
బంగ్లాదేశ్‌కు భారతదేశం నమ్మకమైన స్నేహితుడు
ఢాకా: బంగ్లాదేశ్‌కు భారతదేశం నమ్మకమైన స్నేహితుడని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా అన్నారు. 1971లో జరిగిన విముక్తి యుద్ధంలో బంగ్లాదేశ్ ప్రజలకు ఆశ్రయం ఇచ్చింది భారతదేశమేనని చెప్పారు.
ఎన్నికల సందర్భంగా భారతదేశం గురించి అడిగిన ప్రశ్నకు హసీనా మాట్లాడుతూ.. ''మేము చాలా అదృష్టవంతులం. భారతదేశం మనకు నమ్మకమైన స్నేహితుడు. మా లిబరేషన్ వార్ సమయంలో మాకు మద్దతు ఇచ్చారు. 1975 తర్వాత మేము మా కుటుంబం మొత్తాన్ని కోల్పోయినప్పుడు, వారు మాకు ఆశ్రయం ఇచ్చారు. భారతదేశ ప్రజలకు మా శుభాకాంక్షలు. " అని అన్నారు.
బంగ్లాదేశ్‌లో నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) బహిష్కరిస్తోంది. దీంతో అధికార అవామీ లీగ్ నాయకురాలు హసీనా గెలుపు ఖాయమైంది. ప్రధానమంత్రిగా వరుసగా ఆమె నాలుగోసారి గెలుపొందడంతోపాటు మొత్తంగా అవామీ లీగ్ ఐదవ విజయం సాధించడం విశేషం.
ఇదీ చదవండి: మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. ఖండించిన మాల్దీవుల ప్రభుత్వం