు భారత్ సాయం చేయనుంది. ఖుల్నాలోని రాంపాల్ వద్ద 1,320 మెగావాట్ల సూపర్ క్రిటికల్ బొగ్గు ఆధారిత ప్లాంట్ మైత్రి యూనిట్–1ను, ఖుల్నా–మోంగ్లా పోర్టు ప్రాజెక్టులోని 5.13 కిలోమీటర్ల రుప్షా రైలు వంతెనను ప్రారంభించారు. షేక్ హసీనాకు ఘన స్వాగతం బంగ్లా ప్రధాని షేక్ హసీనా నాలుగు రోజుల పర్యటనకు గాను సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం రాష్ట్రపతి భవన్ వద్ద ప్రధాని మోదీ ఆమెకు స్వాగతం పలికారు. రెండు దేశాల మధ్య సంబంధాలకు సహకారం, పరస్పర విశ్వాసమే ప్రాతిపదిక అని ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ‘ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడం, ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడమే ప్రధాన లక్ష్యం. మైత్రితో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చునని మా విశ్వాసం’అని హసీనా అన్నారు. అనంతరం హసీనా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌తో భేటీ అయ్యారు. రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మునికి పుష్పాంజలి ఘటించారు. -
మతం పేరుతో హింసకు పాల్పడే వారిపై తక్షణమే చర్యలు
ఢాకా: దేశంలో మతాన్ని అడ్డుపెట్టుకుని హింసకు పాల్పడేవారిపై తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా మంగళ వారం హోం మంత్రిని ఆదేశించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఏ విషయాన్నైనా నిజానిజాలు తెలుసుకోకుండా నమ్మవద్దని ప్రజలను ఆమె కోరారు. గత బుధవారం దుర్గాపూజల సంద ర్భంగా దైవదూషణ జరిగిందంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన పోస్టింగ్‌ల ప్రభావంతో హిందువుల ఆలయాలపై ప్రారంభమైన దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రధాని హసీనా పరిస్థితులను సమీక్షించారు. మతపరమైన హింసకు పాల్పడే వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్‌ను ఈ సందర్భంగా హసీనా ఆదేశించారు. కాగా, బంగ్లాదేశ్‌లో హిందువులపై కొనసాగుతున్న దాడులపై ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ జిహాదీస్తాన్గా మారిపోయిందని ఆమె మంగళవారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. -
బంగ్లాదేశ్‌తో కరచాలనం
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర నమోదు చిట్టా (ఎన్ఆర్సీ), జాతీయ ప్రజా నమోదు పట్టిక (ఎన్పీఆర్)లు మన దేశంలో ప్రధానంగా చర్చలోకి వచ్చినప్పటినుంచీ బంగ్లాదేశ్‌తో మన సంబంధాలు క్రమేపీ క్షీణిస్తున్నాయా అన్న సందేహం అందరికీ కలుగుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 26, 27 తేదీల్లో ఆ దేశంలో పర్యటించారు. కరోనా మహమ్మారి విరుచుకుపడ్డాక మోదీ జరిపిన తొలి విదేశీ పర్యటన ఇదే కావటంతో ఆయన తమకిస్తున్న ప్రాధాన్యతేమిటో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గుర్తించేవుంటారు. ఆయన పర్యటన ముగిశాక విడుదలైన ఇరు దేశాల అధినేతల సంయుక్త ప్రకటన ‘ప్రజానుకూల సరిహద్దు’ విధానం మొదలు కొని అణుశక్తి వరకూ వివిధ అంశాలను స్పృశించింది. అయితే ఆ దేశం అత్యంత ప్రధాన మైనదిగా భావించే తీస్తా నదీ జలాల అంశం మాత్రం అందులో లేదు. ఈ విషయంలో హసీనా తన అసంతృప్తిని దాచుకోలేదు కూడా. అలాగే ఆమె పైకి చెప్పకపోయినా వారిద్దరి మధ్య చర్చల్లో సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ల ప్రస్తావన వచ్చేవుంటుంది. ‘కీలెరిగి వాత... వీలెరిగి చేత’ అన్నారు. ఎప్పుడే పని చేయాలో మోదీకి బాగా తెలుసని ఈ పర్యటన నిరూపించింది. యాభైయ్యేళ్లనాటి ఆ దేశ ఆవిర్భావంలో మన దేశానిది కీలక పాత్ర. ఖలీదా జియా పాలనాకాలంలో, సైనిక పాలన సమయంలో ఆ దేశం భారత్ విషయంలో కొంత తేడాగా వున్నా హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం మొదటినుంచీ మన దేశంతో సన్నిహితంగా వుంటున్నది. కనుకనే ఈశాన్యంలో సమస్యలు సృష్టించే మిలిటెంట్లను పట్టి బంధించి మన దేశానికి అప్పగించటం, వారి స్థావరాలను ధ్వంసం చేయటం హసీనా సర్కారువల్లే జరిగాయి. కానీ గత ఏణ్ణర్ధంగా భారత్ అంటే ఆ దేశం గుర్రుగా వుంది. అస్సాంలో ఎన్ఆర్సీ ప్రక్రియ అమలు తర్వాత ఇది మొదలైంది. ఆ ప్రక్రియలో19 లక్షలమంది చట్టవిరుద్ధ పౌరులున్నారని తేలింది. వీరిలో ముస్లింల సంఖ్య గణనీయంగా వుంది. వీరంతా బంగ్లా పౌరులంటూ కేంద్రమంత్రులు మాట్లాడటం ఆ దేశానికి మింగుడు పడలేదు. అలాగని అది అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. సరి హద్దుల్లో పటిష్టమైన నిఘా వుంటుంది కనుక తమవైపు నుంచి ఎవరూ అక్రమంగా వచ్చే అవకాశం లేదని లీకులిచ్చారు. సీఏఏ, ఎన్ఆర్సీలు భారత్ ఆంతరంగిక వ్యవహారమని ఒక సందర్భంలో హసీనా అన్నారు. అలా అంటూనే సీఏఏ అనవసరమని అప్పట్లో ఆమె చేసిన వ్యాఖ్య కలకలం సృష్టించింది. ఇలాంటి సమయంలో ప్రధాని అక్కడకు పర్యటనకెళ్లటం దౌత్యపరంగా మంచిదే. ఎందుకంటే మన పట్ల అసంతృప్తిగా వుంటున్న ఇరుగు పొరుగు దేశాలకు చైనా చేరువవుతోంది. బంగ్లాదేశ్‌లోనూ ఆ పని మొదలుపెట్టింది. హసీనా 2019లో చైనా పర్యటించి ఆ దేశంతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కనుక ఎంత త్వరగా బంగ్లాను సన్నిహితం చేసుకుంటే అంత మంచిది. అందుకు బంగ్లాదేశ్ ఆవిర్భావ సర్ణోత్సవ సంవత్సరం కన్నా మించిన సందర్భం మోదీకి వేరే వుండదు. అదే సమయంలో పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందేం దుకు సైతం ఈ పర్యటన ఉపయోగపడుతుందని ఆయన భావించివుండొచ్చు. దేశ విభజనకాలంతో మొదలుపెట్టి 1965, 1971 యుద్ధ సమయాల్లో, అటు తర్వాత 2002–06 సంవత్సరాలమధ్య ఖలీదా పాలించినప్పుడు బంగ్లా భూభాగంలో వున్న హిందువులు అమానుషమైన హింసను, వేధింపులనూ ఎదుర్కొనాల్సివచ్చింది. దాంతో ఆ సందర్భాల్లో లక్షలమంది పశ్చిమ బెంగాల్‌కు వలస వచ్చి తల దాచుకున్నారు. అలా వచ్చి స్థిరపడినవారిలో నామసూద్ర పేరుతో వుండే తెగకు చెందిన మతువాలు అధికం. వారంతా ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాలు, జల్పాయ్గిరి, సిలిగురి, కూచ్‌బెహార్, వర్ధమాన్ జిల్లాల్లోని 30 స్థానాల్లో గణనీయంగా వున్నారు. అందువల్లే కావొచ్చు...ఆ దళిత కులానికి పితామహుడిగా చెప్పే హరిచంద్ ఠాకూర్ స్మృత్యర్థం బంగ్లాలో నిర్మించిన మందిరాన్ని మోదీ సందర్శించారు. ఇరుగుపొరుగు దేశాల్లో హింసను ఎదుర్కొంటున్న మైనారిటీలకు పౌరసత్వం ఇవ్వటం లక్ష్యంగా తీసుకొచ్చిన సీఏఏలో పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్లతోపాటు మిత్ర దేశమైన తమనూ జత చేయటం బంగ్లాకు ఆగ్రహం కలిగించింది. ఇక తీస్తా నదీజలాల వివాదం చాలా పాతది. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2011 జనవరిలోనే అది దాదాపు పరిష్కారానికి చేరువైంది. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ బంగ్లాదేశ్ పర్యటించినప్పుడు తొమ్మిది ఒప్పందాలు కుదిరాయి. భూభాగాల పరస్పర మార్పిడి చేసుకోవటం పూర్తయింది. తీస్తాతోపాటు ఫెనీ జలాలను పంచుకోవటంపైనా ముసాయిదా ఖరారైనా మమతా బెనర్జీ అభ్యంతరంతో అది ఒప్పందంగా మారలేదు. లక్షలాదిమందికి ప్రాణావ సరమైన తీస్తా నదీజలాల్లో తమకు న్యాయంగా రావాల్సిన వాటా ఇవ్వాలని మోదీతో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో హసీనా కోరినట్టు తాజాగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. భారత్‌తో సన్నిహితమని చెప్పుకుంటున్నా హసీనా తీస్తాపై ఒప్పించలేకపోతున్నారని విపక్షాల నుంచి ఎప్పటినుంచో విమర్శలున్నాయి. ఈ విషయంలో ఆమె ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. కనుక సాధ్యమైనంత త్వరలో ఈ నదీ జాలలపై ఒప్పందానికి రావటం మన దేశానికి మేలు కలిగించే అంశం. కలిసి ముందడుగు వేసి, వ్యాపారం, వాణిజ్యం తదితర రంగాల్లో సమష్టిగా అభివృద్ధి సాధిద్దామని మోదీ బంగ్లాకు పిలుపునిచ్చారు. అది సాకారం కావాలని ఆశించాలి. -
తీస్తా ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం
ఢాకా: తీస్తా నదీ జలాల పంపకంపై బంగ్లాదేశ్‌తో కుదుర్చుకున్న ఒప్పందం అమలుకు కట్టుబడి ఉన్నట్లు భారత ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ విషయమై బంగ్లా ప్రధాని హసీనాతో రెండు రోజుల పర్యనటలో భాగంగా మోదీ చర్చలు జరిపారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. విదేశాంగశాఖ కార్యదర్శి హర్షవర్థన్ ష్రింగ్లా శనివారం మీడియాకు ఈ విషయం వెల్లడించారు. ఫెని నదీ జలాల పంపిణీ ముసాయిదాను రూపొందించాలని షేక్ హసీనాను మోదీ కోరారని ఆయన చెప్పారు. రెండు దేశాలు 56 నదుల జలాలను పంచుకుంటున్నాయి..మున్ముందూ కూడా ఇదే సహకారం కొనసాగుతుందని ఆయన అన్నారు. తీస్తా సహా నదీ జలాల విభజనపై రెండు దేశాల ఉన్నతాధికారుల మధ్య ఇటీవలే ఢిల్లీలో జరిగిన భేటీ ఫలప్రదంగా ముగిసిందన్నారు. సిక్కింలో ప్రారంభమయ్యే తీస్తా నది పశ్చిమబెంగాల్ గుండా ప్రవహించి బంగ్లాదేశ్‌లో ప్రవేశించడానికి ముందు బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. ఈ నదీ జలాల పంపకంపై 2011లో కుదిరిన ఒప్పందం పశ్చిమబెంగాల్ సీఎం మమత అభ్యంతరాలతో అమలు కాకుండా నిలిచిపోయింది. బంగ్లాదేశ్‌లో రెండు రోజుల పర్యటన ముగించుకుని మోదీ శనివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఇద్దరు ప్రధానుల చర్చలు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, భారత ప్రధాని మోదీ శనివారం ద్వైపాక్షిక సంబంధాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కనెక్టివిటీ, వాణిజ్యం, ఇంధనం, ఆరోగ్య రంగాలపై వారు ప్రధానంగా దృష్టి సారించారు. ఈ సందర్భంగా మోదీ హసీనాకు 12 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులకు సంబంధించిన ఒక బాక్సును బహూకరించారు. శాంతి, ప్రేమ, సుస్థిరత కోరుకుంటున్నాం భారత్, బంగ్లాదేశ్‌లు అస్థిరత, అలజడులు, ఉగ్రవాదం బదులు శాంతి, ప్రేమ, సుస్థిరత ఆకాంక్షిస్తున్నాయని ప్రధాని మోదీ ప్రకటించారు. గోపాల్‌గంజ్‌లోని ఒరకండిలో మతువా వర్గం హిందువుల ఆరాధ్యుడు హరిచంద్ ఠాకూర్ ఆలయాన్ని సందర్శించిన అనంతరం అక్కడి వారితో మాట్లాడారు. భారత్ నుంచి ఒరకండికి సులువుగా చేరుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. పశ్చిమబెంగాల్లోని అత్యంత కీలకమైన మతువా వర్గం ఓటర్లను ఆకట్టుకునేందుకే ప్రత్యేకంగా మోదీ ఈ పర్యటన చేపట్టారని విశ్లేషకులు అంటున్నారు. సరిహద్దులకు సమీపంలో ఉన్న 16వ శతాబ్దం నాటి జెషోరేశ్వరి కాళీ ఆలయాన్ని శనివారం ప్రధాని మోదీ దర్శించుకున్నారు. అమ్మ వారికి వెండితో తయారుచేసిన, బంగారు పూత కలిగిన మకుటాన్ని సమర్పించుకున్నారు. తుంగిపరాలోని షేక్ ముజిబుర్ రహ్మాన్ మాసోలియాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. బంగబంధుకు పుష్పాలతో నివాళులర్పించారు. ముజిబుర్ మాసోలియంను సందర్శించిన ఏకైక విదేశీ ప్రభుత్వ నేతగా మోదీ నిలిచారు. -
కరోనా తర్వాత తొలిసారి మోదీ విదేశానికి
-
కరోనా తర్వాత తొలిసారి మోదీ విదేశానికి
న్యూఢిల్లీ: కోవిడ్ సంక్షోభానంతరం తొలిసారి జరిపే విదేశీ పర్యటన స్నేహపూరిత పొరుగుదేశం బంగ్లాదేశ్‌కు కావడం సంతోషకరమని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. బంగ్లా పర్యటనలో ఆదేశ ప్రధాని షేక్ హసీనాతో కీలకమైన చర్చలు జరుపుతానన్నారు. బంగ్లాదేశ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధానిమోదీ నేడు, రేపు బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన తన పర్యటనపై ఆనందం వ్యక్తం చేశారు. బంగ్లా నేషనల్‌డే వేడుకలు జరిగే శుక్రవారమే బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రహమన్ శత జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. పర్యటనలో ముజిబుర్ సమాధిని సందర్శిస్తానని ఆయన తెలిపారు. బంగ్లా పర్యటనలో 51 శక్తిపీఠాల్లో ఒకటైన జషోరేశ్వరి కాళి ఆలయాన్ని సైతం మోదీ సందర్శించి పూజలు జరపనున్నారు. బంగ్లాలోని మతువా ప్రజలతో సమావేశమయ్యేందుకు తాను ఎదురు చూస్తున్నానని మోదీ చెప్పారు. మతువాలకు ప్రధానమైన ఓర్కండాలో శ్రీహరిచంద్ ఠాకూర్ తన సందేశాన్ని ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. గతేడాది డిసెంబర్లో బంగ్లా ప్రధానితో వీడియో సమావేశం ఫలవంతంగా జరిగిందని, తాజా పర్యటనలో మరింత అర్ధవంతమైన చర్చలుంటాయని ఆయన తెలిపారు. బంగ్లా అధ్యక్షుడు అబ్దుల్ హమీద్‌తో పాటు ఇతర బంగ్లా నేతలతో ఆయన సమావేశం కానున్నారు. -
ప్రధాని హత్యకు కుట్ర: 14 మందికి మరణ శిక్ష
ఢాకా: రెండు దశాబ్దాల క్రితం అప్పటి ప్రధానమంత్రి షేక్ హసీనాను హత్య చేసేందుకు యత్నించారన్న కేసులో 14 మంది ఇస్లామిక్ మిలిటెంట్లకు బంగ్లాదేశ్ కోర్టు మరణ శిక్ష విధించింది. వీరిలో 9 మందిని పోలీసులు కోర్టుకు హాజరు పరిచారు, మిగిలిన నలుగురు పరారీలో ఉన్నారు. వీరిని ఫైరింగ్ స్క్వాడ్‌తో కాల్పించి చంపి ఇలాంటి వారికి ఒక సందేశమివ్వాలని జడ్జి తీర్పులో వ్యాఖ్యానించారు. లేదంటే వీరిని ఉరితీయాలని ఆదేశించారు. బంగ్లాదేశ్ నియమాల ప్రకారం మరణ శిక్షను హైకోర్టు నిర్ధారించాల్సి ఉంటుంది. తాజా తీర్పుపై నిందితులు అప్పీలుకు వెళ్లే అవకాశం ఇస్తారు. 2000 సంవత్సరంలో హర్కతుల్ జిహాద్ బంగ్లాదేశ్‌కు చెందిన వీరంతా ప్రధాని హత్యకు కుట్రపన్నారు. వీరి నాయకుడు ముఫ్తి అబ్దుల్ హనన్‌కు వేరే కేసులో 2017లో మరణ శిక్ష అమలు చేశారు. ప్రధాని హత్యాయత్నాన్ని సెక్యూరిటీ వర్గాలు భగ్నం చేశాయి. ఈ కేసుకు సంబంధించే గతంలో 10మంది ఉగ్రవాదులకు మరణశిక్ష అమలు చేయడం జరిగింది. 1975 నుంచి హసీనా పలుమార్లు హత్యాయత్నాల నుంచి తప్పించుకున్నారు. -
ఎన్నికల ప్రచారంలో బంగ్లా ప్రధాని హత్యకు కుట్ర!
ఢాకా: రెండ దశాబ్దాల క్రితం ఇస్లామిక్ మిలిటెంట్లు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాను హతమార్చేందుకు ప్రయత్నాలు చేసిన విషయం తాజాగా బహిర్గతమైంది.. ఆమెను వారు తూటాలతో కాల్చేందుకు సిద్ధమయ్యారని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని బంగ్లాదేశీ కోర్టు మంగళవారం తెలిపింది. 14 మంది మిలిటెంట్ల మరణ వాంగ్మూలంలో ఈ విషయం తెలిసినట్లు కోర్టు పేర్కొంది. ఆ మిలిటెంట్లను కోర్టు నుంచి జైలుకు తరలిస్తుండగా ప్రధాని హత్యకు వేసిన ప్రణాళికను ఢాకా కోర్టు న్యాయవాది అబు జఫర్ ఎండీ కమ్రుజ్జమన్ వివరించారు. గోపాల్‌గంజ్ నైరుతి నియోజకవర్గంలోని కోటాలిపార ప్రాంతంలో ఉన్న మైదానంలో జూలై 21, 2000లో 76 కిలోల భారీ బాంబు అమర్చేందుకు ప్లాన్ వేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని హసీనా ఆ మైదానానికి వస్తారని గుర్తించి బాంబు పెట్టేందుకు హర్కాతుల్ జిహాద్ బంగ్లాదేశ్ (హజీ బీ) సంస్థ ప్రయత్నాలు చేసింది. ఈ కుట్రలో మొత్తం 14 మంది పాత్ర ఉందని తెలిపింది. వారిని ఉరి తీసే క్రమంలో ఈ విషయాన్ని తెలిపారని న్యాయమూర్తి కమ్రుజ్జమన్ తెలిపారు. చదవండి: పార్లమెంట్లో రాసలీలలు.. డెస్క్‌లు, టేబుళ్ల చాటుగా చదవండి: నిజమైన భారతీయులను రక్షిస్తాం -
భారత్, బంగ్లా మధ్య ఏడు ఒప్పందాలు
ఢాకా: భారత్, బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడనున్నాయి. మొత్తం ఏడు రంగాల్లో పరస్పర సహకారం కోసం ఇరుపక్షాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మధ్య గురువారం జరిగిన ఆన్లైన్ సదస్సులో ఈ మేరకు ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల మధ్య గత 55 ఏళ్లుగా నిలిచిపోయిన రైలు మార్గాన్ని సైతం పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పాక్‌పై జరిగిన యుద్ధంలో బంగ్లాదేశ్ విజయం సాధించి 50 ఏళ్లవుతున్న సందర్భంగా విజయ్ దివస్ జరుపుకుంటున్న వేళ భారత్, బంగ్లాల మధ్య ఒప్పందాలు కుదరడం గర్వకారణమని ప్రధాని మోదీ చెప్పారు. భారత జాతిపిత మహాత్మాగాంధీ, బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబీర్ రెహ్మాన్ జీవితాలను ఆవిష్కరించే డిజిటల్ ఎగ్జిబిషన్‌ను ప్రధానులిద్దరూ సంయుక్తంగా ప్రారంభించారు. హైడ్రోకార్బన్స్, వ్యవసాయం, ఇంధనం, టెక్స్టైల్స్ రంగాల్లో పరస్పర సహకారంతో పాటు సరిహద్దుల్లో ఏనుగుల సంరక్షణ, బంగ్లాకు చెత్తను శుద్ధి చేసే పరికరాల ఎగుమతి వంటి వాటిపై ఒక అవగాహనకు వచ్చాయి. భారత్‌కు కృతజ్ఞతలు: హసీనా భారత్ తమకు అసలైన మిత్రదేశమని షేక్ హసీనా అన్నారు. 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో అండదండలు అందించినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.