ఢాకా: బంగ్లాదేశ్‌లో నూర్ హుస్సేన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని షేక్ హాసినా అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులు చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారినట్లు అక్కడి మీడియా పేర్కొంది. షహీద్ నూర్ హొస్సేన్ స్క్వేర్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించాలని అవామీ లీగ్ పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో పలువురు అవామీ లీగ్ మద్దతుదారులపై దాడి జరిగినట్లు వెల్లడించింది. బంగాబంధు అవెన్యూలోని షేక్ హసీనా పార్టీ కేంద్ర కార్యాలయం ముందు ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
ఇక.. మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం ఆగస్టు 5న తిరుగుబాటు ద్వారా పతనమైన అనంతరం ఇవాళ(ఆదివారం) నూర్ హుస్సేన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించాలని అవామీ లీగ్ పార్టీ మొదటిసారి నిర్ణయం తీసుకుంది. విమోచన యుద్ధం విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలను విశ్వసించే సాధారణ ప్రజలు, కార్యకర్తలను నూర్ హుస్సేన్ చత్తర్ (జీరో పాయింట్) వద్ద మార్చ్‌లో చేరాలని పార్టీ ఆహ్వానించింది. ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను తొలగించి బంగ్లాదేశ్ అవామీ లీగ్ నాయకత్వంలో ప్రజాస్వామ్య పాలనను పునఃస్థాపన చేయాలని కూడా పిలుపునిచ్చింది.
Despite suppression from 32 political groups, police, 191 platoons of BGB, the army, and espionage, the AL has marched across the zero point. These are not corrupt people; they’ve received no rewards from the AL in the past decade. Yet, today, they’re struggling for it! pic.twitter.com/Q9Q1JmY8YW
— Tasin Mahdi 🇧🇩 (@in_tasin) November 10, 2024
అయితే.. ఈ ప్రకటన వెలువడిన వెంటనే బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం నిరసన ర్యాలీకి అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న అవామీ లీగ్ ఫాసిస్ట్ పార్టీ.. ఈ ఫాసిస్ట్ పార్టీ బంగ్లాదేశ్‌లో నిరసనలు నిర్వహించేందుకు అనుమతించేది లేదని యూనస్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం అన్నారు. రాజకీయ కార్యకర్త, అవామీ లీగ్ యువజన ఫ్రంట్, జూబో లీగ్ నాయకుడు నూర్ హొస్సేన్ నవంబర్ 10, 1987న ఎర్షాద్ వ్యతిరేక ఉద్యమంలో హత్యకు గురయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment