బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం భారత్‌తో పాటు పొరుగు దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఉన్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ ప్రధానిగా నియమితులయ్యారు.
షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి, దేశం విడిచిపెట్టిన తర్వాత బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున హింస చెలరేగుతోంది. ముఖ్యంగా రాజధాని ఢాకా, చిట్టగాంగ్, కుల్నా సహా ఇతర పలు ప్రాంతాల్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. పలు హిందూ దేవాలయాలు, ఇళ్లు, వ్యాపార సంస్థలు ధ్వంసమయ్యాయి.
ఈ నేపధ్యంలో ఇండియా టీవీ తన వెబ్‌సైట్‌లో ఒక పోల్ నిర్వహించింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్‌లో ఆశ్రయం ఇవ్వడం సబబేనా అని ఇండియా టీవీ ప్రజాభిప్రాయాన్ని ఒక పోల్ ద్వారా కోరింది. దీనికి వేలాది మంది స్పందించారు. 60 శాతం మంది షేక్ హసీనాకు భారత్‌లో ఆశ్రయం ఇవ్వడం తగినదేనని అన్నారు. ఆమెకు ఇక్కడ ఆశ్రయం ఇవ్వకూడదని 33 శాతం మంది తమ అభిప్రాయం వెల్లడించారు. తమ అభిప్రాయం వెల్లడించలేమని ఏడు శాతం మంది పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment