reservarion
-
ఎస్సీ వర్గీకరణ: ‘సుప్రీం కోర్టు తీర్పును అప్పీల్ చేస్తాం’
ఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అనుమతిస్తూ తీర్పు వెల్లడించింది. అయితే తీర్పును దేశ వ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు, నేతలు స్వాగతించారు. సుప్రీం కోర్టు తీర్పుపై స్పందించిన ‘లోక్ జనశక్తి పార్టీ’ (రాంవిలాస్) నేత, కేంద్ర మంత్రిమంత్రి చిరాగ్ పాశ్వాన్ మాత్రం వర్గీకరణను వ్యతిరేకించారు. అదీకాక సుప్రీం కోర్టు తీర్పును సర్వొన్నత న్యాయస్థానంలోనే అప్పీలు చేయనున్నామని అన్నారు. ఆయన శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.‘‘అంటరానితనాన్ని ప్రాతిపదికగా తీసుకుని అణగారినవర్గాలను షెడ్యూల్డ్ కేటగిరీలో చేర్చారు. అయితే ఎస్సీ, ఎస్టీలో ఉప వర్గీకరణ వల్ల ఎటువంటి ప్రయోజనం జరగదు. ఈ వర్గాలు ఎదుర్కొన్నే అంటరానితనం అనే విషయాన్ని సుప్రీంకోర్టు తీర్పులో ఎక్కడా ప్రస్తవించలేదు. విద్యాఅవకాశాలు ఉన్న దళితులు, ధనవంతులు సైతం ఎస్సీల్లో పలు వర్గాలు ఇప్పటికీ కొన్నిచోట్ల అంటరానితనాన్ని ఎందుర్కొంటున్నారు. అందుకే ఎస్సీ, ఎస్టీ ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వటం సరికాదు. ఈ తీర్పును సమీక్షించి, సుప్రీం కోర్టులోనే అప్పీలు చేయనున్నాము’అని చిరాగ్ అన్నారు.सुप्रीम कोर्ट के दलित - आदिवासी के कोटे के अंदर कोटे के फ़ैसले के ख़िलाफ़ केंद्रीय मंत्री @iChiragPaswan की पार्टी पुनर्विचार याचिका दाखिल करेगी । चिराग़ ने साफ़ किया कि दलितों - आदिवासियों को आरक्षण छूआछूत के आधार पर मिला हैं @ndtv @ndtvindia pic.twitter.com/8V2oBGwaQD— manish (@manishndtv) August 3, 2024 అదేవింధంగా దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాల్సిన అవసరం ఉందని మరోసారి స్పష్టం చేశారు. కులగణనకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదన్నారు. దళితుల కోటాలో క్రీమీలేయర్‌ను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందనని తెలిపారు. -
రిజర్వేషన్ల పెంపు.. బీహార్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
బీహార్‌లో రిజర్వేషన్ల పరిధిని మరింతగా పెంచుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో రిజర్వేషన్ల పరిధిని 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది.విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఇతర వెనుకబడిన తరగతులకు రాష్ట్ర ప్రభుత్వం 65 శాతం మేరకు పెంచిన రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై పట్నా హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రిజర్వేషన్ల పెంపును రద్దు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టాన్ని రద్దు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ గౌరవ్ కుమార్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను పూర్తి చేశాక, మార్చి 11న నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు. పట్నాహైకోర్టు ఈ రోజు(గురువారం) రిజర్వేషన్లపై తన తీర్పు వెలువరించింది. Patna High Court scraps 65% reservation for Backward Classes, EBCs, SCs & STs.The Court set aside the Bihar Reservation of Vacancies in Posts and Services (Amendment) Act, 2023 and The Bihar (In admission in Educational Institutions) Reservation (Amendment) Act, 2023 as ultra… pic.twitter.com/FTvY9CzvRn— ANI (@ANI) June 20, 2024 -
ట్రైన్ టిక్కెట్ల కేటాయింపు కసరత్తు సాగుతుందిలా..
ఇప్పుడున్న రోజుల్లో రైలులో ప్రయాణించాలంటే ముందుగా టిక్కెట్ బుక్ చేసుకోవడం ఎంతో ముఖ్యమైదిగా మారిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లోనూ చాలామంది ప్రయాణికులకు వెయిటింగ్ లిస్టు వస్తుంటుంది. అలాగే చాలాసార్లు కన్ఫర్మ్ సీటు కూడా లభించదు. ఒక్కోసారి వివిధ రకాల కేటగిరీలలోని వెయిటింగ్ లిస్టులలోకి చేరిపోతుంటుంది. వాటిలో ఒకటే పీక్యూ. దీని అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఎక్స్‌ప్రెస్ ట్రైన్లో 12 కోచ్‌లు ఉంటాయి. ప్రతీ కోచ్‌లో 72 సీట్లు ఉంటాయి. ఈ విధంగా రైల్లో మొత్తంగా 864 సీట్లు ఉంటాయి. రైల్వే అధికారులు ఈ 864 సీట్లను వివిధ కోటాల కింద కేటాయిస్తుంటారు. వీటిలోనిదే పీక్యూ. దీని అర్థం పూల్డ్ కోటా. దీనిలో 8శాతం సీట్లు రిజర్వ్ అయి ఉంటాయి. ఏదైనా రైలు తన మొదటి స్టేషన్ నుంచి ఏడవ స్టేషన్ వరకూ వెళితే ఆ రూటులో 2 నంబరు మొదలుకొని 6వ నంబరు వరకూ స్టేషన్లు వస్తాయి. అయితే దీనిలో నాల్గవ నంబరు స్టేషన్ ప్రధానమైనది అవుతుంది.ఈ విధంగా రైలు అధికారులు 8 శాతం సీట్లను పూల్డ్ కోటా తరహాలో రిజర్వ్ చేస్తారు. ఈ విధంగా చూస్తే 864 సీట్లలో 8 శాతం అంటే 69 సీట్లు ఈ స్టేషన్లకు పూల్డ్ కోటా కింద రిజర్వ్ చేస్తారు. మొదటి స్టేషన్ నుంచి టర్మినేటింగ్ స్టేషన్ వరకూ ప్రయాణించేవారికి లేదా ఏదైనా మధ్యలోని స్టేషన్ నుంచి టర్నినేటింగ్ స్టేషన్ వరకూ లేదా రెండు మధ్యస్థ స్టేషన్ల మధ్య ప్రయాణించేవారికి పూల్డ్ కోటా సీట్లను కేటాయిస్తారు. ఈ కోటా నిండిపోయిన పక్షంలో వెయిటింగ్ లిస్టు(పీక్యూడబ్ల్యుఎల్) కింద టిక్కెట్ జారీ చేస్తారు. పీక్యూడబ్ల్యుఎల్ అంటే పూల్డ్ కోటా వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్. పీక్యూడబ్ల్యుఎల్ టిక్కెట్.. కన్ఫర్మ్ టిక్కెట్ అయ్యేందుకు సాధారణంగా అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్ ప్రాధాన్యాతా సూచీలో ఇవి జీఎన్డబ్ల్యుఎల్ తరువాత వస్తాయి. ముందుగా జీఎన్డబ్ల్యుఎల్ టిక్కెట్ కన్ఫర్మ్ అవుతుంది. ఆ తరువాతనే పీక్యూడబ్ల్యుఎల్ నంబరు వస్తుంది. అటువంటిప్పుడు మీరు ఐఆర్సీటీసీ వెబ్సైట్లో మీ టిక్కెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాన్ని చెక్ చేసుకోవచ్చు. భారతీయ రైల్వేలో టిక్కెట్ల ఎడ్వాన్స్ బుకింగ్ అనేది ప్రయాణపు తేదీకి సరిగ్గా 120 రోజుల ముందు మొదలవుతుంది. అందుకే ఎవరైనా సరే రైలులో దూర ప్రాంతాలు వెళ్లాలనుకుంటే ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఉత్తమం. అప్పుడు కన్ఫర్మ్ టిక్కెట్ దొరికి, రైలులో సౌకర్యవంతంగా ప్రయాణించేందకు అవకాశం ఏర్పడుతుంది. -
పండుగకు రైలు బండి గగనమే!!
సాక్షి హైదరాబాద్: ఈసారి సంక్రాంతికి సొంత ఊరుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధంచేసుకుంటున్న నగర వాసులను వివిధ మార్గాల్లో నడిచే రైళ్లు నిరాశకు గురి చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే అన్ని ప్రధాన రైళ్లలో వెయిటింగ్ లిస్టు 250 నుంచి 300 వరకు చేరింది. కొన్ని రైళ్లలో ‘నో రూమ్’ దర్శనమిస్తోంది. బెర్తులన్నీ పూర్తిగా భర్తీ కావడంతో ఫిబ్రవరి వరకు బుకింగ్ సేవలను సైతం నిలిపివేశారు. సాధారణంగా మూడు నెలల ముందే రిజర్వేషన్ బుకింగ్ సదుపాయం ఉండడంతో డిసెంబర్లోనే అన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్టు పెరిగింది. ప్రయాణికుల డిమాండ్ మేరకు ఇప్పటికిప్పుడు ప్రత్యేక రైళ్లు వేస్తే తప్ప నగరవాసులు సొంత ఊళ్లకు వెళ్లడం సాధ్యం కాదు. కానీ ఈ దిశగా దక్షిణమధ్య రైల్వే పెద్దగా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. కొన్ని రూట్లలో మాత్రం అరకొరగా అదనపు రైళ్లను ప్రకటించారు. పెరగనున్న రద్దీ.. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా జనం సొంత ఊళ్లకు వెళ్లకుండా నగరంలోనే సంక్రాంతి వేడుకలు చేసుకున్నారు. మరోవైపు రైళ్లు సైతం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఎంపిక చేసిన మార్గాల్లో అదనపు చార్జీలతో ప్రత్యేక రైళ్లు నడిపారు. దీంతో సొంత ఊళ్లకు వెళ్లాలనుకున్న వాళ్లు ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాలపైన ఆధారపడాల్సి వచ్చింది. ప్రస్తుతం అన్ని రూట్లలో రెగ్యులర్ రైళ్లను పునరుద్ధరించారు. అదనపు చార్జీలను రద్దు చేశారు. ప్రస్తుతం నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి ప్రతి రోజు సుమారు 120 ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ నుంచి విశాఖ, కాకినాడ, విజయవాడ,తిరుపతి, బెంగళూరు, ముంబయి, షిరిడీ, తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని రైళ్లలో ఇప్పటికే బెర్తులు భర్తీ అయ్యాయి. రానున్న రోజుల్లో మరింత రద్దీ పెరగనుంది. ప్రత్యేకంగా విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి వైపు వెళ్లే రైళ్లకు మరింత డిమాండ్ నెలకొనే అవకాశం ఉంది. ప్రత్యేక రైళ్లు పది.. ఒకవైపు రద్దీ భారీగా ఉండగా, దక్షిణమధ్య రైల్వే మాత్రం తాజాగా సంక్రాంతి సందర్భంగా 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కాచిగూడ–విశాఖపట్టణం (07497/ 07498) ప్రత్యేక రైలు ఈ నెల 7, 14 తేదీల్లో రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 8, 16 తేదీల్లో సాయంత్రం 7 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. కాచిగూడ–నర్సాపూర్ (82716/07494) సువిధ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 11న రాత్రి 11.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.40 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 12వ తేదీ సాయంత్రం 6 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. కాకినాడ–లింగంపల్లి ( 07491/07492) స్పెషల్ ట్రైన్ ఈ నెల 19, 21 తేదీల్లో రాత్రి 8.10కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 20, 22 తేదీల్లో సాయంత్రం 6.40కి కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు లింగంపల్లికి చేరుకుంటుంది. నిరీక్షణే మిగిలింది.. హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే గౌతమి. విశాఖ, నర్సాపూర్, ఫలక్‌నుమా, నారాయాణాద్రి, పద్మావతి, వెంకటాద్రి, తదితర అన్ని రైళ్లలో 250 నుంచి 300 కు పైగా వెయిటింగ్ లిస్టు పెరిగింది. ఫిబ్రవరి మొదటి వారం వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ప్రత్యేకంగా ఈ నెల 10వ తేదీ నుంచి 20 వరకు ప్రయాణం చేసేందుకు ఏ మాత్రం అవకాశం లేదు. స్లీపర్, ఏసీ బోగీలన్నీ నిండిపోయాయి. -
వరంగల్‌లో విషాదం.. రిజర్వాయర్‌లో పడి..
సాక్షి, వరంగల్ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బీమారంలో ఉన్న పుట్టలమ్మ రిజర్వాయర్‌లో పడి గురువారం ముగ్గురు బాలురు మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. బీమారానికి చెందిన దొడ్డిపాటి మనివిత్ (11), దొడ్డిపాటి మహేష్ బాబు(14), మ్యూనికుంట్ల విష్ణు తేజ (14) ఈ ముగ్గురు బాలురు సైకిల్‌పై వెళ్లి పుట్టలమ్మ రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు రిజర్వాయర్‌లో పడి పిల్లలు గల్లంతు కావటంతో స్థానికంగా ఉన్న గజ ఈతగాళ్లని దింపి గాలింపు చర్యలు చేపట్టారు. (ఆయన గొంతు విన్నాక.. కన్నీళ్లు ఆగలేదు! ) సమాచారం అందుకున్న కేయూసీ పోలీసులు హుటాముటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటికే రెండు మృతదేహాలను వెలికి తీయగా.. వారిని మనివిత్, మహేష్ బాబుగా గుర్తించారు. మరో బాలుడి కోసం గాలిస్తున్నారు. ఇక ఈ దుర్ఘటనతో బాధితుల తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. బిడ్డల కోసం తల్లిదండ్రుల ఆర్తనాదాలు పలువురిని కంటతడి పెట్టించాయి. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. (తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్..) -
మహిళలకే ప్రాధాన్యం
సాక్షి, కొల్లాపూర్: దాదాపు అన్ని మండలాలకు ఎంపీపీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో కొల్లాపూర్ నియోజకవర్గ మండలాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. నాలుగు మండలాల్లో ఒక్క ఎంపీపీ పదవి మినహా మిగతా ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలన్నీ మహిళలకే రిజర్వ్ అయ్యాయి. జనాభా పరంగా ఎస్సీలు, ఎస్టీలు పెద్దసంఖ్యలో ఉన్నారు. అయితే వీరికి ఎక్కడా రిజర్వేషన్లు కల్పించలేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగిందని రాజకీయ పార్టీల నాయకులు భావిస్తున్నారు. మండలాల వారీగా ఇలా.. నియోజకవర్గ పరిధిలో కొల్లాపూర్, పెంట్లవెల్లి, పెద్దకొత్తపల్లి, కోడేరు మండలాలు ఉన్నారు. వీటిలో ఎంపీపీ పదవులకు సంబంధించి కొల్లాపూర్ మండలం జనరల్ మహిళ, కోడేరు మండలం జనరల్ మహిళ, పెంట్లవెల్లి మండలం బీసీ మహిళ, పెద్దకొత్తపల్లి మండలం బీసీ మహిళకు రిజర్వ్ అయ్యాయి. జెడ్పీటీసీ పదవులకు సంభందించి కొల్లాపూర్ మండలం జనరల్ మహిళ, పెంట్లవెల్లి మండలం బీసీ మహిళ, కోడేరు మండలం జనరల్ మహిళ, పెద్దకొత్లపల్లి మండలం బీసీ జనరల్ అయ్యాయి. గతంలో ఇలా.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొల్లాపూర్ నియోజకవర్గంలో కేవలం ఐదు మండలాలు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి. వీటిలో చిన్నంబావి, వీపనగండ్ల, పాన్‌గల్ మండలాలు వనపర్తి జిల్లా పరిధిలోకి వెళ్లాయి. నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో ఉండే మండలాలకు సంభందించి గతంలో కొల్లాపూర్ మండలంలో ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులు జనరల్ స్థానాలకు, పెద్దకొత్తపల్లి మండంలలో ఎంపీపీ స్థానం జనరల్‌కు, జడ్పీటీసీ స్థానం బీసీ జనరల్‌కు, కోడేరు మండలంలో ఎంపీపీ, స్థానం జనరల్‌కు, జెడ్పీటీసీ స్థానం ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఈసారి వీటికి పూర్తి భిన్నంగా ఒక్క స్థానం మినహాయిస్తే మిగతా అన్ని స్థానాలు మహిళలకే రిజర్వ్ అయ్యాయి. ఆశావహుల లెక్కలు ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆయా స్థానాల్లో పోటీలో నిలవాలని భావిస్తున్న ఆశావహులు రాజకీయంగా లెక్కలు వేసుకునే పనిలో పడ్డారు. కొల్లాపూర్, కోడేరు, పెంట్లవెల్లిలో ఎంపీపీ, జెడ్పీటీసీలన్నీ మహిళలకే రిజర్వ్ కావడంతో నాయకులు పోటీలో ఉండాలా లేదా అనే ఆలోచనలో పడ్డారు. అయినా సరే ప్ర త్యర్థి పార్టీ అభ్యర్థి బలాబలాను బేరీజు వేసుకుని బరిలో దిగేందుకు సమాయత్తమవుతున్నారు. -
‘ఆమె’కే జెడ్పీ చాన్స్
సాక్షి,సిద్ధిపేట్: ఇంతకాలం ద్వితీయ శ్రేణి నాయకులుగా ఉన్న పలువురు కొత్త జిల్లా పరిషత్ పీఠంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. మొత్తం 22 మండలాల్లో అక్కన్నపేట జెడ్పీటీసీ, ఎంపీపీ రెండు ఎస్టీకి రిజర్వ్ చేశారు. బెజ్జంకి, కొమురవెల్లి, మిరుదొడ్డి, గజ్వేల్ ఎస్సీలకు కేటాయించారు. మిగిలిన వాటిలో రాయప్రోలు, కొండపాక, వర్గల్, మర్కుక్, ములుగు, చేర్యాల బీసీలకు కేటాయించగా మిగిలిన 11 స్థానాలు జనరల్‌కు కేటాయించారు. జనరల్ స్థానాలతోపాటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళ, జనరల్ స్థానాల్లో కూడా మహిళలను పోటీలో దింపి జెడ్పీ చైర్పర్సన్ పదవికి పోటీ పడే అవకాశం ఉంది. 22 మండలాలతో ఏర్పడిన ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొంత భాగంతోపాటు కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి పలు మండలాలతో సిద్దిపేట జిల్లా ఆవిర్భవించింది. అయితే జిల్లా పరిషత్ పీఠం కోసం ప్రాంతాల వారిగా కూడా పోటీ పడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. సతులను పోటీలో దింపనున్న పతులు జిల్లా పరిషత్ పీఠం జనరల్ మహిళకు కేటాయించడంతో ఇప్పటికే ఆ స్థానం కోసం పోటీ పడుతున్న నాయకులు తమ సతులను పోటీలో దింపేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్‌తోపాటు వివిధ పార్టీల నుండి టికెట్ ఆశించి భంగపడిన నాయకులు, ఓటమి పాలైన నాయకులు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ముందుగా జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉండగా.. జెడ్పీటీసీ సభ్యుల రిజర్వేషన్ల ఆధారంగా ఏ మండలం నుండి తమ సతులను లేదా కుటుంబ సభ్యులను పోటీలో దింపితే బాగుంటుందనే దానిపై దృష్టి పెడుతున్నారు. ఏదిఏమైనా ఎమ్మెల్సీ ఎన్నికల వేడి తగ్గక ముందే పార్లమెంట్, ఆ వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలతో మరోసారి జిల్లాలోని పల్లెలు హోరెత్తనున్నాయి. జిల్లాలో జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీల రిజర్వేషన్లు ఇలా.. మండలం జెడ్పీటీసీ సభ్యులు ఎంపీపీ 1 అక్కన్నపేట ఎస్టీ(మహిళ) ఎస్టీ( మహిళ) 2 బెజ్జంకి ఎస్సీ(మహిళ) ఎస్సీ( జనరల్) 3 గజ్వేల్ ఎస్సీ(జనరల్) ఎస్సీ(మహిళ) 4 కొమురవెల్లి ఎస్సీ(జనరల్) ఎస్సీ( మహిళ) 5 మిరుదొడ్డి ఎస్సీ(మహిళ) ఎస్సీ(జనరల్) 6 రాయప్రోలు బీసీ(జనరల్) బీసీ( జనరల్) 7 కొండపాక బీసీ(మహిళ) బీసీ(మహిళ) 8 వర్గల్ బీసీ( జనరల్) బీసీ(మహిళ) 9 మర్కూక్ బీసీ(మహిళ) బీసీ(జనరల్) 10 ములుగు బీసీ(మహిళ) బీసీ(మహిళ) 11 చేర్యాల బీసీ(జనరల్) బీసీ( జనరల్) 12 జగదేవ్‌పూర్ అన్‌రిజర్వుడ్ అన్‌రిజర్వుడ్ 13 చిన్నకోడూర్ అన్‌రిజర్వుడ్(మహిళ) అన్‌రిజర్వుడ్ 14 నంగునూరు అన్‌రిజర్వుడ్(మహిళ) అన్‌రిజర్వుడ్(మహిళ) 15 తొగుట అన్‌రిజర్వుడ్ అన్‌రిజర్వుడ్(మహిళ) 16 సిద్దిపేటఅర్బన్ అన్‌రిజర్వుడ్(మహిళ) అన్‌రిజర్వుడ్(మహిళ) 17 సిద్దిపేట రూరల్ అన్‌రిజర్వుడ్ అన్‌రిజర్వుడ్ 18 కోహెడ అన్‌రిజర్వుడ్(మహిళ) అన్‌రిజర్వుడ్(మహిళ) 19 దుబ్బాక అన్‌రిజర్వుడ్ అన్‌రిజర్వుడ్ 20 దౌల్తాబాద్ అన్‌రిజర్వుడ్(మహిళ) అన్‌రిజర్వుడ్(మహిళ) 21 మద్దూరు అన్‌రిజర్వుడ్ అన్‌రిజర్వుడ్ 22 హుస్నాబాద్ అన్‌రిజర్వుడ్ అన్‌రిజర్వుడ్(మహిళ) -
ఇవేం రిజర్‘వేషాలు’
ప్రస్తుతం ఏపీపీఎస్సీ అనుసరిస్తున్న విధానం ప్రకారం రిజర్వుడ్ కేటగిరి అభ్యర్థి ఒకరు గ్రూప్–1 రిక్రూట్మెంట్లో ఫస్ట్ ర్యాంకు సాధించారనుకుందాం. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించటానికి రిజర్వేషన్ వాడుకున్నాడనే నెపంతో ఇతనికి బీసీ కేటగిరీలో పోస్ట్ ఉంటేనే ఇస్తారు. లేదంటే ఇవ్వరు. టోటల్‌గా ఫస్ట్ ర్యాంక్ సాధించినప్పటికీ ఫలితం శూన్యం. సాక్షి, అమరావతి : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీరుపై నిరుద్యోగులు, ఆయా ఉద్యోగ సంఘాలు ఆందోళనలు వ్యక్తపరుస్తున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన కనిపించడం లేదు. రిజర్వేషన్లపై కమిషన్‌కు ఎలాంటి అధికారం లేకపోయినా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, రిజర్వుడు అభ్యర్థులకు న్యాయబద్ధంగా, రాజ్యాంగ పరంగా దక్కాల్సిన అవకాశాలను కాలరాస్తోందని కొద్ది రోజులుగా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. స్క్రీనింగ్ టెస్టులో రిజర్వేషన్ ప్రయోజనాన్ని వినియోగించుకొని మెయిన్స్‌కు వెళ్లే అభ్యర్థి కేవలం తన రిజర్వుడ్ కోటాకు మాత్రమే పరిమితం కావాలని ఏపీపీఎస్సీ ఇటీవల కొత్త నిబంధన తేవడం తెలిసిందే. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఇతర ముఖ్యుల దృష్టికి తీసుకెళితే వారు చూసీ చూడనట్లు మౌనం వహించడంతో నిరుద్యోగుల ఆందోళ మరింత తీవ్రరూపం దాలుస్తోంది. స్క్రీనింగ్ టెస్టులో రిజర్వేషన్ ప్రయోజనాన్ని వినియోగించుకున్న వారు ఆతరువాత వారి కేటగిరీకే పరిమితం అవుతారని ప్రభుత్వం జారీ చేసిన జీఓ5లో ఎక్కడా లేదు. స్క్రీనింగ్ టెస్టులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు నిర్ణీత నిష్పత్తి సంఖ్య కన్నా తక్కువగా ఉంటే వారికి కటాఫ్ మార్కులు తగ్గించి ఎంపిక చేయడం ద్వారా ఆయా పోస్టులు భర్తీ చేయాలని మాత్రమే సూచించింది. అయితే వారు రిజర్వుడ్ పోస్టులకే అర్హులని ఏపీపీఎస్సీ చెప్పడం సరికాదని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, దీనిపై హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు కూడా ఇచ్చిందని సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ఏపీపీఎస్సీకి లేఖ కూడా రాశారు. నోటిఫికేషన్లో పెట్టిన నిబంధన తొలగించి స్క్రీనింగ్ టెస్టు నుంచి మెయిన్స్‌కు ఎంపికైన రిజర్వుడ్ అభ్యర్థులందరినీ ఓపెన్ కేటగిరీ పోస్టులకు అనుమతించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ లేఖను ఏపీపీఎస్సీ పెద్దగా పట్టించుకోకపోగా, దీనిపై న్యాయ సలహా తీసుకొని ముందుకు వెళ్లాలని తాజాగా భావిస్తుండడం మరింత వివాదంగా మారుతోంది. నిర్ణయాధికారం లేకున్నా అత్యుత్సాహం రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ల అంశం చట్ట సభలు, ప్రభుత్వ పరిధిలోనిది. అధికరణ 320 ప్రకారం ఈ అంశాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పరిధి బయట ఉంచారని ఆయా ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. రిజర్వేషన్ల విషయంలో చట్ట సభలు, ప్రభుత్వ విధానాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అమలు పరచడం తప్ప, నిర్ణయాలు మార్చేందుకు ఎటువంటి అధికారం రాజ్యాంగం కల్పించ లేదు. ప్రభుత్వ సర్వీస్‌కు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పరీక్షలో స్క్రీనింగ్ టెస్టు, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే వివిధ దశలు ఉన్నప్పటికీ అంతిమంగా వచ్చిన ర్యాంకులను బట్టి సర్వీసులను కేటాయించి రిజర్వేషన్లను అనుసరిస్తూ ఎంపిక చేయాల్సి ఉంటుందని వారు గుర్తు చేస్తున్నారు. కానీ పరీక్షల ప్రక్రియ మధ్యలో ఉన్న వివిధ దశలను వాడుకుని రిజర్వేషన్లను వ్యతిరేక వైఖరితో (నెగటివ్ అప్రోచ్)తో అమలు చేయకూడదని చెబుతున్నారు. అయినా ఏపీపీఎస్సీ అత్యుత్సాం ప్రదిర్శిస్తోందని విమర్శిస్తున్నారు. యూపీఎస్సీ విధానమంటూ తప్పుదోవ యూపీఎస్సీ విధానమంటూ ఏపీపీఎస్సీ తప్పుదోవ పట్టిస్తోందని అభ్యర్ధులు వాపోతున్నారు. 2006 వరకు యూపీఎస్సీ రిజర్వేషన్లను సానుకూల వైఖరితో (పాజిటివ్ అప్రోచ్) అమలు చేసింది. 2007లో మద్రాస్ హైకోర్టు నిర్ణయం తర్వాతి నుంచి యూపీఎస్సీ వ్యతిరేక వైఖరి (నెగటివ్ అప్రోచ్)ని అనుసరించడంతో అభ్యర్థులు కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇది సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. యూపీఎస్సీకి మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు వర్తించవు. ఆయా ప్రభుత్వాలు అయినా ఉత్తర్వులు ఇవ్వాలి లేదా కోర్టు నుంచి అయినా ఉత్తర్వులుండాలి. అవేవీ లేకపోగా ఇక్కడ కొత్త విధానం సరికాదని ఇక్కడి హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. సాధారణ పరిపాలనా శాఖ వద్దని చెప్పింది. అయినా ఏపీపీఎస్సీ తనంతట తానే ఈ కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చి లక్షలాది మంది రిజర్వుడ్ అభ్యర్థులకు అన్యాయం చేస్తోంది. యూపీఎస్సీ రాష్ట్రాల కమిషన్లకు అధిపతి కానేకాదు. అయినా యూపీఎస్సీ విధానం అంటూ ఏపీపీఎస్సీ మెలిక పెడుతోంది. ప్రిలిమ్స్ అనేది కేవలం మెయిన్స్ పరీక్ష రాయడానికి అర్హత పరీక్ష మాత్రమే. మెయిన్స్ పరీక్షలో, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తున్నామని చెబుతున్న ఏపీపీఎస్సీ, ప్రిలిమ్స్‌లో రిజర్వేషన్ ఉపయోగించుకున్నాడని మెరిట్ అభ్యర్థికి పోస్టు ఇవ్వబోమని చెబుతుండడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. -
పేదల కోటాపై స్టేకు సుప్రీం నో
న్యూఢిల్లీ: జనరల్ కేటగిరీలోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో ఇటీవల కల్పించిన 10 శాతం రిజర్వేషన్ల అమలును నిలుపుదల చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కానీ ఈ కోటాకు వీలుకల్పిస్తున్న రాజ్యాంగ సవరణ చట్ట చెల్లుబాటును పరిశీలించేందుకు అంగీకరించింది. 10 శాతం రిజర్వేషన్ల అమలు నిర్ణయాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రభుత్వ స్పందన కోరుతూ బెంచ్ శుక్రవారం నోటీసులు జారీచేసింది. జనహిత అభియాన్, యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే స్వచ్ఛంద సంస్థలు ఈ పిటిషన్లను వేశాయి. ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ..ఈ పిటిషన్లకు విచారణార్హత లేదని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై స్టే ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందేందుకు ఆర్థిక స్థితిగతులు మాత్రమే ప్రాతిపదిక కావొద్దని యూత్ ఫర్ ఈక్వాలిటీ తన పిటిషన్లో పేర్కొంది. 50 శాతమే ఉండాలన్న రిజర్వేషన్ల పరిమితిని తాజా చట్టం ఉల్లంఘిస్తోందని గుర్తుచేసింది. ‘ఎస్సీ/ఎస్టీ చట్ట సవరణ’పై యోచన ఎస్సీ, ఎస్టీ(సవరణ) వేధింపుల నిరోధక చట్టం–2018పై కేంద్ర ప్రభుత్వ సమీక్షతోపాటు, ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టే అంశాన్ని పరిశీలించనున్నట్లు కోర్టు తెలిపింది. ఎస్సీ/ఎస్టీ వేధింపుల చట్టం తీవ్రంగా దుర్వినియోగం అవుతోందనీ, ఈ చట్టం కింద దాఖలైన ఫిర్యాదులపై తక్షణం ప్రభుత్వ ఉద్యోగులను కానీ ఇతరులను కానీ అరెస్టు చేయరాదంటూ గత ఏడాది కోర్టు ఆదేశాలిచ్చింది. మరోవైపు, క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించినప్పు డు జరిగే ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్‌లలో డబ్బు వెంటనే వాపసు అయ్యేలా చూడాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే, పిటిషనర్ ముందుగా ఈ సమస్యను ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది. -
చంద్రబాబు కాపు వ్యతిరేకి..
-
‘ఈబీసీ కోటాలో మాకు వాటా వద్దు’
సాక్షి, అమరావతి : అగ్రవర్ణాల రిజర్వేషన్లలో ఇచ్చే వాటా తమకు అవసరం లేదంటున్నారు రాష్ట్ర కాపునాడు సంఘం నేతలు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. చంద్రబాబు కాపు వ్యతిరేకి.. మాయ మాటలు చెప్తాడు నమ్మవద్దంటూ హెచ్చరించారు. చంద్రబాబు అగ్రవర్ణాల పేదలకు ఇచ్చే రిజర్వేషన్లలోనే కాపులకు వాటా ఇస్తానని అంటున్నాడు. ఇలా చేయడం అంటే కాపులు, అగ్రవర్ణాల మధ్య చిచ్చు పెట్టడమే అని తెలిపారు. ఈబీసీ కోటాలో ఇచ్చే రిజర్వేషన్లు కోర్టులో నిలబడవని పేర్కొన్నారు. 2014 ఎన్నికలకు ముందు కాపులను బీసీల్లో చేర్చుతామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మరోసారి ఎన్నికల ముందు చంద్రబాబు కాపులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం అంతా తిరిగి చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రచారం చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు ఓ చేత్తో రిజర్వేషన్లు ఇచ్చి మరో చేత్తో కోర్టులో కేసులు వేయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మంచినీరు కూడా ముట్టను
అహ్మదాబాద్: పటీదార్లకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ పటీదార్ల నేత హార్దిక్ పటేల్(25) చేపట్టిన నిరాహార దీక్ష ఏడో రోజుకు చేరుకుంది. ఇకపై మంచినీరు కూడా తాగనని ఆయన శుక్రవారం ప్రకటించారు. ఆహారం, నీరు లేకుండా దీక్షచేస్తానని, ఆశయం సిద్ధించేదాకా గాంధీజీ చూపిన బాటలో పోరు సాగిస్తానన్నారు. శుక్రవారం గుజరాత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అర్జున్ మొధ్వాడియా, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కనూ కల్సారియా సహా పలువురు నేతలు హార్దిక్‌ను కలిసి మద్దతు తెలిపారు. వేర్పాటు వాదులతో చర్చలు జరపగలిగిన ప్రభుత్వం హార్దిక్‌తో ఎందుకు చర్చలు జరపడం లేదని మొధ్వాడియా అన్నారు. హార్దిక్‌తో చర్చలు జరిపి పరిష్కారం కనుగొనాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. అహ్మదాబాద్, గాంధీనగర్‌లలో దీక్షకు అధికారులు నో చెప్పడంతో 25న తన నివాసంలోనే హార్దిక్ దీక్ష ప్రారంభించారు. -
వేరే రాష్ట్రంలో కోటా వర్తించదు
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీల వర్గాలకు చెందిన ఒక వ్యక్తి కులాన్ని వేరే రాష్ట్రంలోను అదే వర్గంగా గుర్తిస్తే తప్ప ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా ప్రవేశాల్లో రిజర్వేషన్ల లబ్ధి పొందలేరంటూ సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పునిచ్చింది. ఈ మేరకు జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఏ శంతన గౌడర్, జస్టిస్ ఎస్ఏ నజీర్‌ల రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయంతో తీర్పు వెలువరించింది. అదే సమయంలో ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర రిజర్వేషన్ విధానం అమలు చేయవచ్చని స్పష్టం చేసింది. ‘ఒక రాష్ట్రంలో ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి వేరే రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ఉద్యోగం, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన అంశాల్లో ఆ రాష్ట్రంలో అతనిని ఎస్సీ, ఎస్టీగా పరిగణించకూడదు. దాని వల్ల సొంత రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు వారికోసం ఉద్దేశించిన రిజర్వేషన్ల ప్రయోజనాలు కోల్పోతారు’ అని ధర్మాసనం పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి కులాన్ని వేరే రాష్ట్రంలో అదే వర్గంగా గుర్తించని పక్షంలో అతను ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ కోరవచ్చా? అని దాఖలైన 8 పిటిషన్లను విచారించిన అనంతరం సుప్రీం కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. ‘ఒక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీలుగా గుర్తింపు పొందితే వారికి వేరే రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో తప్పనిసరిగా అదే హోదా ఉండాల్సిన అవసరం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒక కులం లేదా తెగను ఏ రాష్ట్రంలోనైనా ఎస్సీ, ఎస్టీల జాబితాలో చేర్చేందుకు అర్హతను ఆ ప్రాంత పరిస్థితులు, ప్రతికూలతలు, ఆ వర్గం ఎదుర్కొంటున్న సామాజిక ఇబ్బందులపై ఆధారపడి పరిగణనలోకి తీసుకుంటారని ధర్మాసనం వెల్లడించింది. ‘ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి మహారాష్ట్రలో రిజర్వేషన్ లబ్ధి పొందితే మహారాష్ట్రలోని ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తికి ఆ రాష్ట్రం కేటాయించిన రిజర్వేషన్ ఫలాన్ని దక్కకుండా చేయడమే’ అని పేర్కొంది. అయితే వేరే రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీలు ఢిల్లీలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు అర్హులని సుప్రీంకోర్టు తెలిపింది. ఢిల్లీ విషయంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర రిజర్వేషన్ విధానం వర్తిస్తుందని నలుగురు న్యాయమూర్తులు స్పష్టం చేయగా జస్టిస్ భానుమతి వారితో విభేదించారు. ‘కేంద్ర పాలిత ప్రాంతంలోని ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం కిందకు వచ్చినప్పటికీ అవన్నీ కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో ఉంటాయి. యూనియన్ ఆఫ్ ఇండియా నియంత్రణలో ఉండవు’ అని తన తీర్పులో జస్టిస్ భానుమతి అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లకు వెనుకబాటు గీటురాయి కాదు ఉద్యోగ పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల అంశంలో వెనుకబాటుతనాన్ని కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి సరైన ప్రాతినిథ్యం లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లపై గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేస్తూ తీర్పును రిజర్వ్ చేసింది. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలుకు షరతులు విధిస్తూ 2006లో సుప్రీం తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవరించేందుకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలువురు సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేశారు. విచారించిన రాజ్యాంగ బెంచ్ తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. 2006 నాటి తీర్పును సమీక్షించండి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేముందు ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి సరైన ప్రాతినిధ్యం లేకపోవడం తదితర అంశాలకు సంబంధించి అవసరమైన సమాచారం సమర్పించాలని 2006 నాటి ఎం.నాగరాజ్ కేసులో రాష్ట్రాలకు సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పును పునః సమీక్షించాలని కేంద్రం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంను కోరాయి. -
బంగ్లాలో ప్రభుత్వ కొలువుల్లో రిజర్వేషన్లు రద్దు
ఢాకా: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రకటించారు. రిజర్వేషన్ విధానంలో సంస్కరణలు తేవాలంటూ విద్యార్థులు, నిరుద్యోగులు చేపట్టిన ఆందోళనలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. బుధవారం ఢాకా ఆందోళనలతో అట్టుడికింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని పార్లమెంట్లో ఈమేరకు ప్రకటన చేశారు. డిమాండ్లను పరిశీలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత కూడా ఆందోళనలు కొనసాగించటం తగదన్నారు. ఢాకా వర్సిటీ వైస్ఛాన్సెలర్పై దాడిని ఆమె ఖండించారు. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ విధానం ప్రకారం.. 56% ప్రభుత్వ ఉద్యోగాలను స్వాతంత్య్ర సమర యోధుల పిల్లలు, మహిళలు, మైనారిటీలు, వికలాంగులు, వెనుకబడిన జిల్లాల వారికి కేటాయిస్తున్నారు. -
తండాలన్నీ ఎస్టీలకు కాదు!
సాక్షి, హైదరాబాద్ : .. ఈ పరిస్థితి రెండు గ్రామ పంచాయతీలకే పరిమితం కావడం లేదు. కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటవుతున్న వందలాది తండాల్లో ఈ సమస్య తలెత్తనుంది. ఇతర వర్గాల ఓటర్లు కనీసం పది మంది కూడా లేనిచోట రిజర్వేషన్ల రొటేషన్లతో ఆయా వర్గాలకు సర్పంచ్ పదవి కేటాయించే పరిస్థితి ఉంటుంది. దీనితో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి ఎస్టీలకు పాలనా అవకాశం కల్పించాలన్న లక్ష్యం నీరుగారిపోనుంది. ఈ పరిస్థితిని ఊహించిన పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఏం చేయాలనేదానిపై తర్జనభర్జన పడుతున్నారు. ఈ ఇబ్బందిని అధిగమించేలా కొత్త పంచాయతీరాజ్ చట్టంలో ప్రత్యేకంగా నిబంధనలు చేర్చే విషయంపై న్యాయశాఖతో కలసి అధ్యయనం చేస్తున్నారు. 4,122 కొత్త పంచాయతీలు రాష్ట్రంలో జనాభా ఎక్కువగా ఉన్న శివారు గ్రామాలు, పల్లెలు, తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. మైదాన ప్రాంతాల్లో 500 మంది జనాభా ప్రాతిపదికన.. కొండలు, గుట్టల ప్రాంతాల్లో, ప్రత్యేక భౌగోళిక ప్రాంతాల్లో 300 జనాభా ప్రాతిపదికన ఆవాసాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చేలా మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని 30 జిల్లాల నుంచి 4,122 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. అందులో 1,879 సాధారణ ఆవాసాలు, 2,243 తండాలు ఉన్నాయి. చివరిగా మరోసారి జిల్లాల నుంచి నివేదికలు తెప్పిస్తున్నారు. కొత్త పంచాయతీలతో కలిపి రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు మొత్తంగా 12,806కు చేరనున్నాయి. 957 కొత్త పంచాయతీల్లో సమస్యలు స్థానిక సంస్థల ఎన్నికల మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి ఐదేళ్లకు సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ మారుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అన్ని పదవులను పూర్తిగా ఎస్టీ వర్గం వారికే కేటాయిస్తారు. కానీ మైదాన ప్రాంతాల్లోని తండాల్లో రిజర్వేషన్ల రొటేషన్ సమస్య తలెత్తనుంది. రాష్ట్రంలో కొత్తగా 2,243 తండాలు గ్రామ పంచాయతీగా ఏర్పాటు కానుండగా.. ఇందులో 100 శాతం ఎస్టీ జనాభా ఉన్నవి 1,286 మాత్రమే. మిగతా 957 తండాల్లో ఇతర వర్గాలకు చెందినవారు కొద్ది సంఖ్యలో నివసిస్తున్నారు. దీంతో సర్పంచ్‌తోపాటు కొన్ని వార్డు సభ్యుల పదవులు ఇతర వర్గాలకు రిజర్వు అయ్యే పరిస్థితి ఉండనుంది. ప్రత్యేక నిబంధనపై కసరత్తు! గ్రామ పంచాయతీలుగా మారే తండాల్లోని ఓటర్లలో ఏ వర్గం వారు ఎంత మంది ఉన్నారన్న విషయంపై పంచాయతీరాజ్ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న తండాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులు పూర్తిగా ఎస్టీ వర్గం వారికే రిజర్వు అయ్యేలా కొత్త పంచాయతీరాజ్ చట్టంలో నిబంధనను చేర్చాలన్న అంశాన్ని న్యాయ శాఖ దృష్టికి తీసుకువచ్చారు. ఇక కేవలం నలుగురైదుగురు ఇతర వర్గాల వారున్న పంచాయతీల్లో రిజర్వేషన్ల రొటేషన్ అంశంపైనా చర్చిస్తున్నారు. త్వరలోనే ఈ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది. డీసీ తండా.. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఒక గ్రామ పంచాయతీ. నాలుగు తండాలు కలిపి గ్రామ పంచాయతీగా ఉంది. సమీపంలోని ఓ గ్రామం నుంచి నలుగురు బీసీ వర్గం వారు డీసీ తండాలో స్థిరపడ్డారు. 2013 పంచాయతీ ఎన్నికల సమయంలో డీసీ తండా సర్పంచ్ పదవి రొటేషన్‌లో బీసీలకు వచ్చింది. నలుగురే ఓటర్లున్న వర్గానికి రిజర్వేషన్ రావడంతో గిరిజనులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. దాంతో ఎవరూ నామినేషన్ వేయక, సర్పంచ్ ఎన్నిక జరగలేదు. వార్డు సభ్యులలో ఒకరు ఉప సర్పంచ్ అయ్యారు. ఆయనే ఇన్చార్జి సర్పంచ్‌గా వ్యవహరిస్తున్నారు. రాంధన్ తండా.. వర్ధన్నపేట మండలంలోని మరో గ్రామ పంచాయతీ. ఒక్క కుటుంబం మినహా అంతా లంబాడీ తెగవారే. కానీ 2013 ఎన్నికలప్పుడు రిజర్వేషన్ రొటేషన్‌లో సర్పంచ్ పదవి బీసీలకు కేటాయించారు. ఉన్న ఒక్క కుటుంబంలోని వారే సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. -
రాజకీయ జూదంగా కోటాల ఆట
రిజర్వేషన్లను ఎన్నికల పావులుగా మార్చిన పార్టీలు, ప్రభుత్వాలు రాజ్యాంగ, న్యాయపరమైన పరిమితులను గుర్తించకుండా ఎడాపెడా వాగ్దానాలు చేస్తున్నాయి. సుప్రీంకోర్టు నిర్దేశాలకు అతీతంగా ఉండేలా కొత్త కోటాలను 9వ షెడ్యూలులో చేర్చడం అతి సునాయాసం అన్నట్టుగా చెబుతున్నాయి. ఆ దారిన సాధించిన కోటాలు సైతం న్యాయ పరిశీలనకు అతీతమైనవి కావని తెలిసి కూడా ప్రజలను మభ్యపెడుతున్నాయి. ఈ నేపథ్యం నుంచి చూస్తేనే వివిధ సామాజిక వర్గాల ఆశలను, ఆకాంక్షలనూ, వాటిని రాజకీయ పెట్టుబడిగా చేసుకుని సాగే రాజకీయ క్రీడనూ వేరు చేసి చూడగలుగుతాం. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల వంటి సున్నితమైన అంశంపై వివిధ రాజకీయపక్షాల వైఖరి ఆందోళనకరమైనదిగా మారుతోంది. రిజర్వేషన్ల కోసం వివిధ సామాజిక వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ల అమలులోని సాధ్యాసాధ్యాలను విస్మరించి, రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చే ధోరణి ప్రబలుతోంది. సామాజిక ఉద్రిక్తతలకు దారితీయగల సున్నిత సామా జిక అంశమైన రిజర్వేషన్లను బాధ్యతారహితమైన ఎన్నికల వాగ్దానంగా పలు రాజకీయ పార్టీలు దిగజారుస్తున్నాయి. కొత్తగా ఏ సామాజిక వర్గానికైనా రిజ ర్వేషన్లను కల్పించాలంటే ఎదురయ్యే రాజ్యాంగపరమైన, చట్టపరమైన అడ్డం కులను, చిక్కులను రాజకీయపార్టీలు విస్మరిస్తుండటం వల్ల అది కేవలం కేంద్రం లేదా రాష్ట్రం అధికారాల పరిధిలోని అంశం మాత్రమేననే అపోహ ప్రజల్లో ప్రబలుతోంది. ఇటీవలి కాలంలో తలెత్తిన పలు రిజర్వేషన్ల ఉద్యమాలు హింసాత్మకంగా మారి సామాజిక అశాంతికి దారితీయడంలో ప్రభు త్వాలు, పార్టీల బాధ్యతారహితమైన చర్యల, వాగ్దానాల పాత్ర తక్కువేమీ కాదు. వివిధ సామాజిక వర్గాలకు ఇచ్చే మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాట కూడదని సుప్రీం కోర్టు పదేపదే చెబుతోంది. అయినా అంతకు మించిన కోటా అమలు సాధ్యమనే రీతిలో ప్రభుత్వాలు, పార్టీలు వ్యవహరిస్తున్నాయి. రాజ్యాంగ, న్యాయపరమైన పరిమితులను గుర్తించకుండా రిజర్వేషన్లను కల్పి స్తామని ఎడాపెడా వాగ్దానాలు చేస్తున్నాయి. సుప్రీం కోర్టు నిర్దేశాలకు అతీ తంగా కోటాలను పెంచడానికి వీలుగా వాటిని 9వ షెడ్యూలులో చేర్చడం అతి సులువనే రీతిలో మాట్లాడుతున్నాయి. ఈ దారిన కల్పించిన కోటాలు సైతం న్యాయ పరిశీలనకు అతీతమైనవి కావని సుప్రీం కోర్టు హెచ్చరించింది. అది తెలిసి కూడా అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తూ రిజర్వేషన్లను కోరే పలు∙సామాజిక వర్గాల ప్రజలను మభ్యపెడుతున్నాయి. ఈ నేపథ్యం నుంచి చూస్తేనే సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన, వెనుకబడ్డామని భావిస్తున్న వివిధ సామాజిక వర్గాల ఆశలను, ఆకాంక్షలనూ, వాటిని రాజకీయ పెట్టు బడిగా చేసుకుని సాగే రాజకీయ క్రీడనూ వేరు చేసి చూడగలుగుతాం. అప్పుడే గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా ముందుకు వచ్చిన, వస్తున్న రిజర్వేషన్ల ఉద్య మాలను సక్రమంగా అర్థం చేసుకోగలుగుతాం. ఉదాహరణకు, 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజస్థాన్‌లో జాట్లు తమను బీసీ జాబితాలో చేర్చాలంటూ ప్రారంభించిన ఉద్యమం హరియా ణాకు విస్తరించింది. ఫలితంగా ఆ ప్రభుత్వాలు జాట్లను బీసీ జాబితాలో చేర్చాయి. కోర్టులు ఈ నిర్ణయం చెల్లదని కొట్టివేశాయి. దీంతో కేంద్రంలోని నాటి యూపీఏ సర్కారు జాట్లను బీసీ లిస్టులో చేర్చింది. అదీ చెల్లదని సుప్రీం కోర్టు 2015 మార్చి 17న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు వచ్చాక కూడా హరి యాణాలోని బీజేపీ ప్రభుత్వం 2016లో జాట్లకు బీసీ హోదాను కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. కానీ, 2016 మేలో పంజాబ్, హరియాణా హైకోర్టు కూడా సుప్రీం కోర్టు తీర్పును అనుసరిస్తూ ఈ నిర్ణయం చట్టవ్యతిరేకమని ప్రకటించింది. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ జాట్లను బీసీల్లో చేర్చడాన్ని వ్యతిరేకించిందని కూడా కోర్టు గుర్తుచేసింది. రాజస్థాన్‌లో గుజ్జర్ల కోటా అందోళన కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉండగా, రాజస్థాన్‌లో బీసీలైన గుజ్జర్లు తమను షెడ్యూల్డ్ జాతుల(ఎస్టీ–ఆదివాసీలు)జాబితాలో చేర్చాలని ఉద్యమించారు. బీసీ కులాన్ని ఎస్టీ లిస్టులో చేర్చడం కుదరదని గుజ్జర్లకు నచ్చచెప్పడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో వసుంధరారాజే ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను 21 నుంచి 26 శాతానికి పెంచి, గుజ్జర్లను బాగా వెనుకబడిన తరగతుల(ఎంబీసీ) గ్రూపులో చేర్చింది. గుజ్జర్లకు ప్రత్యేకించి ఐదు శాతం కోటా కల్పిస్తూ చేసిన ఈ చట్టం ఫలితంగా ఆ రాష్ట్రంలోని మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటిపోయాయి. ఆ కారణంగా ఆ చట్టం అమలుపై రాజస్థాన్ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా స్టే విధించాయి. రిజర్వేషన్లకు సంబంధించిన ఓ కేసులో 1993 నవంబర్‌లో నాటికే సుప్రీం కోర్టు ఎక్కడైనా మొత్తం కోటా 50 శాతానికి మించకూడదని తీర్పు ఇచ్చింది. మహారాష్ట్రలో మరాఠాలకు కోటా సాధ్యమా? మహారాష్ట్రలో దాదాపు నాలుగోవంతు జనాభాగా ఉన్న మరాఠాలు (ఆ రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో అధికులు ఆ వర్గం వారే) 2014 పార్లమెంటు ఎన్నికల ముందు తమను బీసీలుగా పరిగణించి రిజర్వేషన్లను కల్పించాలని ఉద్యమిం చారు. 2009 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 2008లో అప్పటి కాంగ్రెస్ సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, ఎన్సీపీ నేత శరద్ పవార్లు ఈ డిమాం డ్కు లోపాయికారి మద్దతు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచి నాలుగేళ్లపాటూ ఈ సమస్యను అవి సాగదీశాయి. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు మరాఠాలను బీసీల జాబితాలో చేర్చి, వారికి 16 శాతం కోటాను కల్పిస్తూ ఆర్డినెన్స్‌ను జారీ చేశారు. దాని అమలును నిలిపివేసి, బొంబాయి హైకోర్టు విచారణ చేపట్టింది. మొత్తం కోటా 50 శాతం దాటిందనీ, మరాఠాలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిలేరని కోర్టు తేల్చింది. గుజరాతీ ప్రధాని పాలనలో పాటీదార్ల ఆందోళన! గుజరాత్లో 2015 జులైలో 22 ఏళ్ల యువకుడు హార్దిక్‌పటేల్ నాయకత్వాన పాటీదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) ఆధ్వర్యంలో కోటా ఆందోళన మొదలైంది. జనాభాలో 12 శాతంగా ఉన్న పటేళ్లు దాదాపు అన్ని రంగా ల్లోనూ ముందున్న సామాజికవర్గం. వారు కూడా తమను బీసీ జాబితాలో చేర్చాలనీ, లేకుంటే అన్ని కోటాలు రద్దుచేయాలని వీధుల్లోకి వచ్చారు. పోలీసు కాల్పుల్లో 12 మంది పాటీదార్లు ప్రాణాలు కోల్పోయారు. కిందటేడాది ఏప్రిల్ 30న పాటీదార్లకు కోటా కల్పించే లక్ష్యంతో ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన కులాలకు(ఈబీసీ) పది శాతం రిజర్వేషన్ కల్పించింది. కానీ కోటా మొత్తం 50 శాతం దాటిందని గుజరాత్ హైకోర్టు ఈ కొత్త రిజర్వేషన్‌ను కొట్టివేసింది. డిసెంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యమని ప్రకటించిన పాస్ నేతలు కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. పటేళ్ల కోటా సాధ్యాసాధ్యాలపై పూర్తి అవగాహన ఉన్నాగాని, కాంగ్రెస్ ఈ వివాదాన్ని ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని వేసిన ఎత్తుగడ ఫలించినట్టు కనిపిస్తోంది. పాస్ ప్రతినిధివర్గంతో కేంద్ర మాజీ మంత్రి కపిల్సిబ్బల్ జరిపిన చర్చలతో కాంగ్రెస్ పాటీదార్ల నేతల మద్దతును సంపాదించింది. తాము అధికారంలోకి వస్తే 31 సీ అధికరణ సాయంతో కోర్టుల విచారణలో వీగిపోని విధంగా పటేళ్లకు బీసీ హోదా కల్పించి, రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే ఉన్న 49 శాతం రిజర్వేషన్లకు అదనంగా పాటీదార్లకు కోటా కల్పించగలమని వారిని నమ్మించగలిగారు. 9వ షెడ్యూలులో అన్ని కోటా చట్టాలనూ చేర్చడం కుదిరేనా? మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటిన చట్టాలను కోర్టుల విచారణ పరిధి నుంచి తప్పించడానికి వీలుగా వాటిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేర్పించడంలో 1994లో తమిళనాడు సీఎం జయలలిత విజయం సాధిం చారు. కేంద్రంలోని నాటి పీవీ నరసింహారావు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆమె 76వ రాజ్యాంగ సవరణను చేయించడం ద్వారా తమిళనాడు కోటా చట్టాలను 9వ షెడ్యూలులో చేర్చించారు. అప్పటి నుంచి ఏ రాష్ట్రంలోనైనా కొత్తగా కోటా కోసం, బీసీ హోదా కోసం డిమాండ్ చేసే ప్రతి సామాజికవర్గం 9వ షెడ్యూలు ప్రస్తావన తేవడం మొదలైంది. 2007లో సుప్రీంకోర్టు ఓ కేసులో ఇచ్చిన తీర్పు... 9వ షెడ్యూలులో చేర్చిన చట్టాలు సైతం కోర్టుల పరిశీలనకు అతీతం కాదనీ, 1974 ఏప్రిల్ 23 తర్వాత ఇందులో చేర్చిన చట్టాలు ప్రాథమిక హక్కులకు, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించే విధంగా ఉంటే, వాటిని చెల్లవని ప్రకటించడానికి ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. వాస్తవానికి 1951లో చేసిన తొలి రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూలు ఏర్పాటు చేసి, జమీందారీల రద్దు, భూసంస్కరణ చట్టాలను అందులో చేర్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో తెలంగాణ అసెంబ్లీ ముస్లింల రిజర్వేషన్లను 12 శాతానికి, ఎస్టీల రిజర్వేషన్లను పది శాతానికి పెంచడానికి చట్టాన్ని చేసి, కేంద్ర ఆమోదానికి పంపింది. 49 శాతానికి మించి పెరిగిన ఈ కొత్త కోటాలు అమల్లోకి రావాలంటే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి తెలంగాణ కోటా చట్టాలను 9వ షెడ్యూలులో చేర్చాల్పి ఉంటుంది. రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రపదేశ్‌లో కాపులను బీసీల్లో చేర్చి వారికి ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ 1980ల మధ్యలో మొదలైంది. చివరికి 1994 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కోట్ల విజయభాస్కరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు కాపు సామాజికవర్గం డిమాండ్‌కు సానుకూలంగా స్పందించి వారిని బీసీ జాబిలో చేర్చుతూ నిర్ణయం తీసుకుంది. దాన్ని రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. విభజనానంతర ఏపీలో కూడా మొత్తం కోటాలు దాదాపు 50 శాతం వరకూ ఉండగా, కాపులను బీసీల్లో చేర్చి ఇతర బీసీ కులాలకు నష్టంలేని రీతిలో రిజర్వేషన్లు అమలుచేస్తానని చంద్రబాబు నాయుదు నాయకత్వంలోని తెలుగుదేశం గత ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈ వాగ్దానం అమలు కోసం కాపులు ఉద్యమిం చగా, తెలుగుదేశం ప్రభుత్వం కిందటేడాది ఫిబ్రవరిలో రిటైర్డ్ జడ్జి మంజు నాథ నాయకత్వాన బీసీ కమిషన్‌ను నియమించింది. వెంటనే కాపులను బీసీల్లో చేర్చాలని ఓ పక్క మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆందోళన బాట పట్టారు. 9 నెలల్లో నివేదిక ఇవ్వాల్సిన బీసీ కమిషన్ ఇంకా ఆ పని పూర్తిచేసే స్థితికి చేరలేదు. అయినా సందర్భం వచ్చినప్పుడల్లా కాపులను బీసీల్లో చేర్చడం తథ్యమంటూ చంద్రబాబు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. బీసీ కమిషన్ ఏ కులాన్నయినా వెనుకబడిన కులమని నిర్థారించకుండా బీసీ జాబి తాలో చేర్చవద్దని, చేర్చినా చెల్లవని గతంలో కోర్టులు తీర్పులిచ్చాయి. అయినా మంజునాథ కమిషన్ ఓ నిర్ధారణకు రాకుండానే పాలకపక్షం కాపులకు కోటా వచ్చినట్టేననే విధంగా వారికి హామీలిస్తోంది. రిజర్వేషన్లను ఎన్ని కల పావులుగా మార్చిన పార్టీలు, ప్రభుత్వాలు ఇలా అసత్యాలు, అర్థస త్యాలతో వివిధ సామాజికవర్గాల ఆకాంక్షలతో ఆటలాడక తప్పదు. పలు రాష్ట్రాల్లో బీసీ హోదా కోసం అనేక సామాజిక వర్గాలు డిమాండ్ చేస్తుండగా, వారి డిమాండ్లలో ఇమిడి ఉన్న రాజ్యాంగ, చట్టపరమైన అంశాలు వివరించడానికి రాజకీయ పక్షాలు ప్రయత్నించడం లేదు. ఏ కులం ఏమడిగినావెంటనే ఇస్తామని చెబుతూ సర్కార్లు ప్రజల ఉద్వేగాలతో, ఆకాంక్షలతో చెలగాటమాడుతుండటం ప్రమాదకరం. నాంచారయ్య మెరుగుమాల, సీనియర్ పాత్రికేయులు -
పోరాడైనా సాధిస్తాం..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కోసం చేసిన ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రంలో మైనారిటీ రిజర్వేషన్లను సాధిస్తానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఉద్యమాలు చేసి విజయం సాధించటం తనకు కొత్తకాదన్నారు. ఎస్టీల రిజర్వేషన్లు కూడా 15–16 శాతానికి పెంచుతామని.. తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్లు అమలు చేయడమే దీనికి పరిష్కార మార్గమని పేర్కొన్నారు. ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని.. కేంద్రం సహకరించకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ఈ అంశంపై అన్ని పార్టీలను వెంటపెట్టుకుని ఢిల్లీ వెళ్తామన్నారు. పార్లమెంటు శీతాకాల సమా వేశాల్లో తమ ఎంపీలు భీకర పోరాటం చేస్తారని పేర్కొన్నారు. గురువారం శాసనసభలో మైనార్టీ సంక్షేమంపై జరిగిన లఘుచర్చకు సీఎం సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. సమగ్ర డేటాతో ముందుకెళుతున్నాం.. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లపై తాము ఆషామాషీగా వ్యవహరించడం లేదని, సమగ్ర డేటా తీసుకుని ముందుకెళుతున్నామని కేసీఆర్ చెప్పారు. దీనిపై ప్రధానితో మాట్లాడానని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఒకవేళ కేంద్రం ఒప్పుకోకపోతే సుప్రీంకోర్టులో తేల్చుకుంటామన్నారు. ముస్లింలలో ఉన్నవాళ్లంతా పేదవాళ్లు కాదని.. వారిలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో మైనార్టీలకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, 4 శాతమే అమలు చేశారని... మిగతా ఒక్క శాతం ఏమయిందని, ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ దశాబ్దాల పాలన వల్లే ముస్లిం రిజర్వేషన్ల అవసరం వచ్చిందని, వారు నిజమైన స్ఫూర్తితో పనిచేసి ఉంటే ఈ అవసరం ఉండేది కాదని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు పదేళ్ల కాంగ్రెస్ పాలనలో మైనార్టీలకు ఖర్చుపెట్టింది రూ.932 కోట్లు మాత్రమేనని... తాము రాష్ట్రం ఏర్పాటైన మూడున్నరేళ్లలో రూ.2,146 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో న్యాయపరమైన చిక్కులున్నాయని, ఈ అంశం సుప్రీంతీర్పుకు లోబడి ఉందని తాను ఎప్పటినుంచో చెబుతున్నానని పేర్కొన్నారు. పదో షెడ్యూల్ పంచాయతీ తెగకనే.. రాష్ట్ర విభజన తర్వాత పదో షెడ్యూల్‌పై ఉన్న పంచాయతీ తెగకనే కొన్ని మైనార్టీ సంస్థలను తాము ఏర్పాటు చేయలేకపోయామని సీఎం కేసీఆర్ చెప్పారు. ‘‘ఆస్తుల పంపకానికి వచ్చినప్పుడు ఫసీ ఉర్దూలో ఉన్న లక్షల డాక్యుమెంట్లలో కూడా ఆంధ్ర వాటా కావాలంటోంది. వాళ్లకు ఉర్దూనే చదవడం రాదు. ఆ డాక్యుమెంట్లు ఎందుకని మేమంటున్నం. అలాంటి సమస్యలు పరిష్కారం కాగానే ఈ సంస్థలను ఏర్పాటు చేస్తాం..’’అని చెప్పారు. హజ్ కమిటీ లేకపోయినా తెలంగాణలో అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ బాగా పనిచేసి, హజ్ యాత్రికులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసిందని కేంద్ర మంత్రి ఒకరు పార్లమెంటులో ప్రశంసించారని గుర్తు చేశారు. రవీందర్‌సింగ్ అనే ఓ సిక్కు మతస్తుడిని ఒక కార్పొరేషన్ మేయర్‌గా నియమించిన ఘనత రాష్ట్ర చరిత్రలో తమకే దక్కిందన్నారు. వక్ఫ్ భూముల లెక్క తేలుస్తాం తన పరిధిలోని భూములు ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఉన్నాయో చెప్పే స్థితిలో వక్ఫ్ బోర్డు లేదని.. సమైక్య పాలకులు దాన్ని అంతగా నిర్వీర్యం చేశారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో మొత్తం రికార్డులు సీజ్ చేయాలని అధికారులను ఆదేశించామని.. వక్ఫ్ బోర్డును బాగు చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీ వేస్తున్నామని తెలిపారు. సమగ్ర భూసర్వేలో వక్ఫ్ భూముల బాగోతం కూడా బయటకొస్తుందన్నారు. దళిత క్రైస్తవుల అంశం కేంద్ర చట్టం పరిధిలో ఉంటుందని, దానిపై కూడా తాను ప్రధానితో మాట్లాడానని.. ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తామని తెలిపారు. కావాలనే ఐదో తరగతి నుంచి ‘రెసిడెన్షియల్’ ఐదో తరగతి నుంచే రెసిడెన్షియల్ పాఠశాలల విధానం కల్పించటంపై కాంగ్రెస్ అనవసర విమర్శలు చేస్తోందని.. నిపుణులతో చర్చించాకే ఆ నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఐదో తరగతికి వచ్చేసరికి పిల్లలు ఎనిమిదేళ్ల వయసు దాటి హోమ్‌సిక్ నుంచి బయటపడతారని.. రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్చితే ఇబ్బంది లేకుండా చదువుకుంటారన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ముస్లింలపై సీఎం వరాల వర్షం శాసనసభ వేదికగా సీఎం కేసీఆర్ ముస్లిం మైనారిటీలపై వరాల వర్షం కురిపించారు. వ్యక్తిగత రుణాలు మొదలుకుని అన్ని విభాగాల్లో ఉర్దూ ప్రతినిధులుగా ముస్లింల నియామకం వరకు వరుసపెట్టి హామీలు ఇచ్చారు. మజ్లిస్ సభ్యుడు అక్బరుద్దీన్ విన్నపాల మేరకు కొన్ని అంశాలను ప్రకటిస్తున్నట్లు చెప్పారు. సీఎం ఇచ్చిన హామీలు.. – చట్టపరిధిలో ఉన్న రిజర్వేషన్ వంటి అంశాలు మినహా అన్ని సంక్షేమ పథకాల్లో ఎస్సీ, ఎస్టీలు పొందుతున్న స్థాయిలో ముస్లింలకు ప్రయోజనం – బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా స్వయం ఉపాధి యూనిట్లకు ప్రభుత్వమే నేరుగా రుణాలు ఇస్తుంది. రూ.లక్ష, రూ.లక్షన్నర, రూ.రెండు లక్షలు, రూ.రెండున్నర లక్షలు.. ఇలా యూనిట్లను గరిష్ట సంఖ్యలో అందిస్తాం. – పరాధీనమైన వక్ఫ్ బోర్డు స్థలాలను తిరిగి స్వాధీనం చేస్తాం. వక్ఫ్ బోర్డును పరిపుష్టం చేస్తాం. – 1.76 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హజ్ హౌజ్ భవనాన్ని సంపూర్ణంగా నిర్మిస్తాం. ముస్లింలతో ముడిపడి ఉన్న ప్రభుత్వ విభాగాలన్నింటిని అందులోకి తరలిస్తాం. – షాదీ ముబారక్ పథకంలో ధ్రువీకరణ కోసం ఓటర్ ఐడీ, ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్సు వంటివాటిల్లో ఏదో ఒకటి దాఖలు చేసినా చాలు. – ఉర్దూ పాఠశాలల్లో త్వరలోనే 900 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తం. – ఉర్దూ అకాడమీని పటిష్టం చేసేందుకు 66 పోస్టులు కేటాయిస్తున్నాం. అందులోంచి ఇద్దరు ముఖ్యమంత్రి కార్యాలయంలో, ఒకరు చొప్పున స్పీకర్, మండలి చైర్మన్ కార్యాలయాల్లో, నలుగురు జీఏడీలో, ప్రతి మంత్రి కార్యాలయంలో ఒకరు చొప్పున, ప్రతి కలెక్టర్ కార్యాలయంలో ఒకరు చొప్పున, అసెంబ్లీ, కౌన్సిల్లలో ఇద్దరేసి చొప్పున, ఐ అండ్ పీఆర్ కార్యాలయంలో ఒకరు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, నగర పోలీసు కమిషనర్ కార్యాలయాల్లో ఒక్కొక్కరు చొప్పున ‘ఉర్దూ’ప్రతినిధులుగా నియమిస్తం. – ఉర్దూ మాధ్యమం డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సులు ప్రారంభిస్తం. – ‘నీట్’పరీక్షను ఉర్దూలోనూ రాసే అవకాశం కల్పించాలని ప్రధానిని కోరాం. టీఎస్పీఎస్సీ, విద్యుత్, సింగరేణి, ఆర్టీసీ సహా అన్ని నియామక, పోటీ పరీక్షలను ఉర్దూలో రాసే అవకాశం కల్పిస్తున్నం. – ఫలక్‌నుమా, చంచల్గూడల్లోని ఉర్దూ కళాశాలలకు సొంతంగా కొత్త భవనాలు నిర్మిస్తాం. – తెలంగాణ రాష్ట్రం యూనిట్‌గా అన్ని ప్రాంతాల్లో ఇక నుంచి ఉర్దూ రెండో అధికార భాషగా అమలవుతుంది. – మహారాష్ట్రలో ముస్లింల అభ్యున్నతికి అనుసరిస్తున్న ప్రత్యేక విధానాలను తెలంగాణలోనూ అమలు చేసే అంశంపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో బృందం అధ్యయనం చేస్తుంది. – పహడీషరీఫ్ దర్గా అభివృద్ధికి రూ.9.5 కోట్లు విడుదల చేస్తున్నం, జహంగీర్‌పీర్ దర్గా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను స్వయంగా పరిశీలించి ప్రకటిస్తా. ఇక మౌలాలి దర్గాకు దారి నిర్మిస్తాం. – అజ్మీర్ దర్గా వద్ద తెలంగాణ తరఫున రుబాత్ నిర్మిస్తాం. అక్కడి ప్రభుత్వం ఇప్పటికే రెండెకరాల భూమి ఇచ్చింది. – ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ కాలేజీల తరహాలో ముస్లిం యువతులకు రెసిడెన్షియల్ కళాశాలలు నిర్మిస్తం. – దేవాలయాల్లో అర్చకులకు వేతన క్రమబద్ధీకరణ జరుగుతున్న తరహాలో మసీదుల్లోని ఇమాంల వేతనాలను సవరిస్తాం. -
ట్రాన్స్జెండర్ల కోసం ‘టీ’ ఆప్షన్
న్యూఢిల్లీ: టికెట్ రిజర్వేషన్ల ఫారంలో ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా ‘టీ’ ఆప్షన్‌ను రైల్వే బోర్డు అందుబాటులోకి తేనుంది. ఇందుకోసం రిజర్వేషన్ ఫారాల్లో సవరణలు చేసి ‘ఎం’ (పురుషులు), ‘ఎఫ్’ (స్త్రీలు)తోపాటు ‘టీ’ (ట్రాన్స్‌జెండర్) ఆప్షన్‌ను చేర్చనుంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అన్ని జోన్లకు రైల్వే బోర్డు లేఖ రాసింది. టికెట్ బుకింగ్, రద్దు ఫారాల్లో ట్రాన్స్‌జెండర్ ఆప్షన్‌ను పొందుపరచాలంది. అంతేగాకుండా సంబంధిత సాఫ్ట్‌వేర్‌లో కూడా మార్పులు చేయాలని ఆదేశించింది. అన్ని దరఖాస్తుల్లో ‘థర్డ్ జెండర్’ ఆప్షన్‌ను ఏర్పాటు చేయాలని 2014లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం పాస్‌పోర్టు, రేషన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, బ్యాంకు ఫారాల్లో ‘టీజీ’ (థర్డ్ జెండర్), ‘టీ’ (ట్రాన్స్‌జెండర్) ఆప్షన్లను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. -
గది ముందస్తు రద్దుతో పూర్తి నగదు వాపస్
శ్రీవారి భక్తులకు వెసులుబాటు.. 3వ తేదీ నుంచి అమలు సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఆన్లైన్ ద్వారా ముందస్తుగా గది రిజర్వు చేసుకుని, తిరిగి రద్దు చేసుకుంటే వందశాతం నగదు వాపసు ఇవ్వనున్నారు. ఈ నూతన విధానం జూలై మూడో తేదీ నుంచి అమల్లోకి రానుంది. గది రిజర్వు చేసుకున్న తేదీకి 2 రోజుల (48 గంటలు) ముందు రద్దుచేసుకుంటేనే పూర్తి నగదు భక్తుడి బ్యాంకు ఖాతాకు వాపసు కానుంది. బుక్ చేసుకున్న గదిని రద్దు చేయకున్నా, వినియోగించకపోయినా చెల్లింపులు ఉండవు. ఇక ఆన్లైన్ ద్వారా రిజర్వు చేసుకుని గదిని పొంది, గడువుకు ముందు.. 12 గంటల్లోపు 50%, 18 గంటల్లోపు 25% నగదు సంబంధిత భక్తుల బ్యాంక్ ఖాతాల్లో ఏడు రోజుల్లోపు తిరిగి జమ చేస్తున్నారు.