వెనిజులాలో నికొలస్ మదురో నియంత పాలనకు ముగింపు ఖాయమని ఆశించిన ఆ దేశ ప్రజలకు మరింత నిరాశ కలిగించే పరిణామమిది. అధ్యక్ష ఎన్నికల్లో విపక్షాల సంయుక్త అభ్యరి్థగా మదురోతో తలపడ్డ ఎడ్మండో గొంజాలెజ్ తాజాగా దేశం వీడి స్పెయిన్‌లో ఆశ్రయం పొందారు. జూలైలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వాస్తవ విజేత గొంజాలెజేనని విపక్షాలతోపాటు పలు విదేశీ ప్రభుత్వాలు కూడా పేర్కొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.
గొంజాలెజ్‌కు ఆశ్రయం కలి్పంచేందుకు స్పెయిన్ అంగీకరించిందని వెనిజులా ఉపాధ్యక్షుడు డెల్సీ రొడ్రిగెజ్ ప్రకటించారు. దీనిపై గొంజాలెజ్ గానీ ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో గానీ స్పందించలేదు. ఎన్నికల్లో పోటీ చేయకుండా మచాడోపై మదురో ప్రభుత్వం నిషేధం ప్రకటించడంతో ఆఖరి దశలో గొంజాలెజ్ రంగంలోకి దిగడం తెలిసిందే.
అయితే, వెనిజులా వీడాలన్నది గొంజాలెజ్ నిర్ణయం మాత్రమేనని, తాము పంపిన ఎయిర్‌ఫోర్స్ విమానంలో తమ దేశం చేరుకున్నారని స్పెయిన్ ప్రభుత్వం తెలిపింది. ఆయన వినతి మేరకే ఆశ్రయం కలి్పంచామని స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయెల్ అల్బారెస్ చెప్పారు. ‘వెనిజులా ప్రజల హక్కుల కాపాడటానికి కట్టుబడి ఉన్నాం. గొంజాలెజ్ వెనిజులా హీరో. ఆయన భద్రత బాధ్యతను స్పెయిన్ తీసుకుంటుంది’ అని స్పష్టం చేశారు. వెనిజులాకు రావడానికి కొద్ది రోజుల ముందే రాజధాని కారకాస్‌లోని తమ రాయబార కార్యాలయంలో గొంజాలెజ్ తలదాచుకున్నారని వెల్లడించారు.
ఓటరు జాబితాను ఫోర్జరీ చేశారంటూ వచి్చన ఆరోపణలపై విచారణకు రావాలంటూ మూడు పర్యాయాలు సమన్లు పంపినా హాజరు కాలేదని దేశ అటార్నీ జనరల్ గొంజాలెజ్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో, ఆయన స్పెయిన్ రాయబార కార్యాలయంలో తలదాచుకోవాల్సి వచి్చంది. మడురో నిరంకుశ విధానాలతో ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నేతలు స్పెయిన్‌లో ఆశ్రయం పొందారు. ఈ ఏడాదిలో మొదటి ఆరు నెలల్లోనే దాదాపు 45 వేల మంది వెనిజులా నుంచి స్పెయిన్‌కు వలస వెళ్లారు. 2022 గణాంకాల ప్రకారం వెనిజులా వాసులు కనీసం 2.12 లక్షల మంది స్పెయిన్‌లో ఉంటున్నారు.
– కారకాస్
Comments
Please login to add a commentAdd a comment