మైనార్టీలు ఉపకారవేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి
Published Tue, Sep 27 2016 10:02 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM
ఏలూరు సిటీ :
జిల్లాలోని ముస్లిం, క్రిస్టియన్, జైన్, బుద్ధిస్టు కేటగిరికి చెందిన విద్యార్థులు పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్స్ కోసం ఈ నెల 30వ తేది వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని జాయింట్ కలెక్టర్–2 ఎంహెచ్.షరీఫ్ మంగళవారం తెలిపారు. అర్హత కలిగిన మైనార్టీ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. జిల్లాలోని కళాశాల యాజమాన్యం అర్హత కలిగిన మైనార్టీ విద్యార్థులతో గడువులోగా ఉపకార వేతనాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయించాలని ఆదేశించారు. వివరాలకు 08812– 297059లో సంప్రదించాలని తెలిపారు
Advertisement
Advertisement