క్రైస్తవుల కోసం ముస్లింలు చర్చిని నిర్మిస్తున్నారు! | Muslim farmers build church for christian neighbours | Sakshi
Sakshi News home page

క్రైస్తవుల కోసం ముస్లింలు చర్చిని నిర్మిస్తున్నారు!

Jun 12 2016 5:50 PM | Updated on Oct 16 2018 6:01 PM

పరమత సహనానికి చక్కని ఉదాహరణ పాకిస్థాన్ లోని ఈ గ్రామం.

పరమత సహనానికి చక్కని ఉదాహరణ పాకిస్థాన్ లోని ఈ గ్రామం. ఒక ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ దేశంలో క్రైస్తవుల కోసం ముస్లింలు ఓ చర్చిని నిర్మిస్తున్నారు. పాకిస్థాన్ లోని పంజాడ్ ప్రావిన్సుకు దగ్గరలో ఉన్న గోజ్రాకు దగ్గరలో ఉన్న ముస్లింలు రోజూ వారి వారు పని చేసి సంపాదించిన సొమ్ములో కొంతభాగాన్ని గ్రామంలో నివస్తున్న క్రైస్తవులకు చర్చిని నిర్మించి ఇవ్వడానికి దాస్తున్నారు.

అంతేకాదు, వారే ప్రతి ఇంటి నుంచి రోజుకు ఒక్కొక్కరు చర్చిని నిర్మించడానికి ఇటుకలు, ఇసుక, సిమెంటు తదితరాలను మోస్తుంటే, మరొకరు వాటిని సిమెంట్ తో కలిపి గోడలు నిర్మిస్తున్నారు. ఈ విషయంపై వారిని పలకరించగా.. తోటి మతాలను గౌరవించాలని ఖురాన్ లోనే చెప్పారని గ్రామస్తులు అన్నారు. కాగా, పాకిస్థాన్ మతాలకు సంబంధించిన ఘర్షణలు జరగడం సాధారణమన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement