asylum
-
స్పెయిన్‌కు పరారైన... వెనిజులా విపక్ష నేత
వెనిజులాలో నికొలస్ మదురో నియంత పాలనకు ముగింపు ఖాయమని ఆశించిన ఆ దేశ ప్రజలకు మరింత నిరాశ కలిగించే పరిణామమిది. అధ్యక్ష ఎన్నికల్లో విపక్షాల సంయుక్త అభ్యరి్థగా మదురోతో తలపడ్డ ఎడ్మండో గొంజాలెజ్ తాజాగా దేశం వీడి స్పెయిన్‌లో ఆశ్రయం పొందారు. జూలైలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వాస్తవ విజేత గొంజాలెజేనని విపక్షాలతోపాటు పలు విదేశీ ప్రభుత్వాలు కూడా పేర్కొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. గొంజాలెజ్‌కు ఆశ్రయం కలి్పంచేందుకు స్పెయిన్ అంగీకరించిందని వెనిజులా ఉపాధ్యక్షుడు డెల్సీ రొడ్రిగెజ్ ప్రకటించారు. దీనిపై గొంజాలెజ్ గానీ ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో గానీ స్పందించలేదు. ఎన్నికల్లో పోటీ చేయకుండా మచాడోపై మదురో ప్రభుత్వం నిషేధం ప్రకటించడంతో ఆఖరి దశలో గొంజాలెజ్ రంగంలోకి దిగడం తెలిసిందే. అయితే, వెనిజులా వీడాలన్నది గొంజాలెజ్ నిర్ణయం మాత్రమేనని, తాము పంపిన ఎయిర్‌ఫోర్స్ విమానంలో తమ దేశం చేరుకున్నారని స్పెయిన్ ప్రభుత్వం తెలిపింది. ఆయన వినతి మేరకే ఆశ్రయం కలి్పంచామని స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయెల్ అల్బారెస్ చెప్పారు. ‘వెనిజులా ప్రజల హక్కుల కాపాడటానికి కట్టుబడి ఉన్నాం. గొంజాలెజ్ వెనిజులా హీరో. ఆయన భద్రత బాధ్యతను స్పెయిన్ తీసుకుంటుంది’ అని స్పష్టం చేశారు. వెనిజులాకు రావడానికి కొద్ది రోజుల ముందే రాజధాని కారకాస్‌లోని తమ రాయబార కార్యాలయంలో గొంజాలెజ్ తలదాచుకున్నారని వెల్లడించారు. ఓటరు జాబితాను ఫోర్జరీ చేశారంటూ వచి్చన ఆరోపణలపై విచారణకు రావాలంటూ మూడు పర్యాయాలు సమన్లు పంపినా హాజరు కాలేదని దేశ అటార్నీ జనరల్ గొంజాలెజ్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో, ఆయన స్పెయిన్ రాయబార కార్యాలయంలో తలదాచుకోవాల్సి వచి్చంది. మడురో నిరంకుశ విధానాలతో ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నేతలు స్పెయిన్‌లో ఆశ్రయం పొందారు. ఈ ఏడాదిలో మొదటి ఆరు నెలల్లోనే దాదాపు 45 వేల మంది వెనిజులా నుంచి స్పెయిన్‌కు వలస వెళ్లారు. 2022 గణాంకాల ప్రకారం వెనిజులా వాసులు కనీసం 2.12 లక్షల మంది స్పెయిన్‌లో ఉంటున్నారు. – కారకాస్ -
షేక్ హసీనాకు భారత్‌లో ఆశ్రయం సబబేనా?
బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం భారత్‌తో పాటు పొరుగు దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఉన్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ ప్రధానిగా నియమితులయ్యారు.షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి, దేశం విడిచిపెట్టిన తర్వాత బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున హింస చెలరేగుతోంది. ముఖ్యంగా రాజధాని ఢాకా, చిట్టగాంగ్, కుల్నా సహా ఇతర పలు ప్రాంతాల్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. పలు హిందూ దేవాలయాలు, ఇళ్లు, వ్యాపార సంస్థలు ధ్వంసమయ్యాయి.ఈ నేపధ్యంలో ఇండియా టీవీ తన వెబ్సైట్లో ఒక పోల్ నిర్వహించింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్‌లో ఆశ్రయం ఇవ్వడం సబబేనా అని ఇండియా టీవీ ప్రజాభిప్రాయాన్ని ఒక పోల్ ద్వారా కోరింది. దీనికి వేలాది మంది స్పందించారు. 60 శాతం మంది షేక్ హసీనాకు భారత్‌లో ఆశ్రయం ఇవ్వడం తగినదేనని అన్నారు. ఆమెకు ఇక్కడ ఆశ్రయం ఇవ్వకూడదని 33 శాతం మంది తమ అభిప్రాయం వెల్లడించారు. తమ అభిప్రాయం వెల్లడించలేమని ఏడు శాతం మంది పేర్కొన్నారు. -
బ్రిటన్ గ్రీన్‌సిగ్నల్ రాగానే లండన్‌కు హసీనా
న్యూఢిల్లీ: ఆందోళనల కారణంగా దేశం వీడిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్‌హసీనా ప్రస్తుతం ఢిల్లీలో సురక్షిత ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం(ఆగస్టు 5) ఢాకా నుంచి అత్యవసరంగా బయలుదేరి ఎయిర్‌ఫోర్స్ విమానంలో ఢిల్లీలో దిగిన తర్వాత ఆమెను భారత ప్రభుత్వం భారీ భద్రత నడుమ ఢిల్లీలోని ఓ ఇంటికి తరలించింది. ఢిల్లీ నుంచి ఆమె లండన్ వెళ్లాల్సి ఉంది. అయితే ఆమెకు ఆశ్రయమివ్వడానికి బ్రిటన్ ప్రభుత్వానికి కొన్ని చిక్కులు ఉన్నట్లు తెలుస్తోంది. వీటన్నింటిని తొలగించి బ్రిటన్ వచ్చేందుకు అక్కడి ప్రభుత్వం హసీనాకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. యూకే సర్కారు ఒకే అన్న తర్వాత హసీనా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లండన్ బయలుదేరనున్నారు. హసీనా మంగళవారం(ఆగస్టు 6) ఢిల్లీలోని ఆమె కూతరును కలిసే అవకాశాలున్నాయి. ఇవి కూడా చదవండి:Bangladesh Political Crisis: సంక్షోభ బంగ్లాBangladesh Political Crisis: అప్రతిష్ట మూటగట్టుకున్న ఐరన్ లేడీ! -
రాజపక్సకు ఆశ్రయం ఇవ్వలేదు: సింగపూర్
కొలంబో: శ్రీలంకలో నిరసనకారులు ఆందోళనల నేపథ్యంలో అధ్యక్షుడు గోటబయ రాజపక్స తన భార్యతో సహా మాల్దీవులకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఐతే అక్కడ కూడా గోటబయకి ఆందోళనకారుల నిరసన సెగ వదలకపోవడంతో ఆయన సింగపూర్ పయనమయ్యారని, అక్కడి ప్రభుత్వం ఆశ్రయం ఇస్తోందంటూ పలు వార్తలు వచ్చాయి. ఈ విషయమై సింగపూర్ ప్రభుత్వం స్పందించింది. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స వ్యక్తిగత పర్యటన నిమిత్తం సింగపూర్ వచ్చారే తప్ప తాము ఆయనకు ఆశ్రయం ఇవ్వలేదని అక్కడి ప్రభుత్వ పేర్కొంది. అయినా సింగపూర్ సాధరణంగా ఆశ్రయం కోసం అభ్యర్థనలను మంజూరు చేయదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆయన ఆశ్రయం కోరలేదని కూడా పేర్కొంది. రాజపక్స గురువారం మధ్యాహ్నం సౌదీ ఎయిర్‌లైన్స్ విమానంలో సింగపూర్‌కి వచ్చినట్టు తెలిపింది. లంక అధ్యక్షుడు గోటబయ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు వెళ్లే ముందు కొంతకాలం సింగపూర్‌లో ఉంటారని లంక అధికార వర్గాలు పేర్కొన్నాయి. అదీగాక గోటబయ సింగపూర్‌కు వెళ్లేందుకు ప్రైవేట్ జెట్‌ను ఏర్పాటు చేయాలని మాల్దీవుల ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు కూడా అధికారిక వర్గాలు తెలిపాయి. ఐతే ఆయన కొలంబో బయలుదేరే ముందే రాజీనామ పంపుతానని కూడా లంక నాయకులు హామీ ఇచ్చాడు కూడా. ఈ మేరకు గోటబయ సింగపూర్ చేరిన వెంటనే స్పీకర్‌కి రాజీనామ పంపినట్లు శ్రీలంక పేర్కోంది. (చదవండి: గొటబయ గో! అంటే ముల్లేమూటా సర్దాల్సిందే.. మరోదేశం పోవాల్సిందే!) -
టోర్నీ ముగిసినా స్వదేశానికి రాలేదు.. ఆరా తీస్తే
అండర్-19 ప్రపంచకప్ టోర్నీ ముగిసిన తర్వాత అఫ్గనిస్తాన్ జట్టులోని నలుగురు స్వదేశానికి వెళ్లడానికి నిరాకరించారు. ఆ దేశంలో నెలకొన్న అనిశ్చితి కారణంగానే ఆ నలుగురు లండన్‌లోనే ఆశ్రయం పొందుతున్నారని తెలిసింది. అందులో ఒకరు క్రికెటర్ కాగా.. మిగతా ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ఈ విషయాన్ని అఫ్గన్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించినట్లు సమాచారం. అండర్-19 ప్రపంచకప్ ఆడడానికి వెళ్లిన మా జట్టులో ఒక ఆటగాడు సహా ముగ్గురు సిబ్బంది స్వదేశానికి తిరిగిరాలేదు. వెస్టిండీస్ నుంచి నేరుగా బ్రిటన్ వెళ్లిన ఆ నలుగురు అక్కడే ఆశ్రయం పొందుతున్నారని తెలిసింది. చదవండి: కోహ్లి ఆ తప్పు చేసి ఉండకూడదు.. ఇకనైనా జాగ్రత్తగా ఉండాలి టోర్నీ ముగిసిన తర్వాత అఫ్గన్ క్రికెటర్లు అంటిగ్వా నుంచి కాబుల్ వయా యూఏఈ నుంచి స్వదేశానికి చేరుకున్నారు. అయితే ఆ నలుగురు మాత్రం ఆస్ట్రేలియాతో ప్లేఆఫ్స్ ముగిశాక యూఏఈ వరకు కలిసి ప్రయాణించినప్పటికి.. అక్కడి నుంచి లండన్ ఫ్లైట్ ఎక్కినట్లు తెలుస్తోంది. అయితే ఇలా జరగడం ఇది తొలిసారి మాత్రం కాదు. గతంలోనూ 2009 అండర్ -19 ప్రపంచకప్‌లో క్వాలిఫయర్స్ ముగిసిన తర్వాత టొరంటో, కెనడాకు చెందిన క్రికెటర్లు తమ దేశంలో భద్రతా పరమైన సమస్యలు ఉన్నాయని వేరే దేశంలో తలదాచుకున్నారు. కాగా ఈ విషయంపై అఫ్గనిస్తాన్ అండర్-19 హెడ్‌కోచ్ రయీస్ అహ్మద్‌జై స్పందించాడు. ఈ ఆరోపణలను కొట్టివేస్తూ.. విషయం తెలియగానే ఆ నలుగురికి..'' మీ అవసరం అఫ్గనిస్తాన్ క్రికెట్‌కు ఉంది అని'' మెసేజ్ పెట్టాను. మెసేజ్ చూసినప్పటికి వారి వద్ద నుంచి ఎలాంటి సమాధానం రాలేదని పేర్కొన్నాడు. కాగా అఫ్గనిస్తాన్ జట్టు అండర్-19 ప్రపంచకప్‌లో మంచి ప్రదర్శన కనబరిచింది. సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైనప్పటికి అఫ్గనిస్తాన్ ఆకట్టుకుంది. ఇక మూడో స్థానం కోసం ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో ఆఖరి వరకు పోరాడినప్పటికి ఓటమి పాలైన అఫ్గన్ టోర్నీని నాలుగో స్థానంతో ముగించింది. చదవండి: IPL 2022 Auction:షేక్ రషీద్ సహా ఏడుగురు అండర్-19 ఆటగాళ్లకు బిగ్‌షాక్! -
మాల్యా ‘శరణార్థి’ అభ్యర్థనను మన్నించొద్దు
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకులను వేల కోట్ల రూపాయల్లో ముంచి, ప్రస్తుతం బ్రిటన్‌లో తలదాచుకుంటున్న లిక్కర్ వ్యాపారస్తుడు విజయ్ మాల్యాను దేశానికి రప్పించే దిశలో కేంద్రం కీలక చర్య తీసుకుంది. ‘శరణార్థి’ హోదాలో దేశంలో ఉంటానని మాల్యా అభ్యర్థిస్తే, దానికి ఆమోదముద్ర వేయవద్దని బ్రిటన్‌కు విజ్ఞప్తి చేసింది. నిజానికి తనను భారత్‌కు అప్పగించడం తగదని మాల్యా బ్రిటన్ అత్యున్నత న్యాయస్థానాల్లో చేసిన వాదనలు ఇటీవలే వీగిపోయాయి. అయితే ఆయనను తక్షణం భారత్‌కు పంపడం జరిగే పనికాదనీ, ఇందుకు కొన్ని న్యాయపరమైన చిక్కులు వీడాల్సి ఉందని బ్రిటన్ ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌కు తాజా విజ్ఞప్తి చేసినట్లు గురువారంనాటి ఆన్లైన్ మీడియా బ్రీఫింగ్లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. -
మాల్యా అప్పగింత : మరో ఎత్తుగడ
సాక్షి, న్యూఢిల్లీ: మనీలాండరింగ్ ఆరోపణలతో విచారణను ఎదుర్కొంటున్న ఉద్దేశపూరక ఎగవేతదారుడు విజయ్ మాల్యాను భారతదేశానికి రప్పించే ప్రయత్నాలు ఇప్పట్లో ఫలించే అవకాశాలు కనిపించడం లేదు. మాల్యా అప్పగింతకు ముందు చట్టపరమైన సమస్య పరిష్కరించాల్సి ఉందంటూ బ్రిటీష్ హైకమిషన్ ఇప్పటికే తేల్చి చెప్పింది. తాజాగా మరో న్యాయపరమైన చిక్కు వచ్చినట్టు సమాచారం. ఇది పరిష్కారం అయ్యేంత వరకు మాల్యాను స్వదేశానికి రప్పించే ప్రక్రియలో మరికొంత జాప్యం తప్పదు. మానవతా దృక్పథం ప్రాతిపదికన తనకు లండన్ లో ఆశ్రయం కల్పించాల్సిందిగా మాల్యా కోరినట్టు తెలుస్తోంది. యూరోపియన్ కన్వెన్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (ఈసీహెచ్ఆర్) ఆర్టికల్ 3 ప్రకారం తాజా పిటిషన్ దాఖలు చేశారు. మాల్యాకు యూకే ఆశ్రయం ఇస్తుందా లేదా అనేది చూడాలి. అయితే ఇలాటి దరఖాస్తులు ప్రాసెస్ కు కనీసం ఆరు నెలలు పడుతుందనీ, ఒకవేళ మాల్యా అభ్యర్ధనను తిరస్కరించి నప్పటికీ, దీనిపై మళ్లీ రివ్యూ కోరుకునే అవకాశం కూడా వుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాల్యాకు కొంత సమయం కచ్చితంగా లభిస్తుందని చెబుతున్నారు. -
విజయ్ మాల్యా చివరి అస్త్రం ఇదే..
లండన్: బ్యాంకులకు కోట్లాది రూపాయల రుణాల ఎగవేత కేసులో లీగల్‌గా అన్ని దారులు మూసుకుపోవడంతో లిక్కర్ దిగ్గజం విజయ్ మాల్యా చివరిసారిగా బ్రహ్మాస్త్రం వాడనున్నారు. భారత్‌లో 9వేల కోట్ల ఫ్రాడ్, మానీ లాండరింగ్‌కు పాల్పడి విదేశాలకు మాల్యా పారిపోయిన విషయం తెలిసిందే. తనను భారత్‌కు అప్పగించవద్దంటూ మాల్యా దాఖలు చేసిన అప్పీల్‌ను ఇటీవలే యూకే హై కోర్టు వేసింది. న్యాయపరంగా అన్ని లోసుగులను వాడుకోవడంతో మాల్యా సరికొత్త అస్త్రాన్ని వాడనున్నారని యూకే న్యాయ వర్గాలు తెలిపాయి. తాజాగా మాల్యా పొలిటికల్ అసిలమ్(నిర్వాసితులు) అనే అస్త్రాన్ని వాడనున్నారు. ఏదయినా వ్యక్తి యూకేలో నిర్వాసితులుగా అర్హత పొందాలంటే వ్యక్తి సొంత దేశంలో కేసులతో గానీ, రాజకీయంగా, సామాజికంగా వేధించే అవకాశాల ఉన్న స్థితిలో నిర్వాసితులుగా తమ దేశంలో భద్రత కల్పిస్తారు. అయితే, వ్య్తక్తులు నిర్వాసితులుగా అర్హత పొందడానికి కోర్టు సుదీర్ఘంగా విచారిస్తుందని.. దాదాపు రెండు సంవత్సరాలు సమయం పట్టవచ్చని యూకేకు చెందిన సీనియర్ న్యాయవాది అభిప్రాయపడ్డారు. ఒకవేళ నిర్వాసితునిగా కూడా అర్హత సాధించకుంటే ట్రిబ్యూనల్‌లో కూడా అప్పీలు చేసుకోవచ్చని నిపుణులు తెలిపారు. భారత్‌లో విచారణను తప్పించుకోవడానికి మాల్యా సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్లు న్యాయ నిపుణలు విశ్లేషిస్తున్నారు. చదవండి: భారత్‌కు మాల్యా.. 28 రోజుల్లో -
భారత్ ఆశ్రయం కోరుతున్న పాక్ మాజీ ఎమ్మెల్యే
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు భారత్‌లో రాజకీయ ఆశ్రయం కల్పించాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. పీటీఐ తరఫున ఖైబర్ పఖ్తున్వా ప్రావిన్స్‌లోని బారికోట్ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బల్దేవ్ కుమార్ పాక్‌లో మైనారిటీలకు రక్షణ లేదని ఆరోపించాడు. ఈ క్రమంలో భారత్‌లో తనకు ఆశ్రయం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాడు. ప్రస్తుతం బల్దేవ్ మూడు నెలల వీసాపై భారతదేశంలో ఉన్నాడు. ఆగస్టు 12న ఆయన భారతదేశానికి వచ్చాడు. బల్దేవ్ ఇండియా రావడానికి ముందే తన భార్య, పిల్లలను లూధియానా ఖన్నాలోని వారి బంధువుల వద్దకు పంపాడు. ప్రస్తుతం పాక్‌లో మతపరమైన మైనారిటీలపై హింస పెరిగిపోయిందని.. అందువల్లే తన కుటుంబాన్ని పాక్ నుంచి ఇండియాకు పంపిచాల్సి వచ్చిందని తెలిపాడు. అంతేకాక తాను తిరిగి పాక్ వెళ్లాలని కోరుకోవడం లేదన్నాడు బల్దేవ్. తన కుటుంబ భద్రత గురించి తాను భయపడతున్నానని.. అందుకే భారతదేశంలో రాజకీయ ఆశ్రయం కోరుతున్నానని బల్దేవ్ తెలిపాడు. ఈ క్రమంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ మీద విమర్శల వర్షం కురిపించాడు బల్దేవ్. నూతన పాకిస్తాన్‌ను నిర్మిస్తానని ప్రమాణం చేసిన ఇమ్రాన్ ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేదని ఆరోపించాడు. పాక్‌లో హిందువులు, సిక్కులపై దారుణాలు జరుగుతున్నాయని వాటిని అడ్డుకోవాలని కోరాడు. అంతేకాక భారత్ ప్రధాని నరేంద్ర మోదీ తన విన్నపాన్ని మన్నించి భారత్‌లో ఆశ్రయం కల్పిస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశాడు. బల్దేవ్ కుమార్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి లూధియానా ఖన్నాలోని సమ్రాలా మార్గ్ ప్రాంతంలో రెండు గదుల ఇంట్లో అద్దెకుంటున్నాడు. బల్దేవ్ కుమార్ 2007లో పంబాజ్ ఖన్నా ప్రాంతానికి చెందిన భావనను వివాహం చేసుకున్నాడు. ఆమెకు భారతీయ పౌరసత్వం ఉంది. కాగా బల్దేవ్ ఇద్దరి పిల్లలు పాక్ పౌరసత్వం పొందారు. 2016 ఖైబర్ పఖ్తున్వా ప్రావిన్స్ ఎమ్మెల్యే సోరన్ సింగ్ హత్య కేసులో బల్దేవ్పై ఆరోపణలు ఉన్నాయి. -
నీరవ్ మోదీ మరో స్కెచ్..
లండన్ : పీఎన్బీ స్కామ్‌లో రూ వేల కోట్లు నిండా ముంచిన డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ బ్రిటన్‌లో రాజకీయ ఆశ్రయం కోసం పాకులాడుతున్నట్టు తెలిసింది. కుంభకోణం వెలుగుచూడక ముందే లండన్‌లో తలదాచుకున్న నీరవ్ మోదీ, ఆయన బంధువు గీతాంజలి జెమ్స్ అధినేత మెహుల్ చోక్సీలు ఈ మేరకు లాబీయింగ్ చేస్తున్నట్టు ఓ కథనం వెల్లడైంది. పీఎన్బీని మోసం చేసిన కేసులో నీరవ్ మోదీ, చోక్సీల వ్యవహారంపై దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. రూ 13,000 కోట్లకు పైగా అక్రమంగా రుణాలు పొందిన నీరవ్ మోదీ ఇతరులపై పీఎన్బీ ఫిర్యాదు నేపథ్యంలో మోదీ, చోక్సీలతో పాటు వారికి సహకరించిన బ్యాంకు అధికారులు, ఇతరులపై ఈడీ సహా పలు దర్యాప్తు సంస్థలు విచారణను వేగవంతం చేశాయి. నీరవ్ కంపెనీ ఒక స్టోర్‌ను కలిగిఉన్న లండన్‌లోనే నీరవ్ మకాం వేశారని రాజకీయ ఆశ్రయం పొందేందుకు అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు అధికారులు చెబుతున్నారని ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. భారత్‌తో తమ సంబంధాలను ఈ తరహా సున్నితమైన కేసులు కొంత అలజడి రేపుతాయని, ఏమైనా ఇరు దేశాలు న్యాయప్రక్రియకు అనుగుణంగా వీటిని ఎదుర్కొంటాయని, అయితే ఈ క్రమంలో తాము మానవ హక్కుల పరిరక్షణ చట్టానికి అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుందని బ్రిటన్ విదేశాంగ శాఖ కార్యాలయ అధికారి తెలిపినట్టు ఈ కథనం వెల్లడించింది. కాగా ఈ కేసులో సీబీఐ ఈ ఏడాది మేలో ముంబయి కోర్టు ఎదుట రెండు చార్జిషీట్లను నమోదు చేసింది. ఇక నీరవ్ మోదీ ఆయన అనుచరులపై ఈడీ మరో చార్జిషీట్‌ను న్యూఢిల్లీలో ప్రత్యేక కోర్టులో నమోదు చేసింది. -
పాక్ కు మంటపుట్టించేలా..!
జమ్ముకశ్మీర్ విషయంలో నానా రాద్ధాంతం చేస్తూ భారత్ ను చీకాకు పరుస్తున్న పాకిస్థాన్ కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం తన వ్యూహాన్ని మార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పాక్ లోని కల్లోలిత ప్రాంతాలైన బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) అంశాలను తొలిసారి ప్రస్తావించారు. బలూచిలో, పీవోకేలో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనపై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఈ అంశానికి అంతర్జాతీయంగా ప్రాధాన్యం నెలకొంది. సహజంగానే పాకిస్తాన్ ఆర్మీ సాగిస్తున్న అరాచకాలపై ఎలుగెత్తి నినదిస్తున్న బలూచి కార్యకర్తలకు ప్రధాని మోదీ ప్రకటన వెయ్యి ఎనుగుల బలం ఇచ్చినట్టు అయింది. ఈ నేపథ్యంలో దాయాదికి మంట పుట్టించేలా భారత్ మరో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రవాసంలో ఉన్న బలూచిస్తాన్ రిపబ్లికన్ పార్టీ (బీఆర్పీ) అగ్ర నాయకుడు బ్రాహుందాఘ్ బుగ్తీకి దేశంలో రాజకీయ ఆశ్రయం ఇచ్చే దిశగా భారత్ కదులుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జెనీవాలో ఉంటున్న బుగ్తీ త్వరలోనే భారత్ లో రాజకీయ ఆశ్రయం కోసం దరఖాస్తు చేస్తానని ప్రకటించారు. పాకిస్థాన్ కు వ్యతిరేకంగా బలూచిస్థాన్ విముక్తి ఉద్యమాన్ని నడిపిన నాయకుడు నవాబ్ అక్బర్ ఖాన్ బుగ్తీ మనవడు బ్రాహుందాఘ్ బుగ్తీ. పదేళ్ల కిందట క్వెట్టాలోని ఓ రహస్య స్థావరంపై పాక్ ఆర్మీ జరిపిన దాడిలో నవాబ్ అక్బర్ ఖాన్ బుగ్తీ చనిపోగా.. ఆయన మానవడు ప్రాణాలతో బయటపడి.. విదేశాలకు ప్రవాసం వెళ్లిపోయారు. ఆదివారం జెనీవాలో జరిగిన బీఆర్పీ సమావేశంలో బుగ్తీకి భారత్ లో రాజకీయ ఆశ్రయంపై నిర్ణయం తీసుకున్నారు. బుగ్తీకి రాజకీయ ఆశ్రయం ఇచ్చేందుకు భారత్ అంగీకరించే అవకాశముంది. -
అనాథ వృద్ధాశ్రమం తొలగింపు
ముకుందాపురం(మునగాల): మండలంలోని ముకుందాపురం గ్రామపంచాయతీ శివారులో జాతీయ రహాదారి పక్కన గత కొంతకాలంగా ఉన్న అనాథ వృద్ధాశ్రమాన్ని శనివారం రాత్రి మండల తహసీల్దార్ ఆదేశాల మేరకు మునగాల పోలీసులు బలవంతంగా తొలగించారు. తహసీల్దార్ భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం... జాతీయ రహాదారి విస్తరణలో భాగంగా మూడేళ్ల క్రితం ముకుందాపురం శివారులో కొంతభూమిని ప్రభుత్వం సేకరించి సదరు రైతుకు నష్టపరిహారం అందించింది. కాగ ఈ ప్రాంతంలో రెండేళ్లుగా ఓ మహిళ అనాథ వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తోంది. ఇదిలా ఉండగా ఈ ప్రాంతంలో జాతీయ రహాదారి విస్తరణలో భాగంగా క్యాంటిన్ ఏర్పాటు చేయాలని జీఎమ్మార్ సంస్థ నిర్ణయించింది. ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న వృద్ధాశ్రమాన్ని తొలగించాలని నిర్వాహాకులకు తెలిపినప్పటీకీ తొలగించకపోవడంతో జిల్లా కలెక్టర్ దృష్టికి జీఎమ్మార్ సంస్థ తీసుకువెళ్లింది. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తొలగించాల్సి వచ్చిందని ఆయన‡ తెలిపారు. ఈ మేరకు శనివారం రాత్రి మునగాల ఎస్ఐ గడ్డం నగేష్ ఆధ్వర్యంలో సిబ్బంది వృద్ధాశ్రమాన్ని బలవంతంగా తొలగించారు. -
మంచిపనికి రిటైర్మెంట్ ఉండదు
మనిషికి వ్యాపకం అవసరం. ఫ్రీ టైమ్ ఉంటే ఇంకా ఎక్కువ అవసరం. తోటపని చేస్కోవచ్చు... పూలతో మాట్లాడుకోవచ్చు... పుస్తకాల కాగితాలపై విహరించవచ్చు... లేదా మనంత అదృష్టం లేని వాళ్లను ఆదుకోవచ్చు. పిల్లలు సెటిలై బాధ్యతలు తీరాక జీవితాన్ని ఒక్కసారిగా శూన్యం ఆవరిస్తుంది. ఆ శూన్యంలో బతికే బదులు ‘కొత్త పిల్లల్ని’ వెతుక్కుంటే ఎలా ఉంటుంది? శారదమ్మ అదే చేసింది. వయసుమళ్లిన వాళ్లని చిన్న పిల్లల్లా చూసుకుంటోంది. నుదుటన అర్థరూపాయకాసంత బొట్టుతో చూడగానే ఆప్యాయంగా పలకరించే శారదమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. చేస్తున్న పని చిన్నదే అయినా సమాజంలో తనకంటూ ఓ ముద్ర వేసుకుంటున్నారీవిడ. వేకువజామునే లేచి, చేతిలో కర్ర పట్టుకొని, నిదానంగా ఆశ్రమంలోని ఒక్కొక్కరి బాగోగులను పలకరిస్తూ దైనందిన జీవనాన్ని మొదలుపెడతారు శారదమ్మ. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో పదకొండేళ్ల క్రితం శారదమ్మ ఏర్పాటుచేసిన ఆ ఆశ్రమం పాతికమంది వృద్ధ మహిళలకు, బాలికలకు నీడనిస్తోంది. ప్రతిఫలాపేక్ష లేకుండా శేషజీవితాన్ని పరులకోసం ఉపయోగపడేలా మలుచుకోవాలన్న శారదమ్మ... వయసుపై బడిన వారికి ఓ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వివరాలు ఆమె మాటల్లో... అమ్మను చూసుకుంటున్నా.... ‘‘చిన్నపుడే అమ్మను కోల్పోయి బంధువుల వద్ద పెరిగాను. తోబుట్టువులు లేరు. అయినవారు లేకుండా పరాయివారి మీద ఆధారపడే బతుకు ఎంత కష్టమైనదో ఆ బాధ నాకు తెలుసు. నా భర్త రాజన్న జిల్లా జడ్జిగా పనిచేసి విశ్రాంత జీవనం గడుపుతున్నారు. పిల్లలిద్దరు వారి వారి జీవితాల్లో స్థిరపడ్డారు. మిగిలిన ఈ జీవితంలో ఇంకా చేయాల్సింది ఏముంది? అని ఆలోచించాను. నలుగురికి ఉపయోపడి పనిచేస్తే అంతే చాలు కదా అనుకునేదాన్ని. కానీ, ఆ పని ఏంటో, ఎలా మొదలుపెట్టాలో తెలిసేది కాదు. ఎవరూ లేని అనాథల పరిస్థితి ఏంటి అని ఓ రోజు ఆలోచన వచ్చింది. నా చిన్ననాటి పరిస్థితులు గుర్తుకువచ్చి కళ్లలో నీళ్లు ఉబికాయి. అయినవారికి దూరమై ముదిమి వయసులో కష్టాలు పడుతున్నవారికి సేవ చేస్తే, మా అమ్మకు చేసినట్టే కదా అనిపించింది. ఇదే విషయం మా వారికి చెప్పినప్పుడు చాలా సంతోషించారు. ఇద్దరు అబ్బాయిలు, ఒకమ్మాయి. వాళ్లు వారి జీవితంలో స్థిరపడ్డారు. పిల్లలూ నా ఆలోచన సరైనదన్నారు. తమ వంతూ సాయం చేస్తామన్నారు. ఆ విధంగా పదకొండేళ్ల క్రితం వృద్ధాశ్రమాన్ని స్థాపించాను. ఆ తర్వాత ఎవరూ లేని ఓ బాలిక మా నీడన చేరింది. అప్పటి నుంచి బాలికలకు కూడా ఆశ్రమంలో చోటు ఇవ్వాలని ఇంకాస్త మెరుగుపరిచాను. శివారులో... ఆశ్రమం స్థాపించాలంటే అందుకు పెద్ద స్థలం, ఇళ్లు కావాలి. కామారెడ్డి పట్టణ శివారులోని సామాజిక వేత్త, విశ్రాంత ఉప విద్యాధికారి భద్రయ్యను నేనూ, మా వారు సంప్రదించాం. ఆయన పెద్ద మనసుతో ఆశ్రమ నిర్వహణ కోసం తన పొలం వద్ద ఇంటిని నిర్మించారు. ఆ ఇంటిని ఎలాంటి అద్దె లేకుండా ఇచ్చారు. మంచి పని చేయాలని మనం ఓ అడుగు వేస్తే, మరో పది అడుగులైనా మనతో పాటు కలుస్తాయని పెద్దలు చెప్పిన మాటలు ఆ క్షణాన నాకు అక్షరాల నిజం అనిపించాయి. ముందుగా పాతికమంది ఆశ్రమంలో ఉండడానికి అవసరమైన మంచాలు, దుప్పట్లు, భోజనసామగ్రి... మొదలైన ఏర్పాట్లన్నీ చేశాను. ఇద్దరితో మొదలై పాతికమందికి, అక్కణ్ణుంచి ఈ పదేళ్లలో వంద మంది దాకా ఇక్కడ ఆశ్రయం పొందారు. వయసు పైబడిన వారు అనారోగ్యంతో మంచాన పడుతుంటారు. వారికి ఈ చేతులతో సేవలు చేస్తుంటాను. ఆఖరి క్షణంలో వారికి చేసే సేవ మా అమ్మకే అనిపిస్తుంటుంది. వారు మరణించాక కామారెడ్డి శివారులోనే అంత్యక్రియలు నిర్వహిస్తుంటాను. ఆరోగ్యం సహకరించడం లేదు... పిల్లలున్నా చూసుకునేవారు లేక రోడ్డున పడ్డ మస్తానమ్మ, ఎవరూ లేక అనాథగా మిగిలిన రాణెమ్మ.. ఇలా బంధాలు వదిలేస్తే వచ్చి చేరిన పాతికమంది ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. అందరమూ ఒకేసారి కూర్చొని, కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చే స్తాం. ఉదయం కాఫీ, టీ ల దగ్గర నుంచి రాత్రి భోజనాల వరకు సమాజంలో జరిగే మంచి చెడులు మా మధ్య దొర్లుతుంటాయి. నాకు కాళ్ల నొప్పులు. అందుకే చేతికర్రలేకుండా సరిగా నడవలేకపోతున్నాను. నాతో పాటు ఇంకొందరు ముసలివాళ్లకూ నడవడం చేతకాదు. కళ్లు కనిపించనివారూ ఉన్నారు. రకరకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారూ ఉన్నారు. కొందరు దాతలు, స్వచ్చంద సంస్థల సహకారంతో వారికి వైద్య సేవలు అందిస్తుంటాను. దాతల సహకారంతో... కొంతమంది దాతలు వచ్చి వృద్ధులకు అవసరమైన బట్టలు, దుప్పట్లు, పాత్రలు ఇచ్చి వెళ్తుంటారు. మరికొందరు ఉప్పు, పప్పు, బియ్యం, ఇతర వంటసామాగ్రి పట్టుకొస్తారు. ఇటీవలి కాలంలో కొందరు తమ పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకలప్పుడు ఏదో ఒక సాయం అందిస్తున్నారు. అలాగే తల్లిదండ్రులు చనిపోయిన వారు వారి స్మారకార్థం సేవా కార్యక్రమాలు చేపట్టి అవి వృద్ధులకు అందేలా చూస్తున్నారు. నా భర్త పెన్షన్ డబ్బులతో కొంత, నా పిల్లలు అందించే ప్రోత్సాహంతో మరికొంత, చుట్టూ ఉండే వారి సహృదయంతో ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నాను. ప్రభుత్వం నుంచి నేటికీ ఎలాంటి సాయం అందుకోలేదు. ‘నలుగురికి ఈ సాయం చేస్తున్నాను మీరు దయతలచండి’ అని ఎన్నడూ ఎవరికీ చెప్పుకున్నదీ లేదు. నలుగురికి తలా ఓ పిడికెడు మెతుకులు పెట్టి, ఇంత నీడ కల్పించే భాగ్యం ఆ దేవుడు బతికినన్నాళ్లూ నాకు ఇలా కల్పిస్తే అంతే చాలు అని రోజూ దండం పెట్టుకుంటాను.’’ - వేణుగోపాల్‌చారి, సాక్షి, కామారెడ్డి, నిజామాబాద్ కన్నీళ్లను తుడవడం కనీస ధర్మం నెల్లూరు జిల్లా మాగుంట లేఅవుట్ వాస్తవ్యులైన తుమ్మల కృష్ణారెడ్డి ఉన్నంతలో నలుగురికి సాయం చేయాలనే నిబద్ధత కలిగిన వ్యక్తి. చేసిన సాయం సరిపోదు అనుకుంటే ఇతర దాతలనుంచి విరాళాలు సేకరించి అవసరంలో ఉన్నవారికి అందించడం ఆయన లక్ష్యం. హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో కృష్ణారెడ్డి చేస్తున్న సేవలు ఈ ప్రాంతంలో ప్రతిఒక్కరికీ సుపరిచితమే. 76 ఏళ్ల వయసులో ఇతరులకు సేవ చేయడానికి నిత్యం యువకుడిలా పరుగులు తీస్తున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే... తోడుగా హెల్పింగ్ హ్యాండ్... ‘‘ఓ ప్రైవేట్ కంపెనీలో పి.ఆర్గా పనిచేసి రిటైరయ్యాను. నాలో ఈ సేవాబీజం వేసింది నా భార్య సుదర్శనమ్మ వృత్తిరీత్యా టీచర్. ఆమె నిరుపేద విద్యార్థ్ధుల సాధకబాధకాలను తెలుసుకుంటూ వారికి తగిన సాయం అందించేది. ఆరేళ్ల క్రితం తనే ఈ ‘హెల్పింగ్ హ్యాండ్స్’ సంస్థను స్థాపించింది. రెండేళ్లక్రితం ఆవిడ చనిపోయింది. ముగ్గురు బిడ్డలు స్థిరపడ్డారు. మిగిలిన ఈ జీవితం నలుగురికి ఉపయోగపడితే చాలు అనుకున్నాను. అర్హులైన వారికి ఎలా చేయూతనివ్వాలి అని ఆలోచనల్లో పడ్డ నాకు మీడియా ఒక దారి చూపింది. పత్రికల్లో, టీవీల్లో సాయం కోసం అర్థించేవారు, అభాగ్యులు.. వారి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి చేతనైనంతవరకు ఆదుకోవడం మొదలుపెట్టాను. పెన్షన్ల పంపిణీ... మొదట్లో గవర్నమెంట్ నుంచి వృద్ధులకు, వికలాంగులకు రూ.200 పెన్షన్ మాత్రమే వచ్చేది. మరో మూడు వందల రూపాయలు కలిపి ప్రతినెలా 120 మందికి ఇస్తూ వచ్చాను. ఇప్పుడు కారాగారాల్లో ఉంటున్న ఖైదీల కుటుంబాలకు నెలకు రూ.500 చొప్పున ఆర్ధిక సాయం అందిస్తున్నాం. వార్తా కథనాలకు స్పందిస్తూ... వార్తాపత్రికలు, టీవీల్లో వచ్చే అభాగ్యుల కథనాలకు చూసినప్పుడు వారికి ఎంతో కొంత సాయం అందించేవరకు మనసు కుదుట పడదు. సాక్షి టీవీలో బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు రూ.6 లక్షలు అవసరమని ఓ కథనం ప్రసారమైంది. నా వంతుగా పాతికవేలు అందజేశాను. కానీ, అవి ఏ మూలకు అనిపించింది. దాతలను సంప్రదించి, మరింత మొత్తాన్ని ఆ బాలికకు అందజేశాను. ఇటీవల సాక్షి దినపత్రిక ఫ్యామిలీపేజీలో అనంతపురానికి చెందిన వికలాంగులపై ప్రచురించిన ‘ప్రేమపాఠం’పై స్పందించి, వారి వివరాలను నెల్లూరు నుంచే కనుక్కున్నాను. నా సొంతంగానే కాకుండా దాతల నుంచి సేకరించి పాతికవేల రూపాయలు పంపించాను. మా దగ్గర మునిసిపల్ స్కూల్ ఉంది. ఓ కార్యక్రమానికి హాజరైనప్పుడు అక్కడి విద్యార్థులు చెప్పులు లేకుండా ఎర్రటి ఎండలో నిల్చోడం చూసి చలించిపోయాను. అమెరికాలో ఉన్న నా చిన్నకూతురు సహకారంతో లక్షా పదివేల రూపాయలతో విద్యార్థులందరకీ షూస్ అందచేసాను. సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఇటీవల ఇండియన్ థియోలాజికల్ మినిస్ట్రీస్ -హైదరాబాద్ నాకు గౌరవ డాక్టరేట్‌ను అందజేసింది. కుల, మత, ప్రాంతీయ, వర్గాలకు అతీతంగా కన్నీళ్ళను తుడిచే చేతులుగా నిలవాలన్నదే మా ‘హెల్పింగ్ హ్యాండ్స్’ ఆశయం. నిరుపేదలకు, అవసరం ఉన్నవారికి సాయం చేయడంలో ఉన్న ఆనందం ఇన్నేళ్లలో నాకెన్నడూ కలగలేదు. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసేందుకు స్పందించే హృదయం, వారి కన్నీళ్లను తుడిచే హస్తాలు అలసిపోవు. తుది శ్వాసవరకు నలుగురి జీవితాలకు చేయూతనిచ్చే ఈ సేవను వదులుకోను.’’ - గంటా థామస్ మౌంట్‌బాటన్, సాక్షి, ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా -
అమ్మ ఒడికి
అక్కున చేర్చుకున్న అమ్మఒడి ఆశ్రమం చేయూతనిచ్చిన సబ్ కలెక్టర్ మదనపల్లెరూరల్ : అమ్మకు ఆపన్నహస్తం అందిం ది. తాము ఆశ్రమం కల్పిస్తామని చిత్తూరుకు చెందిన అమ్మ ఒడి సంస్థ ముందుకొచ్చింది. మదనపల్లె సబ్‌కలెక్టర్ డాక్టర్ ఏ.మల్లికార్జున సహకారం అందించారు. ‘అమ్మ అనాథయ్యింది’అనే శీర్షికన శుక్రవారం ‘సాక్షి’ దినపత్రిలో ప్రచురితమైన సంగతి పాఠకులకు విదితమే. దీనిపై చిత్తూరుకు చెందిన అమ్మ ఒడి సంస్థ నిర్వాహకులు నలగాంపల్లె చెరకూరి పద్మనాభనాయుడు, కార్యదర్శి చంద్రశేఖర్, వార్డెన్లు శ్రీమతి, అముజ, ఉచిత అంబులెన్స్ సేవలందించే డ్రైవర్ రమేష్‌లు మదనపల్లె ప్రభుత్వాస్పత్రి క్రానిక్‌వార్డులో ఉన్న లక్ష్మీదేవమ్మకు వద్దకు చేరుకున్నారు. సబ్‌కలెక్టర్ మల్లికార్జున ,ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆంజనేయులు, నర్సింగ్ సిబ్బంది సహకారంతో ఆమెను అంబులెన్స్‌లో అమ్మ ఒడి ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్ మాట్లాడుతూ అవసాన దశలో ఉన్న తల్లిదండ్రులను బిడ్డలు వీధులు పాలు చేస్తే క్రిమినల్ కేసులతో పాటు రూ.10వేలు వసూలు చేసి వారి పోషణకు నెలనెలా చెల్లించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.