
కీవ్: ఉక్రెయిన్‌కు యూరోపియన్ యూనియన్ నేతల నుంచి మద్దతు వస్తున్న వేళ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మరో కీలక ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్షుడు ఆహ్వానిస్తే మరోసారి భేటీకి వెళ్తానని జెలెన్‌స్కీ చెప్పుకొచ్చారు. అమెరికాతో డీల్‌కు తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన ప్రకటనపై ట్రంప్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తాజాగా వీడియోలో మాట్లాడుతూ.. ‘అమెరికాతో మేము సత్సంబంధాలను కాపాడుకోగలం. తీవ్రమైన, నిజమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మరోసారి భేటీ అయ్యేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నిర్మాణాత్మక సంభాషణ కోసం ఆహ్వానిస్తే తప్పకుండా ట్రంప్‌ను కలుస్తాను. అలాగే, ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే సంతకం చేస్తాను.
ఇది భద్రతా హామీల వైపు మొదటి అడుగు అవుతుంది. భద్రతా హామీలు లేని కాల్పుల విరమణ ఉక్రెయిన్‌కు ప్రమాదకరం. మేము గత మూడు సంవత్సరాలుగా పోరాడుతున్నాము. అమెరికా మా వైపు ఉందని ఉక్రేనియన్ ప్రజలు తెలుసుకోవాలి. మాకు కావాల్సింది శాంతి. అంతులేని యుద్ధం కాదు. అందుకే భద్రతా హామీలు దీనికి కీలకమని మేము చెబుతున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇటీవల డొనాల్డ్ ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య వైట్‌హౌస్ వేదికగా జరిగిన చర్యల వాగ్వాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఖనిజాల ఒప్పందం ముందుకు సాగలేదు. జెలెన్‌స్కీపై ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్ కారణంగా మూడో ప్రపంచ యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రష్యాకు భూభాగాన్ని కోల్పోవడానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉండాలన్నారు. ఇకపై ఉక్రెయిన్‌కు సాయం చేసేది లేదని కుండబద్దలు కొట్టారు.
As a result of these days, we see clear support from Europe. Even more unity, even more willingness to cooperate.
Everyone is united on the main issue – for peace to be real, we need real security guarantees. And this is the position of all of Europe – the entire continent. The… pic.twitter.com/inGxdO8jQz— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) March 3, 2025
Comments
Please login to add a commentAdd a comment