బీజేపీలోకి గట్టు శ్రీకాంత్‌రెడ్డి!  | Telangana Leader Gattu Srikanth Reddy Will Join In BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలోకి గట్టు శ్రీకాంత్‌రెడ్డి! 

Published Tue, Apr 6 2021 12:27 AM | Last Updated on Tue, Apr 6 2021 8:54 AM

Telangana Leader Gattu Srikanth Reddy Will Join In BJP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన డాక్టర్‌ గట్టు శ్రీకాంత్‌రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరనున్నారు. సోమవారం ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కలిశారు. ఈ సందర్భం గా వివిధ అంశాలపై చర్చించారు. ఇటీవల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ జాతీయ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రకటించారు. ఆ వెనువెంటనే ఆయన మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌తో కలసి వచ్చి సంజయ్‌తో భేటీ అయ్యారు.  మంచి రోజు చూసుకొని పార్టీ ముఖ్యనేతల సమక్షం లో ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలిపారు. 

చదవండి: (వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు రాజీనామా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement