బంగ్లాలో ప్రభుత్వ కొలువుల్లో రిజర్వేషన్లు రద్దు | Sheikh Hasina announces abolishing quotas for govt jobs in Bangladesh amid student protests | Sakshi
Sakshi News home page

బంగ్లాలో ప్రభుత్వ కొలువుల్లో రిజర్వేషన్లు రద్దు

Published Thu, Apr 12 2018 3:14 AM | Last Updated on Thu, Apr 12 2018 3:14 AM

Sheikh Hasina announces abolishing quotas for govt jobs in Bangladesh amid student protests - Sakshi

షేక్‌ హసీనా

ఢాకా: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా ప్రకటించారు. రిజర్వేషన్‌ విధానంలో సంస్కరణలు తేవాలంటూ విద్యార్థులు, నిరుద్యోగులు చేపట్టిన ఆందోళనలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. బుధవారం ఢాకా ఆందోళనలతో అట్టుడికింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని పార్లమెంట్‌లో ఈమేరకు ప్రకటన చేశారు.

డిమాండ్లను పరిశీలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత కూడా ఆందోళనలు కొనసాగించటం తగదన్నారు. ఢాకా వర్సిటీ వైస్‌ఛాన్సెలర్‌పై దాడిని ఆమె ఖండించారు. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్‌ విధానం ప్రకారం.. 56% ప్రభుత్వ ఉద్యోగాలను స్వాతంత్య్ర సమర యోధుల పిల్లలు, మహిళలు, మైనారిటీలు, వికలాంగులు, వెనుకబడిన జిల్లాల వారికి కేటాయిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement