బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత మాజీ ప్రధాని షేక్ హసీనా బృందంలోని సభ్యులంతా హడావుడిగా భారత్‌కు తరలివచ్చారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం షేక్ హసీనా టీమ్‌లోని చాలా మంది ఇక్కడికి వచ్చే సమయంలో తమ దుస్తులతో పాటు ఇతర రోజువారీ వినియోగ వస్తువులను కూడా తీసుకురాలేదు.
భారత ప్రోటోకాల్ అధికారులు హసీనా జట్టు సభ్యులకు దుస్తులు ఇతర వస్తువులను కొనుగోలు చేసుకునేందుకు సహాయం అందించారు. బంగ్లాదేశ్‌లో వారు ఎదుర్కొన్న భయానక అనుభవాల నుంచి వారు ఇంకా కోలుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. బంగ్లాదేశ్ సైన్యం షేక్ హసీనాకు రాజీనామా చేసేందుకు 45 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చింది. దీంతో ఆమె వెంటనే తన రాజీనామాను అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్‌కు సమర్పించారు. అనంతరం ఆమె భారత్ తరలివచ్చారు.
తాజాగా షేక్ హసీనా తన సోదరి రిహన్నాతో కలిసి ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్ బేస్ షాపింగ్ కాంప్లె క్స్‌కు వచ్చి తనకు అవసరమైన దుస్తులు ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు చేశారు. ఆమె సుమారు రూ.30 వేల విలువైన సామగ్రి కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మొత్తాన్ని ఆమె భారతీయ రూపాయిలలో చెల్లించారు. అయితే ఈ కొనుగోలు అధికారికంగా ధృవీకృతం కాలేదు. ప్రస్తుతం షేక్ హసీనా.. హిండన్ ఎయిర్‌బేస్‌లోని సేఫ్ హౌస్‌లో ఉంటున్నారు. ఆమె త్వరలో ఇక్కడ నుండి మరొక ప్రదేశానికి తరలివెళ్లవచ్చని తెలుస్తోంది.
షేక్ హసీనా భద్రత కోసం ఆమె ఉంటున్న ప్రాంతంలో కమాండోలను మోహరించారు. షేక్ హసీనా తన సోదరి రెహానాతో కలిసి బంగ్లాదేశ్ నుంచి హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ హిండన్ ఎయిర్‌బేస్‌లో ఆమెను కలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment