గది ముందస్తు రద్దుతో పూర్తి నగదు వాపస్
శ్రీవారి భక్తులకు వెసులుబాటు.. 3వ తేదీ నుంచి అమలు
సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఆన్‌లైన్ ద్వారా ముందస్తుగా గది రిజర్వు చేసుకుని, తిరిగి రద్దు చేసుకుంటే వందశాతం నగదు వాపసు ఇవ్వనున్నారు. ఈ నూతన విధానం జూలై మూడో తేదీ నుంచి అమల్లోకి రానుంది. గది రిజర్వు చేసుకున్న తేదీకి 2 రోజుల (48 గంటలు) ముందు రద్దుచేసుకుంటేనే పూర్తి నగదు భక్తుడి బ్యాంకు ఖాతాకు వాపసు కానుంది. బుక్ చేసుకున్న గదిని రద్దు చేయకున్నా, వినియోగించకపోయినా చెల్లింపులు ఉండవు. ఇక ఆన్‌లైన్ ద్వారా రిజర్వు చేసుకుని గదిని పొంది, గడువుకు ముందు.. 12 గంటల్లోపు 50%, 18 గంటల్లోపు 25% నగదు సంబంధిత భక్తుల బ్యాంక్ ఖాతాల్లో ఏడు రోజుల్లోపు తిరిగి జమ చేస్తున్నారు.