
అజ్మీర్ దర్గాను సందర్శించిన హసీనా
భారత్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆదివారం ఆజ్మీర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాను సందర్శించారు.
అజ్మీర్: భారత్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆదివారం ఆజ్మీర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాను సందర్శించారు. ప్రార్థనలు నిర్వహించడంతో పాటు చాదర్‌ను సమర్పించారు.
హసీనాకు దర్గా నిర్వాహక కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. 15 నిమిషాల పాటు దర్గాలో ప్రార్థనలు నిర్వహించిన హసీనా గంటసేపు అక్కడే గడిపారు. అనంతరం సమీపంలోని జన్నత్ గేటు వద్ద నమాజ్ చేశారు. దర్గా నిర్వాహకులు హసీనాకు తంబర్రుఖ్(ప్రసాదం), శాలువను అందచేశారు.