Gattu Srikanth Reddy
-
బీజేపీలోకి గట్టు శ్రీకాంత్‌రెడ్డి!
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరనున్నారు. సోమవారం ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కలిశారు. ఈ సందర్భం గా వివిధ అంశాలపై చర్చించారు. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ జాతీయ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రకటించారు. ఆ వెనువెంటనే ఆయన మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌తో కలసి వచ్చి సంజయ్‌తో భేటీ అయ్యారు. మంచి రోజు చూసుకొని పార్టీ ముఖ్యనేతల సమక్షం లో ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలిపారు. చదవండి: (వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు రాజీనామా) -
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు రాజీనామా
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణలో పార్టీ విస్తరణ లేకపోవటంతో తన సొంత నియోజకవర్గమైన హుజూర్నగర్ ప్రజల అభిమతం మేరకు ఓ జాతీయపార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో తన నిర్ణయాన్ని వెల్లడించారు. 2007 నుంచి తాను పార్టీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉన్నానని, పార్టీలో తనకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గ బాధ్యతలతోపాటు జిల్లా ఇన్చార్జిగా, స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా.. ఇలా అవకాశాలు ఇస్తూ ఎంతో ప్రోత్సహించారని, ఇందుకు తానెప్పుడూ జగన్‌కు రుణపడి ఉంటానని అన్నారు. పార్టీని వీడాలని బాధతో నిర్ణయం తీసుకున్నానని, ఈ రోజు తనకు దుర్దినమేనని ఆయన అభివర్ణించారు. అద్భుతమైన పాలనతో ఏపీని ప్రగతిపథంలో ఉంచిన జగన్ మోహన్ రెడ్డికి భవిష్యత్తులో మరిన్ని గొప్ప అవకాశాలు రావాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు గడుస్తున్నా నిరుద్యోగులు అల్లాడుతుండటం బాధగా ఉందని, తాజాగా ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకోవడం తనను కలచివేసిందని అన్నారు. యాదాద్రి దేవాలయానికి నిధులు ఇవ్వటం తప్ప నల్లగొండ జిల్లాకు సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదని విమర్శించారు. దేశభక్తితో ముందుకు సాగుతున్న జాతీయ పార్టీలో చేరనున్నానని, తాను వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి హుజూర్నగర్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుస్తానని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో డబ్బే గెలుస్తుందని, డబ్బు కావాలో, అభివృద్ధి కావాలో ప్రజలు తేల్చుకోవాలని అన్నారు. -
వైఎస్‌కు ఘనంగా నివాళి
సాక్షి,హైదరాబాద్: దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్‌లో పంజగుట్ట సర్కిల్లోని వైఎస్సార్ విగ్రహానికి పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ఇతరనాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు వైఎస్సార్‌ను స్మరించుకునే రోజని, ఉమ్మడి ఏపీలో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. వైఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతీ గుడిసెకు, గుండెకు చేరుకోవడంతో ప్రజలకు మహానేత చిరస్థాయిగా గుర్తుండిపోతారని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగించేందుకు, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలుకు ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. అక్కడ అమలు చేస్తున్న పథకాలను తెలంగాణలోనూ చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, బి.సంజీవరావు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వెల్లాల రాంమోహన్, సేవాదళ్ అధ్యక్షుడు బండారు వెంకటరమణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొయ్యాడ మహేష్‌కుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలు అమృతసాగర్, నేతలు జస్వంత్‌రెడ్డి, పిట్టా రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల హృదయాల్లో చెరగని స్థానం వైఎస్సార్‌కు కాంగ్రెస్ నివాళి సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేదల సంక్షేమమే పరమావధిగా పనిచేసి ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించారని పలువురు కాంగ్రెస్ నేతలు కొనియాడారు. వైఎస్సార్ 11వ వర్ధంతి సందర్భంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్, అసెంబ్లీలోని కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) కార్యాలయాల్లో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీపీసీసీ నాయకులు మల్లు రవి, బొల్లు కిషన్, అఫ్జలుద్దీన్, కుమార్ రావ్, ప్రేమ్ లాల్ తదితరులు పాల్గొన్నారు. సీఎల్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. -
తెలంగాణలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 71వ జయంతి తెలంగాణలోనూ ఘనంగా జరిగింది. పంజాగుట్ట నాగార్జున సర్కిల్లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా గట్టు శ్రీకాంత్ రెడ్డి సర్కిల్లో కేక్ కట్‌చేశారు. నల్గొండ మిర్యాలగూడ నియోజకవర్గంలో వైఎస్సార్ జయంతి వేడుకలలో భాగంగా గూడూరు, కొండ్రపోల్, బొత్తలపాలెం, దామచర్లలో కేక్ కట్ చేసి పేదలకు పండ్లను పంచిపెట్టారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఇంజమ్ నర్సిరెడ్డి, మిర్యాలగూడ అధ్యక్షుడు పిల్లుట బ్రహ్మం, దామచర్ల అధ్యక్షుడు అన్నెం కరుణాకర్ రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా భువనగిరిలోనిన కిసాన్ నగర్లో శక్తీ మిషన్ అధ్యక్షురాలు కర్తాల శ్రీనివాస్, ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు కుతాడి సురేష్ , కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బత్తులు సత్యనారాయణలు వైఎస్సార్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిరిసిల్ల వైఎస్సార్ జయంతిని సిరిసిల్ల గాంధీ చౌక్ వద్ద వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జోగులాంబ గద్వాల ధరూర్ మండల కేంద్రంలో వైఎస్సార్ 71వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్సార్ అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. -
'తెలంగాణలోను పార్టీనీ బలోపేతం చేస్తాం'
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అమీర్‌పేటలో పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి పార్టీ జెండాను ఆవిస్కరించి కేక్‌ను కట్‌చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. నాడు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు, చంద్రబాబు కుమ్మక్కై వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇబ్బందులకు గురిచేశారు. దీంతో ఆయన కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఏపీ వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేసి వారి సమస్యలను పరిష్కరించడమే ఎజెండాగా మేనిఫెస్టో రూపొందించారు. అనంతరం జరిగిన ఎన్నికలలో పార్టీ అఖండ విజయం సాధించిందని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తామన్నారు. కార్యకర్తలు మనోధైర్యంతో ఉండాలని, త్వరలో ఇక్కడ కూడా మంచి రోజులు వస్తాయని వెల్లడించారు. -
ఆరు నెలల్లోనే వైఎస్ జగన్‌కు ప్రజా దీవెనలు
రహమత్‌నగర్: ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆరునెలల్లోనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజా మన్ననలు పొందారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. నగరంలోని రహమత్‌నగర్ డివిజన్ ఎస్పీఆర్హిల్స్, జూబ్లీహిల్స్‌లోని కార్మికనగర్, శ్రీనగర్‌కాలనీలోని గణపతి కాంప్లెక్స్ వద్ద వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గట్టు శ్రీకాంత్‌రెడ్డి పాల్గొని కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహణతో పాటు దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, పేద మహిళలకు దుప్పట్లను పార్టీ నేతలు అందజేశారు. అనంతరం గట్టు మాట్లాడుతూ..ఎన్ని అవరోధాలు ఎదురైనా దివంగత మహానేత డా.వైఎస్సార్ చూపిన బాటలో అడుగుముందుకు వేసిన భగీరథుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. ఏపీలో దిశ చట్టాన్ని అమలు చేయడంతో ఇతర రాష్ట్రాలు కూడా ఆ చట్టం వివరాలు కోరుతున్నాయంటే జగన్ దార్శనికత అర్థం అవుతుందన్నారు. ఈ వేడుకల్లో దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకల్లో ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు డా ప్రపుల్లారెడ్డి, బి సంజీవరావు, బెజ్జంకి అనిల్ కుమార్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్‌రెడ్డి, వనపర్తి జిల్లా అధ్యక్షుడు జశ్వంత్‌రెడ్డి, రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు బండారు వెంకటరమణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా శనివారం (21న) ఏపీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీనాయకులు, అభిమానులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి కోరారు. జగన్ జన్మదినం సందర్భంగా దైవసన్నిధానాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని, రక్త, అన్నదాన శిబిరాల నిర్వహణతో పాటు ఆస్పత్రుల్లో పండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టాలని గురువారం ఓ ప్రకటనలో కోరారు. -
ఎన్‌కౌంటర్‌ను స్వాగతిస్తున్నాం..
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ కేసు నిందితులకు సరైన శిక్ష పడిందని వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎన్‌కౌంటర్‌ను స్వాగతిస్తున్నామని, సత్వర న్యాయం చేశారని పేర్కొన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి ఇటువంటి శిక్షలే సరి అన్నారు. చట్టం తన పని చేసుకుపోతుందని భావిస్తున్నామని చెప్పారు. ఇలాంటి దారుణ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దారుణాలకు పాల్పడే వారికి వెంటనే శిక్షలు పడేలా చట్టాలను మరింత కఠినంగా మార్చాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు. (చదవండి: ఎన్కౌంటర్: గుడిగండ్లలో ఉద్రిక్తత) -
హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్కు వైఎస్సార్సీపీ మద్దతు
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు మద్దతివ్వాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ఈ మేరకు శనివారం టీఆర్ఎస్ ఇన్చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డిని కలసి మద్దతు కోరగా ఆయన సానుకూలంగా స్పందించి మద్దతు తెలిపారు. -
తెలంగాణ వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వైఎస్సార్‌కు ఘన నివాళి
-
8న రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ జయంతి: గట్టు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. అన్ని జిల్లా, అసెంబ్లీ, మండల కేంద్రాల్లోని వైఎస్సార్ విగ్రహాలను పూలమాలలతో అలంకరించి నివాళులర్పించాలని శనివారం ఒక ప్రకటనలో కార్యకర్తలకు సూచించారు. రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, ఆస్పత్రులల్లో రోగులకు పండ్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో ఉదయం 9 గంటలకు నిర్వహించే వైఎస్సార్ జన్మదిన వేడుకల్లో పార్టీ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులు పాల్గొనాలని శ్రీకాంత్‌రెడ్డి కోరారు. -
రాజ్యాంగ స్ఫూర్తికి పునరంకితం కావాలి
సాక్షి, హైదరాబాద్ : రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులందరూ పునరంకితం కావాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆదివారం ఉదయం హైకోర్టు ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజలవద్దకు తీసుకెళ్లే బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యన్, జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్, విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ వి.ఈశ్వరయ్య, జస్టిస్ చంద్రయ్య, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన తెలంగాణ అవతరణ వేడుకల్లో గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కొండా రాఘవరెడ్డి తదితరులు అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందడుగు వేయాలి: గట్టు హైదరాబాద్: అభివృద్ధి, సంక్షేమం దిశగా రాష్ట్రం ముందడుగువేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆకాంక్షించారు. లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల్లో జాతీయజెండాను ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అమరుల ఆకాంక్షలు నెరవేరాలని, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, కొండా రాఘవరెడ్డి, బి.సంజీవరావు, మహిళావిభాగం అధ్యక్షురాలు అమృతాసాగర్, ఎస్సీసెల్ అధ్యక్షుడు నాగదేశి రవికుమార్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో .. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఆదివారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమరుల త్యాగాల ఫలితంగా తప్పనిసరి పరిస్థితుల్లో నాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సి వచ్చిందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ కలలుగన్నట్లు కాకుండా రాష్ట్రంలో కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు పాలన సాగిస్తుండడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ముఖ్యనేతలు కె. దయాకర్‌రెడ్డి, అరవింద్‌కుమార్‌గౌడ్, బండ్రు శోభారాణి తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఆవరణలో.. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఆదివారం శాసనసభ ఆవరణలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో.. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ లక్ష్యాలు నెరవేరలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన సాగుతోందని, కుటుంబ కబంద హస్తాల్లో, అవినీతిలో కూరుకుపోయిన రాష్ట్రానికి విముక్తి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మజ్లిస్ పార్టీ ఒత్తిడితో నిర్వహించడం లేదని ఆరోపించారు. డీజీపీ కార్యాలయంలో.. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు చైర్మన్ వి.వి.శ్రీనివాసరావు జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో సీఐడీ ఎస్పీ సుమతి, డీఎస్పీ వేణుగోపాల్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ యోగేశ్వర్రావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి
సాక్షి, హైదరాబాద్ : రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 12న రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఆ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ ఏర్పాటై మార్చి 12 నాటికి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకొని, 9వ వసంతంలోకి అడుగుపెడుతోందని ఈ సందర్భంగా శ్రీకాంత్ పేర్కొన్నారు. దీన్ని పునస్కరించుకొని లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఉదయం 10 గంటలకు పార్టీ జెండా ఆవిష్కరణ జరుగుతుందని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని పార్టీ నేతలు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు తప్పక పాల్గొనా లని కోరారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించాలని కోరారు. -
వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో దైవసన్నిధానాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని ఆయ న మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రక్తదానం, అన్నదానం, ఆస్పత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర జనవరి 9,10 తేదీల్లో విజయవం తంగా పూర్తి చేసుకోవాలని, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించి సీఎం కావాలని కోరుకుంటూ ప్రార్థనలు నిర్వహించాలన్నారు. -
వైఎస్.జగన్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై గురువారం విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకొని భవిష్యత్తులో దాడులు జరగకుండా ఉండటానికి వైఎస్ జగన్‌కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. ఏపీలో జగన్ చేపట్టిన పాదయాత్ర విశేష ప్రజాదరణ పొందిందన్నారు. ప్రతినిత్యం లక్షలాదిమంది ప్రజల్లో ఒక్కడిగా ఉంటూ వారి సమస్యలను వింటూ, వారికి న్యాయం జరిగేలా చూడాలని నిత్యం పరితపించే జననాయకుడు జగన్ అని పేర్కొన్నారు. లక్షలాదిమంది ప్రజలు బాసటగా నిలుస్తూ, స్వచ్ఛందంగా ఆయన అడుగులో అడుగు వేస్తూ బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఆయనకు వస్తున్న ప్రజాభిమానాన్ని తట్టుకోలేని కొందరు దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు ఏపీలో వైస్సార్సీపీ కార్యకర్తలపై మొదలైన దాడులు జననాయకునిపై దాడి వరకు చేరాయన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయనటానికి ఇది ఉదాహరణ అని అన్నారు. రాష్ట్ర ముఖ్యనేతపై దాడులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. -
ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న పాదయాత్ర
సాక్షి, హైదరాబాద్: ప్రజలంతా వైఎస్ జగన్ కోసం వేచి చూస్తుంటే జనం కోసం వైఎస్ జగన్ వేలాది కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర 3 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. జనం కోసమే వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టారని, జగన్ కోసం జనం వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం ద్వారా ఒక చరిత్ర సృష్టిస్తే, ఇప్పుడు వైఎస్ జగన్ నవచరిత్ర సృష్టించారన్నారు. చరిత్ర సృష్టించాలన్నా, తిరగ రాయాలన్నా అది మహానేత వంశానికే సాధ్యమవుతుందన్నారు. ప్రజల్లో బలమైన నమ్మకాన్ని కలిగిస్తూ భవిష్యత్తు బాగుంటుందనే భరోసా ను పెంపొందిస్తూ పాదయాత్ర సాగుతోందన్నారు. పాదయాత్రలో సమస్యలు చెప్పుకుంటున్న ప్రజలం తా వైఎస్ జగన్ ధృడమైన నాయకత్వాన్ని చూశారని, ఆయన వస్తే ఆశలు, ఆశయాలు తీరుతాయనే ప్రగా ఢ విశ్వాసం ప్రజల్లో నెలకొందన్నారు. మరే నాయ కుడు పాదయాత్ర చరిత్రను తిరగరాసే ప్రసక్తే ఉండదన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రఫుల్లారెడ్డి మాట్లాడుతూ, వైఎస్ జగన్ సీఎం ఎప్పుడు అవుతారా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారన్నారు. ఆయన నాయకత్వంలోనే పేదవాడు గొప్పవాడుగా, రైతు రాజుగా అవుతారన్నారు. చంద్రబాబు, కేసీఆర్ పాలనలో దుర్మార్గాలు, అక్రమాలు, అన్యాయాలు ప్రజలు చూస్తున్నారన్నారు. ఏపీలో పోలవరం, పట్టిసీమ, తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులను ధనార్జన కోసం వాడుకుని అవినీతికి పాల్పడుతున్నారన్నారు. కేసీఆర్, చంద్రబాబు దుర్నీతిని ఎండగడుతూ ప్రజల కోసం పనిచేస్తున్న వైఎస్సార్సీపీకి అండగా ఉండా లని ప్రజలను కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయ కులు బి.అనిల్‌కుమార్, బొడ్డు సాయినాథ్‌రెడ్డి, నాగదేశి రవికుమార్, బసిరెడ్డి బ్రహ్మానందరెడ్డి, వి.సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
కన్నీటియాత్ర!
మిర్యాలగూడ: పరువు హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్‌కి మిర్యాలగూడ ప్రజలు, కుటుంబ సభ్యులు, వివిధ పార్టీల, కుల సంఘాల నాయకులు ఆదివారం కన్నీటి వీడ్కోలు పలికారు. ఉక్రెయిన్‌లో వైద్య విద్య చదువుతున్న ప్రణయ్ తమ్ముడు అజయ్ మధ్యాహ్నం 2.40 గంటలకు ఇక్కడికి చేరుకున్నాడు. అనంతరం వినోభానగర్‌లోని నివాసం నుంచి 3.15 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమైంది. యాత్ర సాగుతున్నంత సేపూ ప్రణయ్ భార్య అమృత, తల్లిదండ్రులు బాలస్వామి, ప్రేమలత రోదిస్తూనే ఉన్నారు. వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల, కుల సంఘాల నాయకులు భారీగా తరలివచ్చి అంతిమయాత్రలో పాల్గొన్నారు. వినోభానగర్ శ్మశానవాటికలో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం.. 7.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ యాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ప్రణయ్‌ని హత్య చేయించిన మారుతీరావును ఉరితీయాలని అంతియయాత్రలో స్నేహితులు, బంధువులు నినాదాలు చేశారు. నివాళులర్పిస్తున్న వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ప్రణయ్ అంతిమయాత్రలో పాల్గొన్నగోరటి వెంకన్న, ఇతర ప్రజా సంఘాల నేతలు వదినను, తండ్రిని పట్టుకొని రోదిస్తున్న ప్రణయ్ తమ్ముడు అజయ్ అంతిమయాత్రలో పాల్గొన్న నాయకులు... ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, ప్రజా కవి గోరటి వెంకన్న, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, జూలకంటి రంగారెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాల్వాయి రజిని, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎండీ యూసుఫ్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఎల్లయ్య, న్యూ డెమొక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గోవర్ధన్, ఐఎఫ్టీయూ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అనురాధ, తెలంగాణ ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, కుల నిర్మూలన వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బండారు లక్ష్మయ్య, మానవ హక్కుల వేదిక నిజనిర్ధారణ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్, విరసం నాయకురాలు ఉదయ కుమారి పాల్గొన్నారు. పలువురి పరామర్శ: ప్రణయ్ మృతదేహాన్ని సందర్శించి, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించిన వారిలో ఎమ్మెల్సీ రాములునాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేలు, మాజీ ఎమ్మెల్సీ భారతీరాగ్యానాయక్, మాజీ ఎమ్మెల్యేలు రామ్మూర్తి యాదవ్, చిరుమర్తి లింగయ్య, ఇండియన్ రైల్వే సర్వీసెస్ రిటైర్డ్ చీఫ్ జనరల్ భరత్ భూషణ్, విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ మురళీమోహన్ ఉన్నారు. కఠినంగా శిక్షించాలి ప్రణయ్ హత్యలో నిందితులను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రణయ్ మృతదేహాన్ని జిల్లా అధ్యక్షుడు ఇంజం నర్సిరెడ్డితో కలసి సందర్శించి సంతాపం తెలిపారు. అనంతరం అమృత, ప్రణయ్ తల్లిదండ్రులను పరామర్శించి మాట్లాడారు. ఇంకా కులాల పేరుతో పరువు హత్యలు జరగడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. -
ముందస్తు ఎన్నికలకు సన్నద్ధం కావాలి
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సన్నద్ధం కావాలని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు గట్టు శ్రీ,కాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య సమావేశం జరిగింది. గట్టు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలు, అభ్యర్థులు బలంగా ఉన్న స్థానాలు గుర్తిస్తున్నామని తెలిపారు. ఈ వివరాలన్నీ అధిష్టానానికి అందజేస్తామని చెప్పారు. ముందస్తు నేపథ్యంలో ఎన్నికల కమిటీ, కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పార్టీకి కార్యకర్తలే దేవుళ్లని, రాజకీయాల్లో ఓపిక ఎక్కువగా ఉండాలని పేర్కొన్నారు. ఎన్నికల హామీల అమలులో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమై, మళ్లీ ముందస్తు ఎన్నికలు వచ్చేలా చేశారని విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపించి, ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారని గుర్తుచేశారు. అలాంటి టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం అనైతికమన్నారు. అవసరం కోసం చంద్రబాబు ఎవరి కాళ్లయినా పట్టుకుంటారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకే ఎన్నికల్లో పాల్గొంటామని పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు. సంపూర్ణ మద్దతున్నా కేసీఆర్ ముందస్తుకు ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ సూచించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మతీన్ ముజాద్దాదీ, రాంభూపాల్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, అనిల్ కుమార్, ప్రపుల్లారెడ్డి, సంజీవరావు, పార్టీ మహిళా అధ్యక్షురాలు అమృతసాగర్, జీహెచ్ఎంసీ అధ్యక్షుడు సాయినాథ్‌రెడ్డి, వెల్లాల రామ్మోహన్, రవికుమార్, ఎస్ఈసీ సభ్యులు అక్కెనపల్లి కుమార్, బ్రహ్మానందరెడ్డి, జిల్లాల అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌లు, అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. -
రేపు తెలంగాణ వైఎస్సార్సీపీ ముఖ్య సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 10న ముఖ్య సమావేశం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయం లోటస్‌పాండ్‌లో ఈ సమావేశం జరుగుతుంది. పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా ఇన్‌చార్జ్‌లు, జిల్లా అధ్యక్షులు, ఎస్ఈసీ సభ్యులు, అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు హాజరుకావాలని పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. సమావేశంలో రాబోయే ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, తదితర అంశాలపై చర్చించనున్నారు. వైఎస్సార్సీపీలో పలువురికి పదవులు.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాజేంద్రనగర్‌కు చెందిన సయ్యద్ ఫాజిల్ అహ్మద్‌ను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా గట్టు శ్రీకాంత్‌రెడ్డి నియమించారు. రాష్ట్ర యూత్ విభాగం కార్యదర్శులుగా అల్లె అనిల్ కుమార్, గుండ తిరుమలయ్యను నియమించారు. -
ఏం సాధిస్తారు...
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ దాదాపు తొమ్మిది నెలలు ముందుగానే ఎన్నికలకు వెళ్లి ఏం సాధించాలనుకుంటున్నదో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి నిలదీశారు. హైదరాబాద్ వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ లక్ష్యాలన్నింటినీ టీఆర్ఎస్ నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ ముఖ్య నేతల సమావేశం జరిగిందన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సమావేశంలో తీర్మానించినట్లు చెప్పారు. తీర్మానాన్ని వైఎస్ జగన్ నిర్ణయానికి అప్పజెప్పామని, ఆయన నిర్ణయం మేరకే ముందుకెళతామని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో మొదటగా ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం గడువు ముగియక ముందే ముందస్తు పేరుతో ఎన్నికలకు ఎందుకు వెళుతున్నదో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
ఏ హామీ నెరవేర్చారని ముందస్తుకు వెళ్తున్నారు
-
‘కేసీఆర్ సరైన సమాధానం ఇవ్వాలి’..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ప్రభుత్వం తొమ్మిది నెలల ముందే పోవటం ఏంటనేది కేసీఆర్ సరైన సమాధానం ఇవ్వాల్సి ఉందని తెలంగాణ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా యువతకి ఉద్యోగాలు ఇచ్చారని ముందస్తుకు వెళ్తున్నారా..? ఏ హామీ నెరవేర్చారని ముందస్తుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ అభిమానులు అనేక మంది ఉన్నారని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల హమీలను మరిచిన సంగతిని వైఎస్సార్ సీపీ ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. వైఎస్సార్ సీపీ తెలంగాణలో ఎన్ని స్థానాలలో పోటీ చేస్తుందనేది తీర్మానం చేసి జాతీయ అధ్యక్షుడికి పంపిస్తామని అన్నారు. ఆ తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడి నిర్ణయం ప్రకారం ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనేది నిర్ణయిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో పొత్తుల విషయం కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. -
‘హామీలను నెరవేర్చిన తరువాతే ఎన్నికలకు వెళ్లాలి’
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలన్ని నెరవేర్చిన తరువాతనే కేసీఆర్ ఎన్నికలకు వెళ్లాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన హామీల మేరకు వెంటనే లక్షన్నర ఉద్యోగాల ప్రకటన విడుదల చేయాలని కోరారు. దళితులకు మూడు ఎకారాల భూమి పంపిణీ చేయాలని అన్నారు. రాష్ట్రంలో 2.70 లక్షల డబుల్ బెడ్రుం ఇళ్లు ఇస్తానన్నాని.. కేవలం పదివేల ఇళ్లు మాత్రమే నిర్మించారని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్ ఏవిధంగా ప్రజలను ఓట్లు అడుగుతారని ఆయన ప్రశ్నించారు. -
‘బ్రిటీష్ పాలనకంటే ఘోరంగా బాబు పాలన’
సాక్షి, కడప : తనను ప్రశ్నిస్తే జైలుకే అంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన బ్రిటీష్ పాలన కంటే ఘోరంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గట్టు శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం వైఎస్సార్ జిల్లా రాయచోటిలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గట్టు శ్రీకాంత్ రెడ్డితో పాటు కౌన్సిలర్లు, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. మైనారిటీల అక్రమ అరెస్టులపై వారు ధ్వజమెత్తారు. మైనారిటీలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గట్టు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. నారా హమారా, టీడీపీ హమారా.. ప్రభుత్వ కార్యక్రమమా.. పార్టీ కార్యక్రమమా అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా మైనారిటీలు పడుతున్న ఇబ్బందులను గుర్తించని బాబుకు ఎన్నికలు దగ్గరికి వచ్చేసరికి భూటకపు ప్రేమ పుట్టుకొచ్చిందని విమర్శించారు. మైనారిటీ సంక్షేమానికి కట్టుబడిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. మైనారిటీలను వేధిస్తుంటే సహించేది లేదని స్పష్టం చేశారు. బాబును ఊరికే పొగడాలంటే తమ వల్ల కాదని అన్నారు. చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోమని అడగటం నేరమా అని ప్రశ్నించారు. -
వైఎస్సార్ వర్ధంతిని ఘనంగా నిర్వహించండి
సాక్షి, హైదరాబాద్: అపరభగీరథుడు, దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో వైఎస్సార్‌కు ఘన నివాళులర్పించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. వైఎస్సార్ విగ్రహాలను పూలమాలలతో అలంకరించాలన్నారు. అనంతరం రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, ఆస్పత్రులలో రోగులకు పండ్ల పంపిణీ, అనాథలకు వస్త్రాల పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. -
‘బాబు’ బొమ్మతో ఓట్లకు పోతారా..?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన మహానేత వైఎస్సార్ ఫొటో పెట్టుకోవడానికి జంకుతున్న ఆ పార్టీ నేతలు.. సిగ్గు లేకుండా వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కుదుర్చుకోవాలనుకోవడం నీతిమాలిన చర్య అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు బొమ్మ పెట్టుకొని ప్రచారానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఆ పార్టీ నేతలకు అసలు సిగ్గుందా? అని ప్రశ్నించారు. శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ‘నిరుద్యోగ గర్జన’సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు, నీళ్లు, నియామకాలంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఉద్యోగాల జాడలేదన్నారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పిన లక్ష ఉద్యోగాల భర్తీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. లోపభూయిష్టంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేయడం, కోర్టు కేసులతో నియామకాల ప్రక్రియ ఆగిపోవడం పరిపాటిగా మారిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేతకాని వ్యవస్థలా తయారైందని ఆయన మండిపడ్డారు. నాలుగున్నరేళ్లలో లక్షన్నర ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 12 వేల ఉద్యోగాలు భర్తీ చేశారని 19 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినా కోర్టు ద్వారా రద్దయ్యాయని తెలిపారు. నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఉద్యోగాలు భర్తీ చేసే వరకు ఉద్యమాన్ని ఆపబోమని హెచ్చరించారు. ఉద్యోగాలు భర్తీ చేశాకే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. మిషన్ కాకతీయ, భగీరథ పథకాలు కమీషన్లు దండుకోవడానికేనని గట్టు ఆరోపించారు. ప్రాజెక్టు పనుల పురోగతి, నిధుల కేటాయింపులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ చేపట్టిన ప్రాజెక్టులకే రీడిజైనింగ్ చేస్తూ ప్రారంభోత్సవాలు చేస్తున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా చేపట్టి ప్రాజెక్టులు ఏమీ లేవని ఆయన విమర్శించారు. ఆన్‌గోయింగ్ ప్రాజెక్టుల పనులు చేస్తూ గొప్పలు చెప్పుకోవడమే టీఆర్ఎస్ ప్రభుత్వానికి రివాజుగా మారిందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మరోసారి ప్రజలను వంచించడానికే ముందస్తు ఎన్నికల డ్రామాకు తెరలేపారని గట్టు ఆరోపించారు. వైఎస్సార్సీపీ సొంత ఎజెండాతో రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, కరీంనగర్ జిల్లా ఇన్చార్జి బెజ్జంకి అనిల్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజీవరావు, డాక్టర్ ప్రపుల్లకుమార్‌రెడ్డి, సేవాదళ్ అధ్యక్షుడు వెంకటరమణ, రాష్ట్ర కార్యదర్శి అజయ్‌వర్మ, ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి అక్కెనపల్లి కుమార్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.నగేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఉద్యోగాల భర్తీపై శ్వేత పత్రం విడుదల చేయాలి’
సాక్షి, కరీంనగర్: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులను, నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ గర్జన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎర్పడిన తరువాత ఎన్ని ఉద్యోగాలు కల్పించారో, ఎన్ని ఉద్యోగాలు ఖాళీ అయ్యయో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో టీఆర్ఎస్ మోసానికి పాల్పడుతోందని ఆరోపించారు. తెలంగాణలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం, పేర్లు మార్చడం తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా చేపట్టలేదన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని.. అందుకు టైం షెడ్యూల్ విడుదల చేయాలని కోరారు. ముందస్తు ఎన్నికలకు వెళ్తామని చెప్పడం తెలంగాణ ప్రజలను మోసం చేయడమేనని పేర్కొన్నారు. పాతిక లక్షల మందితో టీఆర్ఎస్ పార్టీ మీటింగ్‌లు పెట్టడం కాదు.. పాతిక లక్షల మందికి నియామకాలు ఎప్పుడో చేపడతారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకునే ఏ పార్టీకైనా ఓటమి తప్పదని సూచించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును తెలంగాణలో తిరగనీయకుండా చేయాలన్నారు. -
నేడు కరీంనగర్లో ‘నిరుద్యోగ గర్జన’ : గట్టు
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరుద్యోగ గర్జన సభను నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. ఈ ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిరుద్యోగులు, పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. గురువారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. ఉదయం 10 గంటలకు ఆందోళన ప్రారంభమవుతుందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయటానికి సీఎం కేసీఆర్‌కు చేతులు రావటం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని గట్టు డిమాండ్ చేశారు. -
నిరుద్యోగ గర్జన సభ వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మంగళవారం కరీంనగర్లో నిర్వహించాల్సిన నిరుద్యోగ గర్జన సభను వాయిదా వేసినట్లు వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 24న ఉదయం 10 గంటలకు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరుద్యోగ గర్జన సభను నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జరిగిన ఈ మార్పును అంతా అర్థంచేసుకోవాలని కోరారు. ఈ నెల 24న జరగనున్న సభకు నిరుద్యోగులు, పార్టీ రాష్ట్ర, అన్ని జిల్లాల నాయకులు మరియు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
ఆ దంపతులను చూస్తేనే నా జన్మ ధన్యమవుతుంది
రాజోళి (అలంపూర్) : ‘వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి–భారతి దంపతులను చూస్తేనే నా జన్మ ధన్యమవుతుంది.. అపుడే నాకు ఆనందం అని కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళికి చెందిన విద్యాసాగర్ పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డిని చూడా లని తన కోరిక అని ఆయన చెప్పిన నేపథ్యంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జెట్టి రాజశేఖర్.. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన శనివారం రాజోళికి వచ్చి విద్యాసాగర్‌ను ఆయన నివాసం లో పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ తనకు, తన తల్లిదండ్రులకు వైఎస్.రాజశేఖర్‌రెడ్డి కుటుంబమంటే ప్రాణమని.. ఎప్పటికైనా పెద్దాయనను కలవాలని అనుకున్నా కుదరలేదని పేర్కొన్నారు. ఆ తర్వాత జగన్ చూసినపుడల్లా కలవాలని, మాట్లాడాలని అనిపించినా కుదరడం లేదని తెలిపారు. సివిల్ ఇంజనీర్‌గా ఎన్నో ప్రాజెక్టుల్లో సేవలందించిన తనకు ఎక్కడా సరైన గౌరవం దక్కకపోగా.. వైఎస్ కుటుంబాన్ని చూడగానే తెలియని ధైర్యం వస్తుందని పేర్కొన్నారు. అయితే, పని చేసే సమయంలోనే నా రెండు కిడ్నీలు చెడిపోగా, అల్సర్ కూడా వచ్చిందని.. ఇంతలోనే తన కూతురు కూడా చనిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. తన కుమార్తె కూడా జగన్‌ను చూడాలని కోరుకునేదని.. ఆమె కోరిక తీరకపోగా, తన కోరికైనా తీరుతుందో, లేదోనని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తాను జగన్ చూడాలనుకుంటున్న విషయం తెలుసుకుని ఆయన తరఫున శ్రీకాం త్‌రెడ్డిని పంపించడం ఆనందంగా ఉందని విద్యాసాగర్ తెలిపారు. ఇంత త్వరగా స్పందించే గుణం ఉండడంతోనే వైఎస్సార్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని, అందుకే జననేతగా పిలుస్తున్నారని తెలిపారు. విద్యాసాగర్‌కు అండగా ఉంటాం.. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విద్యాసాగర్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటా మని గట్టు శ్రీకాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించేలా సమస్య తెలుసుకునేందుకు తనను జగన్మోహన్రెడ్డి పంపించారని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు కొండూరు చంద్రశేఖర్, జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల అధ్యక్షుడు జెట్టి రాజశేఖర్, బీస మరియమ్మతో పాటు భూపాల్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, చంద్రవాసులు రెడ్డి, బంగారు మహేశ్వర్ రెడ్డి, వంశీధర్‌రెడ్డి, రాజు, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. -
నిరుద్యోగులను వంచించిన టీఆర్ఎస్: గట్టు
సాక్షి, హైదరాబాద్: లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ హామీని విస్మరించి నిరుద్యోగులను పూర్తిగా వంచించిందని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. ఖాళీగా వున్న ఉద్యోగాలకు ప్రభుత్వం తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని శనివారం ఓ ప్రకటనలో ఆయన డిమాండ్ చేశారు. లక్ష ఉద్యోగాల భర్తీకి ఖమ్మం జిల్లాలో నిర్వహించాలనుకున్న నిరుద్యోగ గర్జనకు ప్రభుత్వం అనుమతి నిరాకరించినందున అదే సభను ఈ నెల 21న కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్నట్లు తెలిపారు. నాలుగేళ్లుగా నిరుద్యోగులు పోటీ పరీక్షల కోసం కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు చేసి అప్పులపాలవుతున్నారని వాపోయారు. కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి, కమీషన్ల కక్కుర్తికి సాగునీటి ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు నోటిఫికేషన్లు విడుదల చేయటానికి మాత్రం చేతులు రావటం లేదన్నారు. నిరుద్యోగ గర్జన సభకు నిరుద్యోగులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
ఉద్యోగాల భర్తీలో విఫలం
నల్లగొండ టూటౌన్ : తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన నిరుద్యోగ యువతను ప్రభుత్వం మోసం చేస్తుందని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నల్లగొండలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా íసీఎం కేసీఆర్ లక్షా 6వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రకటించి నేటికీ 20వేలు కూడా భర్తీ చేయకపోవడం ప్రభుత్వం అసమర్థత అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని, వాటిని ఎందుకు భర్తీ చేయలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంటికో ఉద్యోగమని చెప్పి ఉద్యమ సమయంలో నిరుద్యోగులను వాడుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయకుండా మోసం చేసిందన్నారు. లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ కోచింగ్ సెంటర్లకు లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన అతి కొద్ది ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా కోర్టులోనే నానుతున్నాయన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటికి యుద్ధప్రాతిపదికన నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు, విద్యార్థులు సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పార్టీ తరుపున ఆందోళనలు తీవ్రతరం చేస్తామని అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇంజం నర్సిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిందే నిధులు, నియామకాలు, నీళ్ల కోసమని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు మేడిశెట్టి యాదయ్య, కోరె గోవర్ధన్, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎండీ ఫయాజ్, నాయకులు నరేష్‌గౌడ్, గాదరి రమేష్, మాచర్ల దశరథ, తదితరులు పాల్గొన్నారు. -
21న ఖమ్మంలో నిరుద్యోగ గర్జన
నల్లగొండ టూటౌన్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన నిరుద్యోగులను టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షన్నర ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ఈనెల 21న ఖమ్మంలో నిరుద్యోగగర్జన నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గురువారం పార్టీ ఆధ్వర్యంలో నల్లగొండలో నిరుద్యోగ సమస్యలపై నిర్వహించిన సంతకాల సేకరణలో పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన సీఎం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటికో బర్రె, ఇంటికో గొర్రెను ఇస్తున్నారని విమర్శించారు. నాలుగేళ్ల పాలనలో కనీసం 20 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేని అసమర్థ ప్రభుత్వమన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇంజం నర్సిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిశెట్టి యాదయ్య, కోరె గోవర్ధన్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఫయాజ్ పాల్గొన్నారు. -
‘సంతకాల సేకరణను విజయవంతం చేయాలి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘కొలువుల కోసం సంతకాల సేకరణ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి జిల్లా, మండల, పట్టణ కేంద్రాల్లో ఆగస్టు 8 నుంచి 16 వరకు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పట్టుదలతో నిర్వహించాలన్నారు. కార్యకర్తలు ప్రతీ ఇంటికి తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానని నిరుద్యోగులను వంచించిన తీరును ఓటర్లకు వివరించాలని కోరారు. పార్టీ జూలై 25న మండల కేంద్రాలలో, ఆగస్టు 2న కలెక్టరేట్ల వద్ద ఉద్యోగ ధర్నాలు చేపట్టినా ప్రభుత్వం దిగిరాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు చెప్పారు. నాలుగేళ్లుగా నిరుద్యోగులు పోటీ పరీక్షల కోసం కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ, వేలకు వేలు ఖర్చు చేసి అప్పులపాలవుతున్నా, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే పనిచేస్తుందని విమర్శించారు. -
కొలువుల కోసం సంతకాల సేకరణ
సాక్షి, హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కొలువులు భర్తీ కాక నిరుద్యోగులు పడిగాపులు కాస్తున్నారని, అయినా సర్కారు వారి గురించి ఆలోచించట్లేదని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. కొలువుల కోసం వైఎస్సార్సీపీ పోరుబాట పట్టిందన్నారు. శనివారం ఇక్కడ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానని నిరుద్యోగులను వంచించిందన్నా రు. ఖాళీగా వున్న ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 25న మండల కేంద్రాలు, ఆగస్టు 2న కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్సీపీ చేపట్టిన ఉద్యోగ ధర్నాలు విజయవంతమయ్యాయని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నా రు. నాలుగేళ్లుగా నిరుద్యోగులు పోటీ పరీక్షల కోసం కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు చేసి అప్పుల పాలవుతు న్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి, కమీషన్ల కోసం సాగునీటి ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని విమర్శించారు. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు విడుదల చేయటానికి సీఎం కేసీఆర్‌కు చేతులు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఖాళీలు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తూ ఏవిధంగా మోసం చేసిందో నిరుద్యోగులకు వివ రించాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. నిరుద్యోగుల పక్షాన పోరాటాన్ని మరింత ఉదృతం చేసేందుకు ప్రతి మండ ల, జిల్లా కేంద్రాల్లో, పట్టణాల్లో ఆగస్టు 8 నుండి 16 వరకు కొలువుల కోసం సంతకాల సేకరణ అనే కార్యక్రమాన్ని చేపట్టాలని పిలు పునిచ్చారు. నిరుద్యోగులకు న్యాయం జరగాలన్నారు. వారి పక్షాన అండగా నిలబడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆగస్టు 21న ఖమ్మంలో నిరుద్యోగ గర్జన నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. నిరుద్యోగ గర్జనకు నిరుద్యోగులు, పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై ప్రభుత్వానికి నిరుద్యోగుల ఆకాంక్షను బలంగా వినిపించాలని కోరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జె.మహేందర్‌రెడ్డి, మతీన్ ముజదుద్దీన్, బి.సంజీవరావు, బి.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల్లో అన్యాయం జరుగుతోందని, తెలం గాణ రాష్ట్రం ఏర్పడితేనే లక్షల ఉద్యోగాలు మనకొస్తాయని కేసీఆర్ పదే పదే చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న కొత్త రాష్ట్రంలో కేవలం కేసీఆర్ కుటుంబంలో ఐదు ఉద్యోగాలొచ్చాయి. కానీ, విద్యార్థులు, నిరుద్యోగుల ఆశలు ఆవిరయ్యాయి’అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న లక్షన్నర ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాకు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నాలో శ్రీకాంత్‌రెడ్డి ఆందోళనకారులనుద్ధేశించి మాట్లాడారు. ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదంతో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు జరిగిందన్నారు. కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి, కమీషన్ల కక్కుర్తి కోసమే కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. న్యాయస్థానాల చుట్టూ విద్యార్థులు... ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయటానికి ప్రభుత్వానికి చేతులు రావటం లేదని గట్టు వాపోయారు. టీఎస్పీఎస్సీ చేసిన తప్పిదాల వల్ల నిరుద్యోగులు న్యాయస్థానాల చుట్టూ తిరుగుతుంటే సీఎం కేసీఆర్ మాత్రం అధికార మత్తులో జోగుతున్నారని విమర్శించారు. టీఎస్పీఎస్సీ నిర్ధిష్టమైన నియమ నిబంధనలు పొందుపరచకపోవటంతో 2016 నవంబర్‌లో నిర్వహించిన గ్రూపు–2 పరీక్షలు, 2017లో నిర్వహించిన గురుకుల పరీక్షల ఫలితాలు విడుదల కాలేదన్నారు. ‘సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రంలో 1.07 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని, వాటిని భర్తీ చేస్తామన్న మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. లక్షల ఉద్యోగాలు కల్పించడం ఎలా సాధ్యమవుతాయని అవహేళన చేసేవిధంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు’ అని గుర్తుచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తి అయినా కేవలం 12 వేల ఉద్యోగాలు భర్తీ చేసి చేతులు దులుపుకుందన్నారు. ఇయర్ క్యాలెండర్ ఏమైంది... ఆర్భాటం కోసమే జూన్ 2 నాడు ఉద్యోగాల ప్రకటనలు విడుదల చేస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే నిరుద్యోగుల కోసం ప్రతి సంవత్సరం ఇయర్ క్యాలెండర్ ప్రకటిస్తామని కేసీఆర్ ప్రగల్భాలు పలికారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కళ్లు కా యలు కాసేలా ఎదురుచుస్తున్నారన్నారు. ప్రభుత్వవైఖరిలో మార్పు రాకపోతే, పోరా టాన్ని దశలవారీగా ముందుకు తీసుకెళ్తామ న్నారు. పార్టీ జాతీయ కార్యదర్శి హెచ్ఏ రహమాన్ మాట్లాడుతూ నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తే 2019 ఎన్నికల్లో కేసీఆర్‌కి బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రఫుల్లారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ది ఎలక్షన్, కలెక్షన్, కన్స్ట్రక్షన్ సిద్ధాంతమని విమర్శించారు. పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్‌రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు వేలాది రూపాయల అప్పులు చేసి పిల్లల్ని కోచింగ్ సెంటర్లకు పంపుతున్నారన్నారు. పార్టీ యూత్ విభాగం అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్ మాట్లాడుతూ వైఎస్సార్ పథకాలను ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. అనంతరం శ్రీకాంత్‌రెడ్డి, రెహమాన్, సాయినాథ్‌రెడ్డి, డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, రామ్మోహన్ కలెక్టర్‌కు వినతిపత్రం అంజేశారు. -
ఉద్యోగాల భర్తీని మరచిన కేసీఆర్ : శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న సీఎం కేసీఆర్ సర్కారు ఖాళీల భర్తీని విస్మరించిందని తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఉద్యోగాల భర్తీ కోసం వైఎస్సార్ సీపీ నాయకులు ధర్నాలు చేపట్టారు. హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద చేపట్టిన ఉద్యోగ ధర్నాలో పాల్గొన్న శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని మండిపడ్డారు. మూడు నెలల్లోగా ఖాళీగా ఉన్న లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేయాలని, లేదంటే నిరుద్యోగుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాడుతుందని హెచ్చరించారు. ఈ మేరకు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. జిల్లాల్లో ఇలా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా : జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖల్లో 1,50,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా జరిగింది. ఈ మేరకు డీఆర్వో మోహన్ లాల్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు నాడేమ్ శాంత కుమార్, భూపాలపల్లి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు అప్పమ్ కిషన్, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నాయకుడు రామకృష్ణ, వైఎస్సార్ సీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా : మహబూబాబాద్ పట్టణంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖల్లో 1,50,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ కలక్టరేట్ ముందు ధర్నా చేసిన వైఎస్సార్ సీపీ నాయకులు ఏవో పి.సురేష్ బాబుకి వినతిపత్రం అందజేశారు. కరీంనగర్ జిల్లా : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 50 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కలెక్టరేట్ ముందు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఖమ్మం జిల్లా : జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ నందు, వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఉద్యోగ ధర్నా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధిగా వైఎస్సార్ సీపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్ బాబు విచ్చేశారు. పెద్దపల్లి జిల్లా : ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని పెద్దపల్లిలో కలెక్టరేట్ ముందు వైఎస్ఆర్సీపి జిల్లా అధ్యక్షులు గోవర్ధన శాస్త్రి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, అనంతరం ధర్నా చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా : లక్షా 50 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సిరిసిల్లలో కలెక్టరేట్ ముందు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు రామ్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. -
లక్ష ఉద్యోగాల భర్తీ కోసం ఆందోళనలు: గట్టు శ్రీకాంత్
సాక్షి హైదరాబాద్: ఇచ్చిన హామీ మేరకు లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలన్న చిత్తశుద్ధి సీఎం కేసీఆర్‌లో కనపడటం లేదని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. నాలుగేళ్లుగా సీఎం కేసీ ఆర్ అసెంబ్లీలో, పలు సభల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నోసార్లు ప్రకటించారని శనివారం ఓ ప్రకటనలో గుర్తుచేశారు. ఇప్పటికీ ఆ దిశగా ప్రభు త్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు లక్షకు పైనే ఉన్నాయని.. వీటితో పాటు ఈ నాలుగేళ్లలో సుమారు 50 వేల మంది ఉద్యోగస్తులు పదవీ విరమణ పొందారని వెల్లడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తక్షణమే 1.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని గట్టు డిమాండ్ చేశారు. నాలుగేళ్లు పూర్తయినా లక్ష ఉద్యోగాలు భర్తీ చేయనందుకు నిరసనగా 25న మండల కేంద్రాల్లో ధర్నాలు చేశామన్నారు. దీనిపై స్పందన రాకపోవడంతో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేం దుకు రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 2న అన్ని జిల్లా కేంద్రా ల్లోని కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించి, కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు గట్టు పిలుపునిచ్చారు. -
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుల నియామకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీలో పలు నియామకాలు చేపట్టారు. పార్టీని నమ్ముకొని దివంగత మహానేత వైఎస్సార్ ఆశయాల సాధనకు అహర్నిశలు శ్రమిస్తున్నవారికి కీలకబాధ్యతలు అప్పగించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి క్రియాశీలంగా పనిచేస్తున్న నాయకులను ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులుగా నియమించారు. లింగారెడ్డి జస్వంత్‌రెడ్డి(వనపర్తి జిల్లా అధ్యక్షుడు), ముల్కల గోవర్ధన్‌శాస్త్రి (పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు), అప్పం కిషన్ (జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు), షేక్ తజ్ముల్ హుస్సేన్ (నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు), మహ్మద్ సయ్యద్ ముఖ్తార్(వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా), వేమిరెడ్డి రోషిరెడ్డి(వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా, ఖమ్మం టౌన్ ఇన్చార్జ్), జన్ను విల్సన్ రాబర్ట్ (వరంగల్ ఈస్ట్ నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా), మాజిద్‌ఖాన్ (చాంద్రాయణగుట్ట నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా) నియమితులయ్యారు. ఆ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పదవుల్లో నియమితులైనవారు తక్షణమే జిల్లాల్లో ప్రజాసమస్యలపై పోరాటాలకు సిద్ధపడాలని శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. లక్ష ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకరావటానికి జూలై 25న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, ఆగస్టు 2న అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమాలను కొత్త నాయకత్వం ప్రత్యేకశ్రద్ధతో విజయవంతం చేయాలని సూచించారు. -
నిరుద్యోగులను మోసం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలోని విద్యార్థులు, నిరుద్యోగులు, యువత ఆశలు ఆవిరయ్యాయని.. వారిని టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. గురువారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా 1.07 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తానని చెప్పారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తయినా కేవలం 12 వేల ఉద్యోగాలే భర్తీ చేశారన్నారు. మిగిలి ఉన్న ఏడాదిలో లక్ష ఉద్యోగాల లక్ష్యం నెరవేరుతుందా అని ఆయన కేసీఆర్‌ను ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడితే మా ఉద్యోగాలు మాకొస్తాయని నాడు ఉద్యమంలో విద్యార్థులు, నిరుద్యోగులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. టీఎస్పీఎస్సీ తప్పిదాలు నిరుద్యోగులకు శాపాలు టీఎస్పీఎస్సీ 2016 నవంబర్‌లో నిర్వహించిన గ్రూప్–2 పరీక్షలు, 2017లో నిర్వహించిన గురుకుల పరీక్షల్లో తప్పిదాలు జరగడంతో ఫలితాలు విడుదల కాలేదని తెలిపారు. టీఎస్పీఎస్సీ చేసిన తప్పిదాల వల్ల నిరుద్యోగులు ఉన్నత న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పారు. తక్షణమే ప్రభుత్వం న్యాయపరమైన చిక్కులను తొలగించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. కేవలం ఆర్భాటం కోసమే జూన్ 2 నాడు ఉద్యోగాల ప్రకటనలు విడుదల చేస్తున్నారు తప్పా.. నిజంగానే నిరుద్యోగ యువత కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే నిరుద్యోగుల కోసం ప్రతి సంవత్సరం ఇయర్ క్యాలండర్ ప్రకటిస్తామని కేసీఆర్ ప్రగల్భాలు పలికారని కానీ ఇప్పటివరకు ఆ ఊసే లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాలుగేళ్ల నుంచి నేటి వరకు అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట అనేక బహిరంగ సభల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారని విమర్శించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉద్యోగ ఖాళీలు లక్ష పైన ఉండగా.. ఈ నాలుగేళ్లలో మరో 50 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారన్నారు. ఈ రకంగా చూస్తే ప్రభుత్వం భర్తీ చేయాల్సిన ఖాళీలు సుమారు 1.50 లక్షలు అని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే 1.50 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండు చేశారు. ఆందోళన బాట పడతాం లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, ఆగస్టు 2న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్టు గట్టు శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ప్రఫుల్లా రెడ్డి, జి.రాంభూపాల్ రెడ్డి, బి.అనిల్ కుమార్, బి.సంజీవ రావు, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కె.అమృతా సాగర్, జీహెచ్ఎంసీ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్ రెడ్డి, రాష్ట్ర యూత్ విభాగం అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎన్.రవికుమార్, ఎస్ఈసీ సభ్యుడు బి.బ్రహ్మా నందరెడ్డి, అక్కెనపల్లి కుమార్, వేముల శేఖర్ రెడ్డి , ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్ బాబు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అందుకే ఆయన రాజన్న అయ్యాడు
సాక్షి, హైదరాబాద్ : ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన గొప్ప నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి కొనియాడారు. దేశంలో ఏ ఒక్కనేత అందించని పథకాలను ప్రజల కోసం ప్రవేశపెట్టారని అన్నారు. ఆదివారం వైఎస్సార్ జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మట్లాడుతూ.. వైఎస్సాఆర్ ప్రవేశ పెట్టిన పథకాల కారణంగానే, ఆయన్ను రాజన్న అని పిలుచుకుంటారని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతారని అన్నారు. తెలంగాణ అభివృద్ధిని అప్పటి వరకూ పాలకులు విస్మరిస్తే, కేవలం ఒక్క వైఎస్సార్ మాత్రమే తెలంగాణ అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. సాగునీటి ప్రాజెక్టులు, పేదలకు రెండు రూపాయలకే బియ్యం, పక్కా గృహాలు, ఉచిత విద్యుత్, అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్నకు రుణమాఫీ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. ప్రాణహిత, పాలమూరు రంగారెడ్డి పథకాలు పేర్లు మార్చినా వాటికి పునాదులు వేసింది మాత్రం వైఎస్సారే అని స్పష్టం చేశారు. త్వరలో ఎన్నికలు వస్తున్నాయని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తేనే రాజన్న రాజ్యం వస్తుందని చెప్పారు. -
అందని ద్రాక్షలా లక్ష ఉద్యోగాలు
హైదరాబాద్: కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగుల ఆశలు అడియాసలే అయ్యాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడితే లక్షకుపైగా ఉద్యోగాలు వస్తాయని భావించి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు గడిచినా ఉద్యోగాల భర్తీ చేయడంలేదని విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీస్ శాఖతో పాటు వివిధ కార్పొరేషన్లలో కొన్ని ఉద్యోగాలే భర్తీ చేసిందని... రెవెన్యూ, విద్యా, వైద్యారోగ్య, వ్యవసాయ శాఖల్లో కొలువులు భర్తీ చేయకుండా నిరుద్యోగులకు మొండిచేయి చూపిస్తోందన్నారు. క్యాలెండర్ ఇయర్ ప్రకటిస్తామని ప్రగల్బాలు పలికిన కేసీఆర్ ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదని గట్టు అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకనే గ్రూప్–2, గురుకుల పరీక్షల్లో తప్పిదాలు జరిగాయన్నారు. టీఎస్పీఎస్సీ పొరపాట వల్లే నిరుద్యోగులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. గత నాలుగేళ్లలో విడుదల చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్లపై, ప్రస్తుత ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం చేయాలి: గట్టు
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్(పునాస) సీజన్‌కు సంబంధించిన ప్రణాళికను వ్యవసాయ శాఖ తక్షణమే సిద్ధం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం చేయడంలో తాత్సార్యం తగదని విమర్శించారు. శనివారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడు దల చేశారు. రైతులు అమ్మిన వరి ధాన్యానికి ప్రభుత్వం రూ.1,500 కోట్లు చెల్లించాలని కోరా రు. విత్తనాలు, ఎరువులు కొనటానికి డబ్బుల్లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులను పంపిణీ చేయాలని కోరారు. నకిలీ విత్తనాలను సరఫరా చేసే కంపెనీలపై పీడీ యాక్టు కేసులు నమోదు చేసి వాటి లైసెన్సులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి రైతులకు ఇబ్బందులు లేకుండా విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలని కోరారు. ఇప్పటికైనా రైతులకు చెల్లించాల్సిన మొత్తాన్ని తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
‘శాట్స్’ కేసును సీబీఐకి అప్పగించాలి: గట్టు
సాక్షి, హైదరాబాద్: మెడికల్ సీట్ల కేటాయింపులో అర్హులైన స్పోర్ట్స్ కోటా విద్యార్థులకు సీట్లు కేటాయించకుండా శాట్స్ అవినీతికి పాల్పడిందని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాం త్‌రెడ్డి ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా కింద సిఫారసుకు విద్యార్థులు సమర్పించిన పత్రాలను క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి సారథ్యంలో ఏర్పాటైన కమిటీ పరిశీలించకుండా శాట్స్‌కు చెందిన డిప్యూటీ డైరెక్టర్, కోచ్‌లు పరిశీలించి సంతకాలు చేశారన్నారు. ఈ కేసును ఏసీబీ నుంచి సీబిఐకి అప్పగించాలని శ్రీకాంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
వైఎస్సార్సీపీలో పలు నియామకాలు
సాక్షి,హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పలు పదవులకు నియామకాలు జరిగాయి. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా డా.మనోజ్, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శులుగా కె.ఇందిర, ఎం.జాహ్నవి, కార్యదర్శిగా నిమ్మల లలిత నియమితులైనట్లు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. -
‘జన చైతన్య’ను బస్సు యాత్ర
కోస్గి(కొడంగల్) : టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఎండగట్టి రానున్న ఎన్నికల్లో రాజన్న కలలుగన్న ప్రజాసంక్షేమ ప్రభుత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టనున్న జన చైతన్య బస్సు యాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రపుల్లారెడ్డి పిలుపునిచ్చారు. జూన్ మొదటి వారంలో నిర్వహించే ఈ యాత్రకు సంబంధించి గురువారం కొడంగల్ నియోజకవర్గంలో రూట్ మ్యాప్‌ను నిర్ణయించేందుకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తమ్మలి బాల్‌రాజ్ సమక్షంలో ఆయా మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ.. ఈ యాత్రను చేవేళ్ల నుంచి ప్రారంభించేందుకు పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందన్నారు. ఆనాడు ప్రజా సంక్షేమం కోసం వైఎస్సార్ అమలు చేసిన పథకాలను వివరిస్తూ.. ప్రజలతో మమేకమై పార్టీని గ్రామీణ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు చేపడుతున్న ఈ జన చైతన్య బస్సు యాత్రకు వైఎస్సార్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. బస్సు యాత్ర కమిటీ సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సాయినాథ్‌రెడ్డి, నాయకులు మల్లేష్, కిష్టప్ప, జావీద్, రవిగౌడ్, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రాత్రి ఆయన సాక్షితో మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించి, మార్కెట్ యార్డులకు తరలించిన ధాన్యానికి గిట్టుబాటు ధరల్లేక సతమతమవుతుంటే, వర్షం రూపంలో మరో పిడుగు పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో కురిసిన వర్షాలకు ధాన్యం మొత్తం వర్షపు నీటిలో కొట్టుకుపోయిందని చెప్పారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రభుత్వం తక్షణమే తడిసిన ధాన్యానికి గిట్టుబాటు ధర చెల్లించి.. మార్క్‌ఫెడ్, మిల్లర్లు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మార్కెట్ యార్డులకు తరలించిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లతో కప్పి ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మొక్కజొన్నలు అమ్మిన రైతులకు ఇవ్వాల్సిన రూ.200 కోట్ల బకాయిలను మార్క్‌ఫెడ్ చెల్లించడం లేదన్నారు. మార్క్‌ఫెడ్, ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే రూ.200 కోట్లు రైతులకు చెల్లించి, ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తోన్న టీ సర్కార్
సాక్షి, హైదరాబాద్: కార్మికుల సంక్షేమం కోసం పలు చట్టాలను అమలు చేసిన ఏకైక సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ట్రేడ్ యూనియన్ జెండాను ఆవిష్కరించి, కార్మికు లకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం, భద్రత విషయంలో శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. సింగరేణిలోని కారుణ్య నియామకాల విషయంలో తీవ్ర జాప్యం జరగడం వల్ల కార్మికులు, కార్మికుల పిల్లలు నష్టపోతున్నారని అన్నారు. భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికుల భద్రతకు తగు చర్యలు తీసుకోవడం లేదన్నారు. వారి సంక్షేమం పూర్తిగా విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ట్రేడ్ యూనియన్ విభాగం కార్మికులకు అండగా ఉంటుందని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. అమలుకాని కార్మిక చట్టాలు పార్టీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ విభాగం అధ్యక్షుడు భూమిరెడ్డి ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం కార్మిక చట్టాలను అమలు చేయడం లేదని, అసంఘటిత కార్మికుల సమస్యలను గాలికొదిలేసిందని విమర్శించారు. కార్మికుల సంక్షేమం, భద్రత, హక్కుల అమలు కోసం వారి పక్షాన వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ పోరాడుతుందని అన్నారు. అనంతరం గట్టు, ఓబుల్ రెడ్డి వివిధ విభాగాల్లో పనిచేస్తూ విశిష్ట సేవలందిస్తున్న రాజారెడ్డి, శ్రావణ్ కుమార్, సి.చంద్రశేఖర్ రెడ్డి, నారాయణమ్మ, ధనలక్ష్మి, రాజేందర్‌లకు మేడే కార్మిక అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. ప్రఫుల్లా రెడ్డి, మతీన్, బి.సంజీవరావు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతు కుటుంబాలను ఆదుకోవాలి
మంకమ్మతోట (కరీంనగర్): పంటలు ఎండిపోయి.. దిగుబడి రాక.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా 4 వేలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. రైతు కుటుంబాలు రోడ్డున పడుతున్నా.. వారిని ఆదుకోవాలన్న కనీస బాధ్యత ప్రభుత్వానికి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు వెంటనే రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఆదుకోవాలని హితవు పలికారు. రైతు కుటుంబాలను ఆదుకోవాలని, లేకుంటే రైతుల పక్షాన భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లోనూ వైఎస్సార్సీపీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బెజ్జంకి అనిల్‌కుమార్, ప్రపుల్లా రెడ్డి, సంజీవరావు, మతీన్ ముజాహిద్దీన్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.నగేష్ పాల్గొన్నారు. వివాహ వేడుకకు హాజరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక మండలి సభ్యుడు అక్కెనపెల్లి కుమార్ కూతురు అక్షిత వివాహం సురేశ్‌తో శనివారం నగరంలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు గట్టు శ్రీకాంత్‌రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశ్వీరదించారు. -
వైఎస్సార్సీపీలో పలు నియామకాలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పలు పదవులకు నియామకాలు జరిపినట్లు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, యూత్ విభాగం అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్ తెలిపారు. ఈ మేరకు గురువారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా కొండూరు చంద్రశేఖర్‌ను నియమించామన్నారు. పార్టీ వనపర్తి జిల్లా యూత్ విభాగం అధ్యక్షుడిగా సి.రమేశ్, ప్రధాన కార్యదర్శిగా వొడ్ల సుమంతాచారి, కార్యదర్శులుగా రాచురి ఆంజనేయులు, జె.రవికుమార్‌లను నియమించినట్లు వెల్లడించారు. -
ఉత్సవ విగ్రహాల్లా రైతు సమితులు
సాక్షి, హైదరాబాద్: యాసంగిలో కష్టపడి పండించిన వరి, మినుములు, వేరుశనగ పంటలను మార్కెట్ యార్డులకు తరలించి రైతులు పడిగాపులు కాస్తున్నారని, వాటిని కొనే నాథుడే లేడని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడమే లక్ష్యంగా రైతు సమన్వయ సమితులు పనిచేస్తాయని సీఎం కేసీఆర్ సదస్సులు పెట్టి గొప్పగా చెప్పారని, కానీ సమితులకు నిధులు కేటాయించకుండా, వారిని ఉత్సవ విగ్రహాలుగా మార్చారని ఎద్దేవా చేశారు. రైతులు పండించిన వరి పంటను మార్కెట్ యార్డులకు తరలించారని.. ప్రభుత్వం ఆ ధాన్యాన్ని కొనకపోవడంతో కురిసిన వర్షాల కారణంగా తడిసి ముద్దయి రైతులు నష్టపోయారన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. -
ఘనంగా వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలు
కోదాడ అర్బన్: వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ జన్మదిన వేడుకలను గురువారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ వేడుకలను ఏర్పాటు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మలపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గట్టు మాట్లాడుతూ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డిలకు ఆయురారోగ్యాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా త్వరలోనే రాష్ట్రంలో బస్సుయాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేముల శేఖర్‌రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కస్తాల ముత్తయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు పిల్లి మరియదాసు, దేవిరెడ్డి లింగారెడ్డి, నాయకులు వెంకటరెడ్డి, వాసు, విజయ్, రవీందర్, శ్రీకాంత్, వెంకన్న, రామయ్య పాల్గొన్నారు. -
త్వరలో వైఎస్సార్ జనచైతన్య బస్సుయాత్ర
సాక్షి, మేడ్చల్ జిల్లా: త్వరలో రాష్ట్రంలో వైఎస్సార్ జనచైతన్య బస్సు యాత్ర చేపట్టనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అ«ధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల నుంచి కరీంనగర్ జిల్లా వరకు పది రోజుల పాటు వైఎస్సార్ జనచైతన్య బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పేదలకు మేలు చేసే అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విధానాలను కొనసాగించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఆ పథకాలను కొనసాగించాలని చేపట్టనున్న జనచైతన్య బస్సు యాత్రను జయప్రదం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్ మండలంలోని అలంకృత గార్డెన్లో జరిగిన పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలు, జిల్లాల అధ్యక్షుల సమావేశంలో గట్టు ప్రసంగించారు. రాష్ట్రంలో యాత్ర విజయ వంతం కావడానికి వీలుగా పలు కమిటీలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. అందరి శ్రేయస్సే లక్ష్యంగా మ్యానిఫెస్టో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా, బడుగు బలహీన వర్గాలతోపాటు అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రణాళిక (మ్యానిఫెస్టో)కు రూపకల్పన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం త్వరలో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. బస్సు యాత్రలో ఉపన్యాసకులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బాధ్యతలు నిర్వర్తిస్తారన్నారు. బస్సు యాత్ర కమిటీలివే... - జనచైతన్య బస్సు యాత్ర కమిటి చైర్మన్‌గా మతీన్, సభ్యులుగా మహేందర్‌రెడ్డి, కె. శివ కుమార్, కొండా రాఘవరెడ్డి, బొడ్డు సాయి నాథ్‌రెడ్డి, బి.అనిల్‌కుమార్, కె.అమృతా సాగర్, డాక్టరు ప్రఫుల్లారెడ్డి, బి.సంజీవరావు, వెల్లాల రామ్మోహన్, బెంబడి శ్రీనివాస్‌రెడ్డి, శాంతికుమార్, బండారు వెంకటరమణ - క్రమశిక్షణ సంఘం(కమిటీ) చైర్మన్‌గా మతీన్, సభ్యులుగా అనిల్, వెల్లాల రామ్మోహన్, బి.సంజీవరావు, మహేందర్‌రెడ్డి. - రూట్‌మ్యాప్ కమిటీ చైర్మన్‌గా వెల్లాల రామ్మోహన్, సభ్యులుగా బొడ్డు సాయినాథ్‌రెడ్డి, జి.శ్రీధర్‌రెడ్డి, ఎన్.రవికుమార్, బి.వెంకటరమణ, కుసుమ కుమార్, బెంబడి శ్రీనివాస్‌రెడ్డి, టి. జగదీశ్వర్ గుప్తా. ఆర్. చంద్రశేఖర్, డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, బండారు వెంకటరమణ. - కరపత్రాల కమిటీ చైర్మన్‌గా బి.అనిల్ కు మార్, సభ్యులుగా శాంతికుమార్, భగవంత్‌రెడ్డి, డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, ఎన్.రవికుమార్ - పోస్టర్ కమిటీ చైర్మన్‌గా బొడ్డు సాయినాథ్‌రెడ్డి, సభ్యులుగా ఎం. భగవంత్‌రెడ్డి, బి. బ్రహ్మానందరెడ్డి. - లీగల్ అనుమతుల కమిటీ ఇన్చార్జిగా ఎం. సరోజ్‌రెడ్డి, - బస్సు యాత్ర సాంస్కృతిక (పాటల)కమిటీ ఇన్చార్జిగా ఎన్.రవికుమార్. -
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నాయని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. చట్టాలను తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబు చుట్టాలుగా మార్చుకుని ఇష్టానుసారంగా పాలన సాగిస్తూ దళితులపై దాడులకు తెగబడుతున్నారన్నారు. అంబేడ్కర్ 127వ జయంతిని శనివారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. దాదా సాహెబ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నుంచి వచ్చే ప్రతిమాటకు అంబేడ్కరే స్ఫూర్తి అన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి మతీన్, ప్రధాన కార్యదర్శి సంజీవరావు, రాష్ట్ర ఎస్సీసెల్ విభాగం అధ్యక్షుడు నాగదేశి రవికుమార్, వైఎస్సార్ సీపీ ఏపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి నంద మూరి లక్ష్మీపార్వతి, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పార్టీ అధికార ప్రతినిధులు నారమల్లి పద్మజ, కాకుమాను రాజశేఖర్ మాట్లాడారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు బొడ్డు సాయినాథ్‌రెడ్డి, డాక్టర్ ప్రపుల్లారెడ్డి, బెంబిడి శ్రీనివాస్‌రెడ్డి, చల్లా మధు, బి.మోహన్ కుమార్, పాలెం రఘునాథ్‌రెడ్డి, ఎం. సుధాకర్ రెడ్డి, సూరిబాబు, బుర్రా సురేశ్‌గౌడ్, బీవీఆర్ మోహన్‌రావు, రాజరాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీటీడీపీ నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య చేసిన విమర్శలకు వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శనివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ... రావుల, సండ్ర నోటికొచ్చినట్టు మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో టీడీపీ పూర్తిగా ఖాళీ అయిందని గుర్తుచేశారు. త్వరలో ఏపీలో కూడా ఖాళీ అవుతుందన్న భయం టీడీపీ నేతలకు పట్టుకుందన్నారు. ఆ భయంతోనే వైఎస్సార్ సీపీ అధినేతపై అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. ఐదు కోట్ల ఏపీ ప్రజలు, హోదా కోసం వైఎస్సార్ సీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే హర్షించాల్సింది పోయి టీడీపీ నేతలు విమర్శలకు దిగడం దారుణమన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే చంద్రబాబుతో మాట్లాడి మీ పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించాలని గట్టు టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. టీడీపీ అంటే తెలుగు ద్రోహుల పార్టీ అని, తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ సీటు కోసం ఇతర పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా కొంటూ దొరికిపోయారని విమర్శించారు. జగన్ గురించి ఇక తెలంగాణ టీడీపీ వారు ఎక్కడైనా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. -
కార్పొరేట్ల మేలుకే ప్రైవేట్ వర్సిటీ బిల్లు
హైదరాబాద్: ఉన్నత విద్యను వ్యాపారంగా మార్చి కార్పొరేట్ శక్తులకు మేలు చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు తెచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ విద్యాసంస్థలు, వర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయకుండా సౌకర్యాలు కల్పించకుండా నిధులు కేటాయించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తోందని గురువారం ఓ ప్రకటనలో ఆయన మండిపడ్డారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు వస్తే ప్రభుత్వ వర్సిటీలు పూర్తిగా ఉనికి కోల్పోతాయని, ఫీజులు బాగా పెరిగి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లుతో కార్పొరేట్ దోపిడీకి గేట్లు బార్లాగా తెరిచారని ప్రభుత్వం వెంటనే దీన్ని ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులకు నష్టం చేసే ఈ బిల్లును వెనక్కి తీసుకోకుంటే తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
అవిశ్వాసానికి టీఆర్ఎస్ మద్దతివ్వాలి
మిర్యాలగూడ: పార్లమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి టీఆర్ఎస్ ఎంపీలు మద్దతివ్వాలని వైఎస్ఆర్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి కోరారు. శనివారం ఆయన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో విలేకరులతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగేళ్లుగా చేస్తున్న ఉద్యమం దేశంలోని విపక్ష పార్టీలన్నింటినీ కదిలించిందన్నారు. అవిశ్వాసానికి మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ కూడా కలసిరావాలని కోరారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ల సభ్యత్వాలను రద్దు చేయడం సరైందికాదన్నారు. మే నెలాఖరులో బస్సు యాత్ర రాష్ట్రంలో మే ఆఖరులో వైఎస్ఆర్సీపీ బస్సు యాత్ర ప్రారంభించనున్నట్లు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 54 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర ఉంటుందన్నా రు. బస్సు యాత్ర షెడ్యూల్, నిర్వహణ కమిటీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. బస్సు యాత్రలో అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు ఉంటాయని చెప్పారు. సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ సలీం, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ఇంజం నర్సిరెడ్డి పాల్గొన్నారు. -
త్వరలో వైఎస్సార్ సీపీ బస్సుయాత్ర
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో త్వరలోనే బస్సు యాత్ర చేపట్టనున్నట్లు వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, జిల్లా ఇన్చార్జుల సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా గట్టు మాట్లాడుతూ.. తెలంగాణలో ఎన్నికల హడావిడి ప్రారంభమైందని.. అన్ని జిల్లాలో పార్టీ బలోపేతానికి వ్యూహాత్మకంగా బస్సుయాత్ర నిర్వహించనున్నట్లు చెప్పారు. నాటి దివంగత సీఎం వైఎస్సార్ తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేశారో యాత్రలో వివరిస్తామన్నారు. అలాగే తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కార్యాచరణను ప్రకటిస్తా మని చెప్పారు. మార్చి 13న పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ కో–ఆర్డి నేటర్లతో బస్సు యాత్ర సన్నాహక సమావేశం నిర్వహిస్తామన్నారు. ఇందులో రూట్ మ్యాపు ఖరా రుతో పాటు బస్సు యాత్ర కమిటీలను కూడా ప్రకటిస్తామని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతాం.. ఎన్నికల హామీలు, ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను బస్సు యాత్రలో ఎండగడతామని గట్టు చెప్పారు. కాకతీయ, మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. 31 జిల్లాల్లో ప్రజలు ఎదు ర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి త్వరలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఒకేరోజు పాదయాత్రలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కె.శివకుమార్, జి.మహేందర్‌రెడ్డి, బి.అనిల్ కుమా ర్, డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్‌రెడ్డి, నాయకులు నాగదేశి రవికుమార్, బసిరెడ్డి బ్రహ్మానందరెడ్డి, అక్కెనపల్లి కుమార్, వరం గల్, మెదక్ జిల్లాల ఇన్చార్జులు వి.శేఖర్‌రెడ్డి, వెల్లాల రామ్మోహన్ పాల్గొన్నారు. -
పార్టీని బలోపేతం చేద్దాం
జోగిపేట(అందోల్): పార్టీని బలోపేతం చేసే దిశగా శ్రేణులు కృషి చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జోగిపేటలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద ఆయన నివాళులు అర్పించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ వెళుతూ జోగిపేటలో కొద్దిసేపు ఆగి మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీని బలోపేతం చేసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీని ఇస్తుందని అన్నారు. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అక్కడ అధికారాన్ని చేపట్టగానే తెలంగాణలో కూడా ప్రత్యామ్నాయ శక్తిగా పార్టీని అభివృద్ధి చేసుకుంటామన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి వైపు యువత ఆశగా చూస్తోందని తెలిపారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాల వల్ల ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నిండాయన్నారు. చాలా సందర్భాల్లో ఇతర పార్టీలు సైతం దివంగత నేత ఘనతను గుర్తు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని తెలిపారు. అందోల్ నియోజకవర్గంలో దివంగత నేత అభిమానులు ఎంతో మంది ఉన్నారని, ఈ ప్రాంతం మీదుగా ఆ మహానేత నడిచారని, సేద్యానికి సింగూరు జలాలను అందించేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేశారని, రైతులకు కూడా ఈ విషయం తెలుసని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.సంజీవరావు, పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్‌రెడ్డి, సంగారెడ్డి జిల్లా యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బాగయ్య, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేశ్, జిల్లా కార్యదర్శి పరిపూర్ణ, జిల్లా నాయకులు బుచ్చయ్య, ప్రవీణ్‌కుమార్, అరవింద్ ఆయన వెంట ఉన్నారు. -
వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శుల నియామకం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శులుగా డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, బెజ్జంకి అనిల్ కుమార్, బి. సంజీవ్‌రావు నియమితులయ్యారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వీరి నియామకం జరిపినట్టు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి వెల్లడించారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సభ్యులుగా బసిరెడ్డి బ్రహ్మానందరెడ్డి, అక్కెనపల్లి కుమార్, రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా యలమంద నాయక్, పార్టీ కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్గా బెజ్జంకి అనిల్‌కుమార్, నిజామాబాద్ జిల్లా ఇన్చార్జ్గా నాగదేశి రవికుమార్, ఆదిలాబాద్ ఇన్చార్జ్గా అక్కెనపల్లి కుమార్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కాంపెల్లి గంగాధర్, జోగుళాంబ గద్వాల్ జిల్లా అధ్యక్షుడిగా జెట్టి రాజశేఖర్‌ను నియమిస్తున్నట్టు పేర్కొన్నారు. అసెంబ్లీ కోఆర్డినేటర్లుగా: అదేవిధంగా పార్టీ అంబర్పేట్ అసెంబ్లీ కోఆర్డినేటర్‌గా ఎ. అవినాశ్‌గౌడ్, సూర్యాపేట అసెంబ్లీ కోఆర్డినేటర్‌గా పిట్ట రాంరెడ్డి, కోడంగల్ అసెంబ్లీ కోఆర్డినేటర్‌గా తమ్మళి బాల్‌రాజ్, ముషీరాబాద్ అసెంబ్లీ కోఆర్డినేటర్‌గా సూరిబాబు, తంగతుర్తి అసెంబ్లీ కోఆర్డినేటర్‌గా బాలెంల మధులను నియమిస్తున్నట్లు గట్టు తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా ఇమామ్ హుస్సేన్ (శేరిలింగంపల్లి), మేస్రం శంకర్ (ఆదిలాబాద్), తాళ్లూరి వెంక టేశ్వర్లు (మంచిర్యాల), పిండి శ్రీకాంత్ రెడ్డి (ఎల్బీ నగర్), బి. మోహన్ రెడ్డి (పరిగి), దుబ్బాక గోపాల్ రెడ్డి (ఎల్బీ నగర్), దారెల్లి అశోక్ (మధిర), వారాల శ్రీనివాస్ (కరీంనగర్), మామిడి సంగమేశ్వర్ (వికారాబాద్), బి. రవీందర్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా సూరగంటి సుధాకర్ రెడ్డి(ఎల్బీ నగర్), కడపర్తి తిలక్‌రావు (నిర్మల్)లను నియమించినట్టు వివరించారు. -
రాష్ట్రానికి తీవ్ర అన్యాయం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి తీవ్ర నిరాశనే మిగిల్చిందని, కొన్ని శాఖలకు మాత్రమే అరకొర నిధులను కేటాయించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినా.. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్ర ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుతో పాటు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి కేటాయింపులు చేయలేదన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో సీఎం కేసీఆర్, మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. -
వాక్ విత్ జగన్ జయప్రదం చేయాలి
సాక్షి, హైదరాబాద్: ‘వాక్ విత్ జగన్’ కార్యక్రమాన్ని ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అలుపెరగకుండా నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర ఈ నెల 29న నెల్లూరు జిల్లాలో 1,000 కి.మీ. మైలురాయి పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టాలని కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని కోరుతూ 29న పార్టీ నేతలు కొండా రాఘవ రెడ్డి యాదాద్రి జిల్లా యాదగిరి గుట్ట వద్ద, మతీన్ ముజాద్దీన్ నాంపల్లి దర్గా వద్ద, జి. రాంభూపాల్ రెడ్డి గద్వాల్ జిల్లా జోగుళాంబ దేవాలయం వద్ద, జి. మహేందర్ రెడ్డి వరంగల్ జిల్లా భద్రకాళి దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు చేస్తారని ఆయన తెలిపారు. కె.శివకుమార్ రంగారెడ్డి జిల్లాలో జరిగే కార్యక్రమాల్ని పరిశీలిస్తారని పేర్కొన్నారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు ముందుండి నడిపించాలని శ్రీకాంత్‌రెడ్డి కోరారు. నగరంలో లోటస్‌పాండ్ నుంచి: హైదరాబాద్‌లో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం లోటస్‌పాండ్ నుంచి పెద్దమ్మ గుడి వరకు నిర్వహించే వాక్ విత్ జగన్ కార్యక్రమాన్ని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభిస్తారని వైఎస్సార్సీపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్‌రెడ్డి చెప్పారు. ఈ పాదయాత్రలో గ్రేటర్ హైదరాబాద్ అన్ని నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. -
2018లో చారిత్రక ఉద్యమాలు: గట్టు శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులకు నిరంతరం పోరాటాలు చేసే విధంగా శక్తి నివ్వాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. 2018లో చారిత్రక ఉద్యమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. -
విపక్ష పాత్రలో కాంగ్రెస్ విఫలం
హుజూర్నగర్: ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా వైఫల్యం చెందిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ పార్టీల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై దృష్టి.. అధికార పార్టీని ఎండగట్టాల్సిన కాంగ్రెస్ పార్టీ నేతలు.. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తుందని.. తానే ముఖ్యమంత్రి అభ్యర్థినంటూ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. తమ పార్టీ సిద్ధాంతాలతో కలసివచ్చే పార్టీలు ఉంటే వాటితో పొత్తులు పెట్టుకోవడానికి తాము సిద్ధమన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను పోటీలో నిలుపుతామని గట్టు పేర్కొన్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి లక్షా 16 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారని, నేటి వరకు కనీసం 20 వేలు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టుల రీ డిజైనింగ్ చేపట్టి ఒక్క ఎకరాకూ నీరందించలేక పోతోందన్నారు. ప్రజా సంకల్ప యాత్రకు బ్రహ్మరథం వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్మార్గపు పాలనకు చరమ గీతం పాడేందుకు ప్రజలు సంసిద్ధులై జగన్‌కు అపూర్వ స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రను ఆదరించిన మాదిరిగానే ప్రజలు ఆయన్ను అక్కున చేర్చుకుంటున్నారని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వేముల శేఖర్‌రెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి కస్తాల ముత్తయ్య, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కర్నె వెంకటేశ్వర్లు, యూత్ రాష్ట్ర కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, కె.రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సంకల్ప యాత్ర సక్సెస్ కావాలి: గట్టు
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతం కావాలని ఆపార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి కోరారు. సోమవారం ఇడుపులపాయలో వైఎస్సార్‌ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం వైఎస్సార్ సీపీ తెలంగాణ నాయకులు సంకల్ప యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వీరితోపాటుగా సేవాదళ్ రాష్ట్ర నేతలు బి.వెంకట రమణ, డా.ప్రఫుల్లారెడ్డి, వేముల శేఖర్‌రెడ్డి యాత్రలో పాల్గొన్నారు. -
‘ప్రజాసంకల్పం’లో స్వచ్ఛందంగా పాల్గొనాలి
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడటంతోపాటు వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జీలు, జిల్లా అధ్యక్షుల సమావేశం జరిగింది. శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవంబర్ 6న ప్రారంభించే ప్రజాసంకల్ప యాత్రలో పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇంకా పలు కీలక అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 2019 ఎన్నికల్లో తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని, పొత్తుల విషయాన్ని ఎన్నికల సమయంలో ఆలోచిద్దామని, పార్టీ అధినాయకత్వ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ శిరసావహించాలని స్పష్టం చేశారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయే, కానీ హామీల అమలు మాత్రం అసెంబ్లీ గేటు కూడా దాటడం లేదని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ ఎద్దేవా చేశారు. ఈ నెల 30న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీకాంత్ రెడ్డి జరిపే పర్యటనపై నాయకులు చర్చించారు. వర్షాల కారణంగా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో పాడైన పత్తి పంటలను పరిశీలించి, బాధిత రైతులను శ్రీకాంత్‌రెడ్డి పరామర్శించనున్నారు. వర్షాల వల్ల తడిసి, రంగు మారిన పత్తి పంటకు మద్దతు ధర కల్పించాలని, పత్తికి గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి కరీంనగర్, చొప్పదండి పత్తి కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.రాంభూపాల్ రెడ్డి, మతీన్ ముజాద్దీన్తోపాటు ముఖ్య నేతలు డాక్టర్ ప్రఫుల్లా రెడ్డి, వెల్లాల రాంమోహన్, ఎన్.రవికుమార్, విశ్వనాథ్‌చారి, బండారు వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. -
పత్తికి మద్దతు ధర ప్రకటించాలి
సాక్షి, హైదరాబాద్: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. గతేడాది(2016) పత్తి ధర క్వింటాలుకు రూ.5,500 గిట్టుబాటు ధర వచ్చిందని.. ఈసారి కనీసం రూ.5 వేల మద్దతు ధరనైనా ఇవ్వాలని అన్నారు. లేనిపక్షంలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను తెరిచి తడిసిన, రంగు మారిన పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర ప్రకటించే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు. -
ప్రమాదానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి
అల్గునూర్ (మానకొండూర్): రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ సొరంగ ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టా లని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్ చౌరస్తాలో ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అల్గునూర్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. మృతులకు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీమా కంపెనీలు ఇచ్చే పరిహారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధిత కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రమాదంపై అత్యున్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధితు లకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్సీపీ వారికి అండగా ఉంటుందన్నారు. సాగునీటి ప్రాజెక్టులన్నీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చలవేనని గట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కమీషన్ల కోసం ప్రాజెక్టులను రీ డిజైనింగ్ చేస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయినిపల్లి శ్రీనివాస్‌రావు, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.నగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి..
కరీంనగర్: కాళేశ్వరం ఎత్తిపోతల సొరంగాలలో జరిగిన ప్రమాదాలపై న్యాయ విచారణ చేపట్టి.. కనీస రక్షణ చర్యలు చేపట్టని కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆయన ఈ రోజు మానకొండూర్ నియోజకవర్గంలో పర్యటించారు. సొరంగ ప్రమాదాల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు గన్నేరువరం మండలం గుండ్లపల్లి వద్ద వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయిన్పల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు. అలుగునూర్‌లో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నగేష్, యూత్ జిల్లా అధ్యక్షుడు కంది వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. -
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గట్టు పర్యటన
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఈ నెల 22న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. 22న తొలుత మంచిర్యాలలోని శ్రీరాంపూర్‌లోని సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనులను పరిశీలిస్తారు. అక్కడ కార్మికులతో సమావేశమై సింగరేణి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకొంటారు. ఆ మేరకు రాష్ట్ర పార్టీ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అనంతరం మంచిర్యాల జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో జరిగే విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. అటు తర్వాత నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సదర్మాట్ ఆనకట్టను సందర్శిస్తారు. అనంతరం నిర్మల్ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నాయకులతో, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి, ఆ తర్వాత విలేకరులతో సమావేశంలో పాల్గొంటారు. -
సచివాలయం తరలింపు విరమించాలి
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ► ఆ నిధులు సంక్షేమానికి వినియోగించాలని డిమాండ్ ► వాస్తు పేరుతో రూ.300 కోట్ల దుర్వినియోగం: మతీన్ ► సచివాలయం తరలింపుపై న్యాయ పోరాటం: శివకుమార్ ► బైసన్ పోలో గ్రౌండ్ వద్ద వైఎస్సార్సీపీ ధర్నా విజయవంతం సాక్షి, హైదరాబాద్: సచివాలయం తరలింపును ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. సెక్రటేరియట్ తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శనివారం బైసన్‌పోలో గ్రౌండ్ వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాలకూ ఉపయోగపడేలా హైదరాబాద్‌లో భవనాలు పంచారన్నారు. ‘ఓటుకు కోట్లు’కేసులో అడ్డంగా దొరికిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్‌ను వదిలి అమరావతికి పారిపోయారన్నారు. దీంతో ఏపీకి కేటాయించిన భవనాలన్నీ ఖాళీగా ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాల్సిన కేసీఆర్ వందల కోట్లు వెచ్చించి కొత్త నిర్మాణాలు చేపడుతున్నారని తప్పుపట్టారు. కొత్త భవనాలకు వెచ్చించే నిధులను ప్రజా సంక్షేమానికి ఉపయోగించాలని సూచించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే అధికారం మీకెక్కడిదని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు ఆ భవనాల నుంచి పరిపాలన సాగించారని గుర్తుచేశారు. ప్రజా పరిపాలనకు వాస్తు అవసరం లేదన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలి సచివాలయాన్ని బైసన్ పోలో గ్రౌండ్‌కు తరలించాలన్న నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తోందని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించి.. తరలింపు ఆలోచనను విరమించుకోవాలని సూచించారు. రైతులకు లాభం చేకూర్చని రైతు సమన్వయ సమితుల ఏర్పాటును తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని, లేకుంటే వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతాయని హెచ్చరించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు మూడున్నరేళ్లయినా కొలిక్కి రాలేదని, అమరవీరుల సాక్షిగా చెప్పిన లక్ష ఉద్యోగాలు, ఉద్యమం సాక్షిగా రైతాంగానికి చెప్పిన కోటి ఎకరాలకు సాగునీరు, మేనిఫెస్టోలో చెప్పిన హామీల సంగతి తేల్చాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేసి కొత్త కట్టడాల గురించి ఆలోచించాలని హితవు పలికారు. వైఎస్సార్ హయాంలో రాష్ట్రంలో పూర్తయిన 80 శాతం ప్రాజెక్టులను ప్రారంభించుకుంటూ వస్తున్నారన్నారని గట్టు అన్నారు. గరీబోళ్ల పెన్షన్‌కు కేటాయించాలి పార్టీ ప్రధాన కార్యదర్శి మతీన్ ముజ్దాదీ మాట్లాడుతూ.. సీఎం వాస్తు పేరుతో రూ.300 కోట్లు దుర్వినియోగం చేసే బదులు గరీబోళ్ల పెన్షన్‌కి కేటాయిస్తే బాగుంటుందని హితవు పలికారు. బైసన్ పోలో గ్రౌండ్లో సచివాలయ నిర్మాణాన్ని తాము అంగీకరించబోమన్నారు. మరో ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ మాట్లాడుతూ.. కోటి ఎకరాలకు నీరు, లక్ష ఉద్యోగాల హామీలు ఏమయ్యాయని నిలదీశారు. కేసీఆర్‌కు వాస్తు పిచ్చి పట్టుకుందని, మూఢనమ్మకాలతో కోట్లాది రూపాయలు వృథా చేస్తున్నారని విమర్శించారు. సచివాలయానికే సీఎం కేసీఆర్ వస్తలేదని, ఆయనకు కొత్త సచివాలయందేనికని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో బైసన్ పోలో గ్రౌండ్లో సచివాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. సీఎం డౌన్ డౌన్, బైసన్ పోలోను పేదల ఇళ్ల కోసం కేటాయించాలి, సచివాలయం తరలింపును విర మించుకోవాలి అంటూ ప్లకార్డులు చేత పట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నాలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి జిన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్‌రెడ్డి, యువజన విభా గం రాష్ట్ర అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్, మహిళా విభాగం అధ్యక్షురాలు అమృతసాగర్, వైద్య విభాగం అధ్యక్షులు డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు నశ్రీన్, వనజ, అవినాశ్‌గౌడ్, నాగదేశి రవికుమార్, ఆర్.చంద్రశేఖర్, సంజీవరావు, కుసుమకుమార్‌రెడ్డి, కేసరీసాగర్, వెంకటరమణ, బాలకృష్ణారెడ్డి, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జీఓ 39 రద్దు చేసే వరకు పోరాటం
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సాక్షి, వికారాబాద్: టీఆర్ఎస్ కార్యకర్తల పదవుల పందేరం కోసం విడుదల చేసిన జీఓ 39ను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. జీవో 39ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా గురువారం వికారాబాద్‌లో భారీ బైక్ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ధర్నాలో గట్టు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ రైతు కమిటీల పేరుతో టీఆర్ఎస్ పార్టీ వారికే పదవులు కట్టబెడుతున్నారని విమర్శించారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులను పక్కనబెట్టి రాష్ట్ర ప్రభు త్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నదన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్వేషాలు పెంచడానికే : రాఘవరెడ్డి రైతుల మధ్య విద్వేషాలు పెంచడానికే రాష్ట్ర ప్రభుత్వం సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి దుయ్యబట్టారు. కోట్లు పెట్టి సీఎం క్యాంపు ఆఫీసు నిర్మించుకొని పేదలకు ఒక్క ఇళ్లయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. అనంతరం ఆర్డీవో కార్యాల యంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్ర మంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోళ్ల యాద య్య, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు రజని, రాష్ట్ర కార్యదర్శి బ్రహ్మానందరెడ్డి, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు బండారు వెంకటరమణ, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి, జీహెచ్ఎంసీ కమిటీ ప్రధాన కార్యదర్శి ఇమాం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. జగన్ సీఎం అయితే పద్మనాభుడికి రూ.10 కోట్ల విరాళం ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితే అనంత పద్మనాభస్వామి ఆలయ అభివృద్ధికి వైఎస్సార్ సీపీ తెలంగాణ శాఖ తరఫున రూ.10 కోట్లు విరాళంగా అందజేస్తామని గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. అనంతగిరిలోని అనంత పద్మనాభస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
రైతు సమన్వయ సమితులను రద్దు చేయాలి
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ నల్లగొండ టూటౌన్: రైతు సమన్వయ సమితులను తక్షణమే రద్దు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం నల్లగొండలో విలేకరులతో ఆయన మాట్లాడారు. జీఓ 39 పేరిట గ్రామాల్లో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేయడాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు జన్మభూమి కమిటీలు వేసినట్లుగానే తెలంగాణ సీఎం కేసీఆర్ రైతు సమన్వయ సమితులను వేస్తున్నారని, వీటి వలన ప్రభుత్వాల నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించే చర్యలు తీసుకోకుండా ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతు సమన్వయ సమితుల పేరిట ప్రజల మధ్య చిచ్చుపెడుతోందని విమర్శించారు. రైతు సమన్వయ సమితులు, జీఓ 39ని రద్దు చేయాలని ఈనెల 14న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల ఎదుట పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దేవుడి ఫొటో పక్కన వైఎస్సార్ ఫొటో పెట్టుకున్నారని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పత్తిసాగు వేశారని, సీసీఐ కొనుగోలు కేంద్రాలు పెంచేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి దమ్ముంటే ఆల్మట్టి నుంచి నీళ్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టులకు లబ్ధి చేకూర్చే విధానాన్ని తమ పార్టీ తప్పుపడుతుందని చెప్పారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఇరుగు సునీల్‌కుమార్, ఎండి.సలీం, జిల్లా ప్రధాన కార్యదర్శులు మేడిశెట్టి యాదయ్య, కట్టెబోయిన నాగరాజు తదితరులు ఉన్నారు. -
నల్లగొండ లోక్‌సభ ఉపఎన్నికకు సిద్దం: గట్టు
సాక్షి, నల్లగొండ: నల్లగొండ లోక్‌సభకు ఉప ఎన్నికలు వస్తే పోటీకి సిద్దమని వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ప్రకటించారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ..రాజకీయ లబ్ది కోసమే సీఎం కేసీఆర్ రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేశారని విమర్శించారు. రైతు కమిటీల జీవో 39ను వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తుందన్నారు. ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. గ్రామీణ రాజకీయాన్ని కలుషితం చేసేందుకే ఈ కమిటీలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. -
ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న సర్కార్
జీవో 39ని ఉపసంహరించుకోవాలి: గట్టు షాద్‌నగర్: తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు గ్రామీణ ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయ ని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. జీవో 39 ద్వారా ఏర్పాటు చేసిన రైతు కమిటీలలో అధికార పార్టీకి చెందినవారే ఉంటున్నారని, దీంతో కొందరికే లబ్ధి కలుగుతోందన్నారు. ఈ విధానంవల్ల అధికార పార్టీకి చెందిన వారికి, ఇతర రైతులకు మధ్య వివాదాలు తలెత్తుతున్నాయని చెప్పారు. జీవో39ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామసభలు నిర్వహించి పార్టీలకు, కులాలకు అతీతంగా రైతు కమిటీలు ఏర్పాటు చేయాల న్నారు. ధరల స్థిరీకరణ కోసం రూ.3 వేల కోట్ల నిధిని కేటాయిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్.. నేటి వరకు కిమ్మనకుండా ఉండటానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. లక్షల కోట్ల రూపాయలు వృథాగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. రైతుల కోసం మూడు వేల కోట్ల నిధిని ఏర్పాటు చేయడానికి వెనుకంజ వేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు బండారి వెంకటరమణ, రాష్ట్ర వైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీ ఇబ్రహీం, రాష్ట్ర నాయకులు విజేందర్‌రెడ్డి, రమాదేవి, జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు శీలం శ్రీను పాల్గొన్నారు. -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు: గట్టు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ పథకాలు కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకే అందు తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. శనివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ..అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. దళితుల మూడెకరాల భూపంపిణీ ఒక బూటకంగా మారిందన్నారు. సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలానికి చెందిన యాలాల పరశురాం, మహంకాళి శ్రీనివాస్ అనే ఇద్దరు దళిత యువకులు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించిన సంఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో, సర్కారు పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యువకుల ఆత్మహత్యాయత్నం ఘటనపై ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. -
అవినీతికి అడ్రస్ చంద్రబాబే!
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి - ‘ఓటుకు కోట్లు’తో బాబు అడ్డంగా దొరికిపోయారు - టీఆర్ఎస్ సర్కారు తెచ్చిన కొత్త పథకాలేమీ లేవు - వైఎస్సార్ పథకాలకే పేరు మార్చి అమలు చేస్తున్నారని వ్యాఖ్య వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు అవినీతికి అడ్రస్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ‘ఓటుకు కోట్లు’తో అడ్డంగా దొరికిపోయాడని.. విచ్చలవిడిగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు. అసలు చంద్రబాబు ముఖం చూడకుండా ఉన్నందుకు తెలంగాణ ప్రజలు సంతోష పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఏపీలోని గుంటూరులో జరుగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో రెండో రోజు (ఆదివారం)న ఆయన పార్టీ సామాజిక, రాజకీయ ఆర్థిక తీర్మానాన్ని ప్రవేశపెట్టి.. మాట్లాడారు. ‘‘ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి చంద్రబాబు.. నాకు ఏసీబీ ఉంది, నీకు ఏసీబీ ఉందంటూ బెదిరించారు. మరి చంద్రబాబుకు ఏసీబీ ఎక్కడుం ది. బ్రీఫ్డ్ ఇంగ్లిష్ ముఖ్యమంత్రి చంద్రబాబు. సిగ్గు, శరం విడిచి విచ్చలవిడిగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. మూడేళ్లలో రూ.3 లక్షల 75 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు..’’అని గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణకు అంతకుముందు ఏ ముఖ్యమంత్రి కూడా చేయని స్థాయిలో వైఎస్ రాజశేఖరరెడ్డి అభివృద్ధి చేశారని.. తెలంగాణ రాష్ట్రంలోనూ వైఎస్సార్సీపీ బలమైన శక్తిగా అవతరిస్తుందని చెప్పారు. వైఎస్ తెలంగాణలో 34కు పైగా సాగునీటి ప్రాజెక్టులను చేపట్టారని.. నీళ్లులేక, పంటలు పండక ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ఉచిత విద్యుత్ ఇచ్చారని తెలిపారు. వైఎస్సార్ సిద్ధాంతం విశ్వజనీయమైందని.. అన్ని రాష్ట్రాల సీఎంలు వైఎస్సార్ సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగడం దానికి నిదర్శనమని అన్నారు. సంక్షేమ పథకాలు అణగారిపోతున్నాయి.. అందరికీ ఉపయోగపడేలా వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు.. తెలంగాణలో సరిగా అమలు కావటం లేదని గట్టు శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కొత్తగా తెచ్చిన పథకాలేమీ లేవని.. వైఎస్సార్ పథకాలకే పేరు మార్చి కొన్నింటిని అమలు చేస్తున్నారని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతన బకాయిలు భారీగా పేరుకుపోయి ఉన్నాయన్నారు. అణగారిన వర్గాల సంక్షేమాన్ని గాలికొదిలేశారని విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఏపీలో 2.5 లక్షల ఎకరాల భూములను అటవీ హక్కుల చట్టం కింద గిరిజనులకు పంపిణీ చేశారని... కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ భూములను గిరిజనుల నుంచి లాగేసుకుంటోందని ఆరోపించారు. ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో సాగుతున్న రాక్షస, అవినీతి పాలనకు చరమగీతం పాడాలన్నారు. కేసీఆర్, బాబు ప్రజావ్యతిరేక విధానాలు: రాఘవరెడ్డి ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని వైఎస్సార్సీపీ తెలంగాణ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. ఇరు రాష్ట్రాల్లోనూ సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లుతున్నాయని.. ఎస్టీ, మైనార్టీల అదనపు రిజర్వేషన్ హామీలకు అతీగతీ లేదని పేర్కొన్నారు. తండాలను గ్రామ పంచాయతీ లుగా మార్చే అంశాన్ని గాలికొదిలేశారన్నారు. బాబు ‘ఓటుకు కోట్లు’కేసు ముందుకు సాగడం లేదని, ఇద్దరు చంద్రులు లోపాయకారీ ఒప్పందానికి వచ్చినట్లుగా ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. ధనిక తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని, ప్రాజెక్టులు కేసీఆర్ కుటుం బానికి ఆదాయ వనరులుగా మారాయన్నారు. తెలంగాణలో రాజ్యమేలుతున్న అవినీతి టీఆర్ఎస్ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కె.నగేశ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా గాడి తప్పిందని వ్యాఖ్యానించారు. నకిలీ విత్తనాలు రైతుల పాలిట శాపంగా మారాయని.. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు అందడం లేదని వాపోయారు. పేదలు, ధనికులు, రైతులు, కార్మికులు అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిది అని.. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కింద తెలంగాణ లో 14.72 లక్షల మంది పేదలు శస్త్రచికిత్సలు చేయించుకున్నారని చెప్పారు. వాగ్దానాల అమలులో టీఆర్ఎస్ విఫలం: శివకుమార్ టీఆర్ఎస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదని వైఎస్సార్సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్లీనరీలో ‘టీఆర్ఎస్ మేనిఫెస్టో – ప్రభుత్వ వైఫల్యాలు’అంశంపై ఆయన తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం మాట్లాడారు. ఉద్యమ కాలంలో కేసీఆర్ చెప్పిన మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారని, కానీ రాష్ట్రాన్ని అధోగతి వైపు తీసుకెళ్తున్నారని శివకుమార్ ఆరోపించారు. కేసీఆర్ మాటల గారడీ తప్ప.. తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి తెలంగాణలో 2,256 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని.. మరి ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. పేదలకు 2.6 లక్షల ఇళ్లు నిర్మిస్తామంటూ ప్రగల్భాలు పలికారని.. ఇప్పటివరకు 10 శాతం ఇళ్లకు కూడా టెండర్లు ఖరారు కాలేదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. రెండు లక్షల ఇళ్లకు వెంటనే టెండర్లు పిలిచి, నిర్మాణం పూర్తి చేయాలన్నారు. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో ప్రజల కోసం, రెండు రాష్ట్రాల ప్రజల బాగు కోసం వైఎస్ జగన్ నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. -
చంద్రబాబు.. ‘బ్రీఫ్డ్ ఇంగ్లీష్ ముఖ్యమంత్రి’
♦ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ధ్వజం గుంటూరు జిల్లా: చంద్రబాబు మొహం చూడకుండా ఉన్నందుకు తెలంగాణ ప్రజలు సంతోష పడుతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గుంటూరులో జరుగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో చివరి రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక, రాజకీయ ఆర్థిక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గట్టు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... ఓటుకు కోట్ల కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు నాకు ఏసీబీ ఉంది.. నీకు ఏసీబీ ఉందని మాట్లాడాడని, నీ ఏసీబీ ఎక్కడుందని గట్టు ప్రశ్నించారు. సిగ్గు, శరం విడిచి చంద్రబాబు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డాడని మండిపడ్డారు. బ్రీఫ్డ్ ఇంగ్లీష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడిని బంగాళాఖాతంలో కలిపే శక్తి దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తరువాత ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్రెడ్డికే ఉందన్నారు. మూడేళ్లల్లో రూ. 3 లక్షల 75 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో మరో స్వాతంత్రం రావాలని, మన రక్తపు బొట్టు ధారపోసైనా వైయస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో వైయస్ఆర్ సీపీ బలమైన శక్తిగా అవతరిస్తుందని, రాష్ట్రం ఉన్నంత వరకు వైయస్ఆర్ సీపీ ఉంటుందన్నారు. తెలంగాణకు అంతక ముందు ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా వైఎస్సార్ అభివృద్ధి చేశారన్నారు. రాష్ట్రంలో 34 పైగాప్రాజెక్టుల పూర్తికి కంకణం కట్టుకున్నారన్నారు. నీరు లేక పంటలు రాక ఇబ్బందులు పడుతు ఆత్మహత్యలు చేసుకొంటున్న రైతాంగా సంక్షేమం కోసం ఉచిత కరెంట్ ఇచ్చారన్నారు. దీంతో రైతుల జీవితాలు బాగుపడ్డాయని గుర్తు చేశారు. వైఎస్సార్ పథకాలకే కేసీఆర్ పేరు మార్చారు.. భారతదేశం మొత్తంలో ఎక్కడలేని విధంగా తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టు ప్రారంభించారని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్సార్ సిద్ధాంతాలను ఆదర్శవంతంగా తీసుకొని ముందుకు సాగటం ప్రారంభించాయని గుర్తు చేశారు. అందరికి ఉపయోగపడే వైఎస్సార్ ప్రజా సంక్షేమ పథకాలు పూర్తిగా తెలంగాణలో అమలు కావటంలేదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా తెచ్చిన పథకాలు ఏమిలేవని చెప్పారు. వైఎస్సార్ పథకాలకే పేరు మార్చి కొన్నింటి అమలు చేస్తున్నారన్నారు. ఏపీ రాష్ట్రంలోని చంద్రబాబు నాయకత్వంలో సాగుతున్న రాక్షస, నీచ, దుష్ట, అనినీతి నయవంచన పాలనకు వచ్చే ఎన్నికల్లో చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కుప్పలు తెప్పలుగా ఫీజు రీయింబర్స్మెంట్ ఉపకార వేతనాల బకాయిలు పెరుకపోయి ఉన్నాయని వాపోయారు. అణగారిన వర్గాల సంక్షేమం తెలంగాణలో అణగారి పోయిందని ఆరోపించారు. ఉమ్మడి ఏపీలో గిరిజన ప్రజల కోసం వైఎస్సార్ 2.5 లక్షల ఎకరాలు అటవీ హక్కుల చట్టం క్రింద గిరిజనులకు భూములు పంపిణీ చేశారని, కానీ ఇప్పుడు వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని గిరిజనుల నుంచి లాగేసుకొంటుందని చెప్పారు. చివరల్లో జోహర్ వైఎస్సార్, జగనన్న నాయకత్వం వర్థిల్లాలి అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. -
చంద్రబాబు సిగ్గు, శరం ఉందా: గట్టు శ్రీకాంత్ రెడ్డి
గుంటూరు : చంద్రబాబు నాయుడు జీవితమంతా వెన్నుపోట్లేనని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి, మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ ఆడియో టేపుల్లో బుక్కయ్యారన్నారు. అయినా చంద్రబాబు ఇంకా సిగ్గు లేకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని గట్టు శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. సిగ్గు, లజ్జ విడిచి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడిని బంగాళాఖాతంలో కలిసే శక్తి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తరువాత ఆయన తనయుడు వైఎస్ జగన్‌కే ఉందన్నారు. మూడేళ్లల్లో రూ. 3 లక్షల 75 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో మరో స్వాతంత్రం రావాలని, మన రక్తపు బొట్టు ధారపోసైనా వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. తెలంగాణలో వైఎస్ఆర్ సీపీ బలమైన శక్తిగా అవతరిస్తుందని, రాష్ట్రం ఉన్నంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుందని గట్టు శ్రీకాంత్ రెడ్డి అన్నారు.