
క్రైస్తవులకు అండగా ఉంటాం
వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
మేళ్లచెరువు: క్రైస్తవుల కు అండగా ఉంటామని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు ఎస్సీ కాలనీ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు సుఖసంతో షాలతో, శాంతియుత జీవనం గడుపుతూ సమాజాభివృద్ధికి పాటు పడాలన్నారు. క్రిస్టియన్లు ఎప్పుడు సహాయం అడిగినా అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి క్రిస్టియన్లకు చేసిన సేవలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అనంతరం క్రిస్మస్ కేక్‌ను కట్‌చేసి చిన్నారులకు తినిపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వేముల శేఖర్‌రెడ్డి, కస్తాల ముత్తయ్య, పిల్లి మరియదాసు, జడ రామకృష్ణ, పెద్ది శివ, ప్రేమానందం, పొనగండ్ల సత్యనారా యణ రెడ్డి, కలగొట్ల వెంకటేశ్వరరెడ్డి, ధనపాటి రాధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.