న్యూఢిల్లీ: ఆందోళనల కారణంగా దేశం వీడిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్‌హసీనా ప్రస్తుతం ఢిల్లీలో సురక్షిత ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం(ఆగస్టు 5) ఢాకా నుంచి అత్యవసరంగా బయలుదేరి ఎయిర్‌ఫోర్స్ విమానంలో ఢిల్లీలో దిగిన తర్వాత ఆమెను భారత ప్రభుత్వం భారీ భద్రత నడుమ ఢిల్లీలోని ఓ ఇంటికి తరలించింది.
ఢిల్లీ నుంచి ఆమె లండన్ వెళ్లాల్సి ఉంది. అయితే ఆమెకు ఆశ్రయమివ్వడానికి బ్రిటన్ ప్రభుత్వానికి కొన్ని చిక్కులు ఉన్నట్లు తెలుస్తోంది. వీటన్నింటిని తొలగించి బ్రిటన్ వచ్చేందుకు అక్కడి ప్రభుత్వం హసీనాకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది.
యూకే సర్కారు ఒకే అన్న తర్వాత హసీనా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లండన్ బయలుదేరనున్నారు. హసీనా మంగళవారం(ఆగస్టు 6) ఢిల్లీలోని ఆమె కూతరును కలిసే అవకాశాలున్నాయి.
ఇవి కూడా చదవండి:
Bangladesh Political Crisis: సంక్షోభ బంగ్లా
Bangladesh Political Crisis: అప్రతిష్ట మూటగట్టుకున్న ఐరన్ లేడీ!
Comments
Please login to add a commentAdd a comment