ఢాకా : మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని మహమ్మద్ యూనస్ నేృత్వంలోని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం భారత్‌కు లేఖ రాసింది. దీంతో ఇప్పటికే ఉన్న ఒప్పందం ప్రకారం షేక్ హసీనాను కేంద్రం బంగ్లాదేశ్‌కు అప్పగిస్తుందా? లేదా అనేది చర్చాంశనీయంగా మారింది.
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా షేక్ హసీనా ప్రధాని పీఠం నుంచి దిగిపోవడమే గాక.. దేశాన్ని వీడారు. ఆగస్టు 5 నుండి భారత్‌లోనే నివాసం ఉంటుంన్నారు. ఈ తరుణంలో హసీనాను తమకు అప్పగించాలని మహమ్మద్ యూనస్ నేృత్వంలోని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం భారత్‌కు లేఖ రాసింది.
Bangladesh's foreign adviser #TouhidHossain says #Dhaka has sent #DiplomaticNote to New Delhi for extradition of deposed PM @SheikhHasinaW. @MEAIndia pic.twitter.com/30mm1EvVra
— Upendrra Rai (@UpendrraRai) December 23, 2024
ఆ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు పలువురు మాజీ కేబినెట్ మంత్రులు, సలహాదారులుపై మారణ హోమం కేసులు నమోదు చేసింది. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతుంది. తాజాగా, షేక్ హసీనాను విచారించేందుకు సిద్ధమైంది. భారత్‌లో ఉన్న ఆమెను తిరిగి స్వదేశానికి రప్పించే దిశాగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఇందులో భాగంగా ‘షేక్ హసీనాను తమకు అప్పగించాలని భారత్‌కు లేఖ రాసినట్లు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి తౌహిద్ హుస్సేన్ మీడియాతో మాట్లాడారు. తౌహిద్ హుస్సేన్ ప్రకటనకు ముందు.. మద్యంతర ప్రభుత్వ సలహాదారు జహంగీర్ అలం మాట్లాడుతూ.. హసీనాను ఇక్కడికి(బంగ్లాదేశ్) తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు తన కార్యాలయం లేఖ పంపిందని అన్నారు. ప్రస్తుతం, ప్రక్రియ కొనసాగుతుందని సూచించారు. అంతేకాదు బంగ్లాదేశ్,భారత్‌ల మధ్య అప్పగింత ఒప్పందం ఇప్పటికే ఉందని, ఆ ఒప్పందం ప్రకారం హసీనాను తిరిగి బంగ్లాదేశ్‌కు తీసుకురావచ్చని ఆలం చెప్పారు.
మహ్మద్ యూనిస్ హెచ్చరికలు
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం వీడడంతో అక్కడ మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే, ఈ తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వం వహిస్తున్నారు. తన నేతృత్వంలో ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వ పాలన 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మహ్మద్ యూనిస్.. మాజీ ప్రధాని షేక్ హసీనా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
‘జూలై-ఆగస్ట్‌లో జరిగిన ప్రతి హత్యకు మేము న్యాయం చేస్తాము. హత్యకు బాధ్యులైన వారిని విచారిస్తాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. దేశం వీడి భారత్‌కి వెళ్లిన హసీనా తిరిగి ఇక్కడికి రావాల్సిందే. శిక్షను అనుభవించాల్సిందేనని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment