rooms
-
బ్రాండెడ్ హోటల్స్‌కు భలే డిమాండ్
బ్రాండెడ్ హోటల్స్‌లో విడిది చేసేందుకు వినియోగదారులు మొగ్గు చూపిస్తున్నారు. డిమాండ్ బలంగా ఉండడంతో బ్రాండెడ్ హోటల్స్(Hotels) పరిశ్రమ ఆదాయం క్రితం ఆర్థిక సంవత్సరం కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 11–12 శాతం మేర అధికంగా నమోదవుతుందని క్రిసిల్(Crisil) రేటింగ్స్ నివేదిక తెలిపింది. దేశీయంగా విహార, వ్యాపార ప్రయాణాలు ప్రధానంగా బ్రాండెడ్ హోటళ్ల డిమాండ్‌ను పెంచుతున్నాయని, ఇక ఎంఐసీ విభాగంలో (సమావేశాలు, సదస్సులు, ప్రదర్శనలు) వృద్ధి, విదేశీ పర్యాటకుల సందర్శనలు పుంజుకోవడం పరిశ్రమ ఆదాయానికి మద్దతునివ్వనున్నట్టు వివరించింది.బ్రాండెడ్ హోటల్స్ ఆదాయం గత ఆర్థిక సంవత్సరం సైతం 17 శాతం మేర వృద్ధిని నమోదు చేయడాన్ని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక ప్రస్తావించింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా గత ఆర్థిక సంవత్సరం నుంచి హోటళ్లలో రూమ్‌ల పెరుగుదల వేగాన్ని అందుకున్నట్టు తెలిపింది. అస్సెట్ లైట్ (సొంతంగా కాకుండా లీజు విధానంలో) నమూనాలో ఇక ముందూ కొత్త గదుల చేరిక వేగాన్ని అందుకుంటుందని అంచనా వేసింది. దీంతో ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద కొత్త గదుల లభ్యత 20 శాతం మించుతుందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8–9 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరాలో 11–12 శాతం మేర కొత్త గదులు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. బ్రాండెడ్ హోటళ్ల నిర్వహణ మార్జిన్ 100–150 బేసిస్ పాయింట్లు మేర ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో మెరుగుపడుతుందని అంచనా వేసింది. బలమైన నగదు ప్రవాహాలు, అస్సెట్ లైట్ నమూనాలో విస్తరణ, తగినంత మూలధనం సమీకరణతో బ్రాండెడ్ హోటళ్ల రుణ భారం నియంత్రిత స్థాయిలోనే కొనసాగుతుందని పేర్కొంది. ఇది ఆయా హోటళ్ల రుణ పరపతిని బలోపేతం చేస్తుందని తెలిపింది.రూమ్ రేట్లు అప్ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్రాండెడ్ హోటళ్ల సగటు రూమ్ రేట్లు (ARR) 6–7 శాతం మేర పెరుగుతాయని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. కాకపోతే వచ్చే ఏడాది 3–4 శాతం పెరుగుదలకు పరిమితం అవుతుందని పేర్కొంది. పెద్ద సంఖ్యలో అదనపు గదులు అందుబాటులోకి రావడం ఇందుకు కారణంగా తెలిపింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13–14 శాతం మేర, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 11–12 శాతం చొప్పున ఆదాయంలో వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. విహార, వ్యాపార పర్యటనల్లో ఏడు ప్రధాన నగరాలు 25 శాతం వాటా ఆక్రమిస్తాయని.. మిగిలిన మేర ఆధ్యాత్మిక పర్యాటక రూపంలో ఉంటుందని తెలిపింది.ఇదీ చదవండి: నెలరోజుల్లో 13.41 లక్షల మందికి ఉపాధిఆక్యుపెన్సీ ఎలా ఉంటుందంటే..‘నాన్ మెట్రో(Non Metro) నగరాల్లో, విహార గమ్యస్థానాల్లో హోటల్ పరిశ్రమ కార్యకలాపాలు ఎక్కువగా విస్తరణకు నోచుకుంటున్నాయి. దీంతో కొత్త గదుల చేరికలో 60–65 శాతం మేర ఇక్కడే ఉండనుంది. అది కూడా అస్సెట్ లైట్ నమూనాలో కావడంతో, పెద్ద ఎత్తున పెట్టుబడుల అవసరం కూడా ఉండదు’ అని క్రిసిల్ రేటింగ్స్ అసోసియేట్ డైరెక్టర్ పల్లవి సింఘ్ తెలిపారు. పెద్ద మొత్తంలో కొత్త గదులు అందుబాటులోకి వస్తున్నప్పటికీ, అదే సమయంలో ఆక్యుపెన్సీ (రూముల వినియోగం) వచ్చే ఆర్థిక సంవత్సరంలో 74–75 శాతం స్థాయిలో ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. అది ఈ ఏడాది కంటే 1–1.5% తక్కువగా ఉంటుందని పేర్కొంది. వ్యయాలను సమర్థవంతంగా నియంత్రించడం, టెక్నాలజీ, మానవ వనరుల మెరుగైన వినియోగం, అస్సెట్ లైట్ విధానం ఫలితంగా పరిశ్రమ ఎబిటా మార్జిన్ 1–1.5% పెరిగి 2024–25లో 33–34 శాతానికి చేరవచ్చన్నది క్రిసిల్ అంచనా. -
ఎయిరిండియా సిబ్బందికి షేరింగ్ రూమ్
ఎయిరిండియా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో పనిచేసే సిబ్బందికి సంబంధించిన నియమాల్లో మార్పులు చేస్తున్నట్లు కొందరు అధికారులు తెలిపారు. లేఓవర్ల(విమాన ప్రయాణంలో విశ్రాంతి తీసుకోవడం) సమయంలో సిబ్బంది పరస్పరం గదులను పంచుకునేలా నిబంధనలు తీసుకురాబోతున్నట్లు చెప్పారు. దాంతోపాటు అంతర్జాతీయ విమానాల క్యాబిన్ సిబ్బందికి అలవెన్సులు పెంచే అవకాశం ఉందని పేర్కొన్నారు.మీడియా కథనాల ప్రకారం..విమాన ప్రయాణంలో సిబ్బంది విశ్రాంతికి ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేయబోతున్నారు. వీటిని ఇతర సిబ్బందితో పంచుకోవాల్సి ఉంటుంది. ఎయిరిండియా ఆధ్వర్యంలో ఉన్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, విస్తారాలో క్యాబిన్ సిబ్బందికి రూమ్ షేరింగ్ సౌలభ్యం ఇప్పటికే ఉంది. అయితే ఎయిరిండియా ఎయిర్‌క్రాఫ్ట్‌ల్లో వీటిని ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి.ఇదీ చదవండి: ఇజ్రాయెల్-ఇరాన్ దాడి.. పలు విమానాలు రద్దుఅధికారులు తెలిపిన వివరాల ప్రకారం..అంతర్జాతీయ విమానాల క్యాబిన్ సిబ్బందికి అలవెన్సులు పెంచుతున్నారు. 75-125 డాలర్ల నుంచి 85-135 డాలర్లకు పెంచబోతున్నారు. ఇటీవల ఏఐఎక్స్ కనెక్ట్ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో విలీనం అయిన విషయం తెలిసిందే. అయితే సవరించిన నియమాలు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు మాత్రం వర్తించవు. రాత్రిపూట విధులు నిర్వర్తించే దేశీయ విమానాల క్యాబిన్ సిబ్బంది రూ.1,000 అలవెన్స్ కోరేందుకు అర్హత పొందేలా నిబంధనల్లో సవరణలు చేయనున్నారు. విమానంలో మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్‌లు మినహాయించి క్యాబిన్ సిబ్బంది లేఓవర్ల సమయంలో గదులను పంచుకోవాల్సి ఉంటుందని ఒక సీనియర్ అధికారి పేర్కొన్నారు. -
రాష్ట్రపతి భవనంలో గదులెన్ని? లోపల ఏ విద్యాలయం ఉంది?
ఢిల్లీలోని రాష్ట్రపతి భవనానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ భవనం దాదాపు లక్ష చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీని నిర్మాణం 1912లో ప్రారంభమై, 1929లో పూర్తయింది. ప్రముఖ వాస్తుశిల్పి ఎడ్విన్ లుటియన్స్ ఈ భవనానికి రూపకల్పన చేశారు.రాష్ట్రపతి భవనంలో 340 గదులు ఉన్నాయి. ఈ గదులలో హిమాలయ బెడ్రూమ్ అద్భుతమైన లగ్జరీ బెడ్రూమ్గా గుర్తింపు పొందింది. లోపల ఒక పాఠశాల కూడా ఉంది. దీనిని తొలుత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సర్వోదయ విద్యాలయ అని పిలిచేవారు. ఇది 1946లో నిర్మితమయ్యింది. 1962లో కేంద్ర ప్రభుత్వం ఈ పాఠశాలను ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోకి తెచ్చింది.2019లో ఢిల్లీ ప్రభుత్వం దీనిని కేంద్రీయ విద్యాలయంగా మార్చింది. నాటి నుండి దీనిని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయం అని పిలుస్తున్నారు. మిగిలిన కేంద్రీయ విద్యాలయాల మాదిరిగానే రాష్ట్రపతి భవనంలోని కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశానికి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. -
రైల్వే స్టేషన్స్ లో అతి తక్కువ ధరలో రిటైరింగ్ రూమ్స్...ఎలా బుక్ చేసుకోవాలంటే..?
-
ఇంత తక్కువ ధరకు రైల్వే స్టేషన్లో రూమ్ లభిస్తుందని తెలుసా!
IRCTC Retiring Rooms: ఇండియన్ రైల్వే మన దేశంలో ప్రతి రోజు కొన్ని లక్షల మందిని తమ గమ్యస్థానాలకు చేరుస్తుంది. ప్రయాణికుల వల్ల మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతున్న రైల్వే శాఖ ఆధునిక సౌకర్యాలను అందిస్తోంది. సంస్థ అందించే చాలా సౌకర్యాలను గురించి బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. మనం ఈ కథనంలో అతి తక్కువ ధరకే హోటల్ రూమ్ లాంటి గదులను ఎలా బుక్ చేసుకోవాలనే వివరాలను తెలుసుకుందాం. నిజానికి రైలు ప్రయాణం చేసేవారు స్టేషన్లో ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చినప్పుడు కొంత మంది ప్లాట్‌ఫామ్ మీదనే ఉండిపోతారు. కొంత మంది సమీపంలో ఉన్న హోటల్ రూమ్స్ కోసం వెళతారు. కానీ రైల్వే స్టేషన్లలోనే అలాంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. తక్కువ ఖర్చుతోనే రూమ్ బుక్ చేసుకోవచ్చు. వాటిని రిటైరింగ్ రూమ్స్ అంటారు. రైల్వే స్టేషన్లలో ఏసీ, నాన్ ఏసీ గదులు (సింగిల్, డబుల్ బెడ్) అందుబాటులో ఉంటాయి. డిమాండ్‌ను బట్టి ధరలు రూ. 100 నుంచి రూ. 700 వరకు ఉంటాయి. చాలా వరకు కేవలం వందకే రూమ్స్ బుక్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ రూమ్స్ బుక్ చేసుకోవాలనుకునే వారికి తప్పకుండా టికెట్ కన్ఫర్మ్ అయి ఉండాలి. లేకుంటే రూమ్ బుక్ చేసుకునే అవకాశం ఉండదు. ఈ సదుపాయం పెద్ద పెద్ద స్టేషన్లలో అందుబాటులో ఉంటాయి. రిటైరింగ్ రూమ్ ఇలా బుక్ చేసుకోండి.. టికెట్ కన్ఫర్మ్ అయిన ప్యాసింజర్లు ముందుగా ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. ఆ తరువాత మై బుకింగ్స్ ఆప్షన్స్‌లోకి వెళ్ళాలి, టికెట్ బుకింగ్ కింద రిటైరింగ్ రూమ్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే రూమ్ బుక్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్లో మీ టికెట్ పీఎన్ఆర్ నెంబర్ ద్వారా సర్చ్ చేసుకోవాలి. మీరు ఏ స్టేషన్లో ఉండాలనుకుంటున్నారు అనేది ఎంచుకోవాలి. అక్కడ మీ పర్సనల్ ఇన్ఫర్మషన్, జర్నీ టైమ్ వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. చెక్ ఇన్, చెక్ అవుట్, బెడ్ టైప్, ఏసీ, నాన్ ఏసీ వంటివి ఎంపిక చేసుకుని, ఖాళీ ఎక్కడ ఉందో చూసుకుని బుక్ చేసుకోవాలి. రూమ్ నెంబర్, ఐడీ కార్డు టైప్ వంటి వాటిని సెలక్ట్ చేసుకున్న తరువాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసుకున్న తరువాత రూమ్ బుకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. (ఇదీ చదవండి: బంగారు బుల్లెట్.. అందరి కళ్లు దానిపైనే! సోషల్ మీడియాలో వీడియో వైరల్) ఐఆర్సీటీసీ రిటైరింగ్ రూమ్స్ చార్జెస్ & రద్దు చేసుకునే విధానం ఐఆర్సీటీసీ సర్వీస్ ఛార్జ్ రిటైరింగ్ రూమ్‌కు 24 గంటల వరకు రూ.20, డార్మిటరీ బెడ్‌కు 24 గంటల వరకు రూ.10 ఉంటుంది. అదే సమయంలో రిటైరింగ్ రూమ్ 24 గంటల నుంచి 48 గంటల వరకు బుక్ చేసుకోవచ్చు. ఈ ధరలు డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయించడం జరుగుతుంది. బుక్ చేసుకున్న తరువాత 48 గంటల వరకు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఒక వేళా 48 గంటలు లేదా అంతకంటే తక్కువ వ్యవధిలో రద్దు చేసుకుంటే 10 శాతం తగ్గింపు ఉంటుంది. రూమ్ తీసుకునే రోజు రద్దు చేసుకుంటే 50 శాతం తగ్గింపు ఉంటుంది. (ఇదీ చదవండి: 750సీసీ విభాగంలో రాయల్ బండి.. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క!) గుర్తుంచుకోవలసిన విషయాలు ప్రయాణికులు రూమ్ బుక్ చేసుకుంటే రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండకూడదు. వెయిట్-లిస్ట్‌లో ఉన్నప్పుడు రూమ్‌లను బుక్ చేసుకోవడం కుదరదు. ఆన్లైన్లో బుకింగ్ చేస్తే, క్యాన్సిల్ కూడా ఆన్లైన్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఒక వేళా ట్రైన్ రద్దు అయితే, నిబంధనల ప్రకారం వినియోగదారుడు తన డబ్బు తిరిగి వాపసు పొందుతాడు. -
మానసిక ఆరోగ్యం మీ గదే మీ మది
చిందర వందరగా ఉన్న ఇల్లు చిందర వందరగా ఉన్న మనసుకు కారణం. సర్దుకున్న ఇల్లు సేదతీరిన మనసుకు సూచన. ఎలా పడితే అలా ఉండి పనికిమాలిన వస్తువులతో నిండి కుదురుగా కనిపించని ఇంట్లో నివాసం స్త్రీల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. ఎందుకంటే స్త్రీలు ఎక్కువ సమయం గడిపే చోటు ఇల్లు గనుక. స్త్రీలు తమ పరిసరాలను సర్దుకోవడం, అందంగా మార్చుకోవడం వల్ల మీ మానసిక ఆరోగ్యం బాగుంటుంది అంటున్నారు నిపుణులు. కేస్ స్టడీ 1: సురేఖ వంటగదిలో ఎప్పుడూ చిరాగ్గా కోపంగా ఉంటుంది. పిల్లలు వెళితే కసురుతూ ఉంటుంది. ఆమె వంట చేస్తున్నప్పుడు ఆ సమయానికి పనిమనిషి ఇంకా రాకపోవడం వల్ల సింక్ నిండుగా ఉంటుంది. కావలిసిన వంట పాత్రలు వెంటనే దొరకవు. సరుకుల డబ్బాలను కుదురుగా పెట్టుకోవడాన్ని సురేఖ ఏనాడూ పట్టించుకోదు. కిచెన్ ప్లాట్‌ఫామ్ నీట్‌గా ఉండదు. తను శుభ్రంగా ఉన్నా, ఇంట్లో ఇతరత్రా ఏ సమస్యలు లేకపోయినా ఆ సమయంలో బయట వాతావరణం బాగున్నా వంటగదిలో సురేఖ మానసిక స్థితి మాత్రం ప్రశాంతంగా ఉండదు. అదే ఆమె వంట గదిని సరిగ్గా సర్దుకుని ఉంటే, వంట మొదలెట్టే సమయం కంటే ముందే వచ్చి పాత్రలు శుభ్రం చేసి వెళ్లే పని మనిషిని పెట్టుకుని ఉంటే, వంట గదిలో అనవసరమైన పాత గిన్నెలు, బూజు పట్టిన గంగాళాలు వదిలించుకుని ఉంటే ఆమె ప్రతి పూట హాయిగా వంట చేసుకుని ఉండేది. కేస్ స్టడీ 2: రాజేశ్వరి ఆఫీస్ నుంచి ఇల్లు చేరుకోగానే ఆమె చిరాకు నషాళానికి ఎక్కుతుంది. అప్పటికి పిల్లలిద్దరూ స్కూళ్ల నుంచి ఇంటికి వచ్చి ఉంటారు. చిప్స్ తిని రేపర్లు సోఫాలో పడేసి ఉంటారు. టవళ్లు కుర్చీలో పడేసి ఉంటారు. యూనిఫామ్ బట్టలు ఎలాగంటే అలా పడేసి ఉంటారు. పొద్దున చదివిన న్యూస్‌పేపర్లు చిందర వందరగా ఉంటాయి. తాళం కప్ప ఒకచోట, దాని తాళం ఇంకో చోట. పుస్తకాల సంచుల్ని టీవీ స్టాండ్ దగ్గర పడేసి ఉంటారు. వచ్చిన వెంటనే ఆమెకు ఇల్లు సర్దుకునే ఓపిక ఉండదు. హాల్లో కూచుందామంటే ఈ చిందర వందర అంతా ఆమెకు హాయినివ్వదు. పిల్లలు ఎన్నిసార్లు చెప్పినా వినరు. తాను ఇంటికి వచ్చేసరికి ఇల్లు శుభ్రంగా, కుదురుగా కనిపిస్తే వచ్చి హుషారుగా పలకరిద్దామని ఉంటుంది. కాని ఆ స్థితి లేకపోవడం వల్ల రోజూ రావడంతోటే పిల్లల్ని కసరడం, దాని వల్ల తాను బాధ పడటంతో మూడ్ ఆఫ్. ఇలా రోజు జరగడం అవసరమా? కేస్ స్టడీ 3: సంధ్య వాళ్ల ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండదు. ఇంటికి వచ్చిన వాళ్లు ఈ ఇంట్లో వాళ్లకు ఇల్లు సర్దుకోవడం, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం రాదు అని ఒక్క నిమిషంలో తెలిసిపోతుంది. వాళ్లు ఎక్కువ సేపు కూచోరు. సంధ్యకు ఇల్లు సర్దుకోవాలని ఉంటుందిగాని దానికి ఏదో ముహూర్తం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఆదివారం సర్దుదామనుకుంటుంది... ఆ రోజు ఏదో పని పడుతుంది. హ్యాంగర్లకు మాసిన బట్టలు, కుర్చీల్లో ఉతికిన బట్టలు, వారం అయినా మంచాల మీద మారని దుప్పట్లు... సంధ్యకు ఏ పని చేయాలన్నా మనసు రాదు. ఐదు నిమిషాల పని పది నిమిషాలు పడుతుంటుంది. ఉండి ఉండి ఆందోళనగా అనిపిస్తుంటుంది. ఏదో ఇష్టం లేని ప్లేస్‌లో చిక్కుకుపోయినట్టుగా అనిపిస్తుంటుంది. శుభ్రమైన గదే శుభ్రమైన మదికి సాయం చేస్తుందని ఆమెకు ఎప్పటికి తెలుస్తుందో. రోడ్డు మీద వెళుతున్నప్పుడు చెత్త చెదారం కంట పడగానే మనసుకు ఒక రకమైన ఏహ్యభావం కలుగుతుంది. అలాగే మనం నివసించే ఇల్లు, గదులు కూడా చిందర వందరగా ఉంటే మనసుకు ఉల్లాసం పోతుంది. మనం నివాసం ఉండే ఇల్లుగాని, పని చేసే ఆఫీస్గాని సర్వకాల సర్వవేళల్లో శుభ్రంగా ఉండాలని ఆశించడం కుదరదు. కాని వీలున్నంత మటుకు ఎప్పటికప్పుడు సర్దుకోవడం వల్ల వస్తువుల అపసవ్యత దృష్టికి రాకుండా చూసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం బాగుంటుందని, సరైన కెమికల్స్ విడుదలయ్యి ఒక ప్రశాంతత ఉంటుందని, ఫోకస్డ్గా పని చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. కౌటుంబిక, ఆర్థిక సమస్యలు లేకపోయినా శుభ్రత లేని పరిసరాలు మీ నైపుణ్యాన్ని తగ్గిస్తాయి. మనసును చికాకు పెడతాయి. పరిసరాలు మనసును ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఇవి చేయాలి. 1. ఇల్లు మీ కార్యక్షేత్రంగా ఉందా లేదా చూసుకోవాలి. ప్రతి వస్తువుకు ఒక స్థలం ఉంటుంది. ఉండాలి. లేకపోతే కేటాయించుకోవాలి. చిన్న ఇల్లు అని వంక పెట్టవద్దు. చిన్న ఇల్లు కూడా చాలా నీట్‌గా సర్దుకోవచ్చు. 2. లాండ్రీ, గిన్నెలు, చెత్త పారేయడం... ఈ మూడు పనులు మీరు చేసుకున్నా పని మనిషి చేసినా పర్ఫెక్ట్గా ప్రతిరోజూ జరిగేలా చూసుకుంటే మనసుకు సగం ప్రశాంతత. 3. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలంటే పాతవి, అక్కర్లేనివి, కంటికి ఇబ్బంది కలిగించేవి నిర్దాక్షిణ్యంగా పారేయాలి. అతి తక్కువ వస్తువులతో జీవించాలని దీని అర్థం కాదు. మీకు అవసరమైన వస్తువులు మాత్రమే ఉంటే బాగుంటుంది. 4. ఇల్లు సర్దుకోవడానికి రోజులో కొంత సమయం కేటాయించాలి. ఇంటి సభ్యులందరూ ఏదో ఒక టైమ్‌లో ఇల్లు సర్దడానికి పది నిమిషాలు ఇవ్వాలి. నెలకోసారి సర్వ ప్రక్షాళన అనేది తప్పు భావన. కొద్ది కొద్దిగా నీట్‌గా చేసుకుంటూ రావడమే మంచిది. 5. పొందిగ్గా సర్దబడి, చక్కటి మొక్కలు ఉండి, గాలి వెలుతురు తగినంతగా వస్తూ ఉన్న ఇల్లు మీదైతే మీ మానసిక ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉండటానికి పూర్తి అవకాశం ఉంది. -
తాజ్‌మహల్‌లో మూతపడ్డ 22 గదుల్లో ఏముందంటే...
లక్నో: భారత పురావస్తు శాఖ తాజ్‌మహల్‌లో మూతపడ్డ 22 గదులకు సంబంధించి కొన్ని ఫోటోలను విడుదల చేసింది. ఈ మేరకు తాజ్‌మహల్‌ని పరిరక్షిస్తున్న ఆర్కియాలజీ సర్వే ఆప్ ఇండియా (ఏఎస్ఐ) మూతపడ్డ గదులకు సంబంధించిన మరమత్తుల ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అంతేగాదు ఇటీవలే తాజ్‌మహల్‌లో మూతపడ్డ 22 గదులు తెరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పిటిషన్ పెద్ద హాట్ టాపిక్‌గా వార్తల్లో నిలిచింది. అయితే అలహాద్ హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారించడానికి ముందే న్యూస్ లెటర్ జనవరి 2022 పేరుతో ఆర్కియాలజీ సర్కే ఆప్ ఇండియా(ఏఎస్ఐ) తాజ్‌మహల్‌లో మరమత్తుల పనులు చేపట్టినట్లు పేర్కొనడం గమనార్హం. అంతేగాదు మే9 వ తేదీన తాజ్‌మహల్‌లో అండర్ గ్రౌండ్ వర్క్స్ అనే పేరుతో మూతపడ్డ 22 గదుల చిత్రాలను వారి అధికారిక వెబ్సైట్లో పోస్ట్ చేయగా, వీటిని తాజాగా ఏఎస్ఐ విడుదల చేసింది. అంతేగాదు తాజ్‌మహల్ పునరుద్ధరణకు ముందు తర్వాత ఫోటోలను గురించి వివరించింది. గోడలు మెట్లు, పాడైన సున్నపు ప్లాస్టర్ రీప్లాస్టర్‌గా స్క్రాప్ చేయడం వంటి పనులు చేపట్టినట్లు ఏఎస్ఐ వెల్లడించింది. అలాగే తాజ్‌మహల్ బయటి వైపున, యమునానది ఒడ్డున కూడా మరమత్తుల పనులు చేపట్టినట్లు పేర్కొంది. ఈ మేరకు ఆయా మరమత్తులకు సంబంధించిన ఫోటోలతోపాటు "స్మారక కట్టడం పునరుద్ధరణ పనులు" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. Click on the link to download/view the January issue of @ASIGoI's Newsletter.https://t.co/tIJmE46UR4 pic.twitter.com/UKWsTA2nPZ — Archaeological Survey of India (@ASIGoI) May 9, 2022 (చదవండి: ‘తాజ్ మహల్ కాదు.. తేజో మహాలయా పిటిషన్’.. కోర్టు ఏమందంటే..) -
తాజ్ మహల్: గదులు తెరిపించాలన్న పిటిషన్ తిరస్కరణ
అలహాబాద్: తాజ్ మహల్లో మూతపడి ఉన్న గదులను తెరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు(ఉత్తర ప్రదేశ్) తిరస్కరించింది. 22 గదుల్ని తెరవాల్సిన విషయంలో పిటిషనర్ జోక్యం అనవసరమని గురువారం లక్నో బెంచ్ వ్యాఖ్యానించింది. తాజ్‌మహల్ చరిత్రను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందని, వాస్తవాలను తెలుసుకునే హక్కు ప్రజలకు కూడా ఉంటుందని దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టకుండానే తిరస్కరించింది. అంతేకాదు ప్రజా ప్రయోజన వ్యాజ్యం వ్యవస్థను అవమానపరిచేలా వ్యవహరించొద్దంటూ పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. ఈ వ్యవహారాన్ని చరిత్రకారులకు వదిలేయండంటూ తేల్చి చెప్పింది. ‘‘వెళ్లండి. వెళ్లి ఏదైనా పరిశోధనలు చేసుకోండి. ఎంఏలు, పీహెచ్‌డీలు చేసుకోండి. న్యాయస్థానాల సమయం వృథా చేయొద్దంటూ’’ అంటూ బెంచ్ న్యాయమూర్తులు ఉపాధ్యాయ్, సుభాష్ విద్యార్థిలు పిటిషనర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యవహారాన్ని సరదాగా నాలుగు గోడల మధ్య కూర్చుని చర్చిస్తే బాగుంటుంది. ఇలా కోర్టు రూమ్‌లో కాదు అంటూ బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాదు.. ఇది కోర్టుకు సంబంధించిన వ్యవహారం కాదని, కోర్టు బయట మెథడాలజీ, చరిత్రకారుల ద్వారా తేలాల్సిన విషయం అని బెంచ్ స్పష్టం చేసింది. ఒకవేళ చరిత్ర తెలుసుకోవాలనుకుంటే ఆర్టీఐ ద్వారా తెలుసుకోవాలంటూ సూచించింది. సీల్ చేసి ఉన్న గదులను తెరిపించేందుకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించాలంటూ బీజేపీ యూత్ మీడియా ఇన్‌ఛార్జి డాక్టర్ రజనీష్ సింగ్ హైకోర్టు లక్నో బెంచ్ ముందు అభ్యర్థన పిటిషన్ దాఖలు చేశారు. తాజ్ మహల్ వాస్తవానికి తేజ్ మహాలయా అని.. అది శివుడి ఆలయం అంటూ ఆయన వాదించారు. అంతేకాదు నిజనిర్ధారణ కమిటీ ద్వారా అసలు చరిత్రను వెలుగులోకి తేవాలంటూ ఆయన ప్రభుత్వాన్ని కూడా కోరారు. మొఘలుల కాలానికి చెందిన తాజ్ మహల్‌ను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరిరక్షిస్తోంది. ఈ కళాఖండం 1982లో యనెస్కో వరల్డ్ హెరిటేర్ సైట్ గుర్తింపు దక్కించుకుంది కూడా. చదవండి: తాజ్ మహల్ కట్టిన స్థలం మాదే!: బీజేపీ ఎంపీ దియా -
వార్డెన్ నిర్వాకం.. హస్టల్ గదులను శుభ్రం చేయాలని బాలికకు వేధింపులు
చెన్నై: తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. ఒక హస్టల్ వార్డెన్ బాలికపట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించింది. బాలికను హస్టల్లోని గదులను శుభ్రంచేయాల్సిందిగా వేధించింది. దీంతో మనస్తాపానికి గురైన సదరు బాలిక.. విషంతాగి ఆత్మహత్యకు పాల్పడింది. గత జనవరి 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. 17 ఏళ్ల బాలిక తంజావురు జిల్లాలోని మిఛేల్పట్టి గ్రామంలోని ప్రభుత్వ హస్టల్ ఉంటూ చదువుకుంటుంది. ఈ క్రమంలో బాలికను హస్టల్ వార్డెన్ సగయమేరీ గదులను శుభ్రం చేయాల్సిందిగా ఆదేశించింది. అంతటితో ఆగకుండా బాలికపట్ల క్రూరంగా ప్రవర్తించింది. దీంతో బాలిక పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. బాలికను మెరుగైన వైద్యం కోసం తంజావురు ఆసుపత్రికి తరలించారు. ఆమెను అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించారు. కాగా, జనవరి 18న బాలిక వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. వార్డెన్ ప్రతిరోజు తరగతి గదులను శుభ్రం చేయాల్సిందిగా తనను వేధిస్తుండేదని తెలిపింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు హస్టల్వార్డెన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక చికిత్స పొందుతు జనవరి 19న మృతి చెందింది. బాలిక మృతికి హస్టల్ వార్డెన్ వేధింపులే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో హస్టల్ వార్డెన్‌పై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: ప్రేయసి కోసం కిడ్నీ దానం చేసిన ప్రియుడు.. ట్విస్ట్ ఏంటంటే -
128 మంది బాలురు.. బిగపట్టుకుని.. ఒకరి తరువాత ఒకరు
సాక్షి, వేములవాడ(కరీంనగర్): విద్య, వైద్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆ దిశగా పనులు కనబడడం లేదు. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు ఉన్నప్పటికీ కొన్ని పాఠశాలల్లో మాత్రం ఏళ్లుగా సమస్యలు పరిష్కారం కాక విద్యార్థులు ప్రతిరోజు ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు ఉదాహరణే వేములవాడ రూరల్ మండలంలోని 17 గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోని వసతులు. ఇందులో ప్రధానంగా ఫాజుల్‌నగర్ మండల పరిషత్ పాఠశాలలో అసౌకర్యాల మధ్య పిల్లలు రోజూ ఇబ్బందులు పడుతున్నారు. 1వ తరగతి నుంచి ఐదోతరగతి వరకు 128 మంది పిల్లలు ఉన్నారు. వీరికి మూడు గదులు మాత్రమే ఉన్నాయి. రెండు గదులు చాలా ఏళ్లుగా నిరుపయోగంగా ఉండడంతో వాటిని వినియోగించడం లేదు. ఇక బాత్రూంల పరిస్థితి చెప్పనక్కర్లేదు. 128 మందికి ఒకే బాత్రూం ఉండడంతో ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టాల్సిందే. ఒకరు వెళ్లారంటే మిగితా వారు బిగపట్టుకుని వచ్చేవారి కోసం ఎదురుచూడాల్సిందే. ఇలా మండంలోని నమిలిగుండుపల్లి తదితర గ్రామాల్లో కూడా ఇలాంటి పరిస్థితుల మధ్య విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు దృష్టిసారించి సమస్యలు పరిష్కరించాలని చిన్నారుల తల్లిదండ్రులు, విద్యాకమిటీ చైర్మన్లు కోరుతున్నారు. చదవండి: నాలుగు రోజుల్లో పెళ్లి.. యువకుడి అదృశ్యం -
ClubHouse Vs FaceBook : ఎవరి మాట నెగ్గేను ?
కాలిఫోర్నియా: ఆడియో ప్లాట్‌ఫార్మ్‌లో క్లబ్ హౌజ్ యాప్ సృస్టిస్తున్న సంచలనంతో ఫేస్బుక్ మేల్కొంది. ఆలస్యం చేస్తే ఆపద తప్పదని గ్రహించింది. దీంతో క్లబ్హౌజ్కి పోటీగా ఆడియో రూమ్స్ పేరుతో మాటలు, ముచ్చట్లు, లెక్చర్లు ప్రధానంగా మరో ఫీచర్ అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్ ఆడియో రూమ్‌కి నేరుగా వచ్చారు. మాటల ముచ్చట్లు ఫోటోలు, వీడియోలు, రైటింగ్ కంటెంట్‌తో ఇప్పటి వరకు అలరిస్తూ వస్తోన్న ఫేస్బుక్ మరో అడుగు ముందుకు వేయనుంది. ఫేస్బుక్ వేదికగా ముచ్చట్టు పెట్టుకునేందుకు వీలుగా త్వరలో ఆడియోరూమ్స్ ఫీచర్‌ని అందుబాటులోకి తేనుంది. ఆడియోరూమ్స్ పనితీరు పరిశీలించేందుకు స్వయంగా మార్క్‌జుకర్‌బర్గ్ ఈ రోజు ఇతర టెక్నోక్రాట్స్‌తో ముచ్చట్లు పెట్టారు. ఆడియో రూమ్స్ టెక్నాలజీ వరల్డ్‌లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో ఆడియో ఆథారిత పోడ్‌కాస్ట్‌కి మంచి ఫ్యూచర్ ఉందని ఇప్పటికే పలు నివేదికలు వెల్లడించాయి. మరోవైపు వర్చువల్ ముచ్చట్లే లక్ష్యంగా వచ్చిన క్లబ్‌హౌజ్ అప్లికేషన్ మార్కెట్లో దూసుకుపోతుంది. దీంతొ క్లబ్‌హౌజ్ లాంటి ఫీచర్‌ని ఫేస్బుక్ యూజర్లు అందించే లక్ష్యంతో ఆడియో రూమ్స్ సర్వీస్‌ని త్వరలో అందుబాటులోకి తేనుంది ఫేస్బుక్. ఇప్పటికే ఈ ఫీచర్‌కి సంబంధించి పలు టెస్టింగ్స్ని తైవాన్‌లో విజయవంతంగా నిర్వహించారు. నేరుగా వచ్చిన మార్క్ ఫేస్బుక్ ఆడియో రూమ్స్ లాంఛింగ్‌కి ముందు ముచ్చట్లు పెట్టందుకు నేరుగా మార్క్ జూకర్బర్గ్ లైన్లోకి వచ్చారు. ఫేస్బుక్ రియాల్టీ ల్యాబ్స్ హెడ్ బెజ్ బోస్వర్త్తో పాటు పలువురు ఈ ఆడియో రూమ్ ముచ్చట్లలో పాల్గొన్నారు. ఆనాటి సంగతులు మాట్లాడుకున్నారు. చదవండి : FaceBook : జుకర్‌బర్గ్‌కి ఎసరు పెట్టిన ట్రంప్ -
ఇల్లు ఇరుగ్గా ఉంది అత్తయ్యా
అందరూ కలిసి ఉండాలనేది మంచి ఆలోచన.అందులో లాభాలు ఉన్నాయి.సౌకర్యాలు ఉన్నాయి.కాని అత్తగారు ప్రతి కొడుక్కీ గది సౌకర్యంగా ఉందా అని చూస్తే సరిపోదు.ప్రతి కోడలికి గాలి ఆడుతుందా అనేది కూడా చూడాలి.ఇష్టాలు గౌరవించుకుంటే బంధాలు మరింత బలపడతాయి. ఆ రెండంతస్తుల భవనంలో లోపలి మెట్ల ద్వారా ఏ గదికైనా చేరుకోవచ్చు.అంత సౌకర్యంగా కట్టారు.కాని ఆ ఇంటికే కాక ఆ ఇంట్లోని మనుషులకూ మెట్లు ఉన్నాయి.పై మెట్టు మీద ఒకరుంటారు.. కింద మెట్టు మీద ఒకరుంటారు.అది మాత్రం చాలా అసౌకర్యం. వర్తకుల ఇల్లు అది. ఉత్తరాది నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఉమ్మడి కుటుంబం. తల్లి– తండ్రి, ముగ్గురు కొడుకులు– కోడళ్లు, మనవలు–మనవరాళ్లు... అందరూ కలిసి ఉంటారు. వంట గదిలో నిప్పు ఆరదు. డైనింగ్ టేబుల్‌కు విశ్రాంతి ఉండదు. తిండికి కొదవ లేదు. కాని మనసుల్లోనే ఏదో వెలితి. ఆ ఇంటి చిన్న కోడలు సోనమ్ పూర్తిగా మారిపోయిందని తెలియడానికి అంత ఉమ్మడి కుటుంబంలోని మనుషులకు కూడా ఆరు నెలలు పట్టింది. చిన్న కోడలు అంటే వయసులో చిన్నదని అనుకోవాల్సిన పని లేదు. 42 ఉంటాయి. పదిహేడు పద్దెనిమిదేళ్లకే పెళ్లి చేసి తీసుకొచ్చారు. ఇరవై ఏళ్ల కొడుకు, పద్దెనిమిదేళ్ల కూతురు ఉన్నారు. ముందు నుంచి మెతక. అత్తగారు ఏం చెప్పినా చేసుకుపోతుందని పేరు. అత్తగారి తర్వాత? పెద్ద కోడలు ఏం చెప్పినా చేసుకుపోతుందని పేరు. పెద్ద కోడలి తర్వాత? రెండో కోడలు ఏం చెప్పినా చేసుకుపోతుందని పేరు.ఇరవై ఏళ్లుగా చేసుకుపోతూనే ఉంది. చేసుకుపోతూనే ఉంది కదా అని ఎవరూ గమనించలేదు.గమనించేసరికి ఆమె పరిస్థితి అధ్వాన్నంగా మారిపోయింది. అత్తగారు లేచే సమయానికి కోడళ్లు కూడా నిద్ర లేవాలి. కాని గత ఆర్నెల్లుగా చిన్న కోడలు సమయానికి లేవడం లేదు. ఊరికే అలా పడుకుని ఉంటోంది. లేచినా తయారు కావడం లేదు. స్నానం చేయడం లేదు. దొడ్లోకి ఎప్పుడు వెళుతున్నదో అసలు వెళుతున్నదో లేదో తెలియదు. తిండి పూర్తిగా తగ్గిపోయింది. అప్పడప్పుడు ఆమె బాగా నవ్వేది. అసలు నవ్వు కనిపించడం లేదు. కొద్దో గొప్పో మాట్లాడేది. మాట వినిపించడం లేదు. అత్తగారు, తోడి కోడళ్లు కూడా మనుషులే. ఒక మనిషి ఈ స్థాయికి పడిపోయాకైనా వారు గమనించే తీరుతారు. గమనించారు. ఆస్పత్రికి తీసుకొచ్చారుసైకియాట్రిస్ట్ దగ్గరకు. సోనమ్‌కు చదువుకోవాలని ఉండేది. ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకుంది. కాని చదువు మాన్పించి తల్లిదండ్రులు పెళ్లి చేశారు. సరే.. భర్తను బాగా చూసుకోవడం.. భర్త చేసే పనిలో సాయం చేయడం.. పిల్లలను తీర్చిదిద్దుకోవడం.. ఇవైనా బాగా చేద్దామని అనుకుంది. ఆ కుటుంబ వర్తకంలో భర్త రాణించేది తక్కువ. అందుకని అతడికి తక్కువ స్థాయి పని అప్పజెప్పి ఉన్నారు. కనుక తక్కువ స్థాయి మర్యాద కూడా ఉంది. అతనికి తక్కువ స్థాయి మర్యాద కనుక అతడి భార్యకు కూడా తక్కువ స్థాయి మర్యాదే. నిర్ణయాలు మావగారు, ఇద్దరు బావగార్లు తీసుకుంటూ ఉంటారు. భర్తకే నిర్ణయం తీసుకునే వీలు లేనప్పుడు అతడి భార్యకు వీలు ఎక్కడ ఉంటుంది.ఆ ఇంట్లో తనకు నచ్చింది వండుకుని తినే స్వేచ్ఛ సోనమ్‌కు ఎప్పుడూ లేదు. వండుకోవద్దని ఎవరూ అనరు. కాని వండుకోవడానికి వీల్లేని వాతావరణం ఉంటుంది. పిల్లలు ఇద్దరు పుడితే తనకిష్టమైన పేర్లు సోనమ్ పెట్టుకోలేకపోయింది. భర్తకు ఇష్టమైన పేర్లు కూడా. ఒక పేరు పెదబావగారు పెడితే మరోపేరు రెండో బావగారు పెట్టారు.సంవత్సరానికి రెండుసార్లు అందరూ కలిసి ఎక్కడికైనా వెళ్లి వస్తారు గాని సోనమ్‌కు తన కుటుంబంతో విడిగా ఎక్కడికైనా వెళ్లి రావాలనే కోరిక మాత్రం ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా తీరలేదు. ‘అలాగే అత్తగారు’, ‘అలాగే ఒదిన’... ‘అలాగే మావయ్యా’ ఇవి అనీ అనీ నిద్రలో కూడా ఈ మాటలే అనడానికి అలవాటు పడిపోయింది.అసంతృప్తికీ అణచివేతకీ కూడా ఒక హద్దు ఉంటుంది.ఆ చెలియలి కట్టను కూడా ఆ కుటుంబం దాటి సోనమ్‌ను తీవ్రంగా బాధ పెట్టింది. సోనమ్ కుమార్తె వీర ఇంటర్ పాసైంది. ఇక ఇంట్లో అందరూ పెళ్లి సంబంధాల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. తమ ఇళ్లల్లో ఆడపిల్లలకు ఆ వయసులో పెళ్లి చేస్తారు కనుక ఇది చాలా మామూలు విషయంగా వారు భావించారు. అత్తగారు, ఇద్దరు పెద్ద కోడళ్లు ఆ సంబంధం ఉంది ఈ సంబంధం ఉంది అని తామే మంతనాలు సాగిస్తూ ఉన్నారు. కాని వీరకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. బాగా చదువుకోవాలని ఉంది. కూతురు బాగా చదువుకుని తన కాళ్ల మీద తాను నిలబడి తన జీవితాన్ని తాను నిర్మించుకునే శక్తి పొందాలని సోనమ్‌కు గట్టిగా ఉంది. కాని ఆ మాట ఆ తల్లికూతుళ్లు ఇద్దరూ చెప్పే వీలు ఆ ఇంట్లో లేదు. భర్తకు చెప్తే అర్థం కాదు.అరె... నా కూతురు విషయంలో కూడా నాకు స్వేచ్ఛ లేదా అని సోనమ్ అనుకుంది.అంతే. తనలో తాను ముడుచుకుపోవడం మొదలుపెట్టింది. లోలోపలికి పూర్తిగా చీకట్లోకి వెళ్లిపోయింది. ఆమెకిప్పుడు లోకవ్యవహారాల వేటి మీదా ఆసక్తి లేదు. ఆమె కేవలం ముక్కు నుంచి గాలి పీల్చి వదలగల ఒక బొమ్మ మాత్రమే. సైకియాట్రిస్ట్‌కు అంతా అర్థమైంది. కుటుంబాన్ని కూచోబెట్టుకుని చెప్పింది.‘చూడండి. మనుషులు కలిసి ఉండటం ఎప్పుడూ బాగుంటుంది. కాని కలిసి ఉండటం అంటే కాళ్లకు సంకెళ్లు కట్టి ఉంచడం కాదు. ఎదుటివారి కలలు, కోరికలు, అభిప్రాయాలు వీటిని పట్టించుకుని వాటిని ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడమే ఉమ్మడి కుటుంబం ఉద్దేశ్యం. కాని ఒకరిపై మరొకరు పెత్తనం చేయడం అణచి ఉంచడం ఎంత మాత్రం కాదు. మీరు ఇంట్లో మీ చిన్న కోడలుకు గది ఇచ్చారు కాని సమాజంలో భాగమవడానికి గడప ఇవ్వలేదు. అయినా ఆమె భరించింది. కాని ఆమె కూతురికి కూడా అదే పరిస్థితి వచ్చే సరికి శిథిలమయ్యింది. ‘ఇది నువ్వు చెయ్’ అనే మాటను మీ ఇంట్లో మానేయండి. ‘ఏం చేయాలనుకుంటున్నావు’ అని అడగడం నేర్చుకోండి. ఎదుటివారి ఇష్టాలను హేళన చేయకుండా గౌరవించే స్థితికి మీరంతా ఎదిగినప్పుడే మీ ఉమ్మడి కుటుంబం ఇంకా అర్థవంతంగా ఉంటుంది. మీ మనవరాలి పెళ్లి మీద మొదట నిర్ణయం తీసుకోవాల్సింది మీ మనవరాలే. తర్వాత ఆమె తల్లి. మీరు మాత్రం కాదు’ అని వారికి వివరించి చెప్పింది.అత్తగారు, తోడికోడళ్లు సోనమ్‌ను, వీరను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు.వాళ్లు మొదట చేసిన పని పెళ్లి ప్రస్తావన వాయిదా వేయడం.వీర ఏం చదువుకోవాలన్నా సపోర్ట్ చేస్తామని సోనమ్‌కు వారు ధైర్యం చెప్పారు.అసలు ఒక వారం రోజుల సంతోషంగా తిరిగి రండి అని టికెట్లు బుక్ చేసి టూర్‌కు కూడా పంపారు. కిచెన్ రూల్స్ మారాయి. ఎవరికి ఏం కావాలన్నా సంకోచం లేకుండా వండుకోవాలని అత్తగారు ప్రకటన చేసింది. ఎవరి నిర్ణయాలకు అడ్డు చెప్పేది ఉండదని కాకుంటే మంచి చెడ్డలు ఆలోచించడానికి ఒక అవకాశం పెద్దలకు ఇవ్వదలిస్తే ఇవ్వండని మామగారు చెప్పారు.చిన్న చిన్న కిటికీ రెక్కలు కూడా విప్పినప్పుడు పెద్ద వెలుతురు తెస్తాయి.ఇంట్లో సోనమ్ ఇప్పుడు కూడా చిన్నకోడలే.కాని ఆ ఇద్దరు పెద్ద కోడళ్లకంటే కూడా హోదాలో తక్కువ కాదు. అధికారంలో తక్కువ కాదు. ఇటీవల కూతురిని ఇంజనీరింగ్ కాలేజీలో చేర్చి వచ్చాక ఉదయాన్నే లేచి ఉత్సాహంగా పనిలో పడ్డ సోనమ్‌ను ఆ రెండంతస్తుల ఇంట్లో అందరూ తృప్తిగా చూశారు. కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డా. పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్ -
క్షణ క్షణం.. భయం భయం..
బేల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల తెలుగు మీడియంలో 180 మంది విద్యార్థులు ఉన్నారు. 1 నుంచి 5వ వరకు విద్యనభ్యసిస్తున్నారు. రెండు గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. గత్యంతరం లేక శిథిలావస్థ గదుల్లోనే విద్యార్థులను కూర్చొబెట్టి బోధన చేస్తున్నారు. వర్షం కురిసినప్పుడు స్లాబ్ ద్వారా వర్షపు నీరు గదుల్లోకి చేరుతుంది. ఆదిలాబాద్ టౌన్: జిల్లాలో సర్కారు బడులు కొన్ని శిథిలావస్థకు చేరుకుని మృత్యుఒడిని తలపిస్తున్నాయి. ఏక్షణం ఏం జరుగుతుందోనన్న భయాందోళనలో విద్యార్థులు చదువులు సాగిస్తున్నారు. అధికారులు వాటిని కూల్చివేయకుండా అలాగే కొనసాగించడం.. కొన్ని పాఠశాలల్లో శిథిలావస్థకు చేరిన పురాతన గదుల్లోనే తరగతులు కొనసాగుతున్నాయి. విద్యాశాఖ అధికారులు, పాలకులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో పాఠశాలలు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. గురువారం హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పిల్లర్ కూలిపోవడంతో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందగా.. మరో ఐదుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. కాగా, ఆదిలాబాద్ జిల్లాలోనూ ప్రమాద స్థాయికి చేరిన పాఠశాలు ఉన్నాయి. మృత్యు కుహారాలు.. ఆదిలాబాద్ జిల్లాలో 466 ప్రాథమిక పాఠశాలలు, 109 ప్రాథమికోన్నత పాఠశాలలు, 102 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 58,648 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కొన్ని సర్కారు బడులతోపాటు ప్రైవేటు పాఠశాలల్లోనూ సరైన వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేకుల గదులు, పెంకుటిళ్లలోనూ చదువులు కొనసాగుతున్నాయి. వర్షకాలంలో శిథిలావస్థ భవనాలు ఎప్పుడు కూలుతాయో తెలియక విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువులు కొనసాగిస్తున్నారు. కొన్ని చోట్ల తరగతి గదులు సరిపోక, భవనాలు కూలిపోవడానికి సిద్ధంగా ఉండడంతో చెట్ల కింద విద్యాబోధన జరుగుతోంది. ప్రభుత్వం ఆర్‌ఎంఎస్‌ఏ, ఆర్వీఎం ద్వారా పాఠశాల భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించినప్పటికీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల భవనాలు పూర్తి కావడం లేదు. కాంట్రాక్టర్లకు అధికార పక్షం నేతలు అండదండలు ఉండడంతో పాఠశాల అదనపు గదుల నిర్మాణం ముందుకు సాగడం లేదు. కొన్ని చోట్ల నిర్మాణం పూర్తి కాకున్నప్పటికీ ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై బిల్లులు తీసుకుంటారని ఆరోపణలు ఉన్నాయి. కూలడానికి సిద్ధంగా.. జిల్లాలో 56 పాఠశాలల్లో 93 గదులు శిథిలావస్థకు చేరుకున్నాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. బేల మండలంలో 2, బోథ్ మండలంలో 21 గదులు, ఇచ్చోడలో 3, ఇంద్రవెల్లిలో 2, జైనథ్‌లో 8, నార్నూర్‌లో 21, నేరడిగొండలో 1, తలమడుగులో 17, తాంసిలో 9, ఉట్నూర్‌లో 9 పాఠశాలలు శిథిలావస్థలో చేరుకున్నాయి. బేల మండలంలోని ఎంపీపీఎస్ రెండు గదులు ఉండగా 2 శిథిలావస్థలో ఉన్నాయి. బోథ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల(బుజుర్గు)లో 5 గదులు ఉండగా.. ఐదూ శిథిలావస్థలో ఉన్నాయి. తలమడుగు మండలంలోని బరంపూర్ ప్రాథమిక పాఠశాలలో 8 గదులు ఉండగా 7 శిథిలావస్థలో ఉన్నాయి. తలమడుగు ప్రాథమిక పాఠశాలలో 6 గదులు ఉండగా.. 4 శిథిలావస్థలో ఉన్నాయి. తాంసి మండలంలోని అర్లి(టి)లో 6 గదులు ఉండగా.. 3 శిథిలావస్థకు చేరుకున్నాయి. శిథిలావస్థ గదుల్లో పిల్లల్ని కుర్చోబెట్టవద్దు జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ యాజమాన్య పాఠశాలలకు సంబంధించి 56 పాఠశాలల్లో 93 శిథిలవస్థ గదులు ఉన్నాయి. ఈ గదుల్లో ఉపాధ్యాయులు పిల్లల్ని కుర్చోబెట్టవద్దు. అవసరమైన అదనపు గదులు నిర్మాణం, నిధుల కోసం ప్రభుత్వానికి నివేదిస్తాం. అదనపు నిర్మాణం చేపట్టకుండా నిర్లక్షం వహించే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటాం. ఈ విషయం జిల్లా కలెక్టర్‌కు విన్నవించి వారిని బ్లాక్ లిస్టులో ఉంచేవిధంగా చర్యలు తీసుకుంటాం. – జనార్దన్‌రావు, డీఈవో ఆదిలాబాద్ -
జడ్జీల కంటే కోర్టు గదుల సంఖ్య తక్కువ..
న్యూఢిల్లీ: దేశంలో కింది స్థాయి కోర్టుల్లో పనిచేసే జడ్జీల సంఖ్య కంటే అక్కడ ఉన్న గదుల సంఖ్య తక్కువ ఉన్నట్లు న్యాయ మంత్రిత్వ శాఖ తన నివేదికలో వెల్లడించింది. జిల్లా కోర్టులు, వాటి అధీనంలో పనిచేసే(సబ్ ఆర్డినేట్) కోర్టుల్లో జడ్జీలు, గదుల సంఖ్యలను సమం చేస్తే దేశంలో న్యాయవ్యవస్థ పనితీరు మెరుగవుతుందని అభిప్రాయపడింది. దేశంలో మొత్తం 17,576 కోర్టు రూమ్‌లు, 14,363 రెసిడెన్షియల్ యూనిట్లు ఉండగా.. జడ్జీల సంఖ్య 22,288 ఉందని తెలిపింది. ఈ మేరకు పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సభ్యులకు నివేదిక ఇచ్చింది. -
గది ముందస్తు రద్దుతో పూర్తి నగదు వాపస్
శ్రీవారి భక్తులకు వెసులుబాటు.. 3వ తేదీ నుంచి అమలు సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఆన్లైన్ ద్వారా ముందస్తుగా గది రిజర్వు చేసుకుని, తిరిగి రద్దు చేసుకుంటే వందశాతం నగదు వాపసు ఇవ్వనున్నారు. ఈ నూతన విధానం జూలై మూడో తేదీ నుంచి అమల్లోకి రానుంది. గది రిజర్వు చేసుకున్న తేదీకి 2 రోజుల (48 గంటలు) ముందు రద్దుచేసుకుంటేనే పూర్తి నగదు భక్తుడి బ్యాంకు ఖాతాకు వాపసు కానుంది. బుక్ చేసుకున్న గదిని రద్దు చేయకున్నా, వినియోగించకపోయినా చెల్లింపులు ఉండవు. ఇక ఆన్లైన్ ద్వారా రిజర్వు చేసుకుని గదిని పొంది, గడువుకు ముందు.. 12 గంటల్లోపు 50%, 18 గంటల్లోపు 25% నగదు సంబంధిత భక్తుల బ్యాంక్ ఖాతాల్లో ఏడు రోజుల్లోపు తిరిగి జమ చేస్తున్నారు. -
ఎస్వీయులో హాస్టల్ గదుల కోసం విద్యార్థుల పాట్లు
-
భగవంతునికి భక్తునికి మధ్య ఆధార్
-
రూ.50 అద్దె గదులకు కాషన్ డిపాజిట్ రద్దు
- ఈ నెల 24 నుండి అమలు తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గదుల కాషన్ డిపాజిట్‌ను అక్టోబర్ 24 తేదీ సోమవారం నుండి టీటీడీ రద్దు చేయనుంది. రూ.50 నుంచి ఆపై అద్దె గల అన్ని రకాల అద్దె గదులకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. సాధారణంగా గదులు కేటాయించే సమయంలోనే గది అద్దెతోపాటు అంతే మొత్తంలో భక్తుల నుంచి కాషన్ డిపాజిట్‌ను టీటీడీ వసూలు చేస్తోంది. ఖాళీ చేసిన తరువాత రీఫండ్ కౌంటర్లలో ఆ కాషన్ డిపాజిట్ భక్తులు తిరిగి పొందుతున్నారు. భక్తులపై పూర్తి విశ్వాసంతో అన్ని రకాల అద్దె గదులకు కాషన్ డిపాజిట్ పద్దతిని రద్దు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా తొలివిడత దాతలకు కేటాయించే గదులకు, ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న గదులకు, శ్రీపద్మావతి అతిథి గృహాల సముదాయంలో రిసెప్షన్-1 విభాగం పరిధిలోని ఎక్కువ అద్దె కలిగిన గదులకు మొదటి విడతలో ఈ కాషన్ డిపాజిట్ విధానాన్ని రద్దు చేశారు. తాజాగా రూ.50 ఆపై అద్దె గల గదులకూ ఈ నిర్ణయాన్ని అమలు చేశారు. గది ఖాళీ చేసిన తర్వాత తాళాలు అక్కడి విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి తప్పనిసరిగా అందజేయాలని విజ్ఞప్తి చేశారు. -
జెల్లీ ఫిష్ లాడ్జి గదులు!
ఒక్కదెబ్బకు నాలుగు పిట్టలంటే ఇదేనేమో... ఫొటోలు చూశారా? అందులో నీటిపై తేలియాడుతూ కనిపిస్తున్నవి ఏమనుకుంటున్నారు? ఇవి.. లాడ్జీ రూములు. అంతే కాదు, గాలీ, నీరు క్లీన్ చేసే యంత్రాలు కూడా. ప్లస్ ఆకు కూరలు, కాయగూరలు పండించే పొలాలు! అదెలా సాధ్యం అని ఆశ్చర్యపోవద్దు. అన్నింటి కంటే ముందుగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ బుడగలు నదుల్లో, కాలువల్లో లాడ్జీ రూముల్లా పనిచేస్తాయి. పైభాగంలో ఉన్న వస్త్రంలో సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. ఇవి విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. అడుగున నీట్లో దారపు పోగుల్లా వేలాడుతూ ఉండే నిర్మాణాలు కొట్టుకుపోయే చెత్తను ఒడిసిపడతాయి. అంతేకాకుండా ఈ పోగుల్లోనే నీటిలోని కాలుష్యాలను లెక్కకట్టే సెన్సర్లు వగైరాలను ఏర్పాటు చేశారు. ఒకవేళ కాలుష్యాలు ఎక్కువగా ఉంటే పైన ఉన్న చిన్న చిన్న గుండ్రటి నిర్మాణాల ద్వారా రకరకాల బ్యాక్టీరియాతో శుద్ధి చేస్తారు. ఆ తరువాత వదిలేస్తారు. లేదంటే బుడగలోపల పంటలకు ఉపయోగిస్తారు. జానైన్ హంగ్ అనే డిజైనర్ చేతిలో రూపుదిద్దుకున్నాయి ఇవి. లాడ్జీల నిర్వహణతో పరిసరాల్లోని ప్రజలకు అదనపు ఆదాయం లభిస్తుందని, గాలి, నీరు శుద్ధి చేయడం, కాయగూరలు, ఆకు కూరలు పండించడం అదనపు ప్రయోజనాలని అంటున్నారు హంగ్. ప్రస్తుతానికి వీటిని వాస్తవరూపంలో ఏర్పాటు చేసే ఆలోచనలేవీ లేకపోయినప్పటికీ భవిష్యత్తులో కాలుష్యం మరింత ఎక్కువైతే.. రసాయనాల వాడకంపై మరింత కఠినమైన నియంత్రణలు అమల్లోకి వస్తే ఇలాంటి సహజ సిద్దమైన ఏర్పాట్లకు ప్రాముఖ్యత లభించవచ్చు. జనావాసాలను ప్రకృతి స్ఫూర్తితో నిర్మించడం అన్న అంశంపై ఇన్హ్యాబిటాట్ వెబ్సైట్ ఏర్పాటు చేసిన ఒక పోటీకి హంగ్ ఈ జెల్లీఫిష్ లాడ్జీ డిజైన్‌ను పంపించారు. ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. -
ఇక పెళ్లికాని జంటలకు రూములిస్తారట
బెంగళూరు: ఇక పెళ్లికాని యువ జంటలకు కూడా రూములు అద్దెకు ఇస్తామని ఓయో సంస్థ ప్రకటించింది. రెండు నెలల కింద ప్రారంభించిన పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో ఇక దానిని అధికారికంగా ఆహ్వానిస్తున్నట్లు స్పష్టం చేసింది. దాదాపు దేశ వ్యాప్తంగా 200 నగరాల్లో 70 వేల గదులను అద్దెకు ఇస్తున్న ఈ సంస్థ వాటిల్లో 60శాతం గదులను పెళ్లికానీ యువజంటలకు కేటాయిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం ప్రత్యేక సైట్, యాప్ ద్వారా కూడా వాటిని బుక్ చేసుకోవచ్చని తెలిపింది. రూమ్ కావాలని వచ్చిన వారు తమ స్థానికతకు సంబంధించిన దస్తావేజులు చూపించిన వెంటనే వారికి ఈ సౌకర్యం ఓయో కల్పించనుంది. అంతేకాకుండా.. కపుల్ ఫ్రెండ్లీ రూమ్స్ ను మెట్రో నగరాలతోపాటు ప్రముఖమైన 100 పట్టణాల్లో ప్రారంభించింది. ఓయో రూమ్స్‌ను ఓ జపాన్ టెలికం సంస్థ, ప్రముఖ ఇంటర్నెట్ సంస్థ సాఫ్ట్ బ్యాంక్ సహాయంతో ప్రారంభించారు. -
హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించాలి
గిరిజన జేఏసీ ఆ«ధ్వర్యంలోధర్నా కరీంనగర్‌ఎడ్యుకేషన్ : ఎస్టీ స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించాలని కోరుతూ గిరిజన రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఎస్టీ ఎస్ఎంహెచ్ హాస్టళ్లకు చెందిన విద్యార్థినులు సర్కస్‌గ్రౌండ్ ర్యాలీగా కలెక్టరేట్ వరకు వచ్చి బైఠాయించారు. కలెక్టర్ రావాలని నినాదాలు చేయగా.. వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీశాయి. విద్యార్థినులు పోలీసుల వాహనాలను చుట్టుముట్టారు. దీంతో పోలీసులు బలవంతంగా గిరిజన జేఏసీ నాయకులు భీమాసాహెబ్, తిరుపతినాయక్ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా ప్రతిమామల్టీప్లెక్స్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. జిల్లా కో ఆర్డినేటర్ జి.భీమాసాహెబ్ మాట్లాడుతూ ఎస్టీ స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టళ్లు 2005 నుంచి అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయన్నారు. ఎస్సారార్ డిగ్రీ కళాశాలలో అబ్బాయిలకు, ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో అమ్మాయిలకు హాస్టల్ వసతి కల్పించాలని కోరారు. గిరిజన జేఏసీ నాయకులు శివరాజ్, మోహన్, వెంకటేశ్, భాస్కర్, మౌనిక, సూర్య, రేణుక, కవిత, గౌతమి, కరుణ, రజిత, స్వరూప తదితరులు పాల్గొన్నారు. -
తిరుమలకొండపై ఈగలమోత
-
చెట్టు కింది నుంచి పక్కా భవనంలోకి!
- ఏపీ సరిహద్దు చెక్‌పోస్టుల ఏర్పాటుకు కదిలిన వాణిజ్యపన్నుల శాఖ హైదరాబాద్: రాష్ట్రం ఏర్పాటై 10 నెలలు గడిచినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో వాణిజ్యపన్నుల శాఖ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై 'సాక్షి' రాసిన కథనానికి సర్కార్ స్పందించింది. 'చెట్టు కిందే చెక్‌పోస్టు' శీర్షికన గతనెల 21న ప్రచురితమైన వార్త కథనాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని వెంటనే చెక్‌పోస్టుల ఏర్పాటుకు అవసరమైన చర్యలకు ఆదేశించింది. చెక్‌పోస్టుల ఏర్పాటుకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వ్యక్తుల నుంచి లీజు పద్ధతిలో భూమిని తీసుకుంది. ఏపీ సరిహద్దులుగా ఉన్న కర్నూలు జాతీయ రహదారిపై తుంగభద్ర చెక్‌పోస్టును మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు మండలం పుల్లూరు గ్రామ పరిధిలో 6.23 ఎకరాలను ఇద్దరు వ్యక్తుల నుంచి వాణిజ్యపన్నుల శాఖ లీజుకు తీసుకుంది. విజయవాడ హైవేపై కోదాడ వద్ద 7.16 ఎకరాల భూమిని చిమిర్యాల గ్రామ పరిధిలో ముగ్గురు వ్యక్తుల నుంచి లీజుకు తీసుకుంది. ఈ రెండు ప్రాంతాల్లో ఆఫీసు భవనం, ప్రధాన రోడ్డుకు సమానంగా 30 అడుగుల సీసీ గ్రావెల్ రోడ్డు, సీజ్ అయిన సరుకుల కోసం షెడ్, రూం, యాంటీ రూం కోసం పక్కా ఆర్సీసీ నిర్మాణం, కిచెన్, టాయ్లెట్లు, రెస్ట్‌రూమ్‌లను భూమి యజమానులే నిర్మించి ఇస్తారు. రెండు నెలల్లో వీటి నిర్మాణం పూర్తవుతుందని వాణిజ్యపన్నుల అధికారి ఒకరు తెలిపారు. -
ఒకే గదిని రెండు రాష్ట్రాలకు కేటాయించారు
-
ఒకే గదిని రెండు రాష్ట్రాలకు కేటాయించారు
హైదరాబాద్ : రాష్ట్రాలు విడిపోయినా రాష్ట్ర విభజన చిక్కులు వీడటం లేదు. తాజాగా అసెంబ్లీ ప్రాంగణంలో శాసనసభ్యులకు గదుల కేటాయింపు గందరగోళానికి దారి తీసింది. తెలంగాణ అసెంబ్లీ సెక్రటేరియట్ టీఆర్ఎస్ ఎల్పీకి కేటాయించిన గదులనే ఆంధ్రపద్రేశ్ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులకు కేటాయించటం జరిగింది. దాంతో ఒకే గదిని రెండు రాష్ట్రాలకు కేటాయించటంతో వివాదం నెలకొంది. ఇక అసెంబ్లీ ప్రాంగణంలో ఆయా రాజకీయ పార్టీలకు కార్యాలయాలను కేటాయిస్తూ అసెంబ్లీ కార్యదర్శి సదారాం శుక్రవారం సర్క్యూలర్ జారీ చేశారు. సీఎల్పీ కార్యాలయాన్ని టీఆర్ఎస్ఎల్పీకి, టీఆర్ఎస్ఎల్పీ ఆఫీస్‌ను సీఎల్పీకి కేటాయించారు. డిప్యూటీ స్పీకర్ కార్యాలయాన్ని యథావిధిగా కొనసాగించనున్నారు. -
విద్యార్థులు ఫుల్... గదులు నిల్
విద్యార్థులు ఫుల్... గదులు నిల్ ఎర్రగుంట్ల, :ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలోని దొండపాడు రస్తాలోని రామాంజనేయపురం కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఫుల్‌గా ఉన్నా.. గదులు కొరతగ ఉండడంతో గత్యంతరం లేక ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణలో తడికలతో గుడిసెలు వేసుకొని పాఠాలు బోధిస్తున్న దుస్థితి ఇక్కడ నెలకొంది. విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలలకు మాత్రం ప్రభుత్వం బిల్డింగ్‌లను మంజూరు చేస్తుందని మా పాఠశాలలో విద్యార్థులు సుమారు 101 మంది ఉన్నా బిల్డింగ్ వసతి కల్పించలేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఈ పాఠశాలో మొదటి తరగతి నుంచి ఐదవ తరగతి వరకు విద్యార్థులు ఉండగా ప్రధానోపాధ్యాయునితో కలిపి ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఉన్న గదులు రెండు శిథిలావస్థకు చేరుకున్నాయని వర్షం వస్తే తడిసి ముద్ద అవుతుందని వారు వాపోయారు. విద్యార్థులు సంఖ్య చాలా ఎక్కువగ ఉండడంతో గత్యంతరం లేక ఆవరణలోనే తడికలతో ఒక గుడిసెను వేసుకొని విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నామని వారు వాపోయారు. ఇప్పటికైన ప్రజాప్రతినిధులు కానీ, విద్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలకు కొత్త భవనాలు మంజురు చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకరయ్య, ఉపాధ్యాయుడు శివరామిరెడ్డిలు కోరుతున్నారు -
సారీ..‘నో రూమ్’