ఒకప్పుడు భారత్‌తో చెలిమిచేసిన బంగ్లాదేశ్ ఇప్పుడు విషం చిమ్ముతోంది. ఆ దేశంలో హిందువులపై తరచూ దాడులు జరగుతున్నా మౌనం వహిస్తోంది. అక్కడి నేతలు అనునిత్యం భారత్‌పై నిరంకుశ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. అయినా బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ ఏమీ మాట్లాడటంలేదు. పైగా బంగ్లాదేశ్ హోమ్ మంత్రి అక్కడి సైన్యాన్ని భారత్ ముందు గట్టిగా నిలబెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు యూనస్ ప్రభుత్వం మాజీ ప్రధాని షేక్ హసీనాను భారత్ నుంచి రప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
షేక్ హసీనా అధికారానికి దూరమైన తర్వాత, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్‌కు ఏమాత్రం ఇష్టంలేని పలు నిర్ణయాలు తీసుకుంటోంది. అయినప్పటికీ భారత్ ఆ దేశంతో స్నేహపూర్వకంగానే మెలుగుతోంది. బంగ్లాదేశ్‌కు చెందిన పలువురు నేతలు తమ వ్యాఖ్యలతో విషం చిమ్ముతున్నా, భారత్ ఇంకా మాటల యుద్దం ప్రారంభించలేదు. భారత్.. బంగ్లాదేశ్ విషయంలో ఎంతో సంయమనం పాటిస్తోంది.
బంగ్లాదేశ్‌లో భారత్‌కు వ్యతిరేకంగా..
1. హిందువులపై దాడి
బంగ్లాదేశ్‌లో హిందువులపై తరచూ దాడులు జరుగుతున్నాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం ఈ సంవత్సరంలో ఇప్పటివరకు బంగ్లాదేశ్‌లో హిందువులపై 2,200కి పైగా అఘాయిత్యాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. ఇది పాకిస్తాన్‌లో జరిగినదాని కంటే 10 రెట్లు అధికం.
2. పాకిస్తాన్‌తో చెలిమి
బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ తాజాగా పాకిస్తాన్‌తో చెలిమి కోరుకుంటున్నారు. పాక్ నేతలతో సంబంధాలు నెరపుతున్నారు. పాకిస్తాన్ నుండి షిప్ కంటైనర్లు తరచూ చిట్టగాంగ్ నౌకాశ్రయానికి చేరుకుంటున్నాయి. పాక్ సైన్యం బంగ్లాదేశ్ ఆర్మీకి శిక్షణ ఇవ్వబోతోంది.
3. సార్క్ పునరుద్ధరణకు యత్నం
సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్ (సార్క్)పై దృష్టి సారించడంపై భారత్ సుముఖంగా లేదు. అయతే బంగ్లాదేశ్ ప్రభుత్వం దానిని పునరుద్ధరణకు ప్రయత్నాలు సాగిస్తోంది.
4. దౌత్య సంబంధాలను విచ్ఛిన్నం
బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌తో దౌత్య సంబంధాలను విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశ్యంలో ఉంది. ఈ నేపధ్యంలో బంగ్లాదేశ్ హైకమిషనర్ ప్రణయ్ వర్మను వెనక్కి పిలిపించింది. ఇలాగే మరో ఇద్దరు దౌత్యవేత్తలను కూడా వెనక్కి పిలిపించింది.
5. సాధారణ సంబంధాలలోనూ..
మన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ బంగ్లాదేశ్‌ను సందర్శించినప్పుడు, యూనస్ లేదా బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన సోషల్ మీడియా ఖాతాలలో ఇందుకు సంబంధించిన ఫొటో పోస్ట్ చేయలేదు. సాధారణ విధివిధానాలను కూడా బంగ్లాదేశ్ పాటించలేదు. ప్రధాని మోదీ బంగ్లా ప్రధాని యూనస్‌కు ఫోన్ చేసినప్పటికీ ఆయన చర్చల కోసం ఏ ప్రతినిధి బృందాన్నీ భారత్‌కు పంపలేదు. దీనిని చూస్తుంటే భారత్‌తో బంధాన్ని చెడగొట్టుకుంటోందని స్పష్టమవుతోంది.
6. షేక్ హసీనా అప్పగింత
షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు వెళ్లేందుకు భారత్ అంత తేలిగ్గా అనుమతించదని బంగ్లాదేశ్‌కు తెలుసు. అయినా భారత్ పరువు తీయాలనే ఉద్దేశంతో షేక్ హసీనాను రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. భారత్‌తో సంబంధాలు చెడగొట్టేందుకే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా కారణమే
బంగ్లాదేశ్ ప్రజలు షేక్ హసీనాపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపధ్యంలో ఆమెకు ఆశ్రయం ఇచ్చిన భారత్‌పై మండిపడుతున్నారు. షేక్ హసీనాకు భారతదేశం మద్దతు ఇస్తున్నదని, అందుకే ఆమె నియంతగా మారిందని వారు ఆరోపిస్తున్నారు. ఇటువంటి సమయంలో ముహమ్మద్ యూనస్ ప్రభుత్వం అక్కడి ప్రజల కోపాన్ని చల్లార్చడానికి బదులుగా, రెచ్చగొట్టేటట్లు చేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బంగ్లాదేశ్ ఈ తీరులో ప్రవర్తిస్తున్నా భారత్.. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాను దౌత్య ఆయుధంగా ఉపయోగించలేదు. ఆమెను అడ్డుపెట్టుకుని బంగ్లాదేశ్‌ను అస్థిరపరిచేందుకు ఎలాంటి ప్రణాళిక చేయలేదు. షేక్ హసీనాను మాజీ ప్రధానిగా గౌరవిస్తున్నామని, అందుకే కొత్త ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించామని భారత్ స్పష్టం చేసింది. రాజకీయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ముహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్‌లో తన అధికారాన్ని కాపాడుకోవాలని అనుకుంటున్నారు. అందుకే బంగ్లాదేశ్ వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకోకూడదని కోరుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: World Year Ender 2024: హద్దులు దాటిన విమర్శలు.. వివాదాల్లో రాజకీయ ప్రముఖులు
Comments
Please login to add a commentAdd a comment