పాక్ కు మంటపుట్టించేలా..! | Exiled Baloch activist Brahumdagh Bugti to apply for Indian citizenship | Sakshi
Sakshi News home page

పాక్ కు మంటపుట్టించేలా..!

Published Mon, Sep 19 2016 6:33 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM

పాక్ కు మంటపుట్టించేలా..!

పాక్ కు మంటపుట్టించేలా..!

జమ్ముకశ్మీర్ విషయంలో నానా రాద్ధాంతం చేస్తూ భారత్ ను  చీకాకు పరుస్తున్న పాకిస్థాన్ కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం తన వ్యూహాన్ని మార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పాక్ లోని కల్లోలిత ప్రాంతాలైన బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) అంశాలను తొలిసారి ప్రస్తావించారు. బలూచిలో, పీవోకేలో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనపై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఈ అంశానికి అంతర్జాతీయంగా ప్రాధాన్యం నెలకొంది.

సహజంగానే పాకిస్తాన్ ఆర్మీ సాగిస్తున్న అరాచకాలపై ఎలుగెత్తి నినదిస్తున్న బలూచి కార్యకర్తలకు ప్రధాని మోదీ ప్రకటన వెయ్యి ఎనుగుల బలం ఇచ్చినట్టు అయింది. ఈ నేపథ్యంలో దాయాదికి మంట పుట్టించేలా భారత్ మరో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రవాసంలో ఉన్న బలూచిస్తాన్ రిపబ్లికన్ పార్టీ (బీఆర్పీ) అగ్ర నాయకుడు బ్రాహుందాఘ్ బుగ్తీకి దేశంలో రాజకీయ ఆశ్రయం ఇచ్చే దిశగా భారత్ కదులుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జెనీవాలో ఉంటున్న బుగ్తీ త్వరలోనే భారత్ లో రాజకీయ ఆశ్రయం కోసం దరఖాస్తు చేస్తానని ప్రకటించారు.

పాకిస్థాన్ కు వ్యతిరేకంగా బలూచిస్థాన్ విముక్తి ఉద్యమాన్ని నడిపిన నాయకుడు నవాబ్ అక్బర్ ఖాన్ బుగ్తీ మనవడు బ్రాహుందాఘ్ బుగ్తీ. పదేళ్ల కిందట క్వెట్టాలోని ఓ రహస్య స్థావరంపై పాక్ ఆర్మీ జరిపిన దాడిలో నవాబ్ అక్బర్ ఖాన్ బుగ్తీ చనిపోగా.. ఆయన మానవడు ప్రాణాలతో బయటపడి.. విదేశాలకు ప్రవాసం వెళ్లిపోయారు. ఆదివారం జెనీవాలో జరిగిన బీఆర్పీ సమావేశంలో బుగ్తీకి భారత్ లో రాజకీయ ఆశ్రయంపై నిర్ణయం తీసుకున్నారు. బుగ్తీకి రాజకీయ ఆశ్రయం ఇచ్చేందుకు భారత్ అంగీకరించే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement