build
-
వర్టికల్ టవర్ గార్డెన్‌ను ఇలా మీరే తయారు చేసుకోవచ్చు!
వర్టికల్ టవర్ గార్డెన్ ఇంటిపంటల సాగుదారులకు చాలా ఉపయోగకరం. మేడ మీద లేదా బాల్కనీలో, ఇంటి పెరట్లో అతి తక్కువ స్థలంలో (కనీసం 4 గంటలు ఎండ తగిలే చోట) ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక్కో బారెల్లో 60 రకాల ఆకుకూరలు, కూరగాయలు, కషాయాల కోసం ఔషధ మొక్కలను పెంచుకోవచ్చు. బారెల్ మధ్యలో ఉండే పీవీసీ పైపులో వంటింటి వ్యర్థాలు వేస్తూ.. వర్మీ కం΄ోస్టును కూడా తయారు చేసుకోవచ్చు. ఈ టవర్ గార్డెన్లను సేంద్రియ ఇంటిపంటలపై ఆసక్తి, ఓపిక ఉన్న వారు తమంతట తాము తయారు చేసు కోవచ్చు. అదెలాగో హైదరాబాద్‌కు చెందిన వర్టికల్ టవర్ గార్డెన్ నిపుణులు రవి చంద్ర కుమార్ వివరిస్తున్నారు. మార్కెట్లో దొరికే 300 లీటర్ల లేదా 250 లీటర్ల హెచ్.డి.పి.ఇ. బారెల్ తీసుకోవాలి. బారెల్ పొడవు 36 అంగుళాలు. బారెల్‌కు చుట్టూతా 5 అంగుళాలకు ఒక చోట కత్తిరిస్తే (దీన్నే పాకెట్ అని పిలుస్తున్నాం).. 7 వరుసల్లో పాక్లెట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. అడ్డంగా ఒక్కొక్క పాకెట్ వెడల్పు 5 అంగుళాలు ఉండేలా కొలత స్కేల్‌తో మార్క్ చేసుకోవాలి. రెండు పాకెట్ల మధ్య 4 అంగుళాల దూరం ఉండేలా చూసుకోవాలి. ఒక వరుసలో 8 పాకెట్ వస్తాయి. 7 వరుసల్లో మొత్తం 56 పాకెట్లు వస్తాయి. బారెల్ పై భాగాన 4 మొక్కలు పెట్టవచ్చు. అన్నీ కలిపి 60 మొక్కలు పెట్టుకోవచ్చు. అంటే ఒక బారెల్ 60 కుండీలతో సమానం అన్నమాట! పాకెట్ ఎక్కడ పెట్టుకోవాలో మార్క్ చేసుకున్న తర్వాత మార్క్ చేసిన చోట బారెల్ను డ్రిల్ మెషిన్‌తో కత్తిరించి చిల్లు పెట్టాలి, జిగ్సా రంపం పట్టడం కోసం. జిగ్సా తో వరుసలల్లో మార్క్ చేసిన చోట్ల 5 అంగుళాల వెడల్పున కట్ చేయాలి. పాకెట్ మౌల్డింగ్ చేసే విధానం.. హీట్ గన్‌తో కట్ చేసిన ప్రదేశంలో హీట్ చేయాలి. తగిన హీట్ అయిన తరువాత ఆ ప్రదేశంలో చిత్రంలో చూపిన విధంగా సిమెంటు దిమ్మె అమర్చాలి. అలా అన్నిపాకెట్ ను తయారు చేయాలి. బారెల్ అడుగు భాగంలో మధ్యన 4 అంగుళాల రంధ్రం చేయాలి. పక్కన అర అంగుళం రంధ్రం చేయాలి. అధిక నీరు బయటకు వెళ్లడానికి అక్కడ గ్రోమేట్ పెటి టేకాహ్ అమర్చాలి. మధ్యలో 4 అంగుళాల పీవీసీ గొట్టం అమర్చాలి. గొట్టం చుట్టూ చిల్లులు పెట్టాలి. ఇదీ చదవండి: గోకృపామృత సేద్యం, మెరుగైన ఫలితాలుగొట్టం అమర్చే విధానం.. ఆ గొట్టాన్ని క్రింది భాగాన 6 అంగుళాలు బయటకు ఉండేలా అమర్చి.. అక్కడ ఎంసీల్‌తో అతకాలి. పై భాగాన జీయే వైరుతో కట్టాలి. 4 అంగుళాల గొట్టానికి పైన, కింద మూతలు అమర్చాలి. ఈ బారెల్ను నిలబెట్టడానికి ఇనుప స్టాండ్‌ను తయారు చేసుకోవాలి. స్టాండ్ 18 అంగుళాల పొడవు, 18 అంగుళాల వెడల్పు, 10 అంగుళాల ఎత్తు ఉండాలి.వర్టికల్ గార్డెన్లో కంపోస్టు తయారు చేసే విధానం : వర్మీ కం΄ోస్టు 30%, రంపపు పొట్టు 30%, పశువుల ఎరువు 30%, వేప గింజల చెక్క 10%.. ఇవన్నీ కలిపి బారెల్లో సరిపడినంత నింపుకోవాలి. బారెల్ మధ్యలో అమర్చిన గొట్టంలో వంటింటి వ్యర్థాలు వేయాలి. అందులో చక్కటి వర్మీకంపోస్టు తయారవుతుంది. స్టాండ్ మీద వర్టికల్ గార్డెన్‌ను అమర్చుకున్న తర్వాత.. అందులో కం΄ోస్టు మిశ్రమాన్ని నింపుకోవాలి. బారెల్ చుట్టూ ఉన్న అరలలో విత్తనాలు నాటుకోవాలి. ఒక్కో వర్టికల్ గార్డెన్ టవర్‌ను తయారు చేసుకోవడానికి (బారెల్, స్టాండ్, టవర్, కం΄ోస్టు, విత్తనాలు.. అన్నీ కలిపి) రూ. 5 వేలు ఖర్చవుతుంది. వర్టికల్ టవర్‌కు రోజుకు కనీసం 4 గంటలు ఎండ తగిలే చోట పెట్టుకోవాలి. ఇందులో అన్ని రకాల ఆకుకూరలు, ఔషధ మొక్కలు చక్కగా పండించవచ్చని రవిచంద్ర కుమార్ తెలిపారు. -
సువర్ణావకాశం.. ఒక ఐడియా రూ.10 లక్షలు - ట్రై చేయండిలా!
ఆధునిక కాలంలో సృజనాత్మకత పెరిగిపోతోంది. కేవలం చదువుకున్న వారు మాత్రమే కాకుండా నిరక్ష్యరాస్యులు కూడా తమదైన రీతిలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఏవియేషన్ కంపెనీ బోయింగ్ ఇండియా కొత్త ఆలోచనల కోసం ఒక కార్యక్రమం ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, బోయింగ్ ఇండియా తన ప్రతిష్టాత్మక బోయింగ్ యూనివర్శిటీ ఇన్నోవేషన్ లీడర్షిప్ డెవలప్మెంట్ (బిల్డ్) ప్రోగ్రామ్ కోసం విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు, ఇతర వర్ధమాన వ్యవస్థాపకులను ఆహ్వానించింది. ఇక్కడ వినూత్న ఆలోచలను షేర్ చేసుకోవచ్చు. ఇందులో ఉత్తమ 7మందికి ఒక్కొక్కరికి రూ. 10 లక్షల బహుమతి లభిస్తుంది. ఏరోస్పేస్, రక్షణ, టెక్నాలజీ, సామాజిక ప్రభావం వంటి విషయాలపైన ఆసక్తి ఉన్న వారు అధికారిక వెబ్సైట్ ద్వారా బిల్డ్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ ఆలోచనలను 2023 నవంబర్ 10 వరకు పంపవచ్చు. గత ఏడాది ఇదే ప్రోగ్రామ్ కోసం టైర్ 1, టైర్ 2, టైర్ 3 నగరాలకు చెందిన విద్యార్థుల నుంచి 1600 కంటే ఎక్కువ, స్టార్టప్ ఔత్సాహికుల నుంచి 800 కంటే ఎక్కువ ఆలోచనలు వెల్లువెత్తాయి. కాగా ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: 12 నెలలు ఆఫీసుకు రానక్కర్లేదు.. ఇంటి నుంచే పనిచేయండి.. ఈ సంవత్సరం బోయింగ్ బిల్డ్ ప్రోగ్రామ్ కోసం ఏడు ప్రసిద్ధ ఇంక్యుబేటర్లతో జతకట్టింది. అవి సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ - ఐఐటీ ముంబై, ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ - ఐఐటీ ఢిల్లీ, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ - ఐఐటీ గాంధీనగర్, ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్, సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్ - ఐఐఎస్సీ బెంగళూరు, టీ-హబ్ హైదరాబాద్, టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ - కేఐఐటీ భువనేశ్వర్. -
ఇది యోగి మార్క్.. గ్యాంగ్‌స్టర్ భూమిలో పేదల కోసం ఇళ్లు
ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ గత ఏప్రిల్‌లో హత్యకు గురైన విషయం విదితమే. కాగా ప్రభుత్వం అతని నుంచి స్వాధీనం చేసుకున్న భూమిలో పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఈ ఇళ్లను లాటరీ ద్వారా అర్హులకు కేటాయించారు. ప్రయాగ్‌రాజ్: గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన అతీక్ అహ్మద్ నుంచి స్వాధీనం చేసుకున్న భూమిలో పేదల కోసం నిర్మించిన 76 ఫ్లాట్ల కేటాయింపునకు సంబంధించి లాటరీ తీశారు. ఇది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగింది. ఈ లాటరీలో ఎన్నికైనవారికి ఫ్లాట్లను అప్పగించనున్నారు. ప్రయాగ్‌రాజ్ డెవలప్మెంట్ ఆథారిటీ(పీడీఏ) ఉపాధ్యక్షుడు అరవింద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అలహాబాద్ మెడికల్ అసోసియేషన్‌కు చెందిన హాలులో పేదలకు ఫ్లాట్లను కేటాయించేందుకు లాటరీ తీశామన్నారు. మొత్తం దరఖాస్తు చేసుకున్న 6,030 మందిలో నుంచి 1590 మందిని లాటరీలో పాల్గొనేందుకు అర్హులుగా గుర్తించామన్నారు. లబ్ధిదారులకు 41 స్క్వేర్ మీటర్లలో నిర్మితమైన ఫ్లాట్ రూ. 3 లక్షల 50 వేలకు అందజేయనున్నామన్నారు. 2021లో శంకుస్థాపన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రెండు గదులు కలిగిన ఈ ఫ్లాట్‌లో ఒక వంటగది, టాయిలెట్ ఉంటుందన్నారు. ఈ ఫ్లాట్ ఖరీదు రూ. 6 లక్షల రూపాయలని తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌లోని లూకర్‌గంజ్ పరిధిలోని అతీక్ నుంచి స్వాధీనం చేసుకున్న 1731 స్క్యేర్ మీటర్ల భూమిలో సరసమైన గృహ నిర్మాణ ప్రాజెక్టుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2021 డిసెంబరు 26న శంకుస్థాపన చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై)కింద ఈ ప్రాజెక్టు చేపట్టింది. చదవండి: మహారాష్ట్ర రాజకీయంలో కలకలం UP: Flats built on land confiscated from slain gangster Atiq Ahmed allotted to poor in Prayagraj Read @ANI Story | https://t.co/VwutaCV8NN#Prayagraj #atiqahmad #UttarPradesh pic.twitter.com/y0fCo4mhGn — ANI Digital (@ani_digital) June 9, 2023 ముఖ్యమంత్రి యోగి చేతుల మీదుగా.. ఈ ప్రాంతంలో రెండు బ్లాకులుగా మొత్తం 76 ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణం పూర్తయ్యాక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అర్హులైన పేదలకు ఈ ఇళ్లను అప్పగించనున్నారు. అతీక్ అహ్మద్ 2005లో జరిగిన బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే రాజూపాల్ హత్య, ఈ కేసులో ప్రత్యక్ష్య సాక్షి ఉమేష్ పాల్ హత్య కేసులలో ప్రధాన నిందితుడు. కాగా అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్‌లను ఈ ఏడాది ఏప్రిల్ 15న రాత్రి విలేకరుల రూపంలో వచ్చిన ఆగంతకులు తుపాకీతో కాల్చి చంపారు. అతీక్ అహ్మద్‌ను పోలీసులు వైద్య పరీక్షల కోసం తీసుకెళుతుండగా ఈ ఘటన జరిగింది. చదవండి: విదేశాల్లోని భారతీయులకు ఓటుహక్కు! -
రైతులకు వరం.. ఐఐటీ హైదరాబాద్ సరికొత్త ఆవిష్కరణ!
హైదరాబాద్ : వ్యవసాయదారులకు, రైతుకూలీలకు ఉపయోకరంగా ఉండటమే కాకుండా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే సరికొత్త ఆవిష్కరణకు ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ బాటలు వేసింది. వేస్ట్ టూ వెల్త్ వ్యవసాయం చేసేప్పుడు ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాలతో బయో బ్రిక్స్ (ఇటుకలు)ను ఐఐటీ, హైదరాబాద్ విద్యార్థులు రూపొందించారు. సాగు చేసేప్పుడు వచ్చే చెత్తను సేకరించి దాన్ని ప్రత్యేక పద్దతిలో మిక్స్ చేసి ఈ ఇటుకలను రూపొందించారు. ప్రస్తుతం ప్రోటోటైప్‌లో ఉన్న ఈ ఇటుకలను కమర్షియల్ పద్దతిలో భారీ ఎత్తున తయారు చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం అందివ్వడంతో పాటు ఆఫ్ సీజన్లో రైతు కూలీలకు కూడా మరో పనిని అందుబాటులోకి తెచ్చినట్టు అవుతుందని ఐఐటీ , హైదరాబాద్ అధ్యాపకులు అంటున్నారు. ప్రాజెక్ట్ బిల్డ్ ఐఐటీ హైదరాబాద్‌లో బోల్డ్ యూనిక్ ఐడియా లీడ్ డెవలప్మెంట్ (బిల్డ్) పేరుతో ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టారు. అందులో భాగంగా భవన నిర్మాణ రంగంలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆ ప్రాజెక్టులో భాగంగా 2019 నుంచి బయె బ్రిక్ పరిశోధనలు ప్రారంభించారు. ఇటీవల హైదరాబాద్ క్యాంపస్‌లోనే ఈ ఇటుకలను ఉపయోగించి సెక్యూరిటీ గార్డ్ గదిని నిర్మించారు. బయె ఇటుక ప్రత్యేకతలు - సాధారణ ఇటుకలతో పోల్చినప్పుడు బయో ఇటుకలు చాలా తక్కువ (ఎనిమిదో వంతు) బరువును కలిగి ఉన్నాయి. దీంతో ఇంటి పైకప్పు నిర్మాణానికి సైతం వీటిని వినియోగించవచ్చు. పీవీసీ షీట్లపై ఈ ఇటుకలను పేచ్చి కప్పును పూర్తి చేయవచ్చు. - బయె ఇటుకలు వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్‌గా పని చేస్తాయి. కాబట్టి భవనానికి అదనపు రక్షణ లభిస్తుంది. అంతేకాదు కొంత మేరకు సౌండ్ ప్రూఫ్‌గా కూడా పని చేస్తున్నాయి. - సాధారణ ఇటుకలతో పోల్చితే బయో ఇటుకలను కాల్చేందుకు కనీసం 6 సెంటిగ్రేడ్ వరకు తక్కువ ఉష్ణోగ్రత సరిపోతుంది. ఫలితంగా పర్యావరణ కాలుష్యం తగ్గిపోతుంది. - ఈ ఇటుకలను భారీ ఎత్తున తయారు చేస్తే ఒక్కో ఇటుక తయారీకి కేవలం రూ.2 నుంచి రూ. 3 ల వ్యయం అవుతుంది. దీంతో ఇటుకల రేటు తగ్గిపోతుంది. గ్రామీణ ప్రాంతాలకు ఉపయుక్తం బయో బ్రిక్ టెక్నాలజీ విరివిగా అందుబాటులోకి వస్తే రూరల్ ఇండియాకు ఎంతగానో మేలు జరుగుతుందని ఐఐటీ హైదరాబాద్ అధ్యాపక బృందం అంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో తయారయ్యే వ్యర్థాలతో అతి తక్కువ ఖర్చుతోనే ఇటుకలు అందుబాటులోకి వస్తాయని, వీటి వల్ల ఇంటి నిర్మాణ వ్యయం గణనీయంగా తగ్గుతుందంటున్నారు. వ్యయం తగ్గడంతో పాటు ఇంటి నాణ్యత కూడా బాగుంటుందని హామీ ఇస్తున్నారు. చదవండి : Hyderabad Metro: అమ్మకానికి హైదరాబాద్ మెట్రో! ఎల్ అండ్ టీ కీలక నిర్ణయం? -
ఎల్ అండ్ టీకి భారీ ఆర్డర్
ముంబై: ఇంజనీరింగ్ మేజర్ లార్సన్ అండ్ టర్బో భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. విదేశీ ప్రభుత్వంనుంచి వేలకోట్ల విలువైన ప్రాజెక్టును సాధించింది. మారిషస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని మెట్రోఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ నుంచి ఈ భారీ ఆఫర్ కొట్టేసింది. రైలు ఆధారిత పట్టణ రవాణా వ్యవస్థ రూపకల్పన,మరియు నిర్మాణానికిగాను రూ. 3,375 కోట్ల రూపాయల కాంట్రాక్టును గెలుచుకుంది. ఇది తమకు చాలా కీలకమైన ఆర్డర్‌ని ఎల్ అండ్ టీ బిఎస్ఇ ఫైలింగ్ లో తెలిపింది. ఆఫ్రికన్ ద్వీప దేశంలో సమీకృత లైట్ రైలు ఆధారిత రవాణా వ్యవస్థకు ప్రధాన పురోగతి ఈ ఒప్పందమని పేర్కొంది. 26 కిలోమీటర్ల మార్గం క్యూరీపైప్ తో పోర్ట్ లూయిస్‌లోని ఇమ్మిగ్రేషన్ స్క్వేర్ కు అనుసంధానిస్తుందని, 19 స్టేషన్లను కలిగి ఉంటుందని తెలిపింది. మారిషస్ ప్రధాన మంత్రి ప్రవీంద్ కుమార్ జుగ్నౌత్ సమక్షంలో జూలై 31 న ఒప్పందంపై సంతకాలు జరిగాయని కంపెనీ తెలిపింది. తమ నైపుణ్యంపై విశ్వాసం ఉంచిన మారిషస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ఈ కొత్త లైట్సిస్టం ద్వారా రూటు అభివృద్ధితోపాటు పరిపుష్టమైన ఆర్థిక లాభాలను గణనీయంగా ఆర్జించనుందని ఎల్ అండ్ ఎండీ, సీఈవో ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ తెలిపారు. -
నూతన ఆవిష్కరణల బ్రాండ్‌గా సైయంట్
♦ 2020 నాటికి 3 రెట్ల ఆదాయం.. ♦ 18,000లకు ఉద్యోగుల సంఖ్య ♦ సైయంట్ ఫౌండర్ మోహన్ రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా నూతన ఆవిష్కరణల బ్రాండ్‌గా నిలవాలని సైయంట్ లక్ష్యంగా చేసుకుంది. వచ్చే ఐదేళ్లలో డిజైన్, బిల్డ్, మెయింటెయిన్ వ్యూహాన్ని అమలు చేయనున్నట్టు సంస్థ వ్యవస్థాపకులు బీవీఆర్ మోహన్‌రెడ్డి తెలిపారు. కంపెనీ ఇటీవలే 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. 1991లో జియోస్పటికల్ సర్వీసులతో ప్రారంభమై విభిన్న విభాగాలకు విస్తరించామన్నారు. 21 దేశాలు, 38 కేంద్రాలతో మొత్తం 13,200 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు సాగిస్తున్నట్టు వివరించారు. మార్కెట్ క్యాప్ రూ.5,000 కోట్లకు ఎగసిందన్నారు. 1997లో రూ.10,000 పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్‌కు 300 రెట్ల ఆదాయం వచ్చిందని గుర్తు చేశారు. రెండేళ్లలో బిలియన్ డాలర్.. గత ఆర్థిక సంవత్సరంలో సైయంట్ రూ.3,100 కోట్ల టర్నోవర్ సాధించింది. 2020 నాటికి ఆదాయం మూడు రెట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్టు సైయంట్ ఎండీ కృష్ణ బోధనపు తెలిపారు. రెండేళ్లలో 1 బిలియన్ డాలర్ కంపెనీగా ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. ఏరోస్పేస్, డిఫెన్స్, కమ్యూనికేషన్స్ రంగాలు రానున్న రోజుల్లో మెరుగ్గా ఉంటాయని అన్నారు. ఈ రంగాలపై ఫోకస్ చేస్తామని చెప్పారు. కంపెనీల కొనుగోళ్లు ఉంటాయని అన్నారు. తాము సేవలందిస్తున్న రంగాల్లోని స్టార్టప్స్‌లో పెట్టుబడి చేస్తామని పేర్కొన్నారు. ఉద్యోగుల సంఖ్య వచ్చే ఐదేళ్లలో మొత్తం 18,000లు దాటొచ్చని అంచనాగా చెప్పారు. గతేడాది మాదిరిగానే ప్రస్తుత ఏడాది నియామకాలు 1,000 దాకా ఉండొచ్చని అన్నారు. -
వేదాలతోనే జ్ఞాన వికాసం
ప్రతి జిల్లాలో వేద పాఠశాలలు ఉండాలి ప్రముఖ పండితుడు శ్రీరామశర్మ సామర్లకోట: వేదాలతోనే జ్ఞాన వికాసానికి అవకాశం ఉంటుందని ప్రముఖ వేదపండితుడు చిఱా<వూరి శ్రీరామశర్మ పేర్కొన్నారు. పంచారామ క్షేత్రమైన శ్రీకుమారరామ భీమేశ్వరాలయంలో శ్రీ బాలత్రిపుర సుందరి వేదశాస్త్ర పరిషత్తు ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన 18వ వేదసభకు శర్మ అధ్యక్షత వహించారు. వేదాల ద్వారా సృష్టిలోని ప్రతి అంశాన్నీ తెలుసుకోవడానికి అవకాశం ఉందన్నారు. వేద స్వస్తి నిర్వహించడం వలన ఆయా ప్రాంతాలలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని తెలిపారు. వేదాలలోని మహిమలను, వేద సంరక్షణావశ్యకతను వివరించారు. వేదాల ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేయడానికి ప్రతి జిల్లాలో ఒక వేద పాఠ శాల ఉండాలన్నారు. దువ్వూరి లక్ష్మణ ఘనపాఠి, సర్వేశ్వర ఘనపాఠిల పర్యవేక్షణలో ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన సుమారు 125 మంది వేద పండితులు ‘చతుర్వేద పారాయణ, వేద స్వస్తి నిర్వహించారు. అనంతరం పండితులను నిర్వాహకులు సత్కరించారు. పరిషత్తు నిర్వాహకులు డాక్టర్ చందలాడ అనంతపద్మనాభం, పసల పద్మరాఘవరావు, సింగవరపు సాయిబాబు, గ్రంధి రామకృష్ణ, పాలకుర్తి ప్రసాద్, ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ కంటే బాబు తదితరులు పాల్గొన్నారు. -
హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించాలి
గిరిజన జేఏసీ ఆ«ధ్వర్యంలోధర్నా కరీంనగర్‌ఎడ్యుకేషన్ : ఎస్టీ స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించాలని కోరుతూ గిరిజన రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఎస్టీ ఎస్ఎంహెచ్ హాస్టళ్లకు చెందిన విద్యార్థినులు సర్కస్‌గ్రౌండ్ ర్యాలీగా కలెక్టరేట్ వరకు వచ్చి బైఠాయించారు. కలెక్టర్ రావాలని నినాదాలు చేయగా.. వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీశాయి. విద్యార్థినులు పోలీసుల వాహనాలను చుట్టుముట్టారు. దీంతో పోలీసులు బలవంతంగా గిరిజన జేఏసీ నాయకులు భీమాసాహెబ్, తిరుపతినాయక్ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా ప్రతిమామల్టీప్లెక్స్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. జిల్లా కో ఆర్డినేటర్ జి.భీమాసాహెబ్ మాట్లాడుతూ ఎస్టీ స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టళ్లు 2005 నుంచి అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయన్నారు. ఎస్సారార్ డిగ్రీ కళాశాలలో అబ్బాయిలకు, ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో అమ్మాయిలకు హాస్టల్ వసతి కల్పించాలని కోరారు. గిరిజన జేఏసీ నాయకులు శివరాజ్, మోహన్, వెంకటేశ్, భాస్కర్, మౌనిక, సూర్య, రేణుక, కవిత, గౌతమి, కరుణ, రజిత, స్వరూప తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన భవనం వెంటనే నిర్మించాలి
నంగారాభేరి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రమావతు కృష్ణానాయక్ అరండల్‌పేట: నగరంలో గిరిజన భవనం వెంటనే నిర్మించాలని నంగారాభేరి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రమావతు కృష్ణానాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక బ్రాడీపేటలోని నంగారాభేరి లంబాడి హక్కుల పోరాట సమితి కార్యాలయంలో సమితి నాయకుల సమావేశం నిర్వహించారు. రమావతు కృష్ణానాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో తప్పనిసరిగా గిరిజన భవనాలు నిర్మించాలన్నారు. గుంటూరు జిల్లాకు సంబంధించిన గతంలోనే గిరిజన భవనం నిర్మాణానికి నిధులు విడుదలైనా ఇప్పటి వరకు భవన నిర్మాణం ప్రారంభించలేదన్నారు. దీనిపై సోమవారం లాడ్జిసెంటర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి జెడ్పీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండేను కలిసి వినతిపత్రం సమర్పిస్తామన్నారు. గిరిజనులకు ప్రభుత్వం అందించాల్సిన అన్ని సంక్షేమ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అమలయ్యేలా చూడాలన్నారు. జిల్లాలోని అన్ని గిరిజన సంఘాల నాయకులు కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో ఏకలవ్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె వెంకటేశ్వర్లు, బీజేపీ నాయకులు టైగర్ ప్రసాద్, గిరిజన సంఘాల నాయకులు ఎం.శివానాయక్, కె ఏసుబాబు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన భవనం వెంటనే నిర్మించాలి
నంగారాభేరి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రమావతు కృష్ణానాయక్ అరండల్‌పేట: నగరంలో గిరిజన భవనం వెంటనే నిర్మించాలని నంగారాభేరి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రమావతు కృష్ణానాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక బ్రాడీపేటలోని నంగారాభేరి లంబాడి హక్కుల పోరాట సమితి కార్యాలయంలో సమితి నాయకుల సమావేశం నిర్వహించారు. రమావతు కృష్ణానాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో తప్పనిసరిగా గిరిజన భవనాలు నిర్మించాలన్నారు. గుంటూరు జిల్లాకు సంబంధించిన గతంలోనే గిరిజన భవనం నిర్మాణానికి నిధులు విడుదలైనా ఇప్పటి వరకు భవన నిర్మాణం ప్రారంభించలేదన్నారు. దీనిపై సోమవారం లాడ్జిసెంటర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి జెడ్పీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండేను కలిసి వినతిపత్రం సమర్పిస్తామన్నారు. గిరిజనులకు ప్రభుత్వం అందించాల్సిన అన్ని సంక్షేమ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అమలయ్యేలా చూడాలన్నారు. జిల్లాలోని అన్ని గిరిజన సంఘాల నాయకులు కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో ఏకలవ్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె వెంకటేశ్వర్లు, బీజేపీ నాయకులు టైగర్ ప్రసాద్, గిరిజన సంఘాల నాయకులు ఎం.శివానాయక్, కె ఏసుబాబు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు అవగాహన కల్పించండి
సంగం : మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ ఏడాది చివరినాటికి నూరుశాతం మరుగుదొడ్లు నిర్మంచు కునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆత్మగౌరవం జిల్లా కో–ఆర్డినేటర్ సుస్మితారెడ్డి అన్నారు. మంగళవారం మండలకేంద్రమైన సంగంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ జయరామయ్యకు ఆత్మగౌరవం కార్యక్రమంపై పలు సూచనలు, సలహాలు అందజేశారు. అన్ని గ్రామల్లో నూరుశాతం మరుగుదొడ్లు నిర్మించుకుని, వినియోగంలోకి తెచ్చేలా చర్యలు చేపట్టాని తెలిపారు. లబ్ధిదారులకు బిల్లులు మంజూరులో జాప్యం లేకుండా చూడాలని సూచించారు. ఆమె వెంట పీఆర్ ఏఈ మల్లికార్జున, ఆర్‌డబ్ల్యూస్ అధికారి గౌస్‌అహ్మద్, ఈఓపీఆర్డీ రవికుమార్ తదితరులున్నారు. -
క్రైస్తవుల కోసం ముస్లింలు చర్చిని నిర్మిస్తున్నారు!
పరమత సహనానికి చక్కని ఉదాహరణ పాకిస్థాన్ లోని ఈ గ్రామం. ఒక ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ దేశంలో క్రైస్తవుల కోసం ముస్లింలు ఓ చర్చిని నిర్మిస్తున్నారు. పాకిస్థాన్ లోని పంజాడ్ ప్రావిన్సుకు దగ్గరలో ఉన్న గోజ్రాకు దగ్గరలో ఉన్న ముస్లింలు రోజూ వారి వారు పని చేసి సంపాదించిన సొమ్ములో కొంతభాగాన్ని గ్రామంలో నివస్తున్న క్రైస్తవులకు చర్చిని నిర్మించి ఇవ్వడానికి దాస్తున్నారు. అంతేకాదు, వారే ప్రతి ఇంటి నుంచి రోజుకు ఒక్కొక్కరు చర్చిని నిర్మించడానికి ఇటుకలు, ఇసుక, సిమెంటు తదితరాలను మోస్తుంటే, మరొకరు వాటిని సిమెంట్ తో కలిపి గోడలు నిర్మిస్తున్నారు. ఈ విషయంపై వారిని పలకరించగా.. తోటి మతాలను గౌరవించాలని ఖురాన్ లోనే చెప్పారని గ్రామస్తులు అన్నారు. కాగా, పాకిస్థాన్ మతాలకు సంబంధించిన ఘర్షణలు జరగడం సాధారణమన్న విషయం తెలిసిందే. -
ప్రజల కోసం.. పదెకరాలు అమ్మేశాడు!
ప్రజల బాగు కోసం సొంత ఆస్తుల్ని సైతం అమ్ముకునేందుకు వెనకాడని హీరోల్ని తెలుగు సినిమాల్లో చాలా సార్లే చూసుంటాం. కానీ, నిజజీవితంలో ఇలాంటి వాటికి చోటు ఉండదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుండే సమాజంలో పక్కవారి కోసం త్యాగాలు చేయడానికి ఎవరూ సాహసించరు. మహారాష్ట్రకు చెందిన 42 ఏళ్ల సంజయ్ టిడ్కే దీనికి భిన్నం. ఎవరో రావాలని, ఏదో చేయాలని.. చూసినన్నాళ్లు ఎదురు చూశాడు. నిరీక్షణలు ఫలించవని తెలుసుకున్నాక తానే స్వయంగా బరిలోకి దిగాడు. ఇంతకీ, ఆయనేం చేశాడు? మహారాష్ట్రలోని అకోలా జిల్లాకు చెందిన సంజయ్ టిడ్కేను చాలా కాలంగా ఓ సమస్య వేధిస్తోంది. అదే.. డ్యామ్..! అవును, తన పంట పొలాల మీదుగా వృథాగా పోయే కాలువ నీటిని ఎలాగైనా నిల్వచేయాలనుకున్నాడు. దీనికి ఓ చిన్నపాటి డ్యామ్ అవసరమవుతుందని ఆయనకు బాగా తెలుసు. అయితే, పదిమందికీ పనికొచ్చే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు ప్రభుత్వాలు పూర్తి చేయాల్సినవే అని సంజయ్ భావించాడు. ఆ దిశగా అధికారులకు ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేశాడు. డ్యామ్‌ని నిర్మించి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరాడు. కానీ, ఏనాడూ ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఆయనకు సరైన సమాధానం రాలేదు. దీంతో ఓసారి తన ప్రయత్నంగా మట్టితో నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేశాడు. కానీ, ఆ ఏడాది కురిసిన వర్షాలకు మట్టి డ్యామ్ నిలబడలేదు. దీంతో సంజయ్ సహా రైతుల భూములన్నీ నీటమునిగాయి. పంటలు నాశనమై, వారంతా తీవ్రంగా నష్టపోయారు. కనీసం అప్పుడైనా ప్రభుత్వం తన అభ్యర్థనను మన్నిస్తుందని ఆశించాడు సంజయ్. కానీ, అలా జరగలేదు. ఎప్పటిలాగే ప్రభుత్వం ఉదాసీనత చూపింది. ఈ ఘటనతో కళ్లు తెరచుకున్న సంజయ్.. తన ముప్పై ఎకరాల భూమిలోంచి కొంత భాగాన్ని అమ్మేసి కాంక్రీట్ డ్యామ్‌ను నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. అలా పదెకరాలు అమ్మగా వచ్చిన రూ.55 లక్షలతో డ్యామ్ నిర్మాణం ప్రారంభించాడు. ఇది చూసైనా సానుకూలంగా స్పందించాల్సిన అధికారులు విచిత్రంగా వ్యవహరించారు. సంజయ్‌ను వేధించడం మొదలుపెట్టారు. ఇసుకను అక్రమంగా అమ్ముకుంటున్నాడంటూ కేసులు పెట్టారు. అయితే, సంజయ్ దేనికీ భయపడలేదు. గ్రామస్థుల సహకారంతో సొంతంగానే కాంక్రీట్ డ్యామ్‌ను నిర్మించాడు. దీని స్టోరేజీ సామర్థ్యం 3 కోట్ల లీటర్ల పైమాటే. ప్రస్తుతం తుది దశలో ఉన్న నిర్మాణ పనులు.. జూన్ మొదటివారం నాటికి పూర్తి కావొచ్చు. ఇదే కనుక, ప్రారంభమైతే ఆ ప్రాంత రైతులు సిరులు పండిస్తారనడంలో ఆశ్చర్యం లేదు! -
బుర్జ్ ఖలీఫా కన్నా ఎత్తైన టవర్!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆకాశహర్మ్యంగా పేరొందిన బుర్జ్ ఖలీఫా కన్నా పొడవైన నిర్మాణం చేపట్టేందుకు దుబాయ్ పావులు కదుపుతోంది. దీంతో ప్రపంచంలోనే ఎత్తయిన భవనం నిర్మించి...తన రికార్డును తానే అధిగమించేందుకు సన్నద్ధం అవుతోంది. 'ది టవర్' పేరుతో దుబాయ్‌కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఎమార్ ప్రాపర్టీస్ ఈ భవనాన్ని నిర్మించనుంది. 2020 నాటికి ఈ నిర్మాణం పూర్తి చేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. అయితే ఎత్తు ఎంత ఉంటుందన్న విషయం మాత్రం నిర్మాణం పూర్తయ్యే సమయానికి ప్రకటిస్తామని వెల్లడించింది. స్పానిష్-స్విస్ శిల్పి శాంటియాగో కాలట్రవ వల్స్ రూపకల్పనలో దుబాయ్‌లో నిర్మాణం రూపొందనున్నట్లు ఎమార్ వెల్లడించింది. ఈ ప్రత్యేక నిర్మాణంలో రెస్టారెంట్లు, విలాసవంతమైన హోటళ్ళు నిర్వహించేందుకు 18 నుంచి 20 అంతస్తులు మిశ్రమ వినియోగానికి పనికొచ్చేట్టుగా నిర్మించేందుకు పరిశీలనలో ఉన్నట్లు ఎమార్ సంస్థ ఛైర్మన్ అలబ్బర్ తెలిపారు. దుబాయ్ లోని జెడ్డాలో నిర్మించ తలపెట్టిన ఈ అత్యాధునిక నిర్మాణం... ఇకముందు నగరానికే కాక ప్రపంచంలోనే ఓ సొగసైన స్మారక చిహ్నంగా ఉంటుందని ఆయన వివరించారు. ఓ సన్నని స్తంభంలా ఆకట్టుకునేట్లు కనిపించే టవర్... భూమిలోనూ బలమైన పునాదులు కలిగి ఉంటుందన్నారు. ఆకాశమే హద్దుగా డజన్లకొద్దీ నిర్మాణాలను చేపట్టడంలో ఎంతో గుర్తింపును సాధించిన దుబాయ్ నగరం... భవిష్యత్ లోనూ ఈ అత్యంత పొడవైన నిర్మాణంతో ప్రత్యేకంగా ఆకట్టుకోనుంది. ప్రస్తుత ప్రాజెక్టుకు సుమారు 664 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని, బుర్జ్ ఖలీఫా కన్నా పొడవుగా ఉంటుందంటూ అలబ్బర్ ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. కాగా ఇప్పటివరకూ ప్రపంచంలోనే ఎతైన నిర్మాణంగా పేరొందిన బుర్జ్ ఖలీఫా ఎత్తు 828 మీటర్లు ఉండగా.. దాన్ని నిర్మించేందుకు సుమారు 997 కోట్ల రూపాయలు ఖర్చయింది. -
రైలు లింక్ ఒప్పందం కుదిరింది..
బీజింగ్: చైనా, నేపాల్ దేశాలు ప్రధాన మైలు రాయిని దాటాయి. నేపాల్ ప్రధాని కెపి ఒలి అభ్యర్థనను చైనా అంగీకరించడంతో ఏళ్ళ తరబడి పెండింగ్ లో ఉన్న చైనా-నేపాల్ లింక్ రైల్ నిర్మాణంతో పాటు పది ఒప్పందాలపై సంతకాలు చేసి, ఇరు దేశాలమధ్య సంబంధాలను సుస్థిరం చేసుకున్నాయి. ప్రతి విషయానికీ నేపాల్ భారతదేశంపై ఆధారపడటాన్ని తగ్గించడంలో భాగంగా చైనా నుంచి టిబెట్ మీదుగా నేపాల్ కు వ్యూహాత్మక రైల్వే లింక్ నిర్మాణానికి వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. నేపాల్ ప్రధాని కెపి ఒలి ఏడు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం చైనా చేరుకున్నారు. ఆయనకు చైనా ప్రీమియర్ కెక్వాంగ్ గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్ లో రెడ్ కార్పెట్ తో ఘన స్వాగతం పలికారు. చైనా అధ్యక్షుడు క్సి జిన్ పింగ్ కు కూడ పిలుపినిచ్చారు. అయితే నేపాల్ లో ప్రభుత్వ మార్పు... అక్కడే స్థిరపడ్డ భారతీయులు వ్యతిరేకించడం, నేపాల్ సరిహద్దుల్లో ఇద్దరు భారతీయుల్ని నేపాల్ భద్రతా దళాలు కాల్చి చంపడం వంటి అనేక సంఘటనలు ఇటీవల భారత్, నేపాల్ దేశాల మధ్య సహృద్భావ వాతావరణాన్ని దెబ్బ తీశాయి. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రధాని చైనా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా, నేపాల్ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, సరఫరా మార్గాలను పెంపొందించుకొనేందుకు నేపాల్ ప్రధాని పర్యటన ప్రధాన్యత నిచ్చింది. అయితే చర్చల సందర్భంగా ఇద్దరు ప్రధానమంత్రులు ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష చేసి, ఇరు దేశాలమధ్య క్రమంగా పెరుగుతున్న సంబంధాలపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసం, అవగాహన కుదిరిందని, అలాగే అన్ని రంగాల్లో లాభదాయకమైన సహకారం ఉంటుందని నేపాల్ విదేశాంగ శాఖ జారీ చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ట్రేడ్ విస్తరణ, సీమాంతర మార్గాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉత్పాదనలో పరస్పర సహకారం, పర్యాటకం, ఫైనాన్స్, విద్య మరియు సంస్కృతి లపై ప్రధానంగా ప్రధానులిద్దరూ చర్చించినట్లు తెలిపింది. ముఖ్యంగా లీ, ఒలి లు చర్చల్లో చైనా నుంచి టిబెట్ మీదుగా నేపాల్ కు రైల్వే మార్గం నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. -
'చట్టంలోని హామీలను కేంద్రప్రభుత్వం పూర్తి చేయాలి'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని రాష్ట్ర నడిమధ్యలో ఉంచాలని నిర్ణయించి అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడలో ఆయన ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'రాజధాని ప్రాంతం అందరికీ సమానదూరంలో ఉండాలని మొదటి నుంచి చెప్పుతున్నామని... రాజధాని ఎక్కడ పెట్టాలన్న దానిపై కాంగ్రెస్ పార్టీ ఏమి చెప్పలేదన్నారు. విభజన చట్టంలోని వివిధ అంశాలను కేంద్రప్రభుత్వం ఇంకా అమలు చేయలేదన్నారు. ల్యాండ్ ఫూలింగ్‌కు ముందుకొస్తే... భూమి విలువ పెరుగుతుందని తాను ముందు నుంచి చెబుతున్నానని చంద్రబాబు గుర్తుచేశారు. రాజకీయాలకు అతీతంగా ల్యాండ్ ఫూలింగ్‌కు ముందుకు వచ్చిన రైతులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానన్నారు. ఉక్కు సంకల్పంతో రాజధానిని పూర్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో భూములు ఇష్టానుసారం చేతులు మారాయని ఆరోపించడంలో నిజం లేదని చంద్రబాబు స్పష్ట చేశారు. కొందరు బెదిరించి లాక్కున్నారని అంటున్నారని, బెదిరించి లాక్కుంటే కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు భూములు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. 1954కు ముందున్న అసైన్డ్ భూములను అమ్ముకోవచ్చని, ఆ తర్వాత ఉన్న అసైన్డ్ భూముల విషయంలో సమస్యలున్నాయని ఆయన వెల్లడించారు. భూములు లాక్కున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారికి రక్షణ కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. -
ఆకాశంలో కిలోమీటర్ ఎత్తున టవర్..!
కిలోమీటర్ ఎత్తున.. ఆకాశాన్ని తాకుతున్నట్లుగా కనిపించే ప్రపంచంలోనే అతి పెద్ద, పొడవైన నిర్మాణాన్ని సౌదీ ప్రభుత్వం చేపట్టింది. ఈ భారీ కట్టడం నిర్మాణంలో 57 లక్షల చదరపు గజాల కాంక్రీట్, 80 వేల టన్నుల స్టీల్ ను వినియోగించి, దుబాయ్ లోని అతిపెద్ద టవర్, గిన్నిస్ రికార్డులకెక్కిన 'బుర్జ్ ఖలిఫా' ను తలదన్నే రీతిలో నిర్మిస్తున్న ఈ కట్టడం... అనుకున్నలక్ష్యాన్ని చేరితే ప్రపంచ గుర్తింపు తెచ్చుకోగలదని భావిస్తున్నారు. అతిపెద్ద జెద్ టవర్ ప్రాజెక్టు ఆకర్షణీయంగా నిర్మించేందుకు సుమారు ఏడువేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. జెడ్ ఎకనమిక్ కంపెనీ, సౌదీ అరేబియాకు చెందిన అలిన్మా ఇన్వెస్ట్ మెంట్ సంస్థలు సంయుక్తంగా రెండు వందల ఇరవై కోట్ల రూపాయలను వెచ్చించి జెద్ నగరంలో ఈ నిర్మాణం చేపట్టేందుకు ఒప్పందంపై సంతకాలు చేసినట్లు సౌదీ ప్రభుత్వం ఓ పత్రికా ప్రకటన ద్వారా తెలిపింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ నిర్మాణం 26వ అంతస్తు వరకు పూర్తయిందని, 3 వేల 280 అడుగుల ఎత్తైన ఈ ఆకాశహర్మ్యం 2020 లోగా పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ నిర్మాణంతో స్థానికంగా రియల్ ఎస్టేట్ మరింత అభివృద్ధి చెందుతుందని, ఆధునిక జీవన శైలిని కూడా అందిస్తుందని, అనుకున్న లక్ష్యాన్ని చేరితే ఓ ప్రపంచ స్థాయి పట్టణ కేంద్రంగా ఈ ప్రాంతం రూపు దిద్దుకుంటుందని జెడ్దా ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మౌనిబ్ హమ్మౌద్ అంటున్నారు. -
సింగపూర్ తరహాలో పోలీస్ వ్యవస్ధ నిర్మాణం
-
మోడ్రన్ చైనావాల్
-
స్పీడెక్కువైతే...లెసైన్స్ రద్దు
పాడేరు రూరల్ : మన్యంలో ఇటీవల కాలంలో తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు పాడేరు డివిజన్ పోలీసులు నడుం బిగించారు. డ్రైవర్లకు, వాహన యజమానులకు కౌన్సెలింగ్ చేపట్టారు. తప్పతాగి వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణమవుతున్న డ్రైవర్లను గుర్తించడానికి ప్రత్యేకంగా మౌత్ అలార్ట్ మిషన్‌ను తెప్పించారు. గురువారం స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్కార్యాలయంలో పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టు, హుకుంపేట, జి. మాడుగుల మార్గాలో జీపులు, ఆటో సర్వీసులు చేస్తున్న డ్రైవర్లు, వాహన యజమానులతో సమావేశం నిర్వహించారు. ఇటీవల కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు వీలుగా ముద్రించిన గోడ పత్రికలను అవిష్కరించారు. ఈ సందర్భంగా పాడేరు ఏఎస్పీ బాబూజీ మాట్లాడుతూ జీపులు, ఆటోల్లో పరిమితి మేరకే ప్రయాణికులను ఎక్కించాలని, వేగాన్ని తగ్గించాలని, మద్యం సేవించి వాహనాలను నడపరాదని హెచ్చరించారు. ఎవరైనా ప్రమాదాలకు కారణమైతే అటువంటి వారి లెసైన్స్‌లను రద్దు చేసి, వాహనాలను సీజ్ చేసి, హత్య కేసు నమోదు చేస్తామన్నారు. సక్రమంగా వాహనాలు నడిపి, రోడ్డు ప్రమాదాలకు దూరంగా ఉన్న లెసైన్స్‌లు లేని డ్రైవర్లను గుర్తించి రవాణ శాఖ ద్వారా పోలీసు శాఖ లెసైన్స్‌లను ఇప్పించే ఏర్పాట్లు చేస్తుందన్నారు. కార్యక్రమంలో అనకాపల్లి ఆర్టీవో శివరామకష్ణ, పాడేరు డిపో మేనేజర్ వి. ప్రవీణ, పాడేరు సీఐ ఎన్. సాయి, పాడేరు హుకుంపేట ఎస్ఐలు ధనుంజయ్, భరత్‌కుమార్ పాల్గొన్నారు.