
ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలి
• వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పిలుపు
• డీసీసీబీల్లో నోట్ల మార్పిడిపై ఆంక్షలా!
సాక్షి, హైదరాబాద్: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ)ల్లో పెద్ద నోట్ల మార్పిడిని నిలిపివేస్తూ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) విధించిన ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నా యని, ఇది దారుణమని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయలో పార్టీ జిల్లాల అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదట్లో దాదాపు వారం పాటు పెద్ద నోట్లను మార్పుచు కోవడానికి రైతులను అంగీకరించి ఆ తర్వాత నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మార్పిడితో పాటు తమ సొమ్మును బ్యాంకుల్లో జమ చేసుకోవడానికి కూడా అవకాశం లేకపోవడంతో గగ్గోలు పెడుతున్నారన్నారు.
ప్రస్తుతం ఆ బ్యాంకులు రబీ రుణాలను ఇచ్చే పరిస్థితి లేకుండా పోరుుందన్నారు. రాష్ట్రంలో 35 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకుంటుండగా... అందులో 12 లక్షల మందికి డీసీసీబీకి చెందిన 272 బ్యాంకు బ్రాంచీల్లో ఖాతాలు ఉన్నాయన్నారు. రైతుల కోసమే పుట్టిన డీసీసీబీలకు రిజర్వు బ్యాంక్ పూర్తి స్వేచ్ఛను ఇచ్చి రైతుల కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల పక్షాన, నూత నంగా ఎన్నికై న జిల్లాల నాయకత్వం ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
వైఎస్సార్ పథకాలే లక్ష్యంగా...
దివంగత సీఎం వైఎస్సార్ తొమ్మిదేళ్ల పాలన లో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేస్తూ, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పార్టీ నూతన జిల్లాల అధ్యక్షులు పనిచే యాలని గట్టు సూచించారు. పార్టీ పరువు, ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ఎవరు ప్రయత్నించినా ఉపేక్షించేది లేదని హెచ్చరిం చారు. 20 మందితో ఏర్పాటయ్యే మండల కమిటీలో అన్ని గ్రామాల నుంచి అన్ని కులాల వారికి చోటు కల్పించాలన్నారు. ఇప్పటికి 23 జిల్లాల అధ్యక్షుల నియామకం పూర్తరుుం దన్నారు. జిల్లా కమిటీల్లో 15 మందికి చోటు ఇవ్వాలని చెప్పారు. పార్టీ అభివృద్ధే తన ధ్యేయం అని చెప్పారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి జె.మహేందర్‌రెడ్డి, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు అమృత సాగర్, న్యాయవాదుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలెం రఘునాథరెడ్డి, టీచర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షుడు పర్వతరెడ్డి, బాలకృష్ణారెడ్డి, జి.రాంభూపాల్‌రెడ్డి, జిల్లాల అధ్యక్షులు బొడ్డు సారుునాథ్ రెడ్డి (జీహెచ్‌ఎంసీ), ఎం.భగవంత్‌రెడ్డి (నాగర్ కర్నూల్), బీస మరియమ్మ (మహబూబ్ నగర్), మద్దిరాల విష్ణువర్థన్‌రెడ్డి(వనపర్తి), లక్కినేని శ్రీధర్(ఖమ్మం), బి.అనిల్ కుమార్(ఆదిలాబాద్), వొడ్నాల సతీష్ (మంచిర్యాల), సుధాకర్ (కుమ్రంభీం ఆసిఫాబాద్), శాంతికుమార్ (వరంగల్ రూరల్),సంగాల ఇర్మాయ (వరంగల్ అర్బ న్), అప్పం కిషన్(జయశంకర్ భూపాలపల్లి), కాందాడి అచ్చిరెడ్డి(మహబుబాబాద్), నీలం రమేష్ (కామారెడ్డి) పాల్గొన్నారు.