నగరంలో అందంగా ముస్తాబైన చర్చిల్లో బుధవారం అర్ధరాత్రి ప్రార్థనలతో మొదలైన క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మూడు వారాల
సాక్షి, న్యూఢిల్లీ : నగరంలో అందంగా ముస్తాబైన చర్చిల్లో బుధవారం అర్ధరాత్రి ప్రార్థనలతో మొదలైన క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మూడు వారాల కింద దిల్షాద్ గార్డెన్‌లో అగ్నిప్రమాదం జరిగిన సెయింట్ సెబాస్టియన్ చర్చితో పాటు దాదాపు 224 చర్చిల్లో క్రైస్తవులు గురువారం ప్రార్థనలు చేశారు. ప్రపంచశాంతిని, సౌభ్రాతత్వాన్ని కాంక్షిస్తూ గీతాలు ఆలపించారు.
గంటల తరబడి చలిలో..
కనీస ఉష్ణోగ్రత ఆరు డిగ్రీలు ఉన్నప్పటికీ వేలమంది క్రైస్తవులు గంటలతరబడి క్యూలలో నిలబడి అర్థరాత్రి ప్రార్థనలు చేశారు చర్చిలలో సెయింట్ సెబాస్టియన్ చర్చిలో అర్థరాత్రి మాస్ మాత్రం జరుపలేదు. అన్ని కార్యక్రమాలను రాత్రి 11 గంటలకే ముగించారు. కొన్నిచోట్ల ప్రత్యేకంగా వేసిన టెంట్లలో ప్రార్థనలు చేశారు. అన్ని చర్చిల్లోనూ ఉత్సాహంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకొన్నారు. క్రిస్మస్‌కారోల్స్ పాడేవారు. శాంటాక్లాజ్ ల వేషధారణలు పిల్లలు, పెద్దలను అలరించాయి. పోలీసులు గట్టి భద్రతా ఏర్పాటు చేశారు. పీసీఆర్ వ్యాన్లతో పాటు భారీ సంఖ్యలో సిబ్బందిని మోహరించారు. వేడుకలు శాంతియుతంగా జరిగేలా చూశారు. గుర్గావ్‌లోనూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.