భారత్‌లో కూర్చొని బంగ్లాదేశ్‌పై మాట్లాడటం సబబు కాదు
అది ఇరుదేశాల మైత్రికి మంచిది కాదు
బంగ్లాదేశ్ సారథి మొహమ్మద్ యూనుస్ వ్యాఖ్య
ఢాకా: బంగ్లాదేశ్‌ను వీడిన మాజీ మహిళా ప్రధాని షేక్ హసీనా భారత్‌లో ఉన్నంతకాలం మౌనంగా ఉంటే మంచిదని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మొహమ్మద్ యూనుస్ హెచ్చరించారు. హసీనా బంగ్లాదేశ్‌ను వీడాక చెలరేగిన అల్లర్లలో చనిపోయిన వారికి న్యాయం జరగాలని ఆగస్ట్ 13వ తేదీన హసీనా డిమాండ్ చేయడంపై యూనుస్ ఘాటుగా స్పందించారు. గురువారం ఢాకాలోని తన అధికార నివాసంలో పీటీఐతో ఆయన ముఖాముఖి మాట్లాడా రు. ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
అప్పగింత కోరేదాకా మౌనంగా ఉండాల్సిందే
‘‘హసీనాను అప్పగించాలని మేం భారత్‌ను మేం కోరేదాకా ఆమె అక్కడ ఎలాంటి వ్యాఖ్యానాలు చేయొద్దు. మౌనమే మేలు. ఇక భారత్ సైతం ఒక విషయం గుర్తుంచుకోవాలి. హసీనా లేకపోయి ఉంటే మా దేశం అఫ్గానిస్తాన్‌లా తయారవుతుందన్న అభిప్రాయాలు మార్చుకోవాలి. హసీనాకు చెందిన ఆవామీ లీగ్ పార్టీ తప్ప బంగ్లాదేశ్‌లోని ప్రతి రాజకీయ పార్టీ ఇస్లామిక్ పార్టీ అనే భావననూ భారత్ విడనాడాలి. భారత్‌లో ఉంటూ ఆమె చేస్తున్న బంగ్లా వ్యతి రేక వ్యాఖ్యలపై ఇక్కడ ఎవరూ సంతోషంగా లేరు. ఆమెను వెనక్కి తీసుకురా వాలని యోచిస్తున్నాం. భారత్‌లో ఉంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బతింటాయి’’ అని అన్నారు.
మేం కూడా ఆమెను మర్చిపోతాం
‘‘ఆమె ఇండియాలో మౌనంగా కూ ర్చుంటేనే మేం కూడా ఆమెను మర్చి పోతాం. బంగ్లాదేశ్ ప్రజలూ ఆమెను మర్చిపోతారు. ఆమె తన లోకంలో తాను ఉంటే అందరికీ మంచిది. అలా కాకుండా భారత్‌తో కూర్చుని మాకు ఎలా పరిపాలించాలో ఉచిత సలహాలిస్తే ఎవ్వరికీ నచ్చదు. ఈ ధోరణి మాకేకాదు భారత్‌కు కూడా మంచిది కాదు. ఇరు దేశాల సంబంధాలపైనా ప్రతి కూల ప్రభావం చూపుతుంది. ఆమె సాధారణ పర్యటనకు ఇండియా వెళ్లలేదు. ఉవ్వెత్తున ఎగసిన ప్రజా ఉద్యమా నికి జడిసి హసీనా దేశం నుంచి పారిపో యారు. దేశంలో దురా గతాల నుంచి ప్రజలకు న్యాయం అందించేందుకు మా సర్కార్ కట్టుబ డి ఉంది. ఆమె చెబుతు న్నట్లు ప్రజలకు న్యాయం జరగా లంటే వాస్తవానికి ఆమెనే స్వదేశా నికి తీసుకురావాలి. అలా జరగకపోతే బంగ్లాదేశ్ ప్రజలు శాంతించరు. ఆమె పాల్పడిన దురాగతాలపై అందరి సమక్షంలో విచారణ జరగాల్సిందే’’ అని అన్నారు.
భారత్‌తో సత్సంబంధాలనే కోరుకుంటున్నాం
‘‘బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) ఇస్లామిక్‌గా మారిపోయిందని, దేశాన్ని అఫ్గానిస్తాన్‌లా మార్చేస్తారని భారత్ భావిస్తోంది. కానీ మేం పొరుగుదేశం ఇండియాతో మైత్రి బంధాన్నే కోరుకుంటున్నాం. హసీనా నాయకత్వంలో మాత్రమే బంగ్లాదేశ్‌లో సుస్థిరత సాధ్యమని భారత్ భావించడం మానుకోవాలి. హసీనా ప్రభుత్వం కూలిపోయాక మైనారిటీ హిందువులపై దాడులు పెరిగాయనేది అవాస్తవం. భారత్‌తో బలహీనంగా ఉన్న బంధాన్ని బలోపేతం చేసుకోవాల్సిన సమయమొచ్చింది. రవాణా, అదానీ విద్యుత్ ఒప్పందం వంటి వాటిని పట్టాలెక్కించాలి. ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష జరుపుతా. తదుపరి ఎన్నికల్లో బీఎన్‌పీ గెలిచి అధికారంలోకి వస్తే దేశంలో అవసరమైన సంస్కరణలు తీసుకొస్తా’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment