గుడ్‌ఫ్రైడే సందర్భంగా ప్రార్థనలు | Good Friday observed with religious fervour all across India | Sakshi
Sakshi News home page

గుడ్‌ఫ్రైడే సందర్భంగా ప్రార్థనలు

Published Sat, Apr 19 2014 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 6:12 AM

గుడ్‌ఫ్రైడే సందర్భంగా ప్రార్థనలు

గుడ్‌ఫ్రైడే సందర్భంగా ప్రార్థనలు

న్యూఢిల్లీ: గుడ్‌ఫ్రైడేను పురస్కరించుకొని నగరంలోని అన్ని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పలువురు క్రైస్తవులు ఉపవాసాలు ఆచరించి ప్రార్థనల్లో పాల్గొన్నారు. మరికొం దరు గత 40 రోజులుగా ఉపవాసాలు పాటిం చారు. ‘మానవజాతి విముక్తి కోసం క్రీస్తు నేడు శిలువ వేయించుకున్నాడు.

 

దేవుడే అయినా, మానవత్వానికి ఆయన మచ్చుతునక’ అని ఢిల్లీ క్యాథలిక్ చర్చ్ అధికార ప్రతినిధి ఫాదర్ డోమినక్ ఎమ్మాన్యుయేల్ అన్నారు. చర్చిలకు హాజరైన వాళ్లంతా సాయంత్రం ప్రార్థనలు ముగిసిన తరువాతే భోజనాలు చేశారని మార్కెటింగ్ సంస్థలో సీనియర్ మేనేజర్‌గా పనిచేసే వెండీ రొజారియో అన్నారు. క్రీస్తు పునరుత్థానాన్ని సూచించే ఈస్టర్ పర్వదినాన్ని ఆదివారం జరుపుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement