christians
-
ప్రభుయేసు ఆగమనం
విశ్వవ్యాప్తంగా క్రైస్తవ విశ్వాస సమాజం యేసుప్రభువు వారి జన్మదినం జరుపుకొనేందుకు నాలుగువారాలు ముందస్తుగా ‘క్రిస్మస్’ వేడుకలు ప్రారంభిస్తున్నారు. దీనినే ‘అడ్వెంట్’ అంటారు. అనగా ఆగమనం/రాకడ/ఆహ్వానం పలుకుటకు ముందస్తుగా ఏర్పాట్లు ప్రారంభించి, డిసెంబరు 24 సాయంత్రంతో ముగిస్తారు.దేవకుమారుడైన యేసుక్రీస్తు ఆగమనానికి ముందస్తు క్రైస్తవ విశ్వాస సమాజం ప్రార్థనలోను, సంఘ సహవాసంతోను కలిసి దేవుని వాక్యానుసారంగా ప్రార్థించుటకు ‘దేవుని మందిరమైన’ సంఘంలో పాల్గొని ‘క్రిస్మస్’ డిసెంబరు 25న క్రీస్తు జన్మదినం కొరకు సిద్ధపడటమే ‘అడ్వంట్’. చీకటిరాత్రి తొలగి అరుణోదయ కాంతి రావటమే ప్రధానాంశం.క్రీ.పూ. 5వ శతాబ్ద కాలంలో ‘మాలకీ’ అనే దేవుని దూత చెదిరిపోయిన ఇశ్రాయేలీయులు అనగా ప్రవాసులుగా భూమియంతట చెందినవారిని, నిస్సహాయక స్థితిలో ఉన్న వారిని భయభక్తులు కలిగి వుండాలని సందేశిమిచ్చాడు. కానీ వారిని భయభ్రాంతుల నిమిత్తం కాదన్నది వాక్యభావం, అందులో ప్రాముఖ్యంగా నియామ ఏకదినము, చిగురపుట్టను అన్న వచనాలు బలపరుస్తూ క్రీ.పూ 742–687 సంవత్సకాలంలో సింధూర వృక్షం నరకబడిన దానిమొద్దులోనుంచి పరిశుద్ధమైన చిగురు పుట్టునన్న వాక్యం దావీదు వంశావళిలో శాంతి, సమాధానాది ప్రదాతయైన యేసుప్రభువువారు జన్మించునని ముందస్తుగానే ప్రవచించారని వాక్యం స్పష్టీకరించుచున్నది. మలాకీ కాలం క్రీ.పూ. 5వ శతాబ్దం (మలాకీ 4 :1 –6; యెషయా 6 : 13).ఈ ముందస్తు క్రీస్తు ప్రభువువారి జన్మదిన సిద్ధపాటులో ప్రజలు లేక పెండ్లి విందుకు ఆహ్వానించినవారిలో కొందరు బుద్ధిమంతులు వుంటారని, మరికొందరు బుద్ధిహీనులుగా వుంటారని పెండ్లి కుమారుడు వచ్చేవరకు వేచి వున్న బుద్ధిమంతుల దీపము అనగా భక్తిపరులుగా వాక్యానుసారంగా ఎదురుచూస్తారని ఏల అనగా వారి దీపములలో అనగా భక్తిలో నూనెతో సిద్ధపడతారని, (‘నూనె’ భక్తికి సాదృశ్యం), బుద్ధిహీనులు దానికి బదులుగా విరుద్ధమైన సిద్ధపాటు పడతారని వారు బుద్ధిహీనులని యేసుప్రభువులవారు ఇశ్రాయేలీయుల ప్రజలతో ఉపమాన రీతిలో బోధించారని ఈ వాక్యం తెలియజేస్తున్న పరమార్థం (మత్తయి 5 :1–13).కనుక ముందస్తు ఆగమనం కొరకు ఎదురుచూసేవారు ఈ నాలుగువారాలు సంఘము నియమింపబడిన సమయంలో భక్తిపూర్వకంగా వాక్యానుసారమైన ప్రార్థన, సంఘ సహవాసంతో కలిసి ప్రార్థనలలో పాల్గొని పరిశుద్ధంగా అనగా ఆ ప్రార్థనల్లో 100 శాతం నిజాలు, ప్రభువు సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థనలు వుండేలా సిద్ధపడుదురు గాక.– కోట బిపిన్‌చంద్రపాల్ -
వెచ్చని హృదయ రాగ సందేశం
ఇది నిన్ననే జరిగినట్లుగా నా జ్ఞాపకంలో స్పష్టంగా ఉంది. నిజానికైతే, నేను తొలిసారి ఫాదర్ టెర్రీ గిల్ఫెడర్ను కలిసింది నలభై ఏళ్ల కిందట! అది 1982 వేసవి చివరిలో... నిషా, నేను మా పెళ్లికి సిద్ధం అవుతున్న సమయం. ఒక క్యాథలిక్‌గా నిషా తను కోరుకున్న సంప్రదాయబద్ధమైన చర్చి వివాహానికి నేను నా అంగీకారాన్ని తెలిపినప్పుడు, స్థానిక పారిష్ చర్చి ప్రీస్ట్‌ను కలసి ఆయన చేత మూడు ఉపదేశాలు ఇప్పించుకోవలసి అవసరం ఏర్పడటం నన్ను చీకాకు పెట్టింది. కానీ వేరే దారి లేదు. వెదికితే, అతి దగ్గరగా నార్తంబర్లాండ్ అవెన్యూలో ఉన్న పునీత మేరీ మగ్దలీనా చర్చి ఒక్కటే నిషాకు ఒక క్రైస్తవేతరునితో వివాహం జరిపించేందుకు అంగీకరించింది, నిబంధనలకు లోబడి ఉండే షరతు మీద! సెప్టెంబరులో ఒక శనివారం, సాయంత్రం 6 గంటలప్పుడు నిషా, నేనూ ఫాదర్ టెర్రీ ఇంటి తలుపు తట్టాం. ఆయన తన డెస్క్ ముందు కూర్చొని ఉన్నారు. ఆయన కళ్లజోడు ముక్కు చివరికి దిగి ఉంది. ఆ చిన్న గదికి ఎదురుగా ఉన్న ఒక పాత, వెలసిపోయిన లెదర్ సోఫా మీద మేము కూర్చున్నాం. బయట ఎప్పుడూ లేనంత వేడిగా ఉంటే, లోపల వాతావరణం మంచులో ఉన్నట్లుగా ఉంది. నేను ఊరకే ఉండలేకపోతున్నాను. ‘‘షెర్రీ తీసుకుంటారా?’’ అని ఆయన అనటం నన్ను అమితంగా ఆశ్చర్యపరిచింది. ‘‘మీ ఇద్దరి గురించీ నాకు తెలియదు. కానీ నేను షెర్రీ పట్ల కొంత మొగ్గుగానే ఉన్నాను’’ అన్నారు.అది టియో పెపె. నాకు ఇష్టమైనది. షెర్రీ బ్రాండ్. కానీ ఆ రోజుల్లో లండన్‌లో అది చాలా అరుదుగా మాత్రమే దొరికేది. ఫాదర్ టెర్రీ వివేచనతో కూడిన అభిరుచి గల వ్యక్తి. నేను ఆయనతో యూఎస్ ఓపెన్ టెన్నిస్, నాటింగ్ హిల్ కార్నివాల్, రష్దీ ‘మిడ్నైట్ చిల్డ్రన్’ వంటివాటిపై చర్చిస్తూ ఉన్నాను– మేము చేసుకోబోయే వివాహం, మాకు పుట్టబోయే పిల్లలు ఏ మతాన్ని అనుసరించవలసి ఉంటుంది– అనేవి తప్ప... అన్నీ. ఫాదర్ టెర్రీ మా గ్లాసులను నింపుతూ సంభాషణను నడిపిస్తున్నారు. ఆయన నా వాదనను గ్రోలుతూనే, తన వాదనను సౌఖ్యంగా నిలిపి ఉంచుకుంటున్నారు. కాలం ఉల్లాసవంతమైన వేగంతో గడిచిపోయింది. వచ్చేవారం కలుద్దాం అనుకున్నాక, బయల్దేరేందుకు మేము లేచి నిలబడ్డాం. ఫాదర్ టెర్రీ మమ్మల్ని ఆపినప్పుడు మేము తలుపు దగ్గర ఉన్నాం. ‘‘మీరు ఆలోచించాలని నేను కోరుకుంటున్న విషయమై ఒక ప్రశ్న నా దగ్గర ఉంది’’ అన్నారు. ఆ ప్రశ్నకు సూచనగా చిరునవ్వొకటి విశాలమైన ఆయన గుండ్రటి ముఖం మీద నాట్యమాడింది. ఆయన కళ్లు సూటిగా మావైపే చూస్తున్నాయి. ‘‘మీరిద్దరూ కలిసి ఎందుకు సహజీవనం చేయకూడదు?’’ అన్నారు ఫాదర్ టెర్రీ. మా ముఖాల్లోంచి రక్తం చివ్వున చిమ్మిందేమో నేను కచ్చితంగా చెప్పలేను కానీ, మేమిద్దరం మాత్రం నోట మాట రాక అలా ఉండిపోయాం. నిజం ఏమిటంటే నిషా, నేను అప్పటికే సహజీవనంలో ఉంటూ ఆ వాస్తవాన్ని దాచటానికి ఉద్దేశపూర్వకంగానే ఫాదర్ టెర్రీకి వేర్వేరు చిరునామాలను ఇచ్చాం. అది ఆయన ఊహించారు. అందుకే తన పద్ధతిలో అదేం పెద్ద విషయం కాదన్నట్లు చెప్పారు. నిషా పూర్తి క్రైస్తవ సంప్రదాయంలో వివాహాన్ని కోరుకుంది. వరుడు క్రైస్తవుడు కాదు అనే విషయాన్ని పట్టించుకోకుండా ఫాదర్ టెర్రీ అందుకు సమ్మతించారు. ఆయన ఉపదేశ వాక్యం అందరి దృష్టిని ఆకర్షించింది. నరకం, అపరాధం, దైవం, çసచ్ఛీలత... వీటి గురించి ఆయన ఉపదేశించలేదు. ‘‘ఐ లవ్ యు’’ అనే మూడు చిన్న పదాల గురించి మాట్లాడారు. ‘‘కరణ్, నిషా...’’, ‘‘గుర్తుంచుకోండి. ‘ఐ’ నీ, ‘యు’నీ ‘లవ్’ జత కలుపుతుంది. కానీ అది వేరు కూడా చేస్తుంది. మీరిద్దరూ వేర్వేరు వ్యక్తులని మీరు మరచిపోయిన రోజున మీ బంధం విడిపోతుంది’’ అన్నారు ఫాదర్ టెర్రీ. అదొక వెచ్చని, తేలికపాటి, హృదయపూర్వక సందేశం. లాంఛనప్రాయమైన తంతు కంటే కూడా నిప్పు చుట్టూ కూర్చొని మాట్లాడుకోవటం వంటిది. కానీ అది పావు శతాబ్దం పాటు నా మదిలో వెలుగుతూనే ఉండిపోయింది. ఆరేళ్ల తర్వాత, ఆసుపత్రిలో నిషా చివరి ఘడియల్లో ఉన్నప్పుడు లైఫ్ సపోర్టును తొలగించటానికి కొన్ని నిమిషాల ముందు ఫాదర్ టెర్రీ ఆమె పక్కనే ఉన్నారు. ఆమెకు చివరి మతకర్మను నిర్వహించారు. అమ్మను కూడా హైందవ సంప్రదాయం ప్రకారం నిషా చెవిలో ప్రార్థనలు వినిపించమని ప్రోత్సహించారు. ఆ తర్వాత యంత్రాలు మెల్లగా, బాధగా మినుకు మినుకుమని కొడిగడుతున్నప్పుడు నిషా అంతిమ శ్వాసలో ఫాదర్ టెర్రీ నా పక్కన నిలబడ్డారు. నాకు తెలిసిన ఏకైక క్రైస్తవ మత గురువు టెర్రీ గిల్ఫెడర్. ఆయన ఒక వింత మనిషి అయినప్పటికీ ఒక గొప్ప వ్యక్తి. ఒరిస్సా, కర్ణాటకలలో క్రైస్తవులపై జరిగిన దాడి గురించి చదివిన ప్రతిసారీ నేను ఆయన గురించి ఆలోచిస్తాను. గాయపడిన హృదయాలను నయం చేసే పదాలను ఆయన కనుగొని ఉంటారని నేను నమ్ముతాను. అందుకు నిస్సందేహంగా ఆయనకు షెర్రీ సహాయపడి ఉంటుంది. కరణ్ థాపర్ – వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
గుడ్ ఫ్రైడే' 2024: ప్రాముఖ్యత ఏంటి.. ‘హ్యాపీ గుడ్ ఫ్రైడే' విషెస్ చెప్పకండి!
క్రైస్తవ సోదరులకు గుడ్ ఫ్రైడే పవిత్ర దినం. బైబిలు ప్రకారం గుడ్ ఫ్రైడ్ అంటే మానవాళి పాపాలకు జీసస్ శిలువపై ప్రాణాలను పణంగా పెట్టిన రోజు. అందుకే ఏసుక్రీస్తు జ్ఞాపకార్థం ఈ రోజును పవిత్ర శుక్రవారం, లేదా బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. శిలువ వేయబడిన మూడు రోజుల తరువాత యేసు పునరుత్థానాన్ని ఆదివారం రోజు ఈస్టర్ గా పాటిస్తారు. గుడ్ ఫ్రైడే రోజున క్రైస్తవులు ఉపవాసం ఉండి దేవున్ని తలచుకుంటారు. జీసస్ ప్రార్థనలో గడుపుతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. ప్రవచనాలు, ప్రార్థనలు, ధ్యానం వంటివి జరుగుతూనే ఉంటాయి. కొంతమంది నల్లటి వస్త్రాలు ధరించి తమ బాధను వ్యక్తపరుస్తారు. గుడ్ ఫ్రైడే విషెస్ యేసు మరణానికి త్యాగానికి గుర్తుగా సంతాపాన్ని తెలియజేయడానికి దీన్ని నిర్వహించు కుంటారు. అందుకే గుడ్ ఫ్రైడే వస్తే మాత్రం ఏ ఒక్కరూ హ్యాపీ గుడ్ ఫ్రైడే అని ఒకర్ని ఒకరు విష్ చేసుకోరు. మిగిలిన వారు కూడా ఎవరూ అలాంటి మెసేజ్‌లు పంపుకోరు. చర్చిలలో ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుకలు జరగవు. ఏసు ప్రభు ప్రజల పాపాలకోసం త్యాగ చేసి మానవాళికి మంచి చేశాడని, అందుకే ఫ్రైడేకి ముందు గుడ్ అనే పదం చేరిందని నమ్ముతారు. గుడ్ ఫ్రైడేను... హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుచుకుంటారు. శిలువ వేయడం అనేది యేసు జీవితంలో చిట్టచివరి ఘట్టమనీ, క్రైస్తవ సోదరుల విశ్వాసం. అందుకే గుడ్ ఫ్రైడే రోజు ఎన్నో చర్చిలలో ఈ నాటికను ప్రదర్శిస్తారు. అలాగే గుడ్ ఫ్రైడేకి ముందు లెంట్ డేస్ మొదలవుతాయి. దాదాపు 46 రోజులు పాటు కొనసాగుతాయి. ఆ రోజుల్లో ఉపవాసాలను పాటిస్తారు. -
Kerala Blast: కేరళలో వరుస పేలుళ్లు
కొచ్చి: కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలోని కొచ్చి నగర సమీపంలో వరుస పేలుళ్ల ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. మతపరమైన వేడుక జరుగుతున్న కన్వెన్షన్ సెంటర్లో చోటుచేసుకున్న ఈ పేలుళ్లలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో 51 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మూడు రోజులుగా జరుగుతున్న ఈ వేడుకల ముగింపు కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనేందుకు కలామాస్సెరీలోని జామ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌కు ఆదివారం ఉదయం వందలాది మంది ‘జెహోవా’ క్రైస్తవులు తరలివచ్చారు. అందరూ ప్రార్థనల్లో ఉండగా, ఉదయం 9.40 గంటలకు హఠాత్తుగా పేలుడు జరిగింది. కొద్దిసేపటికే మరోరెండు పేలుళ్లు సంభవించాయి. దీంతో జనమంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది మంది రక్తమోడుతూ కనిపించారు. ఘటనా స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. మొదటి రెండు పేలుళ్లు శక్తివంతమైనవిగా, మూడోది తక్కువ తీవ్రత కలిగిన పేలుడుగా పోలీసులు గుర్తించారు. పేలుళ్ల కోసం దుండగులు ఐఈడీ ఉపయోగించినట్లు కేరళ డీజీపీ షేక్ దర్వేష్ సాహెబ్ చెప్పారు. ఇది ఉగ్రవాద చర్యా? లేక మరేదైనా కారణం ఉందా? అనేది ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. పేలుళ్లకు కారణమైన ముష్కరులను గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, చికిత్స కొనసాగుతోందని డీజీపీ స్పష్టంచేశారు. పేలుళ్ల సమాచారం తెలియగానే కేరళ రాష్ట్ర యాంటీ–టెర్రరిజం స్క్వాడ్, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలో ఆధారాల కోసం అన్వేషణ ప్రారంభించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. కేరళ గవర్నర్ దిగ్భ్రాంతి క్రైస్తవుల మత ప్రార్థనల్లో పేలుళ్లు జరగడం పట్ల కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పేలుళ్ల ఘటన అత్యంత దురదృష్టకరమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, దోషులను కఠినంగా శిక్షిస్తామని తేలి్చచెప్పారు. పేలుళ్లకు తానే కారణం అంటూ వ్యక్తి లొంగుబాటు కలామాస్సెరీలో తానే వరుస పేలుళ్లకు పాల్పడ్డానంటూ ఓ వ్యక్తి ఆదివారం కేరళలోని త్రిసూర్ జిల్లా కొడాకర పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. తాను కూడా ‘జెనోవా’ సభ్యుడినేనని చెప్పారు. లొంగిపోయిన వ్యక్తి పేరు డొమినిక్ మార్టిన్ అని పోలీసులు తెలిపారు. పేలుళ్లకు తానే కారణం అంటూ కొన్ని ఆధారాలు చూపించాడని వెల్లడించారు. అతడు చెప్పేది నిజమేనా? అనేది క్షుణ్నంగా విచారిస్తున్నామని అన్నారు. కళ్ల ముందు అగ్నిగోళం కనిపించింది కలామస్సెరీలో మత ప్రార్థనల్లో జరిగిన పేలుళ్లను తల్చుకొని ప్రత్యక్ష సాక్షులు బెంబేలెత్తిపోతున్నారు. తాను కళ్లు మూసుకొని పార్థన చేస్తున్నానని, హఠాత్తుగా భారీ పేలుడు శబ్ధం వినిపించిందని ఓ మహిళ చెప్పారు. వెంటనే ఉలిక్కిపడి కళ్లు తెరిచానని అన్నారు. కళ్ల ముందు భగభగ మండుతున్న ఒక అగి్నగోళం కనిపించిందని పేర్కొన్నారు. -
యూఏఈ దుబాయిలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు
-
క్రైస్తవులు ఏకతాటిపైకి రావాలి
హిమాయత్‌నగర్ (హైదరాబాద్): కొంతకాలంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే.. కొన్ని వర్గాల వారు చర్చిలు, మసీదులు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. కానీ, రాష్ట్రంలో వారి పప్పులు ఉడకవని, ముఖ్యమంత్రి కేసీఆర్ అటువంటి వారిని ఉపేక్షించరన్నారు. రాష్ట్రంలోని క్రైస్తవులంతా ఒకేతాటిపైకి వచ్చి వారి హక్కులు, సంక్షేమ పథకాలు సాధించుకునేందుకు అవకాశాలను అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. మంగళవారం నారాయణగూడలోని బాప్టిస్టు చర్చిలో ‘తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్స్ అండ్ పాస్టర్స్ అసోసియేషన్’(టీయూసీపీఏ) ఆధ్వర్యంలో 33 జిల్లాల పాస్టర్ల సమావేశం జరిగింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలసి మంత్రి తలసాని హాజరయ్యారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. క్రైస్తవుల్లో ఐకమత్యం లోపిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి హైదరాబాద్ వరకు ప్రతి మండలానికి ఓ కమిటీని రూపొందించి ఈ కమిటీలన్నీ ఒకే గొడుగు కింద ఉండేలా కృషి చేయాలన్నారు. అందరూ ఏకతాటిపైకి వస్తే దక్కాల్సిన హక్కులు తప్పకుండా దక్కుతాయన్నారు. మైనార్టీలు అంటే క్రైస్తవులు కాదనే ఆలోచన నుంచి క్రైస్తవులు బయటకు రావాలని సూచించారు. క్రైస్తవుల కోసం షాదీముబారక్ పేరుమార్పు అంశాన్ని పరిశీలిస్తామన్నారు. లోపాలను సరిదిద్దుకుని ముందుకువచ్చి హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని, అందరూ ఏకతాటిపైకి వచ్చి నిలబడితే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నానని తలసాని ప్రకటించారు. రాష్ట్రంలో కోటిన్నర జనాభా కలిగిన క్రైస్తవులు డెసిషన్ మేకర్స్ అని ఎమ్మెల్యే దానం అన్నారు. కొంతకాలంగా కొన్ని వర్గాలపై ప్రణాళిక ప్రకారం దాడులు జరుగుతున్నాయని.. దానిని అధిగమించేందుకు క్రైస్తవులు ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. -
ఆ రోజు వద్దు.. మరో రోజు పోలింగ్ పెట్టండి ప్లీజ్
ఇంఫాల్: శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను మార్చాలని ఆల్ మణిపూర్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ (ఏఎంసీఓ) కోరింది. ఫిబ్రవరి 27న జరగబోయే మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలను మరోరోజు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఆదివారం క్రైస్తవులకు ప్రార్థన దినం అయినందున పోలింగ్ తేదీని మార్చాలని పేర్కొంది. ఆదివారం కాకుండా మిగతా రోజుల్లో ఎప్పుడు పోలింగ్ నిర్వహించినా తమకు అభ్యంతరం లేదని తెలిపింది. తమ మనోభావాలను గౌరవించి మొదటి దశ పోలింగ్ తేదీని మార్చాలని ఈసీకి విజ్ఞప్తి చేసింది. కాగా, ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, ఇతర రాజకీయ పార్టీల అభ్యర్థన మేరకు పంజాబ్ ఎన్నికలను ఈసీ వాయిదా వేసిన సంగతి విదితమే. గురు రవిదాస్ జయంతి వేడుకల దృష్ట్యా ఫిబ్రవరి 14న జరగాల్సిన పోలింగ్‌ను ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. 60 మంది సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 27, మార్చి 3న మణిపూర్‌లో పోలింగ్ నిర్వహించనున్నారు. 30 లక్షల మంది జనాభా కలిగిన మణిపూర్‌లో క్రైస్తవులు 41.29 శాతం ఉన్నారు. ( ఆమె మౌనం.. ఎవరికి లాభం!) -
రామమందిరానికి క్రైస్తవుల భారీ విరాళం
శివాజీనగర: అయోధ్యలో నిర్మించే రామ మందిర నిర్మాణానికి కర్ణాటకలో క్రైస్తవ వర్గానికి చెందిన వ్యాపారులు, విద్యానిపుణులు పెద్దమొత్తంలో విరాళాలను అందజేశారు. బెంగళూరులో ఆదివారం ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సీ.ఎన్.అశ్వత్థనారాయణ ఏర్పాటు చేసిన సమావేశంలో క్రైస్తవ వర్గ వ్యాపారవేత్తలు, విద్యానిపుణులు, ఎన్ఆర్ఐలు, సీఇఓలు, సమాజ సేవకులు పాల్గొన్నారు. మందిర నిర్మాణానికి తమవంతు సహాయం చేస్తామని భరోసానిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లుగా అందరితో కలసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లటమే బీజేపీ లక్ష్యమని అశ్వత్ధ నారాయణ తెలిపారు. సుమారు రూ.కోటి వరకూ విరాళాలను అందజేసినట్లు ఆయన చెప్పారు. -
టీడీపీ క్రిస్టియన్ సెల్ నేతల మూకుమ్మడి రాజీనామాలు
సాక్షి, అమరావతి: మత సామరస్యాన్ని దెబ్బ తీస్తూ విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చర్యలను నిరసిస్తూ పలువురు క్రైస్తవ మైనార్టీ నాయకులు ఆ పార్టీని వీడుతున్నారు. క్రైస్తవులను అవమానిస్తూ చంద్రబాబు వ్యాఖ్యలు చేయటానికి నిరసనగా 13 జిల్లాల టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు ఆ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. టీడీపీ క్రిస్టియన్ సెల్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు యలమంచిలి ప్రవీణ్ నేతృత్వంలో మంగళవారం విజయవాడలో సమావేశమైన 13 జిల్లాల నాయకులు పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించారు. అనంతరం ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ క్రైస్తవ మతం గురించి చంద్రబాబు చేసిన తీవ్ర వ్యాఖ్యలు తమను ఎంతో బాధించాయన్నారు. చర్చిలో ప్రార్థనలు చేయలేదా బాబూ?: పాస్టర్లకి రూ.5 వేలు ఎవరు ఇమ్మన్నారని ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారని, అదే విషయాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయాన్ని మరిచారా? అని ప్రవీణ్ ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్లలో క్రిస్మస్ వేడుకలు ఎలా జరుపుతారని ప్రశ్నించిన చంద్రబాబు గతంలో చర్చికి వచ్చి గంటన్నర ఎలా ప్రార్థన చేశారు? బైబిల్ ఎలా చదివారు? అని నిలదీశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ క్రిస్టియన్ సెల్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు డి.వి.డి.వి.కుమార్, విజయవాడ అధ్యక్షుడు వెంకన్న, విశాఖ జిల్లా అధ్యక్షుడు బెన్హర్, తూ.గో.జిల్లా అధ్యక్షుడు రత్నరాజు, ప.గో.జిల్లా అధ్యక్షుడు విజయకుమార్, కృష్ణా జిల్లా అధ్యక్షుడు వెస్లీ, గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఇమ్మానియేల్, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావు, కడప జిల్లా అధ్యక్షుడు విజయ్ బాబు, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వి.సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. కాగా, చంద్రబాబు తీరును ఖండిస్తూ ఆయన కార్యక్రమాలను అడ్డుకునేందుకు పలు క్రైస్తవ సంఘాలు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ నెలాఖరులోపు విజయవాడలో భారీ సమావేశాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నాయి. -
బాబుపై టీడీపీ క్రిస్టియన్ సెల్ ఆగ్రహం
సాక్షి, అమరావతి: క్రిస్టియన్లపై తీవ్ర ఆరోపణలు చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై పలు క్రిస్టియన్ సంఘాలతో పాటు..ఆ పార్టీ క్రిస్టియన్ సెల్ సైతం ఆగ్రహంతో రగిలిపోతోంది. రాజకీయాల కోసం ఉన్నట్టుండి యూటర్న్ తీసుకుని క్రిస్టియన్లను అవమానిస్తూ మాట్లాడడం, వారిపై నిందలు వేయడం ఏమిటని పలువురు టీడీపీ క్రిస్టియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఫిలిప్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన బాటలోనే టీడీపీ క్రిస్టియన్ విభాగం పయనించడానికి సిద్ధపడుతోంది. ఈ అంశంపై చర్చించేందుకు టీడీపీ క్రిస్టియన్ సెల్ మంగళవారం విజయవాడలో సమావేశం అవుతోంది. రాష్ట్ర నాయకత్వంతోపాటు అన్ని జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, ముఖ్య నాయకులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. చంద్రబాబు తీరును ఎండగట్టాలని, మూకుమ్మడిగా పార్టీకి రాజీనామాలు చేయాలని వారు భావిస్తున్నట్లు తెలిసింది. చంద్రబాబు క్రైస్తవులకు క్షమాపణ చెప్పాలి కేవలం తమ రాజకీయ ఉనికిని చాటుకోవడం కోసం చంద్రబాబు తమ మతంపై అసభ్య వ్యాఖ్యలు చేస్తూ కులమతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఆలిండియా క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏపీ క్రిస్టియన్ లీడర్స్ ఫోరం, విశాఖ చాప్టర్ అధ్యక్షుడు రెవరెండ్ అద్దేపల్లి రవిబాబు అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను నిరసిస్తూ విశాఖలోని (జీవీఎంసీ) గాంధీ విగ్రహం వద్ద క్రైస్తవులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. చంద్రబాబు వెంటనే క్రైస్తవులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోరం రాష్ట్ర చైర్మన్ ఆలివర్ రాయ్, రెవ.డా.డీజే విల్సన్‌బాబు, రెవ.ఎల్.ఆర్. బిల్లి గ్రహమ్, రెవ.సన్నీజామ్స్, ఎం.జి.డబ్ల్యూ డేవిడ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న పెరికె వరప్రసాదరావు, బందెల దయానందం తదితరులు బాబును రాష్ట్రంలోకి రానివ్వం మత సామరస్యం కలిగిన రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్న చంద్రబాబును రాష్ట్రంలో కాలుపెట్టనివ్వబోమని క్రిస్టియన్ సంఘాలు మండిపడ్డాయి. విజయవాడలో సోమవారం ఏపీ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు పెరికె వరప్రసాదరావు మాట్లాడారు. రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికే చంద్రబాబు మత రాజకీయాలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోసియేషన్ కన్వీనర్ రెవరెండ్ దయానందం, అధ్యక్షుడు రవికిరణ్ తదితరులు మాట్లాడారు. త్వరలోనే చంద్రబాబు ఏకాకి.. భవిష్యత్తులో చంద్రబాబు ఏపీలో ఏకాకిలా మారనున్నారని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు లింగం జాన్‌బెన్నీ పేర్కొన్నారు. చంద్రబాబు ఓ మతోన్మాదిలా మారిపోయారని గుడ్లవల్లేరు మండలంలోని శేరీదగ్గుమిల్లిలో పాస్టర్లు నిరసన వ్యక్తం చేశారు. ఏఐసీసీ ఏపీ కార్యదర్శి ముత్యాల జయరాజు తదితరులు పాల్గొన్నారు. -
మత విద్వేషాలను రెచ్చగొడితే సహించం
భవానీపురం (విజయవాడ పశ్చిమ): క్రైస్తవులు, హిందువుల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడితే తగిన బుద్ధి చెబుతామని రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ (ఆర్కేపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు రంజిత్ ఓఫిర్ హెచ్చరించారు. క్రైస్తవులపై ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆర్కేపీ, క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ (సీఆర్పీఎస్) సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగాగల అంబేడ్కర్ విగ్రహం వద్ద సోమవారం నిరసన తెలిపారు. రంజిత్ ఓఫిర్ మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం కుల, మతాల మధ్య చిచ్చుపెట్టడం ఒక ఎంపీగా రఘురామకృష్ణరాజుకు తగదన్నారు. కార్యక్రమంలో సీఆరీ్పఎస్ జాతీయ అధ్యక్షుడు అప్పికట్ల జీవరత్నం, రాష్ట్ర అధ్యక్షుడు వై.బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
క్రైస్తవులు రేపు ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలి
సాక్షి, అమరావతి: గుడ్‌ఫ్రైడే సందర్భంగా శుక్రవారం క్రైస్తవులు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని క్రైస్తవ మైనార్టీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఏసురత్నం బుధవారం ఒక ప్రకనటలో తెలిపారు. కరోనా వైరస్ కారణంగా ఈనెల 14 వరకు లాక్డౌన్ అమలులో ఉన్నందున సామూహిక ప్రార్థనలు నిషేధించినట్లు తెలిపారు. పాస్టర్లు కూడా ఈ విషయాన్ని గుర్తించి భక్తులకు తెలిపి వారి ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకునే విధంగా చూడాలని కోరారు. -
మనిషి స్వార్థంతో మసకబారిన దేవుని ప్రేమ!!
పస్కా పండుగనాచరించడానికి యూదులంతా యెరూషలేము పట్టణానికి రావాలన్నది ధర్మశాస్త్ర నిబంధన (నిర్గమ 23:7). అందువల్ల యేసుప్రభువు కూడా మత్తయి సువార్త 21వ అధ్యాయంలోనే పస్కాపండుగ కోసం యెరూషలేము పట్టణానికి వచ్చాడు. యెరూషలేము ప్రజలను, పండగనాచరించడానికి అక్కడికి వచ్చిన యూదులనుఉద్దేశించి ‘నేను ఆకలితో ఉన్నపుడు నాకు మీరు భోజనం పెట్టారు, నాకు దాహమైనపుడు నీళ్లిచ్చారు, పరదేశిగా ఉన్నపుడు ఆశ్రయమిచ్చారు, వస్త్రాలు లేనపుడు వస్త్రాలిచ్చారు, రోగినై వుంటే, చెరసాలలో ఖైదీగా ఉంటే నన్ను మీరు పరామర్శించారంటూ యేసు చేసిన బోధ యెరూషలేములో పెద్ద సంచలనమే రేపింది (మత్తయి 25;35,36), ఈ బోధ విన్న వాళ్లంతా, ‘ప్రభువా, మీకోసం మేము ఇవన్నీ ఎప్పుడు చేశాము?’ అంటూ అమాయకంగా ప్రశ్నించారు. ‘‘నాకు ప్రత్యక్షంగా చెయ్యలేదేమో, కానీ మీ చుట్టూ ఉన్న పేదలు, నిరాశ్రయులైన వారికి మీరు చేసిన ప్రతి మేలూ, సహాయమూ నాకు చేసినట్టే’’ అని వివరించి, ఇలా పేదలను ఆదుకున్న ‘మీరంతా నా పరలోకపు తండ్రిచేత ఆశీర్వదించబడినవారు’ అని ప్రకటించాడు. దేవుని దర్శనం కోసం ఎక్కడెక్కడినుండో వచ్చిన నాటి యూదులందరికీ, ‘దేవుని చూసేందుకు ఇంత దూరం రానఖ్ఖర్లేదు, మీరుండే ప్రాంతాల్లోనే మీ చుట్టూ ఆపదల్లో, అవసరతల్లో ఉన్న పేదలు, బలహీనులకు అండగా నిలిస్తే చాలు, దేవుని చూసినట్టే, ఆయన్ను సేవించినట్టే’ అంటూ యేసు చేసిన నాటి బోధతో పండుగ తర్వాత సొంత ఊళ్లకు వెళ్లిన యూదు ప్రజలు, ప్రభావితులై వచ్చే ఏడాది యెరూషలేముకు రాకపోతే, వారి కానుకలు లేక ఆలయ ఖజానా వెల వెలబోతే, యాజకులు, ఆలయ నిర్వాహకులైన లేవీయులు బతికేదెలా? ఆలయ ప్రాంగణంలో అనుబంధంగా సాగుతున్న వ్యాపారాలు మూతపడితే ఎంత నష్టం? వెంటనే యాజకులు, యూదు ప్రముఖులు సమావేశమై ‘ఇక యేసును చంపాల్సిందే. కాకపోతే పండుగలో చంపితే ప్రజలు తిరుగబడతారు గనుక నిదానంగా ఆ పని చేద్దాం’ అని తీర్మానించుకున్నారు (మత్త 26:3,4). దేవుని మానవరూపమూ, తానే దేవుడైన యేసును చంపేందుకు, ఆయనకు ఆరాధనలు నిర్వహించే వారే కుట్ర చెయ్యడం కన్నా మరో విషాదం ఉంటుందా? దేవాలయ యాజక వ్యవస్థ స్వార్ధపూరితమైన ప్రతిసారీ, చరిత్రలో ఇలాంటి అనర్థాలే జరిగాయి. దేవుని ఉదాత్తమైన సంకల్పాలను మరుగు పర్చగల ‘నాశనకరమైన శక్తి’ మనిషి స్వార్థానిదని మరోసారి రుజువైంది. దీనికన్నా విషాదకరమైన పరిణామం మరోటి జరిగింది. పస్కా పండుగ మరునాడే అంటే అర్ధరాత్రి దాటగానే, ప్రజలంతా గాఢనిద్రలో ఉండగానే యేసును తాను అప్పగిస్తానని, ఆయన్ను అర్ధరాత్రే బంధించి, ప్రజలు నిద్ర లేచేలోగా విచారణ చేసి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చని యేసు శిష్యుల్లోనే ఒకడైన యూదా ఇస్కరియోతు ఆలయ యాజకులకు సూచించి అందుకు ముప్పై వెండినాణేలకు వారితో ఒప్పందం చేసుకున్నాడు. చివరికి అదే జరిగి మరునాడే యేసును సిలువ వేశారు. యేసు బోధల్ని ఉన్నవి ఉన్నట్టుగా లోకానికి చేరవేయవలసిన చర్చి, పరిచారకుల వ్యవస్థ తమ స్వార్థం కోసం వాటిని కలుషితం చేస్తున్నందువల్లే, దేవుని రాజ్య నిర్మాణం ఆగిపోయింది, ఎంతోశక్తితో సమాజాన్ని ప్రభావితం చేసి లోక కల్యాణానికి కారణం కావలసిన క్రైస్తవం’ పేలవమైంది. – రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్ -
దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తించాలి!
న్యూఢిల్లీ: క్రిస్టియన్లుగా మారిన షెడ్యూల్డ్ కులాల వారికి ఇతర ఎస్సీలకు లభించే అన్ని ప్రయోజనాలు లభించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు బుధవారం సుప్రీంకోర్టు అంగీకరించింది. ఎస్సీలను మతపరంగా తటస్థులుగా పరిగణించాలని ఆ పిటిషన్లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దళిత్ క్రిస్టియన్ సంస్థ కోరింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం... కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు, ఎస్సీ జాతీయ కమిషన్‌కు, మైనారిటీల జాతీయ కమిషన్‌కు, భారత రిజిస్ట్రార్ జనరల్‌కు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా స్పందించాలని వారిని ఆదేశించింది. ‘ఇస్లాంలో రిజర్వేషన్లు లేవు. ఆ విషయాన్ని విచారణలో భాగం చేయొచ్చు కదా!’ అని కోర్టు అభిప్రాయపడింది. -
శ్రావ్యంగా సాగిన మధురగీతం జాకబ్ సన్!!
తెలుగు క్రైస్తవలోకంలో ఎన్నో ఏళ్లపాటు తనదైన ముద్ర కలిగిన ఎంతో శ్రావ్యమైన క్రైస్తవ భక్తి సంగీత బాణీలతో విశ్వాసులను ఎంతో అలరించి కాంతులీనిన క్రైస్తవ సంగీత దర్శకుడు ఎం.డి.జాకబ్ సన్ అనే ఒక అద్భుతమైన తార కనుమరుగైంది. కొంతకాలంగా అనారోగ్యంగా ఉండి, 67 ఏళ్ళ వయసులో ఇటీవలే ఆయన కన్ను మూశారు. ఆయనకు భార్య రోసెలిన్, ఇద్దరు కూతుళ్లు సునయన, కత్రీనా ఉన్నారు. క్రైస్తవలోకంలో ఈ రోజున గొప్ప గాయకులుగా, సంగీత వాద్యకారులుగా ఉన్న చాలామంది జాకబ్ సన్ చేతిలోనే శిక్షణనొంది, ఆయన బాణీలద్వారానే పేరు పొందారు. ఆయన 1978 నుండి, 1980, 1990 దశకాల్లో ‘విశ్వవాణి’ అనే అద్భుతమైన క్రైస్తవ రేడియో కార్యక్రమాలకు చేసిన సంగీత పరిచర్య చిరస్మరణీయమైనది. అప్పట్లో పల్లెటూళ్లలో ఉన్నవాళ్లకు విశ్వవాణి కార్యక్రమంతోనే తెల్లవారేది, మళ్ళీ విశ్వవాణి కార్యక్రమంతోనే రాత్రయ్యేది. ఆ రోజుల్లో విశ్వవాణి రేడియో కార్యక్రమంలో దైవజనులు ఆరార్కే మూర్తి ప్రసంగం జనహృదయాలకు ఎంతగా హత్తుకునేదో, జాకబ్ సన్ పాటలు కూడా అంతే జనరంజకంగా ఉండేవి. ఆ తరాల తెలుగు క్రైస్తవులకు జాకబ్ సన్ ఒక సెలెబ్రిటీ!! ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెదధన్వాడ గ్రామానికి చెందిన జాకబ్ సన్ మహబూబ్ నగర్లో డిగ్రీ చదువుతున్నపుడు పెట్కార్ గారనే ఇంగ్లీష్ మిషనేరీ గారు. ఆరార్కే మూర్తి అనే దైవజనులు ఆయనలోని సంగీత ప్రతిభను గుర్తించి హైదరాబాద్‌లో తాము కొల్పిన ‘దేవుడు మాట్లాడాడు’ అనే స్టూడియోకు తీసుకొచ్చి తమ సంస్థ నిర్మించి, ప్రసారం చేస్తున్న తెలుగు క్రైస్తవ కార్యక్రమాలకు సంగీత దర్శకుడుగా నియమించారు. అదే కాలక్రమంలో విశ్వవాణి అనే పేరుతో ప్రాబల్యం పొందింది. అలా ఆరంభమైన జాకబ్ సన్ సంగీతపరిచర్య ద్వారా తెలుగు రాష్ట్రంలోని ఎందరో గాయకులూ, సంగీతకారులకు ఆయన స్టూడియోలో పాడి, వాయించి, అలా తెలుగు క్రైస్తవుల మన్నన పొందే ఆధిక్యత లభించింది. ‘దేవా నా దేవా’, ‘నా హృదయ సీమలో’, ‘దేవా నీవే నా ..’, ‘నే పాపినో ప్రభువా’, ‘దేవుని ఉపకారములలోన’, ‘ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు’ వంటి కబ్ సన్ బాణీ, సంగీతం కూర్చిన పాటలు, ఆ రోజుల్లో క్రెస్తవ చర్చిలు, విశ్వాసుల నాలుకలపై ఆడి, దైవికంగా మధురానుభూతులను పంచాయి. ఆయన సంగీతంలో, బాణీల్లో విశిష్టత ఏమిటంటే, అవి నేరుగా విశ్వాసి హృదయాన్ని తాకి మరో లోకంలోకి తీసుకెళ్తాయి. చాలా సాధారణమైన ఆ బాణీలు, ప్రజల్లోకి సునాయాసంగా వెళ్లి వాళ్లంతా హాయిగా పాడుకునేలా చేస్తాయి. ఆయన బాణీల్లో శ్రావ్యతే ప్రాధాన్యంగా ఉంటుంది. ఇంత గొప్ప ప్రతిభావంతుడైనా, అతిశయం, అహంకారమనేది ఆయనకసలు తెలియదు. ఎంతో నిరాడంబరంగా, వివాదాలకు దూరంగా, మృదుభాషిగా అందరిపట్లా స్నేహభావంతో మెలిగాడాయన. ఎంతోమంది అనామకులైన అతి సాధారణ గాయకులూ కూడా, ఆయన సంగీతం, ఆయన బాణీల్లోని విశిష్టత వల్ల గొప్ప గాయకులుగా పేరు ప్రతిష్టలు పేరొందారు. అందరితో కలిసిమెలిసి, ఆడుతూ, పాడుతూ, హాస్యోక్తులు వేస్తూ, తాను నవ్వుతూ అందరినీ నవ్వించడమే తప్ప ఎప్పుడూ ఎవర్నీ ఆయన నొప్పించిన సందర్భమే లేదు. సంగీతం, పాటలే తన లోకంగా బతికాడాయన. గోరంత ప్రతిభకు, తమ సొంత ‘మార్కెటింగ్ తెలివితేటలు’ జోడించి చూస్తుండగానే ఎంతో ఎత్తుకు ఆయన పరిచయం చేసిన అతి సాధారణ గాయకులు, సంగీతకారులే ఎదిగిపోయినా, ఎన్నడూ ఆయన వ్యసనపడలేదు. ఎంతటి పరిస్థితుల్లోనైనా తాను నొచ్చుకోకుండా, ఎవరినీ నొప్పించకుండా ఉండడానికే ప్రయత్నించేవాడే తప్ప, ధనార్జన పైన, పేరు సంపాదించడం పైన ఎన్నడూ దృష్టిపెట్టినవాడు కాదాయన. ప్రతి పరిస్థితిలోనూ, ఎంతో గుంభనంగా, నిండుగా జీవించాడు జాకబ్ సన్. జీవితమే క్రైస్తవ స్ఫూర్తితో సాగిన ఒక శ్రావ్యమైన సంగీత బాణీ జాకబ్ సన్!! అసూయకు, విమర్శలకు, వివాదాలకు తావివ్వని అసమానమైన విశ్వాసి ఆయన. తెలుగు క్రైస్తవ భక్తి సంగీత ప్రపంచంలో కొన్ని మైలు రాళ్ళ మీద ఆయన పేరు తప్పకుండా ఉంటుంది. శ్రావ్యమైన సంగీతంతో విలసిల్లే పరలోకంలో జాకబ్ సన్ తప్పక మరింత సంతోషంగా, ఆనందంగా ఉంటాడని సువార్తికుల విశ్వాసం. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ prabhukirant@gmail.com -
కలిసి ఉంటే కలదు సుఖం
కలిసి ఉంటే కలదు సుఖం అనే రీతిలో ప్రపంచవ్యాప్తంగా హిందూ కుటుంబాలు ఉమ్మడిగానే ఉంటున్నాయని అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉంటున్న హిందూ కుటుంబాల్లో 55 శాతం కుటుంబాలు కలిసి ఉంటున్నాయని ఆ సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. ఆ తర్వాత బౌద్ధులు 44 శాతం, ముస్లింలు 36 శాతం, క్రిస్టియన్లు 29 శాతం ఉమ్మడి కుటుంబాలుగానే ఉంటున్నారని తేలింది. ‘రెలిజియన్ అండ్ లివింగ్ అరేంజ్మెంట్ అరౌండ్ ద వరల్డ్’పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో సంపన్న దేశాల్లో నివసించే కుటుంబాలు చిన్నవిగానే ఉంటున్నాయని, ఆసియా, ఆఫ్రికా దేశాల్లో మాత్రం పెద్ద కుటుంబాలుగా జీవిస్తున్నారని వెల్లడించింది. – సాక్షి, హైదరాబాద్ అక్కడ చిన్న కుటుంబాలే ప్రపంచంలోని ప్రతి 10 మంది క్రిస్టియన్ కుటుంబాల్లో ఆరు కుటుంబాలు అమెరికా, యూరోప్‌లోనే ఉన్నాయని, ఆయా దేశాల్లో చిన్న కుటుంబాల వ్యవస్థ వైపే మొగ్గుచూపుతున్నారని ప్యూ తన అధికారిక వెబ్సైట్లో ఇటీవలే ఉంచిన సర్వే నివేదికలో పేర్కొంది. ప్రపంచంలోని ప్రతి 10 హిందూ కుటుంబాల్లో 9 కుటుంబాలుండే భారత్‌లో తొలి నుంచి వస్తున్న సంప్రదాయాలకు లోబడి కలిసే ఉంటున్నారని తెలిపింది. ప్రపంచంలోని 130 దేశాల డాటా ఆధారంగా జర్మనీలో అతి తక్కువగా సగటున 2.7 మంది ప్రతి కుటుంబంలో ఉంటున్నారని వెల్లడించింది. అదే గాంబియా దేశంలో అతి ఎక్కువగా 13.8 మంది సభ్యులు ఒక్కో కుటుంబంలో ఉన్నారని తెలిపింది. ఒంటరి జీవులు 4 శాతం ఇక, ప్రపంచవ్యాప్తంగా కేవలం 4 శాతం మంది మాత్రమే ఒంటరిగా జీవిస్తున్నారని సర్వే తేల్చింది. అందులో యూదులు (10 శాతం), బౌద్ధులు (7 శాతం), ఏ మతమూ చెప్పనివారు (7 శాతం) ఉన్నారని, హిందూ, ముస్లిం మతస్తుల్లో కేవలం ఒక్క శాతం మంది మాత్రమే ఒంటరిగా జీవిస్తున్నారని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లోని వివిధ ప్రభుత్వ సంస్థల వివరాలు, జనాభా గణన లెక్కల ఆధారంగా 2010 నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఈ సర్వే వివరాలను క్రోడీకరించినట్టు ప్యూ సంస్థ వెల్లడించింది. -
అర్హులైన క్రైస్తవులకు గిఫ్ట్‌లు అందేలా చర్యలు
విజయనగర్ కాలనీ: క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని అర్హులైన క్రిస్టియన్ సోదరులకు గిఫ్ట్ ప్యాక్‌లు అందేలా శాసన సభ్యులు, కార్పొ రేటర్లు తగు చర్యలు తీసుకోవాలని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర పశు సంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని కాన్ఫరెన్స్ హాల్లో హోంమం త్రితో కలసి క్రిస్మస్ వేడుకల నిర్వహణపై సమీ క్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఏడాది మాదిరిగానే 9 వేల మంది క్రైస్తవులకు ఎల్బీ స్టేడియంలో విందు నిర్వహిస్తామన్నారు. ఈ విందుకు సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతార న్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 200 ప్రాం తాల్లో పేద క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాక్‌లు అందిస్తున్నామన్నారు. ఒక్కో ప్రాంతంలో 500 గిఫ్ట్ ప్యాక్‌లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్రిస్మస్ విందు నిర్వహణకు ఎంపిక చేసిన చర్చిలకు రూ.లక్ష చొప్పున చర్చి బ్యాంకు ఖాతాలో వేస్తామన్నారు. కార్యక్రమం లో ప్రభుత్వ సలహాదారులు ఏకే. ఖాన్, ఎమ్మెల్యేలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
కొంచెం శక్తితోనే కొండంత ఫలితం....
‘నీకున్న శక్తి కొంచెమే అయినా నా వాక్యాన్ని అనుసరించావు, పైగా నన్ను ఎరుగనని అనలేదు’ అన్నది ప్రకటన గ్రంథంలోని ఫిలడెల్ఫియా చర్చికి పరిశుద్ధాత్ముడిచ్చిన ‘ప్రోగ్రెస్ రిపోర్ట్’!! అందుకు బహుమానంగా, ఎవరూ మూయలేని ఒక తెరిచిన ద్వారాన్ని ఆ చర్చికి దేవుడు అనుగ్రహించాడు (ప్రక3:7–13). ప్రకటన గ్రంథంలోని ఏడు చర్చిల్లో ఫిలడెల్ఫియా చాలా చిన్నది. ఇప్పటి టర్కీ దేశంలో, రోమ్ నుండి ఆసియా కు వెళ్లే రహదారులన్నీ కలిసే ఒక ప్రాముఖ్యమైన కూడలి ప్రాంతమైన ఫిలడెల్ఫియా పట్టణంలో ఉన్న చర్చి అది. ఎన్నో ప్రతికూలతలు, లోక సంబంధమైన ప్రలోభాల మధ్య కూడా వెల లేని తన విశ్వాసాన్ని కాపాడుకొని ఆ చర్చి దేవుని ప్రసన్నుని చేసి ఆయన ప్రేమను సంపాదించుకొంది. ప్రతికూలతలను, శత్రువులను ఎలా ఎదుర్కొంటుందన్నదే ఏ చర్చి విశ్వాసానికి, విజయానికైనా గీటురాయి. అయితే ఆసుపత్రిలో రోగులున్నట్టే చర్చిలో పాపులు, ఆత్మీయంగా బలహీనులు, దీనులు తప్పక ఉంటారు. కాకపోతే తాము ఒక రోజున రోగవిముక్తులం కావాలన్న బలమైన ఆశ ఉన్న ఆసుపత్రి రోగుల్లాగే, తాము తప్పక పాపవిముక్తులం కావాలన్న ప్రార్థ్ధన, పట్టుదల, ప్రయాస కలిగిన పాపులున్న చర్చి దేవుణ్ణి ప్రసన్నుని చేస్తుంది. ‘పాపులముగానే చేరాము, పాపులముగానే చనిపోతాము’ అన్న మార్పులేని మొండి వైఖరి కలిగిన సభ్యుల వల్ల చర్చికి, దేవునికి కూడా ప్రయోజనం లేదు. లోకంలో అంతా పాపులే, కాకపోతే క్షమించబడిన పాపులు కొందరు, ఇంకా క్షమించబడని పాపులు మరి కొందరు. పాపక్షమాపణానుభవంతో చర్చిలో చేరడం అత్యంత శ్రేయస్కరం. ఒకవేళ అలా జరుగక పోతే, చేరిన తర్వాతైనా పాపక్షమాపణను పొందితే ఆనందం. కాకపోతే చర్చిలో అంతా పరిశుద్ధులు, నీతిమంతులే ఉండాలన్న నియమం పెట్టుకున్న స్వనీతిపరులైన విశ్వాసులు మాత్రం ఏ చర్చిలోనూ ఇమడలేరు. యూదులు కాకుండానే యూదులమని అబద్ధమాడే సాతాను సమాజపు వాళ్లంతా వచ్చి నీకు నమస్కారం చేస్తారని ఫిలడెల్ఫియా చర్చికి ప్రభువు వెల్లడించాడు. అబ్రాహాము విశ్వాసవారసత్వంతో సంబంధం లేకున్నా శరీర సంబంధంగా ఆయన వంశానికి చెందిన వారమని చెప్పుకొనే పరిసయ్యులను ఆనాడు యేసుప్రభువు ‘మీరు మీ తండ్రి అయిన సాతాను సంబంధులు, అతని క్రియలు చేయగోరేవారు’ అంటూ ఘాటుగా విమర్శించాడు( యోహాను 8:44). నిజమైన క్రైస్తవ విశ్వాస విలువలు లేకున్నా, తమ తాతలు తండ్రులు క్రైస్తవులు కాబట్టి మేము కూడా క్రైస్తవులమేనని చెప్పుకొనే నామకార్ధపు తరతరాల క్రైస్తవులతో ఈరోజుల్లోనూ చర్చికి సమస్యలున్నాయి. అయితే వారిని విమర్శించడం, పరిహసించడం, వెళ్లగొట్టడం, సూటిపోటి మాటలనడం అందుకు పరిష్కారం కానే కాదు. యేసుప్రభువు అనుచరులమని చెప్పుకునే వాళ్లంతా యేసు ప్రేమకు, ఆయన చూపించిన క్షమాపణకు ప్రతినిధులు!! మన ప్రేమ, క్షమా స్వభావమే వారిని మార్చి దేవుని వైపునకు తీసుకెళ్ళాలి. బైబిల్ కన్నా, దేవునికి సంబంధించి మనకున్న అనుభవ జ్ఞానం, దాని మూలంగా ఏర్పడిన విశ్వాసం, క్షమ, ప్రేమాపూర్ణత కలిగిన మన జీవితం ఇతరులను ప్రభావితం చేసి వారిని ఆత్మీయంగా స్వస్థపర్చి ప్రభువు వద్దకు నడిపిస్తుంది. అందుకు ఎంతో జ్ఞానం, మరెంతో శక్తి అవసరం లేదు. సాత్వికత్వంతో తలవంచుకొని దేవుని పక్షాన ధీరత్వంతో నిలబడగల మన ‘కొంచెం శక్తి’ చాలు, ఫిలడెల్ఫియా చర్చిలాగా గొప్ప దేవునికోసం గొప్ప కార్యాలు చేసి గొప్ప విశ్వాసులమనిపించుకోవడానికి. సూపర్ మార్కెట్లో ఉండే వందలాది కొవ్వొత్తులకు చీకటి ఏ మాత్రం భయపడదు. కానీ పూరిగుడిసెలో మూలన వెలిగే ఒక చిన్నకొవ్వొత్తికి కారు చీకటి కూడా వణికి పారిపోతుంది. క్రైస్తవుడు కూడా సూపర్ మార్కెట్లో కొవ్వొత్తి కాదు, అతను వెలిగే కొవ్వొత్తి... అందుకే మరి, క్రైస్తవులెప్పుడూ మైనారిటీలే!!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
చిక్కుల్లో సూపర్ స్టార్ చిత్రం
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ తాజా చిత్రం ‘లూసిఫెర్’ వివాదాల్లో చిక్కుకుంది. ఈ చిత్రంలో క్రైస్తవుల మనోభావాలను దెబ్బ తీశారని.. చర్చి విలువలను కించపరిచారంటూ క్రిస్టియన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ ఆఫ్ కేరళ ఆధ్వర్యంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు వారు ఫేస్బుక్ ద్వారా ఓ లేఖను విడుదల చేశారు. నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం లూసిఫెర్. అయితే ఈ పేరును క్రైస్తవులు సాతానుగా నమ్ముతారని.. కానీ ఈ చిత్రంలో అందుకు విరుద్ధంగా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఫేస్బుక్ పోస్ట్‌లో ‘చర్చి ఔన్నత్యాన్ని, క్రైస్తవ విలువలను, మత కర్మలను దూషిస్తూ.. సాతాను పేరును స్తుతిస్తున్నారు. దీన్ని బట్టి మలయాళ చిత్ర పరిశ్రమలో ఎంతటి దారుణ పరిస్థితులు నెలకొన్నాయో అర్థం అవుతుంద’ని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ను ఇప్పటకే వేల మంది లైక్ చేయడమే కాక ‘‘లూసిఫెర్’ను క్రిస్టియన్లు సాతానుగా భావిస్తారు’ అని కామెంట్ చేస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన లూసిఫెర్ చిత్రం గురువారం విడుదలయ్యిది. హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తొలిసారి దర్శకత్వ వహించిన ఈ చిత్రం ఇప్పటికే పాజిటీవ్ టాక్ తెచ్చుకోవడమే కాక సమ్మర్ బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. -
తల్లి్ల మరియా... కాచికాపాడుమమ్మా!
శ్రీకాకుళం మేత్రాసన పాలక పునీతురాలు, క్రైస్తవుల సహాయమాత మేరిమాత మహోత్సవం నేడు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం సమీపంలోని యు.వెంకమ్మపేట వద్ద మరియగిరిపై జరుగుతోంది. ఈ కొండపై వెలసిన మరియమ్మకు శ్రీకాకుళం మేత్రాసనం పీఠాధిపతి అడ్డగట్ల ఇన్నయ్య ఆధ్వర్యంలో ఏటా జనవరి 30న ప్రత్యేక దివ్యపూజలు నిర్వహిస్తారు. ‘విశ్వ స్వరూపుడైన దేవదేవుని పుత్రుని నీ వరాల గర్భంబున ధరియించిన మేరిమాతా వందనం అభివందనం..’ అంటూ, ‘దేవునిచే ఎన్నుకొనబడిన ఓ సుధాభాషిణి నీకే వందనం.. దైవప్రజలారా.. దైవ జనమా..’ అంటూ బిషప్ ఇన్నయ్య స్తోత్రం పలికి పూజలు చేయడం ఇక్కడ ఆనవాయితీ. ఈ యాత్రకు ఒక రోజు ముందే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలతో పాటు ఒడిశ్సా రాష్ట్రం నుండి తండోపతండాలుగా క్రైస్తవులు, హిందువులు తరలివచ్చి దివ్యపూజలో పాల్గొంటారు. అనంతరం మరియగిరి కొండను అధిరోహించి మేరిమాతను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. కులమతాలకు అతీతం మరియగిరి యాత్ర రోజున ఈ ప్రాంతంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. మఠకన్యలు, పీఠాధిపతులు, క్రైస్తవ గురువుల ప్రత్యేక ప్రార్థనలతో మేరిమాత స్తోత్రం మారు మ్రోగుతుంది. ఈ సందర్భంగా మేరిమాతను దర్శించుకొనేందుకు కులమతాలకు అతీతంగా భక్తులు కొవ్వొత్తులు వెలిగించి, కొబ్బరికాయలు కొట్టి, హిందూ సంప్రదాయంలో ఉన్నట్లు తలనీలాలు అర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ‘ఓ తల్లీ మరియా.. మమ్మల్ని కాచికాపాడుమమ్మా’ అంటూ ప్రార్థనలు చేస్తారు. దివ్య పూజలో క్రైస్తవ గీతాలను ఆలపిస్తూ మరియమ్మను స్తుతిస్తారు. కుటుంబ సమేతంగా మేరీమాతను దర్శించుకున్న తర్వాత భక్తులు వనభోజనాలు చేస్తారు. ఏటా 25 వేల నుండి 30 వేల మంది భక్తులు హాజరై మేరీమాతను దర్శించుకుంటారు. ఈ ఏడాది కూడా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నేటి మరియగిరి యాత్రకు ఉత్తరాంధ్ర జిల్లాల నుండి తరలివచ్చే భక్తుల కోసం పార్వతీపురం, పాలకొండ, శ్రీకాకుళం, సాలూరు, టెక్కలి, విజయనగరం తదితర ఆర్టీసీ డిపోల నుండి స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. ఈ ఏడాది సుమారు 35 వేలమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందన్న అంచనాతో మరియగిరి వద్ద ప్రత్యేక ఆర్టీసీ కంట్రోల్ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. -
వాటికన్ సిటీలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
వాటికన్ సిటీ: ఉరుకులు పరుగుల యాంత్రిక జీవనానికి దూరంగా గడపాలని క్రిస్మస్ వేడుకల సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ మంగళవారం పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పర్వదినాన్ని క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. పోప్ ప్రసంగం వినేందుకు సోమవారం రాత్రి వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బసిలికా చర్చికి వేల సంఖ్యలో క్రైస్తవులు హాజరయ్యారు. ‘నేటికీ మానవుడి జీవితం నిరాశ నిస్పృహలతో నిండి ఉంది. కొందరు విలాసవంతమైన జీవనాన్ని గడుపుతుంటే మరికొందరు ఓ పూట రొట్టె ముక్క కోసం ఇబ్బంది పడుతున్నారు..’అని పోప్ వ్యాఖ్యానించారు. ఇటు జీసస్ జన్మస్థలంగా భావించే బెత్లెహాంలో కూడా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు భారీగా తరలివచ్చారు. -
సీబీఐ దర్యాప్తునకు ఎలా ఆదేశించాలి?
సాక్షి, హైదరాబాద్: సామాజిక మాధ్యమాల్లో క్రైస్తవులపై దుష్ప్రచారం చేస్తున్నవారు ఎవరో తెలియకుండా సీబీఐ దర్యాప్తునకు ఎలా ఆదేశించాలని ఆలిండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్(ఏఐటీసీసీ)ను హైకోర్టు ప్రశ్నించింది. హిందూ జనశక్తి, శివశక్తిలకు చెందిన వారు ఏపీ, తెలంగాణాల్లో క్రైస్తవులపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఇందుకు సంబంధించి పలు పోలీసు స్టేషన్లలో ఉన్న కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ విశాఖలోని మాధవధారకు చెందిన కౌన్సిల్ జాతీయ ప్రధాన కార్యదర్శి కొలకలూరి సత్యశీలరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. ఎవరిపై ఆరోపణలు చేస్తున్నారో వారిని వ్యాజ్యంలో పేర్కొనకుండా సీబీఐ దర్యాప్తు చేయాలని కోరడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. శివశక్తి, హిందూ జనశక్తిలను ప్రతివాదులుగా చేసేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యర్థనను ధర్మాసనం అంగీకరించింది. తదుపరి విచారణను కోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. -
2019 ఎన్నికల కోసం ప్రార్థనలకు పిలుపు
న్యూఢిల్లీ: భారతదేశ ప్రజాస్వామిక విలువలు, లౌకిక వ్యవస్థకు దేశంలోని ప్రస్తుత ‘అల్లకల్లోల రాజకీయ వాతావరణం’ ముప్పుగా పరిణమించిందని ఢిల్లీ ఆర్చిబిషఫ్ అనిల్ కౌటో చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరలేపాయి. కర్ణాటకలో ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఢిల్లీ ఆర్చిడయోసిస్ పరిధిలోని అన్ని చర్చిలు, మత సంస్థలకు ఆయన లేఖ రాస్తూ.. 2019 సాధారణ ఎన్నికల నేపథ్యంలో మే 13 నుంచి ప్రార్థనా ఉద్యమానికి పిలుపునిచ్చారు. దేశం కోసం ప్రతీ శుక్రవారం క్రైస్తవులు ఉపవాసం ఉండాలని ఆయన సూచించారు. ఈ వ్యాఖ్యల్ని కేంద్ర ప్రభుత్వం తప్పపడుతూ.. అవి కౌటో వివక్షపూరిత మనస్తత్వాన్ని చాటిచెపుతున్నాయని విమర్శించింది. అయితే తన లేఖ మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కాదని కౌటో మంగళవారం వివరణిచ్చారు. ‘దేశం కోసం వారానికి ఒక రోజు వెచ్చించాలని నేను చెప్పాను. ముఖ్యంగా ఎన్నికలు వస్తున్నందున ఈ సూచన చేశాను. అందువల్ల ఇది ఏ విధంగాను నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి రాసిన లేఖ కాదు. గత నాలుగేళ్లలో వార్తా పత్రికలు, మీడియాలో ఎన్నో వార్తలు చూశాం. ప్రజల ఆహార అలవాట్లు, దాడుల ఘటనలతో పాటు నలుగురు న్యాయమూర్తులు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం చూశాం. వీటిపై న్యాయవ్యవస్థ స్థాయిలో ఆందోళన వ్యక్తమైంది. ఒక పౌరుడిగా నేను కూడా ఆందోళన వ్యక్తం చేశాను’ అని లేఖలోని అంశాల్ని ఆయన సమర్థించుకున్నారు. -
చికాగోలో క్రైస్తవుల వివాహా పరిచయ వేదిక
చికాగో : అమెరికాలోని భారతీయ క్రైస్తవ యువతి, యువకుల కోసం వివాహా పరిచయ వేదికను ఏర్పాటు చేశారు. ఎలిజర్ మినిస్ట్రి ఆఫ్ మాట్రిమోనీ చికాగో(ఈఎంఎం) ఆధ్వర్యంలో యునైటెడ్ తెలుగు క్రిస్టియన్ కమ్యూనిటీ ఆఫ్ చికాగో, క్లెర్జి కౌన్సిల్ ఆఫ్ చికాగో (సీసీసీ) ల సహకారంతో ఈ నెల 7న ఇల్లినాయిస్లో ఏర్పాటు చేసినట్టు నిర్వాహాకులు తెలిపారు. ఈ పరిచయ వేదికకు పెద్ద సంఖ్యలో యువతి, యువకులు వారి తల్లిదండ్రులు హాజరైయ్యారు. పరివార్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సామ్ జార్జ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈఎంఎం సమన్వయకర్తలైన ప్రభు, జాన్సన్ సుక్కు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి భారీగా తరలి వచ్చిన యువతీయువకులకు, తల్లిదండ్రులకు, శ్రేయేభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు. -
క్రీస్తు కారుణ్యం మనకు ఆదర్శం
ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగను జరుపుకొంటున్నారు. మనుష్యుల హదయాల్లో వెలుగును నింపిన పండుగ ఇది. మరణాన్ని జయించి తిరిగిలేచిన యేసుక్రీస్తు మహాత్మ్యాన్ని కొనియాడుతూ భక్తిపారవశ్యంతో పునీతులవుతున్నారు. మరణపు మెడలు వంచి మరణభయం నుంచి మానవుని విడిపించడానికి యేసు పునరుత్థానుడయ్యాడు. యేసు పునరుత్థానం మనిషికి నిజమైన పరమార్థాన్ని తెలియచేసింది. దేవునికి అసాధ్యమేదీ ఉండదని నిరూపించింది. యెరూషలేములోని యేసు ఖాళీ సమాధి మనిషికి నిరీక్షణను, అపరిమితమైన ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రతీ యేటా కోట్లాదిమంది ఆ ఖాళీ సమాధిని చూసి పరవశంతో నింపబడి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు జీవితం నుండి కొన్ని అమూల్య పాఠాలను ‘సాక్షి’ పాఠకులకు అందిస్తున్నాం. క్రీస్తు జీవనశైలి ఒకింత ప్రత్యేకమైనది, విలక్షణమైది. భువిపై ముప్పై మూడున్నర సంవత్సరాల ఆయన జీవిత ప్రస్థానం ప్రపంచ చరిత్రలో పెనుమార్పులను తీసుకొని వచ్చింది. నిరాశ నిస్పృహల నుండి మనిషికి విడుదల ప్రసాదించింది. ప్రేమ, దయ, వినయ స్వభావం వంటి అనేకమైన ఆత్మీయ పదాలకు మనిషి మనసులో చోటు లభించింది. ఒక వ్యక్తి గెలుపుబాటలో అప్రతిహతంగా దూసుకుపోవాలన్నా, పరీక్షా ఘట్టాలను, గడ్డు సవాళ్లను అధిగమించి కీర్తి కిరీటం దక్కించుకోవాలన్నా పరమాత్ముని బాటలో నడవాలని క్రీస్తు బోధించాడు. మహత్తర ఆధ్యాత్మిక భావాలు ఇమిడియున్న ఆయన బోధల ద్వారా ప్రయోగాత్మకమైన ఫలవంతమైన జీవితానుభవాలు పొందుకొనే సావకాశం ఏర్పడింది. గర్వం, అహంభావం, దురహంకారం ఏలుబడి చేస్తున్న ప్రస్తుత లోకంలో ఘనతర లక్ష్యాలు నిలువుగా నీరు గారిపోతున్నాయి. మనిషి మస్తిష్కంలో గూడుకట్టుకుపోయిన పాప స్వభావం వల్ల సమాజానికి చాలా కీడు జరుగుతోంది. పాపం మనిషిని ఎటువంటి నీచస్థానానికైనా దిగజారుస్తుంది. ఆఖరుకు పతనానికి నడిపిస్తుంది. సాటి మనిషిని ప్రేమించని రాక్షస సమాజంలో తన దివ్యమైన బోధల ద్వారా నవ్యపథ నిర్దేశం చేసిన ఘనుడు యేసుక్రీస్తు. పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించి తన ప్రేమతత్వాన్ని లోకానికి ఆచరణాత్మకంగా చాటిచెప్పాడు. తన పంతమే నెగ్గాలని ఉవ్విళ్లూరే ఉగ్రవాదానికి బలౌతున్న అభాగ్యులు ఎందరో. పైశాచిక మూర్ఖత్వపు దాడులు మానవాళి చరిత్రలో నెత్తుటి పుటలను లిఖిస్తున్నాయి. ఇటువంటి సమాజంలో మార్పును తీసుకురావాలన్న సదాశయంతో వెలువడిన క్రీస్తు సందేశాలు, బోధలు సదా ఆదరణీయం. ‘‘ఆత్మ విషయమై దీనులైనవారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది.’’ అని క్రీస్తు కొండమీది ప్రసంగంలో తెలియచేశాడు. ఆత్మలో దీనత్వం అనగా తన నిస్సహాయతను సర్వశక్తుడైన దేవుని దగ్గర నిర్మొహమాటంగా ఒప్పుకోవడం. ఒక చంటిబిడ్డ తన తల్లిపై ప్రతి చిన్న విషయానికి ఏవిధంగా ఆధారపడుతుందో అలా పరమాత్మునిపై ఆధారపడటం. స్వనీతి కార్యములు మోక్షప్రాప్తినివ్వవని మనస్ఫూర్తిగా గ్రహించి పశ్చాత్తాపంతో దేవుని పాదాలను అశ్రువులతో అభిషేకం చేయడం. భౌతిక ప్రపంచంలోనైనా ఆధ్యాత్మిక ప్రపంచంలోనైనా పతనానికి దోహదమయ్యే దుర్లక్షణాలను దేవుని శక్తిద్వారా పరిత్యజించడం. ‘‘తన్నుతాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.’’ అనే తన దివ్య బోధలతో శిలలను కూడా శిల్పంగా మార్చుతున్నాడు యేసు. భయరహిత వాతావరణం సృష్టించుకుంటూ దినదిన ప్రవర్ధమానం చెందడం క్రీస్తు బోధల ద్వారా నేర్చుకోవచ్చు.జీవితం విలువ తెలిసినవానికి ఆత్మవిశ్వాసం ఉంటుంది గానీ అహంకారం ఉండదు. నాశనమునకు ముందు గర్వము నడుస్తుందనేది బైబిల్ ఉపదేశం. అసత్యపు బండలను కొట్టుకొని తునాతునకలౌతున్నమనిషిని సంపూర్ణతలోనికి నడిపించాలన్నదే క్రీస్తు ఆలోచన. జడత్వంతో నిండిన ఇంద్రియాలను చైతన్యపరచి, వర్ణరహిత వర్గరహిత సమసమాజ నిర్మాణం కోసం తన వంతు కృషి సలిపిన మహాఘనుడు యేసుక్రీస్తు. ‘ఒక చెంప మీద కొట్టిన వానికి మరొక చెంప చూపించు’ అని బోధించిన యేసు అక్షరాలా దానిని తన జీవితంలో నెరవేర్చగలిగారు. యేసు దివ్యనామము విశ్వమంతటా మారుమోగడానికి గల అనేక కారణాలలో ‘ఆయన కారుణ్యం’ ప్రధానమైనది.క్రీస్తు శరీరధారిగా ఉన్న రోజుల్లో యెరూషలేములోని మేడగదిలో తన శిష్యుల పాదాలను కడిగాడు. అది ప్రజల గుండెల్లో శాశ్వతకాలం నిలిచిపోయే ఓ అపురూప సంఘటన. అప్పటికే ఆయనకు ఆ ప్రాంతాల్లో అద్భుతమైన ప్రజాదరణ ఉంది. అన్ని వర్గాల ప్రజలు ఆయనను గొప్పవానిగా, దేవునిగా గుర్తించి ఆయనను వెంబడిస్తున్నారు. యేసు భోజనపంక్తిలో నుంచి లేచి తన పై వస్త్రాన్ని పక్కన ఉంచి ఒక తువాలు నడుమునకు కట్టుకొని, పళ్లెములో నీళ్లు పోసి తాను ఏర్పరచుకొన్న శిష్యుల పాదాలు కడుగుటకు, వాటిని తువాలుతో తుడుచుటకు మొదలుపెట్టాడు. తాను కాళ్ళు కడిగే శిష్యులు చాలా సామాన్యమైన వారు. వారు ఆనాటి సమాజంలో విశిష్టులు కారు. ఆ సందర్భంలో శిష్యులు ఆయనను వారించినా భావితరాలకు స్ఫూర్తి కలుగుటకు, సేవాతత్పరతను అందరూ అలవాటు చేసుకొనుటకు ఆవిధంగా యేసు చేశాడు. తాను ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ తన్ను తాను తగ్గించుకొని చేసిన ఆ సర్వోత్తమ కార్యము సాక్షాత్కరించిన జీవితాల్లో ‘సేవ’ పట్ల యథార్థ దృక్పథాన్ని రగిలించింది. ‘నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు’, ‘మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి’ అన్న క్రీస్తు బోధనలు చేతల్లో నిరూపించబడ్డాయి. ఈ అసాధారణ సంఘటన ఆధారంగా అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ ప్రజాస్వామ్యానికి ఓ వినూత్న నిర్వచనాన్ని ఇచ్చాడు. ‘ప్రజల యొక్క, ప్రజల ద్వారా, ప్రజల కొరకు’ అనే నినాదంతో నవ్యపథ నిర్దేశాన్ని చేశాడు. ‘మనుష్యులంతా సమానమే’ అంటూ వర్ణ వివక్షను రూపుమాపడానికి తనవంతు కృషి చేశాడు.క్రీస్తులో ఉన్న శాంత స్వభావాన్ని, కారుణ్యాన్ని, ప్రేమను ఆకళింపు చేసుకొన్న మదర్ థెరిసా భారతదేశ చరిత్రలో ఓ శ్రేష్టమైన స్థానాన్ని పొందింది. కేవలం మన దేశానికే కాదు యావత్ ప్రపంచానికే దీవెనకరంగా మారిన మదర్ క్రీస్తు ప్రేమాగ్ని జ్వాలల్లో నుంచి ఎగసిన ఓ నిప్పురవ్వ. అనాథలకు, అభాగ్యులకు సేవ చేయాలన్న తపనతో ఈ దేశానికి వచ్చిన మదర్ ఎందరినో అక్కున చేర్చుకొంది. కడుపునిండా అన్నం, కంటినిండా నిద్ర, ఒంటి నిండా బట్టలను ఇచ్చి మానవీయ హృదయంతో ప్రజలను ఆదుకొంది. ఎక్కడ నుంచో వచ్చిన ఆమెను ‘మదర్’ అని సంబోధిస్తూ ఆమెను గౌరవించిన వారు ఎందరో ఉన్నారు. ఉన్నత స్థితిగతులను విడిచి లోకహితం కోసం పాటుపడాలన్న ఆకాంక్షతో కలకత్తా వీధుల్లో అనాథ పిల్లల పోషణ కోసం యాచన చేసేది. ఆ ప్రక్రియలో ఒకసారి వికృత చేష్టలకు బందీయైన ఒక వ్యక్తి, మదర్ థెరిసాపై ఉమ్ము వేశాడు. ‘దీనత్వం’ అంటే ఏమిటో నేర్చుకుంది కదా! ఆ ఉమ్మిని తుడుచుకొంటూ ‘‘నా కోసం ఇది ఇచ్చావు... అనాథ పిల్లల కోసం ఏమి ఇస్తావు?’’ అని తిరిగి అడిగింది. ఆ ఒక్క మాటతో గర్వపు పొరలు విడిపోయాయి. ఇంతగా అవమానించినా తిరిగి ఏమీ అనని మదర్ గుండెల్లో ఉన్న తగ్గింపును అర్థం చేసుకొన్నాడు. జీవితాంతం మదర్ థెరిసా ఆశ్రమానికి తనకు తోచినంత సహాయం చెయ్యడం ప్రారంభించాడు. నోబెల్ బహుమతి ప్రదానం రోజున మదర్ మాట్లాడుతూ ‘క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించగలగడమే నిజమైన క్రైస్తవ్యం’ అని తాను ఎవ్వరి నుంచి సేవాస్ఫూర్తిని పొందిందో ఆ విషయాన్ని కచ్చితంగా ప్రపంచానికి తెలిపింది. నేటికీ ఆమె ద్వారా స్థాపించబడిన సంస్థల ద్వారా విశేషమైన సేవలు పేదలకు అభాగ్యులను అందుతున్నాయి. కొంత చేసి ఎంతో చేశామని ప్రగల్భాలు పలికే నేటి సమాజంలో ఎంతో చేసినా ఇంకా ఏదో చెయ్యాలన్న తపనతో నింపబడిన వ్యక్తులను కనుగొనడం కొంచెం కష్టమే. అటువంటి వారిలో విలియం కేరీ ఒకడు. ఇంగ్లండ్ దేశం నుండి భారతదేశానికి వచ్చి ఎన్నో విశిష్ట కార్యాలు చేశాడు. ఒక్కమనిషి తన జీవితకాలంలో ఇన్ని కార్యాలు చేయగలడా? అనిపించే విధంగా సమాజ అభ్యున్నతి కోసం పాటుపడ్డాడు. అంతే కాదు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌ను 36 భాషల్లోకి అనువదించాడు. అనేక భారతీయ భాషల్లో నిఘంటువులు రాశాడు. పట్టాను బహూకరించే మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. బ్యాంకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. స్వదేశ భాషలో మొట్టమొదటి వార్తాపత్రికను ప్రారంభించాడు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి తాను సాధించాలనుకున్న వాటిని సాధించి తీరాడు. దేశచరిత్రలో, ప్రజల గుండెల్లో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నాడు. జీవన పరిణామాలన్నింటిని సమదృష్టితో చూడగలిగే స్థితప్రజ్ఞతను ఆకళింపు చేసుకున్నాడు. ఇన్ని గొప్ప కార్యాలు చేసి ఒకసారి ఇంగ్లండ్ వెళితే తన స్నేహితుడొకడు వచ్చి అపహాస్యంతో, విలియం కేరీని కించపరచాలనే ఉద్దేశంతో ‘నీవు చెప్పులు తయారు చేసుకొనే వ్యక్తివని మర్చిపోవద్దు’ అన్నాడు. క్రీస్తు కారుణ్యంతో, వినమ్రతతో నింపబడిన కేరీ ‘అయ్యా! నేను చెప్పులు తయారు చేసేవాణ్ణి కాదు... వాటిని కేవలం బాగుచేసుకునేవాణ్ణి’’ అని బదులిచ్చాడు. ఎన్నో గొప్ప కార్యాలు చేసిన కేరీ ఇచ్చిన సమాధానం, అతనిలో ఉన్న తగ్గింపు ఆ వ్యక్తిని ఎంతగానో ఆశ్చర్యపరచింది. అంతేమరి! నిండుకుండ ఎప్పుడూ తొణకదు కదా! ‘కారుచీకటిలో కాంతిరేఖ’ అని కేరీని పిలవడంలో అతిశయోక్తి లేదుకదా! ఇవి కేవలం కొన్ని ఉదాహరణలే. ప్రపంచంలో నేటికీ కోట్ల సంఖ్యలో ప్రజలు క్రీస్తు కారుణ్యమునకు, దీనత్వమునకు ఆరాధకులే. ఆధ్యాత్మిక చింతన కోసం, జీవన సాఫల్యం కోసం తపించే ప్రతి ఒక్కరూ క్రీస్తులో ఉన్న మహోన్నత ప్రేమతత్వానికి మంత్రముగ్ధులే. మానవ హృదయ వైశాల్యాన్ని పెంచుతూ, గుణాత్మక పరివర్తనకు దోహదపడుతున్న క్రీస్తుప్రభువు తగ్గింపు జీవితం సదా అభినందనీయం. యేసుక్రీస్తు పరలోకములో ఉండుట గొప్ప భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపం ధరించి, తన్ను తాను రిక్తునిగా చేసుకొని సిలువ మరణం పొందునంతగా తగ్గించుకున్నాడని పౌలు మహాశయుడు తెలియజేశాడు. నిజమే.. యేసు పుట్టింది పశువులశాలలో. పసికందుగా పవళించింది గరుకైన పశువుల తొట్టెలో! దేవుడు ఈ లోకంలో పుట్టాలనుకుంటే ఆయన మాట ద్వారా సృష్టించబడిన ఈ సృష్టిలో పూల పాన్పులు, అంతఃపురాలు ఆయనకు ఆహ్వానం పలుకలేవా? ఎందుకు ఆయన పశువులశాలలో పుట్టాడు? పశువుల శాల వంటి మానవ çహృదయాన్ని పావనపరచుటకు ఆయన పశువుల తొట్టెలో జన్మించాడు. రెండవ కారణం ‘‘పశువుల శాలలోనికి ఎవ్వరైనా నిరభ్యంతరంగా వెళ్లవచ్చు’’. క్రీస్తును దర్శించుటకు కుల మత ప్రాంత వర్గ భేదాలు లేనేలేవు. వాస్తవానికి క్రీస్తు పుట్టినప్పుడు ఆయనను మొదటగా దర్శించుకున్నది గొర్రెల కాపరులు. రాత్రివేళ తమ మందను కాచుకొనుచున్న గొర్రెల కాపరులకు దూత ద్వారా శుభవార్త అందింది. భక్తి పారవశ్యంతో క్రీస్తును దర్శించుకొని పరమానందభరితులయ్యారు. ఇది నిజంగా విడ్డూరమే! లోకరక్షకుడు అందరికీ చెందినవాడు. ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడని క్రీస్తు తన జన్మ ద్వారా నిరూపించాడు. పువ్వు నుంచి పరిమళాన్ని, తేనె నుంచి మాధుర్యాన్ని, చంద్రుని నుంచి చల్లదనాన్ని, మీగడ నుంచి కమ్మదనాన్ని, అమ్మ నుంచి అనుబంధాన్ని వేరుచేయలేనట్టుగానే క్రీస్తు నుంచి ప్రేమను, కరుణాపూరితమైన మనసును వేరుచేయలేము. క్రీస్తు ప్రేమ అనిర్వచనీయమైనది. అవధులు, షరతులు లేనిది. విలువైన ఆయన ప్రేమలో వంచన లేదు. మధురమైన క్రీస్తు ప్రేమకు మరణం అంటే ఏమిటో తెలియదు. ప్రవచనాల ప్రకారం క్రీస్తు పుట్టింది బెత్లేహేము అనే చిన్న పల్లెటూరులోనైతే ఆయన పెరిగింది నజరేతులోని ఒక వడ్లవాని ఇంటిలో. ఆ కాలంలో గలిలయలోని నజరేతుకు ఏమాత్రం పేరుప్రఖ్యాతులు లేవు. పేరుకు మాత్రం తండ్రి అని పిలువబడిన యోసేపు అనే వ్యక్తికి అన్ని విషయాలలో సహాయం చేశాడు. కష్టమంటే ఏమిటో తెలుసు. చెమటోడ్చడం అంటే తెలుసు యేసుకు. మనిషి సాధక బాధకాలను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఆయనకు ఉంది. యేసు భూమ్మీద జీవించిన కాలంలో స్నేహం చేసింది పామరులతో, గొర్రెల కాపరులతో, చేపలు పట్టే జాలరులతో. ఆ కాలంలో పరమ పాపులుగా పిలువబడే సుంకరులతో అనేకసార్లు భోజనం చేశాడు. వారితో సహవాసం చేసి దైవ మార్గాన్ని వారికి ఉపదేశించాడు. దైవభక్తిలో ఎడతెగని, అలుపెరుగని అలౌకిక అనుభవాలు దాగి ఉంటాయని తెలియచెప్పాడు. మనిషి సమస్యలను, పేదరికాన్ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తి యేసుక్రీస్తు. అందుకేనేమో! వారందరి çహృదయాల్లో రారాజుగా కొలువుంటున్నాడు. కాంతికి వేగాన్ని నియమించిన దేవుడు శరీరధారిగా ఉన్నప్పుడు ఎంత దూరమైనా కాలిబాటతోనే ప్రయాణించాడు. ఇవన్నీ ఆయన కారుణ్యానికి నిలువెత్తు నిదర్శనాలు. నక్కలకు బొరియలున్నాయి. ఆకాశ పక్షులకు గూళ్లున్నాయి. కానీ తలవాల్చుకొనుటకు మనుష్య కుమారునికి చోటు లేదని చెప్పడం ద్వారా ప్రజల కోసం తానెంత కరుణామయుడిగా మారిపోయాడో తెలియచెప్పాడు. ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు దివ్య మహిమతో నిండిన ఆ మహాఘనుడు శరీరధారిగా తగ్గించుకొని వచ్చిన ప్పుడు కుష్టు వ్యాధిగ్రస్తులను కౌగిలించుకున్నాడు. ఆ కాలంలో కుష్టు వ్యాధిగ్రస్తులను అంటరాని వారుగా పరిగణించేవారు. సమాజంలోనికి రానిచ్చేవారు కాదు. సొంత కుటుంబ సభ్యులు కూడా విపరీతంగా ద్వేషించేవారు. అలాంటివారిని తన దివ్య స్పర్శతో బాగుచేశాడు. వారికి నూతన జీవితాన్ని ప్రసాదించాడు. రోగ పీడితులను పరామర్శించాడు. పాపంలో పట్టుబడి భయంతో సభ్య సమాజంలో తలదించుకొన్న వ్యభిచారిని అమ్మా! అని పిలిచిన పరిశుద్ధుడు క్రీస్తు. వికటముతో మాట్లాడి, చులకనగా వ్యవహరించిన వారిని కూడా ప్రేమపూర్వక పదజాలంతో తన్మయుల్ని చేసిన కరుణామయుడు. మట్టల ఆదివారం రోజున క్రీస్తు గాడిదపై ప్రయాణం చేశాడు. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు అని జెకర్యా ద్వారా పలుకబడిన ప్రవచనం నెరవేరింది. పూర్వదినాల్లో ఏ రాజైనా గుర్రంపై ప్రయాణిçస్తూ మరో పట్టణానికి వెళ్తే యుద్ధానికి వస్తున్నాడని ఇట్టే గ్రహించేవారు. గాడిదపై వస్తుంటే సమాధానం కోసం వస్తున్నాడని గ్రహించేవారు. కలవరంలో నిండిపోయిన యెరూషలేము పట్టణానికి సమాధానాన్ని ప్రకటించడానికి క్రీస్తు గాడిదపై దీనుడుగా ప్రయాణం చేశాడు. ‘‘ప్రయాసపడి భారము మోసుకొనువారలారా! నా యొద్దకు రండి నేను విశ్రాంతిని కలుగచేతును’’ అని క్రీస్తు ఏనాడో ప్రకటించాడు. నేటి దినాల్లో మనిషి మనశ్శాంతి కోసం తపిస్తున్నాడన్నది కాదనలేని సత్యం. విశ్యవ్యాప్తంగా అన్ని రకాల ప్రజలు శాంతి కోసం అన్వేషిస్తున్నారు. కొందరు ధన ధాన్యాలలో శాంతిని వెదకుతుంటే మరికొందరు కీర్తి ప్రతిష్టలలో వెదకుచున్నారు. కొందరు బంధాల్లో శాంతిని పొందుకోవాలని తపిస్తుంటే మరికొందరు ఒంటరి తనంలోనే సంతోషాన్ని వెదకుచున్నారు. ఈ వెతుకులాటలో నిజమైన శాంతి దొరకక అనేకులు ఆత్మహత్యలు చేసుకొనుచున్నారు. వాస్తవాన్ని అంగీకరించే మనస్సుంటే శాంతి అనేది భౌతిక సంబంధమైన విషయాలపై ఆధారపడి లేదు. ప్రపంచంలో రెండు రకాల ప్రజలుంటారు. కొందరు శాంతి సమాధానాల కోసం పరితపిస్తారు, మరికొందరు శాంతితో జీవిస్తారు. ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి గలవాడు శాంతి సమాధానాలతో జీవిస్తాడని భారతదేశ రెండవ రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక సందర్భంలో తెలియజేశారు. అవును! పరమాత్ముడు సమాధానానికి సృష్టికర్త గనుక ఆయన పాదాల దగ్గర కాకపోతే మరెక్కడ శాంతి దొరుకుతుంది? క్రీస్తు పొంతి పిలాతు ద్వారా అన్యాయపు తీర్పు తీర్చబడి, వస్త్ర హీనునిగా చేయబడి, పరమ పవిత్రుడైనప్పటికీ మనిషి కోసం దోషిలా నిలువబడి, మానవ అపహాస్యాన్ని, హేళనను భరించిన సహనశీలి. తాను చేయని నేరాలను తలదించుకొని భరించాడు. చివరకు తనను యెరూషలేము వీధుల్లో ఈడ్చి, కల్వరి కొండపై మేకులతో సిలువకు కొట్టి, ముళ్ల కిరీటం ధరింపజేసి కిరాతకంగా హింసించిన వారిని కూడా క్షమించిన దయార్ద్ర హృదయుడు యేసు. ఒక్క ఎదురుమాట చెప్పినందుకే మొండెము నుండి తల వేరు చేయించిన చక్రవర్తులు ఎందరో చరిత్రలో ఉన్నారు. తమ మాటకు ఎదురు నిల్చినవారిని ఖండములుగా నరికినవారున్నారు. తమను అవమానపరచారని కత్తి వాతకు గురిచేసిన రాజులెందరో మానవ చరిత్రలో ఉండగా ప్రేమ చూపి సత్క్రియలు చేసి, దయను కురిపించి, ఆకలి తీర్చి, స్వస్థపరచి, మృతులను సైతం సజీవులుగా చేసిన మహోన్నతుడు యేసు. యేసు ఏమి సొంతం చేసుకోవాలని అనుకున్నాడు? ఆయన పుట్టింది ఎవరో పశువులపాకలో. ఒకసారి ఓ పరాయి పడవలో అమరమున తలవాల్చి నిదురించాడు. అనేక రాత్రులు ఒంటరిగా గెత్సేమనే తోటలో ప్రార్థనలో గడిపాడు. ఆఖరికి ఆయన మరణించిన తరువాత కూడా అరిమతయి యోసేపు అనువాని సమాధిలో ఉంచబడ్డాడు. ఇవన్నీ దేనికోసం? కేవలం మనిషిని సొంతం చేసుకోవాలన్న ఆశయంతో, తపనతో ఆయన దేన్నీ సొంతం చేసుకోలేదు. అవును! పరమాత్ముడు మనిషి çహృదయంలో వసించాలని ఆశిస్తున్నాడు. తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని క్రీస్తు పలికాడు. అది అక్షరాలా ఆయన జీవితంలో నెరవేరింది. ఒంటరిగా సిలువపై వేలాడుతూ ప్రజల పాపాల కోసం, పాప ప్రాయశ్చిత్తం కోసం యేసు సిలువలో మరణించాడు. మొదటి శతాబ్దపు చరిత్రకారుడైన ఫ్లావియస్ జోసీఫసు కూడా క్రీస్తు మరణాన్ని ధ్రువీకరించాడు. ఆ సమయంలో సిలువ చుట్టూ చేరిన అనేకులు సిలువ నుంచి దిగిరా! నీవు దైవకుమారుడని నమ్ముతామని క్రీస్తును సవాలు చేశారు. అంతమంది సవాలు చేస్తున్నా క్రీస్తు ఎందుకు సిలువను దిగలేదు? ఆ స్థానం నుంచి క్రీస్తు తప్పుకుంటే మానవునికి రక్షణ లేదు గనుక. పాప పరిహారం జరగదు గనుక.సమాధిలో ఉంచబడిన క్రీస్తు జీవితం ముగిసిపోయిందనుకున్నారంతా! ఆయన జీవితం సమాప్తమైనదని భావించారు. కానీ వారి అంచనాలను పటాపంచలు చేస్తూ మూడవ రోజున మరణ బంధనాలను తెంచుకొని యేసుక్రీస్తు బయటకు వచ్చారు. సమాధి ముందు పెట్టబడిన పెద్దరాయిగాని, చుట్టూ మోహరించి ఉన్న రోమన్ సైనికులు గాని ఆయన పునరుత్థానాన్ని అడ్డుకోలేకపోయారు. ఎన్నో ఏళ్లు మనిషిని ఏలుబడి చేసిన మరణం ఆరోజు మరణించింది. సత్యాన్ని ఏ ఒక్కరూ శాశ్వత సమాధి చేయలేరని ఋజువుచేయబడింది. అఖండ విజయం ఆయన పాదాక్రాంతమయ్యింది. సిలువ మరణం వరకు తగ్గించుకున్నాడు గనుక ఇప్పుడు హెచ్చింపబడ్డాడు. సమాధి నుంచి బయటకు వచ్చాడు గనుక ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. యేసుక్రీస్తుకు సిలువ మరణం విధించిన రోమన్ శతాధిపతి లాజినస్. ప్రక్రియంతా పూర్తయ్యాక పొంతి పిలాతు ముందు క్రీస్తు మరణాన్ని ధ్రువీకరించి వెళ్తుండగా పిలాతు భార్య ప్రొక్యులా ఇలా అడిగింది – ‘‘క్రీస్తు పై నీ అభిప్రాయం ఏమిటి?’‘. ‘‘క్రీస్తు మరణించినప్పుడు జరిగిన పరిస్థితులను గమనిస్తే ఆయన నిజముగా దేవుడని రుజువు చేయబడింది. తాను చెప్పినట్టే ఆయన మూడవ రోజున తిరిగి లేస్తాడు. మరణం కచ్చితంగా ఓడిపోతుంది. సమాధి నుంచి బయటకు వచ్చాక ఆయన విశ్వసంచారానికి శ్రీకారం చుడతాడు. విశ్వంలో ఆయన పేరు మారుమ్రోగుతుంది. ఈసారి ఆయన్ను ఏ రోమన్ చక్రవర్తి గాని, శాస్త్రులు, పరిసయ్యులు గాని ఏ ఒక్కరూ అడ్డుకోలేరు’’ అని బదులిచ్చాడు. ప్రియ నేస్తమా! ప్రతికూల పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నావా? అన్యాయం జరిగిందని బాధపడుతున్నావా? ప్రజలంతా నిన్ను నిందిస్తూ వేధిస్తున్నారా? నీవు ఎందుకూ పనికిరావు, నీ వల్ల ఏదీ కాదు అనినిన్ను హేళన చేస్తున్నారా? మౌనం వహించు! నీవు చేయాలనుకున్న కార్యమును నెరవేర్చడానికి ముందుకు సాగిపో! మరణాన్ని జయించిన దేవుని అనిర్వచనీయమైన కృప మరియు శక్తి నీకు తోడుగా ఉంటాయి. ఆయన్ను గుండెల్లో ప్రతిష్టించి క్లిష్ట పరిస్థితులను చాకచక్యంగా ఎదుర్కో, నిందలూ అవమానాలూ వస్తున్నాయని కృంగిపోకు! ప్రపంచంలోని విజేతలందరూ ఏదోక సందర్భంలో వాటిని ఎదుర్కొన్నవారే. ధైర్యంతో ముందుకు సాగిపో! నీవు తప్పకుండా విజయం సాధిస్తావు. ఈ రోజు నీ తగ్గింపే రేపు నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడుతుంది.ఈస్టర్ శుభాకాంక్షలు. డా. జాన్ వెస్లీ ఆధ్యాత్మిక రచయిత, వక్త క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి