- గిరిజన జేఏసీ ఆ«ధ్వర్యంలోధర్నా
హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించాలి
Published Mon, Jul 25 2016 10:59 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
కరీంనగర్‌ఎడ్యుకేషన్ : ఎస్టీ స్టూడెంట్ మేనేజ్‌మెంట్ హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించాలని కోరుతూ గిరిజన రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఎస్టీ ఎస్‌ఎంహెచ్ హాస్టళ్లకు చెందిన విద్యార్థినులు సర్కస్‌గ్రౌండ్ ర్యాలీగా కలెక్టరేట్ వరకు వచ్చి బైఠాయించారు. కలెక్టర్ రావాలని నినాదాలు చేయగా.. వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీశాయి. విద్యార్థినులు పోలీసుల వాహనాలను చుట్టుముట్టారు. దీంతో పోలీసులు బలవంతంగా గిరిజన జేఏసీ నాయకులు భీమాసాహెబ్, తిరుపతినాయక్ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా ప్రతిమామల్టీప్లెక్స్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. జిల్లా కో ఆర్డినేటర్ జి.భీమాసాహెబ్ మాట్లాడుతూ ఎస్టీ స్టూడెంట్ మేనేజ్‌మెంట్ హాస్టళ్లు 2005 నుంచి అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయన్నారు. ఎస్సారార్ డిగ్రీ కళాశాలలో అబ్బాయిలకు, ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో అమ్మాయిలకు హాస్టల్ వసతి కల్పించాలని కోరారు. గిరిజన జేఏసీ నాయకులు శివరాజ్, మోహన్, వెంకటేశ్, భాస్కర్, మౌనిక, సూర్య, రేణుక, కవిత, గౌతమి, కరుణ, రజిత, స్వరూప తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement